భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
118. భద్రోపాఖ్యాన, ఆదిత్యాయతన దీపదానఫల వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను, “భాను దేవుని మందిరమున దీపమును, వెల్గించునేర్పాటు చేయువాడు సూర్య తేజముతో ప్రకాశించు "వాడగుచు సర్వయజ్ఞఫలములను పొందును. ముఖ్యముగా కుమారుని సంబంధమాసమగు కార్తీకమున సూర్యాలయమున సంవాదమును గూర్చి చెప్పెదను అది బ్రాహ్మణుడు, మహాత్ముడైన భద్రునకును అతని సోదరులకును మధ్య జరిగినది. పూర్వ కొలమున నీ భూమండలమున “మాహిష్మతి' యను పేరుగల యొక అందమైన పట్టణముండెడిదీ. ఆపట్టణమున నాగశర్మయను, బ్రాహ్మణ ప్రముఖుడుండెను. భాను దేవుని యనుగ్రహమున నతనికి నూర్వురు పుత్రులు కలిగిరి. వారిలో నందజీకంటెను చిన్నవాడు భద్రుడను వివేకశాలి. అతడు ప్రతిదినము జగత్సృష్టికర్త, దేవదేవుడునగు సూర్యభగవానునకు దీపములు వెల్డించుచు, పోని కొఱకు తైలమును సేకరించుచునుండెను. సూర్యదేవాలయమున నాతడు దివారాత్రములు వేయి దీపములను వెలిగించెను. అతని కాంతిముందు వెలవెలబోవుచు, అతనిముఖ వర్చస్సు ముందు తిరస్కృతులగుచు నతని సోదరులందఱు నాదరముతో, నతని తో నిట్లనిరి, “భద్రా! సోదరా! నీకు శుభమగుగాక, నిన్నొక విషయమడుగవలెనని మేము కుతూహలపడుచున్నాము. మేమడుగ బోవు ప్రశ్నలకు సదుత్తరములిత్తువుగాక" వారి యామాటలు విని భద్రుడు అన్నలారా! అయైనచో నేను చెప్పదగిన దేద్దియో సేలవిండనేను.
తా॥ నేను మత్సర యుక్తుడనుకాను. రాగాది దూషితుడనుకొను, మీరందఱును నాకు అన్నలు, గురువులు కూడా. మీకు పుత్రునితో సమానుడనైన నేను మీరడిగిన విషయమును చెప్పకుండుటెట్లు? కాబట్టి యన్నలగు మీరు నేను చెప్పలవసిన దేదో తప్పక చెప్పుడు. వినయముతో గూడిన భద్రుని మాటలు విని యతని యన్నలిట్లనిరి. “భద్రా! సూర్యమందిరమున పగలెట్లో రాత్రి యట్లు, రాత్రియేట్లో పగలట్లుగ నీవు నిరంతరముగ దీపములు వెళ్లించు ప్రయత్నమున నున్నంతగ పుష్పాలంకరణమునందు గాని ధూప సమర్పణమునగాని, బ్రాహ్మణ పూజనమునగాని శ్రద్ద చూపునట్లు కన్పట్టదు. ఇది విచిత్రముగ నున్నది. ఇది తెలిసికొనుటకే మేము మిక్కిలి కూతూహల పడుచున్నాము. కావున దీనిని మాకేజింగింపుము. సూర్యభగవానునకు దీపదానము చేయుటవలన కలుగు ఫలమేద్దియో నీకు తెలియును. దానిని మాకు సాకల్యముగఁజెప్పుము”. భద్రుని యన్నలిట్లాసక్తిగ నడిగిన విషయమునంతయువిని యతడు వారికే సమాధానమును జెప్పక మౌనముగ నుండిపోయెను. వారు మఱల మఱల నదే విషయమును గూర్చి యడుగుచు సమాధానము చెప్పుటకై యతనిని బలవంత పెట్టిరి. మొగమాటపు బలిమిచేత భద్రుడు విషయమునంతయును వారికి చెప్పివైచెను.” అన్నలారా! మీ కుతూహలమంతయు నిట్టి సాధారణ విషయమునందే యైనను. దానిని నా దీపజ్వాలన వ్రత వివరమును నేడు మీకు నివేదింతును. పూర్వ ఋక్ష్వాకు రాజునకు వసిష్టుడు పురోహితుడుగనుండెను. అతడు సరయూనదీతీరమున నొక సూర్యమందిరమును నిర్మింపజేసెను, అందాతడు ప్రతిదినము పుష్పధూపానులేపనాదులచే సూర్యభగవానుని సేవించుచుండెను. అంతేకాక ఆ బ్రాహ్మణుడు సూర్యదేవునకు దీపదానములు మున్నగు వానిచే ప్రీతి గలిగించుచుండెను, ముఖ్యముగా ప్రతి కార్తీక మాసము నను దేవుని సన్నిధియందు దీపములను వెళ్లించుచుండెను.
తా॥ రాత్రి సమయమున నాతడు సూర్యప్రతిమ ముందు ప్రశాంతముగ విశ్రమించుచుండెను, నేను కూడా మిక్కిలి వ్యాధిగ్రస్తుడనై బాధపడుచు అదే దేవాలయమున నివసించుచుంటిని. శరీరమునుండి చీము, నెత్తురు నిరంతరముగ బయటకు కారుచుండగా, చట్టబడిపోయిన ముక్కు గలవాడనై, పీల పడిపోయిన కంఠధ్వని గలవాడనై దుర్గంధమున మునిగితేలుచు. సూర్యభగవానుని { వస్తువుల యెడ దుష్టబుద్ధి గలవాడనై, యాదృచ్చికముగ సూర్య భగానునకు దీపాదులను సమర్పించుటకు వచ్చెడి భక్తులు. నాకిచ్చుచుండిన ఆయా ఆహారపదార్ధములను భుజించుచు, వానితోడనే తృప్తిపడుచు కాలము గడుపుచుంటిని, ఒకసారి యా దేవాలయమున నున్ననేను. రాత్రి సమయమున జాగరణ చేయుటకై యచటికి వచ్చిన భక్తులను గమనించితిని, వారి ప్రాపునఁజేరి ప్రార్ధింపగా దయాన్వితులై. వీడు వ్యాధిగ్రస్తుడు, మిక్కిలి దీనావస్థలో నున్నాడు. అని జాలిపడి తమకు తోచినది దానముచేసిరి. అప్పుడు వారు చలిమంటనాశ్రయించి కూర్చొనియుండ వారి సమీపమున నేనును కూరుచుంటిని. అన్నలారా నేను దుష్టబుద్దీన్లో సూర్యభగవానుని దివ్యాభరణమును దొంగిలించుకోరికతో నవశము కొరకు వేచి యుంటిని. భోజకులు నిద్రించిన పిదప సూర్యదేవుని విలువైన యాభరణమును దొంగిలించుటకై కాచుకొని యుంటిని పిమ్మట నిద్రమోహితులై భోజకులందఱును పరుండిరి. దేవళమునందలి దీపము లన్నియు నారిపోయి అంధకార మలుముకొనెను. అప్పుడు నేను శ్రీఘ్రముగ లేచితిని.
తా॥ మిక్కిలి సంతోషముతో అగ్ని వైపునకుఁబోయి, అగ్నిని జ్వలింపజేసి, పూనికతో దీపమును వత్తిని సమకూర్చి. సూర్య భగవానుని ముందు నేతి దీపమును వెలిగించితిని. ఇది యంతయును భానుదేవుని యాభరణమును దొంగిలించు నుద్దేశ్యముతోఁ జేసితిని. అంతలో సూర్యదేవుని పుత్రులగు భోజకులు మేల్కొని సూర్య మూర్తి సమీపమున దీప హస్తుడనై నిలిచి యున్న "నన్నుఁజూచిరి. దేవుని ముందు నిలబడి యున్న నేను దొంగగా వారికి పట్టుబడి పోయితిని. మహాత్ముడైన భాస్కరుని తేజముచే మూడుడనై. విలపించుచు జాలిగొలుపునట్లు వారి పాదముల పై బడి మిక్కిలి రోదించితిని. వారు నా దైన్యము పై దయఁ బూని నన్ను వదలి పెట్టిరి. కాని యచట నున్న రాజభటులు నన్ను పట్టుకొనిరి. “ఓరి దుష్టుడా! దేవ దేవుని మందిరమున నిట్లు దీపము వెలిగించి నీవు చేయుచున్న పని యేమి?. త్వరగా చెప్పుము.” అని గద్దించి యడిగిరి. ఆయుధములు ధరించి నా చుట్టును చేరి వారిట్లు బెదరించుచు ప్రశ్నింపగా. రోగగ్రస్తుడనయి యుండుట చేతను, వారి భయము చేతను వెంటనే ప్రాణములను వదలి సూర్యలోకమునకుఁజేరితిని. అచట నొక కల్పము వఱకు నివసించి పిమ్మట మి సోదరుడనై జన్మించితిని. కార్తిక మాసమున సూర్యదేవుని ముందు వెలిగించిన ప్రభావమిది!. దుష్ట బుద్ధితోనైనను సూర్యభగవానుని మందిరమున దీపము వెలిగించిన నాకీ యుత్తమ ప్రయోజనము సిద్ధించినది. ఆకలితో నలమటించుచు, సూర్యదేవుని యాభరణమును దొంగిలింప తల పెట్టిన నాకు సూర్యాలయమన దీపము వెల్డించుట వలన నిట్టి సత్పలానుభవము ఘటించినది. సూర్యదేవుని యెదుట దీపమును ప్రకాశింపజేసి నందువలన నాకు పూర్వజన్మస్మరణముతో గూడిన బ్రాహ్మణునింటఁబుట్టువు లభించినది.
తా॥ కుష్టు వ్యాధిగ్రస్తుడనై యుండియు, శూద్రుడనైయుండియును, ఉత్తమమైన బ్రాహ్మణత్వమును పొందితిని. నానా విధములైన శ్రాస్త్రములను సాంగవేదాధ్యయనమును పూర్తిచేసికొనగలిగితిని. దుష్టబుద్ధితోనైనను సూర్యభగవానుని సన్నిధిలో ఘృత దీపమును వెలిగించుటవలన నేనిట్టి యద్భుతమైన ఫలమును పొందితిననగా నిక సద్బుద్ధితో దీప సమర్పణము చేయువారు పొందేడి ఫలమును గుఱించి చెప్పనేల?. ఈ కారణమున నేను సూర్యమందిరమునందు రాత్రింబవలును దీపదానము చేయుచుందును. దీపదానఫలమెట్టిదో తెలిసినది గదా!. కార్తిక మాసమున సూర్యభగవానునకు దీపసమర్పణ చేయుట వలన కలుగు ఫలము నంతయును చెప్పితిని. మీ యెడ సోకు గల స్నేహభావము వలనఁజెప్పితినీ. ఇందు సంశయములేదు. ఏకాగ్రచిత్తముతో సూర్యనామము జపించుచు, సూర్యమందిరమున ప్రతిదినము దీపము వెల్డించుటను గూర్చి యిట్లు భగ్ర-గు చెప్పినట్లు. కార్తిక మాసమున సూర్యాలయమున దీపసమర్పణ చేసిన వానికి తన పూర్వజన్మ జ్ఞాపకముండుటయేగాక మేధావిత్వము, విస్తృతమగు కీర్తి. ఇంద్రియ పటుత్వము మున్నగునవి లభించుననుటలో సంశయము లేదు. సర్వకాలముల యందును చక్కని దృష్టిగలవాడై, ప్రజ్ఞావంతుడై ప్రకాశించును. నరకమునకుఁబోయినను అంధ తామిస్రమును జూడడు. ప్రతి పక్షమునను షష్ఠినాడు గాని, సప్తమీనాడు గాని. దీప ప్రదానము చేయుమానవునకు కలుగు ఫలమునుగూర్చి చెప్పుచున్నాను తెలిసికొనుము. మిక్కిలి సుందరమైనది, శుభప్రదమైనది, మణిఖచితమైనదియు. దీపమాలాలంకృతము, దివ్యమునైన కాంచన విమానమున పయనించి సూర్యలోకమునుజేరును. కావున తెల్లవేళల సూర్యాయతనమున దీపములను వెలిగించుచుండవలెను. విష్ణుదేవా! దీపములను వెలిగింపవలెనేగాని వానిని యార్పివేయరాదు. నూనె నిండుకొనునట్లును చేయరాదు. దీపమును హరించువాడు గ్రుడ్డియేలుకగా జన్మించును. కాబట్టి దీపమును సమర్పింపవలెనే గాని శ్రేయస్కాముడైనవాడు దానినెప్పుడు హరింపరాదు.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు భద్రోపాఖ్యాన, ఆదిత్యాయతన దీపదాన ఫలవర్ణనమను నూట పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.
