భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

83. ఆదిత్యవార కల్పమున భద్ర విధి వర్ణనము

తా॥  భాద్రపదమాస శుక్లపక్ష షష్టియందువచ్చునది భద్రయని చెప్పబడును. ఆ దినమున నక్తము పవసించువాడు హంసయానమునందధిరోహించి సూర్యలోకమునకుఁబోవును ఆనాడు జాజిపువ్వులు, తెల్ల చందనము, విజయధూపము, పాయస నైవేద్యము. సూర్యపూజలో వినియోగించుట శ్రేష్ఠము, ఇట్లు సూర్యభగవానుని మధ్యాహ్నము పూజించి. బ్రాహ్మణునకు యధాశక్తిగ దక్షిణనిచ్చి వాజ్నియమము గలవాడై తాను భోజనము చేయవలెను. పాయసమును నేయినీ, బెల్లమునుపయోగించి చేయవలెను. ఈ విధముగ సూర్యదేవుని భక్తితో పూజించువాడు, భార్యాపుత్ర ధనాది రూపమగు సర్వవాంఛితములను పొందును. సర్వపాపముల నుండి ముక్తుడై సూర్యలోకమును పొందును. ఇదియే భద్రయనబడిన వ్రత విధి. దీనిని నీకు వివరించితిని. దీనిని వినియు చేసియు మానవుడు పాపముల నుండి విడివడును.

శ్రీ భవిష్యపురాణము నందలి బ్రహ్మపర్వమున ఆదిత్య వారకల్పమున భద్ర విధి వర్ణనమను ఎనుబది మూడవ అధ్యాయము సమాప్తము.