బ్రహ్మాండ మహా పురాణము
33 - తైలోక్యవిజయమంత్రకవచము
సగరుఁడిట్లభ్యర్థించెను :-
‘గోపీజన’ పదము యొక్క తుదను ‘వల్లభాయ’ అని సముచ్చరించవలెను. అయ్యది ‘స్వాహా’తో అంతము కావలెను. ‘గోపీజన వల్లభాయ స్వాహా” ఇది పది వర్ణముల మంత్రము. ఇది భుక్తిదము. ముక్తిదము. ఈ మంత్రమునకు ఋషి సదాశివుఁడు, ‘పంక్తి’ ఛందస్సు. దేవత కృష్ణుం డుగా చెప్పఁబడినది. తద్వినియోగము. ‘సర్వాప్తి’ కొఱకు. త్రైలోక్య విజయమను కవచమునకు ఋషి ప్రజాపతి, ఛందస్సు జగతి. (పండ్రెండక్షరములు) దేవత స్వయముగా రాజేశ్వరుండే త్రైలోక్య విజయప్రాప్తి వినియోగముగా కీర్తింపఁబడినది. (ఇఁక న్యాసము చెప్పఁబడుచున్నది). ఓం కృష్ణాయనమః మమ శివః పాతు. కృష్ణాయ స్వాహా మమతారకాం హరయే నమః. హే కృష్ణ పాతుమే నేత్రే కృష్ణాయస్వాహా మమతారకం పాతు. హరయే నమః భ్రూలతాంపాతు సదా ఓం గోవిందాయ స్వాహా ! మమ నాసికాం సతతం పాతు, గోపాలాయ నమః మమ గండం సతతం పాతు. క్లీం కృష్ణాయ నమః మమ కర్జీ కల్పతరుః పాతు. (కల్పవృక్షము కరముల రక్షించుగాక). ఓం కృష్ణాయనమః నిత్యం మే అధరయుగ్మకం పాతు. (పెదవుల జంటను రక్షించుగాక!) ఓ గోపీశాయ స్వాహా ! మమ దంతపంక్తిం అవతు. త్ర్యక్షర మంత్రమయిన ‘శ్రీకృష్ణ’ నా దంతముల మధ్య నున్న ఛిద్రమును రక్షించుగాక. (నోటిని) ‘ఓం కృష్ణాయ స్వాహా’ మే జిహ్వికాం పాతు (నాలుకను) రక్షించుగాక, రామేశ్వరాయ స్వాహా ! మే తాలుకం సదా పాతు. రాధికేశాయ స్వాహా! మే కంఠం పాతు సర్వదా, నమో గోపీగణేశాయ స్వాహా. మే గ్రీవాం సదా పాతు, (కంఠమును) ఓం గోపేశాయ నమః స్వాహా ! మే స్కంధౌ సదా పాతు. (భుజములను) నమః కిశోరవేషాయ స్వాహా! మమ పృష్ఠం సదా పాతు (వీపును) ముకుందాయ స్వాహా! మే ఉదరం పాతు సదా (కడుపును) హ్రీం, శ్రీం, క్లీం కృష్ణాయ స్వాహా ! మే కరౌ పాతు సర్వదా. ఓం విష్ణవే నమః స్వాహా ! మమ బాహు యుగ్మం పాతు. (15)
ఓం హ్రీం భగవతే స్వాహా ! మే నఖపంక్తిం సదా పాతు. (గోళ్లవరుసను) నమో నారాయణాయ స్వాహా ! మే నఖరంధ్రమవతు ఓం శ్రీం పద్మనాభాయ స్వాహా మే నాభిం సదావతు. ఓం సర్వేశాయ స్వాహా మమకేశాన్ అవతు. నమః కృష్ణాయ స్వాహా మమ బ్రహ్మరంధ్రం సదావతు. ఓం మాధవాయ స్వాహా మమ ఫాలభాగం సదావతు. ఓం హ్రీం శ్రీం రసికేశాయ స్వాహా కటిం మమ అవతు. ఓం నమో గోపీజనేశాయ స్వాహా ఊరూ మమ పాతు. (తొడలు) ఓం నమో దైత్యనాశాయ స్వాహా మమ జానునీ అవతు. (పిక్కలు) ఓం యశోదానందనాయ స్వాహా మమ జంఘకే, అవతు. ఓం రాసారంభ ప్రియాయ స్వాహా మమ హీం అవతు (సిగ్గు అభిమానము). ఓం వృందా ప్రియాయ స్వాహా సకలాంగాని మే అవతు. ఓం పరిపూర్ణమనాః కృష్ణః ప్రాచ్యాం మాం సదావతు (తూర్పుదిక్కు), స్వయం గోలోకనాథో మాం ఆగ్నేయ్యాం దిశి రక్షతు. (22) పూర్ణ బ్రహ్మ స్వరూపః దక్షిణే మాం అవతు. కృష్ణః నైరుత్యాం మాం పాతు. హరిః మాం పశ్చిమే పాతు. గోవిందః మాం వాయవ్యాం పాతు. రసికేశ్వర ఉత్తరే. మాం పాతు. బృందావనవిహారకృత్ ఐశాన్యాం మే. పాతు. వృందాప్రాణేశ్వరః ఊర్ద్వదేశతః పాతు (పై నుండి రక్షించుగాక). బలిధ్వంసీ మహాబలః సదా. మాం అధః పాతు. నృసింహః మాం జలే, స్థలే, అంతరిక్షే పాతు. మాధవః - మాం స్వయం స్వప్నే జాగరణే చ పాతు. సర్వాంతరాత్మా నిర్లిప్తః మాం సర్వతోవిభుః పాతు. ఓ రాజా! ఈ విధముగా నీకు సమస్త పాప సంఘ వినాశనకరమయిన కవచమును చెప్పితినీ, ఇది త్రైలోక్య విజయ నామకవచము. పరమేశ్వరుఁడయిన శివుని ముఖము నుండి నేను వింటిని. ఎవ్వనికి చెప్పరాదు. ఎవ్వఁడు గురువును అభ్యర్చించి విధి పూర్వకముగా కందము నందుగాని, దక్షిణ బాహువు నందుగానీ, ఈ కవచమును ధరించునో అతఁడు విష్ణువు. సంశయములేదు.
ఎచ్చట భక్తి తత్పరుఁడయి ఈ కవచ సాధకుఁడు నివసించునో అచ్చట లక్ష్మీ సరస్వతులు స్థిరముగా నివసింతురు. ఎవ్వడీ ‘కవచ సిద్దిని పొందునో యతఁడు జీవన్ముక్తుఁడు. సంశయము లేదు. కోటీ సంవత్సరములు పూజచేసిన ఫలమును పొందనగును. బహు సహస్ర రాజసూయ యాగములనుగాని, వందలాది వాజపేయ యాగములను గాని, మహాదానములని యొవ్వి పేరు పడ్డవో యట్టివిగాని, భూప్రదక్షిణమునుగాని, చేసినను, త్రైలోక్య విజయనామక కవచము నుపాసించిన వచ్చు ఫలితములో పదియారవ భాగమునకయినను అర్హులు కారు. (32) వ్రతోపవాస నియమములుకాని, స్వాధ్యాయాధ్యయనములుగానీ, సర్వ తీర్థముల యందు స్నాన మాచరించుటకాని పదీయారవభాగమునకయినను నర్హములు కావు. కవచోపాసనమున సిద్దీ పొందిన సాధకుఁడు, సిద్ధత్వము, అమరత్వము, శ్రీహరి యొక్క దాసత్వము సర్వము నిశ్చయముగా పొందును. దశలక్ష సంఖ్య ఈ మంత్రజపము చేసినట్టిఁడు సిద్ధకవచుడగును. సిద్ధ కవచుఁడయినపొండు నిశ్చయముగా విజయవంతుఁడగును ఓ రాజా! రాజ్యమునయిన నీయవచ్చును, శిరస్సులైన నొసఁగవచ్చును. ప్రాణములనయిన నీయవచ్చును, ఓ వత్స, ఎట్టి విపత్పరిస్థితులలోనైనను ఈ కవచము . నీయరాదు. ఓ కులభాస్కర ! వంశోద్దీపక ! వీరందరిని రక్షించుటకై నాచే నియ్యది నీకు ప్రకాశిత మయినదీ అదీకాక నీవు నా యాజ్ఞను ఆచరించుటవలన ఓయీ! ఈ కవచమును నీవు ధరించి, చక్రవర్తి వగుదువు.
ఇది వాయుప్రోక్తమయిన శ్రీ బ్రహ్మాండ మహా పురాణమున మధ్యమభాగమున, తృతీయోపాద్ఘాతపాదమున భార్గవచరిత్రయందు ముప్పదిమూఁడవ అధ్యాయము.
Summary of chapter 71 of the Brahmānda Mahā Purana is as follows:
This radiant chapter chronicles the emergence of the Yadu dynasty, founded by the virtuous prince Yadu who received his father's special blessings for his nobility and spiritual wisdom. It traces the flourishing branches of the Yādavas, who were destined to welcome the supreme lord himself into their royal clan. The devout heart rejoices in reading these sacred genealogies, knowing that every branch of this lineage was sanctified by divine presence.