బ్రహ్మాండ మహా పురాణము
32 - శ్రీనగర త్రిపురా సప్త కక్షా పాలక దేవతా ప్రకాశనకథనం
అగస్త్యుడనేను:- లోహాది సప్తశాలములకు రక్షక్షులున్నారు గదా! వారి పేరులను జెప్పి నా సంశయమును బోగొట్టుము -1. హయగ్రీవుడనెను. ఓయగస్త్యా! నానావృక్ష మహోద్యానమున సర్వలోకభక్షకుడు, నల్లని యాకారము గలవాడునైన మహాకాలుడు రక్షకుడుగా నుండును -2 అతడు నల్లని కవచమును ధరించును. మదముచే నాతని కన్నులెరుపెక్కి యుండును. బ్రహ్మాండమను. చషకమున (పానపాత్రమున) విశ్వమును రసాయనమును ద్రాగుచుండును -3. మేఘమువలె నల్లనై కామముచే మనమున ద్రవించిన మహాకాలిని క్రీగంట -జూచుచుండును. సర్వసోశాత్మకమైన కల్పాంతమను సింహాసనమున గూర్చుండును.-4. లలితాధ్యాన సంపన్నుడై లలితా పూజనముననుత్సుకుడగును. లలితా భక్తివలన తనయాయుష్యమును. దీర్ఘదీర్ఘముగా పొడిగించుచుండును. కాలమృత్యువు మొదలగు సేవకులచే సేవింపబడుచుండును -5. మహాకాలీలు మహాకాలు లలితాదేవి యొక్క యాజ్ఞను పాటించువారు. ప్రథమ మార్గముననుండి సమస్తవిశ్వమును పాలింతురు -6. మతంగుని కాలచక్రమాతని యాసనమగును. అది నాలుగావరణములతో గూడినది, మధ్యన బిందువుతో మనోహరమైనది. మూడు కోణములు ఐదుకోణములునుగలది, పదునారుదలములు-గలకమలము. అట్లే అష్ణారములు గల కమలము. మహాకాలుడు దానీ మధ్యనుండును-8 త్రికోణమున మహాకాల (మహాకాలి) మహాసంధ్య, మహానీశ అను నీమహాకాలుని. . శక్తులు మహాదేవులు -9. అచటనే పంచకోణాగ్రమున ప్రత్యూషుడు, పీతప్రసువు, ప్రాబ్లో, షరాహ్లా, మధ్యాహ్న - అనునీల్లేదు మహాకాలుని శక్తులు -10. ఇక, ఓ మునీ! పదునారుదలములపద్మముననున్న శక్తులను వినుము. దీనమిశ్ర, తమిస్ర, జ్యోతి, పక్షిడి:-11, ప్రదోష, నిశీథ, ప్రహర, పూర్ణిమ, రాక, అనుమతి, అమావస్యీక -12. సినీవాలీ, కుహు, భద్ర, పదునారవది ఉపరాగ - ఈషోడశమాత్ర స్థలైన శక్తులు పదునాలు -13. కల, కాష్ఠ, నిమేషము, క్షణము, లవము, తృటి, ముహూర్తము, కుతపము, హోర, శుక్లపక్షము -14 కృష్ణపక్షము, దక్షిణోత్తరాయనములు, విషువ, త్రయోదశి, సంవత్సర, పరివత్సర, ఇడో వత్సర -15, వీరు పదునారుదలముల నుండుశక్తులు. ఇద్వత్సర, ఇందువత్సర, వత్సర పద్మమున-16, తిథి, వారములు, నక్షత్రములు, యోగములు, కరణములు ఇవి నాగపత్రకమలముననుండు శక్తులు -17. కలి, కల్ప, కలన, కాలీ -అనునలుగురు ద్వారపాలకత్వము ననుండినవారు. (శక్తులు కాలచక్ర స్వభావమును. ఇట్టి -16 వీరు మహాకాలునిదేవులు (భార్యలు) మదముతో నవ్వినమోముగలవారు. మదిరతోనిండి పూర్తిగా నేనైన చషకమును (పానపాత్రమును) ధరించినవారు. నల్లని యాకారములు గలవారు. వీరందరు మహాకాలుని భార్యలు -19, లలితా పూజన -ధ్యాన, జప-స్తోత్రములందు నిమగ్నలైనవారు. వీరు కాలచక్రా సనమునమన్న మహాకాలుని సేవింతురు-20. ఇక, ఓ ఆగస్యా! కల్పకవాటిని రక్షించువాడు వసంతర్తువు. ఈతడు మహాతేజస్వి లలితాదేవికి ప్రియసేవకుడు- 21. పుషసింహాసనమునగూర్చుండును. పుష్పాసవమదముననే పెక్కును. పుష్పాయుధములధరించును. పుష్పాలంకారముల బెట్టుకొనును. పుష్పములు గొడుగుగా గలవాడైశోభించును -22, విలాసముగా క్రీడించునాతనికి. మధుశ్రీ మాధవశ్రీ, (చైత్రవైశాఖములు) అనునినిరువురు భార్యలు. పుష్పాసవమున మత్తెక్కినవారు. కామలాలసలు-23. ఇక సంతాన వాటికను పాలించువాడు గ్రీషర్తువు. ! అతడు తీక్షనేత్రుడు. నీత్యము లలితాదేవికి సేవకుడు. ఆమె యాజ్ఞనాచరించువాడు -24. శుక్రశ్రీ, శుచిశ్రీ (జేషాషాడములు) ఆతని భార్యలు, హరిచందనవాటికా పాలకుడు వర్షర్తువు. ఆతడు - మహాతేజస్వి. మెఇపువలె పింగలములైన కన్నులుగలవాడు. పిడుగలేయట్టహాసములుగాగలవాడు. మదించిన మేఘమువాహనముగా - గలవాడు-26. మేఘకవచము దొడిగినవాడు. మణిధనువును ధరించినవాడు. లలితా పూజన-ధ్యాన-జప-స్తోత్రములందాసక్తిగలవాడు -27. వింధ్యమథనమున తైలోక్యాహ్లాదమునిచ్చువాడు. నభశ్రీ -సభస్యశ్రీ(శ్రావణ భాద్రపదమాసములు) స్వరస్వా, రస్యమాలినీ -28, - అంబ, దుల, నిరాలి, ఆభయంతి, మేఘయంత్రిక, వర్షయంతి, చిబుణిక, వారిధార, ఈశక్తులాతని భార్యలు-25. వీరుపండ్రెండుగురు. మదముచేవెళ్లినైన కన్నులుగలవారు. ఆ శక్తులతోగూడ నా వర్షర్తువు పరమేశ్వరి నెల్లప్పుడు జపించుచుండును -30. తనకాలమునందలి పుష్పసమూహములచేతను సర్వసంపదచేతను లలితాభక్తులదేశములనలంకరించును-31. లలితావైరుల దేశములను అనావృష్టిచే పీడించుచుండును, వర్షర్తువు ఎల్లపుడు దేవీసేవకుడైయుండును-32, మందారవాటికను శరదృతువు రక్షించును. అది లోకచిత్తముల ప్రశాంతముగానుంచును-38. ఇషశ్రీ, ఊర్జశ్రీ (ఆశ్వయుజకార్తీక మాసములు) ఆశరదృతువు భార్యలు. వీరిచే జలమును ఒక్కచోగూర్చును. - తన ఋతువునందలి పూవులతో సామ్రాజ్ఞయైన శ్రీ కామేశ్వరపతిని పూజించును-34, హేమంత ఋతువు మహాతేజస్వి హీమశీతమైనయాకారముగలది. ఎల్లప్పుడు ప్రశాంతమైన ముఖముగలియుండును. లలితాదేవికి ప్రియ సేవకుడగును-85, తన ఋతువులోని పుష్పభారములచే పరమేశ్వరినర్చించును. ఈతడు అగ్నిని శాంతింపజేసి పారిజాతవృక్షవాటికను రక్షించును-36, సహఃశ్రీ, సహాస్యశ్రీ (మార్గశీర్ష- పుష్యమాసములు) ఈతని భార్యలు. అగస్త్యా! శిశిర ఋతువు కదంబవనవాటికకు రక్షకుడు -37. ఆకదంబవనవాటికక్ష్య శిశిర ఋతువుచే చల్లగా కుంచించుకొనిపోవునట్లు చేయబడును. అచటనుండు దేవత శ్యామా, శిశిరా కృతిగలది. తపఃశ్రీ, తపస్యశ్రీ (మాఘఫాల్గునమాసములు) యాతనియుత్తమ భార్యలు. వారితోగలిసి యాఋతువు విశ్వపావనియైన లలితాంబను అర్చించును. -39. అగస్త్యుడనెను ఓ హయగ్రీవా! లక్ష్మీవంతుడా! ఏడుగానున్న నానా వృక్షములుగల ప్రథమోద్యానమునకుపాలకుడుగా నీ మహాకాలునిచే ఆశ్రయింపబడెను. -40. ఆతనిది నాలుగావరణములగల చక్రమని చెప్పితివి. కల్పకోద్యానవాటులలోనితరములైన (మహాకాలేతరములైన) యాము. ఋతువులకు పాలకత్వమని నీవల్ల వింటిని. కాని చక్రదేవుల (స్త్రీలు) వినలేదు-41. ఓ భగవత్సర్వరూపుడా! నీవు సర్వజ్ఞుడవై గొప్పవాడవు. కావున వసంతాది చక్రములయావరణదేవతలను క్రమముగా జెప్పుము142. హయగ్రీవుడనెను. ఓ మునిశ్రేషా! అగస్త్యా ఆయా చక్రముననున్న దేవతలను వినుము-43. పూర్వము చెప్పిన కాలచక్రము వాసంతచక్రమనబడును. అది మూడుకోణములును ఐదుకోణములునుగలది. నాగదళములు గల కమలము. షోడశారము (పదునారాకులు (దళములు) గలది) ఐన కమలము. మరల ఇరువది యాకులు. (దళములుగల కమలము-44. చతురస్రమైనది. ఏడావరణములతోగూడినది. దానిమధ్యన బిందుచక్రమునన్నువాడు మహాద్యుతిగల వసంతుడు -45. ఆతని యొక్కనీలో రెండుగా గలిసినవారు మధుశ్రీ--మాధవశ్రీలు. వసంతుడు తన రెండు చేతులతో కేవలమాయిద్దరియొక్క ఒకొకసనమును పీడించుచుండును-46. తన రెండు చేతులతో వాపన - పుష్పాసవముతోనిండిన పానపాత్రను మాంసమునుధరించును -47. వింధ్యగర్వాపహరణముజేసిన యోయగస్త్యా ఈవిధముగా. నన్ని ఋతువులందలి ధ్యానముండును. వర్షర్తుధ్యానమున మొదటి శక్తిద్వయము తొడపైనున్నన్నట్లుగా దెలియవలెను. తక్కినశక్తులు సమీపముననుందురు-48, ఇక వాసంత చక్రదేవులను జెప్పేద వినుము. మధు(చైత్ర) శుక్ల ప్రథమిక (ప్రతీపత్), మధుశుక్ల ద్వీతీయిక. (విదియ) -4. మధుశుక్ల తృతీయ, మధుశుక్లచతుర్థిక, మధుశుక్లపంచమి, మధుశుక్లషష్ఠిక -50. మధుశుక్లసప్తమీ, మధుశుక్లాష్టమి, మధుశుక్లనవమి, మధుశక్లదశమి -51. మధుశుక్లికాదశి, మధుశుక్ల ద్వాదశి-52 మధుశుక్ల త్రయోదశి, మధుశుక్లచతుర్దశి మధుశుక్ల పౌర్ణమాసీ, మధుకృష్ణ (చైత్రబహుల) ప్రథమ, మధుకృష్ణ ద్వితీయ, మధుకృష్ణ తృతీయ - 53. మధుకృష్ణ చతుర్థి, మధుకృష్ణపంచమి, మధుకృష్ణ షఫీ, మధుకృష్ణ సప్తమి -54. మధుకృష్ణాష్టమి, మధుకృష్ణనవమి, మధుకృష్ణదశమి,-55. మధుకృషైకాదశి, మధుకృష్ణద్వాదశి, మధుకృష్ణ త్రయోదశి, మధుకృష్ణచతుర్దశి-56. మధ్వమా (చైత్రబహుల అమా) వాస్య, - వీరు ముప్పది దేవతాశక్తులు. ఈ విధముగానే మాధవము వైశాఖము) పైనున్న శుక్ల ప్రతి పధమొదలగు ముప్పది శక్తులు వేరైనవి. మొత్తము గలిసి వాసంతశక్తులు - అణువది. (చైత్రవైశాఖములు వసంతఋతువుగదా)-58. వారు తమ తమ మంత్రములచే నాచక్రమున విధివిధానముగ బూజింపదగినవారు. వాసంతచక్రరాజమునకు ఏడు ఆవరణభూములు -55. అందు అరువది భూములలో నలువదిదేవతలుందురు, సాధకులు వారిని వేరు పరచి వారివారి మంత్రములతో బూజింపవలెను-60. వాసంత చక్రమునందు వలెనే తక్కిన మూడు చక్రములందు ఉండును. శుక్ర (జ్యేష్ఠ శుచీ (ఆషాఢ) మొదలగు భేదములతో దేవతలు వేరుగానుందురు-61. గ్రీష్మ ఋతు చక్రమున మహోదయలైన యువది శక్తులు చెప్పబడిరి. ఈవిధముగనే పరఋతువు చక్రమున నభ (శ్రావణ) సభస్య (భాద్రపద) జములైన దేవతలను దెలియవలె-62. ప్రతి చక్రమున నువదేసి శక్తులు ప్రతీష్టతలు. గ్రంథ విస్తరభీతిచే వారి సంఖ్యానము విరమించినాను-63. వీరు ఋతువులకు సంబంధించిన శక్తులు. లలితాభక్తులకు సౌఖ్యము నిత్తురు. లలిత యొక్క పూజన-ధ్యాన-జపస్తోత్రములందు ఆసక్తిగలవారు-64. కల్పాదివాటీకా చక్రమున సంచరించు శక్తులు మదాలసలు. తమతమ వాటి కలలోని పుష్పములనుండి స్రవించిన మధువులతో (తేనెలతో-ఆసవములతో) మహేశ్వరిని తృప్తిపరచుచుందురు-65, మొత్తము గలిసి యాశక్తులు (360) మూడువందల యువది. ఈవిధముగా నేడు శాలములలో పాలకులైన చక్రదేవతలను నీవడిగితివి గావున వారీ నామములతో గూడ జెప్పితిని. ఇతర శాలముల యుపాదానమును పూరకమును, విస్తారమును దానిలోని శక్తిని గూడ జెప్పెద వినుము-67.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున శ్రీనగరత్రిపురాసప్తకక్షాపాలకదేవతాప్రకాశనకథనమను ముప్పదిరెండవ యధ్యాయము-32.
Summary of chapter 144 of the Brahmānda Mahā Purana is as follows:
This section details the divine manifestation and roles of the guardian deities, Yoginīs, and Sakti attendants who reside within the various circuits of the Śrī Cakra. It explains how these divine beings protect the spiritual seeker, grant specific psychic powers, and guide the devoted soul inward toward the central sanctuary of bliss. The pious practitioner offers humble obeisance to these divine guardians, seeking their benevolent guidance on the path.