23 - జామదగ్న్య తపశ్చరణము

వసిష్ఠుఁడిట్లు చెప్పెను.

మహరులయిన భృగువు, అత్రీ, క్రతువు, జాబాలి, వామదేవుఁడు, మృకండుడు --అందరును తపస్సుచే నీరూత కల్మషులు. పాప రహితులు. వారు జ్ఞానముచే, కర్మచే, పొక్కులచే వృద్దులు. వారి ప్రతాచరణములన్నియును, అందరిచే ప్రశంసింపబడినవి. వారు రాముఁడు ఏకాగ్రమనస్సుతో రహస్యముగా ఏకాంతముగా నిరంతరము, నియత వ్రతముతో తపమాచరించు చుండెనని వినిరి. అంతీయేకాక యతఁడు నిరంతర నియమ నిష్టా చరణుఁడనీయు వినిరి. వారందరు ఆతనినీ చూడ వలయునను కుతూహలముతో ఆతని ఆశ్రమమున కరీగిరి. [4] పవిత్రములయిన పుణ్యక్షేత్రములలో దూరమున తపస్సాచరించుచున్న మహాత్ములు కూడ పరశురాముఁడు తపస్సాచరించునట్టి ఆశ్రమమునకు కదలివచ్చిరి. ఆతని అనర్ఘమయిన తపస్సును ప్రశంసించి, సర్వలోకముల యందలి శ్రేష్ఠ జ్ఞానమును, అభినందించి, ఆ మహరులందరు తమతమ ఆశ్రమములకు మరలిపోయిరి. (6) రాముఁడిట్లు తపస్సున నిమగ్నుఁడైయుండ, రాముని తపస్సువలన నీశ్వరుఁడయిన భగవాన్ శివుఁడు అత్యంత ప్రసన్నుడయ్యెను. (7) తన్నుగూర్చి అత్యంత గాఢమయిన తపస్సు చేయు రాముని యొక్క భక్తిని తెలిసికొనఁ గోరి శంకరుం డు, ఓ రాజా ! మగవ్యాధుని రూపమును ధరించి రాముని సమీపమున కరిగెను. శంకరుఁడు, యువకుఁడయిన మృగవ్యాధుని రూపమున కాటుక వంటి శరీరము, ఎఱ్ఱనయిన నేత్రాంతములు గల దీర్ఘమయిన లోచనములు, శరము చాపమును దాల్చి, ఉన్నతమైన శరీరము కలిగి, వజ్రముతో తుల్యమయిన గొప్ప దృఢ శరీరము కలిగి యుండెను. ఆతని దవుండలు ఎత్తుగా నుండెను. అతని బాహువులు భుజములు, ఉన్నతములు. ఆతనీ మీసములు, జుత్తు పింగళ వర్ణమున నుండెను. ఆతఁడు పచ్చిమాంసపు, వస, యొక్కయు వాసన గలిగి యుండెను. సర్వప్రాణీ హింసకుని రూపమున నీతడుండెను. ఆతని శరీరమంతయును ముండ్లు తీగెలు తగులుకొని, చీరుకొని గాయములుపడి యుండెను. ఆతఁడో రక్తమునోడు మాంసఖండమును మాటిమాటికీ నములుచుండెను.

                        ఆతని మెడ ఇరు. పార్శ్వముల నుండి వ్రేలాడుచున్న మాంస ఖండముల భారముచే కొంచెము వంగియుండెను. నడచుకొని పోవుచు నతఁడు తన గమన వేగమున ఊరువులతో గట్టిగా వృక్ష సంతతిని రాసుకొనుచు పోవుచు (12) కాళ్లతో నడచి వచ్చెడు పర్వతమువలె ఆతఁడా ప్రదేశమునకు వచ్చెను. పుష్పించిన వృక్షములతో గూడియున్న ఆ సరస్సు యొక్క తీరమును నతఁడు చేరెను. (13) తాను మోసికొని వచ్చు మాంస భారమును, ఒక చెట్టు మొదట దింపెను. అచ్చట తరుచ్ఛాయ నాశ్రయించి యొక క్షణకాలము అతఁడు నిలుచుండెను. (14) భృగు నందనుఁడయిన రాముఁడు, సరోవర తీరమున నిలుచుండియున్న ఆతనిని చూచెను. అంత ఆతఁడు (రాముఁడు) వెంటనే లేచి, ఆతని సమీపమునకు వచ్చెను. ధనుశ్చాపములతోడి రెండు చేతులను ఎత్తి అంజలి ఘటించి రామున కతఁడు నమస్కరించెను. అంత, ఆతఁడు భృగు శార్దూలుడయిన రామునితో, సజల మేఘ గంభీర తుల్యమయి గుహాంతరము నుండవచ్చు నాదమేమో యనిపించు స్వరముతో నిట్లనెను. “నేను తోషప్రవరుఁడనెడి వ్యాధుఁడను. ఈ మహావనము నందు వసించుచున్నాను. నేను ఇందలి ప్రాణులకు, తరుషులకు, లతలకు ప్రభువును. ఇదీ నా ప్రదేశము. నేను సమచిత్తాత్ముఁడనయి, నానావిధ జంతువుల మాంసమాహారముగా నీందు సంచరింతును. నేను సమస్త భూతముల యందు సమ స్వభావుఁడను నాకు తల్లిదండ్రులెవ్వరును లేరు. నేనుపయోగించు వస్తువుల యందు, అభక్ష్యములు, అపేయములు, అను వివక్షయందును నాకు లేదు? (19) కృత్యాకృత్య వీధుల యందును నాకెట్టీ విభేద బుద్దియు లేదు. అంతియేకాక నేనాచరించు విధులయందు గాని ఆచారము లందుగానీ వివక్షలేదు. ఈ ప్రదేశమున కెవ్వరయిన వచ్చుటకు కానీ యిందు నివసించుటకు కానీ నేనంగీకరింపను. నేను నా బలముతో నింద్రునికూడ నిచ్చట నివసింప నంగీకరింపను. ఇందు సందేహము లేదు. అందరీ విషయము నెఱంగుదురు. ఈ ప్రదేశమంతయు నన్నాశ్రయించి యున్నది. అందుచే నెవ్వఁడును నా అనుమతిలేక యిచ్చటకు రాఁడు. ఇది నా వృత్తాంతము. సర్వము నీకు చెప్పితిని. నీవు కూడ యథార్థముగా నీ వృత్తాంతమును సర్వము చెప్పుము. నీవెవ్వఁడవు? దేనికై నీ విచ్చటకు వచ్చితివి? ఏల నీ విందు అధిష్ఠించి యుంటివి?(23)

ఎక్కడి కయిన పోవుటకు సిద్ధముగా నుంటివా? నీవేమి ఆచరింపఁదలంచితివి. వసిష్ఠుఁడిట్లు చెప్పెను.

ఈ విధముగా నడుగబడి, మహాద్యుతి మంతుఁడయిన రాముఁడు నవ్వుచు, నిశ్శబ్దముగా క్షణకాలముండి, తన తలకొంచెము క్రిందకు వంచి, యిట్లు తలపోసెను. (24) “ఎవ్వండీ దురాధరుఁడు? సజలాంభోదనిస్వనుఁడు? సుస్పష్టాక్షర సంయుతముగా అత్యంతార్థ యుక్తముగా పలుకుచున్నాడు? ఆతని శరీరము నాకు గొప్ప సంశయమును కలిగించుచున్నది. ఏలయన? ఆ శరీరమొక హీనజాతి వ్యక్తికి జెందినది. అంత్యకాక, శరములును, రమణీయములయి భయంకరముగా నున్నవి.” ఇట్లాలోచించు చుండగా శుభశకునములు భూమీ యందు దేహనందును తోచెను. ఆశకునములు స్వాభిప్రేతార్షదములుగా నున్నవి. (27) భృగు పుంగవుఁడయిన రాముఁడు, అంత, మనస్సులో విశేషముగా సాలోచించి వ్యాధునితో మృదువుగా నెమ్మదిగా సప్తశ్రయముగా సూనృతాక్షర వచనము లాడేను. “నీకు మంగళమగుగాక ! నేను జామదగ్న్యుఁడను. రాముఁ డు నా నామము. భార్గవ వంశజుఁడను. తపస్సాచరించుటకిచ్చట కిప్పుడు గురు శాసనము ననుసరించి వచ్చితిని. సర్వలోకేశుఁడయిన శివుని, తపస్సుచే, భక్తిచే, నీయమముచే, ఆరాధించుటకు ఈ ప్రదేశమున చిరకాలమునకు పూర్వమే యారంభించితిని. అందుచే, సర్వేశ్వరుడు, సర్వశరణ్యుడు, అభయప్రదుడు, త్రినేత్రుడు, పాపదమనుడు, భక్తవత్సలుడు, సర్వజ్ఞుడు, త్రిపురాంతకుడు నయిన శంకరుని తపస్సుచే సంతుష్టుని చేయుదును. ఈ సరసీరమున నియమము నాశ్రయించితిని. (32) భక్తానుకంపి యయిన భగవానుఁడు హరుఁడు, ప్రత్యక్షుడగు వరకు నిందే యుండెదను. ఇది నా దృడ నిశ్చయము. అందుచే, నీ విందుండి ఇప్పుడే, వేడొక చోటకు పోవుట సమంజసము. అట్లు కానిచో, ఇది మత్కృత నియమమునకు ప్రచారమునకు హాని కలుగును. నేను వేళాక ప్రదేశము నుండి యిచ్చటకు వచ్చితినీగాన, అతిథిని నీ వలన గౌరవనీయుఁ డను. నేనొక తపస్విని, మునిని, నీ నివాసమునకై వచ్చి యుంటిని. (35)

నీ సన్నిధానమున నేనుండుట కేవలము పాపమునకే యగును. నీవును మత్సమీపమున నివసించుట నీకును అసుఖోదర్కమగును. (36) అందుచే ఈ నా యాశ్రమప్రాంతమున చంక్రమణాదికము (సంచారాదికము) పరిత్యజించి, ఇహ పరలోక ద్వయమున సుఖవంతుఁడవు కమ్ము, (37)

వసిష్ఠుఁడిట్లనెను.

ఆతఁడీ రాముని వాక్కులు వినెను. రోష తామ్రాక్షుఁడయ్యెను. తామ్రాక్షుఁడయిన భృగుపుంగవునకు వ్యాధుఁడు మరల నిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. బ్రహ్మన్ ! కృతఘ్నునివలె ఇదేమి? నీవు మత్సమీపమున నా వసతిని పరీగరించు చున్నావు? (అసహ్యించు కొనుచుంటివి?) నీకేమయిన నేనపకృతి నాచరించితీనా? అంతీయకాక ఎక్కడనయిన ఈ ప్రపంచమున నెవ్వనికయిన అపకృతి నాచరించితినా? ఇంద్రియ నిగ్రహము గలిగిన దోషమాచరించని వానిని ఎవ్వఁడసహించుకొనును? ఎవ్వండవమానించును? (40) ఓ విప్రపుంగవ! నా సన్నిధి నీకు పరిహర్తవ్య మయినచో, మద్దర్శనము, మత్సవాసము, మత్సంభాషణము, వీనికీ దూరముగా ఓ ఆయుష్మంతుఁడా ! ఇప్పుడే నీవు. ఆశ్రమము నుండి వెడలి పోవలసిన వాఁడవు. నేనో బుభుక్షితుఁడను, ఆకలితో నుంటిని. నా ఆశ్రయమయిన యీ వనమును వీడి ఎక్కడికేగేదను? నేను నా అధివాసమును పరిత్యజించి నీచే ప్రేరేపింపఁబడి ఎట్లు వెడలిపోవుదును? నేనీ ప్రదేశము నుండి దూరముగా వెళ్లను. నీవు అన్యప్రదేశమున కరుగుము లేదా ఇచ్చటనే యుండుము. నన్నీ ప్రదేశము నుండి చలింప చేయుటకు నెప్పట్టున శక్యము కాదు. (44)

వసిష్ఠుఁడిట్లనెను.

ఓ రాజా ! భృగూద్వహుఁడయిన రాముఁడు ఆ వ్యాధుని వాక్కులు వినెను. కొద్దిగా కోపసమన్వితుఁడయ్యెను. తరువాత నతనితో రాముడిట్లనియెను. “వ్యాధజాతి మిక్కిలి క్రూరమయినది. సర్వ జంతువులకును భయావహమయినది. దుష్టకర్మలతో నిత్యము కూడి యుండును. సర్వ ప్రాణులచే ధీకృతమయినది. అసహించుకొనబడినది. నీవా జాతికి చెందితివి, పాపీవీ. సర్వప్రాణి హింసకుఁడవు. ఓ దుర్మతీ ! సుజనులచే నీవెట్లు పరిత్యాజ్యుఁడవు కావు ! (47)

అందుచే నీవు విహీనజాతికిఁ జెందినవాఁడవనునది యెలుంగుము వెంటనే నీవిచ్చట నుండి వేడొక ప్రదేశమునకు శీఘ్రముగా వెడలిపొమ్ము. నీవీ విషయమున ఆలోచింపఁదగినది లేదు. (48) నీవు నీ శరీగత్రాణ పరుండవు. నీవు శరీరమును రక్షింపఁదలచుకొంటివి. అందుచే ముండ్లు మొదలగు వాని కడకు నీవు వెళ్లవు. ఆ ముండ్ల బాధ భరింపలేని వాఁడవు. అట్లే ప్రాణమెల్ల వారికిని ప్రియమని గ్రహింపుము. కొట్టఁబడిన ప్రతివ్యక్తియు నీవలెనే బాధ నొందును. వేరు విధము కాదు. (50) “అహింస సర్వభూతములకు ధర్మము” అన్నది సనాతన ధర్మము. నీవీ ధర్మమునకు విరుద్ధముగా నాచరించువాడవగుట సజ్జనులు నిన్ను గర్జింతురు. (51) అత్మ ప్రాణ రక్షణార్ధము నీవశేష శరీరుల యొక్క ప్రాణములను నాశనము చేయుదుపు. అట్టిండవీవు ఎట్లు సజ్జనులచే గర్షింపఁబడకుండ నుండగలవు? ఓ పురుషాధము ! శీఘ్రముగా నీవే యిచ్చటి నుండి పొమ్ము, నీ విషయములో నేనాచరించు కృత్యము పట్ల ఎట్టి దోషము కాని హానీ కాని కలుగదు. నీయంతట నీ విచ్చట నుండి తొలఁగిపోవనిచో, నేను బలము నుపయోగించి, ఇచ్చటి నుండి తొలఁగి పోబుద్ది నీకు స్పష్టముగా కల్గించేదను. ఒక్క క్షణార్థము కూడ ఓ పాపీ ! నీ విందుండుట నీకు శ్రేయస్సు కాదు. విరుద్ధాచరణుఁడు, ధర్మ శత్రువునైన వాఁడెట్లు శుభము నొందును.

వసిష్ఠుడిట్లు చెప్పను :

రాముని వచనము విని, ప్రీతుండయినను, వ్యాధ రూపముననున్న పినాకపాణి (ఈశ్వరుఁడు), సంక్రుద్దునివలె నీ వాక్యము లాడెను. “ఈ ప్రయత్నమంతయును వట్టి వ్యర్థమైనదిగా తలంచుచున్నాను. మొదట - నీవెట్లు జ్ఞానివి? శంభుడేక్కడ? తపసెక్కడ? ఓ మూఢ ! నీవేల వ్యర్థముగా తపస్సాచరించెదవు? మిథ్యా వ్యాపారము గల నీయెడ శంకరుఁడు సంతోషింపఁడు. ఇదీ ధ్రువము. శంభువు వీరుద్ద లోకా చరణుఁ డు, ఓ దుర్మతీ ! నీవునక్క వేతాకఁడెవ్వఁడు మర్త్యుండా శంభుని తుష్టి కొరకు ప్రయత్నించును? (59)

లేదా, నా నిర్గమనమిచ్చట నుండి యుక్తమే, సంశయము లేదు. పూజ్యపూజకవీధిలో నీకును శంభునకు కలయికయగును. ఎప్పుడు? నీవు పూజించువానీ విధి ననుసరించి నిన్ను పూజించిన తరువాత ఏలయన - శంభునకు నీకు సంగమము సమంజసమే లేదా (ఈశ్వరుఁడు) నీచే పూజింపఁబడుట యుక్తమే. ఏలయన నాతఁడు ప్రపంచమునందనురక్తుఁడు. భువనరతుఁడు. అతనికి నీవు సంపూజకుఁడవగుటయు యుక్తమే. తద్విషయమున సాలోచింప పనిలేదు. లోకమునకు పితామహుఁడు, పరమేష్టి బ్రహ్మయునైన వాని శిరస్సును ఛేదించి బ్రహ్మహత్యా పాపము నొందెను. ఓ ద్విజ ! బహుశః బ్రహ్మహత్యా పాపము నొందిన శంభునిచే ఉపదేశింపఁబడి యుంటివి. కానిచో నీవే కారణమున నీట్లు చేయుదువు? (63) ఓ మునీ! అతి స్వల్ప కాలములో నీచే తపస్సిద్ధి సాధింపఁబడినది నీకును శంభునకుఁగల గుణ తాదాత్మ్యముచే ననుకొందును. నీవు నీ తల్లిని చంపి సమస్త లోకముచే నిరాకరింపఁబడితివీ. తపస్సు చేయుట యను మీషచే గహనమయిన నీర్జన ప్రదేశమున ప్రవర్తించుచుంటివి. (65) గురు, ప్రీ బ్రహ్మహత్యను ఆచరించుట వలన కలిగిన పాతకము యొక్క నాశనము కొఱకు నీవు తపస్సాచరించు చుంటివి. సరే ! ఈ తపస్సుచే ఆ పాతకము నశింపదు. (66) ఇతరములయిన పాతకములకు ప్రాయశ్చిత్తములున్నను, మాతృద్రోహమున కెక్కడను నిష్కృతి లేదనీ యెలుంగుము. ఓ రామ ! లోకము నందు ధర్మ మహీంసా లక్షణమయినచో ఏలనీ చేతితో నీవు నీ తల్లినీ ఖండించిన వాఁడవయితివి? సర్వలోక వీగర్జితమయిన ఫోరమగు మాతృవధ నాచరించి, నీవు మరల ధార్మికుఁడవ, నీ యిచ్చవచ్చినట్లు ఇతరులను నిందించుదువు. (69) ఘోరమయిన ఆత్మదోషము నేఱుంగక (గుర్తించక) చూచుచు, హేళనము చేసినవ్వుచు, నీవు పరదోష విమర్శనము చేయుటకు అనరుఁడవని యెంతును, నేను నా స్వధర్మమును పరిత్యజించి, ఎవ్వరివలన నెట్టభయము లేక వర్తించిన నీవు నన్ను గర్జించవచ్చును. యథేచ్చగా నిందించను వచ్చును. మాతో పితృ సుతాదుల యొక్క కేవల పోషణార్థము, ప్రాణికోటి హననము స్వధర్మమగుటచే చేయుచుంటిని. ప్రతిదినము, నా కుటుంబమును నేను, మాంసముతో పోషించుకొందును. ఏలయన అది నా వృత్తి. పూర్వమందెప్పుడో బ్రహ్మచే నీ వృత్తి విహితమయినది. (73)

నా పిత్రాదుల పోషణమునకు వలసిన మాంసము కంటే నధికముగా నేను చంపినచో అప్పుడు నాకు దోషము నంట గట్టవచ్చును. పోషణకు కావలసినంత మాత్రమే చంపిన మాత్రాన మేము నిందితులము కాము. ఆ విషయమును ఆలోచించి నన్ను నిందించు లేదా ప్రశంసించు. (75) సాధు కర్మ కావచ్చును, అసాధుకర్మ కావచ్చు, యే కర్మ పూర్వమందు విహితమైనచో, అయ్యదియే ఎట్లయినను ఆపత్సమయమునంగూడ ఆచరింపవలెను. నీకును నాకును గల యంతరమును నీ బుద్ధి విశేషముచే విచారించి నిరూపింపుము. నేను మాత్రము స్నేహితులు మొదలగు వారి భరణము నందే సర్వాత్మభావనారతుఁడను. వృద్ధుఁడయిన తండ్రిని వదలి, తల్లిచంపి, నీవు ధార్మికుడవయి, తపస్సాచరించుట కిచ్చటకు వచ్చితివి. (78) ఎవ్వరు ప్రధానమయిన మూలకారణము నెఱుంగుదురో, ఎవ్వరికీ వస్తు విషయమయినవిస్పష్ట సత్యదర్శనము కలదో, పారు నాలికకు వచ్చి నట్లు పలు కాడరు. (79) నీ చరిత్ర మంతయు నేను పూర్తిగా నెఱుంగుదును. ఓ భృగూద్వహ! అందుచే నిష్పలమయిన యీ నీ తపస్సు చాలు విరమింపుము. సుఖమునే నీవు కోరినచో, శరీర క్లేశకరమయిన తపస్సును విడిచి, ఓ రామ! ఇంకొకచోటునకు తెలిసినవారెవరు లేని కడకు పొమ్ము.

ఇది మహాపురాణము, వాయుప్రోక్తమునయిన బ్రహ్మాండపురాణమున తృతీయోపాధాతపాదమున ఇరువది మూఁడవ అధ్యాయము సమాప్తము.