బ్రహ్మాండ మహా పురాణము
58 - అంశుమంతునిరాజ్యప్రాప్తి
జైమినీ ఇట్లనెను. నేల గణచి ఈ విధముగా పలుకు వరుణునీ చూచి భృగుకులోహద్వహుఁడయిన రాముడు అస్తమును మరల ఉపసంహరించెను. అస్త్రము నుపసంహరించి, ముందు నిలిచియున్న వరుణుని చూచి, రాముఁడు విగతక్రోధుఁడయి, చిరునవ్వు పొలుపు చూపుచు ఆతనింగూర్చి యిట్లనెను. “ఓ సరితతీ ! ఈ మునీశ్వరులు పూర్వము గోకర్ణవాసులు మహేంద్రాద్రి యందు నివసించు నన్ను కలిసి కొనిరి. పూర్వము సగరాత్మజులు సముద్రముకై మేదినిని త్రవ్వ, ఆ సముద్రోదకమునందు, ఋషి సేవితమయిన గోకరక్షేత్రము, నిమగ్నమైనది. దానిని తిరిగి పొందుటకు. తత్తీర్ణవాసులయిన మునులు నన్ను చేరిరి. తత్క్షేత్రము శివునకు ప్రియమైనది. వారి కార్యార్థము నేను, ఉత్తమమైన మహేంద్రగిరి నుండి నిన్ను చూడగోరి మునీ పుంగవులతో సహితముగా వచ్చితిని. ఆ కారణమున నా కొఱకు నీ యొక్క సలిలమును తొలగించి తత్క్షేత్రమును పూర్వము నీకై నీవు సమర్పింప నరుఁడవు. జైమినీ ఇట్లనెను. అంభఃపతియైన వరుణుఁడు రాముని వాక్యములను వీనేను. మనస్సులో నాలోచించి, రామునితో మరల వరుణుఁడిట్లనెను. “ఎవ్వనిచేగానీ యా నీరమును తొలగించుట సాధ్యము కాదు”. అని పురాణం డైన బ్రహ్మ నాకు వరము నొసంగేను. కానీ నీ తేజస్సుచే నేను సహజమైన ధైర్యమును విడనాడి, కాతరుఁడ నయితిని."నీవశము నొందితిని. ఓ క్షత్రియకులాంతక ! ఆకార్యము నేనెట్లు చేయక యుండగలను? నీవో యీ ఋషీశ్వరుల కొఱకే కార్యము నర్ణింప కాదనగలనే ! అందుచే నీ హృదయమున యావత్రమాణము నీవు సంకల్పించెదవో అంతవట్టు నాయీ నీరము నా భూమిపై నుండి తొలగించెదను.
ఆ వాక్యమును భార్గవుఁడు విని 'అట్లే చేయుము'. అని పలికి తన ధనువును, నిర్బేధించి దూరముగా శరములతో దానిని పూర్వస్థానమున నుంచెను. తత్క్షేత్రము యొక్క యెల్లలను మనసా నిర్ణయించుకొని, దానిని నిరూపింపదలచీ, సువమును సముద్రమున పారవైవ చేపట్టెను. రాముని ప్రసన్న చేతసుని, గతరోషునిగా నెంచి, వరుణుడు అంతర్షితుఁడయ్యెను. సముద్రుఁడంతర్షితుఁడు కాగా రాముడుత్తరాభిముఖుఁడై నిల్చెను. ఆ స్రువమును వేగముగా త్రిప్పి సముద్రములోనికి వీసరెను. సముద్రములోనికి వీసరబడి ఆ స్రువము సముద్రములో ఉత్తర పశ్చిమముగా 200 యోజనములు వెడలి, పడిపోయెను. ఆ తీర్థము శూర్పారక మను నామము వహించెను. సర్వ పాప విమోచకము, సముద్రతీరమున అయ్యటీ త్రిలోకముల యందు ప్రఖ్యాతము. రామునీకరము నుండి చ్యుతమైన సువము పడినచోట ఆ పవిత్ర తీర్థము రాముని విక్రమమును సూచించును. రామునిచే నెచ్చట భూమి సృజింపఁబడెనో నది శూర్పారకముగా ప్రతిష్ఠితము. అయ్యది. మూఁడు లోకముల యందు ప్రఖ్యాతము. అందుండి సముద్రుడు తన నీరములను ఉత్సారీంచెను. ఆ స్థలమును రామునీ కొసంగి సముద్రుఁడు వినమ్రుడై నిలిచెను. అనతిక్రాంత మర్యాదుఁడయిన రాముఁడు సముద్రుని తాను చేసిన నిర్ణయమునకు లోబడి యుండజేసెను, అయ్యది భూమికి తూర్పుటెల్లగా దెలిసికొని సముద్రుఁడు అంగీకరించి భూమి నొసంగెను. రాముని పరాక్రమమును చూచి, దేవతలందరాశ్చర్యచకితులైరి. సహ్య పర్వతము నుండి నీరు తొలగినపిమ్మట, ఇందందు పట్టణముల గ్రామముల సరిహద్దులు (ఎల్లలు) పూర్వమువలె నున్నవి. వాని నాతఁడు (రాముఁడు) నిమ్నత్వముచే గుర్తించెను. అంత పవిత్రాత్ములయిన యా ఋషీశ్వరులకు వారభిలషించిన విధముగా, ప్రీతి పూర్వకముగా స్థానము నొసంగెను.
అంత మునులందరు అత్యంతోత్కృష్ట హరముతో కృతకృత్యులై రాముని ఆశీస్సులతో పూజించిరి. అంత వారిచే అభ్యనుజ్ఞాతుఁడై ప్రాప్త మనోరథుఁడై యరిగెను. తత్ర్పదేశము నుండి ముని శ్రేష్ఠుఁడయిన రాముఁడు స్వకీయాశ్రమమునకు వెడలగా ఋషులందరు కలిసికొనీ, అంబుధి యొక్క తీరమున కరిగిరి. ప్రయత్న పూర్వకముగా ఆ ప్రదేశము నంతటిని సంచరించి భూమి సముద్ర మందు స్థిరముగా నుండుటకు "కనుగొను కారణము అయ్యది నీత్యమగుట సర్వదేవతాధిష్టానమగుట; అయ్యది త్రవ్వబడి, సముద్రములోపడియు, నష్టమయినను, చిరకాలము అంతర్జలములనున్నను, పాడైపోలేదు. ఇయ్యది రుద్ర ప్రభావమున విష్ణవమును నాశమును పొందలేదు. నీరు విస్తృతమయి ఆ క్షేత్రము పూర్వము వలెనే యుండెను. ఓ రాజ ! ఇదంతయు దేవతా సామర్థ్యము దానీకి కారణమూహింపలేము. ఈ విధముగా (ఓ రాజా ! ) సముద్రము నుండి భూమి మరల రామునిచే సృష్టింపఁబడినది. దక్షిణోత్తరముగా నది 400 యోజనముల విస్తీర్ణము కలది. ఇప్పటికి సముద్రుఁడు సీమను నతిక్రమింపఁడు. రాముఁడు వింటినీ నుపయోగీంపలేదు. అది సజ్జీకృతము మాత్రమే, రాముని ప్రభావమట్టిది. సగర పుత్రులు భరతఖండమును సముద్రములో కలిపిరి. తన్మూలమున సముద్రము 1000 యోజనములు విస్తరించెను. సముద్రము వృద్ధి పొందెను. మరల రాముఁడో 600 యోజన విస్తీర్ణమయిన వసుంధరను సృష్టించెను. సగర సుతులు సముద్రమును వృద్ధి పొందించుటవలన అప్పటి నుండి యయ్యది సాగర నామమును పొందెను. కార్తవీర్యుని యొక్క రామునియొక్క సగర మహీపతియొక్క చరిత్రము నాచే చెప్పఁబడినది.
ఇది మహాపురాణమయిన బ్రహ్మాండపురాణమున వాయుప్రోక్తము నందు, మధ్యభాగమున, తృతీయమైన ఉపోద్ఘాత పాదమున ఏబది యెన్మిదవ అధ్యాయము.
Summary of chapter 96 of the Brahmānda Mahā Purana is as follows:
This solemn chapter describes the eventual extinction of ancient royal dynasties and the complete breakdown of traditional social structures as Kali Yuga reaches its peak. It depicts a world devoid of true Vedic kings, where righteousness becomes scarce and material distress increases. Yet, amidst this gloomy vision, the narrative shines a light of hope, assuring that sincere devotees of lord Vishṇu remain forever protected from the dark age's influence.