బ్రహ్మాండ మహా పురాణము
15 - వైవాహికోత్సవోనామ పంచదశోఽధ్యాయః
ఆమాటవినీ మహాదేవి చిరునవ్వు ముఖముతో బ్రహ్మవిష్ణువు మొదలగు దేవతలతో నిట్లనెను-1. ఓ దేవతలారా! నేనెప్పుడు స్వతంత్రను స్వేచ్చాచారమున విహరించుదానిని. నాకు దగిన చరిత్ర గలవాడు నాకు ప్రియుడుగాగలడు-2. అయని యామెమాట నంగీకరించి, సమస్త దేవతలతోబాటు బ్రహ్మ మహాదేవితో ధర్మార్థ సహితముగా నిట్లనెను -3. ఒక సమయమునకు మాత్రమే కొనబడినది, డబ్బుతో కొనబడినది, స్వయముగా చేరినది తండ్రిచేనీయబడినది, ఈ విధముగా స్త్రీ పురుషుల వివాహము నాలుగు విధములు-4. నిర్ణీత కాలమునకు కొనబడినది వేశ్యయగును. వెలగట్టికొన్నది దాసియగును, గాంధర్వవిధితో వివాహముజేసికొన్నది ‘యుక్త’ యగును. తండ్రిచే యథావిధిగ నీయబడినదీ భార్యయగును-5. (యుక్త) సమాన ధర్మముగలదియగును. భార్య పితరులకు వశంవద చెప్పినట్లు వినునది యగును. మొదట సదసద్భావములు లేక అద్వైతమై (రెండులేనిదై) పరబ్రహ్మయుండెను-6. దానినుండి చిదానందాత్మకముగా ప్రకృతి జనించెను. నీవేయా బ్రహ్మపు, నీవేగా ప్రకృతివి-7. నీవేయనాదీవి (మొదలులేని దానివి) అఖిల స్వరూపిణివి. కార్యకారణ స్వరూపిణివి. సనకాదియోగులు నిన్నే వెదకుదురు-8. సదసత్కర్మరూపిణీవి, వ్యక్త (బయల్పడినది) అవ్యక్త (బయల్పడనిది)యైనయుదయము గలదానివి. అట్టి నిన్నే పంచబ్రహ్మ స్వరూపీడిగా ప్రశసింతురు-9. మొదటనీవే సృష్టింతువు. నీవేదానిని రక్షింతువు. లోకానుగ్రహమునుగోరి. ఒకపురుషుని బొందుము-10. ఈ విధముగా దేవతల చేతను. బ్రహ్మచేతను విన్నవింపబడి యమహా దేవి చేతితో నొకహారము నెత్తి యాకాశమధ్యమునకు విసిరేను-11. ఆమె విసిరిన మాల ఆకాశమును బ్రాకాశింపజేయుచు అపుడు కామేశ్వరుని కంఠమునబడెను-12. అంత బ్రహ్మ విష్ణువు మొదలుగా గల దేవతలు సంతసించిరి. పిల్లవాయువులతో కదల్పబడిన మేఘములు పుషముల వర్షించినవి-13.
ఆ తరువాత బ్రహ్మ భగవంతుడైన విష్ణువుతో నిట్లనెను. ఓ హరీ! ఈశివులకు మహాదేవీమహేశ్వరులకు వివాహము జేయవలెను-14 . జగన్మంగల కారకమైన ముహూర్తము దేవతలచేత సంప్రాప్తమైనది (వచ్చినది) మహాదేవి నీ రూపము గలిగియున్నది. నీవు గూడ నామెకుతోబుట్టువు-15. కావున ఈ కల్యాణిని కామశివునకీయదగుదువు. బ్రహ్మయొక్క యీ మాటను వినీ దేవదేవుడైన త్రివిక్రముడు (మూడు పాదములలో ముల్లోకము సాక్రమించిన విష్ణువు)-16. ప్రేమతో నా మహాదేవిని వీధిపూర్వకముగా శంకరునకిచ్చెను. దేవతలకు ఋషులకు పితృదేవతలు మొదలగు సమస్త దేవతలకును యోగులకును కల్యాణమైన మహేశ్వరీ మహేశ్వరుల కల్యాణమును ఆదిశ్రీహరి చేయించెను. బ్రహ్మాదులైన దేవతలు కానుకలు సమర్పించిరి-18. బ్రహ్మ వజ్రసారమై యనశ్వరమైన చెరకువిల్లును, శ్రీ విష్ణువు పాడని పుష్పాయుధమును-19. వరుణుడు నాగపాశమును, రాజైన విశ్వకర్మ అంకుశమును-20. అగ్ని కిరీటమును, చంద్రసూర్యులు చెవికమ్మలను, రత్నాకరుడు నవరత్నమయములైన సొమ్ములను-21. దేవేంద్రుడు అక్షయమైన మధుపొత్రమును, కుబేరుడు చింతామణి మయమైన మాలను-22. లక్ష్మీపతి స్వయముగా సామ్రాజ్య సూచకమైన ఛత్రమును (గొడుగును), గంగాయమునలు చంద్రునివలె తెల్లని వింజామరలను-23. ఇంకను అష్ట వసువులు ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అశ్వినీదేవతలు, ఇంద్రాది దీక్పాలురు, మరుత్తులు, సొధ్యులు, గంధర్వులు, ప్రమథ గణపతులును, పరితోషితులై వారీ వారీ యాయుధములను ఈమెకిచ్చీరి-24. రథములను, మహావేగములైన గుఱ్ఱములను, మహాబలములైన ఏనుగలను, రోగములేని ఒంటెలను, అశ్వములను ఆకలిదప్పులు లేనివానిని ఇచ్చేరి, సపరీచ్చదములై (కవచములుగల) వజ్రముతో సమానమైన యాకారముగల యాయుధములనిచ్చీరి-25. ఆ తరువాత మహేశ్వరీ - మహేశ్వరులను సామ్రాజ్యమునందు మంగళకరముగా నభిషేకించిరి. తరువాత బ్రహ్మ కుసుమాకరమను విమానమును నిర్మించియిచ్చెను-26. అది వాడిపోని మాలలుగలది. ఆయుధములచే నెప్పుడును భేదింపనలవికానిది. దేవలోకమునను, భూలోకమునను, అంతరిక్షమునను (ఆకాశమునను) సుసమృద్ధిమంతమై కామ గమనము గలది. (ఇచ్చవచ్చినట్లు పోవునది)-27. దాని గంధమును వాసనజూచిన మాత్రమున భ్రాంతీ-రోగము-ఆకలి-పీడలు-ఇవి క్షణకాలముననే నశించును. అది మనమున కానందమును గూర్చునది. శుభమైనదీ-28. చామరములు, విసనకర్రలు, గొడుగులు జెండాకట్టెలు-వీనితో మనోహరమైన యా విమానమునా యిద్దరు దివ్యదంపతులు అధిరోహించరీ-29. వీణ వేణువు మృదంగము-మొదలగు వివిధములైన మద్దెల మొదలగు వాద్యములు మ్రోయగా దేవగణములతో రాజమందిరము నుండి వెడలి-30. ఆ యీశ్వరీ తేజముతో బ్రకాశింపజేయుచు వీధిలో విహారము గావెడలెను. ఎదుట (ప్రక్క) నున్న మేడల చివరనున్న వేలకొలదీ-51. యస్పరసలు ముత్తైదువలును తమ చేతులతో లాజక్షతలను వర్షించిరి. మంగళార్ధములైన గాధలు బాడిరి. వీణావేణ్వాది ధ్వనులు చెలగినవి. వీనితో సంతసించుచు ఈ విధముగా వీధివీథులలో మెల్లమెల్లగా తిరిగివచ్చెను-52. అప్సరలచే చేయబడిన నీరాజనమునుగైకొని మీమానాగ్రమునుండి దిగీ మహాసభలో ప్రవేశించేను-33. శివునితో సహా సింహాసన మధిరోహించెను. అచట మహాజనులు మనమునగోరిన దానినెల్ల సర్వజ్ఞయైన యామహాదేవి కరుణా కటాక్షపాతముచేతనే పూరించెను-34. దానిని జూచి లోకపితామహుడైన బ్రహ్మ ‘కామాక్షి యనియు కామేశ్వరీ’ యనియు పేరిడేసు-35. ఆ పురమున ఆమె యాజ్ఞచే ఆశ్చర్యకరమైన మేఘము గూడ గొప్ప విలువైన వస్తువులను దివ్యములైన యాభరణములను వర్షించినది-36. దేవియొక్కయెదుట ప్రత్యింటను చింతామణీ, కల్పవృక్షము, కమల (లక్ష్మి), కామధేనువులును నెలకొన్నవి-37. వదలిపెట్టిన యితర క్రియా-గుణములుగల వారై సర్వకామార్థసంయుక్తులై నిత్యము సంతసించుచు సేవానందము మూర్తీభవించిన యా మహాదేవిని సేవించిరి-38. బ్రహ్మ, విష్ణువు, మహాదేవుడు, ఇంద్రుడు, దిక్పాలకులు, సమస్త దేవతా గణములు-39. దేవర్పులు నారదాదులు, సనకాదులైన యోగులు, మహర్షులు, మన్వాదులు, వశిష్టాదులైన తపోధనులు-40. గంధర్వులు, అప్పరసలు, యక్షులు, ఇతర దేవజాతులు, దివిలోభువీలో ఆకాశములో ససంబాధముగా నున్నవారు-41. వీరందరును ఆమె పురమున నేబాధయులేక యుండిరి-42. ఈ విధముగా వత్సలమైన (భక్తులందదయగల) యాదేవి ఈ యఖిల జనములను వదలి వేరొక చోటికి వెళ్ళదు. మీక్కలి యనురాగముతో పారిసెల్లప్పుడు సంతసింపజేసేను-43. అందరి కోరికలను దెలిసి ఈ మహాభూలోకమునకు రాజైన వాని యొక్కయు, ఈ సమస్త భూతలముననుండు వారియొక్కయు అభీష్టములనన్నింటిని ఈ రాణీ పీతికెను-44, అంబికతో గూడిన కామశంకరుడు త్రిలోకమునకేకరాజు పదివేలయేండ్లు ఒక క్షణమువలే గడచెను-45. అంత, ఒకసాడు భగవంతుడు ఋషియైన నారదుడు వినయముతో పరాశక్తికి నమస్కరించి యిట్లనెను-48. ఓ పరమేశ్వరి! నీవు పరబ్రహ్మవు. నీవే పరమమే పవిత్రమైన ధామమవు (స్థానము) సదసద్భావముల సంకల్పించుదానివి వికల్పించు దానివీ-47. జగముయొక్క యభ్యుదయము కొఱకే వ్యక్తభావమును బొందినదానివి. అసజ్జన వీసాశమే ప్రయోజనముగా గలదానివి. సజ్జనులయభ్యుదయమును గోరిన దానివి. నీ ప్రవృత్తియంతయు ఓ కల్యాణీ! సాధుసంరక్షణ కొరికే గదా-48. ఓదేవి! ఈ భండాసురుడు మూడు జగముల బోధించుచున్నాడు. నీ వొక్కరితమే వానిని జయింపగలవు. ఇతరులైన దేవతలకు సాధ్యముగాదు-49. నీ సేవయందే తత్పరులైన దేవతలు చిరకాలమిచటనేయుండిరి. నీయాజ్ఞచే పొరీ వారియిండ్లకు పురములకు బోగలరు-50. అమంగలములు శూన్యములైనవి. సత్త్వవంతములై సమృద్ధమైన ప్రయోజనములు గలవియైనవి- ఇట్లు నారదుడు విన్నవింపగా నాయఖిలేశ్వరి దేవతలను తమ తమ నివాసములకు వెళ్ళియుండుటకై పంపెను-51. అంబిక బ్రహ్మను, హరిని, శంభువును, ఇంద్రాది దీక్పాలకులను, వారివారికి తగినట్లు పూజించిపంపివేసేను-52. అట్లు పంపబడిన దేవతలు ఆమెను వదలిపెట్టుట ఆపరాధమని తలించిరి, కాని ఎవరికి వారు తమ యాత్మాంశలలో ఆదిపితరులైన మహేశ్వరీ మహేశ్వరుల సేవించునేయుండిరి-53. ఈ లలితోపాఖ్యానము ఆయుష్యమునిచ్చునది. సర్వమంగళములకు కారణము. విద్వాంసుడు భక్తి శ్రద్దలతో గూడినవాడై ప్రొద్దున లేచి మహాదేవియావిర్భావమును, ఆమె రాజ్యాభిషేచనమును జపించినచో ధన సమృద్ధి గలవాడై అమృతము వలె తీయగా మాటలాడు వాడగును-55. ఆతనికీ లోకమునగాని పరలోకమునగాని అశుభముండదు. విశాలమైన యశమును (కీర్తిని)బొందును. సమానులలో నుత్తమశ్లోకుడగును-56. అతనికి స్థిరమై చంచలముగొనీ లక్ష్మి లభించును. అడుగడుగున శ్రేయము చేకూరును. ఎప్పుడును భయము గలుగదు. తేజస్వియు వీర్యవంతుడును అగును-57. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక ఆధిదైవిక తాపములంటవు. ధర్మార్థకామమోక్షములను నాలుగు పురుషార్థములతో నిండియుండును. సింహాసనేశ్వరుని మూడు సంధ్యలలో ధ్యానించి జపించిన వాడు జాపకోత్తముడు ఆరుమాసములలో మహాలక్ష్మిని బొందును-59.
ఇది బ్రహ్మాండమహాపురాణమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున వైవాహికోత్సవమను పదియేనవయధ్యాయము.
Summary of chapter 127 of the Brahmānda Mahā Purana is as follows:
In vivid narrative style, this chapter depicts the arrogant march of Bhandāsura's colossal army, led by formidable demon generals, toward the divine fortress of goddess Lalitā. It describes their terrifying weapons, dark incantations, and boundless pride as they attempt to challenge the divine army of Saktis. The faithful listener remains unshaken, knowing that no shadow of evil can ever withstand the blazing light of the supreme mother's grace.