బ్రహ్మాండ మహా పురాణము
54 - కపిలాశ్రమస్థాశ్వానయనమ్
జైమినీ ఇట్లు చెప్పెను.
ఓ విప్రేంద్ర ! ఈ కోపాగ్నినీ వెంటనే మీరుపసంహరింప నరులరు. లేనిచో ఈ లోకమంతయు అకాలమున సర్వము దానిచే దహింపం . బడగలదు. మీ మహిమ చూడఁబడినది. అయ్యది చరాచర లోకమంతట వ్యాప్తమైనది. ఓ విప్రశ్రేష్ఠ ! మీకు నమస్కారము. క్షమించు. క్రోధము నుపసంహరింపుము. ఈ విధముగా భగవంతుఁడయిన కపిలమహర్షి స్తోత్రము చేయబడి, వెంటనే మహర్షి భీకరమయిన తనక్రోధాగ్నిని క్షయింపం జేసెను. అంత, చరాచరమయిన జగత్తంతయును ప్రశాంతి నొందెను. దేవతలు తపస్వినులు భయరహితులయిరి. ఆ సమయముననే భగవానుండయిన నారదమహర్షి దేవలోకము నుండి యదృచ్చయా అయోధ్యానగరమున కరిగెను. నగరమునకు వచ్చిన యా నారదుని సగరుఁడు . చూచెను. శాస్త్ర సమ్మతముగ నతనిని అర్ఘ్యపాద్యాదులతో భక్తితో పూజించెను. నారదులాతని పూజలు స్వీకరించి ఉత్తమాసనమున నాసీనులైరి. రాజశార్దూలుఁడయిన సగరునితో ముని యిట్లు పలికెను.
నారదుఁడు.
నీ కుమారులు యజ్జీశ్వసంరక్షణమునకు వెళ్లియుండిరి కదా ! ఓ నృపసత్తమ ! పోరందరు బ్రహ్మ దండముచే వినష్టులయిరి. నీ యజ్ఞాశ్వము వారిచే రక్షింపబడుచున్నను, ఎవనిచేతనో యది తీసికొని పోవఁబడినది, ఎక్కడికి పోయెనో కనపడలేదు. వినష్టమయిన తురగము కొఱకు వారు మహీతలమయంతయు వెదకిరీ. ఎంత వెదికినను ఎక్కడను వారు దానీని పొందలేకపోయిరీ, తత్రవృత్తిని గూడ తెలియలేక పోయిరి. అంత వారు భూమీకథఃప్రదేశమున పాతాళమున వెదుక కృత నిశ్చయులయిరి. సాగరులందరు కూడి, వసుధా తల మంతటిని త్రవ్వనారంభించిరి. భూమిని త్రవ్వుచుండ ఓ నృప ! పాతాళములో యజ్ఞాశ్వమును మహామునియు యోగీంద్రుఁడునైన కపిలునీ సమీపమున వారు చూచిరి. పాప కర్ములయిన వారలాతనిని చూచిరి. వారందరు కాలచోదితులై ‘ఇతఁడే అశ్వహర్త’ యని ఆతనిని క్రోధమానసుని చేసిరి. కపిలుని క్రోధ సంభూత నేత్రాగ్నిచే దిక్కులు దహింపఁబడెను. నీ పుత్రులందరు ఆ యగ్నికి ఇంధనీ భూత దేహులయి సంక్షయము పొందిరి.
వారందరు క్రూరులు; పాపసమాచారులు; సర్వలోకోపద్రవకారకులు. అందుచే, వారల కొఱకై ఓ రాజేంద్ర ! నీవు శోకింపతగవు. ధైర్య ధనుడవు కమ్ము, ఈ కార్యములన్నియు నీకనివార్యములుగా జరుగవలసినవే, పండితులైన వారు నష్టమయిన దానికి, చనిపోయినదానికి, అతీతమయిన దానికి విచారింపరు. అందుచే, ఓ రాజా ! నీ పౌత్రుఁడు బాలుఁడు నయిన అంశుమంతుని తురగమును తీసికొని వచ్చుటకు నియోగించుము. ఆతఁడు..మహామతి, అనీ సగరునీతో చెప్పి, నారదుఁడు సదస్సులు ఋత్విక్కులు సమన్వితులై, అందరు చూచు చుండగనే క్షణ కాలములో అంతర్జానుఁడయ్యెను. నృపోత్తముఁడు నారదుని వచనములు విని, దుఃఖ శోకపరీతాత్ముఁడయ్యెను. చిరకాలము రాజు ఆలోచనో నిమగ్నుడై యుండెను. ధ్యాన యుక్తుడై, సభలో అధోముఖుఁడై యున్న రాజును చూచి దేశకాల వీదుఁడైన వసిష్ఠుఁడిట్లనెను. “ఇదేమి? ధైర్య సారులయిన నీవంటి వారి హృదయములో శోకము అవకాశము: కల్పించుకొనినచో ధీరత్వము యొక్క ఫలమేమి? మనో దౌర్బల్యమును శిధిలము చేయుము. భగవద్వశానుగమయి సర్వము సంభవించును. అని యూహించుము. అంత అనంతరకృత్యమును నీవు. సంశయ రహితముగా నొనర్ప నరుఁడవు”. వసిష్ఠునిచే నీట్లు చెప్పఁబడి కార్యార్థతత్వవిదుడయిన రాజు, ధృతిని సత్వమును నవలంబించి “మీరా దేశించినట్లే' యని సమాధాన మొసంగెను. పౌత్రుఁడు, వినయశాలియునైన అంశుమంతుని పిలిపించి, రాజు, బ్రహ్మ, క్షత్ర సభామధ్యమున మృదువుగా నీట్లనెను”. ఓ వత్స ! నీతండ్రులందరు, బ్రహ్మ దండముచే హతులయిరి పాపకర్మాణులయిన వారు శాశ్వతీః సమాః (చిరకాలము) నరకమునఁబడిరి. నీవే నాకు సర్వసంతితివి; నో రాజ్య రక్షకుఁడవు నీవే. నా సర్వ శ్రేయస్సు ఇహమునందు పరత్ర పుణ్యము నీ స్వాధీనమై యున్నది. అందుచే, నా ఆదేశమునూని పాతాళమున కపిలునీ దగ్గర కరుగుము. ఎందులకన, అత్యంత ప్రయత్న మాచరించి యజ్ఞ తురగమును తోడి తెచ్చుటకు శాస్త్ర ధర్మానుగుణముగ ఆతనిని ప్రార్థించుము, వత్స ! తురగమును వెంటనే తీసికొని రమ్ము. నీవు వెంటనే తిరిగి రావలయును సుమా !
జైమిని ఇట్లనెను :
ఈ విధముగా చెప్పుఁబడి అంశుమంతుఁడు తాతగారైన సాగరునకు నమస్కరించి, ‘అట్లే చేయుదునని మహాబుద్ధిమంతుఁడు కపిలాంతి కమునకు బయలు వెడలెను.
కపిలుని చేరెను. విధివత్తుగా నమస్కరించెను. వినయవంతుఁడై ఆతనితో నిట్లు పలికెను. “ఓ ఏప్రశార్దూల ! ప్రసన్నుఁడవు కమ్ము! నిన్ను నేను శరణు పొందితిని ! లోక వినాశన కారకమయిన నీ కోపమును వెంటనే ఉపసంహరింపుము. నీవు కోపగించిన, జగత్సర్వము ప్రణాశనము నొందగలదు. వెంటనే ప్రశాంతిని పొందుము. లోకములు బాధా విముక్తములగును. ప్రసన్నుఁడపై ఓ మహాభాగ ! మమ్ము సౌమ్య చక్షువులతో తిలకించుము. త్వత్రోధాగ్నిచే నిర్దగ్ధమయినవారి సంతతిగా (కుమారునిగా) నన్నెఱుంగుము. నాపేరు అంశుమంతుఁడు, సగరమహీపతి యొక్క మనుమఁడను. నేను, మాతాతయైన సగరుని నిదేశమున భవత్పదాకాంక్షినయి వచ్చితిని. ఓ బ్రహ్మర్షి ! తురంగమును నీవిచ్చిన తీసికొని పోవుటకు వచ్చితినీ.
జైమిని ఇట్లనెను :
అంశుమంతుని వాక్కులకు యోగీంద్ర ప్రవరుఁడు మునియునైన కపిలుడు వీని, అంశుమంతుని సమాలోకించి, ప్రసన్న హృదయముతో నీట్లనెను. “ఓ వత్స ! నీకు స్వాగతము. అదృష్టవశమున నీవిచ్చటకు వచ్చితివి. ఇచ్చటి నుండి వెంటనే వెడలుము, అశ్వమును సగరాంతికమునకు తీసికొని పొమ్ము. మధ్య ఆగిపోయిన యీ యజ్ఞము చక్కగా ప్రవర్తింపఁబడుగాక. నీవు నీ మనోగతమయిన పరమును కోరుకొందువు గాక. నీ భక్తిచే పరితుపుఁడను. సుదుర్లభమయిన వర మొసంగెదను నీవు వెళ్లి ఏరియొక్క వినాశనమును గూర్చి తాతకు చెప్పుము, పాపులైన పోరియొక్క మరణమును గూర్చి నీవు విచారింపతగదు." అనిన అంత అంశుమంతుఁడు యోగీంద్రునకు నమస్కరించి యిట్లనెను. “ఓ మహాముని! నీవు నాకు వరమీయదలంచినచో నిన్ను వరము కోరుచుంటిని. నేను నీచే వరమీయఁబడుటకు అరుఁడైనచో ప్రసన్నుడవై నీవీయ అరుండవు. నీయొక్క క్రోధాగ్నిచే దగ్గులయిన నా పితరులు నరకమునకు పోవుదురు. అందు శాశ్వతముగా బహువత్సరములుందురు. బ్రహ్మ దండముచే శపులై హతులయినవారికి పిండాదిక క్రియలు లేవు. పిండోదకములు లేక మహామునీ ! ఇహలోకమున పితృ సాలోక్యము లేదు. ఇది శ్రుతి కథతము. త్వత్పసాదముచే వారలకు అక్షయ స్వర్గలోకములగుగాక, ఈ వరముచే నేను కృతకృత్యఁడనగుదును.
అందుచే వారి యెడ ప్రసన్నుఁడవుకమ్ము. వారికి స్వర్గము కలుగుటకు కారణము వచింపుము. భవదీయమైన కోపము యొక్క వహ్ని నుండి వారల కుద్దరణము ఎట్లు కలుగునో వచింపుము. అంత సుప్రసన్నమయిన మనస్సుతో ఆతనీతో యోగీశ్వరుఁడయిన కపిలుఁడిట్లనెను. ఓ వత్స ! నరకము నుండి వారిని ఉద్దరించుట నీకు శక్యము కాదు. పాపకర్మలచే వారు నరకమున వసింపవలసి యున్నది. నీకు మను మండుదయించు వరకు కాలమును ప్రతీక్ష చేయుము. ఆ. మనుషుఁడు మహామత్ భగీరథుఁడు, సర్వధర్మార్థతత్త్వవేత్త. ఆతఁడు పితరుల యందలి యత్యధిక గౌరవముచే యంత్రితుఁడయి అత్యద్భుతమయిన తపస్సాచరించి గంగానదిని తీసికొనివచ్చును. ఆ గంగానదీ నీరము వారి గాత్రములందు ఎముకలయందు, భస్మమందు ప్రవహించి (ప్లావితమై) నీ పితరులందరు స్వర్గగతిని పొందుదురు. ఓ నృపనందన, గంగానది యొక్క మాహాత్యము ‘భాగీరథి’ అనీ లోకమున విఖ్యాతినందును. ఆ గంగాతోయస్లావితమయిన అస్థిభస్మలోమనఖములు నరకము నుండి దేహినీ అక్షయమయిన స్వర్లోకము నొందించును. అందుచే నీవు వెళ్లుము. నీకు భద్రమగు గాక. విచారింపవలసినది. లేదు. నీవు వెళ్లి నీ పితామహునకీ అశ్వమును సమర్పింపుము. అనెను.
జైమినీ ఇట్లనెను :
అతనికి నమస్కరించి “తథేతి” “అట్లే” యని పలికి, మహామతి అంశుమంతుఁడామహర్షిచే నభ్యనుజ్ఞాతుఁడై సాకేతనగరమునకేగెను. తాతయైన సగరుని చేరెను. ఆతనికి నమస్కరించి జరిగిన దంతయు యథాక్రమముగా మునివృత్తాంతమును నివేదించెను. ప్రయత్న పూర్వకముగా తీసికొనివచ్చిన తురగము నాతనికి సమర్పించెను. ఇంక చేయవలసినదేమి. యని యడిగెను. .
ఇది వాయుప్రోక్త మహాబ్రహ్మాండపురాణమున మధ్యమభాగమున తృతీయ ఉపోద్ఘాతపాదమున కపిలాశ్రమస్థాశ్వానయనమను ఏబది నాలుగవ అధ్యాయము.
Summary of chapter 92 of the Brahmānda Mahā Purana is as follows:
Continuing the prophetic chronicles, this section details the future rulers of the venerable Solar Ikshvāku line down to its final monarchs in the Kali age. It describes how even this sun-like dynasty eventually waned under the relentless influence of cosmic time. The devout reader reflects deeply upon the impermanence of earthly glory, anchoring their heart solely in the unchanging, eternal feet of the supreme lord.