భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
96.సప్తమీ కల్పమున జయనామ సప్తమీ మహాత్మ్య వర్ణనము
తా॥ దీండి యిట్లనెను. “దేవా! ఏడు సప్తమీ తిథులను గూర్చి నాకుఁదేలిపితిరి. పోనీలో మొదటి సప్తమీ గుఱించి సవిస్తరముగ నుడివిత్తిరి. ఇతరములైన ఆటు సప్తములను గూర్చి వివరించిచెప్పుడు. వానిని ఉపవాసాదులతో నాచరించి నేను సూర్యలోకమునకుఁ బోవఁజాలుదును”. బ్రహ్మ దేవుడిట్లు నుడివెను. “ఐదు తారలుగల నక్షత్రము శుక్ల పక్ష సప్తమీ నాడేర్పడినచో నది 'జయ' అను. పేరుగల సప్తమీగా తెలియవలెను. ఆ దినమున చేసిన దానము, హవనము, జపము; తర్పణము, దేవతార్చనము, సూర్యపూజ - అన్నియును నూఱురెట్లు ఫలమిచ్చునని చెప్పఁబడినది. ఇది భాస్కర దేవునకు ప్రియమైన దినము. పాపములను నశింపఁ జేయునది. కృతార్థతను, యశస్సును, సంతానమును, అభీష్టసిద్ధిని, ఐశ్వర్యమును ఇచ్చునది. నేను చెప్పిన ఈ తిథి వర్తించునప్పు డే విధిని పాటింపవలెనో చెప్పుచున్నాను వినుము. పాటించు వారభీష్ట ప్రయోజనమును పొందుదురు. శంకరా! సూర్యుడు హస్తానక్షత్రమున ప్రవేశించినపుడది 'శుక్ల సప్తమీ'గా పూర్వము వ్యవహరింపబడెను. ఆనాడు ఉపవాసము చేసి వక్ష్యమాణ విధిగా ప్రతాచరణము నిర్వర్తింపవలేను. మూడవ దినమున పారణ చేయవలెనని చెప్పబడినది. అటుల చేయుట తేజస్సును, ధర్మమును కలిగించును. మొదటి పారణము నాలుగు మాసములకు చేయవలెను. అనగా సంవత్సరము సాంతమునకు మూడు పారణములు. ఈ సందర్భమున గన్నేరు పువ్వులు, ఎట్టి చందనము, శ్రేష్ఠమైన గుగ్గులు ధూపము. నైవేద్యము కొఱకు కాంసారము (గోధుమ పిండిని నేతిలో వేయించి శర్కర పాకముతో చేయబడు తీపి పదార్థము=పంజీరి) భాస్కర దేవుని పూజలో వినియోగింపవలెను. విధి పూర్వకముగ సూర్యునిట్లు పూజించి. పారణమునందు బ్రాహ్మణులను సూర్య దేవుని ప్రసాదములతో భుజింపజేసిమౌన వ్రతుడై తాను కూడా భుజింపవలేను.
తా॥ పంచమినాడేకాహారుడై షష్ఠినాడు నక్త వ్రతముతోనుండి, సప్తమీనాడు ఉపవసించిన అష్టమినాడు పారణమగును. షష్టితో గూడిన సప్తమీనాడే ఉపవసింపవలెనుగాని, అష్టమితో గూడిన సప్తమీనాడు ఉపవసింపరాదు. అష్టమినాడు పారణ నిమిత్తముగా సప్తమీతో గూడిన షష్టినాడు ఉపవసింపవలెనని చెప్పుదురు. ద్వాదశినాడు పారణ చేయుటకొఱకు ఏ కాదశినాడు ఉపవాసము చేసినట్లదియును అటులే చెప్పబడినది. “భానుర్మేప్రియతామత్ర” (సూర్యదేవుడు ప్రీతుడైనన్ను గ్రహించునుగాక) అను మంత్రమునుచ్చరింపుచుస్తానము, గోమయ భక్షణము చేయవలెను. దంత ధావనము కొఱకు జిల్లేడు కళి పుల్లనుపయోగింపవలెను. ఇట్లు మొదటి పారణ విధి చెప్పబడినది. ఇక రెండవ పారణ విధి చెప్పుచున్నాను వినుము.. జాజి పూలు, శ్రీ ఖండము (చందనము) 'విజయ' ధూపము, నైవేద్యము కొఱకు పాయసము, సూర్యదేవుని పూజకు వినియోగింపవలెను. బ్రాహ్మణులకు భోజనము పెట్టి యాపిదప తాను భుజింపవలెను. ఈ సందర్భమునఁజేయు ప్రతిపనియందును “రవిర్మేప్రియతామత్ర' అనుచు సూర్యదేవుని స్మరించుచుండవలెను. ద్వితీయ పారణమున పంచగవ్య ప్రాశనము చేయవలెను. దంత ధావనమునకు చండ్ర కఱ్ఱపుల్లనుపయోగింపవలెను. రెండవ పారణ మెట్లు పూర్తి చేయవలెనో ఆ విధానము చెప్పితిని. ఇప్పుడు మూడవ పారణమును గూర్చి చెప్పబోవుచున్నాను. దానిని తెలిసికొనుము. ఈ సందర్భమున సూర్యదేవుని అగిసే పూలతో పూజింపవలెను.
తా॥ గంధలేపన మంత్రముతో శ్రీ ఖండము; పుష్పములు, అందుగు మాకువలనఁబుట్టిన యావన ధూపము - సూర్య దేవునకు ప్రియములైన ఈ పూజా ద్రవ్యములతో నా దేవుని పూజింపవలెను. నైవేద్యమునకు పైన చక్కెర చల్లిన (లేక .మామిడి పండ్ల రసముతో) శాల్యన్నమునుపయోగింపవలెను. బ్రాహ్మణులకు అన్నదానము చేసి ఆపై తాను భుజింపవలెను. ఈ సందర్భమున కుశోదక ప్రాశనము చేయవలెను. రేఁగు పుల్లతో దంతధావనము చేసికొనవలెను “వికర్తనః ప్రీయతాంమే” (సూర్య దేవుడు నాయీ భక్త్యుపచారమునకు ప్రీతుడగుగాక) అను మంత్రమును తఱచుగ నుచ్చరించుచుండవలెను. వర్షర్తువునందు గంధ పుష్పోపహారములతో, వివిధములైన నృత్య నాటక సంగీతాది కార్యక్రమములతోను సూర్య భగవానునికి యథావిధిగా పూజ చేయవలెను. గోదాన భూదానాదులతో బ్రాహ్మణులను తృప్తి పలుపవలేను. ఇట్లు పూజించి యాదేవ దేవుని సమక్షమున, పరమ పుణ్య కారణము, ధన్యమునైన పురాణ ప్రవచనమును జరిపింపవలెను. అనంతరము వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, ధూపములు మున్నగువానితో పౌరాణికుని పూజింపవలెను. పిదప దేవుని యెదుట నిలచి ఈ మంత్రమును పఠింపుచు సూర్యదేవుని ప్రార్థింపవలెను. “ఓ దేవదేవా! జగన్నాథా! సర్వ రోగములను, బాధలను పోగొట్టువాడా! గ్రహరాజా! లోకమునకు చూపునిచ్చువాడా! విశ్వ కర్మచేత సుందర రూపముగ తీర్చబడినవాడా! చీకట్లను పారద్రోలువాడా! దేవదేవేశా! నేను నీ అనుగ్రహముచే, ధన్యమైనది, పాపహరమైనది, శివంకరమైనదియు నైన జయాసప్తమీని నా శక్తి కొలదిగా చేసితిని. నన్ననుగ్రహింపుము". ఇది జయాసప్తమీ విధి. ఈ విధానముగ నీ సప్తమీ వ్రతమాచరించిన వానికి - స్నానాది కర్మలన్నింటికిని నూడు రెట్లు ఫలము లభించును. ఈ సప్తమీ వ్రతమాచరించి పురుషుడు కీర్తిని, ధనమును, ధాన్యమును, బంగారము, పుత్రులను, ఆయువును, సంపదలను పొందజాలును. పొంది, పరమున సూర్యలోకమునకుఁబోవును. అటనుండి తిరిగి భూలోకమునకేతెంచి యిట చక్రవర్తి యగును. త్రిపురాంతకా! ఇట్లు జయసప్తమీ గూర్చి వివరించితిని. ఇది చేసినను, స్మరించినను, వీనినను సూర్య లోకప్రాప్తిని కలుగజేయును.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమీ కల్పమునందు జయానామ సప్తమీ మాహాత్మ్య వర్ణనమను తొంబది యాఱవ అధ్యాయము సమాప్తము.
