భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
81. విజయ సప్తమీ వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లనెను. “జయ, విజయ, జయంతి, అపరాజిత, మహాజయ, నంద, భద్ర అని ఏడు విధములైన సప్తమీ తిథులు చెప్పబడినవి. శుక్లపక్ష సప్తమీ దినమున ఆదివారమయ్యెనేని అది 'విజయ' అను పేరుగల సప్తమీ యనబడును. ఆ దినమున నీయబడు దానము గొప్పఫలమునిచ్చును. ఈ విజయ సప్తమీనాడు చేసిన స్నాన, దాన, హోమ, ఉపవాసములు మహాపాపములను కూడ నశింపఁజేయును. పంచమినాడేకభుక్తము, షష్టినాడు రాత్రిభోజనము, సప్తమీనాడు ఉపవాసము, అష్టమినాడు పారణ చేయవలయునని చెప్పబడినది. కొందదేవుని తమ నియమ నిష్టలతో వశీకరించుకొందురు. కొందఱట్లు చేయజాలరు. షష్ఠినాడు కూడా ఉపవసింపవలెనని తలంపబడిన కారణమున నట్లు చెప్పుచున్నాను. చతుర్థినాడు ఏకభుక్తము, పంచమినాడు నకబోజనము పగివచునమసనాసుము చేసిన సుసగు కలిగి షష్ఠినాడు గంథపుష్పాద్యుపచారములతో సూర్యదేవుని పూజింపవలెను. భూమి పైననే సూర్యపూజనేర్పాటు చేసి రాత్రి సమయముననా దేవుని ముందు పరుండవలెను, గాయత్రీమంత్రమును జపించుచు లేక సౌరసూక్తమును పఠింపుచు శయనింప వలెను. సప్తమీనాడు మేల్కొని స్నానమాచరించి మహాశ్వేత మంత్రాక్షరములు, లేక షడక్షరి జపించవలేను. పిమ్మట సూర్యభగవాను నర్చించి విధి విధానముగ హోమము చేయవలెను. తరువాత యధాశక్తిగ, భక్తితో బ్రాహ్మణులకు భోజన సంతర్పణము చేయవలెను.
తా॥ శాల్యన్నము, భక్ష్యములు, బూరెలు, నేయి, పాయసము, మున్నగు పదార్థములతో శక్తిననుసరించి బ్రాహ్మణ భోజనము సభక్తికముగ నిర్వహింపవలెను. సగౌరవముగ దక్షిణలిచ్చి బ్రాహ్మణులను పంపవలెను. ఈ విధముగ పుణ్యప్రదముగు విజయసప్తమీ ప్రతాచరణమును గూర్చి చెప్పబడినది. ఉపవాస వ్రతముతో దీని ననుష్ఠించినచో నుత్తమమగు సూర్యలోకపదము లభించును. ఎఱ్ఱని గన్నేరుపూలు, కుంకుమ విలేపనము. విజయధూపము, ఈ వ్రతమున సూర్యదేవునకు తృప్తి కలిగించు ఇది పాపహరము. పుణ్యప్రదము. మహాపాపములను కూడా నశింపజేయునది. ఈ సందర్భమున చేసిన దానము, హవనము, అక్షయమైయుండును. విజయసప్తమీనాడు చేసిన స్నానదాన హోమ పితృపూజనములు. మహాపాపవినాశకములు. భాను వాసరముతోఁగూడిన సప్తమీయే విజయసప్తమీయని చెప్పబడును. సర్వకామ ప్రదాయిని యగు నీ వ్రత విధానము నిట్లు నీకు తెలిపితిని. త్రిపురాంతకా! పుణ్యప్రదమైన దీనిని స్మరించినను, వినినను, కీర్తినిఆయుష్యమును, ధన్యతను చేకూర్చునని ప్రశంసింపబడినది.
శతార్ధసాహస్ర సంహితయగు శ్రీ భవిష్యమహాపురాణము నందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు విజయ సప్తమీ వర్ణనమను ఎనుబది యొకటవ అధ్యాయము సమాప్తము.
