భవిష్య మహా పురాణము - బ్రహ్మ పర్వము
93. సప్తమీ కల్పమున భానుమహిమ వర్ణనము
తా॥ బ్రహ్మదేవుడిట్లునుడివెను. “ఎవరి కులమున నెల్లప్పుడును సూర్యదేవునుద్దేశించి యిట్టి ధర్మ కార్యములు చేయబడు చుండునో వారి కులమున దరిద్రుడుగాని, రోగగ్రస్తుడుగాని జన్మింపడు. సూర్య దేవాలయ ప్రదేశమున నావు పేడతో భక్తి మెయినలుకువాడు తతణమే పాపమునుండి ముక్తుడగును. తెల్లమట్టి, ఎఱ్ఱమట్టి లేక పచ్చని మట్టితోగాని సూర్య మందిరముననులేపనము చేయువాడు తలచిన ఫలమును పొందగలడు, పరిమళ భరితములైన పుష్పములతో సూర్యమూర్తిని రచించి, ఉపవాస వ్రతముతో పూజించువానికి కోరిన కోరికలు లభించును. నేతితోగాని నువ్వుల నూనెతోగాని సూర్యదేవునికి దీపమును వెలిగించువాడు శతకోటి దీపములతో నావరింపబడి వైభవముగ సూర్య లోకమునకుఁబోవును. సూర్య పూజా సంబంధముగ వెల్గింపబడు దీపమునకై నూనె దానము చేయువాడు నరకప్రాప్తినందడు. దీపము కొఱకగునూనె, నువ్వులు మహాపాపములను నశింపజేయునవి. ప్రతి దినము సూర్య దేవాలయమున దీపము వెలిగించువాడు, సూర్య తీర్ధములందలి చదుకములందు దీపకాంతులు ప్రసరింపజేయువాడు మిక్కిలి తేజోవంతమైన రూపముగలవాడగును. సూర్య దేవుని కొఱకు భక్తితో దీప సేవ చేయించువాడు కోరిన కోరికలన్నింటిని సఫలము చేసికొని దేవ లోకమునకుఁబోవును. చందనము, అగరు, కుంకుమము మున్నగు సుగంధ ద్రవ్యములు కర్పూరముతో కస్తూరితోను కలిపి సూర్యునకు మై పూతలు చేయువాడు . శతకోటి సంవత్సరముల కాలము శివలోకమున హాయిగా విహరించి మఱల భూ లోకమున జన్మించి చక్రవర్తియగును. సందేహములేదు. అంతేకాక కోర్కెలన్నింటిని సంపూర్ణముగ సఫలముచేసికొని సర్వలోక పూజ్యుడగును
తా॥ చందనము కలిపిన నీరు, పుష్పములును కలిపి సూర్యున కర్ష్య మిచ్చువాడు భార్యాపుత్ర పౌత్రాదులతో సుఖ జీవనము గడిపి స్వర్గమునకుఁబోవును. సుగంధ మిశ్రితములైన జలములచేత, పుష్పములచేత నర్ఘ్య ప్రదానము చేయువాడు చిరకాలము దేవ లోకమున నుండి పిదప భూతలమున రాజగురు. బంగారము కలిపిన నీటితో, లేక కుంకుమ మిశ్రితమైన ఎఱ్ఱని నీటితో నర్ఘ్యమిచ్చిన యెడల శతకోటి సంవత్సరములు స్వర్గవాసములభించును. తామరపువ్వులతో సూర్యదేవుని పూజించినచో స్వర్గ నివాస సౌఖ్యము, పెక్కు సంవత్సరముల వఱక ఖండైశ్వర్యము, ఉత్తమ స్త్రీలతో సాంగత్యము లభించును. భక్తి యుక్తుడై సూర్య భగవానునకు నేతితో గూడిన గుగుల(ధూప)ము సమర్పించినచో తక్షణమే సర్వపాపములనుండి ముక్తుడగును. సందేహములేదు. ఒక పక్షము దినములు గుగ్గులమర్పించువాడు బ్రహ్మహత్య నుండి ముక్తుడగును. సంవత్సరము వఱకు సమర్పించుచుండినచో అశ్వమేధ ఫలము కలుగును. తురుష్క దేశపు సుగంధ ధూపమర్పించిన స్వర్గము లభించును. కర్పూరము, అగరు ధూపములతో రాజ సూయ ఫలము కలుగును. భక్తి శ్రద్దలతో గూడి పూర్వాహ్లామున సూర్య పూజ చేసినచో నూజు కపిల గోవులను దానము చేసిన ఫలము లభించును. నిశ్చలమగు బుద్దితో జితేంద్రియుడై మధ్యాహ్నము సూర్యార్చన చేయువాడు వంద గోదానములు, భూ దానము చేసిన ఫలమును పొందును. సాయం సంధ్యా కాలమున సూర్యదేవుని, శుచియై, తెల్లని తలపాగ ధరించి, పూజించువానికి వేయి గోవులను దానము చేసిన ఫలము కలుగును.
తా॥ అర్ధరాత్రి సమయమున భక్తితో సూర్యదేవుని పూజించువానికి తన పూర్వజన్మల జ్ఞానము కలుగును. ధర్మాత్ముడై సత్కులమున జన్మించును. మునిమాపుదాటిన రాత్రివేళ యందు సూర్యార్చన చేయువాడు ప్రళయ పర్యంతము స్వర్గమున క్రీడించును. సేనాధిపతి నగరమును తిరుగువేళ, మల వేకువ జామున భక్తితో సూర్యారాధన చేయువాడు స్వర్గ వాస లాభమును పొందును. ఇట్లు సర్వ కాలములయందును సమాహిత చిత్తుడై జిల్లేడు పువ్వులతో, భక్తి శ్రద్ధా సమన్వితుడై సూర్యదేవునర్చించు మనుష్యుడు సూర్య లోకమునకుఁబోవును. ఉత్తరాయణమునగాని, దక్షిణాయనమునగాని భక్తి యుక్తుడై సూర్య పూజ చేయువాడు బ్రహ్మ లోకమునందును . అచటి నింద్రాదిదేవతలచేత సూర్య భగవానుడు పూజింపబడునట్లు, సకల దేవతల చేత పూజలందుచుండును. విషువత్పుణ్య కాలములందు, గ్రహణ పర్వములయందు, షడశీతి పుణ్య కాలములందు రవిదేవుని భక్తితో పూజించువానికి దుఃఖము కలుగదు. ఒకరు చెప్పుటచేగాని (మేల్కోని)లేక స్వయముగ గాని సూర్య నమస్కారములు చేయువాని యెడ నా సూర్యదేవుడు సంతుష్టుడై అతనికి నిష్టమైన గతినిచ్చును. సేవియలు, పాయసము, భక్ష్యములు, నూవుల పిండితో గూడిన లడ్డువములు, వీనితో సూర్యదేవునకు బలిచేసిన కోరికలన్నియు సఫలము చేసికొనవచ్చును. లడ్డువములు, పాయసము, మధు మాంసరసములతో సూర్య దేవుడు మిక్కిలి ప్రీతుడగును.
తా॥ ఏ మానవుడైనను సూర్యదేవునకు నేతితో తర్పణము చేసి స్నేహముగలవాడగును. మాంసముతో తర్పణము చేసి అప్పటికప్పుడే పాప విముక్తుడగును. ఒక్క దినమునము మాత్రమే ఉదయ కాలమున సూర్యదేవునకు నేతితో అభిషేకము చేసిన యెడల లక్ష గోవులను దానము చేసిన ఫలము కలుగును. ఆవుపాలతో స్నానము చేయించినచో పౌండరీక ఫలము లభించును. చెఱుకు రసముతో నభిషేకించిన నశ్వమేధ ఫలము కలుగును. సూర్యదేవుని కొఱకు సుపుష్టమైన ఒక లేగటి యావు నిచ్చువాడు భూదానము చేయువాడు అచంచలమైన సంపదను పొంది, పరమున సూర్య లోకమునకు బోవును. ఆవు శరీరము పై నెన్ని రోమములుండునో అన్ని కోట్ల సంవత్సరముల వఱకు సూర్య లోకమున నుండును. సూర్య భగవానుని కొఱకు నూఱు గోవుల నిచ్చిన రాజసూయ యాగ ఫలము కలుగును. వేయి గోవుల నిచ్చువానికి అశ్వ మేధ ఫలము దక్కును. గుగ్గులు, దేవదారు, నేతి చుక్కలతో కాల్చుచు సూర్య దేవునకు ధూపము వేయవలెను. నేతి ధూపమే దేవతలకు స్వాభావికముగ ప్రియమైనది. భేరి మొదలగు వాద్యములు, శంఖములు, వేణువులు మొదలగు వానిని సూర్యదేవుని కొఱకు నిచ్చువారు సూర్యలోకమునకుఁబోవుదురు. భక్తితో గూడీ ఆ దేవదేవునకు వజ్రము సమర్పించువాడు, పుణ్య తీర్థము నందలి యుదకము సమర్పించువాడు దేవలోకమునకుఁబోవును. అచట విమానములలో స్త్రీ సమూహములతో చిరకాలము క్రీడించి, మల మనుష్యత్వమును పొంది, భూ లోకమున ధార్మికుడగు రాజగును.
తా॥ గొడుగు, టెక్కెము, మేలుకట్టు, పతాకములు, చామరములు, హేమ దండములు మున్నగు వానిని భక్తితో సూర్యదేవునకు సమర్పించువాడు. చిఱు గంటల వరుసలతో నలంకరింపబడిన దివ్య విమానమున పయనించి సూర్య లోకమును జేరియచట అప్సర స్త్రీలకు భర్తయగును. అచట చిరకాలముండి స్వర్గమునకుబోయి మఱల మనుష్య లోకమున రాజులందజీ చేత నమస్కరిపంబడు సార్వ భౌముడుగ జన్మించును. సూర్య భగవానునకు వస్త్రములు, అలంకారములు సమర్పించువాడు సృష్ట్యాది ప్రళయ పర్యంతము జన లోకమున వినోదించును. గీత వాద్య నృత్యములతో గూడి భానుదేవునుద్దేశించి జాగరణము చేయువాడు చిరకాలము గంధర్వాప్సరో భామినులతో క్రీడించుచుండును. సుగంధములు, పుష్పమలు, పత్రములు, వివిధములైన స్తోత్రములతో సూర్యుని భక్తితో స్తుతించువారు సూర్య లోకమునకుఁబోవుదురు. ఉదయ కాలమున సూర్య భగవానుని స్తుతించుచు, కీర్తనలు బాడుచుండు స్తోత్రపాఠకులు, కైవారములు చేయు భక్తులు సర్వులును స్వర్గమునకుఁబోవుదురు. బంగారముతో చేయబడినదిగాని లేక వెండితోజేయబడినదిగాని, మణి రత్నాద్యలంకారములతో గూడిన రథమును, గుఱ్ఱములతోను కాడితోను నొగలతోను గూడ సూర్యదేవునకు సమర్పించువాడు. చిరుగంటల వరుసలతోను, మిక్కిలి తేజస్సుతోను ప్రకాశించు విమానమున పయనించి స్వర్గమునకుఁబోయి అచట అప్సర స్త్రీలతో విహరించును. రవిదేవుని కొఱకు శ్రేష్ఠమైన కఱ్ఱ రథమును చేసియిచ్చువాడు సూర్య వర్ణముతో మెఱయుచుండు విమానమునెక్కి సూర్యలోకమునకుఁబోవును.
తా॥ ఒక సంవత్సరము వఱకు గాని, ఆు మాసముల వఱకు గాని నిత్యము సూర్య రథయాత్ర నిర్వహించువారు పొందేడి పుణ్య ఫలమును చేప్పెదను వినుము. వారు, ధ్యాననిషులు, యోగులు, సూర్య భక్తి మార్గమున నడచువారు పొందెడి యుత్తమ ఫలమును పొందుదురు. భక్తియుక్తులై సూర్య రథమును లాగువారు ప్రతి జన్మమునందును ఆరోగ్యవంతులై, ధనవంతులై యుందురు. సూర్య రథయాత్రను చేయువారు సూర్య లోకమును పొంది అచట సుఖముగా విహరింతురు. మోహము వలనగాని, క్రోధమువలన గాని సూర్య రథయాత్రను భంగము చేయువారు పాపకృత్య పరాయణులైన మందేహ రాక్షసులని యెఱుంగవలెను. ధనము, ధాన్యము, బంగారము, వివిధములైన వస్త్రములు, సూర్యదేవునకిచ్చువారు పరమగతినందుదురు. గోవులను, గేదెలను, ఏనుగులను, చక్కని గుఱ్ఱములను సూర్య భగవానునకిచ్చువాని పుణ్య ఫలమును వినుము. సర్వ కామ్యములక్షయములై సిద్ధించుటయేగాక అశ్వమేధ ఫలముకూడ లభించును. చేసిన దానమునకు వేయిరెట్ల ఫలము వీనిని చేరును. సారవంతమైన దున్నిన భూమిని సూర్య భగవానునకు సమర్పించినవాడు తన వంశీయులను గడచిన పది తరముల వారిని, రాబోవు పది తరములవారిని తరింపజేయును. అట్టివాడు దివ్య విమానము నధిరోహించి సూర్యలోకముంజేరియచట, మదపుటేనుగు ఆడయేనుగుల మధ్య క్రీడించునట్లు అప్సర స్త్రీల మధ్య వినోదించుచుండును.
తా॥ సూర్యునకు భక్తితో నొక గ్రామమును సమర్పించు బుద్ధిమంతుడు సూర్య వర్ణమున ప్రకాశించు విమానమున పయనించి యుత్తమగతిని చేరుకొనును. పత్ర పుష్పఫల భరితములైన తోటలను భక్తితో సూర్య దేవునకిచ్చువారు పరమ గతినందుదురు. సూర్య భగవానుని యనుగ్రహమువలన మనో వాక్కాయకర్మలతో వారు చేసిన పాపమంతయు నశించిపోవును. ఆర్తుడుగాని, రోగ గ్రస్తుడుగాని, దరిద్రుడుగాని, దుఃఖితుడుగాని సూర్య భగవానుని శరణు పొందినచో నీక దుఃఖింపనక్కరలేదు. నూలు క్రతువులను జేసి పొందేడి యుత్తమ ఫలము ఒక్కనాడు సూర్య పూజతో పొందిన ఫలమునకు సమానమగును. సూర్య దేవాలయమున నా దేవదేవుని లీలావిలాసముల ప్రదర్శించు నృత్య నాటకాదులు నిర్వహించెనేని అట్టి వాని కోరికలన్నియు నక్షయముగ సిద్ధించి, రాజసూయ యాగ ఫలము కలగును. వారకాంతలను సూర్యదేవుని సేవకై భక్తితో సమర్పించువాడు పరమస్థానమగు సూర్యలోకమునకుఁబోవును, ఆ దేవుని సేవకై భారత గ్రంథము నిచ్చువాడు సర్వపాపములనుండి ముక్తుడై విష్ణులోకమగు వైకుంఠమునకుఁబోవును. రామాయణ పుస్తకమునిచ్చువాడు వాజపేయ యాగ ఫలమును పొంది సూర్యలోకప్రాప్తినందును. ఆ దేవ దేవునకు భవిష్య పురాణముగాని లేక సాంబ పురాణముగానీ సమర్పించిన మానవుడు రాజసూయ, అశ్వమేధ యాగముల ఫలములను పొందును.
తా॥ కోరికలనన్నింటిని సఫలము చేసికొని సూర్యలోకమునకుఁబోవును. అచ్చట చిరకాలము నివసించి యటు పైన బ్రహ్మలోకమునకు బోవును. అచట నూఱు కల్పముల కాలము నివసించి భూలోకమున జన్మించి రాజగును. సూర్యభగవానుని యాలయమున చలిపందిరులు, 'నీటివసతులు' ఏర్పరచువాడు పరమస్థానమగు దేవలోకమునకుఁబోవును. చలికాలమున చలిని పోగొట్టగలుగు కంబళ్లు మొదలగు వానిని సూర్యాలయమున, వలసినవారికి దానము చేయవలెను. దానివలన నశ్వమేథ యాగము చేసిన ఫలము లభించును. రామాయణ మహాభారతములను, పురాణములను నిత్యమును ప్రవచనము చేయించుట పుణ్యప్రదమైనది. అట్టివానికి వేయి అశ్వమేధములు చేసిన ఫలము కలుగును. ఈ పనీ వలన కలుగు ఫలమింక దేని వలనను కలుగనేరదు. కాబట్టి ఎన్ని ప్రయత్నములు చేసినను సూర్యదేవాలయమున నితిహాస పురాణముల ప్రవచనములనేర్పాటు చేయవలెను. అది మిక్కిలి శుభకరమైనది. పుణ్య కథలను చెప్పించుట, వినిపించుట వలన కలుగు పుష్టి, తుష్టి సూర్యదేవునకు మజీ దేని వలనను కలుగదు.
శ్రీ భవిష్య మహా పురాణమునందలి బ్రహ్మపర్వమున సప్తమీ కల్పమునందు భాను మహిమ వర్ణనమను తొంబది మూడవ అధ్యాయము సమాప్తము.
