భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
130. సాంబోపాఖ్యానమున ప్రాసాదలక్షణ వర్ణనము
తా॥ శతానీకుడిట్లనెను. “ద్విజోత్తమా! సాంబుడు సూర్యదేవునెట్లు ప్రతిష్ఠించెను? ఎవరి వాక్యముననుసరించి యాతడు సూర్య దేవునకు ప్రాసాదమును నిర్మింపఁజేసెను?-1 సుమంతుముని యిట్లు సమాధానము చెప్పెను. రాజేంద్రా! ధీమంతుడైన సాంబుడు సూర్య ప్రతిష్ఠ యెట్లు చేసెనో, ఆయతనమెట్లు నిర్మింపజేసెనో నీ కిపుడు వివరింతును-2. చంద్రభాగలో సూర్య ప్రతిమ లభించినంతనే సాంబుడు తన మనస్సున నారదునిఁదలంచికొనెను. వెంటనే సాంబుని యెదుట నారద మహర్షి ప్రత్యక్షమయ్యెను-3. మునిసత్తముడైన నారదుని రాకను గమనించి సాంబుడా మహాత్ముని విధి విధానముగఁబూజించి యతనితో నిట్లు విన్నవించేను-4. “దేవరీ! సూర్య దేవునకు ప్రాసాదమును నిర్మింపఁజేయువానికి, ఆ దేవ దేవుని ప్రతిష్ఠించువానికిని ఎట్టి ఫలము లభించునో దయతో నాకుఁదెలుపుడు”-5. నారదుడిట్లు సమాధానము చెప్పెను. “సాంబా! సుందరమగు ప్రదేశమున సూర్య దేవాలయమును నిర్మింపఁజేయువాడు నిస్సంశయముగ సూర్య లోకమునకుఁబోవును”-6. సాంబుడు మఱల నిట్లు ప్రశ్నించెను. “మహాత్మా! సూర్యాయతనము నెట్లు నిర్మింపవలెను? ఎట్టి స్థలమున నిర్మింపవలెను? దేవాలయమెట్లున్నచో ప్రశస్తము?17. అను నీ ప్రశ్నలకు నారద మహర్షి యిట్లు సమాధానము చెప్పెను. “బావులు మున్నగువానిలో నిండుగ కనబడునప్పుడును, భూగర్భమునందు కనబడకుండగను విస్తారమైన జలసందగల ప్రదేశములందు యశోధర్మ వృద్ధి కొఱకు దేవాలయమును నిర్మింపవలెను-8. యజ్ఞ యాగాదులు నిర్వర్తించుట, తటాకారామాదుల నేర్పరచుట వలన నుత్తమ లోకములు లభించును. రెండంశములెచట కన్పట్టునో అచట దేవతలకు గుడులు నిర్మింపవలెను-9. అందుమొదటిది జలము. ఉద్యానవనములు, పుష్పవాటికలు. రెండవది- ఇట్టి స్థానమున నిర్మింపబడిన యాలయములలో, పరిసరములందును దేవతలు సన్నిధినందియుందుట.
తా॥ తామరలచే కప్పబడుటచే సూర్య కిరణములను నిరాకరించునవియు, హంసలచే వేయబడిన పరిమళ భరితములగు కలువపూల వరుసలు గలుగుటచే పవిత్రములైన జలములు గలవియు-11. హంసలు, కన్నెలేళ్లు (పక్షులు), క్రౌంచ పక్షులు, జక్కవ పక్షులు మున్నగువాని కూజితములతో ధ్వనించుచున్నవియు, పరిసరములలో వ్యాపించియున్న చల్లని నీడలో విశ్రమించుచున్న బాటసారులు గలవియునైన సరస్సులయందు-12. దేవతలు క్రీడించుచుందురు. మేఖలాకృతిగ, బారులు దీరిన క్రౌంచపక్షుల పలుకులనెడు సంభాషణలు గలవియు, కలహంసల యవ్యక్త మధుర ధ్వనులు గలవియు, నీటి పాయలనెడి యుత్తరీయములను ధరించినవియు, చేపల వరసలే మేఖలలుగా చేయబడినవియు-13. చిగురించిన చెట్ల గుబురుల క్రిందుగగల ప్రదేశములే తమ నివాస స్థలములుగా గలవియు, నదీ సంగమ స్థానములే నితంబ మండలములుగా గలవియు, ఇసుక తిన్నెలనెడి యెత్తైన వక్షః స్థలములు గలవియు, జలమే నవ్వుగా గలవి, పల్లపు ప్రదేశములకుఁబోవునవియు, గంభీరమైన యాంతర్యము గలవియు)నైన నదులు,-14. ఉద్యానవనములకు సమీపమునందుగల ప్రదేశములు, నదులు కొండలు కలిగియు మానవ విహారమున కనుకూలముగఁ జక్కఁజేయబడిన ప్రాంతములు, ఫల పుష్పభరితములైన తోటలు గల పురములు మున్నగునవి దేవతా విహార భూములు-15. వాస్తు శాస్త్రముననుసరించి బ్రాహ్మణాది వర్ణములవారి నివాస గృహముల నిర్మాణము కొఱకెట్టి ప్రదేశములు నిర్దేశింపబడినవో దేవాలయ నిర్మాణమునకుఁగూడ నట్టి ప్రదేశములే ప్రశస్తమైనవి-16. అణువది నాలు చదరపుటడుగుల వైశాల్యముండునట్లు దేవాయతనమును నిర్మింపవలెను. దాని యందిరువైపుల సమ భాగములుండునట్లు నట్టనడిమి స్థలమున ద్వారము నేర్పరుపవలెను-17. అట్లేర్పరచుట ప్రశస్తము-17. ఆలయ విస్తీర్ణమునకు రెండింతలు దాని యెత్తుండవలెను. ఎత్తులో మూడవ వంతునకు సమముగ కటి(నడిమి) ప్రదేశముండవలెను-18. విస్తృతి యందర్ధభాగము గర్భాగారము, చుట్టును వేజ్వేలు పాములుగగనతోను గల రోగ నిగమునకోక చతురగము సగిలుతగ చతుర్ధభాగము సూర్య ప్రతిమయు, దానికన్నను తక్కిన యిద్దజి (సంజ్ఞాచ్ఛాయల) ప్రతిమల విస్తృతి పాద భాగము తక్కువగ నుండవలెను.
తా॥ ద్వారపు వెడల్పు. మూడు, ఐదు, ఏడు తొమ్మిది విభాగ ప్రమాణములలో నుండుట శ్రేష్టము. వెడల్పునకు నాల్గవ యెత్తునుండి కడప వఱకును కవాటములుంచవలెను-21. బిల్వము, జమ్మి, రావి, సూర్యుడు, చంద్రుడు, పక్షి, స్వస్తికములతోడి కలశములు మున్నగు చిత్రణములు వాని పై నుండవలెను-22. ఎనిమిదవ భాగపు పరిమాణమున నుబ్బెత్తు ప్రతిమ యుండవలెను. ఎత్తులో రెండు వంతుల ప్రతిమ, లేక మూడు వంతుల ప్రతిమయైనచో నొక భాగము మాత్రముబ్బెత్తుగ నుండవలయును. మహాబాహూ! మేరుపు కైలాసము-23. విమాన చ్చదనము సముద్రము, పద్మము, గరుడము, నందివర్థనము, కుంజరము-24. గృహ రాజము, వృషము హంసము, సర్వతోభద్రకము, ఘటము, సింహము, వృషము, చతుష్కోణము, షోడశాశ్రయము, అష్టాశ్రయము-25. అని యిరువది విధములగు ప్రాసాదములు చెప్పబడినవి. చెప్పబడిన క్రమమున వాని లక్షణములను చెప్పుచున్నాము వినుము-26. ముప్పది రెండు హస్త ప్రమాణముల విస్తీర్ణము, ముప్పది తొమ్మిది ప్రమాణముల యెత్తు, వివిధములగు ప్రవేశ కుహరములు, నాలుగు ప్రధాన ద్వారములు గల ద్వాదశ భూమిక ప్రాసాదము మేరువనబడును-27. ముప్పది హస్తముల ప్రమాణము నిడివి, పది భౌమములు, ఏడు మందరములు, శిఖరములుగల ప్రాసాదము కైలాసము. ఇరువది యెనిమిది ప్రమాణముల నిడివి, అష్ట భౌమములుగలది శిఖరవంతము-28. అష్ట దళ పద్మాకృతిగ గుండ్రముగ నుండి, ఒక శృంగము, ఒక భూమిక గల ప్రాసాదము సముధము.
తా॥ గరుడాకృతి గలది గరుడము. ఇది అణువది హస్త ప్రమాణముల విస్తీర్ణము, సప్త భూమికా కాయము, ఇరువదియేడనుబంధ భాగములు గలిగియుండును-31. గజపృష్టాకరముగ నిర్మితమగునది కుంజరమనబడును. ఇది పృష్ఠమధ్య భాగమున పదునాలు హస్త ప్రమాణముల యెత్తు కలిగియుండును. పదునాలు హస్తముల విస్తీర్ణము గలది గృహ రాజము. మూడు చక్ర శాలలు గలదీ వలభి-32. పన్నెండు హస్తముల విస్తీర్ణముతో పొడవైన వృత్తాకారముగలిగి, ఒక శృంగముతో నిర్మింపబడునది వృష ప్రాసాదము. హంసాకారముగ నుండునది హంసప్రాసాదము. ఎనిమిది వేల కలశముల రూపమున నుండునది ఘటప్రాసాదము-33. నాలుగు వైపుల ద్వారములు, బహుశిఖరములు గలది సర్వతో భద్ర. దీనికి ఇరువది యాఱు భాగముల భూమి, మిక్కిలి సుందరమైన చంద్రశాల యుండును-34. సింహకృతిగ నుండునది సింహప్రాసాదము. ఇది ఎనిమిది హస్తముల ప్రమాణ విస్తీర్ణము, పన్నెండు కోణములు గలిగియుండును-35. విశ్వకర్మ మూడువేల ప్రాసాదములను గూర్చి చెప్పెను. ఇట ప్రాసాద స్థాపకునకు విద్వాంసులొక యభిప్రాయమును సూచింతురు-36. ఏమన కపోత పాచిక (గువ్వగూటి)తో కూడిన ప్రాసాదము గణనీయతను సంతరించుకొనును”-37. సాంబుడు మఱల నిట్లనెను. “మహర్షీ! మీరు వివరించిన యీ యిరువది విధములగు సాయతనములలో సూర్య భగవానునకు నిర్మింపవలసినది యెట్టిదై యుండవలెను?-38. సూర్యాయతన నిర్మాణము కొఱకు తాము లోగడ వివరించి యున్న స్థలములో నేది శ్రేష్ఠము? అట్టి స్థలమున సూర్య మందిరమే దిశగా నుండవలయును? మిగిలిన వివరములన్నియు దయతో నాకుఁజేప్పుడు.
తా॥ నారదుడిట్లు చెప్పెను. “పట్టణ మధ్య భాగమునగాని లేక ఆ పట్టణపు తూర్పు వాకిలి సమీపమున ప్రాగ్భాగమున గాని సూర్య మందిరమును నిర్మింపవలెను-41. మొదట భూమిని పరీక్షించి యా పిమ్మట మందిర నిర్మాణము చేయవలెను. భూమి యందలి మట్టి చక్కని సుగంధము గలిగి, మంచి రుచి గలిగియుండుట ప్రశస్తము, నిర్మాణ స్థలము పల్లముగా నుండవలెను-42. పలుగు బిళ్లు, ఊఁక (ఉముక), కేశములు, ఎముకలు, ఉప్పు, బూడిద, ఉమ్మెత్త, బొగ్గు మున్నగునవి లేనిదిగ నుండవలెను. మేఘ గర్జన, దుందుభి ధ్వానము కలిగి ఏ విత్తనములైనను మొలకెత్తగలదిగ సారవంతమై యుండవలెను-43. బ్రాహ్మణులకు తెల్లనిది, క్షత్రియుల కెఱ్ఱనేల, వైశ్యులకు పచ్చనిది, శూద్రులకు నల్లనేల శ్రేష్ఠమైనదిగ చెప్పబడినది-44. ఇట్లు పరీక్షించిన ప్రదేశము మధ్య భాగమున నాలుగు మూరల వైశాల్యముతో చతురస్రముగ చుట్టును అలుకవలెను. (లేపనము చేయవలెను)-45. ఆ యలికిన ప్రదేశమున నొక మూరెడు క్రిందు చేసి మధ్య భాగమున పది యంగుళముల లోతుగ నొక గుంట తవ్వి, అట్లు తవ్వగా వచ్చిన మట్టితో నా గుంటను నింపివేయవలెను-46. సమముగా నిండినచో ఆ నేల సమగుణము కలదియని పూర్తిగా నిండక మట్టి తక్కువైనచో హీనమైనదనియు, పూర్తిగ నిండి మట్టి యెక్కువై మిగిలినచో నట్టి స్థలము సంపత్కరమనియు తెలియవలెను-47. సూర్య మందిరమెప్పుడేనియు తూర్పు ముఖముగా నుండవలెను. అనివార్యమగునపుడు పశ్చిమాభి ముఖముగ కూడ నిర్మింపవచ్చును. కాని ప్రాజ్ముఖ స్థానమును కల్పించి నిర్మించుటయే శ్రేష్ఠము-48. భవనమునకు దక్షిణ పార్శ్వమున సూర్యదేవునికి స్నాన గృహమును నిర్మింపవలెను. ప్రధాన మందిరమున కుత్తర భాగమున నగ్ని హోత్ర గృహము నేర్పరుపవలెను. శివుని యొక్కయు, మాతృకల యొక్కయు మందిరముల నుత్తరముఖములుగను-49. బ్రహ్మ దేవుని యాలయమును పశ్చిమముగను, విష్ణ్వాలయ ముత్తరమునకును, కుడివైపున వేపచెట్టును, ఎడమవైపున రాజీ మందిరమును నిర్మింపవలెను.
తా॥ సూర్యభగవానునకు కుడివైపున పింగళుడు, ఎడమవైపున దండనాయకుడుండవలెను. శ్రీ మహాశ్వేతల స్థానము సూర్యునకు ముందుభాగము-51. దేవ గృహమునకు బహిర్భాగమున ప్రాగ్జిశయందశ్వినీ కుమారులను ప్రతిష్టింపవలెను. మందిరమునందలి రెండవ కక్షలో రాజ్ఞ సొషులను స్థాపింపవలెను. మూడవ కక్షలో కల్మాష, పక్షులను, దక్షిణ దిశనాశ్రయించి దండ, మాఠరులను-53 ఉత్తరమున లోకపూజితుడైన కుబేరుని, అతనికి ఉత్తరమున వినాయకుని యుక్తముగ, రేవతుని ప్రతిష్టింపవలెను-54. ఎచట స్టానము గలదో అచ్చటచ్చట నిర్దేశింపబడిన దిక్కులలో నాయాదేవతల మందిరములను నిర్మింపవలెను. ఎడమ ప్రక్కన నొకటి, కుడిప్రక్కన నొక్కటియు నర్ఘ్యప్రదానము కొఱకు రెండు మండలముల నేర్పరుపవలయును-55. ఉదయకాలమున దక్షిణ మండలమునను, ఆస్తమయకాలమున నుత్తరమండలమునను సూర్యభగవానున కర్ఘ్యమొసంగవలెను-56. చక్రాకార పీఠముపై సూర్యప్రతిమను విధి విధానముగ స్థాపించి, స్నానగృహమున నాలుగు మంగళకరములైన కలశములలోని జలములతో నభిషేకింపవలెను-57. అభిషేక సమయమున వివిధములగు మంగళ వాద్యములు, శంఖములు మ్రోగించుచుండవలెను. తృతీయ మండలమున నిట్లు సూర్యదేవుని పూజింపవలెను-58. ఈ మండలమును సూర్యాలయమునకు ముందు ప్రతిమకు మధ్య భాగమున చతురస్రముగను, నాలుగు శృంగములతోడను, ప్రతిమా శాస్త్రసూత్రములననుసరించి దారముతో కొలిచి నిర్మింపవలెను-59. దానికి ముందు సూర్యాభిముఖముగ దిండిని స్థాపింపవలెను. నేను వివరించిన సర్వదేవమయమైన వ్యోమమునకు -60. మధ్యాహ్న సమయమున నిట నర్ధ్యప్రదానము చేయవలెను. లేక చక్రాకృతిగనొక తృతీయ మండలమును నిర్మించి దాని పై-61. సూర్యదేవుని స్థాపించి, విద్వాంసులైనవారీ స్థలమున నర్ఘ్యప్రదానము చేయదగును. ఈ వ్యోమస్థానము సూర్యదేవున కెదురుగ, సమీపమున కల్పింపవలేను. ఇక పురాణేతిహాసాదికముల వాచనము కొఱకేచట సౌకర్యమనిపించునో అచట సమావేశమందిరమును నిర్మింపవలెను-62. ఇట్లు దేవతల స్థాపనవిధి, క్రమముననుసరించి నీకు చెప్పబడినది. గృహరాజము, సర్వతోభద్ర యను నీ రెండు విధముల ప్రాసాదములు సూర్యదేవునకు ప్రియమైనవి.
శ్రీ భవిష్య మహాపురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు సాంబోపాఖ్యానమున ప్రాసాదలక్షణ వర్ణనమను నూట ముప్పదియవ అధ్యాయము సమాప్తము.
