11 - సమిద్వర్ణనము

బృహస్పతి ఇట్లు చెప్పెను.

పితృదేవతలకు ఉపయోగించు పాత్రలు వెండివి కాని వెండి మలాము (పూత) చేసినవి కాని యుపయోగింపవలెనని చెప్పఁబడినది. రజత పాత్రలని చెప్పిన మాత్రం చేతను, వాని దర్శనము చేతను, వాని దానము చేతను, పితరులకు అనంతము అక్షయము నయిన లాభము స్వర్గమున కలుగును. ఈ రజతపాత్రల దానముచే ఉత్తమములయిన పుత్రులు పితరులను తరింపఁజేయుదురు. (1,2) పూర్వమందు భూమి (గో రూపమున నుండగా) పాలు పిదుకఁబడినప్పుడు, 'స్వధ' వారలచే (దోగ్గలచే) రజత పాత్రలలో పితుకబడినది. అది 'స్వధ'కా నిండు వేలొకటి కానిండు, ఓ వత్సా! ఏయది ఆ వెండి పాత్రలలో వారలచే నీయబడినను అయ్యది అక్షయమయిన ప్రయోజనమును నొసంగును. (3). కృష్ణాజినము తత్సమీపమున నున్నను, దాని దర్శనము కానీ, దాని దానము కాని రాక్షసులను నాశన మొనరించును. అంతీయకాక యది. బ్రహ్మవర్చ:ప్రభ నొసంగును. పశువుల యొక్క పుత్రుల యొక్కయు తారణమును కలిగించును. (4) కనకపాత్ర, రజతపాత్ర, తీలలు. (తామ్రపాత్ర) దీనము నందలి యెనిమిదవ ముహూర్తము, దర్భలు, తెల్ల నువ్వులు, సన్న్యాసుల చేతనుండు) త్రిదండి - ఇవి యితర వస్తువులను గూడ పావనము చేయు పవిత్ర వస్తువులు. శ్రాద్ధకర్మ యందిది శ్రేష్ఠము, బాహ్యము సనాతనమునైన విధి. ఇయ్యది ఆయువును, కీర్తిని, సంతానమును, ఐశ్వర్యమును, ప్రజ్ఞను, సంతతిని వృద్ధి పరచును. (6) దక్షిణ పూర్వది శల మధ్య ఆగ్నేయమున) వేడిని నిర్మించవలెను. (అరత్ని చిటికిన వ్రేలి తుది నుండి మోజేతి వరకు గల మధ్యనున్న దూరము). ఆ వేదిక అరత్నిమాత్ర చతురస్రమయి యుండవలయును. భుజములు 'అరల్నీ' పరిమితము కావలెను. అది సుసంస్థితమై యుండవలెను. (7) విధి పూర్వకముగా అనుశాసితమయిన పితరుల స్థానమును చెప్పెదను. అయ్యది ఆయురారోగ్యై శ్వర్యము కలిగించును. అయ్యది బలమును శరీరకాంతిని వృద్ధి పరచును. (8) అందు మూఁడు గర్తములు (గుంటలు). త్రవ్వవలెను. ఖాదీర మను కట్టితో మూఁడు దండములు నిర్మింపఁబడవలెను. ఆ దండముల పొడవు 'అరత్ని ప్రమాణము కలిగి యుండవలెను. అయ్యవి రజత పతాకలతో ప్రవీభూషితములు కావలెను. (9) ఆర్తలు వితస్త్యాయతములు, అనఁగా - పండ్రెండంగుళముల పొడవు (జేనెడు) వీతస్త్యము. ఆ గుంటలు ఒక జానెడు లోతుండవలెను. నాలుగు భుజములును నాలుగంగుళములు సర్వత్ర యుండ వలయును. ఆగ్నేయ దీశాముఖముగా గర్తమునుకావించవలయును. ఆగర్తములు స్థిరముగా రంధ్రము లేనివిగా నుండవలయును. (10) శ్రాద్ద మాచరించువాఁడు పరిశుభ్ర వస్త్రములను దాల్పవలయును. మనస్సున శుద్ధుఁడుగా నుండవలెను. పరిశోధకముచే నతఁడు గర్తములను పవిత్రము లొనర్పవలయును. (దర్బలచే కట్టబడిన పవిత్రము) ఆ దర్భలతో సమకూర్చిన పవిత్రమును కుడిచేతి ఉంగరపు వ్రేలికి ధరింపవలెను. గర్తము యొక్క శోధనమును మేకపాలతోకానీ, ఆవుపాలతోకానీ, నీటితోకానీ చేయవలయును. (11) తర్పణము ఎప్పుడు నీటితో సలుపవలెను. తన్మూలమున ఇహపరముల తృప్తి కలుగును. శ్రాద్ధకర్తకు ఆత్మ నిగ్రహమున్నచో, ఆతని కెన్నియో కోరికలుండియున్నను, ఆతఁడు నదిలో మూఁడు మార్లు స్నానమాచరించి, తరువాత పితరులను త్రికరణశుద్ధిగా మంత్రములను వీధివదుచ్చరించుచు ఆచరించి ఆతఁడు అశ్వమేధ యాగమాచరించిన ఫలము నొందును. (12,13) చతురంగుళ పరిమితమయిన గర్తములను అమావాస్యనాఁడు చేయవలయును. ఆ యజ్ఞములు ఇరువది యొకటి. ఆయజ్ఞములు ఇరువదియేడు సంస్థలు వానిచే త్రైలోక్యము ధరింపబడును. తత్కర్తకు పుష్టి, యైశ్వర్యము, ఆయువు, సంతతి కలుగును. ఆతని విభవముచే నతం డు స్వర్గమున ప్రకాశించును. క్రమముగా మోక్షము నొందును. (15) పవిత్రీకరణానంతరము పూజ గాలించిన పాపములు తొలఁగును. తత్పూజ వలన అశ్వమేధఫలము నతఁడందును. బ్రాహ్మణులు పరిశుద్దులై ఆచరించిన అశ్వమేధఫలము లందుదురు. (16) అందుచే అమృతతుల్యమైనది, బ్రహ్మచే నిర్మితమయినదియునగు మంత్రమును చెప్పెదను. ఆ మంత్రమును శ్రాద్ధకర్త శ్రాద్ధారంభమునను, సమాప్తమునను, మూఁడు సార్లు జపింపవలెను. “దైవతేభ్య పితృభ్యశ్చ, మహాయోగిభ్య ఏవ చ నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ భవత్యత ఆద్యేవసానే శ్రాద్ధస్య శ్రీరావృత్తం జపేత్సదా.”

పిండ ప్రదాన సమయమున పిండ ప్రదాత (శ్రాద్ధకర్త) సమాహీతచిత్తుడై యీ మంత్రమును జపింపవలయును. పితరులు వెంటనే వచ్చేదరు. రాక్షసులు పలాయితులగుదురు. శ్రాద్ధకాలమున నీ మంత్రము నియతులయిన బ్రహ్మవాదులచే పరింపఁబడినచో, ఈ మంత్రము పితరులతో భూత భవిష్యద్వర్తమానకాలముల సంబంధము కలిగిన వారినేల్లరను తరింపఁజేయును. (20) రాజ్యకాముఁడయిన వాడీ మంత్రమును అతంద్రితుఁడయి, శ్రద్దాయుతుడై జపింపవలయును. ఇయ్యది వీర్యము, శౌర్యము, అర్జము, సత్త్వము, ఆశీస్సు, ఆయువు బుద్ది అన్నింటిని వృద్ధి పరచును. (21) నేనిప్పుడు. “సప్తార్చిష” మంత్రమును ప్రవచించుచున్నాను. ఇది శుభంకరమయినది. సర్వకామప్రదము. నీయమపూర్వకముగా సదా జపించుటచే పితరులు ప్రీతిమంతులగుదురు. (22) 'సప్తార్చిష మంత్రము. అమూర్తి మంతులు, మూర్తిమంతులు, ప్రకాశవంతమయిన తేజస్సు కలవారు ధ్యానులు, యోగచక్షుష్కులు అయిన పితరులకు నమస్కరించుచున్నాను. (23) వారు ఇంద్రాదులకు నాయకులు అట్లే దక్ష మారీచులకు, సప్తరులకు నేతలు. అట్టి కామదులయిన పితరులకు నమస్కరించుచున్నాను. మన్వోదులకు నాయకులు, సూర్య చంద్రులకు నాయకులు, పితరులకు సంబంధించిన విధుల యందు పితరులయిన వారందరకు నమస్కరించెదను, (25) కృతాంజలుఁడనై నక్షత్రముల యొక్క గ్రహముల యొక్క వాయువుయొక్క, అగ్ని యొక్క ద్యావాపృథ్వుల యొక్క పితరులకు నమస్కరించుచున్నాను. నేను పితరులకు నమస్కరించు చున్నాను. వారు దేవర్పులకు నేతలు; వారు సర్వలోక నమస్కృతులు, వారు సర్వభూత ముల సంరక్షకులు. వారికి నమస్కరించు చున్నాను. కంజలీబద్ధుఁడనై ప్రజాపతికి, ధేనువులకు, అగ్నీకి, సోమునకు, యమునకు, యోగేశ్వరేశ్వరులకు' పితామహులకు నమస్కరించు చున్నాను. సప్త లోకములందున్న సప్త పితృగణములకు యోగ చక్షుష్కుండయిన స్వయంభువునకు నేను ననమస్కరించుచున్నాను. (29) దీనిని ప్రార్చిష మంత్రమందురు. ఇది బ్రహ్మర్షి గణసేవితము. పవిత్రమయినది. ఉత్కృష్టమయినది. శ్రీమంతమయినది. సర్వరోగ వినాశన కరమయినది.

ఏతద్విధి యుక్తుఁడయిన నరుఁడు మూఁడు వరములను పొందును. అన్నమును, ఆయువును, సుతులను, పితరులు ప్రసాదింతురు. ఉత్కృష్టమయిన భక్తితో కూడుకొని, శ్రద్ధావంతుఁడై, జితేంద్రియుడై నిత్యము సమాహిత చిత్తముతో సప్తార్చిష' మంత్రమును నెవ్వఁడు జపించునో, యతఁడు సప్తద్వీప సముద్రయుతమయిన పృధ్వీ యందు, ఏకరాట్ (ఏకచ్ఛత్రాధిపతి) అగును. ఆతని గృహమున భక్ష్యము కాని భోజ్యము కాని యేది యేమాత్రము వండబడినను, పితరులకు నివేదనము చేయబడకుండగ భుజించరాదు. (33,34) ఇంక పితరులకు అలీనోసంగఁదగిన పాత్రములను క్రమముగా వివరించుచున్నాను. వేనీ యందు పితృబలి యొసంగిన శాస్త్రముల యందు పితృయజ్ఞ ఫలములు వక్కాణింపం బడినవో వానిని చెప్పుచుంటిని వినుము, పలాశ పత్రమున సమకూర్చిన దొన్నెలో పితరులకు బలీ యొసంగీన తత్పలితము బ్రహ్మవర్చస్సు. రావి ఆకునందు (అశ్వత) బలీ యొసంగిన వసుభావనము కలుగును. (వసు - ధనము) ధనము కలుగును. (35) ప్లక్ష వృక్షపు (మట్టి) టాకుల యందు బలి యొసంగిన సర్వ భూతముల యందు నీత్యాధిపత్యము ఫలము. (36) న్యగ్రోధ వృక్షపుటాకులను దొన్నెలనుగా వాడిన (న్యగ్రోధముమట్టి) పుష్టి, సంతానము, బుద్ధి, ప్రజ్ఞ, ధృతి, స్మృతి ఫలితములుగా కలుగును. కాశ్మీరీ వృక్షపుటాకులతో బలీపాత్రలు దొన్నెలు కావించిన రాక్ష సవినాశనము కలుగును యశస్సు లభించును. మాధూక పత్రపు దొన్నెలలో పితృదేవతలకు బలియొసంగిన (మధూకము - అశోకము). ప్రపంచమున సౌభాగ్యము ఫలితము. (37) ఫట్లు జిల్లేడు పత్ర పాత్రములలో పితృదేవతలకు బలి యొసంగిన పరంద్యుతయును ప్రకాశమును ఫలితములు. (మారేడు) బిల్వపత్ర పాత్రమున పితరులకు బలి యొసంగిన ఆ శ్రాద్ధ కర్తకు ఐశ్వర్యము బుద్దీబలము, ఆయుర్ధాయము ఫలితముగా గలుగును. (39) క్షేత్రారామ తడాకముల యందు సర్వ సస్యముల యందు, వేణు పాత్రమున (వెదురుతో చేసిన పాత్ర) యందు పితృబలు లొసంగిన, మేఘుఁడెల్లప్పుడును వర్షించును, పైని చెప్పఁబడిన పాత్రముల యందు బలి యొసంగవలయును. సర్వ యజ్ఞములు నొనర్చిన ఫలము కలుగును. సుగంధ యుతములయిన పుష్పమాల్యములను పితరుల కొసంగవలెను. ఆతఁడు సూర్యునీ భంగి సదా ప్రకాశించును. పితరులకు గుగ్గులము మొదలయిన వానిని ధూపములను నెవఁడు మధుసర్పులతో (తేనెనేతులతో) సమర్పించునో, ఆతఁడు అగ్నిష్టోమాదు లాచరించిన ఫలితము బొందును. (42,43) పితృ పరాయణుఁడయి మంచి గంథముతో గూడిన ధూపమును పితరుల కొసంగీన ఇహో ముత్రములందు శుభములు పొందును. పితరులకు శ్రద్ధతో అతంద్రితుఁడై కర్త సర్వము సమర్పింప వలయును.

పవిత్రమనస్కుడై యెవ్వఁడు ప్రయత్నపూర్వకముగా పితరులకుదీపము నొసంగునో అతఁడు అప్రతిమ మయినది శుభమయినదియునగు దృష్టిని పొందును. ఉత్తమగతిని పొందును. (45) భూమి యందు ప్రకాశము నొందీ స్వర్ణమున ప్రకాశించును. (46) ఆతఁడు అప్పరోగణములచే పరివృతుఁడయి విమానాగ్రములందు ఆనంద మనుభవించును. గంధపుష్పములచేతను, జపములచేతను, హోమములచేతను, ఫలమూల నమస్కారముల చేతను, పితరులకు ప్రయత్నపూర్వకముగ పూజనొనరించి, తరువాత బ్రాహ్మణులకు అన్న మొసంగి పూజింపవలెను. శ్రాద్ధ కాలములందు వాయుభూతులయిన పితామహులు (వాయువులో సంచరించు తాతలు మొదలగువారు), శ్రేష్ఠులయిన బ్రాహ్మణులను ఆదేశింతురు. అందుచేనిట్లు చెప్పుచున్నాను. (49) శ్రాద్ధ కాలమున ద్వీజసత్తములను, వస్త్ర దానమున, రత్నప్రదానమున, భక్ష్యములచే, మధుర పానీయములచే, గోదానములచే, గ్రామ దానములచే, కర్త పూజింపవలయును. (50) ద్వీజాదులు పూజింపఁబడిన పీతరులు సంప్రీతులగుదురు. అందుచే విధి పూర్వకముగా ప్రయత్నముచేసి ద్విజులను పూజింపవలెను. (51) బ్రాహ్మణుఁడు కుడి యెడమ చేతులతో ఉల్లేఖనము చేయవలెను. (కుడిచేతిపై ఎడమచేతి నుంచి నేలమీఁద రాయవలయును. ఇది ఉల్లేఖనము) తరువాత నీటితో ప్రోక్షణము చేయవలయును. తరువాత శ్రాదకరు. అతంద్రీతుండై ఆచరించవలెను. (52) దర్భలను, పిండములను, భక్ష్యములను, వివిధములయిన పుష్పములను, గంధములను, అలంకారములను, వీనినన్నింటిని పితృశ్రాద్దమునకు భక్తుఁడైన శ్రాద్ధకర్త సమకూర్చుకొని యుండ వలయును. (53) యజ్ఞోపవీతమును దక్షిణ భుజము నుంచి (దండముల అపసవ్యము చేసికొని) పితరులకు మంచి రకమయిన 'కాటుక'ను (కంటికి పెట్టుకొనునట్టిదీ) సమర్పింపవలయును. కాటుకను చక్కగా చేసి, అభ్యంగమును (స్నానమును) దర్భల చివరలచే (నీరుచల్లి) యధావీధి మూడు మార్లు చేయవలయును. అపసవ్యముగా యజ్ఞోపవీతమును మార్చుకొని పితరులకు కాటుకను సమర్పింపవలేను. నేలకు వంగి వస్త్రమును, యజ్ఞోపవీత సూత్రమును కూడ సమర్పింపవలెను. (58) ఓ బ్రాహ్మణులారా ! ఖండనము (కోయుట - త్రేంచుట) ప్రోక్షణము దర్భలతో నీరములను చల్లుట, ఉల్లేఖనము చేతితో నేలమీఁద రాసి పరి శుభ్రము చేయుట. మొదలగునవి దేవ పితరులకు ఒక్కమారును, స్వపితరులకు మూఁడు సార్లును చేయవలెను. (56)

పితృ పరాయణుఁడయిన శ్రాద్ధకర్త మూడు పిండములను భూమిపై సమర్పింపవలయును. ఆ పిండములు నేతితో తిలలతో కూడి యుండవలెను. భూమిపై మోకాలు వంచీ సవ్యముగా యజ్ఞోపవీతమును ధరించవలెను. (58) పితరులను, పితామహులను, ప్రపితామహులను, అట్లే ప్రాచీన పితరులను ఆ శ్రాద్ధకర్త తప్పక ఆహ్వానించవలేను. ఆతఁడు ప్రయత్న పూర్వకముగా శ్రద్దగా పితృ తీర్థమును పిండములపై చల్లవలయును. ఆ పితృ తీర్థమును అపసవ్యముగా నర్పించవలయును. కొందరు మాతామహులకు వేరుగా వండిన వంటకములతో శ్రాద్ద మాచరింపఁ గోరుదురు. వారు పుష్టి వర్ణకములయిన వారలను అంగుష్ఠముచే నొక్కి పట్టి మూఁడు పిండముల ప్రదానము చేయవలయును. పోరా పిండములను తమ రెండు చేతులను మోకాళ్ల మధ్య నుంచీ యథాక్రమము పెట్టవలయును, ఎడమ చేయి కుడిచేతి మీద పెట్టి ధార నిడుచు మంత్రము నుచ్చరించవలయును. (62) ప్రథమ పిండమును, దక్షిణ దోశను రెండు చేతులతో 'నమోవః పితరః శోషాయ” ఇతి (అని) మంత్రము నుచ్చరించుచు పెట్టవలయును. (63) 'నమోవః పితరః సౌమ్యః' అని జాగ్రత్తగా నుచ్చరించుచు సవ్యోత్తరముగా (పై విధముగా) నుంచిన రెండు చేతులతో పిండముల నొసంగవలెను. (64) శ్రద్ధతో రెండు చేతులతో ఉలూఖలము (రోతి) యొక్క లేఖ యందు ఉదకపాత్ర నుండి నీటిని చల్లవలయును. నవక్షామ సూత్రమును, (క్రొత్త సిల్కు దారమును) జనపనార లేక ప్రత్తిదారమును సమర్పింపవలేను. (65) పతోర్ణము (ఉతికిన వస్త్రములు) రంగుబట్టను, కౌశేయము (ఒక విధమయిన సిల్కును) విసర్జించవలయును. (ధరింపరాదు). యజ్ఞము నందు అహత వస్త్రమును (క్రొత్తగా మగ్గము నుండి తెచ్చి తడుపక యుంచిన దానిని) వదలవలె. (66) ఈ వస్తువులు పీతరులకు తృప్తి కలిగింపవు. త్రికకుత్ సంబంధమయిన కాటుక శ్రేష్టమని చెప్పుదురు. {67) ఈ క్రింది వస్తువులు శ్రాద్ధమునకు శ్రేష్ఠములయినవి - నల్లనీ నువ్వుల నుండి గానుగాడి తీసి జాగ్రత్తగా నుంచిన నూనే, చందనము, అగరు, తమాలము, ఉశీరము (వట్టి వేరు) ఉత్పలములు. గుగ్గులధూపము, శ్వేత తురుషుము (పరీమళ మొసంగు ధూపవస్తువు) తెల్లని పువ్వులు శ్రేష్ఠములు. అట్లే పద్మోత్పలములును. (69) అరణ్య జాతములు, మంచి రూపము, మంచి వాసన (పరిమళము) గలిగిన పువ్వులు శ్రేష్ఠములు. అట్లే స్మరకుండికలు, పొడుగాటి కాడ కలిగిన పూలును శ్రేష్ఠములు. వాసనలు లేనివి, వెగటు (ఉగ్ర) వాసనలు గలిగిన పూవులు పుష్టిని వాంఛించు వారిచే శ్రాద్ధ కర్మలో పరిత్యాజ్యములు. (71) శ్రాద్ధమునకు ఆహ్వానింపఁబడిన బ్రాహ్మణులు (భోక్తలు) తప్పక ఉత్తరమువైపు ముఖము కలిగి కూర్చుండవలెను.

యజమాని దక్షిణాభిముఖుఁడై కూర్చుండి విధివత్తుగా పూజాదులను సలుపవలెను. వారలకభిముఖుఁడై ప్రయత్న పూర్వకముగా దర్భలపై పిండముల నుంచవలెను. (73) ఈ విధముగా శ్రద్ధగా చర్చించినచో పితామహాదులు (పితరులు) యదార్థముగా నర్చింపఁబడిన వారగుదురు. పచ్చగా నున్నచో కుశలు ఆసనములకు శ్రేష్టము. అవి ఒక మర్మర ధ్వని చేయవలయును. అయ్యవీ దృఢముగా, వంపులు లేక నీడుపుగా,మెత్తగా, గాజు రంగుతో (పింజలాః) ఉండవలయును. కుశలు ఓరల్ని ప్రమాణము గలిగి యుండవలెను. (పిడిమూరెడు పొడవు) అయ్యప్ పితృ తీర్థము యొక్క సేచనమున సంస్కృతములు కావలెను. అయ్యవీ మొదలు నందు (మూలమున) నీలవర్ణములై యుండవలెను. అట్టివి కుశలలో శ్రేష్టములు. (75) శ్యామాకములు, నీవారములు, దూర్వలు కూడ చెప్పబడినవి. పూర్వము కీర్తిమంతులలో శ్రేష్ఠుఁడయిన అశ్వుడు ప్రజాపతియయ్యెను. (76) ఆతని శిరోజములు (వెండ్రుకలు) నేలమీఁద పడి కాశలయినవి. రెల్లుగడ్డిపోచ అందుచే కాశలు పవిత్రశ్రాద్ధ క్రియలందు గౌరవింపఁ బడినవి. (77) అందుచే 'కాశలను శ్రాద్ధ కర్మలందు ఉపయోగింపవలయును. సంపత్తును నభిలషించినవాఁడు ఆ రెల్లుకసవుపై (కాశలపై) పిండముల సమర్పింపవలయును. తన్మూలమున సంతతిని - పుష్టిని, ద్యుతిని, ప్రజ్ఞను, కీర్తిని, కాంతిని పొందుదురు. (78) వారెప్పుడు (రుచిరులు) అందమైన వారగుదురు. పాపము నుండి విముక్తు లగుదురు. వారు అఘవర్జితులు. పిండముల కొఱకు దక్షిణాభిముఖుఁడై (కర్త) యొకేయొక సారి దర్భలను పరుచవలయును. దర్భల యొక్క ఆగ్రములు ప్రాగ్దాక్షిణముగా నుండవలెను. తత్సంబంధమయిన విధిని చెప్పుచున్నాడు. శ్రాద్ధకర్త దీనుఁడు కానీ కోపి కానీ కాకూడదు. ఆతఁడు అనన్యమనస్కుడై యుండవలెను. ఆతఁడు మనస్సును ఒకచోటనే కేంద్రీకరించి పవిత్ర హృదయముతో శ్రాద్దము నాచరించవలెను. (80) (81) మంత్రము ఆమంత్రార్థమిది. “అపవిత్రమైన దానిని నేను నాశనము చేయుదును. అసురులు దానవులు నాచే చంపఁబడిరి. రాక్షసులు, యక్షులు, పిశాచ సంఘములు, యాతుధానులు నాచే చంపఁబడిరి.” (81) శ్రాద్ధకర్త ఈ మంత్రముతో సంయతాత్ముఁడయి, చక్కగా వేదిని ఒక మారు ఉల్లేఖనము (తుడువ) చేయవలయును. బుద్ధి మంతుఁడయినవాఁడు, మంగళమును కోరువాఁడు అయిన శ్రాద్ధకర్త ఉత్తరదిశగా తిరిగి దర్భను (ఉల్లేఖనము చేసిన దానినీ) విసర్జించవలయును. (82) అసురులు పితృమంత్రము నుచ్చరించిన యజమానిని చూచి, విడిచి పోవుదురు. ఎందీ మంత్రముచ్చరింపఁబడినదో ఆ ప్రదేశమును వీడి రాక్షసులు పోవుదురు. (83) కర్త అశుచిమంతము, అసాధువు, అయిన అన్నము చూడకూడదు. స్పృశింపను కూడదు. చేతియందు (ప్రోలియందు) పవిత్రము పూనకయున్నచో ఆ కర్త శ్రాద్ధ క్రియ యొక్క ఫలితముననుభవింపజాలఁడు.

ఎవడు ఎల్లప్పుడు ఈ విధి ననుసరించి శ్రాద్ధము నాచరించునో ఆతఁడేమేమిమీ హృదయమున వాంఛించునో పితరులు వాని నెల్ల నొసంగెదరు. నిత్య మీ విధముగా ప్రయత్న పూర్వకముగా శ్రాద్ధమును దోష రహితముగ నాచరించిన పితరులు మనస్సున సంహృష్ణులగుదురు. రాక్షసులు విమనస్కులయ్యేదరు. (86) శ్రాద్ధకర్మ లందు ఈ క్రింది వానిని ఎప్పుడును పరిత్యజించవలయును. శూద్రులను గొఱ్ఱపాలను బల్వజ, వారణ లను తృణములను ఉపలములను కలువపుగుండు సముద్ర సంబంధమైన ఉతువాలములను 'లడ్డులను - ఇవి అయజ్ఞ వస్తువులు. " వీనిని పరిత్యజించవలెను. (87) కన్నులకు కాటుSక పెట్టుకొనుట, అభ్యంగన స్నానమాచరించుట, గంధములను (అత్తరువులను) వాడుట, సూత్ర ప్రణయనము సూదితో వస్త్రములను కుట్టుట - మొదలగు వానిని శ్రాద్ధకర్త పరిహరించవలేను. కోసిన మరల చిగిర్చి పెరుగునట్టి కాశలతో పవిత్ర శ్రాద్ధకర్మ నాచరించవలయును. తన్మూలమున అశ్వమేధ యాగము నాచరించిన ఫలమును పొందును, పువ్వులను ' సమర్పించునప్పుడు, అత్తరుల (గంధముల) అలదునపుడు, ఆభరణములను ధరించునప్పుడీ క్రింది మంత్రమును చెప్పవలయును. "కాశా పునర్భవా యే చ బరిలో హ్యుపపర్షిణః ఇత్యేతే పితరో దేవా దేవాశ్చ పీతరః పునః పుష్పగంధ విభూషాణా మేషమంత్రఉదాహృతం” (90) ఈ విధముగా పితరులు దేవతలు : దేవతలు పితరులు. కర్మ సిద్ధి కొఱకు కర్త హోమము నాచరించవలయును. హోమమునకు ప్రయత్న పూర్వకముగా " (తప్పక) దక్షిణాగ్ని నుపయోగింపవలయును. ఇతర కర్మల యందు లౌకికాగ్నిని ఉపయోగింపవచ్చును. (91) సమీధలను హోమగుండములో లోపల వేయవలయును. తరువాత అగ్నిని వాని చుట్టును నుంచవలయును. తరువాత సమాహితమయిన మనస్సుతో అగ్ని నంతటను ప్రజ్జ్వలింపం జేయవలయును. మూఁడగ్నులకు క్రమముగా నీమూఁడు మంత్రములు చెప్పవలెను. 1.అగ్మయే స్వకవ్యవవాహాయ స్వధా అంగిరసే నమః. 2. సోమాయ వై పీతృమతే స్వధా అంగీరసే నమః, 3. యమాయ వైవస్వతయే స్వధా నమ ఇతిధ్రువమ్ (94) అగ్నికి హోమమెల్లప్పుడు దక్షిణముగను, సోమునకు ఉత్తరముగను, వైవస్వతునకు (యమునకు) ఆ రెండింటికి మధ్యమము గను హోమము చేయవలెను. (95) ఉపహారము స్వధాకారము, ఉల్లేఖనము, హోమజపములు, నమస్కారము, ప్రోక్షణము, అనేకములైన హవ్యేంధనములు, అంజనా భ్యంజనములు, పిండనిర్వపణము - వీనిని బాగుగా ప్రజ్వరిల్లినయగ్నిలో వేల్చవలె.

శ్రాద్ధ క్రియలన్నియు యథోద్దిష్టముగా శ్రద్దతో చేయవలెను. (98) శ్రాద్ధకర్మ సిట్టించుకోకు, కర్త, పవిత్రాగ్ని యందు, అధికమయిన నేతితో, సమిధలతో, అగ్నీ బాగుగా ప్రజ్జ్వలించునట్లు, అగ్నీ హోత్రము ధూమముతో కప్పబడి యుండని విధముగ, హోమము చేయవలయును. (99) హోమజ్వాలలు ప్రజ్జ్వలింపవలెను. యజమాని, అగ్ని ప్రజ్జ్వలింపకుండ హోమము చేసినచో, ఇహాముత్రములందు (ఇప్పుడు తరువాతను) అంధుం డగును. ఇయ్యది నిజముగా మాచే శ్రుతము. (పెద్దలు చెప్పగా విందుము) (100) అల్పమయిన ఇంధనము (సమిధలు) గలిగిన వహ్ని కానీ, సర్వత్ర జ్వాలలు లేని అగ్ని కానీ, రూక్షాగ్నికాని, జ్వాలలు ధూమము అపసవ్యముగా వెలువడినను అగ్నిహోత్రుఁడు కోరిక లొసంగఁడు. అది అసిద్దాగ్ని. (101) దుర్గంధయుత మయినదియు, నీలవర్ణము కలదియు, కృష్ణ వర్ణము కలిగినదియునగు అధోముఖ జ్వాలలో భూమి వైపు వెలుంగునదియునగు అగ్ని పరాభవమును గలిగించునది యని యెఱుంగవలెను. (102) అర్చిష్మంతము (జ్వాలలు కలిగినది) పిండిత శిఖలు కలిగినది పైనీ జ్వాలాగ్రములు వలయములుగా వెలుంగునది, నేతితో చేసిన అంజన (కాటుక) తుల్యమయినది. స్నిగ్ధమయినది, ప్రదక్షిణముగ కదలు శీఖలు కలిగినదియునగు వహ్ని కార్య సిద్ది కొకు సహకరించును. (103) (కర్త) నరనారీ గణముల నుండీ, శాశ్వతమయిన పూజల నందును. అక్షయము శాశ్వతమునయిన ప్రయోజనము కోలకు యజమానీ పీతృగణములను అగ్నినీ పూజింప వలయును. (104) బిల్వముల యొక్క ఉదుంబరముల యొక్క పత్రములు ఫలముల సమిధలు శ్రాద్ధ క్రీయ యందు మహా పవిత్రములు మేధ్యములు. (105) ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! (దర్బలతో జేసిన) పవిత్రము జన్మకర్మలను పవిత్రీకరించునది. పాత్రముల యందు శ్రాద్ధకర్మలాచరించిన ఎట్టి ఫలితము కలుగుననినాచే చెప్పఁబడినదో, క్రమముగా అట్టి ఫలమే సమిధల సేకరించుట వలన కలుగునని గ్రహింపవలయును, (ఆయా వృక్ష సమిధలనుపయోగించిన ఫలితము). కర్త చిత్తము సమాహితము చేసికొని, అగ్నీ సంబంధమైన కర్మను చేయుచున్నాను - అనగా “అనుజ్ఞాతుఁడవై కర్మ చేయుము” అని చెప్పవలెను. 'తథైవ' అట్లే అనుజ్ఞాతుఁడవై 'కురుష్వ' చేయుము - అని ద్విజసత్తములచే ఆజ్ఞాపింపఁబడి, పాత్రమునందు నేతిని తీసికొనీవచ్చీ అగ్నిహోత్రము నందు హోమము చేయవలెను. (107) పలాశము, ప్రక్షము, న్యగ్రోధము, ప్లక్షము, అశ్వత్తము, వికంకతము, అంతియేకాక, సరళము, దేవదారు, శాలము, ఖదీరము - కూడ సమిధలకరములు. ఇవి ప్రశస్తములు కూడ. ముండ్లచెట్లు, గ్రామములలో లభించునవి, కూడ పితృదేవతల వచనముల బట్టి యజ్ఞములలో సమిధల కొఱకు గౌరవీంపఁబడుచున్నవి.

షట్పల వృక్షముల సమిధలతో అగ్నిని హోమము చేయవలయును. వాని వలని ఫలమెట్టిదో నేచెప్పెదను వినుఁడు, (112) (తత్పలము)  అక్షయము; సర్వకామము లొసంగునదీ. అశ్వమేధ యజ్ఞతుల్య ఫలమయినది. (113) శ్రాద్ధకర్మ యందు క్రిందఁజెప్పబడునట్టి వృక్ష సమిధలను పరిత్యజించవలెను. శ్లేషాంతకము - నక్తమాల, కపిత్తము (వెలగ), శాల్మలీ, నీపము (కడిమీ) విభీతకము. చిరబిల్వము - కోలము - తిందుకు - వృక్షములు నిషిద్ధములు. (114) అట్లే బల్వజము, కోవిదారము, సర్వత్ర వర్జ్యములు. పక్షులు గూడు కట్టుకొని నివసించు వృక్షములను సమిధలకై పరిత్యజించవలెను. తత్తుల్యమైన ఇతర వృక్షములు యజ్ఞములకు పనికి రావు. వానీని నిషేధించవలెను. (115) పితృ శ్రాద్ధ కర్మ యందలి మంత్రములందు, ‘స్వధా’ అను పదమును దేవతల యజ్ఞ కర్మలందు 'స్వాహా' అను పదమును కలిపి చెప్పుట ఉదాహరింపఁబడినది. (116)

ఇది వాయుప్రోక్తమయిన మహాపురాణమగు బ్రహ్మాండ పురాణమున మధ్యభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున, శ్రాద్ధకల్పము నందలి సమీద్వర్ణనమను ఏకాదశాధ్యాయము సమాప్తము.