భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

28. చతుర్థీ కల్పమున స్త్రీ లక్షణ వర్ణనము

తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. మహాబాహూ! శ్రేష్టమైన స్త్రీ లక్షణము నిప్పుడు వినుము. మహాత్ముడైన నారదునకు పూర్వము దీనిని చెప్పియుంటిని-1. దీనిని తెలియుటచేత స్త్రీల శుభాశుభ లక్షణములతత్త్వము తెలియగలదు. స్త్రీ లక్షణములలో నిందితము లెవ్వియో ప్రశస్తము లెవ్వియో చెప్పుచున్నాను-2. తల్లిని, తండ్రిని, సోదరుని, మేనమామను రెండు పక్షముల వంశములను సముద్రుని వాక్యానుసారము పరీక్షింపవలేను-3. శాస్త్రము తెలిసినవాడు శుభ నక్షత్రమున శుభతిథియందు మంచి ముహూర్తమున బ్రాహ్మణులతో కూడి వచ్చి కన్యను పరీక్షింపవలెను-4. చేతులు, పాదములు, వ్రేళ్ళు, గోళ్లు, అరచేతులు, పిక్కలు, నడుము, ముక్కు, తొడలు-5. మొల, కడుపు, వీపు, స్తనములు, చెవులు, భుజములు, నాలుక, పెదవులు, దంతములు, చెక్కిళ్లు, మెడ-6. కనులు, ముక్కు నొసలు, తల, వెంట్రుకలు, రోమ సమూహము, కంఠస్వరము, శరీరవర్ణము, సుడులు-7. ఇవి యన్నియును చూడవలెను. మెడమీద రేఖలు, కనుగొనలయందేఱుపుజీరలున్న స్త్రీ ఏ యింటికి వచ్చునో ఆ యిల్లు సుఖముగానుండును-8. దైవికముగనే, ఏ స్త్రీ నుదుట త్రిశూల చిహ్నము కన్పట్టునో అట్టి స్త్రీ అనేక స్త్రీ సమూహములకు యజమానురాలగునని నిర్దేశింపవలెను-9. రాజహంస నడక వంటి నడక, లేడి కన్నుల వంటి కన్నులు, మృగమువలే బంగారుబొయ, సమానముగను, తెల్లగను ఉన్న పై పలువరస, గల కన్య ఉత్తమురాలుగ నెన్నుదురు.

తా॥ మఱిచెట్టువలెనంతటను గుండ్రముగ నుండి కప్పకడుపువంటి కడుపుగల స్త్రీ ఒక్క కొడుకును కనును. అతడు కూడ రాజగును-11. హంసధ్వని వంటి కంఠస్వరము, మృదువైన మాటతీరు, తేనెవన్నె వంటి శరీర వర్ణము, గల కన్య ధనధాన్యసమృద్ధిని కలిగించుచు ఎనమండుగురు పుత్రులను కనుగు-12. నీడు పైన చెవులు, సొంపగు ముక్కు, ఇంద్రధనుస్సు వంటి కనుబొమలు గల స్త్రీ మిక్కిలి సుఖముననుభవించును-13. బక్కపలుచని శరీరరము గలది, చామన చాయ లేక నలుపుగనున్నది. చిక్కని నును పైన అంగములు గలది, మృదువుగ మాట్లాడునది, శంఖమువలె, మొల్లపువ్వులవలె, చంద్రునివలె తెల్లగా మెఱసెడు పలువరుస గలది అయిన స్త్రీ ఐశ్వర్యవంతురాలగును-14. విశాలమైన మొల (కాంచీ పదము) గలది, వేదికవంటి నడుముగలది, పొడవుగను విశాలముగను తీర్చబడిన కన్నులు గలది అయిన స్త్రీ రాజు భార్యయగును-15. ఎడమ చంటి పై, చేతి పై, చెవి పైన, మెడ పైన గాని, మచ్చ, పుట్టుమచ్చ ఉన్న స్త్రీ, మొదట పుత్రునికి జన్మమిచ్చును-16. బలిసిన చీలమండలు, వ్రేలికొనలుగలది, చిన్నమడమలు గలది, అందమైన నడుముగలది, ఎఱ్ఱని కనులు, పాదములు గలది మిక్కిలి సుఖముననుభవించును-17. తాబేలు వంటి వీఁ పు, పొడవైన కణుకు గోళ్లు, వంకర వ్రేళ్లు, పాదములుగల కన్యను వదలవలెను-18. శరీరములో ఏ భాగముననేని, ఏ మాత్రమేని మాంసము పెరిగియున్నచో అది గాడిదవంటీ యాడదియగును. అట్టిస్తీ వివాహము కరతలేని దగును-19. పాదమున, బొట్టనవ్రేలి ప్రక్కవేలు, బొట్టన వ్రేలి కంటే మించి యున్నచో అట్టి కన్య దుఃశీల, దుర్భగయని తెలియవలెను. అట్టి కన్యను వదలి పెట్టవలెను.

తా॥ పాదమునందలి నడిమివేలు నేలను తాకకున్ననట్టి స్త్రీ కౌమారమున క్రీడింపదు. స్వైరిణి, స్వేచ్ఛాప్రియయగును-21. పాదమునందలి 'అనామిక బొట్టనవ్రేలినుండి నాల్గవ వ్రేలు నేలను తాకకున్నయెడల అస్త్రీ రెండవ భర్తను చంపి మూడవ భర్తతో కాపురముండును-22. పాదమునందలి చిటికెనవ్రేలు నేలను తాకని యెడల అట్టి స్త్రీ రెండవ భర్తను చంపి మూడవ భర్తతో కాపురీము చేయును-23. పట్టపురాణులు (దేవి) పేళ్లుగలది, ఉత్తమ స్త్రీల పేళ్లుగలది ధాన్యాదుల పేరులుగలది, పొదలు, చెట్లు మొదలైన వాని నామములు గలదియైన కన్యను విడిచి పెట్టవలెను-24. ఇంద్రుడు, చంద్రుడు మొదలైన పురుషదేవతల పేళ్లు గలది, అశ్విన్యాది నక్షత్రముల పేళ్లుగల స్త్రీలును తమ పతులయందనురాగము కలిగియుండరు-25. ఏ స్త్రీకి వీపు నుండి నాభివరకు చేరు సుడియుండునో ఆమె అల్పసంతానము గలదిగను, అల్పాయుష్కురాలును అగును-26. వీపున సుడి గలదీ భర్తను చంపును. నాభియందు సుడి గలది పతివ్రతయగును. నడుమున సుడిగలది స్వేచ్చగా ప్రవర్తించును. ఎప్పుడును సంతోషింపదు-27. నవ్వుచున్నప్పుడు చెక్కిళ్ల పై సొట్టలు (గుంతలు) పడినచో అట్టి స్త్రీ కౌమారావస్థలో క్రీడింపదు. స్వతంత్రముగ పనులు చేయుచుండును-28. నడచుచున్నప్పుడు కాలివేనుక భాగమున టిక్ టిక్ అను ధ్వని వినవచ్చెనేనీ అట్టి స్త్రీ భర్తృత్వముచే పనిచేయుటకు పుత్రుని పురికొల్పును. సంశయములేదు-29. పాదములు స్థూలములై, అంగములన్నింటియందు రోమములుండి, చేతులు కూడా స్థూలములైయున్న కన్యను గూర్చి దాసియగునని పండితుడు చెప్పవలెను.

 తా॥  నితంబములు, పాదములు, ముఖము వికారముగనుండినను, పై పెదవి పై రోమమలుండినను అట్టిన్రీ శీఘ్రముగనే భర్తను మ్రింగివేయును -31. నొసలు, కడుపు పిరుదుల ఈ మూడును వ్రేలాడుచున్నట్లుండిన యట్టి స్త్రీ, మతిదిని, మామను, భర్తను ఈ ముగ్గురిని మ్రింగివేయును-32. ప్రశంసనీయమైన చరిత్రగలది, గురువులయందు భక్తి గలది, పతివ్రత, దేవ బ్రాహ్మణులయందు భక్తి గలదియైన స్త్రీని ‘మానుషి'యని చెప్పవలెను-33. నిత్యము స్నానము చేయునది, పరిమళము గలది, ఎప్పుడును ప్రియముగ మాట్లాడునది, తక్కువగా భుజించునది, తక్కువ కోపముగలది యైన స్త్రీని 'దేవత' యని చెప్పవలెను. స్త్రీని 'మార్టారి' (పిల్లి)యని నిర్దేశింపవలెను-35. నవ్వుచుండునది, క్రీడించుచుండునది, అప్పుడే కోపించి, అప్పుడే ప్రసన్నురాలగునది, ఎప్పుడును నీచులతో రమించుచుండునది 'రాసభి' (గాడిద) అని చెప్పవలెను-36. భర్తకును, బంధువులకును ప్రతికూలకార్యములు చేయునది. స్వేచ్ఛగనున్నప్పుడు' అంగవిన్యాసరూప శృంగార చేష్టలుచేయునది యగు స్త్రీని 'ఆసురి'యని చెప్పనగును-37. ఎక్కువగ తినుట, అతిగ మాట్లాడుట, ఎప్పుడును అప్రియభాషణము చేయుట, తన భర్తను హింసించుచుండుట- ఈ లక్షణములుగల స్త్రీని రాక్షసి' యని చెప్పవలెను-38. శుచి, ఆచారము లేనిది, భయంకరము వికృతమునైన రూపముగలది, చెమట, మాలిన్యములతో కూడియుండు స్త్రీని 'పిశాచి'యని చెప్పవలెను-39. నిత్యస్నాతమై, సువాసనతోగూడిన మేను గలదియై, మద్యమాంసములను ఇష్టముతో సేవించునదై, చెట్లు, ఉద్యానవనములలో విహరించు నిష్టము గల స్త్రీని 'గాంధర్వి'గా నిర్దేశింపవలెను-40. చాపల్యము గలది, చంచలమైన స్వభావము గలది, ఎప్పుడును దిక్కులు చూచుచుండునది, తిరుగాడు గుణముగలది, పిసినారియునైన స్త్రీని 'వానరి' (కోతి) యని చెప్పవలెను-41. చంద్రబింబము వంటి ముఖము పొందికగానున్న అవయవములు, మదించిన ఏనుగు నడకవంటి నడక, ఎఱుపు వన్నెతో మెఱయు గోళ్లు, చేతులు, గలస్తీని పండితుడు 'విద్యాధరి'యని తెలిసికొనవలెను-42. వీణ మొదలగు సంగీత వాద్యధ్వనుల చేతను, వేణుగానము, పాటలు మొదలగువాని చేతను, పుష్పములు, సుగంధధూపద్రవ్యములతోను. ప్రసక్తిగల స్త్రీని 'గాంధర్వ'యని చెప్పవలెను-43. సుమంతుముని యిట్లనెను. ఈ విషయములను చెప్పి మహానుభావుడైన బ్రహ్మదేవుడు తన మందిరమునకు వెడలిపోయెను. ఈ స్త్రీ పురుష లక్షణ విశేషము రాజలోకమునకు పూజ్యమైనది.

శతార్ధ సాహస్ర్య సంహిత యగు శ్రీ భవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున చతుర్ధికల్పమునందు స్త్రీలక్షణ వర్ణనమను ఇరువది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.