బ్రహ్మాండ మహా పురాణము
37 - చాక్షుష మన్వంతరము -వైవస్వత మనువువంశము
సూతుఁడిట్లు చెప్పెను :
సంప్రదాయ కథనము ననుసరించి, వసుంధర సముద్రము అంతముగా వ్యాపించి యున్నది. వస్తువును (బంగారమును) కలిగి యుండుటచే వసుధయని కీర్తింపబడినది. (వసుధత్తేయతః తస్మాత్) పూర్వము మధుకైటభులను రాక్షసుల (మేదస్సు) కొవ్వుచే వసుంధర సంపరిప్లుతమై యుండెను. అందుచేతనే శబ్దవృత్తిని బట్టి బ్రహ్మవాదులు దీనిని 'మేదిని' యనిరి. తరువాత ధీమంతుఁడు వైన్యుఁడు నయిన పృథుమహారాజు యొక్క దుహితృత్వ ప్రాప్తి పొందిన వేనుక ‘పృథ్వి’ యని పిలువబడినది. పూర్వమందు భూమియొక్క విభజనము కూడ పృథువుచే సాధీంపం బడినది. పట్టణముల యొక్క పరంపరను, సహజమయిన ఖనుల సముదాయమును కలిగి యొప్పిన పృథ్వి, చాతుర్వర్య సమాకీర్ఘమైన పృథ్వి, ధీమంతుఁడయిన పృథువుచే రక్షింపఁబడెను. ఓ ద్విజసత్తములారా ! ఏవం విధమయిన ప్రభావము గలిగిన వాఁడు వేనుని కుమారుఁడైన పృథు మహారాజు. ఆతఁడు సర్వభూత సముదాయముచే నమస్కరింపఁదగినవాఁడు, పూజ్యుఁడు. మహాభాగులు, వేదవేదాంగ పారగులు, అయిన బ్రాహ్మణులచే పృథు మహారాజు నమస్కారారుండు, ఆతఁడు బ్రహ్మయోని. సనాతనుఁడు, ఆది రాజయి ప్రతాపవంతుఁడైన పృథువు, వైన్యుఁడైన పృథువు మహభాగులైన పార్థివులచే, మహా యశస్కులచే నమస్కారారుఁడు. యుద్దము నందు విజయమును కాంక్షించు, యోధులచే, రణవిద్యకాధికర్తమయిన పృథువు నమస్కరింప నరుఁడు. పృథు మహారాజును కీర్తించి యెవఁడు యుద్ధమున కరుగునో, భయంకర యుద్ధము నుండి ఆతఁడు సురక్షితముగ వచ్చును. కీర్తి గడించును బహుయశస్వియైన పృథురాజర్షి, వైశ్యవృత్తియందున్న వైశ్యులచే నమస్కరింపబడ యోగ్యుడు ఏలయన ఆ పృథువు వారలకు వృత్తిని ప్రసాదించిన మహాయశస్వి. ఈ విధముగా విభిన్నమైనట్టి దూడలు, దోగ్ధలు, క్షీరము, విశేషముగా నాచే వర్ణింపబడిరి.
పాత్రలు సర్వము యథాక్రమము వర్ణింపబడినవి. ప్రథమముగా వసుంధర మహాత్ముఁడైన బ్రహ్మచే, వాయువును వత్సముగా చేసి, పీదుకంబడెను. వసుధాతలమున క్షీరోత్పత్తికి బీజములు నాటఁబడినవి. తరువాత స్వాయంభువ మన్వంతరమున స్వాయంభువ మనువును వత్సముగా చేసి వసుంధర పొలు పిదుకఁబడెను. మేదిని సస్యములు కురిసెను. వృక్ష బీజములు క్షీరములాయెను. ఉత్తమ మన్వంతరమున మేదినీ దేవానుజునిచే మనువును ఉత్తమవత్సముగా జేసి సర్వసస్యములు పిదుకఁబడెను. తామస మన్వంతరమయిన యేదవ మన్వంతరమున బలబంధువు తామసుని వత్సముగాఁజేసి వసుంధరను పీదికెను. చారిష్టవుని ఆరవ మన్వంతరము సంప్రాప్తముకాగా భూమీ పురాణునిచే చారిష్టవునీ వత్సముగాజేసి పాలుబిందుకంబడెను. చాక్షుష మన్వంతరము సంప్రాప్తముకాగా, చాక్షుషుని వత్సముగా చేసి పురాణుఁడు భూమిని పాలం బిదికెను. చాక్షుష మన్వంతరము గడచిపోగా వైవస్వత మన్వంతరము ప్రవేశింప భూమి వేనుని కుమారునిచే పాలఁబిదుకఁబడెను. ఎట్టులాతండా మేదినీని పొలఁబీదికెనో ఇంతకుం భూర్వము మీకు వివరించియుంటిని. ఈ విధముగా భూమీ మన్వంతరములు పిదుకంబడినది. దేవాదులు, భూతాదులు, మానవులు, కూడ పిరికిరి. ఇట్లే జరిగి పోయిన మన్వంతరముల యందు రానున్న మన్వంతరము యందు, జరిగినదని జరుగునని గ్రహింపవలయును. దేవతలు మన్వంతరమంతయు స్వర్గమున నీవసింతురు. ఇక పృథునీ సంతానమును గూర్చి వినుఁడు. ప్రతాపవంతులైన ఇరువురు పుత్రులు పృథువునకు కలిగిరి. వారీరువురు 1.అంతర్ధి 2. పావనుఁడు. శిఖండిని అంతర్జానునీ వలన హవిర్టానుని గనెను. అగ్నియొక్క కూతురయిన ధిషణ (ఆగ్నేయో) హవిర్జానునీ వలన ఆణుగురు పుత్రులం గనెను.
ఆ యాలుగురు ప్రాచీనబరీ, శుక్లుఁడు, గయుఁడు, కృష్ణుఁడు, వ్రజ, అజీనుఁడు. ప్రాచీనబర్హి గొప్ప ప్రజాపతి. (ప్రజానాం భర్తా, పాలకః) బలముచే, పాండిత్యము, తపస్సుచే, వీర్యముచే ఆతఁడు పృథివీ యంతటికీ నేకైక చక్రవర్తి. ఆతని దర్భల యగ్రములు తూర్పున కభీముఖముగా నుండుటచే నాతండు ప్రాచీనబర్హి యయ్యెను. గొప్ప తపస్సు యొక్క అనంతరము, ఆ ప్రజాపతి సముద్ర తనయయైన “సవర్ణను వివాహమాడెను. సముద్ర తనయయైన సవర్ణ, ప్రాచీనబర్షికి పదిమంది పుత్రులంగనెను. వారందరు ధనుర్వేదము యొక్క పారమును చూచినవారు. పొరల నందరను ప్రాచేతసులందురు. వారందరు కలిసి యుండిరి. ధర్మకార్యముల వీడివడకయే ఆచరించిరి. సముద్ర జలములలో పరుండి వారు పది సంవత్సరములు తీవ్రమయిన తపమాచరించిరి. వారు తపస్సు చేయుచుండ, వృక్షములు (మహీ మహములు) అరక్ష్యమాణమయిన పృథివి నంతటినీ ఆవరించెను. అప్పుడు ప్రజాక్షయమయ్యెను. ఇది చాక్షుష మన్వంత రానంతరము జరిగినది. సర్వప్రపంచము వృక్షమయమయ్యెను. (ఆ వృక్ష సంతతి యొక్క సాంద్రతచే) అప్పుడు వాయువు వీచుటకశక్తుఁ డయ్యెను. ఆకాశము కూడ వృక్షమయమయ్యెను. అంత, పదివేల సంవత్సరములు ప్రజలు తమ కార్యములను నిర్వహింప నశక్తులైరి. దీనిని విని, తపో యుక్తులైన ప్రచేతసులు కోపమూనీరి. వారు తమ ముఖముల నుండి వాయువును అగ్నిని సృజించిరి. వాయువు వృక్షముల వ్రేళ్లతో పెరికి పారవైచెను. అగ్ని పోనిని దగ్గపటల మొనర్చెను. అగ్ని వృక్షముల దహించెను. అందుచే ఘోరమయిన వృక్ష క్షయమయ్యెను. వృక్షముల యొక్క నాశనమును తెలిసికొని, ఇంకను కొన్ని చెట్లు నశింపక యుండ, సోమ ప్రభువు (చంద్రుఁడు) ప్రచేతసులజేరి ఇట్లనెను. ఓ ప్రచేతసుని కుమారులారా, రాజులారా! ప్రయోజనము సాధింపఁబడుట చూచిన మీరు కోపమును త్యజింపుఁడు. వృక్షములు భూమి యందు పుట్టగలవు అగ్ని మారుతములు శాంతించుదురుగాక.
సుందరమైన ముఖము కలిగిన ఈమె వృక్షముల యొక్క కూతురు. ఈమె సర్వ స్త్రీ లోకమునకుఁ దలమానిక మయ్యెను. నేను భవిష్యత్ జ్ఞానము కలిగి యుండుటచే గర్భమున నీమెను భరించితిని. ఆమె నామము మారీష. ఈమె వృక్షముల చేతనే సృష్టింపబడినది. సోమునీ గర్భమున వివర్ణితమైన యీమె నీకు భార్య యగును. మీ తేజస్సు యొక్క సగభాగము చేతను, నా తేజస్సు యొక్క అర్థ భాగము చేతను, విద్వాంసుఁడయిన దక్షుండను ప్రజాపతి యామెకు కలుగును. ఈతడు అగ్నితో సమానుఁడు. మీ మీ తేజోమయుడైన యగ్నితో సుమారు దగ్గపటలమయిన ఈ ప్రజలను ఈ దక్షుఁడు పోషించి సంవర్ధనము చేయును, అంత సోముని యొక్క వాక్యప్రేరణమున ఆప్రచేతసులు తమ కోపమును నిగ్రహించుకొనిరి. ధర్మానుగుణముగ వృక్షముల నుండి మారిషను తమ భార్యగా పరిణయమాడిరి. అంత వారు మనసా మారిషను గర్భవతిగా నొనర్చిరి, ప్రజాపతియైన దక్షుఁడు పదిమంది ప్రచేతసులకును పుత్రుఁడుగా మారిష యందు జన్మించెను. దక్షుండు సోముని యంశమున జనన మొందుటచే వీర్యవంతుఁడు, మహాతేజస్వి, దక్షుండు ఆరంభమున మానసికముగా సృజించెను. తరువాత మైథునముచే సృజించెను. భార్యా సంగమముచే, మానసికముగా చరాచరములను, ద్విపదులను చతుష్పదులను: వృష్టించిన పిమ్మట, దక్షుఁడు స్త్రీలను సృష్టించెను ఆతఁడు. పదుగుండ్రను ధర్మునకొసంగెను కశ్యపునకు వధీమగులనణ, ఇరువది యేడుగురు కూతుండ్రను చంద్రువకు కాలగమనమున కనుకూల మగునట్లు ఒసంగెను. తరువాత మరీ నలుగురను దక్షుండు. అరిష్టనేమీ కొసంగేను, ఇషుపుత్రున కిర్వురను, అంగీరసునకు ఇరువుర కూతుల నొసంగెను. ఆతఁడు కృశాశ్వునకోక కూతునొసంగెను, వారికి బిడ్డలు పుట్టిది, తరువాత నీయ్యది ఆరవ. చాక్షుష మన్వంతరముగా కీర్తింపఁబడినది. సప్తమ ప్రజాపతియైన వైవస్వత మనువునకు వస్తువులు దేవతలు, పక్షులు, ఆవులు, సర్పములు (నాగులు) దైత్యలు, దానవులు.
గంధర్వులు, అప్సరలు, వారీతోపాటు ఇతర జాతులు పుట్టిరి. అది మొదలు లోకమున జలు మైథునసంభవులు. పూర్వము సృష్టి సంకల్పముచే, దర్శనముచే, స్పర్శచే జరిగినదనీ చెప్పుదురు. ఋషి అడిగేను. పూర్వము దేవతల యొక్క దానవుల యొక్క దేవరుల యొక్క మహాత్ముఁడయిన దక్షుని యొక్క సంభవ ప్రకారము నీవు చెప్పితివి. బ్రహ్మయొక్క ప్రాణము నుండి, దక్షుని యొక్క జన్మమును గూర్చి చెప్పితివి మహా తపస్వియైన దక్షుండు మరల ప్రచేతసునీ కుమారస్థితినీ ఎట్లు పొందెను? ఓ సూత ! నీవు సంశయనివారణ చేయుటకు అరుఁడవు. అతం డో సోముని యొక్క కూతురు కొడుకు. (దౌహిత్రుఁడు) గదా ! ఆతఁడెట్లు శ్వశురత్వమును పొందగలిగెను? సూతుఁడిట్లు పలికెను.ఓ పూజ్యులారా! ఉత్పత్తి ప్రలయములు నిత్యము (జీవకోటి యందు) భూతముల యందు జరుగుచుండును. ఋషీశ్వరులు విద్యావంతులయిన జనము లీ విషయమున తెలివి తక్కువగా కలవరపాటుపడరు. ఓ బ్రాహ్మణులారా ! ప్రతీ యుగము నందు దక్షుడు మొదలయిన వారు కలుగుచుందురు. మరల ప్రలయము నొందుచుందురు. విద్వాంసులీ విషయమున భ్రాంతి చెందరు. ఓ ద్విజోత్తములారా ! పొరలలో జ్యేష్ఠత్వము, కనిష్ఠికత్వము పూర్వముండెను. తప మొక్మటీయే గరీయము. దానికి వారి ప్రభావము కారణము. చరాచర సంబంధమైన చాక్షుష సృష్టిం డెలిసినవాఁడు, ప్రజావంతుఁడు, ఆయుః కాలము నతిక్రమించినవాఁడు అగును. మరణానంతరము స్వర్గమున గౌరవమును పొందును. సంక్షిప్తముగా నీ విధమున చాక్షుష సృష్టి వివరింపబడినది. ఈ విధముగా మన్వంతరాత్మకములు, స్వాయంభువ మనువుతో నారంభించీ చాక్షుష మన్వంతరము వరకు యథాక్రమము షట్ సర్గములు సంక్షిప్తముగా చెప్పబడినవి. ఈ సృష్టి క్రమములు ఉత్తమములు ప్రాజ్ఞులునయిన బ్రాహ్మణులచే చెప్పఁ బడిన విధానమున వివరింపఁబడినవి.
వైవస్వత మన్వంతరమున వారి సృష్టి క్రమము విస్తరముగా గ్రహింఫసగును. వివస్వంతుని యొక్క యీ సర్గములు (సృష్టులు) అన్నీయును తక్కువలు. ఎక్కువ {5:8). ఇవి ఆరోగ్యము, ఆయుః ప్రమాణము, ధర్మము, అర్థము మున్నగు వానిలో లేనివీ సమానములు. అపూయా రహితుఁ డై వీనినెవడు చదుపునో ఆతఁడు ఈ ఉత్తమ గుణములను పొందును. ఇక, మహాత్ముడు ప్రస్తుత మనువు, అయిన వైవస్వతుని గూర్చి సంక్షిప్తముగాను, వివరముగాను చేప్పెదను. నేను వివరించుచుండ మీరు గ్రహింపుఁడు.
ఇది మహాపురాణము, వాయుప్రోక్తమునయిన బ్రహ్మాండపురాణమున పూర్వభాగమున ద్వితీయానుషంగపాదమున చాక్షుష సర్గ వర్ణన మనంబడు ముప్పదియేడవ అధ్యాయము.
Summary of chapter 37 of the Brahmānda Mahā Purana is as follows:
This section chronicles the twilight of the Cākshusha Manvantara and heralds the glorious dawn of the current cosmic epoch governed by the righteous Vaivasvata Manu. It affectionately outlines the noble dynasties born of his solar lineage, whose kings were destined to uphold truth, valor, and devotion upon the earth. Reading these grand genealogies, the faithful are inspired by the enduring continuity of divine rule, fostering a deep trust in the supreme lord's perfect administration of the universe.