బ్రహ్మాండ మహా పురాణము
17 - శ్రాద్ధ మాచరించుటకు దగిన తిథులు
బృహస్పతి ఇట్లు చెప్పెను.
ఇంక ముందు త్రివిధములైన శ్రాద్ధ కర్మలఁ గూర్చి చెప్పెదను. 1. (కామ్యము) మనస్సులో నొక కోరిక నుంచుకొని చేయునట్టిది. 2, (నైమిత్తికము) ఒక నిమిత్తము నుద్దేశించి, అప్పుడప్పుడు (ప్రత్యేక సమయములలో) జేయునది 3. (అజస్రము) నిత్యము చేయునట్టిది, ఈ శ్రాద్ధములన్నియును గౌరవనీయములయినవి. అష్టక శ్రాదత్రయములు పుత్రుల యొక్క భార్యల యొక్క క్షేమము కొఱకు ఆచరింపఁబడునవి. ఇయ్యవి చాంద్రమాసములయిన మార్గశీర్షము, పుష్యము, మాఘము అనుమాసములలో కృష్ణ పక్షమున అష్టమి తిథినాఁడు చేయబడునవి. మొదటిది ఆఖండలుడయిన ఇంద్రుడు దైవము-- గలది. ఉత్తమమయినది. రెండవది ప్రజాపతి దైవముగా గల ప్రాజాపత్యము. మూఁడవది విశ్వేదేవతలు దేవతలుగా గలిగినది. మొదటిది సదా అపూపములతో చేయఁదగినది. రెండవది యెల్లప్పుడు మాంసముతో చేయఁదగినది, ఇక మూఁడవది కూరలతో (శాకములతో) చేయఁదగినది. ఇది శ్రాద్ధ గత ద్రవ్య వినియోగ సంబంధవిధి. అయినను, నిత్య శ్రాద్దము పితరుల క్రిష్ణ ప్రాయమైనదని విధింపఁబడినది. [4) వేతకటీ నాలుగవదియున్నది. ఇయ్యది ప్రత్యేకముగా విశేషమయిన శ్రద్ధతో చేయదగినది. తనకున్న సంపదను సర్వము నయినను వెచ్చించి యీ శ్రాద్ధముల నాచరించీ వివేకియయిన బుధుఁడు, ఇహమున, పరత్ర, శ్రేయస్సు వెంటనే పొందును. (5) పీతరులు, పర్వదినములలో (అమావాస్య మొదలగు రోజులలో) సప్తమి, అష్టమి, నవమి తిథులలో, అధిష్టాన దేవతలు. (6) ఈ పురుషులు (పీతరులు) ఆవులు నీటి పడియలకు పోవునట్లు శ్రాద్ధ యోగ్య ప్రదేశముల కరుగుదురు. అష్టకములలో శ్రాద్ధము నిర్వర్తింపఁబడక పోయినచో, పూజింపఁబడకయే మాసాంతమున తిరిగి పోవుదురు.(7) ఇహమున పరమున ఆ వ్యక్తి కోరికలు (ఆశలు) నిష్పలములయినవగును. పూజించిన వారలకు సముత్కర్ష (అభివృద్ధియు, పూజింపని నాస్తికుల కధోగతియును నగును. (8) శ్రాద్దము పెట్టిన వారు (దాతలు) దేవతలం జేరుదురు. పెట్టని వారలు తిర్యగ్దంతులను చేరుదురు. తిథుల యందు పూజలను చేయునట్టి వారు పుష్టిని, సంతానమును, స్మృతిని, బుద్ధిబలమును, పుత్రులను, ఐశ్వర్యమును పుష్కలముగా పొందుదురు. శుక్లపక్షము నందు ప్రతీపత్తు (పాడ్యమినాఁడు) అధికమయిన ధనలాభమున కనుకూలము, ఆతఁడు పొందిన పుష్యాదీకములు నశించవు. (10) ద్వీతీయ తిథి యందు శ్రాద్ధమాచరించినవాఁడు ద్వీపాత్ జంతువుల కధిపతియగును. శుక్లపక్ష తృతీయా తిథిని ఆచరించు వారు, ఉత్తమ వస్తువుల పొందుదురు. శత్రుఘ్నుడగును. పాపములు నాశనము చెందును. (॥) చతుర్థి యందు చేయునతఁడు శత్రువుల ఛిద్రములను (లోపములను) కనుగొనును. పంచమీ తిథి నాచరించినవాఁడు గొప్పదయిన సౌభాగ్యము నందును. (12)
షష్ఠినాఁడు శ్రాద్ధముల నాచరించువాఁడు ప్రయత్నపూర్వకముగా మిక్కిలిగా పూజింపఁదగినవాఁడగును. సప్తమినాఁడు శ్రాద్ధముల సతము సాచరించు నరుఁడు భూమికి ప్రభువగును. గణముల కధిపతియగును, అష్టమి యందాచరించిన మానవుఁడు సంపూర్ణముగా నభివృద్ధిని పొందును. (14) ఐశ్వర్యమును స్త్రీలను కాంక్షిచునట్టివాఁడు, సపమీయందు శ్రాద్ధమాచరించవలయును. దశమి నౌఁడాచరించిన వ్యక్తి బ్రాహ్మీ శక్తిని శ్రీయమును పొందును. సర్వ వేదములను నేర్చినవాఁడగును. విప్రులతో సమత్వమును పొందును. ఏకాదశి నౌఁడాచరించిన శ్రాద్ధము వలన ఉత్కృష్టమైన దానమును ఐశ్వర్యమును సతతము ఆ వ్యక్తి పొందును. (16) ద్వాదశి యందు శ్రాద్ధ మాచరించిన నరుఁడు, జయ లాభమును, రాజ్యమును, ఆయుర్దాయమును, ధనమును, ప్రజావృద్ధిని, పశువులను, మేధను (తెలివిని) స్వాతంత్ర్యమును ఉత్తమమయిన పుష్టిని పొందును. (17) త్రయోదశి యందు శ్రాద్ధము సాచరించిన వాఁడు దీర్ఘాయుర్దాయమును ఐశ్వర్యమును పొందును. చిన్నతనములో మృతినొందిన వారికి లేక ఆయుధములచే గొట్టంబడి మరణించిన వారికి చతుర్దశి నాడు శ్రాద్దము నాచరించవలయును. అమావాస్యనాఁడు ప్రయత్న పూర్వకముగా సదా శుచిమంతుఁడై శ్రాద్ధమాచరించవలయును. ఆతఁడు సర్వకామములను పొందును. శాశ్వత స్వర్గము నందును. అట్లే, కవలలుగా పుట్టిన వారికి, అననుకూల నక్షత్రములందు పుట్టిన వారికి సర్వత శార్దమును అమావాస్య నాఁడొచరించవలెను. ఆతఁడు సర్వమైన కోరికలను పొందును. మఘ నక్షత్రమందు శ్రాద్దము లాచరించినవాఁడు సర్వకామములను పొందును. (21) మఘ నక్షత్ర మండలికి పితరులు అధ్యక్షులగుట పీతరులు స్వయముగా ప్రత్యక్షముగా నర్చీంపఁబడిన వారగుదురు. అందుచే మఘ నక్షత్రమున నాచరింపఁబడిన శ్రాద్దము అక్షయమయిన లాభముల నొసంగునట్టిదిగా స్మరింపఁబడినది.
ఇది వాయుప్రోక్తము మహాపురాణమునయిన బ్రహ్మాండ పురాణము నందు మధ్యభాగమున, తృతీయోద్ఘాతపాదమున శ్రాద్ధకల్పమున తిథి శ్రాద్ధవర్ణనమను పదునేడవ అధ్యాయము.
Summary of chapter 55 of the Brahmānda Mahā Purana is as follows:
Reaffirming the glory of ancestral devotion, this chapter extols filial piety as one of the highest spiritual virtues leading directly to divine grace. It recounts how honoring parents and ancestors yields longevity, wisdom, and eternal spiritual merit that no worldly wealth can equal. The reader is filled with profound respect for family elders, recognizing that service to parents is equivalent to worshipping the supreme lord directly.