భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
72. దూర్వాస మహర్షి సాంబునకు శాపమిచ్చుట వర్ణనము
తా॥ సుమంతుముని యిట్లనెను. “రాజా! ఇట్లు బ్రహ్మదేవుడు చెప్పిన విషయములు విని యాజ్ఞవల్క్యుడు వ్యోమ రూపుడైన దివాకరు నారాధించి సూర్యలోకమునకుఁబోయెను-1. నీవు కూడా ఆ దేవ దేవుని పూజించినచో దేవతలకు కూడా లభ్యముకాని ఉత్తమ స్థానమునకుఁబోయెదవు”-2. అది విని శతానీకుడిట్లనెను. “మునీశ్వరా! జంబూద్వీపము నందు సూర్య దేవుడుండెడి. మొదటి స్థానమేది? ఈతడు ఎచ్చట నివసించుచు విధి విధానముగ నాచరింపబడు పూజలను స్వీకరించును?”-3. సుమంతుమని యిట్లునుడివెను. “ఈ ద్వీపమున సూర్యదేవునకు మూడు స్థానములు గలవు. మొదటిది ఇంద్రవనము, రెండవది ముండీరము-4. మూడవది కాలప్రియము. ఇది ముల్లోకముల యందును ప్రసిద్ధమైనది. పూర్వము బ్రహ్మదేవుడు చెప్పిన మఱియొక స్థానము కూడ కలదు. దానిని గూర్చి కూడ చెప్పుచున్నాను.-5. చంద్రభాగా నదీ తీరమున సాంబపురమని యొక పురముగలదు. ఇదియే ఈ ద్వీపమునందు సూర్య దేవుని శాశ్వత స్థానము. అతడక్కడ సదావసియించి యుండును-6. జనులననుగ్రహించుట కొఱకు సూర్య భగవానుడీ సాంబుని పట్టణమున పన్నెండు భాగములుగననుగ్రహ దృష్టితో వాసము చేయుచుండును-7. జగచ్చైయస్సు నిమిత్తము, అంతటను అవలోకించుచు నిచట నెల్లప్పుడును నివసించుచుండును. ఆ భగవానుడు స్వయముగనే విధ్యుక్త పూజలను స్వీకరించు చుండును”-8. శతానీకుడిట్లనెను "మునివర్యా! ఈ సాంబుడెవరు? ఎవరి కుమారుడు? సూర్య భగవానుడు ఎవరి యెడ ప్రీతుడై అచట నివసించుచున్నాడు? ఎవరి పుణ్య కర్మలకు తుష్టిఁజెంది వరదుడయ్యెను?”-9. ఆ ప్రశ్నలు విని సుమంతుముని యిట్లు పలికెను. “మహా బలశాలురైన పన్నెండుగురాదిత్యులలో విష్ణువను పేరగల ఆదిత్యుడు సర్వ లోక ప్రసిద్ధుడయ్యెను-10.
తా॥ భగవానుడు, జగత్ర్ప భువునైన యాతడు ఈ లోకమున వాసుదేవ నామమును పొందెను. అతని వలన జాంబవతియందు మహాబలుడైన సాంబుడను కుమారుడు జన్మించెను-11. అతడు తన తండ్రియగు శ్రీ కృష్ణునిచేత శపింపబడీ కుష్ఠరోగ గ్రస్తుడయ్యెను. అతని చేతనే సూర్యమూర్తి స్థాపింపబడెను. తన పేరుతో నతడు పురమును కూడ నిర్మించేను”-12. శతానీకుడిట్లనెను. “తన కుమారుడేయయిన సాంబుని కృష్ణుడే కారణమున శపించెను? కొడుకును శపించినాడనినచో నది అల్పకారణమై యుండదు”-13. సుమంతుముని యిట్లనెను. “రాజా! శాపకారణమును చెప్పుచున్నాను. శ్రద్దగా వినుము. పూర్వము రుద్రాంశ సంభూతుడగు దుర్వాసమహాముని-14. ముల్లోకములు తిరుగుచు మధు సంజ్ఞ గల ద్వారవతికేతెంచెను-15, గోరోజనము వర్ణముగల కన్నులుగలవాడు, ఆకలి గొనియున్నవాడు, తీక్షమైనవాడు, వికృతమైన రూపముగలవాడు, కృశించిన వాడునైన ఆ దుర్వాస మహర్షి వచ్చుచుండుగా రూప గర్వితుడైన సాంబుడు చూచి-16. పరిహాస పూర్వకముగనతని చూపులను నడకను అనుకరింపసాగెను అతనిముఖమును చూచి తన ముఖమును కూడ అతని ముఖమునలే నీకుతేను చేసినడువసాగెను -17 యావన పొంగగంగుతో కంగరించు తనను వెక్కిరించుచున్న సాంబుని మహాతేజస్వి, ఋషిసత్తముడైన దుర్వాసుడు గమనించి క్రుద్ధుడయ్యెను-18. ముఖమును కోపముతో విదలించుచు దూర్వాస భగవానుడు సాంబునుద్దేశించి యిట్లనెను. “సాంబా! నీ సుందర రూపమును చూచుకొని నా వికృత రూపమును-19. పరిహసించుచు నా చూపును, నడకను అనుకరించుచుంటివి కావున నీవతి శ్రీఘ్రముగనే కుష్ఠ రోగ పీడితుడవయ్యెదవు” అని శపించెను-20.
శతార్థ సాహస్ర సంహితయగు శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మ పర్వమున సప్తమి కల్పమునందు దూర్వాస మహర్షి సాంబునకు శాపమిచ్చుటయను డెబ్బది రెండవ అధ్యాయము సమాప్తము.
