11 - లలితోపాఖ్యానమున భండాసురప్రాదుర్భావమను ఏకాదశాధ్యాయము 

అగస్త్యుడనెను: భండాసురుడెట్లు జన్మించెను. త్రిపురాంబిక గూడ ఎట్లు జన్మించెను. ఆమె భండాసురునేవిధముగ జంపెను. విస్తరముగా జెప్పుము-1. హయగ్రీవుడనెను. పూర్వము తన తండ్రియజ్ఞమును వినశింపజేసిన దాక్షాయణిని వదిలి శివుడు ఆత్మలోనాత్మను జూచుచు, జ్ఞానానందరసస్వరూపుడై అద్వంద్వగుణలక్షణుడయ్యెను. అపుడు మునులాతనినుపాసించుచుండిరి-3. తరువాత హిమవత్పర్యంతమున గంగాతీరమునందు ప్రవేశించెను. ఆ దాక్షాయణియు చిరకాలము శంకరునారాధించి మనస్విని-4. యోగముతో తన శరీరమును జాలించి హిమవత్పర్వతరాజునకు కూతురుగానయ్యెను-5. ఆ హిమవంతుడును నారదునితో. నీకూతురు రుద్రుని భార్యయగునని విని రుద్రాణీయను తనకన్యకను రుద్రుని శుశ్రూషకై రుద్రుని కడనుంచెను-6. ఈ మధ్యన దేవతలు తారకాసురునిచే పీడింపబడిరని బ్రహ్మ వారికి జెప్పగా దేవతలు మన్మథుని బిలిచి యిట్లనిరీ-7. సృష్టికి మొదట, సమస్త ప్రజలను సృష్టించుచున్నను బ్రహ్మకు మనమున తృప్తి కలుగలేదు. మనోవాక్కాయకర్మలతో తపమాచరించెను-8. అంత, భగవంతుడైన జనార్దనుడు (విష్ణువు) సర్వప్రాణులకు వరము లిచ్చువాడు లక్ష్మీదేవితో ప్రసన్నుడయ్యెను. వరమును గోరుకొమ్మనెను-9.

బ్రహ్మయనెను : ఓ భగవన్ హరీ! నీవీ నా సృష్టితో సంతుష్టిజెందీతి వేని, నీయనుగ్రహమున నిరాయాసముగనే చరాచరమైన జగమునంతయు సృజించెదను-అని బ్రహ్మయనగా విష్ణువు లక్ష్మీదేవిని జూచెను. అపుడు (మన్మథుడు) జగన్మోహన రూపముతో జనించెను-11. సంతుష్టుడైన హరి యాతనికాయుధముగా పుష్పబాణములను చెరకువిల్లును విజయత్వమును అజేయత్వమును ప్రసాదించెను12. స్వకర్మకారణముగా ఈ మన్మధుడు ప్రాణులను సృజించును. సాక్షిపై యో బ్రహ్మా నీవు స్వజనముతో సుఖముండుము. -13. ఈ విధముగా వరమీయబడిన బ్రహ్మ నీయందు (మన్మధునీయందు) ఆ సృష్టిభారముంచీ మానసికముగా బ్రహ్మ యిప్పటికీని సుఖసంతోషములతో నుంటున్నాడు-14. కావున ఓ మన్మథా! నీ బలవీర్యము వ్యర్థముగానిది. నీ పరాక్రమము గూడ వ్యర్థముగానిదీ-15. సుకుమారములైన నీ పుష్పబాణములు గూడ నెల్లప్పుడును, వ్యర్థముగానివే! ఇక బ్రహ్మదత్తవరుడైన యీ తారకుడను రాక్షసుడు -16. సకలలోకములను విశ్లేషించి మమ్ములను సైతము బోధించుచున్నాడు.. శివపుత్రునివల్ల, దప్పమరెవ్వరి నుండియు నాతనికి భయము లేదు-17. నీవు దప్ప నీ పనిలో మరొకడు మాటాడలేడు. నీకు నీస్వహస్తముననే యాకార్యము నెరవేరును. మతెచ్చుట నుండియుగాదు-18. ప్రస్తుతము రమ్యమైన హిమాచలముపైన మునులా వరించి యుండగా శివుడు ఆత్మైక్యధ్యాననిరతుడైయున్నాడు. గౌరితో గూడనున్నాడు-19. కావుననీబాణ ప్రభావమున శివుని గౌరీయందు నియోగింపుము.. దాని వలన వారికి పుత్రుడు గలుగును. ఈ చీన్నీకార్యమును జేసి ఓ మహాబలా! మన్మథా! మమ్ముల (దేవతల)గాపాడుము-20.

ఈ విధముగా దేవతలభ్యర్థింపగా వారిచేత పొగడబడుచు మన్మథుడు తన వినాశనమునకు హిమాలయతటమునకు బోయెను-21. ఏమియో ఆరాధించుచున్నవాడు ధ్యానమువలన మూసిన కన్నులు గలవాడు, కూర్చున్న వాడునైన యీశ్వరుని జూచి తన యాయుధమైన. పూవిల్లునెక్కుపెట్టెను-22. ఇంతలో హిమవంతుని కూతురు, అద్భుత రూపధారిటీయై పుష్పోపహారములతో బూజింపదలచి శివునికడకు వచ్చెను. శివుని సేవించుటలో మునిగిన యాపార్వతిని అతి బలుడైన మన్మధుడు జూచెను-24. సర్వప్రాణులకుగనబడకుండ శివునకు సమీపముననే యుండి మన్మథుడు తన శ్రేష్ఠములై (వాడియైన) పుష్పబాణములను మహేశ్వరుని గ్రుచ్చుకొనునట్లు ప్రయోగించెను-25. పుష్పబాణములు గ్రుచ్చిన శివుడు తన కార్యములను విస్మరించి మన్మథావిష్టమతయై గౌరిని జూడసాగెను. ఇదియేమీ వైపరీత్యమని యాలోచించి మరల ధైర్యమును వహించి (ఇంద్రియ చాపల్యమునరికట్టి) యెదుట కుసుమాయుధుడై సన్నద్ధుడైన మన్మథుని జూచెను-27. అతనిని చూచి శూలియైన శివుడు కోపించి ముల్లోకముల దహింపసమర్థమైన మూడవ కన్ను దెఱచి మకరధ్వజుడైన మన్మథుని దహించివైచెను-28. ఈ విధముగా శ్రీవునిచే తిరస్కరింపబడి దుఃఖించిన శైలరాజ పుత్రి తనతల్లిదండ్రులయనుమతినిటోంది తపముచేయుటకై వనము జేరెను-29. ఆ తరువాత ఆ మదన భస్మను జూచి చిత్రకర్ముడైన గణేశ్వరుడు ఆభస్మతో చిత్రాకారము గల పురుషుని సిద్దము - జేసెను ఆ విచిత్ర శరీరముగల పురుషుని రుద్రుడు తనయెదుటచూచెను. ఆ క్షణముననే యాతడు ఆకారముదాల్చిన మన్మథుని వలె ప్రాణము గలిగినవాడు (జాతజీవుడు) అయ్యెసు, ఆతడు మహాబలుడును, అతి తేజస్వీయును, సూర్యసమకాంతిగలవాడును నయ్యెను-31. చిత్రకర్మమైన గణేశుడు బాహువులతోనా పురుషుని కౌగిలించుకొని సంతసించెను. ఆ పురుష బాలకునకు-“మహాదేవుని స్తుతించుము. అతడు సర్వార్థ సిద్ధులనొసగువాడు”-32. అని చెప్పెను. ఇంత అంత అని చెప్పనలవి కాని బుద్దీగల గణేశుడు శతరుద్రీయమును ‘ఉపదేశించెను’. ఆబాలుడును శతరుద్రీయమును పూర్ణముగా జపించుచు నూర్లమారులు రుద్రునకు నమస్కరించేను-33. దానితో ప్రసన్నుడైన భగవంతుడగు మహాదేవుడు, వృషధ్వజుడునైన శివుడు బాలుని వరము గోరుకొమ్మనెను. ఆతడు శత్రుబల ప్రయోజనము నా బలముననుపయోగింపక నెరవేరకుండుగాక శత్రువు యొక్క సగము బలము నాలోజేరి, శత్రువునకుపయోగింపకుండుగాక కావున శత్రువు యొక్క ఆయస్త్ర శస్త్రములు మొదలగునవి వ్యర్థమగుగాక-కాని నా యస్త్రశస్త్రములు మొదలగునవి యట్లు వ్యర్థముగాకుండుగాక-35. అని వరమును గోరేను, అట్లేయని ప్రతిజ్ఞ చేసి, ఏదో ఆలోచించి ప్రభువైన శివుడు ఈతనికి అరువదివేలయేండ్ల వరకు మరల రాజ్యమునను గ్రహించెను-36. ఈ చరితమును జూచి బ్రహ్మ “భండ్ భండ్” అనియనెను. ఆ నామముతోనే యా పురుషుడు లోకములందు “భండుడు” అని చెప్పబడును-37. అని, వరములనిచ్చి ఆస్త్రములను శస్త్రములను ఇచ్చి మునిగణములతో సవరింపబడినవాడై యంతార్థనమందేను-38.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున ఉత్తరభాగమున లలితోపాఖ్యానమున భండాసురప్రాదుర్భావమను పదునొకండవయధ్యాయము -11.