బ్రహ్మాండ మహా పురాణము
6 - లలితోపాఖ్యానమున హింసాద్యస్వరూపకథనమను
ఆ తరువాత అగస్త్యుడు హయగ్రీవుని నాశ్చర్యకరమైన యాసనమున గూర్చుండజేసి యాతనిని సమీపించి యిట్లడిగెను-1. పర్వధర్మముల దెలిసిన వాడా! సర్వసిద్దాంతముల నెరిగినవాడా: ఓ భగవత్స్వరూపుడవైన హయగ్రీవా! మీ బోటివారి దర్శనము లోకాభ్యుదయమునకు హేతువు-2 మహాదేవి యొక్క ఆవిర్భామును, ఆమె వేర్వేరు రూపములను, ఆమె ముఖ్యమైన విహారములను మాకు విస్తరముగా జెప్పుము-3.
హయగ్రీవుడనేను : ఆ మహాదేవి ఆది లేనిది, సమస్త స్వరూపిణి (అన్ని రూపము లామెవే) కేవలధ్యానము చేతనే చూడదగినది, ధ్యానమే యామె స్వరూపము. మన హృదయమే స్థానముగా గలది-4 చాలా కాలము దేవీమంత్ర జపానుష్టానములు జేసిన గౌరవము వలన నామెతో నాత్మైక్యమేర్పడిన యావ్యక్తిని ఆదేవి చేరును-5. మొదట బ్రహ్మయొక్క ధ్యానయోగము వలన శక్తి యావీర్భవించినది. ఆమె ప్రకృతియని పిలువబడినది. ఆమె దేవతల కిష్ట సిద్ధినిచ్చునది-6, అమృతమంథనము జరుగగా నామె రెండవ రూపము ఆవిర్భవించినది. అదీ సర్వసంమోహనమైనది మాటలకుగాని మనస్సునకు గాని యందనిది-7. ఆమెను దర్శించుట వలననీశుడు సర్వజ్ఞుడైనను విమోహితడయ్యెను. వెంటనే పార్వతిని వదలి యామెను జేరి సంభోగించెను-8. ఆమెయందు శివుడు అసురఘాతియైన “శాస్త్ర”ను జనింపజేసేను-9.
అగస్త్యుడనేను :- ఆశ్చర్యము! సర్వభూతములకీశ్వరుడు, సర్వేంద్రియములను తన వశము నందుంచుకొన్నవాడు, మన్మథుని భస్మీకరించి శాసించిన వాడు, ఆ దేవి చేత నెట్లు విమోహితుడై యామె యందు తన కుమారుని జనింపజేసెను?- 10 హయగ్రీవుడనెను:పూర్వము అమరావతి పట్టణమునకధిపతియైన యింద్రుడు విజయశ్రీ సమృద్ధి జెందిన పోడై దేవదానవ-మానవులతో నిండిన ముల్లోకములను పాలించుచుండెను. (11) అతడు కైలాసశిఖరము వంటి యాకారము గల ఐరావతమను తెల్ల యేనుగనెక్కి అందరి చేతను అఖిల లోకములలో పూజింపబడుచు తిరుగుచుండెను. అవ్యయుడైన (నాశనము లేని వాడైన) భవానీపతి శివుడు అతనిని మదించిన వానిగా గుర్తించెను, (12) ఆమదమును దించుటకు దుర్వాసమునిని బీలిచి యాతని (ఇంద్రుని) కడకంపెను. దుర్వాసుడు చినిగిన చర్మమును ధరించి దండియై దుమ్ముబారిన దేహము గలవాడై పిచ్చివాని వేషమును ధరించి దేవ (ఆకాశ) మార్గమున వెళ్లెను -13. ఈ మధ్యలో నోక సుందరాంగియైన విద్యాధర స్త్రీ అనుకొనకుండగనే యాతని యెదుటకి వచ్చాను-14. ఆమె చాలా కాలము తపము జేసి పరాంబికను సంతోషపెట్టి యా పరాంబిక యిచ్చిన మాలను పొంది సంతోషించియుండెను-15. లేడిపిల్ల కన్నులవంటి కన్నులుగల యా విద్యాధర స్త్రీని చూచి దుర్వాసముని శ్రేష్ఠుడు ఓ భీరు! (పిరికి స్వభావము గలదానా) ఎక్కడికి పోవుచుంటివి? ఈ మాల యెక్కడి నుండి పొందితివి? అని యడిగెను -16, ఆ విద్యాధర స్త్రీ మహాత్ముడైన దుర్వాసునకు నమస్కరించి వినయముతోనిట్లనెను. ఓ బ్రహ్మస్వరూపుడా! నా చిర తపముచే సంతుష్టయైన పరాదేవి యనుగ్రహించి యీ మాలనిచ్చినది-17. ఆమె మాటను వినీ దుర్వాసుడు ఆ మాలనీమ్మని యడిగెను. ఆమెయు దుర్వాసుడడిగిన మాత్రముననే సంతసించినదై యా మాలను మహాత్ముడైన దుర్వాసునకిచ్చెను-18. ఆమాలను రెండు చేతులతో స్వీకరించి కృతార్థుడనైతిని అని వెంటనే భక్తితో నా మాలను దుర్వాసమునీ శిరమున ధరించెను. మిక్కిలి సంతసించియిట్లనెను-19. బ్రహ్మాదులుగూడ బొందలేని మాలను నేను బొందితిని. నీకు దేవి యొక్క పదకమలములయందు సముజ్జ్వలమైన భక్తి యుండుగాక-20. రాబోవు చక్కని శోభనమైన యాకారముగలదానా యథా సుఖముగా వెళ్లుము-21 అట్లామెను చింపించి మరలదేవ మార్గమున దుర్వాసముని వేడలెను. విద్యాధర వధువుయొక్క చేతినుండి వీణను దీసికొనెను.-22. దివ్యములైన మాలలను, దివ్యములైన మైపూతలను, దివ్యములైన యాభరణములను ఒక చోటధరించెను. ఒక చోవానినిగ్రహించుచు, ఒకచో గానము జేయుచు, ఒకచో నవ్వుచు, స్వేచ్ఛగా విహరించుచు, ఆముని ఇంద్రుడున్నచోటికి బోయెను. తన చేతిలో నున్న దివ్యమాలను. ఇంద్రునకొసగెను-24: దేవరాజైన యింద్రుడు దానిని దీసికొని తన మైరావతము మూపునబడవైచెను. ఆయేనుగ దానిని దీసికొనీ భూతలమునకు విసిరేను-25, అట్లు భూమిపైకి విసిరిన మాలను చూచి దుర్వాసముని కోపముతో నిట్లనెను, నేను శిరమున ధరించిన మాలను శిరమున ధరింపవైతివి-26. త్రైలోక్యైశ్వర్య (త్రిలోకాధిపతివను మడముచే) మత్తుడవై యీ-దివ్యమాలనవమానించితివి. ఈ ఆ మాల మహాదేవి ధరింపబడినది. బ్రహ్మాదులచే పూజింపబడును-27. నీవు శాసించిన దేవ దానవ, మానవలోకము నా శాపమున అశోభనమై, తేజోహీనమైకాగలదు-28. అని శపించెను, ఇంద్రుడు వినయముతో పూజించినను దుర్వాసముని కాబోవు.ఇంద్రపతనమును స్మరించుచు ఊరకయే (మాటాడకయే) వెళ్లేను-29. అందువలన ఇంద్రుని విజయలక్ష్మి బలిదైత్యుని జేరెను. ఇక నిత్యశ్రీ నిత్యపురుషుడైన శ్రీమహా విష్ణువును జేరెను-30. ఇంద్రుడు గూడ తన యమరావతికిబోయి యందరు దేవతలతో గూడి దుఃఖితచిత్తుడై సిరిలేనివాడై చింతింపసాగెను-31. అంత అమరావతిలో అశుభశకునముల జూచి యింద్రుడు బృహస్పతిని బిలిచి యిట్లనెను-3 ఓ భగవత్స్వరూపుడా! సర్వధర్మముల దెలిసినవాడా! భూత భవిష్యద్వర్తమానములడెలిసినవాడా! ఈ వరకు కనబడనియశుభ శకునములు గనబడుచున్నవి. వాని ఫలము లేమి? వానిని. గడచునుపాయములేమి? చెప్పుడు-అనియడిగెను. అది విని బృహస్పతి. ధర్మార్దములతోగూడిన శుభవాక్యమునిట్లనెను. ఓరాజా! చేసిన పాపపుపనిని కల్పకోటి శతములకైనను ప్రాయశ్చిత్తమును జేసితాని అనుభవించికాని కడ తేర్చుకొనవలెను-35
ఇంద్రుడనెను (పాప) కర్మయెట్టిది? దాని ప్రాయశ్చిత్తమెట్టిది? అది యంతయు వినదలచితిని విస్తరముగా చెప్పుడు -36. బృహస్పతి యనేను:- చంపుట, దొంగిలించుట, హింసించుట, కల్లుమొదలగువానిని ద్రాగుట, పరస్త్రీరతీ - ఇవీ రాజుయొక్క దుష్కర్మలు ఐదు - 37. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, గుఱ్ఱములు, గాడిదలు, ఒంటెలు, నాలుగుకాళ్ల జంతువులు, అండజములు (గ్రుడ్డు నుండి బుట్టునవి), నీటబుట్టువీ, తిర్యగ్జంతువులు (అడ్డముగా బోవునవి), ఎముకలు లేని ప్రాణులు - 38. అయుతమును (10,000), సహస్రమును (1000), శతమును (100), దశము (10), అట్లేదశము, దశము, ఐదు, మూడు, ఒకటి సగము ఇదీ ఆనుపూర్విగానగును-39. బ్రాహ్మణ క్షత్రియ-వైశ్యులగు స్త్రీలకు పూర్వము జెప్పిన విషయమున పాపమును జెప్పవలెను. తండ్రి-తల్లీ-గురువు-స్వామి-పుత్రుడు-వీరి విషయములో నిష్కృతి (ప్రాయశ్చిత్తము) కలదు-40. గురువు యొక్క యాజ్ఞచే చేసిన పాపము ఆతని యాజ్జోల్లంఘనమున సగమగును. రాజు పదిమంది బ్రాహ్మణుల భృతికై (నిలుపుటకై) ఒక బ్రాహ్మణుని జంపవలెను-41. బ్రాహ్మణుడు నూరుగురు బ్రాహ్మణుల నిలుపుటకు ఒక బ్రాహ్మణుని జంపవచ్చును. ఐదుగురు బ్రాహ్మణుల నిలుపుటకు ఒక వైశ్యుని దండింపవలెను-42. పదుగురు వైశ్యుల నిలుపుటకై ఒక వైశ్యునీ దండింపవలెను. నూరుగురు వైశ్యుల నిలుపుటకై ఒక బ్రాహ్మణునీ దండింపవలెను-45. వేయిమందీ శూద్రులను నిలుపుటకై ఒక బ్రాహ్మణుని దండింపవలెను, వారిలో నూరుగురికై ఒక వైశ్యుని వారిలో పదుగురికై ఒక శూద్రుని దండింపవలెను-44. బంధువుల యొక్కయు, మిత్రుల యొక్కయు ఇష్టముకొఱకై ముప్పాలు, భార్యాపుత్రులకై సగపాలు, స్వాత్మార్గముననేమియులేదు-45. తనను జంపబూనినపుడు బ్రాహ్మణునిగాని, క్షత్రియునిగాని, వైశ్యునిగాని, గోవునుగాని, గుఱ్ఱమునుగాని, మరి యితరమును గాని చంపినచో దోషమంటదు-46. తనను, భార్యను, సోదరునీ, బంధువులను జరిపిన మొదట నుండి వరుసగా నుత్తరోత్తరముగా పదిపదిరెట్ల అధిక దోషము గలుగును. (ఉదా: ఆత్మహనమునకన్న భార్యాహననదోషము పదింతలు. దానికి పదింతలు ఇట్లేతక్కినవి). అట్లే ఆత్మ-భార్య-సోదర బంధువుల రక్షణమున గూడ ఉత్తరోత్తరముగా పదిపదిరెట్లు అధికముగా పుణ్యము లభించును-47. రాజును, ద్విజుని, శ్రోత్రియుడైన వేత్తను, వేదవతిని వేదాస్త్రవేత్తను జంపినచో ఒకటి, రెండు, ఏబది, పదివేలు ఉత్తరోత్తరాధిక ప్రాయశ్చిత్తములు. అట్లే పైపొరని దానమున రక్షించినవారికీని పై విధముగా ఉత్తరోత్తరాధికముగా పుణ్యము లభించును. అని సత్పురుషులు చెప్పుదురు. వారిని దర్శించుటలోను, నమస్కరించుటలోను, సేవించుటలోను వారితో సమానముగా నాచరించుటలోను ఉత్తరోత్తరాధిక పుణ్యము లభించును-45, రాజు దేవతలకై, బ్రాహ్మణులకై (పోరినీలుకడకై సింహములు, పులులు, మృగములు మొదలగు లోకహింసాకర జంతువులను ఎల్లప్పుడు చంపివేయుచుండవలెను-50. ఆపదలలో ఆత్మరక్షణకై పవీతములైన వానిని జంపి తినవచ్చును-51. తనకొఱకైయన్నమును వండరాదు. తనకొఱకై పశువులను వండరాదు. దేవతల కొఱకుగాని, బ్రాహ్మణులకొఱకుగానీ వండినవారికి పాపమంటదు -52. పూర్వము భగవతి మాయా స్వరూపిణియై జగమునుజ్జీవింపచేయబూని సమస్త దేవతలను, అట్లే దానవులను, మానవులను సృష్టించేను-53. వారి సంరక్షణకై పదునాలుగు పశువులను సృష్టించెను. యజ్ఞములను, వాని విధానములను ఏర్పరచి వారితో దేవాదులతో నిట్లనెను-54, ఓ మానవులారా! ఈ విధానమున. పశువులతో యజ్ఞము జేసి దేవతల బూజింపుడు. యజ్ఞభావనతో పుష్టిజెంది దేవతలు మీకిష్టములను ప్రసాదించెదరు-55. ఈ విధముగా పరమేశ్వరునిచే ప్రవర్తించిన ప్రపంచ చక్రమును అనువర్తింపనీపోడు జన్మజన్మలలోను దరిద్రుడై నరకమనుభవించును-56. దేవతలకైగానీ, పితరులకైగానీ, అభ్యాగతులకై (అకస్మాత్తుగా భోజనమునకు వచ్చినవారికై)గానీ, గురువునకైగానీ, మహాత్ములు వచ్చినప్పుడు గానీ బ్రాహ్మణుడు పవిత్రములైన పశువులను జంపవచ్చును-57. ఆపదలలో బ్రాహ్మణుడు పవిత్రమైన మాంసమును భుజించియు పాపమునంటడు, వేదవిహితములైన కర్మల జేయవలె వేద నిషిద్ధములైన వానిని మానవలె-58. పూర్వము . యువనాశ్వుని యొక్కయు దేవతలయొక్కయు మహాక్రతువు జరిగెను. అపుడు ‘ఇదినాది’యని దేవతలలో కలహము కలిగెను. అపుడు లోకపితామహుడైన బ్రహ్మ దేవతలకును మానవులకును ఒక్కొక్కరికి పశువులను విభజించి యిచ్చెను-60 . అంతలో భూత (ప్రాణి). సంఘసహాయినియగు పరాశక్తి కుపితురాలయ్యెను. నయముతో గూడిన పోడై బ్రహ్మయామెతో నిట్లనెను-61 ఆ విధముగాకుపితయై యావిర్భవించినయాపరాశక్తిని తలయెత్తి చూచీ ప్రాణుల యానందమునకు విఘ్నమువాటిల్లునను భయముతో గూడిన పొడై చేతులు జోడించి నమస్కరించి స్తుతించి అనుగ్రహింపుమని మాటిమాటికి వేడికొనుచు -62. నీవునాముందావిర్భవించినందున ధన్యుడనయితిని. నీ చేతనే యీ సమస్త శుభాశుభ కార్య సముదాయము నిర్మింపబడినది-63. శ్రుతులు, స్మృతులు నీచేతనే ప్రతిపాదింపబడినవి. నీ చేతనే యాగములన్నియు కల్పింబడినవి. మహాక్రతువున నాయా దేవతలకు వీభజించిన పశువులు అన్నియు ప్రాణి తృప్తి కొరకు ఓ పరమేశ్వరి! నీవే(నీకుసంబంధించినవే) యగుగాక-65. అని చెప్పి బ్రహ్మ వారీయెదటనే యంతర్థానమందెను. ఆ బ్రహ్మ తాను చెప్పిన విధముగనే మహాక్రతువులను గూడ జేసెను-66. పవిత్రములైన పశువులను జంపీ పరాశక్తిని యజ్ఞమున ఐూజించేను. ఆయా విభాగము వేదములందు జెప్పబడియుండుటచే నిచట జెప్పబడలేదు-67, బ్రాహ్మణుడు దప్ప స్త్రీలును శూద్రులును మాంసమును స్వీకరించిరి. ఆపదలయందు బ్రాహ్మణుడు గూడ గురువుయొక్క యాజ్ఞతో దాని భక్షింపవచ్చును-68. శివుని నుండి బుట్టిన పిండము సంపూర్ణముగ శ్రీవత్వము నందినది. ఓ పశూ! నీవు మేల్కొనుము. అశివుడవగుచున్నను శివుడవగుచున్నావు గదా! (మాయాపిండమును వీడి సద్రూపశివైక్యమునందు చున్నావని భావము)-69. ఆకారణముననే (మాయావిముక్తుడవగుటచే) ఈశుడవు, సర్వజగమునకు కర్తవు, కారణుడవు, ప్రలయ స్వరూపుడవు, రుద్రుడు విశ్వాధికుడైనందున తదఖిన్నుడవైన ఓ పశూ! నీవు గూడ రుద్రుడవు-70 ఈ కారణముచేత స్వార్థమునకు గాని పరార్థమై (పరాశక్త్యర్థమైకాని గుఱ్ఱమునుగాని, గోవునుగాని, ఏనుగు-ఒంటె - దున్న మొదలగు వానిని గానీ జంపిన పాపమునంటడు-71. గృహమునకు అనిష్టమును జేయు సర్పములు, ఎలుకలు, తేళ్ళు మొదలగు వానీనీ జంపియు పాపమునంటడు, ఇది క్రీయాఫలమును గోరు గృహస్థాశ్రమవాసులకును, మనః సంకల్ప సీదులై శ్రీవతేజస్కులైన - మహాత్ములకును-72 ఇతరులకును పశుయజ్ఞముచే ఇష్టాపూర్తి కరమగును. (యజ్ఞయాగాదులను-తటాకాదీ నిర్మాణములను జేసిన వారగుదురు) జప-హోమ-అర్చనాదులతో వారి యిష్టములు సిద్ధించును -73).
ఇది బ్రహ్మాండ మహాపురాణమున ఉత్తరభాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితో పాఖ్యానమున హింసాద్యస్వరూప కథనమను షష్ఠాధ్యాయము -6.
Summary of chapter 118 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter recounts the severe distress of the gods under the oppressive tyranny of the demon Bhandāsura and their deep spiritual refuge in intense penance. It describes how king Indra and the deities performed a supreme fire sacrifice, offering their own devotion and physical forms into the holy sacrificial altar to invoke the divine mother. Moved by their selfless surrender, the cosmic altar blazed with celestial energy, setting the stage for the miraculous advent of the supreme goddess.