భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము

Table of Contents

9. ఆగమన ప్రశంస

తా ॥  బ్రహ్మదేవుడిట్లనెను. ఇట్లు స్త్రీల యెడ పురుషులు ప్రవర్తింపవలసిన విధానమును గూర్చి సాకల్యముగా చెప్పితిని. ఇక నిప్పుడు పురుషుల పట్ల స్త్రీల కుండవలసిన వర్తనమును ఉపదేశింతును. పురుషులను చక్కగా ఆరాధించుట, రతి వృత్తి కలిగి యుండుట అనునవి స్త్రీలకు పుత్రలాభమును స్వర్గాద్యదృష్ట ఫలమును కలిగించును. కావున వారా నియమమును పాటింపవలెను. కర్తవ్య మేకొంచెమైనను అది అంతయును విధిననుసరించియుండును. వ్యక్తికి వైఫల్యము కలిగెననగా అది అన్యథా జరిగేడు ప్రారబ్దమగును. విఫలములైనను (సఫలములైనను) కర్మలన్నియును శాస్త్రముననుసరించియేయుండును. మహారంభులు విశేషముగ త్రివర్గ హేతుభూతులగుదురు. సర్వమును సిద్ధింపజేసి కొనువారగుదురు. ఆగమ శాస్త్రపు కట్టుబాటు నెఱుగుటయే వీధీనము. విధి నిషేధములను తెలసికొనుట ద్వారా ఐహిక పారలౌకిక ఫలములను పొందుట దీని వలన సాధ్యము. స్త్రీలకు శాస్త్రాధికారముగాని గ్రంథధారణాధికారముగానీ లేదు. అందుచే కొందఱు స్త్రీ శాసనమనర్థదాయకమనితలతురు. శాస్త్ర విహిత కరులయందు సీలకు భరతో కూడియే అధికారముగలదు, భరు మరణానంతరము సీ. క్రియాయోగము లేక పొదింగ ముండవలెనని స్మృతి వాక్యముగలదు. అందువలన భర్తయగువాడు కార్యాకార్యములను శాస్త్రమునుండి తెలసికొని గుణదోష విషయములందు స్త్రీలను -రాజు ప్రజలనువలె శాసించును. విశేషముగ శాస్త్రములను చదివిన స్త్రీలు కొందఱు కలరు. కాని అది శాస్త్రాధికారిత్వ విషయమున గల స్మృతి వాక్యములకు విరుద్దము. వేదము తెలిసిన వారే యైనను కొందఱు బ్రాహ్మణులు కృత్యముల చేత వేషక్రియాపరులు (నటులు, డాంబికులు)గా నున్నారు. అట్లే నను జాతిమాత్రమైన యోగ్యత చేత అట్టి వారు కూడ శాస్రాద్యధ్యయనమునకు అర్హులు.

తా॥ వేద శాస్త్రజ్ఞులు శాస్త్రలౌకిక ప్రయోగములు చేయుదురు. ఈ రెంటికి అంత భేదము లేని సందర్భమునను శాస్త్రమే కట్టుబాటని యెఱుంగువలెను. బోయవారు, జాలరులు, గొల్లలు మొదలగు జాతులలో, విష్టి (భద్ర) కరణము, మంగళ, శనివారములు విడిచి పెట్టుట కనబడుచున్నది. ఈ విచి పెట్టుటయనునది గమ్యాగమ్య కార్య సంబంధమున నియతాచారమై యున్నది. జనులకు శాస్త్ర వాక్యములలో తమ కిష్టమైన ఏర్పాట్లు మాత్రమే ప్రాణప్రదములు. అందువలన నాలుగు వర్ణముల వారికి, నాలుగు ఆశ్రమముల వారికిని ముఖ్యాముఖ్య ధర్మభేదములకు సంబంధించిన శాస్త్రాధి కారిత్వమును తెలిసికొనుట శక్యముకాదు. అందుచేత కర్మ, శరీరముననుసరించినట్లు శాస్త్రమునే మననము చేయవలెను. పరలోకము లేదని వాదించువాని పట్టు, శాస్త్రమునందు లేక పురాణమునందు-రెండు విధములే యుండును. కానీ నిశ్చలచిత్తుడై పెద్దలు నడచిన మార్గమునే అనుసరించుట శ్రేయోదాయకము. స్త్రీలకు తమ భర్తల నారాధించుట గృహస్థ ధర్మములకు మూలము దాని వలన వారు పతివ్రతలగుదురు. అందువలన ఆ ప్రకారము చెప్పెదను.

ఇది శతార్థ సాహస్రత సంహి యగు శ్రీ భవిష్య మహాపురాణమున బ్రహ్మపర్వమునందలి ఆగమ ప్రశంసయనెడు తొమ్మిదవ అధ్యాయము.