బ్రహ్మాండ మహా పురాణము
10 - మహాదేవ విభూతి వర్ణనము
మహాదేవ పదవ్యుత్పత్తి, శివుని యొక్క మాహాత్మ్యము. నీలకంఠుని ఉత్పత్తి శివుని అష్టతనువులు. ఈ ప్రకరణమున శివుని అష్టతనువుల (మూర్తుల) గూర్చిన వివరమున్నది. ఇది పురాణముల యందు ప్రసిద్ధము. వైదిక వాజ్మయమున నుపలబ్ధము, ఇయ్యది శతపథ బ్రాహ్మణమునకు వివరణము. వాయు పురాణమున నియ్యదియే కొననగును
ఋషి పలికెను :
ఈ కల్పము నందు మహాత్ముఁడు మహాదేవుఁడు, రుద్రుడునయిన వాని యొక్క పాదుర్భావము, సాధకులయిన ఋషులతో సహితముగా నేను వచింపలేదు. .
సూతుండు పలికెను ;
ఆదిమ సృష్టియొక్క యుత్పత్తి, ఉదయాదికము, సాచే సూక్ష్మముగానే చెప్పఁబడినది. ఇప్పుడు విస్తరించీ వివరముగా నామములతో తనువులతో సహా నేను చెప్పెదను. ఇంతకుఁబూర్వము గతించిన కల్పములలో మహాదేవుఁడు తన భార్యలయందనేకులయిన సుతులను కనెను. వానిని గూర్చి యీ కల్పమున వినుము, కల్పాది యందు తనతో తుల్యమయిన కుమారుని కొరకు బ్రహ్మ ధ్యానమొనరించెను. అందువలన సౌతని తొడపై నోక కుమారుఁడు, నీలలోహితుఁడు, ప్రాదుర్భవించెను. (4) ఆ బిడ్డడు ఘోరముగా సుస్వరముగా రోదించెను. తన తేజస్సుచే ప్రపంచమును దహించునట్లుండెను. వెంటనే ఏడ్చుచున్న కుమారుఁడయిన నీలలోహితుని చూచి “బ్రహ్మ ఓ కుమార! ఏల రోదించుచుంటివి" యని యడిగెను. “ఓ పితామహ! ప్రప్రథమున నాకొక నామము (పేరు) నీడు"మని పలికెను. (6) “ఓ ప్రభు! “నీవు రుద్ర. సోమకుం డవయితివి”. అని చెప్పగా ఆ బాలుఁడు మరల ఏడ్చెను. “ఓ కుమార! ఏల ఏడ్చెదవు' అని మరల ప్రశ్నించెను. స్వయంభువునితో నా బాలుఁడు” నాకు రెండవ నామ మొసంగు'మనెను. “నీవు భవనాముఁడవగుము”అనిన వెంటనే ఆతఁడు మరల ఏడ్చెను.
ఏడ్చుచున్న బాలునిఁజూచి బ్రహ్మ” ఏల ఏడ్చెద” వనెను. “నాకు తృతీయ నామము నొసంగుము" ఆతఁడనెను. (9) “ఓ దేవ! నీవు శర్వ - నాముఁడవయితివి” అని బ్రహ్మ పలికినంతనే ఆతఁడు మరల రోదించెను. ఏడ్చుచున్న యాతనినిగని బ్రహ్మ” “ఏల ఏడ్చుచున్నావు' అని యడిగెను. (10) చతుర్థ నామమును నా కోసంగుము” అని యాతఁడు ప్రత్యుత్తరమిచ్చెను. “ఈశానుడవను నామము నొందిన వాఁడవు” అని న వెంటనే ఆ బాలుఁడు మరల రోదించెను. ఏడ్చుచున్న యాతనితో 'ఏల నీవేడ్చుచుంటివి” అని ఆ బ్రహ్మ యడిగెను. స్వయంభువునితో “నాకు పంచమమైన నామము నొసంగుము” అని ప్రత్యుత్తర మాతఁడొసంగెను. (12) “నీవు పశువులకు పతివి. పశుపతివి. ఓ దేవ" యని బ్రహ్మ పలికెను. ఆ బాలుఁడు మరల ఏడ్వదోడగేను. “ఏల ఏడ్చుచుంటివి' యని బ్రహ్మ ప్రశ్నించెను. (13) ఆతనితో ఉనాకు షష్ణ (ఆరవ) నామ మొసంగుమని బాలుడు పలికెను. ఆ బ్రహ్మ “ఓ దేవ! నీవు 'భీమ' నామకుఁడవు”అనెను. ఇట్లు పలుకబడి ఆ బాలుఁడు మరల నేడ్చెను. (14) ఏడ్చుచున్న నాతనిని “ఏల నీవేడ్చుచుంటివి” అని బ్రహ్మ ప్రశ్నించెను. ప్రత్యుత్తరముగా నాతండు “నాకు సప్తమమైన నామ మొసంగు'మనెను. బ్రహ్మ “నీవు 'ఉగ్ర' నామమును పొందితి” వనిన వెంటనే ఆ బాలుఁడు మరల రోదించెను. రోదించుచున్న కుమారకుని చూచి “ఏడ్పు మానుము' అని బ్రహ్మ యనెను. ఆ బాలుఁడు సోకు ఎనిమిదవ (అష్టమ) నామము నొసంగు”మనెను. “నీవు మహాదేవ నామకుఁడ వయితివీ అని బ్రహ్మ పలుక ఆతఁడు రోదనము విరమించెను.
ఈ నామముల నొంది, నీలలోహితుఁడు బ్రహ్మతో “ఈ నామములకు స్థానములను నిర్దేశించు” మని యనెను. (18) అంత స్వయం భువుఁడు ఆ నామములకు తనువులను స్థానములను నిర్దేశించేను. అయ్యవి సూర్యుఁడు, జలము, భూమి, వాయువు, వహ్ని (అగ్ని) ఆకాశము, దీక్షిత బ్రాహ్మణుడు (యజమాని), చంద్రుఁడు. ఇవి అష్ట విధ తనువులు. ఆ రూపములలో ప్రభువు పూజ్యుఁడు, వంద్యుఁడు, ప్రయత్న పూర్వకముగా నమస్కరింపఁదగినవాఁడు, (20) కుమారుఁడయిన నీలలోహితునితో బ్రహ్మ మరల ఇట్లనెను - " ప్రభూ। మొట్టమొదట నీవు 'రుద్రుండవని ప్రథమముగా నీ నామము చెప్పఁబడినది. (21) ఆందుచే నీ ప్రథమ. నామమున 'రుద్ర నామమునకు సూర్యుఁడు నీ ప్రథమ తనువు. ఆతఁడట్లు పలుకగనే, ఆతని తేజము ప్రకాశవంతమై ఒక నేత్రమయ్యెను.ఆ నేత్రము సూర్యుని యందు ప్రవేశించేను. (22) అందుచే సూర్యుఁడు రుద్రుఁడుగా స్మరింపఁబడుచున్నాడు. ఉదయించు సూర్యునింగిని అస్తమించు సూర్యునిగాని ఎవ్వరును దర్శింపరాదు. (23) సూర్యుఁడు (శశ్వత్) తరచుగా నుదయించుచు నుండును. అట్లే తరచుగా నస్తమించుచుండును. అందుచే ఆయుష్కాముఁడగు వాఁడు సూర్యుని చూడరాదు. ఆయుష్కాముఁడు సదా శుచిమంతుఁడై యుండును. (24) ఉదయ సాయం సంధ్యాద్వయములందు, సామము, ఋక్, యజుస్సు సూక్తములను చదువుచు, బ్రాహ్మణులు ఉదయించు నస్తమించు సూర్యునుపాసించి రుద్రుని ప్రభావ వంతుని చేయుదురు. ఉదయించు సమయమున ఋక్ సూక్తముల యందు సూర్యుఁడుండును. మధ్యాహ్న సమయమున యజు సూక్తముల యందు నిలుచును. ఇంక ఆలస్యముగా నగు సాయం సమయమున అపరాష్ట్రమున రుద్రుండు పరుండును. విశ్రాంతి వహించును. నిజమునకు సూర్యుఁడుదయింపఁడు. అస్తమింపఁడు.
శివుని అష్టతనువులు: వాని వివరణము.
నీలలోహితుఁడయిన ఈశ్వరునకు ఎనిమిది మూర్తులు. అయ్యవి పంచమహాభూతములు, ప్రాణ, అపానములను వాయుద్వయము, మనస్సు యజమానరూపము - ఇవీ యష్ట చిహ్నములు లేదా లింగములు. ఈ క్రింది వివరణమును బరిశీలించినచో నీ ప్రకరణమందలి వర్ణనము సులభ గ్రాహ్యమగును. ఇందు ఈశ్వరుని అష్టస్థానములు, తనువులు, ఆయా తనువులలో భార్యల పేర్లు, సంతానము ఒసంగబడినవి.
పని మనువు శివుని స్థానము లేక నీయమిత శరీరము శరీర నియమము
శివుని తనువు
శివుని స్థానము లేక నియమిత శరీరము
శరీర నియమము
భార్య పేరు
సంతానము తత్సంఖ్య
1
రుద్రః
సూర్యుఁడు, ప్రాణము లేదా వేడిమీ
రౌద్రి
సువర్చలా
శని
2
భవః
జలము
అపః
ధాత్రి
శుక్రుడు
3
శర్వః
భూమి
భూమి
వికేశీ
అంగారకుడు
4
ఈశానః
వాయువు
వాత
శివా
1.మనోజవ
2.అవిజ్ఞాతగతి
5
పశుపతిః
అగ్ని
అగ్ని
స్వాహా
స్కంధః
6
భీమః
ఆకాశః
ఆకాశః
దీశలు
స్వర్గః
7
ఉగ్రః
దీక్షిత బ్రాహ్మణుఁడు యజమాని
దీక్షిత బ్రాహ్మణ
దీక్షా
సంతానః
8
మహాదేవః
చంద్రుడు (అపాన) శీతలము
చంద్రుడు
రోహిణి
బుధః
శతపథ బ్రాహ్మణములో - యజమానుఁడు మనస్తత్వ నిరూపణముగా వ్యక్తీకరింపఁబడినాఁడు. “మనో వై యజమానస్వరూపమ్” శబ్రా. 1.2.8 24. భారతమున ఉదయాస్తమానముల సూర్యుని చూడరాదను విధి యున్నది. ఈ పురాణ నియమము ఇందు విజ్ఞానశాస్త్ర ధర్మముగా నిరూపింపం బడినది.
రుద్రుని (సూర్యునకు) కెదురుగా ఎట్టి పరిస్థితులలోను, మూత్ర విసర్జనము చేయరాదు. ఇట్టి నియమముల ననుసరించు బ్రాహ్మణులను రుద్రుడెన్నడు హింసింపఁడు. అంత బ్రహ్మ మరల నీలలోహితునితో నిట్లు పలికెను. (28) 'భవుఁడవని నీ ద్వితీయ నామము నాచే ప్రోక్త మయినది. అందుచే జలము (ఆపస్సు)ఈ నామమునకు ద్వీతీయమయిన తనువగును”, అని ఇట్లు చెప్పగా రసాత్మకమయిన జలప్రకృతి ఆతని శరీరస్థమైన దయ్యెను. ఆతని యందు జలములు ప్రవేశించుటచే జలము ('భవపద వ్యుత్పత్తి వాయుపురాణములో గూడనట్లే యీయబడినది.) భవ' స్వరూపముగా సంస్మరింపఁబడినది. (30) సర్వ భూతములు ఆతని వలననే పుట్టినవగుటచేతను వానివలననే ఆతఁడు జీవభూతములను భావించుట చేతను ఆతఁడు 'భవుడని పిలువబడెను. (సృష్టించుటచే, భావించుటచే, ప్రసరించుటచే) (1) అందుచే నెవ్వడును జలములలో మూత్ర విసర్జనముగాని మల విసర్జనమునుగానీ చేయరాదు. ఎవ్వఁడును నీటిలో నిషీవనము (ఉమ్మివేయ) చేయరాదు వివస్తుఁడై స్నానము చేయుటగాని, నీటియందు స్త్రీతో మైథున క్రియఁజేయుటకాని కూడదు. (32) నీరు ప్రవహింపనీ ఒకచో నిలువయుండనీ నీటిని పరిచక్షింపరాదు. పేర్కొని నిందింపరాదు. జల శరీరములను మునులు మేధ్యములుగాను (పవిత్రములుగా) అమేధ్యములుగాను (అపవిత్రములుగా) పేర్కొనీ యున్నారు. (38) స్వాదువులు (రుచి లేనట్టి) కొనటి నీటిని, చెడ్డగా వాసన వేయు నీటినీ, వర్ణితమయిన (రంగుతోనున్న నీటిని) స్వల్పముగా నున్న నీటిని సర్వశః అన్నీ యవసరముల యందు విసర్జింప వలయును. నీటికీ జననస్థానము (యోని) సముద్రము అందుచే జలములు సముద్రమును జేరును. (సముద్రమునే చేరును, కొమీంచును) (34) సముద్రమును జేరి నీరములు పవిత్రములు అమృతములగును. అందుచే నీటి నెవ్వరు ప్రవహించిపోకుండ ఆపరాదు. ఆ నీరములు సముద్రమును ప్రేమించును.
ఇట్లు ఎవ్వడు నీటిని ఆదరించి వర్తించునో ఆతనిని భవుఁడు హింసింపఁడు. (36) అంత బ్రహ్మ స్వకుమారుఁడయిన నీలలోహితునితో “ఓ ప్రభూ! శర్వుఁడవని నీకు ఏ మూఁడవ నామము నాచే చెప్పబడినదో, దానికి భూమి భౌతిక శరీరము అగును”. (37) అని పలుకఁగా ఆ నీలలోహితుని శరీరమందలి (స్థిరమైనది) గట్టివి, స్థిరములయినవియునగు ఎముకలు (అస్థి) భూమిని ప్రవేశించెను. అందుచేతనే భూమికి శర్వ మని పేరువచ్చినదీ: (38) అందుచే దున్నిన నేలలో (కృష్ట సబ్దములో) మూత్ర పురీషముల విడువరాదు. చెట్ల నీడలందు మూత్రము నెవ్వరు విడువరాదు, అంతియేకాక నడిచేడు త్రోవలోగాని తన నీడపడు చోటనుగాని మూత్రము విడువరాదు. (39) నేలను గడ్డితో పరచి, తన తలను గుడ్డతో కప్పుకోనీ (ముసుగీడుకొని) మల విసర్జనము చేయవలయును. భూమి యెడనిట్లు ప్రవర్తించు వానిని శర్వుఁడు హింసింపఁడు. (40) అంత బ్రహ్మ కుమారుఁడయిన నీలలోహితునితో 'ఈశానుఁడ వని నీ నాలుగువ నామము నాచే చెప్పబడినది. నీ నాలుగవ నామమునకు "వాయువు చతుర్థ శరీరమగును.” అనీ పలుకంగా ప్రాణము, ఐదు విధములుగా నతని యందున్నట్టిది, ప్రాణమనునది వాయువు నందు ప్రవేశించెను. అందుచే వాయువు ఈశానుఁడు. వాయువు నెవ్వరును నిందింపరాదు.. పొయువుపై నెదురు తిరుగరాదు. ఏలయన ఈశ్వరుఁడయిన వాయువు ప్రబలముగా వీచును. (43) మహేశానుఁడు పోయువునెడ సవ్యము ప్రవర్తించు వానిని యజ్ఞముల నాచరించుటచే పాయువును గౌరవించువానిని, పొయువును సేవించు వానిని హింసింపడు.
అంత ధూమ్రవర్లుఁడయిన ఈశ్వరునితో బ్రహ్మ మరల నిట్లనెను. నేను 'పశుపతియని ఏ నామముతో నీన్నుగూర్చి చెప్పితినో యది నీ పంచమ నామము. ఈ అగ్ని నీ పంచమ సొమమునకు ఐదవ శరీరము అగుగాక అని చెప్పఁగనే శరీరస్థమయిన అగ్నీవత్పజ్వలించు తేజము “ఉష్ణ' సంజ్ఞిత మాతని శరీరమును ప్రవేశించెను. (46) అగ్ని ప్రవేశించుటచే పశుపతి యయ్యెను, అగ్ని “పశువగుట (జంతువు) చేతను, అతఁ డు పశువులను రక్షించుటచేతను ఆతని భౌతిక శరీరము పశుపతీ' నామమున పిలువబడేను. ఆ పశుపతి తను “వగ్ని' శరీరము. అందుచే అ పవిత్రమయిన మేధ్య పదార్థమును ఎవరు దహింపరాదు, అంతియేకాదు ఎవ్వరును అరికాళ్లను కాచుకొనరోదు, (48) అందుచే దానిని క్రింద (అధస్తోత్) ఉంచరాదు, దానిని దాటరాదు. ఇట్లు వర్తించు వానినీ పశుపతి బాధింపఁడు, గాయపరుపండు, (49) శ్వేత పింగళుఁడయిన రుద్రునితో బ్రహ్మ మురల నిట్లనెను. నేను నీకు ఆరవ నామముగా (భీముఁడు' అని దేనిని చేప్పితినో ఓ ప్రభూ। అది ఆకాశ పునాముమై నీకారవ నామమగు గాక అని పలుకగనే ఆతని శరీరస్థమయిన (ఆకాశము) అవకాశము సుషిరమయ్యెను. (51) ఆకాశమతని శరీరమును ప్రవేశించెను. అందుచే నయ్యది (ఆకాశము) (భీముని) భీమనామక శివుని శరీరము. ఆ కారణమున శివుఁడా కాశమున నున్నట్లుగా స్మరింపఁబడుచున్నోఁడు. (52) తత్కారణమున సంవృతము చేయకుండఁగ (కప్పకుండఁగ) మలమును, మూత్రమును, పారవేయరాదు. ఆచ్చాదనము లేక అన్నమును తినరాదు. నీటిని త్రాగరాదు, మిథున క్రియను చేయరాదు; భుజింపఁగా మిగిలిన యుచ్చిష్టమును ఆచ్చాదనము లేక పారవేయరాదు.
ఇట్లా చరించువానిని భీమనామకుడయిన ఈశ్వరుఁడు హింసింపఁడు గాయ పరుషండు అంత సర్వప్రభుఁడైన ఈశ్వరునితో బ్రహ్మ మరల నిట్లనెను. “నేను చెప్పిన నీ సప్తమ నామము “ఉగ్రుఁడు'. దీక్షితుఁడయిన బ్రాహ్మణుఁడు, ఆ ఏడవ, షేరింటివాఁడగును” ఆతఁడట్లు పలుకగనే ఆతని శరీర స్థమైన చైతన్యము దీక్షితుఁడు బ్రాహ్మణుఁడు, సోమయాజీయునయిన యితనిని ప్రవేశించెను. (56) దీక్షితుఁడై సోమయాజియై యుండునంత కాలము బ్రాహ్మణుడు 'ఉగ్రు'ఁడగును. అందుచేతనే యతని నెవ్వరు నిందింపరాదు, ఎదురు తిరుగరాదు, ఆతనిని గూర్చి పరీపాదము (దూషణము) చేయరాదు. (57) ఎవరాఁతనీనీ నిందింతురో వారలు ఇవి పొషమును పొందుదురు. ఇట్లు యుక్తముగా ప్రవర్తించు ద్వీజులను ఈశ్వరుఁడు హింసింపడు, అంత భాస్కర ద్యుతిమంతుఁడయిన శివునితో బ్రహ్మ మరల ఇట్లు పలికేను. “నేను చెప్పిన నీ యెనిమిదవ సామము మహాదేవ' సోమము ఈ ఎనీమీదవ సామమునకు భౌతికమయిన తనువు చంద్రుఁడగుగాక. " ఇట్లు చెప్పలగనే సంకల్ప ధ్యానములతో నిండిన ఈశ్వరుని మనస్సును చంద్రుడు ప్రవేశించెను. (60) ఆ కారణమున మహాదేవుడు చంద్రుఁడుగా భావింపఁబడుచున్నాడు. అందుచేతనే మహాదేషుఁడు 'శశి' (శశమును గలినవాఁడు) అని )( యవహరింపఁబడుచున్నాడు (61) అమావాస్య యండు బ్రాహ్మణుఁడు వృక్షమును, పొదను, ఓషధులను కొట్టరాదు, భేదింపరాదు. మహాదేవుఁడు సోముఁడు ఆత్మ ఓషధీగణములు.
పర్వములయందు (అమావాస్య, పౌర్ణమి) ఎవ్వండు మహాదేవునిటైజింగి వృక్షగుల్మౌషధీగణమును ఛేదింపక యుండునో ఆతనిని మహా దేవుఁడు చంపఁడు. (63) సూర్యుఁడు పగటివేళ, చంద్రుఁడు రాత్రివేళ ప్రజలను రక్షించుదురు. చంద్రసూర్యులు సన్నిహితముగా నొకేచోట అమావాస్య నాటి రాత్రియందు కలిసియుందురు. (64) అమావాస్య నాటి రాత్రి యందు నియమయుక్తమయిన యోగక్రియాచరణము చేయవలయును. ఈ దృశ్యమాన ప్రపంచమంతయు ఆతని శరీరములతో నామములతో రుద్రుఁడు వ్యాపించియుండును. (65) ఏకాకియై (ఒంటరిగా) సంచరించు సూర్యునీ రుద్రుఁడందురు. సూర్యుని ప్రకాశము చేతనే జనములు వారి నేత్రములతో వస్తువుల చూడగలుగుదురు. రుద్రుడు ముత్తాత్ముఁడై యుండును. నీజ కిరణములచే నీటిని త్రాగును. అన్నకాంక్షతో పానకాంక్షతో అన్నము తినబడుచున్నది. నీరు త్రాగబడుచున్నది, (67) అరబూద్భవ మయిన దేహము శరీరమును పోషించి వృద్ధి పరచును. భూ సంబధమయిన పరమేశ్వరుని శరీరము తన ప్రజలను పోషించునట్టి దగుట ఉత్తమమైనది. (68) స్థిరీభూతమున తేజస్సుచే పరమేశ్వరుడు తన ప్రజను భరించుచున్నాఁడు. (68,69) పార్థివమయిన ఈశానుని శరీరము భూతజాలమున కంతటికీ ముఖ్యప్రాణము. ముఖ్యప్రాణ వృత్తులతో సహా సర్వభూత శరీరములయందు పార్థివ తనువు పోషించుచున్నది. (70) పశుపతీ శరీరము, తీసిన ఆహారమును, త్రాగిన పానీయములను, భూతముల యుదరములలో సున్నవానినీ, పచనము చేయును, జీర్ణమొండ జేయును. వండునట్టిది 'అగ్ని' అనంబడును. (71)
శరీరములో వాయువు యొక్క సులభ సంచారార్థము గల ప్రదేశములు (వివరములు, రంధ్రములు) భగవానుని శరీర నిర్మాణ మొసంగును ఆ శరీరమును 'భీమ' అందురు. బ్రహ్మవాదులయిన బ్రాహ్మణుల స్థితి చైతన్యవశమున ఆరంభమగును. (ఉపక్రమించును) ఆ తనువు ఉగ్రసంబంధి. అందుచే ఆరంభమొనర్చినటిందు 'ఉగ్రుడు'గా స్మరింపఁబడుచున్నాఁడు. (72,73) సంకల్పించునది, ధ్యానించునది, ప్రజలలో సుపస్థితమై యున్నట్టిదియు నయిన తనువు యొక్క భాగము మానసిక శరీరము అదియే చంద్రుఁడు, అయ్యది భూతజాలముల స్థిరపడి యున్నది. పునః పునః జన్మించీ అతఁడు 'నవో నవో' భవతి (దీనదినవృద్ధి నొందును). (74) ఆ చంద్రముఁడు యథా కాలములో (ఉచితకాలమున) విబుధులచే అంభః ప్రసూతియైన చంద్రుఁడు అంతర్గతస్థితామృతుండై మహాదేవునిగా స్మరింపఁబడును. (75) ఆ నీలలోహితుని ప్రథమతనువు 'రౌద్రి'గా కీర్తింపఁబడినది. దాని పత్ని సువర్చల, ఆమె కుమారుడు శనైశ్చరుఁడు అతడే శని (76) భవుని యొక్క ద్వితీయతనువు ఆపస్సు (నీరుగా స్మరింపఁబడును. దాని భార్య ధాత్రి. పుత్రుడు ఉశనుఁడు (శుక్రుఁడు). (77) శర్వునీ మూఁడవ శరీర నామము భూమీ. దానీపత్నీ వికేశి, తత్పుత్రుఁడంగారకుఁడుగా స్మరింపబడుచున్నాడు. (78) ఈశానుని చతుర్థనామము, వాతము (వాయువు) అదీ వాయుతనువు. దానిపత్ని (ఆతనువు యొక్క) “శివ” ఆనీలునకు ఇద్దరు కుమారులు, ఒకఁడు మనోజవుడు మనస్సుతో సమానమయినవేగము గలవాఁడు). రెండవ వాఁడు అవిజ్ఞాతగతి తెలియబడనీ గమనము కలవాఁడు). అగ్ని పశుపతి శరీరముగా బ్రాహ్మణులచే స్మరింపఁబడినది. స్వాహా ఆతని భార్య. స్కంధుడు ఆమె కుమారుడు.
ఆతని ఆరవతసువయిన భీమా ఆకాశముగా చెప్పఁబడుచున్నది. (81) దిక్కులా తనువు యొక్క పత్నులుగా స్మరింపఁబడినవి. స్వర్గము దానీ కుమారుడు. ఏడవ తనువయిన ఉగ్రము దీక్షితుఁడయిన బ్రాహ్మణుడుగా (యజమానిగా) స్మృతుడు. దీక్ష ఆ తనువు పత్నిగాను, సంతానుడు దాని కుమారుఁడుగాను స్మరింపఁబడిరి. (83) ఎనిమిదవ తనువు మహత్తు. దానినే చంద్రునిగా స్మరించిరి. దాని పత్ని రోహిణి. ఆమె కుమారుఁడు బుధుఁడు. అతని ఎనిమిది శరీరము లీ విధముగా నామములతో సహితముగా కీర్తింపఁబడినవి. (84) ఈశ్వరుఁడు ఆయా శరీరములతో ఆయా నామములతో నమస్కరింపబడవలెను. సూర్యునీయందలి దేవతలు, నీరములు, భూమి, వాయువు, అగ్ని, ఆకాశము, యజమాని తమతమ నామములతో ఈశ్వరునకు నమస్కరింపవలెను. (85) తమ నామములతో సహితము ఆ ఈశ్వరుఁడు గొప్ప భక్తితో గౌరవింపబడవలెను. ఎవ్వడు పరమేశ్వరు నీ వీధముగా నామములతో, శరీరములతో తనువులతో) నెలుంగునో యతఁడు ప్రజావంతుం డగును, భవునితో సాయుజ్యము పొందును. (87) గుహ్యము (పరమ రహస్యమైన) భీముని యొక్క (ఈశ్వరుని) యశస్సు సాచే పేర్కొనపబడినది, ఓ బ్రాహ్మణులారా! ద్వీపదులకు (రెండు పాదములు - (కాళ్లు) గలిగినవారు) శుభమగు గాక! చతుష్పదులకు కళ్యాణమగుగాక! మహాదేవుని తనువులు, నామములు కీర్తింపఁబడినవి. ఇక భృగునీ సంతానమును గూర్చి వినుడు.
ఇది పోయుప్రోక్తమయిన శ్రీ బ్రహ్మాండ పురాణము నందు పూర్వభాగమున ద్వీతీయానుషంగ పాదమున మహాదేవ విభూతి వర్ణనమను దశమోమిధ్యాయము సమాప్తము.
Summary of chapter 10 of the Brahmānda Mahā Purana is as follows:
This deeply devotional chapter exalts the supreme glory of lord Śiva, recounting his sacred manifestation as Nīlalohita, the one adorned in cosmic blue and red. It affectionately enumerates his eight divine names and profound forms, each representing a foundational element of the universe from the earth to the eternal soul. Chanting and meditating upon these divine attributes, the devoted heart is filled with pure ecstasy, recognizing Śiva as the benevolent protector and the ultimate essence of all creation.