భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
34. పంచమి కల్పమున దంశ దష్టక దూత లక్షణము
తా॥ కశ్యప ప్రజాపతి యిట్లనెను. “ఇకమీద కాలసర్పదష్టుని లక్షణము చెప్పెదను గౌతమా! కాలనాగముచే కాటువేయబడిన మనుష్యుడెట్లగునో వివరింతును. అట్టివానికి నాలుక మొద్దువారును. హృదయమున శూలముగ్రుచ్చినట్లుండును. కన్నులు కనబడకుండపోవును. కాటువేసిన తావున పండిన నేరేడు పండువలే కాలినట్లుండును. దంతములు రంగుమారి పోవును. ఒడలంతయు కోఁతివన్నె లోనికి మారును. అవయవములన్నియును శిథిలములగును. మలవిసర్జన జరుగుచుండును. భుజములు, నడుము, మేడ వాలిపోవుచుండును. ముఖము క్రిందై, పైకి చూచుచుండును. శరీరము దహించుకొని పోవుచున్నట్లు మాటమాటికి వణుకుచు నిద్రించుచు(మూర్చిలుచు) ఉండును. శరీరము పై శస్త్రముతో గాటు వేసినను రక్తము రాకుండును. కఱ్ఱతో గొట్టినను, ఒంటిపై కట్టకు సంబంధించిన ముద్ర పడకుండును. కాటు వేయబడిన శరీర భాగమున కాకిపాదము వంటి నల్లని ముద్ర, నేరేడు పండువలే ఉబ్బిపోయి యేర్పడియుండును. దట్టముగా రక్తముతో తడిసిపోయి యుండును. నాళములు నిరోధింపబడును. ఎక్కిళ్లు వచ్చుచుండును. గొంతుపట్టి నట్లుండి శ్వాసించుట కష్టమగును. చర్మం తెలుపు మించిన పసుపువన్నెలోనికి మారును. అంగములెండిపోవును. కాలసర్పముచే కాటువేయబడినవాడీ లక్షణముణలకు లోనగునని శాస్త్ర నిపుణులైన పండితులు చెప్పుచున్నారు. కాటుపడిన చోట మిక్కిలిగా వాచిపోయి దాని చుట్టును వలయాకారముగ గాఢమైన నీల వర్ణపుడాగు ఏర్పడినను, ఒడలంతయు బాగుగా చెమటపట్టినను, గాయమునుండి రక్తము స్రవించుచున్నను, దష్టుడు ముక్కుతో మాట్లాడుచున్నను, దంతములు, పెదవులు విడిపోయి (నోరుతెరచుకొనియున్నను, గుండె వేగముగా కొట్టుకొనుచున్నను, శ్వాసకు తీవ్రమైన ఆటంకమేర్పడినను, అది కాలసర్పము యొక్క తీక్షమైన కాటుగా తెలిసికొనవలెను. దంతములతో దంతములను స్పృశించు చుండుట, మిక్కిలిగా నాయాసపడుచున్నట్లు భిన్నమైన చూపు కలిగియుండుట, కాటు పెద్దదైన యెడ రక్తము స్రవించుచుండుట, ఒక కన్ను చూపు ప్రక్కకు తొలగుట, వైద్యులు మున్నగు వారిచే నిరాకరింపబడుట, (చొంగకార్చుట), అతిగా శ్వాసింపుచుండుట, ముక్కు ధ్వనితో మాట్లాడుట, తనపై తాను జాలిపడుట, అందఱిచేతను 'పాప'మనిపించుకొనుట-ఈ లక్షణములు గలవానిని కాలసర్పముచే కటువబడినవాడని చెప్పుదురు. బాగుగా వణకుచుండును. తీవ్రముగా భాదపడుచుండును. కన్నులెఱ్ఱబారును. మెడ ఒరగిపోవును, నాభిచలించును. అట్టివాడు కాలసర్పదష్టుడని నిర్దేశింపవలేను. అద్దమునందుగాని, నీటియందుగాని తన ప్రతిబింబమును చూడజాలకుండును. సాధారణమైన ఎండను కూడ తీర్ఘమైనదిగా భావించును. సూర్యుని తేజోహీనునిగా చూచును.
తా॥ నొప్పికి తాళజాలక, భయపడుచు వణకుచుండును, కన్నులెత్థవారును. అట్టివాడు కాలసర్పదష్టుడని, మరణించుననియు చెప్పవలెను. అష్టమి, నవమి, కృష్ణపక్ష చతుర్దశి, నాగపంచమి నాడు పాము కఱచినవారు జీవించుట సంశయాస్పదమే. ఆర్ర, ఆశ్లేష మఘు, భరణి, కృత్తిక, విశాఖ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, పూర్వఫల్గుని, మూల, స్వాతి, శతభిష నక్షత్రములందు పాముకాటుకు గుణియైన వారుగానీ, విషము త్రాగిన వారుగాని జీవింపజాలరు. పాడుబడిన యిండ్లలోగానీ, శ్మశానమునందుగాని, ఎండిపోయిన చెట్టు మీదగాని, దుష్టమైన నక్షత్ర-తిథి యోగమునగాని పాము కాటువేసిన వారు జీవింపరు. ప్రాణుల శరీరమున నూటయెనిమిది మర్మస్థానములు (ఆయువుపట్లు) చెప్పబడినవి. వానీలో పన్నెండు స్థానములు ముఖ్యమైనవి. నొసటీ యెముక, కన్ను, కనుబొమల నడిమి భాగము, పొత్తికడుపు (ఇరువైపులు) వృషణముల పై భాగము, చంకలు, భుజములు, హృదయమధ్య భాగము, దవడలు, గడ్డము (గదువ), గుదస్థానము. -వీని యందు సర్పము కాటు వేసినను, ఆయుధముతో కొట్టినను మనుష్యుడు మరణించును. సర్పదష్టుని గుజించిన వార్త చెప్పెడివారలు, 'అకచటతపయశ' వర్ణములుచ్చరించును, తలను జార్చుచుపాముకాటు వివరములు చెప్పుచుండినను దష్టుడు జీవింపనేరడనియు, అతనికి మరణకాలమాసన్నమైనదనియు నెంచవలెను. వార్త చెప్పేడు దూత ఉత్తమునికి సంబంధించిన అధముడైనను, అధమునికి సంబంధించిన ఉత్తముడైనను, మొట్టమొదటనే దష్టుని పేరు ఉచ్చరించుచు తక్కిన వివరములు తరువాత చెప్పినను, చెప్పెడి విషయమంతయు తడబాటుగా చెప్పినను అట్టివాడు ప్రాప్తకాలుని దూతయని భావింపనగును. దూత, చేతకట్టగలవాడైనను, దూతలిద్దమైనను, చేత త్రాడు పట్టుకొనియున్నను, ఎఱుపు లేక నలుపు బట్టలు ధరించియున్నను, ముఖము పైభాగమున లేక ముఖమునకు శిరస్సుకును కలిపి ఒకే వస్త్రము చుట్టుకొని యున్నను, నూనె రాచుకొని యుండినను, వెంట్రుకలు విరియబోసినను మిక్కిలి వేగముగ బోవువాడైయున్నను, కాళ్ళు చేతులతో భయంకరమైన శబ్దము చేయువాడైనను-అట్టివాడు, మరణకాలము సమీపించినవాని దూత యని తెలిసికొనవలెను.
తా॥ ఇక శివుడు చెప్పిన విధముగా సర్పముల పుట్టుకను గురించి వివరింతును. పూర్వము బ్రహ్మదేవుడు గ్రహములను, నాగులను అనేకములుగ సృష్టించెను. అనంతుని సూర్యగ్రహముగ, చంద్రుని వాసుకిగను, తక్షకుని కుజునిగను, బుధుని కర్కోటకునిగను. పద్ముని బృహస్పతిగను, శుక్రుని మహాపద్మునిగను, కులిక శంఖపాలురనిరువురిని శనైశ్చరుడు గను తెలియవలెను. నిత్యము పగలు, రాత్రియను భాగములుండునట్లు మొదటి పాదము శంఖపాలుడనియు, రెండవపాదము కులీకుడనియు నెఱుంగవలేను. దివారాత్రములు గ్రహముల ఆధిపత్యముననుండును. మధ్యాహ్నమున శుక్రచంద్రులు, ఉదయమున సంగారకుడు ఎనిమిదవ భాగమునందలిముందు భాగము శని. ఇతర భాగములందిత కలిగియుందురు. ఆదివారమునాడు పదియవ, పదునాల్గవ పాదములు. సోమవారము ఎనిమిదవ, పన్నెండవ పాదములు, మంగళవారము ఆఱవ,పదవ భాగములును, బుధవారము తొమ్మిదవపాదము, (పగటి తొమ్మిదవ భాగము రాహువునందు). వ, పదునాఱవ పాదములు వదలి పెట్టవలేను. శనివారము మొదటిపాదము దారుణమైనది. దానిని వదలవలెను. అటులే రెండవ, పన్నెండవ, పదునాఱవ భాగములను కూడ వదలి పెట్టవలెను. రెండు గడియలకు పైన, నాలుగు గడియలలోపున నుండు కాలమును భాగమందురు. అట్టి ఇరువది భాగములను అరువది గడియల కాలమునకు సరి పెట్టినచో నొక 'అహోరాత్ర'మగును. కుహూసుత, బుద్బుద, నిమేషములు వ్యావహారిక కాలము యొక్క కనిష్ఠ ప్రమాణములు.
శతార్ధసాహస్ర సంహితయగు శ్రీభవిష్యమహాపురాణమునందలి బ్రహ్మపర్వమున పంచమీ కల్పమునందు దంశదష్టకదూత లక్షణ వర్ణన మనెడు ముప్పది నాల్గవ అధ్యాయము సమాప్తము.
