17 - దండనాథాశ్యామలాసేనాయాత్రా నామ సప్తదశోఽధ్యాయః

ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున దండనాథాశ్యామలాసేనా యాత్రయను పదునేడవ యధ్యాయము.

దండనాథ బయలు దేరినప్పుడు లెక్కకు మిక్కుటమైన తెల్లగొడుగులతో లెక్కలేని చంద్రమండలములతో ఆకాశమువలె ప్రకాశించినది-1. ఒండొంటినంటియున్న తెల్లగొడుగులలోపల ఘనీభవించిన చీకటిని ఆ గొడుగుల దండములకు బొదిగిన మణుల కాంతులు తరిమివేయుచున్నవి-2. విసనకట్టలు తనలో పొదిగిన వజ్రముల ధగధగ ప్రభలతో దీట్ముఖములు నిండినవి. అప్పుడు వెంటనే శత విధములైన పందులు మొదలగునవి రంధ్రములలో జొచ్చినవి-3. చండుడు, దండుడు మొదలగువారు, తీవ్ర స్వభావములుగల భైరవులు.శూలములు చేత ధరించి జ్వలించుచున్నకేశముల పిశంగ వర్ణములు గలిగి మెఱుపులవలె దీజ్ముఖములను బ్రకాశింపజేసిరి-4. దండనాథయొక్క సేనాగ్రమున పరువెత్తిన శక్తులు తమ భాణాగులచే రాక్షస సమూహములను గెల్చుచున్నట్లు కదలినవి-5. తరువాత, వరాహముఖమైనదేవి కదలినది. ఆమె వెంటనే ఆమెతో సమానమైన యాకారములు భూషణములు ఆయుధములు, తమ వాహనములు :గలిగి కదిలినవి. వారి కోరలనుండి బయలుదేరిన యగ్నుల ధూమములాకాశము నిండినవి. వారియాకారములు తమాల శ్యామలములు. వారి కన్నులు కపిలములై క్రూరములు, ఈ వారాహీసైన్యము వేయిదున్నల పైనధిరోహించి కదిలినది. తరువాత ఆత్రీదండనాథ కిరిచక్రరథోత్తమమునుండి-8. దిగి తన వాహనమైన మహాసీంహము నధిరోహించెను. దాని పేరు వజ్రమౌషము అని ప్రసిద్ది, అది తన జూలు విదిల్చినది-9. నోరు తెరచినది. ఆకారము వికటమైనది. కన్నులు విశాలములైనవి. కోఅల కటకట ధ్వనులు. దీంగంతములను బధిరముజేసినవి-10. దాని గోళ్లు ఆదివారాహముయొక్క కఠినమైన తలపుళైయెముక వలె కఠినమైనవి. భూమిపై నిలబడి మోపినను భూచక్రమునంతయు త్రాగుచున్నవాయన్నట్లు పాతాళము చివరి వరకు మునిగిపోవుచున్నదీ.-11. మూడుయోజనముల యెత్తుండి తోకను పైకెత్తిన ఆ సింహము .నారోహించి దండనాయిక (రణమునకు) కదలైను-12. మండుచున్న క్రోధముతో ఆయసురసంహారము జరుగగనే సచారచరమైనముల్లోకములు మిక్కిలి యద్వేగమును బొందేసు-13. ఈ పోరాహా (వరాహముఖి) యిపుడే విశ్వమంతయు దహించివేయునా? రోకలిదెబ్బతో భూమినిరెండుగా జేయునా?-14. లేదా నాగలిపోటులచే సముద్రములనన్నింటిని క్షోభింపజేయునా? -అని . ఆకాశమునందలి దేవతల గణములు తమ యేదలలో భీతిజేందిరి-15. దూరముగా విమానములలో బోయిన దేవతలామెను జూచిరి. చేతులు జోడించి మాటి మాటికి ఆమె పండ్రెండు నామములను ఆకాశమున కీర్తించుచు ఆమెకు నమస్కరించిరి-16.

అగస్త్యుడనెను: ఆదేవి యొక్క పండ్రెండు నామములెవ్వి? మాకు మిక్కిలి కుతూహలముగలదు. ఓ ప్రభో! అశ్వముఖ! మహాప్రాజ్ఞ  తెలుపుము-17. హయగ్రీవుడనెను. ఓ ఘటోద్భవ! అగస్త్య! అదేవియొక్క పండ్రెండు నామములను వినుము. వానిని వినినంతమాత్రమున ఆదేవి ప్రసన్నురాలగును. పంచమీ, దండనాథ, సంకేత, సమయేశ్వరీ-18. సమయసంకేత, వారాహి, పోత్రిణీ, వార్తాలీ, మహాసేనా, ఆజ్ఞా, చక్రేశ్వరీ-19. అరిఘ్నీ-ఓ మునీ ఇవి పండ్రెండు నామములు నీకు చెప్పితిని. ఈ నామద్వాదశ పంజర మధ్యముననున్న మానవుడు సంకటమునందు గూడ దుఃఖమును బొందడు-20. ఆకాశముననున్న దేవతలు ఈ నామములతో సంకేతను మిక్కలి స్తుతించిరి. వారిననుగ్రహించుటకే యామెకూడ మరల కదిలినది-21. అంత, మంతనాథ పదమును స్పృశించి సంకేతయోగిని యొక్క బయలుదేరుటను (యాత్రను) సూచించు ఢంకమ్రోగెను-22. శృంగారమునీండిన సొమ్ములు గలిగి పూలవంటి కాంతియు శ్యామలవర్ణమును గలిగి, వీణను చేత ధరించిన శక్తుల సైన్యము బయలుదేరెను-23. కొందఱు మత్త కోకిల కంఠములతోగానము  చేయుచున్నారు, నాట్యము చేయుచున్నారు. సవిలాస పదవిక్రమలై (పదవిన్యాసముగలవారై వీణా-వేణు-మృందంగాదులను వాయించుచు శ్యామవర్ణముగల శక్తులు జగజ్జనములను సంతోషింపజేయుచు కదిలిరి. వారిలో మయూర వాహనాలు కొందరు. హంసవాహనలు కొందరు-25 ముంగిసలపై నెక్కినవారు కొందరు. కోకిలల సెక్కీక్రవారు కొందరు. అందరును. శ్యామలాకారలు. కొందరు  క్రీడాశకటములందున్నారు. కొందరు కడిమిపూల మధువుచే మత్తెక్కిన వారు. కొందరు గుఱ్ఱములనెక్కినవారు. వీరందరు మంత్రనాథను ముందడుకొని చక్కగా ముందుముందుగా బయలుదేరిరి-27. ఆ తరువాత, మంత్రనాయిక ఎత్తైన పతాకము చక్రములును గల రథమెక్కి బయలుదేరెను. ఆమే కవచము- బాలసూర్యవర్ణము. కన్నులు మదాలోలములు-28. ముఖకమలము చిరుచెమట బిందువుల నందముగానున్నది. కనుబొమ్మలనుద్దతముగా తాండవింపజేయుచు(కదలించుచు) క్రీగంటి చూపులతోనచటి. యుద్దతోద్దతమైన శక్తులసైన్యములను పర్యవేక్షించుచున్నది. తనసామర్థ్యమునకు చిహ్నముగా  (బిరుదముగా) నేమలీయీకత్రికోణముగల, గొప్పఛత్రము ధరించినది-30. ఇతర శక్తులమధ్యన గాక తనశక్తులమధ్య ఉజ్జ్వలమైన (పైకి వేలిగిన) యుదయముగలది. మేఘశ్యామయైనది. ఇట్టి శ్యామలమైన మంత్రనాయిక బయలుదేరినదీ-31. స్వర్గవాసులైన దేవతలు ఈమెను పదునారు నామములతో స్తుతించిరి. ఓ అగస్త్యమునీ! ఆ పదునారు నామములను వినుము-32. సంగీతయోగిని, శ్యామ, శ్యామల, మంత్రసాయిక, మంత్రిణి, సచివేశీ, ప్రధానేశీ, శుకప్రియ-33.  వీణావతి, వైణికీ, ముద్రిణీ, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబేశీ, కదంబవనవాసినీ-34. సదామద-ఓ యగస్త్యా ఇవి యా పదునారు నామములు. ఈ నామములతో సచివేశానిని ఒక్కమారు స్తుతించిన మానవుడు సమస్త త్రిలోకములను తన చేత నుంచుకొనగలడు. సంశయములేదు-35. ఈమంత్రనాథ ఎక్కడెక్కడ తన చూపు ప్రసరింపజేయునో అచ్చటచ్చట శత్రుసైన్యము పూర్తిగా పతనముజెందును-36. మొత్తము లలితా పరమేశాని యొక్క చరితము. శక్తుల చర్చయు, అంతటను జయమునిచ్చును-37 ఇక, సంగీతయోగినియొక్క చేతనున్న చిలుకపిల్ల నుండి సర్వసిద్ధముగానున్న ధనువుతోబాటు ధనుర్వేదము ఆవిష్కరించెను-38. నాలుగు బాహువులు, మూడు తలలు, మూడు కన్నులు గల వీరుడు భక్తితో నమస్కరించి ప్రధానేశితోనిట్లనెను-39. దేవీ! భండాసురునితో యుద్ధమునకు నీవు బయలుదేరుచున్నావు. కావున ఓ మంత్రినాయికా! నేను నీకు సహాయము చేయవలసి యున్నది-40. ఇది చిత్రజీవమను ధనువు మిక్కలి గొప్పది. ఓ జగదంబా! దానవ నాశకమైన దీనిని స్వీకరింపుము-41. ఈ అక్షయబాణములతో నొప్పినది, బంగారుతో చిత్రింపబడిన రెండమ్ములపొదులను రాక్షసనాశనముకై నన్ననుగ్రహించుటకు స్వీకరింపుము-42. అని భక్తితో నమస్కరించి ధనుర్వేదముతోబాటు  ధనుస్సును అమ్ములపొదులను అర్పింప “ప్రియ కప్రియ” స్వీకరించేను-43. “శుకప్రియ”యు చిత్రజీవమను గొప్పధనువును దీసికొని అనేక పర్యాయములు నారిని మ్రోగించి విశాలశబ్దమును గలుగజేసేను-44. “సంగీత యోగిని” యు వింటి నాదముతో సంపదతో జగమును పూరించెను. స్వర్గవాసులమనమును నయనానందసంపదతో పూరించెను-(45) యంత్రీణి, తంత్రిణి యనువారలిరువురును ఆమె పరిచారికలు. చిలుకను వీణను వహించి వెంటనే వీరామెను సేవింతురు-46. ఘన శ్యామయు కదులుచున్న కంకణ ధ్వనులతో వృద్ధిచెందు ‘నారి’ ధ్వనిని మిక్కిలి మనోహరముగ, వ్యాపింపజేసెను-47. గీతయోగిని చిత్రజీవమను మహాధనువును ధరించి, కదంబచ్చత్రకార్ముకయైన కదంబినీ వలె ప్రకాశించెను-48. కాలికటాక్షమువలె తీక్షమై, నర్తించు నాగుబామువలె భయంకరమైన కుడిచేతిలోని బాణము ప్రకాశించెను-49. గేయచక్రరథమునధిరోహించినయా దేవిని (గీతయోగినిని) వెంబడించుచునే ఆమెవలె శ్యామలశోభతో నొప్పినవారును, బాణములను ధనువును ధరించినవారునైన దేవులు (దేవీశక్తులు) సేవించుచుండిరి-50. తీవ్రవేగమును గలవారును, మదముచే అలసటగానున్నవారును, మధురములైన కిలకిలారావములతో దిక్కులను నింపువారునైన వేయి శక్తిసేనలు వేయి యక్షౌహిణీ సంఖ్యలో నొప్పుచున్నవి-51.

ఇదీ శ్రీబ్రహ్మాండమహాపురాణమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున  దండనాధాశ్యామలసేనాయాత్రయను పదునేడవయధ్యాయము.