బ్రహ్మాండ మహా పురాణము
7 - ఉపోద్ఘాతము
(ఈ ప్రకరణము గంధర్వాప్సరో విహగ, సర్ప, యక్ష, రాక్షస, పిశాచ, యాతుధానులు
మొదలయిన ప్రముఖ గణములను, ఇతర గణములను గూర్చి వివరించును)
సూతుఁడిట్లు చెప్పెను.
గంధర్వులు అప్పరసలు ముని యొక్క కుమారులు, వారిని పేర్లతోఁ దెలిసికొనుము. వారు భీమసేనోగ్ర సేనులు, సుపర్ణుఁడు, వరుణుం డు, ధృతరాష్ట్రుఁడు, గోమంతుఁడు, సూర్యవర్చసుఁడు, పత్రవంతుఁడు, అర్కపర్ణుడు, ప్రయుతుఁడు, భీముఁడు, చైత్రరథుడు విఖ్యాతుఁడు, సర్వజిత్, త్రయోదశుఁడు శాలిశిరుఁడు, పదునాలుగవవాఁడు పర్జన్యుఁడు, పదునైదవవాఁడు కలి, పదునారవవాఁడు నారదుఁడు. వీరు దేవగంధర్వులుగా మౌనేయులుగా కీర్తింపఁబడిరి. (1,4) వారీకి ఇరువది నలుగురు శుభ వతులయిన కనీయలయిన (చిన్నవారయిన) చెల్లెండ్రు అప్సరసలను నామములతో గలరు. వారు అరుణ, అనపాయ, విమనుష్య, వరాంబర, మిశ్రకేశ్, అసిపర్తినీ, ఆలుంబుష్క మారీచి, శుచికా, విద్యుత్పర్లా, తిలోత్తమా, అద్రికా, లక్ష్మణా, క్షేమ, దీవ్యా, రంభా, మనోభవా, అసితా, సుబాహూ, సుప్రియా, సుభుజా (5,7) పుండరీక, అజగంధ, సుదతీ, సురసా, ఆమె సోదరులు - సుబాహువు, విఖ్యాతులయిన హహో - హుహూలు, తుంబురుఁడు - వీరు నల్వురు గంధర్వ సత్తములుగా సంస్కృతులు. ఇట్లు ముని సంతానమయిన గంధర్వులు, అప్సరలు పేర్కొనంబడిరి. (8,9) లౌకికాప్పరలుగా - (భూలోకాప్సరలు) - హంస, సరస్వతి, సూత, కమల, అభయ, సుముఖీ, హంసపాది అనువారు చెప్పఁబడిరి. (10) ఇంకను తొమ్మండు గంధర్వులు అధికముగా కలరు(?) వారు హంస, జ్యోతిష్ణమ, ఆచార, దారుణ, వరూథ, వరేణ్య, వసురుచి, వారిలో నెన్మిదవది సురుచి, మఱియు విశ్వావసు. మహాభాగురాలు, దేవర్పులచేఁబూజితురాలు అయిన రీష్ట ముగ్గురు కుమార్తెలను గనెను. వారు అరూప, సుభగా, భాసి, మనువంతియు సుకేశియును, శుభవతులయిన తుంబురు కుమార్తెలు. ఈ యైదుగురిని పంచచూడలనీ (ఐదు జడలు గల యప్సరసలని) తెలియవలెను. అప్సరస లీవిధముగా పదిమంది - మేనక, సహజన్య, పర్ణిని, పుంజికస్థల, కృతస్థల, ఘృతాచి, విశ్వాచి, పూర్వచిత్తి, సుప్రసిద్ధ ప్రహ్లిచ, మరియు అనుప్లెచ. (11,15)
ఊర్వశిని పదునొకండవదిగా దలంతురు. ఆమె (ఊర్వశి) నారాయణుని వలనఁగలిగేను, ఆ నారాయణుఁడు అనాదినిధనుఁడు. ఆమె దోషరహితమయిన యవయవములు గలది. అనవద్యాంగి. స్వకులోచితమైన యవయవసౌందర్యము కలది. మేనక మేన యొక్క కన్య. సర్వాంగసుందరి. వీరందరు బ్రహ్మవాదినులు, మహాభోగులు ఈ విషయము లన్నీంటి నేఱుంగుదురు. (17) అప్సరలలో పుణ్యులయినవారు పదునల్గురు వారు ఆహృతులు, శోభవతులు, వేగవతులు, ఊర్జలు, యువతులు, సుచలు, కురవులు, బరులు, అమృతలు, ముదలు, మృగులు, రుక్కులు, భీరులు, శోభయంతులు. ఆహృతులు బ్రహ్మయొక్క మానసజాతలు, శోభవతులు మరుత్సుతలు వేగవతులు రిష్ట యొక్క కూతులు: ఊర్జలు అగ్ని సంభవలు. యువతులు సూర్యరశ్మి జాతలు : వీరు చాల సౌందర్యవతులు. పవిత్రులయిన కురవలు చంద్రుని కిరణములతో సహా పుట్టిరి. సుక్కులను అప్సరలు యజ్ఞము నుండి పుట్టిరి. కుశవతీ నుండి బరులు పుట్టిరి. అప్సరలు అమృతము నుండి పుట్టిరి. అందుచే వారిని అమృతలని తలంచిరి. “ముద'లు అనుపేరొందిన అప్సరలు వాయువు నుండి పుట్టిరీ, మృగులు భూమి నుండి పుట్టిరి. రుక్కులను అప్సరలు విద్యుత్తు నుండి పుట్టిరి. భీరులు మృత్యువు యొక్క కుమార్తెలు. శోభయంతులు కామము నుండి పుట్టిరి. పదునాలుగు అప్సరోగణములు వివరింపఁబడినవి. (24) భాస్వరలయిన అప్సరోగణములు బహు సహస్ర సంఖ్యాకములు. వారు దేవతలకు ఋషీశ్వరులకు పత్నులు. అంతియేకోక తల్లులు. (25) ఈ అప్సరసలందరు సుగంధయుతులు, నిష్పందలు. ఆవేశరహీతలు), అప్సరలందరికి సమభావలు. హరుఁడుకాక - దేవతల యందలి ఋషులయందలి అందరు కామముచే వారితో సంబంధము కలిగినవారే. కామ సంప్రయోగము కలిగినవారే. పర్వతుఁడు నారదుఁడు వారీ వలన పుట్టిరి. కాని, వారు దేవతర్ష సంయోగమున పుట్టియుండుటచే, పర్వత నారదులు దేవతలతో సమానముగా కలిపి చెప్పబడిరి. దేవతలయిరి. ఇంక మూఁడవది యొకతే యున్నది. ఆమె వారికంటే చిన్నది. ఆమె అరుంధతి. అరుణుఁడు గరుడుడు వినతకుమారులు, (29) గాయత్రీ మొదలగునవి వేద ఛందస్సులు. సుపర్ణుఁడు మొదలగు వారు పక్షులు. (ఋజువులు సన్నిహితమును నయినవన్నియు వ్యవహార్యములు)
కద్రూ నాగ సహస్రములను కనెను, వారే భూమిని భరింతురు. వారికి చాల పడగలు (ఫణులు) కలవు. వారందరు మహాత్ములు. వారు ఆకాశమున సంచరింపఁగలరు. (31) పారసంఖ్యేయులగుట వారి నామముల నన్నింటిని చెప్పుటలేదు. వారిలో ప్రధానులయిన వారి నామముల నేఱుంగుము. ఆ నాగములలో ప్రధానమయినవి శేషుఁడు, వాసుకి, తక్షకుఁడు. ఇతరములయిన ముఖ్య సర్పముల నామములు - అకర్ణుండు, హస్తీకరుండు, పింజరుడు, ఆర్యకఁడు, ఐరావతము, మహాపద్మము కంబలము, అశ్వతరము, ఏలాపత్రము, శంఖుఁడు, కర్కోటకము, ధనంజయము, మహాకర్ణము, మహానీలము, ధృతరాష్ట్రము, బలాహకి, కరవీరము, పుష్పదంష్ట్రుండు, సుముఖుఁడు, దుర్ముఖుఁడు, సూనాముఖుఁడు, దధిముఖుఁ డు, కాలీయుఁడు, అలిపిండకము, కపిలుఁడు, అంబరీషుఁడు, అక్రూరుఁడు, కపిడ్డకుఁడు, ప్రదుఁడు, బ్రహ్మణుఁడు, గంధర్వుఁడు, మణిస్టకుం డు, నహుషుఁడు, కరోముఁడు, మణి మొదలగునవి. కాద్రవేయులు చెప్పఁబడిరి. ఇంక ఖగ్లేయులను నేఱుంగుఁడు. (37) ఖత ఇరువుర పుత్రుల కనెను. వారు వికృతులు, పరుష ప్రతులు. పెద్దవాఁడు సంధ్యా సమయమున పుట్టెను. చిన్నవాఁడు పూర్వసంధ్యా సమయములో పుట్టెను. ఖశ తన పెద్ద కుమారుని ఈ లక్షణములతో కనెను. వాని చెవులలో నొకటి ఎల్లనిది. ఆతనికి 4 చేతులు శ్రీ కాళ్లు గలవు. ఆతఁడు తూలిపడెడువాఁడు. నడుచునపుడు ఊగిసలాడువాఁడు (ద్వీధాగతుడు) ఆతని శరీరము నందంతటను రోమములు కలవు. ఆతని యవయవములు స్థూలములు. ఆతని ముక్కు అందమైనది. ఆతనికి పెద్ద ఉదరము కలదు. ఆతని శిరస్సు స్వచ్ఛముగా నున్నది. ఆతనికి చెవులు పెద్దవి. ఆతని రోమములు ముంజగడ్డివలె నున్నవి. ఆతఁడు మహాబలుఁడు; ఆతని నోరుచిన్నది, నాలుక పెద్దది. పొడుగాటిది. ఆతఁడు బహుదంష్ణుఁడు; ఆతని గడ్డము పెద్దది; ఆతఁడు రక్తపింగాక్షపాదుఁడు. ఆతని కనుబొమలు స్థూలములు, దీర్ఘమైన నాసిక ఆతని మేడ్రము గుహ్యము. ఆతని కంఠము శీతీవర్లము. ఆతని పాదములు పొడుగు; ఆతనిది చాల పెద్ద ముఖము. ఇట్టి భయాతి భయంకరుఁడయిన కుమారుని ఖశ కనెను. (42) ఖశ ఆతని సోదరుని కనెను. ఆరెండవ వానీని ఉషః కాలాంత సమయమున కనెను. అతనికి మూడు తలలు, మూడు కాళ్లు మరియు మూఁడు చేతులు. ఆతని లోచనములు కృష్ణ వర్ణకములు. ఆతని శిరోజములు ఊర్ధ్వాగములుగా నిలబడి గిరసభారీ యుండెను. ఆతని మీసములు హరిత వర్ణములు. ఆతని శరీరము శిలా సన్నిభ కాఠిన్యము కలది. ఆతని చేతులు దీర్ఘములు. ఆతని ధ్వని పరుషము. ఆతని ముఖము (నోరు) చెవుల వరకు వ్యాపించియున్నది. ఆతనికి లావైన పెద్దముక్కు శరీరము పెద్దది. హ్రస్వకాయము; రీ కోరల వంటి పల్లు గలిగిన దంష్ట్ర ఆతని ముఖము ఆకారమున క్రమరహితము. ఆతడు శంకు కర్ణుండు. ఆతని నయనములు పింగళవర్ణములు. ఆతని జుట్టు జడలల్లుకొని యున్నది. ఆతనికి ద్వంద్వ పిండము కలదు. కండరములు తేరిన మాంసపు కండలు. ఆతడు మహాస్కంధుడు. మహోరసుడు. ఆతని ముక్కువిశాలముగా నుండును. అతనీ ఉదరము కృశము (పలుచన).
ఆతని కంఠము స్థూలము కాదు. కాని లోహిత వర్ణము, ఆతని మేడ్రము వ్రేలాడుచుండెను. ఇట్టి లక్షణము గల రెండవ వాని నామె కనెను. (47) పుట్టినవెంటనే కుమారులిర్వురు తమ శరీర ప్రమాణములలో వృద్ధి పొందిరీ. వానీ వాని కార్యక్రియా విషయమున వారి అంగములు దక్షిణములు (సమర్ధములుగా నుండెను. పుట్టిన వెంటనే వారి అవయవములు పరిమితులలో పెద్దవియయి, శక్తియందధికముకాగా, వారు వారి తల్లిని ఆకర్షింప మొదలీడిరి. ఈడ్చుటకు ప్రారంభించిరి. ఆ యిద్దరిలో పెద్దవాఁడు చాలక్రూరుఁడు. తల్లిని లాగీ ఈడ్చిపారవైచెను. ఆతఁడిట్లనియెను. ఓ అమ్మా ! మేము ఆకలిచే బాధపడుచున్నాము. క్షుధార్డులము. అస్థితులము. మమ్ము మేము రక్షించుకొనుటకై మేము నిన్ను మ్రింగి వేసెదము.” కాని చిన్నపాండతనిని ఆటంకపెట్టేను. అన్నను తన రెండు చేతులతో పట్టుకొని తన సోదరునీ ముందే, తల్లితో సతడిట్లనెను. “నీవే నీ పితరులకు సేవచేసి వారి క్షేమమును రక్షింపవలసిన వాఁడవు. కనీసము, నీవు నీ తల్లినైన రక్షించుము.” ఆ క్షణముననే పొరీ తండ్రి / వారీ ముందు ప్రత్యక్షమయ్యెను. వికృతా కారులయిన పుత్రద్వయమును జూచి, ఆతఁడు ఖశతో నిట్లనెను. తండ్రిని చూచిన వెంటనే ఆ కుమారులిద్దరు భయభ్రాంతులైరి. ఒక్కరుగా నిరువురు నేకీ భూతులయిరి. వారిరువురు స్వమాయచే తల్లి శరీరమున ప్రలీనులయిరి. (53) అంత ఆ ఋషి తన భార్యతో వీరిద్దరకు నీవేమి చెప్పియుంటివి? తత్త్వతః ఆవృత్తాంతమంతయును నాకుఁజెప్పుము, ఇదంతయు నీ వ్యతిక్రమమనెను. కుమారుఁడు కాని, కూతురుగాని, జన్మ సమయమున వారి తల్లివలె నుందురు. జనన సమయమున కుమారుఁడు తల్లి యెట్టి శీలవంతురాలో అట్టివాడే యగును. (55) భూమి యెట్టి వర్ణముతో నుండునో నిజముగా నీరును కూడా నారంగునే కలిగియుండును. తల్లుల శీల దోషముచే తను వారి యొక్క లక్షణముల వలనను, రూపముగుణముల చేతను, పిల్లలెక్కువగా ప్రభావితులగుదురు కాని పిల్లలందరు వారి వారి ఖ్యాతి వశమున భిన్నభిన్న భేదగుణములు గలిగిన వ్యక్తులయ్యెదరు. అని ఖశతో పలికి అప్రతిమప్రభావుఁడయిన యా ఋషి పుత్రులను పిలిచి, సౌమ్య వచస్సులతో, వారికి నామకరణము చేసెను. అప్పుడు మాతయైన ఖశ వారిరువురు తన్ను గూర్చి యేమి చేసియుండిరో చెప్పెను. ఆతఁడు తల్లి చెప్పినట్లు సరిపోవునట్టి ధాత్వర్ధములు గల నామములను వారికి తగినట్లుగా, తాను స్వయముగా వారి లక్షణములను గ్రహించినట్లుగా, షేర్లిడెను. (59) పెద్దవాఁడు 'ఓ తల్లీ ! మేము నిన్ను భక్షించెదము. అనెను. అందు 'యక్ష' అనే ధాతువు 'నమలుట' యను నర్గమున పాఁడబడెను. అందుచేనతఁడు యక్షుఁడాయ్యెను. ధాతువు 'రక్ష' అన్నది రక్షించు నర్థమున నున్నది. అందుచే నీ రెండవ కుమారుఁడు 'ఈ నీ తల్లిని రక్షించుము' అనుటచే ఆతఁడు 'రాక్షసుఁడు' అను నామమును పొందెను.
వారీ తల్లిని గూర్చి తద్విధమయిన వికృత క్రియను గమనించీ, అంతియేకాక వారియొక్క అనివార్యములయిన భవిష్యత్రియలను గమనించి ఋషి వారలకా నామములిడెను. పరీమృష్ట ధీమంతుఁడయిన (బుద్ధిశాలి) ఆ ఋషి క్షుధితులయిన ఆ యిర్వులను జూచి విస్మితుఁడయ్యేను. రక్తమును కొవ్వును వారలకు ఖశా భర్తయైన ఋషి వరముగా నొసంగెను. (64) “మీ యిరువురీ యొక్క హస్త స్పర్శ వలన సర్వత్ర రక్త ప్రవాహములు అసక్మాంస వసలు మీ కోరికను బట్టియగును.” మీకు రాత్రుల యందు భోజనము, విహారములు వినోదములు నగును. బ్రాహ్మణులు దేవతలు మీకాహారము. మీరు రాత్రుల యందధికబలవంతులై యుందురు. పగటిపూట మిక్కిలి బలహీనులై యుందురు. ఈ మీ తల్లిని రక్షించుఁడు. ఇదియే మీకు శాసించిన ధర్మము.” ఈ విధముగా కశ్యపుఁడు తనకుమారులతో పలికి అచ్చటనే అంతర్థానమొందెను. తండ్రి నిర్గమించెను. సహజముగానే దారుణస్వభావులయిన ఆక్రూరులిద్దరూ అకృతులు ప్రాణిహింసకులు, విపర్యయక్రియల యందు నిమగ్నులైరి. (68) వారు మహాబలశాలురు, మహాశక్తియుతులు, వారు మహాకాయులు దురాసదులు, ఇతరులకు స్వాధీనులగువారు కారు. వారు మాయావులు. వారు అదృశ్యులు. వారు చరించుచునే అంతర్థానము నొందఁగలవారు. (69) వారు కామరూపులు. కోరిన రూపమును ధరింపగలవారు వారు ఫరస్వరూపులు రోగరహితులు. వారి స్వరూపములకు, వీకృత లక్షణములకు నరములయిన ఆచారములతో సంచరింప గలరు. వారు మిక్కిలిగా బాధించునట్టివారు. వారు దేవతలను పితరులను ఋషులను గంధర్వులను కిన్నరులను, పిశాచములను, మనుష్యులను పన్నగులను, పక్షులను, పశువులను చంపి తినవలయునను నాత్రము గల వారు. వారు నిశలందు సంచరించెడివారు. వారిని జూచి యింద్రుని యనుచరులు సంక్షుణ్ణులు, (72) ఆ యిరువురిలో చిన్నవాఁడు ఒకప్పుడు తినుటకాహారమును సంపాదించుటకు సంచరించుచుండెను. ఆతఁడు తనయాహార వస్తువును తచ్చళ్లముచేతనే యనుసరించును. అర్థరాత్రమున నతఁడు “తానే ప్రభువు” అన్నట్లు సంచరించుచుండెను. అజుఁడు, షండుడు అను ఇద్దరు పిశాచములు ఆతని కెదురైరి. వారు కపి యొక్క పుత్రులు. వారు మహావీర్యులు. మహాశక్తికలితులు. వారు బూడిదగుమ్మిడికాయలవలె నుండిరి. (ఆకారమున). వారే పిశాచముల కన్నింటికీ పితరులు. వారిని గుండ్రని నేత్రములు పింగళ వర్ణములు. వారు భయోత్పాదకులు. వారి శిరోజములు రెల్లువలె పైకి నిగడ పొడుచుకొని యున్నవి. వారు వారి కుమార్తెలతో కూడి వచ్చుచున్నారు. వారు వారికి (ఆ కన్యలకు) తగిన భర్తల కొఱకు చూచుచుండిరి. ఆ కన్య లిద్దరు వారు కోరిన రూపమును పొందగలరు వారు ఆకలితో నుండిరి. ఆహారార్థము వెదకుచుండిరి. (76) వారా రాక్షసులను భక్షింపనెంచిరి.
కామ రూపములను స్వీకరింపఁగల ఆ రాక్షసులను వారు వారి ముందు చూచిరి. వారందరు పరస్పరము చూచుకొనిరి. ప్రతీయొక్కఁడు రెండవవానిని పట్టనెంచెను. ఆ పిల్లల తల్లిదండ్రులు (పిశాచములు) తమ కూతుండ్రతో “ఆతఁడు ప్రతిపదమున తొట్రుపడు చున్నాఁడు. ఆతనినీ పట్టుకొని, బ్రతికియుండగనే యిచ్చటకు తీసికొనిరండు” అనెను. అంత ఆ కన్యలిద్దరు వానిని వెన్నంట తరిమి పట్టుకొనిరి. చేతులతో నతనిని దృఢముగా పట్టుకొని తండ్రి సన్నిధికి తీసికొని వచ్చిరి. కన్యలచే పట్టుకొనంబడి తీసికొని రాబడిన రాక్షసుని చూచీ పిశాచు లిట్లడిగిరి. “నీ వెవ్వడవు. ఎవ్వరికి సంబంధించినవాఁడవు” అన నతఁడు సర్వమును చెప్పెను. ఆ రాక్షసుని యొక్క కార్య కలాపములను, ఆభిజాత్యములను విన్న పిమ్మట అజుడు, శండుడును తమ కూతుండ్ర నాతనికి వివాహమున సమర్పించిరి. (81) వారిరువురు వానీ కర్మచే సంతుష్టులు. తమ పుత్రికాద్వయము నాతనికొసంగిరీ. (82) ఆ కన్యలు రోదించుచున్నను, రాక్షసుఁడు వారలను పైశాచ సంబంధమయిన వివాహవిధులతో పెండ్లియాడెను, అజుఁడు శండుడును తమ కూతుండ్రకు ధన సంపదలను చదివించిరి. (83) ఈ కన్యక బ్రహ్మధన యను పేరుగలది (బ్రాహ్మణులు ధనముగా గలది. బ్రాహ్మణులు ఆమెకు శ్రేష్ఠమయిన ఆహార వస్తువులు. వారు ఆమె సహజమైన ప్రధానమయిన ఆహారము). (84) అజుఁడు తరువాత తన కూతురు యొక్క ధన సంపదను ప్రకటించెను. “సర్వాంగముల యందు వెంట్రుకలవలె వ్రేలాడు క్రిములు కలిగిన యీమె జంతుధన అను నామము కలది, ఈమె సర్వజంతువుల యొక్క టైశ్వర్యములను, ధనములను, గ్రహింపఁగలిగినది.” “జంతుధన' యనేడు నామము గల కన్యక యొక్క శరీరము నందంతటను సర్వాంగకేశపాశము కలదు. ఆమె పెద్ద గర్జనను సృష్టింపగలది. ఆమె యాతుధాన యనెడు పిల్లను కనెను. (86) ఆ కన్యక కూడ మహారవము గల్గించు శక్తి కలది. బ్రహ్మధన యనెడు కన్యక రక్తవర్ణ. రోమరహీత, ఆమె కూడ మహారవమును సృజింపఁగలదు. ఆమె కోక కూతురు. ఆమె బ్రహ్మధన ఆమె కూడ రవము చేయగలదు. (87) ఈ విధముగా పిశాచుల యొక్క సుతలు ఇద్దరు కూతుండగనిరి. వారి యొక్క సంతానమును వివరించెదను. దెలిసికొనుము. (88) యాతుధానకు హేతి, ప్రహేతి, ఉగ్ర, పౌరుషేయ, వధ, విద్యుత్పూర్ణ, వాత, ఆయ, వ్యాఘు, సూర్య అను పదిమంది రాక్షసులు సంతానము. మాల్యవంతుఁడు, సుమాలీ అనువారు ప్రతి కుమారులుగా గ్రహింపుము.
ప్రతి కుమారుఁడు శ్రీమంతుఁడు. ఆతఁడు పులోముఁడు అను పేరుతో ప్రఖ్యాతుఁడు. ఇంకొక కుమారుఁడు 'మధు' ఆతఁడు భయంకర రాక్షసుఁడు ఆతని కుమారుఁడు లవణుఁడు. (91) ఆ టవణుఁడు మహాయోగబలోపేతుఁడు. ఆతఁడు మహాదేవుని పూజించెను. ఉగ్రుని పుత్రుఁడు మహాపరాక్రమవంతుఁడు. ఆతడు 'వజ్రహా' నామమున విశ్రుతుఁడు. పౌరుషేయునకు మహాబల శాలులయిన యైదుగురు కుమారులు వారు పురుషులను తీను క్రూరులు. నరహింసకులు. వారి నామములు క్రూరుఁడు, వికృతుఁడు, రుధిరాదుఁడు, మేదాశుఁడు, వహశుఁడు అని వారి పేర్లు పరికీర్తింపఁబడినవి. వధ కు ఇద్దరు పుత్రులు. వారు దురాచారులు. వారి నామములు విఘ్నుండు, శమనుఁడు. విద్యుత్పుత్రుఁడు దురాచారుఁడు. అతఁడు రసన నామధేయుఁడు. రాక్షసుఁడు స్పూర్ట్స్ యొక్క క్షేత్రమున (భార్యకు) నికుంభుఁడను బ్రహ్మ రాక్షసుఁడు పుట్టెను. (95) వాత పుత్రుఁడు విరోధుఁడు ఆయ యొక్క పుత్రుఁడు జనాంతకుడు, వాస్తు యొక్క కుమారుఁడు నీరానందుఁడు ఆతఁడు క్రతువులకు విఘ్నము లాచరించెను. (96) సర్పుని యొక్క అన్వయమున క్రూరులు, సర్పములు, రాక్షసులు పుట్టిరి. యాతుధానులందరు వివరింపబడినారు. ఇంక బ్రహ్మధానుల గురించి యెఱుంగుండు. (97) బ్రహ్మధానాత్మజులు తొమ్మండుగురు వారు యజ్ఞా పేతుఁడు, ధృతి, క్షేముఁడు, బ్రహ్మాపేతుఁడు, యజ్ఞహుఁడు, శ్వాతుఁడు, అందుకుఁడు, కేలి, సర్పుఁడు (98) ఈ బ్రహ్మధానులకు చెల్లెండ్రు కలరు. వారు భయంకర బ్రహ్మరాక్షసులు. రక్తకర్ణి, మహాజిహ్వా, క్షమ, ఇష్టాపహారిణి. ఈ బ్రహ్మ రాక్షసులు (రాక్షసి స్త్రీలు) భూమిపై బ్రహ్మరక్షఃస్త్రీల వంశమున పుట్టిరి. ఈ విధముగా రాక్షసులందరు చెప్పఁబడిరి. ఇక యక్షుని యొక్క వారసులను పుత్రులను) నెఱుంగుండు, (100) యక్షుడు క్రతు స్థలను ప్రేమించెను. ఈ క్రతుస్థల పంచచూడ అప్సరల జాతిలో నొకతె. ఆ యక్షుఁడు ఆమెను పొందుటకే కాంక్షించేను. ఉపాయము లాలోచించుచు నతఁడు దేవోద్యానములను వెదకెను. ఆ దేవోద్యానములు వైభాజము, సురభి, చైత్రరథము, విశోకము, సుమనము, వనోత్తమమయిన నందనము. (102) జాతలాలసుఁడై యాతఁడు రమణీయములయిన యనేకోద్యానములను వెదకెను. తుట్టుతుదకు, ఆతఁడామెను నందనోద్యానమునఁ జూచెను. ఆమె ఇతరులయిన అప్సరఃకాంతల నడుమ ఆసీనురాలై యుండెను. వారలతో నవ్వుచుండెను. ఆమెను పొందుటకు నెట్టి యుపాయమును ఘటింపలేకపోయెను. తన రూపముచే నతఁడు దూషితుఁడు, స్వకర్మచే కూడ దూషితుఁడు. (104) ఆతడిట్లు తలపోసెను” సర్వభూతములు సర్వత్ర నన్ను అసహించుకొందురు. కారణము నేను హింసస్వభావుఁడను. అట్టిచో సర్వసౌందర్యాంగి యైన యామె నెట్లు పొందగలను? (105) అనీ ఆతనికొక ఆలోచన స్ఫురించెను. ఉపాయముతోచి దానిని వెంటనే ఆచరింపఁదలంచెను. ఆతఁడు గంధర్వుఁడయిన వసురుచి యొక్క రూపమును ధరించెను.
ఆ యక్షుఁడు అప్సరసల మధ్య నుండి క్రతుస్థలను గ్రహించెను. ఆమె ఆతనిని వసురుచియేయని యెంచి యిచ్ఛాపూర్వకముగా ఆతని - ననుసరించెను. (107) అపురోగణములు చూచుచుండగనే ఆతఁడామెను గాఢముగా ఆలింగనము చేసికొని, పుత్రర్థాము ఆమెతో (యక్షుఁడు) మైథున క్రియ యాచరించెను. వారందరు చూచుచున్నను వాఁడు శంకీంపలేదు. ఏలయన ఆదివ్యాప్సరసను పొంద ఆత్రముగా నుండెను. ఆ కారణమున వెంటనే కుమారుఁడు సద్యోజాతుఁడయ్యెను. ఆతడు పరిపుష్టములయిన అవయవములు గలిగియుండెను. ఆతఁడు వెంటనే పరిమాణమున ఎత్తున శరీరపుష్టి యందు వృద్ధి పొందెను. “ఆ పుట్టినవాఁడు నేను నాభిని. నేను రాజును' అని తండ్రికి నమస్కరించెను. (110) ఆతనికి ప్రత్యుత్తరముగా అతని తండ్రి “నీవు రజతనాభుఁడవు” అనెను. ఆ కారణమున మాతృరూపమున పీతవీర్యమున కుమారు డుదయించును. (111) కుమారుఁడు పుట్టగనే యక్షుఁడు తన రూపమును పొందెను. యక్షులు, రాక్షసులు, నిగూఢ రూపములలో నున్నను, (ప్రచ్చన్న రూపములలో నున్నను) వారి స్వతః సిద్దమయిన రూపములను నిద్రలో నున్నప్పుడు, కోపముతో నున్నప్పుడు, మరణమొందినప్పుడు, భయ భ్రాంతులైనప్పుడు లేదా అత్యంతానందహర్షములో నున్నప్పుడును పొందెదరు. మందహాస మొనర్చుచు గుహ్యకుఁడు (యక్షుఁడు) అప్పరసతో నీట్లనియెను. (113) “ఓ సుందరమైన ఆసనము కలదానా ! నీకు భద్రమగుగాక” నీ కుమారునితో సహా నా యింటికి రమ్ము. అని పలికి వెంటనే యక్షుఁడు స్వరూపమును ధరించెను. (114) ఆ రూపమును అప్సరసలు చూచిరి. సంక్రాంతలైరీ. నలుమూలలకు పరువెత్తిరి. క్రతుస్థల వెళ్లుచుండగా ఆమె కుమారుఁడామెననుసరించెను. ఆమెను మృదు వాక్యములతో అనునయించెను. ఆమెను గంధర్వాప్సరసల మధ్య కుంగొంపోయి తిరిగి వచ్చెను. ఆమె యక్షుల సముత్పత్తికి ప్రారంభముగా గమనించి అప్సరోగణములు క్రతుస్థలతోనీవు యక్షులకు జననివి.” అనిరీ, తరువాత యక్షుఁడు కుమారుఁడు అనుసరింప స్వస్థానమున కరిగెను. (117) న్యగ్రోధమొకటి యున్నది. దానిపేరు రోహిణము. అయ్యది యక్షులకు నీవాసము. వారందు శయనింతురు. అందుచే రోహిణమను న్యగ్రోధము (మట్టిచెట్టు) యక్షులకు నీవాసమనీ స్మరింపం బడుచున్నది. (118) యక్షుఁడయిన రజతనాభుఁడు గుహ్యకులకు పితామహుఁడు. ఆతఁడు మణివరను పెండ్లాడెను, ఆమె మృదు స్వభావురాలు. అనవద్యాంగి. అనుహ్లాదుడను దైత్యుని కూతురు. మణివరుఁడు స్వకీయావయవములయందు నిగ్రహము కలవాడగుచునే తల్లికి పుట్టెను. ఆమె మణిభద్రునీ కనెను. ఆతఁడో పరాక్రమమున ఇంద్రుని తో సమానుడు. (120) ఆతని భార్యలు ఇద్దరు అక్కచెల్లెండ్రు. వారి పేర్లు పుణ్యజనీ, దేవజనీ.
యోగ్యురాలయిన పుణ్యజనీ, మణిభద్రుని వలన ఇరువది నల్గురు పుత్రులను గనెను. వారు సిద్ధార్థుఁడు, సూర్యతేజుండు, సుమనుఁడు, నందనుఁడు, మండూకుఁడు, రుచకుఁడు, మణిమంతుఁడు, వసువు, సర్వానుభూతుఁడు, శంఖుఁడు, పింగాక్షుఁడు, భీరువు, అసోముఁడు, దూరసోముఁడు, పద్ముఁడు, చంద్రప్రభుఁడు, మేఘవర్ణుఁడు, సుభద్రుఁడు, ప్రద్యోతుఁడు, మహాద్యుతి, కేతుమంతుఁడు, దర్శనీయుఁడు మరియు సుదర్శనుఁడు. ఈ 24 (ఇరువదినల్గురు) కుమారులు పుణ్యజనికి కలిగిరి. (125) మణిభద్రునకు పుట్టిన వీరెల్లరు పుణ్యలక్షణులు. వారి పుత్రులు పౌత్రులు పుణ్యజనులు యక్షులు. (126) శోభావంతురాలయిన దేవజనీ మణివరునికి పుత్రులనుకనెను వారు పూర్ణభద్రుఁడు, హైమవంతుఁ డు, మణిమంత్ర వీవర్ధనుఁడు, కుసుపు, చరుఁడు, పిశంగుఁడు, స్థూలకర్లుఁడు, మహాముదుఁడు, శ్వేతుఁడు, విమలుఁడు, పుష్పదంతుఁడు, జయావహుఁడు, పద్మవర్ణుఁడు, సుచంద్రుఁడు, పక్షుఁడు, బలకుఁడు, కుముదాక్షుఁడు, సుకవలుఁడు, వర్ధమానుఁడు, హితుఁడు, పద్మనాభుం డు, సుగంధుఁడు, సువీరుఁడు, విజయుఁడు, కృతుఁడు పూర్ణమాసుఁడు, హిరణ్యాక్షుడు, సారణుఁడు, మానసుఁడు. మణివరుని కుమారులయిన ఈ యక్షులు గుహ్యకులుగా స్మరింపబడుచున్నారు. వారందరు సురూపులు, చక్కని వేషములు ధరించినవారు, మాలాధరులు. ప్రియదర్శనులు. (131) వారి పుత్రులు పౌత్రులు వందలకొలది, వేలకొలదియున్నారు. ఖశకు ఇతర కుమారులు కూడనున్నారు. వారందరు రాక్షసులు, కామరూపులు. (132) వారిలో ప్రధానులయిన వారిని వర్ణించుచుంటినీ. ఎళుంగుఁడు. వారి నామములను వినుఁడు, వారు లాలావి, క్రధనుం డు, భీముఁడు, సుమాలి, మధు, వీస్పూర్జనుఁడు, బృహజ్జిహృఁడు, మాతంగుఁడు, ధూమ్రతుఁడు, చంద్రార్కభీకరుండు,బుధ్నుండు, కపీలో ముం డు, ప్రహాసకుఁడు, పీడాపరుఁడు, త్రిశిరుఁడు, నిశాచరుఁడయిన వక్రాక్షుఁడు, త్రిశరుఁడు, శతదంష్ణుఁడు, తుండకోశ్వుడు, రాక్షసుఁడు (135) అశ్వుఁడు, అకంపనుఁడు, నిశాచరుఁడయిన దుర్ముఖుఁడు; వీరంరదు రాక్షసవరులు. విక్రాంతులు. వారు గణరూపులు. (136) వారు సర్వలోకచరులు. వారు దేవతలతో సమానమయిన క్రమము కలవారు. ఆమె కింకను బిడ్డలు కలరు. వారేడుగురు కూతుండ్రు, వారిని గూర్చి యథాక్రమము వివరింతును వినుఁడు. (137) వారు ఆలంబ, ఉత్కచ, ఉత్కృష్ణా, నీరృత, కపిల, శివ మహాభాగురాలైన కేశినీ; వీరేడుగురు అక్కచెల్లెండ్రు. వారి వలన సంతానము కలిగినది. ఆ సంతానము నుండీయే గణములు అవతరించిరి. వారి నుండీయే రాక్షస గణములుదయించిరి. ఆ రాక్షసులు లోకనికాయహంతకులు. యుద్ధ దుర్మదులు.
ఆలంబేయ మను రాక్షసగణము క్రూరమయినది. ఉగ్రమయినది. అట్లే ఔత్కచేయమను రాక్షస గణము క్రూరమే. ఔత్కార్టేయము శైవేయమను గణములు రాక్షసులలో నుత్తమములు, అట్లే నైరృతనామరాక్షసగణము త్ర్యంబకుని యొక్క అనుచరునిచే సృజింపఁబడెను. ఆత్ర్యబికానుచరుడు ప్రజాసర్గమున గణేశ్వరవరుడు. ఆనైరృతులు, వారు మిక్కిలి వీర్య వంతులు. వారికి అధికమైన శౌర్య సంపత్తు కలదు. వారి నాయకుఁడు విరూపకుండు మిక్కిలి ప్రఖ్యాతుఁడు ఆతనికి యోగశక్తులు కలవు. వారందరు ఉద్దతులు. అయినను మహాత్ములు వీరే వందలాది గణములుగా, సైన్యముగా నయిరి. వారు సాధారణముగా జగత్ర్పభువయిన శంకరుని అనుసరింతురు. కాపీలేయులను దైతేయరాక్షసులు దైత్యరాజయిన కుంభునిచే నుత్పాదీంపఁబడిరి. వారు మహాకాయులు. వారికి మహాబలము పరాక్రమము, వీర్యము కలవు. వినాశనము చేయు శక్తి కూడ కలదు. యక్ష రాక్షసులను వేటాక రాక్షస వర్గము కేశిని యందు మహాశక్తి మంతుఁడయిన కపిలునిచే నుత్పాదింపఁబడినది. (146) నీల యను నోక క్షుద్ర రాక్షసి కలదు. ఆమె కేశిని యొక్క కూతురు. ఆలంబేయ రాక్షస గణమునకు సంబంధించిన వారు నైలులని పేరొందినవారు పెక్కు రాక్షసులు సురసికుని వలన పుట్టిరి. వారందరు దుర్జయులు, ఘోరవిక్రములు. వారికి దేవలౌకిక లక్షణములు కలవు. వారు సమస్త భూతలమున సంచరింతురు. (148) వారీ సృష్టి (ఉత్పాదనము) అనంతసంఖ్యాకమయినదగుట వారిని గూర్చి చెప్పుటకు శక్యము కాదు. వికచ యనురాక్షసి నీల యొక్క కూతురు, ఆమె కుమారులు వికచులు మహాసత్త్వ పరాక్రములు. వారు నైరృతుఁడయిన విరూపకునిచే ఆమెయందు. త్పాదీంపం బడిరి. ఆ విధముగా కలిగిన సంతానము అత్యంత మౌరస్వభావులు. వారి నామములను యధాక్రమముగా వినుము, వారు వారి యొక్క కరాళదంష్ట్రలచే (వంకర కోరలచే) సుఖోరులు. వారు మహా కర్ణములచే పెద్ద పెద్ద పొట్టలచే వికృతులు. వారి వర్గములు హారకులు, భీషకులు, క్లామకులు, రేరవాకులు, పిశాచులు, వాహకులు, త్రాసకులు మరి ఇతరులు. వారందరు భూమీ రాక్షసులు. వారు జడబుద్దులు. పరుష స్వభావులు. క్రూరవిక్రములు. వారు వివిధములయిన ఆకారముల(దాల్చి ఇంతకుఁబూర్వము చూడబడనీ (అదృష్టపూర్వములయిన) ప్రదేశముల సంచరింతురు. వారిలో ఉత్కృష్ట బలసత్వులైన వారు ఖేచరులుగా స్మరింపఁబడుదురు. కాని వారు ఆకాశమున నొక కొంత పరిమిత ప్రదేశమునందే సంచరింతురు. ఈ విశ్వమునంతయు వందలాది వేలాది సంఖ్యగల వారిచే పరివ్యాప్తము. ఈ భూమీరాక్షసులు అనేక క్షుద్ర రాక్షసులు.(155)
నానా ప్రకారములతో, నానా దేశములు విభిన్న రాక్షసులచే సమాక్రాంతములు. సూక్ష్మముగా వచింప, వారు ఎనమండ్రు రాక్షసమాతలు. వారి అష్ట విభాగములు క్రమముగా వ్యాఖ్యానింపఁబడినవి. కొన్ని వర్గములు భద్రక నికరములు - వారందరు అజ్ఞానులచే కూర్పబడిరి. (157) వారు వందల కొలది వేల కొలది సంఖ్యా పరిమితులున్నారు. వారందరికి పూతన సామాన్యమాత, వారు సర్వభూత భయంకరులు. వారు మర్త్యలోక విచారిణులు. మనుష్యలోకమున చిన్న పిల్లల మరణములకు ఈ గ్రహములు కారణములు. వారు స్కంద. గ్రహాదులు - హోస్యులు, ఆపకులు, త్రాసకులు - మరికొందరు. (159) (వారందరు అప్రసిద్ధులు క్షుద్రులునైన రాక్షసులు). వారందరిని కౌమారులని యెఱుంగవలయును. పారందరు పిల్లల వసతులయందుందురు. వారు స్కంద గ్రహ విశేషులు. వారు మాయావులు, వారు లోక వినాయకులు. ప్రపంచమునకు అభ్యంతరముల గల్గించువారలు. వారు పూతనా నామక భూతములు లోకనాశకులు. లోకవినాయకులు. ఈ విధముగా గణ సహస్రములు ఈ భూమియందు సంచరించుదురు. (161) యక్షులు రెండు విధముల వారు : పుణ్య జనులొకరు - పూర్ణభద్రులుగా స్మరింపఁబడువారొకరు. అలకాధిపతి యక్షులకు రాక్షసులకు, నైరృతులకు, పౌలస్త్యులు, అగస్తులు అని పిలువబడువారికి రాజు. యక్షులు, మానవుల యొక్క మాంసమును, రక్తమును, క్రొవ్వును తమ చూపులచే త్రాగుదురు. (163) రాక్షసులు ఆయా వ్యక్తుల శరీరములందు ప్రవేశించి రక్తమును త్రాగుదురు. ఇంక పిశాచులు వ్యక్తుల శరీరముల నుండి రక్తమును పీడించి, పీల్చి త్రాగుదురు. దేవతలు సర్వ లక్షణ సంపన్నులు. వారు కాంతిమంతులు, బలవంతులు, ఈశ్వరులు (సర్వకార్య సమర్థులు). అంతీయేకాక వారు కామరూపులు - కోరిన రూపమును పొందగలరు. వారజేయులు. విక్రమవంతులు. వారు సర్వలోక నమస్కృతులు, (165) వారు సూక్ష్మస్వరూపులు, తేజస్వంతులు. పవిత్రులు. వారు యజ్ఞముల యందు పాల్గొందురు. ఈ లక్షణములు దేవతలవి రాక్షసులవి కూడ. గంధర్వులు అప్సరలు దేవతలకంటే మూడుపాదములు (ముప్పాలు) హీనులు అల్పశక్తిమంతులు. తక్కువవారు గుహ్యకులు రాక్షసులు గంధర్వుల కంటే మూడు వంతులు తక్కువవారు. పిశాచులు రాక్షసులకంటే ఐశ్వర్య విషయమున, మూడింతలు తక్కువవారు. ఈ విధముగ దేవ - గంధర్వర్యాప్సరసగుహ్యకరాక్షస - పిశాచులైన నలుగురుదేవయోనులు ధన-రూపఆయు-క్ష్మా-బల-ధర్మ-ఐశ్వర్య-బుద్దీ-తపః-శ్రుత-పరాక్రమములలో దేవాసురలకంటే ముప్పాలు తగ్గినవారు. (169) గంధర్వులతో ఆరంభించి, పిశాచులతో అంతమొందు నాలుగు వర్ణముల వారు దేవయోనులు. అందుచే వారికి భద్రమగుగాక ! ఇంక క్రోధావశాన్వయమును గూర్చి వినుం డు. (170) క్రోధ తన గర్భము నుండి జన్మించిన పండ్రెండుగురు కూతుండ్రకు తల్లీ, వారందరు పులహనుని భార్యలైరి. వారి నామములంబట్టి యెఱుంగుము. వారు - మృగి, మృగమంద, హరిభద్ర, ఇరావతి, భూతి, కపిశ, దంష్ట్ర, ఋషి, తీర్య.-
శ్వేత, సురమ, సురస వారందరు సువిశ్రుతులు. మృగీయొక్క సంతతి - హరిణములు, మృగములు (లేళ్లు) శశములు (కుందేళ్లు), న్యంకువులు, శరభములు, గురువులు, పృషంతములు (చుక్కలు గల లేట్లు). మృగమంద యొక్క సంతతి (బిడ్డలు - పుత్రులుగా) - ఋక్షములు (ఎలుగుదొడ్లు), గవయ మృగములు (ఒకజాతి ఎద్దులు), దున్నపోతులు (మహేషములు), ఉష్టములు (ఒంటెలు), వరాహములు (అడవి పందులు), ఖడ్గమృగములు, గౌరముఖములు (ఒకజాతి ఎనుబోతులు), పుట్టినవి. ఇంక హరి (హరిభద్ర) యొక్క పుత్రులు - వివిధవిధములయిన మర్కటములు - హరులు, గోలాంగూలములు, వానరములు, - కిన్నరులు, మాయులు, కింపురుషులు, సింహములు, వ్యాఘములు, నీలములు (నల్లని, నీలివర్ణము గల వృషభములు), ద్వీపులు (ఒక విధమైన పులులు), సర్పములు, అజగరములు (కొండచిలువలు), మొసళ్లు, మార్జారములు (పిల్లులు) ఎలుకలు, కప్పలు, నకులములు (ముంగిసలు) వలక్రములు (అరణ్య గోచర మృగములు). (177)ఆమె పులహుని వలన - హంసుని, (ప్రథమ పుత్రుఁడు), రణచంద్రుని, శతముఖుని, దరీముఖుని, హరీతుని, హరీవర్మను - {ఈ హరివర్న భీషణుఁడు, అయినను శుభలక్షణుఁడు), ప్రధితుని, మథితుని, హరిణుని, లాంగలిని - కనెను. (179) శ్వేత పదిమందిని వీరులయిన వానర పుంగవులను గనెను. వారు - ఊర్థ్వ దృష్టి, కృతాహారుండు సువ్రతుఁడు, వినతుఁడు, బుధుఁడు, పారిజాతుఁడు, సుజాతుఁడు, హరిదాసుఁడు, గుణాకరుఁడు మరియు శక్తి మంతుఁడయిన హేమమూర్తి. వీరందరు రాజులు. (181) వారి పుత్రులు, పౌత్రులును, బలవంతులు, సుదుస్సహులు. వారు సమరములందు దేవదానవ మానవులకు, యక్ష భూత పిశాచ రాక్షసులకు, శక్తిమంతమైన సర్వములకు జయింపబడనశక్యులు. వారందరజేయులు. వారికి మృత్యువు విషముచే గానీ, అగ్నిచేగాని, శస్త్రములచేగాని, ఇతరములైన వానివలన గాని, లేదు. (183) వారి సంచారము పృథివీ యందు, ఆకాశమున, పాతాళమున, జలమున, వాయువునందు నిర్లిరోధముగ సాగును. వారందరు అవినాశనులు. శక్తిమంతులు, వేగవంతులు నయిన ఆ వానరుల సంఖ్య అనంతము. వారిలో కొందరు దశకోటి సహస్ర సంఖ్యులు. కొందరు సాహస్రార్బుదములు; కొందరు మహారుద సహస్ర సంఖ్యులు. కొందరు శతార్బుద సంఖ్యులు. మరి కొందరు దశార్బుద సంఖ్యులు; మిగిలిన కొందరో శత సహస్ర కోటి సంఖ్యులు; కొందరు నియుత సంఖ్యులు (పదివేల కోట్లు), మరికొందరు నిఖర్వులు - మరికొందరు పదికోట్ల అర్బుద సంఖ్యులు. మరికొందరు అరువది కోట్లు; మరికొందరు, శతసహస్ర అద్బుదసంఖ్యులు. ఇంకను మిగిలిన వారు తొమ్మిది మహాపద్మ సంఖ్యులు. ఈ వానరులందరు కులీనులు. ఉత్తమ వంశములకు చెందినవారు. వారందరు తేజస్వులు, శూరులు, కామరూపులు, మహాబలులు; దివ్యాభరణవేషులు, బ్రహ్మణ్యులు (బ్రాహ్మణులు) బ్రాహ్మణ భక్తులు, వారాహీతాగ్నులు. (186) వారు సర్వ యజ్ఞముల నాచరించువారు; వారు వందలు వేలు దక్షిణలుగా నీచ్చువారు; వారు కిరీటాలంకృతులు, శ్రవణ కుండల ధరులు, హారాలంకృతులు, భుజకీర్తులు (కేయూరముల) ధరించువారు; వారు వేదవేదాంగ విద్వాంసులు; నీతిశాస్త్ర విచక్షణులు, అస్త్ర ప్రయోగమోచనములందు, సంహార కర్మలందు నిపుణులు; దివ్యమంత్ర పురస్కారులు. వారు దివ్యమంత్ర పురస్కృతులు (పూజితులు) : వారు సమర్థులు, బలవంతులు, సర్వశస్త్రములచే ప్రహరింపఁగల దక్షులు. (192) 185 - 273 శ్లోకములలోను 319 - 328 శ్లోకములలోను ప్రత్యేకముగా వానరుల గూర్చి వివరింపఁబడినది. అందుచే శ్రీమద్రామాయణ ప్రభావము గోచరించెడిని. వాలి సుగ్రీవుల చరితలు చెప్పం బడినవి. ఆర్బుదము - ఒక వంద మిలియనులు, నిఖర్వము - ఒక వేయి మిలియనులు, పద్మము - ఒక వేయి మిలియనులు).
వారు దీవ్యరూపధరులు ; సౌమ్యులు; జరామరణరహితులు, అట్టి మహాత్ములయిన వానరకులములు పదివేలు కలవు. (198) విశ్వకర్మచే వారికీ నిపాసములు మేరు పర్వతపు నాలుగు పార్వముల, హేమ కూటమున, హిమాచలమున, నీల పర్వతమున, శ్వేత పర్వతమున, నిషధ పర్వతమున, గంధమాదన పర్వతమున పర్వత గుహలలో పర్వతముల మీద స్వయముగా సమకూర్చెను. వారి వాసములు సప్త ద్వీపములందు చెప్పబడినవి. (195) వారి నీవాసములు పురములు. ఆ పురములు వివిధాకారములలో గలవు. వివిధ ప్రకారమున నున్నవి. చక్కగా నలంకృతములు, అంతటను ఉద్యోనములు, అవి సర్వర్లురమణీయములు. వారి గృహభూములశయ్యాతలములు, పుష్పగంధపరీమళ సుఖోదీతములు. వారికీ దేవతా సంబంధమయిన (పూతలు) ఆలేపనములు కలవు. వారికి దేవతాభరణములు. వారి గృహములు సర్వరత్న సమాకీర్ణములు. అవి యన్నియు వారి మనస్సంకల్పసిద్ధిసంపన్నములు. పొనరులు - వారి భార్యలు దీవ్యాభరణ భూషితలు, భూషితలు.(198) వారు ద్రాక్ష సంబంధము మధురము సుధాభక్షానుమిశ్రీతమయిన దానిని త్రాగుదురు. వారందరు క్రీయామయులు. స్వర్గమందలి దేవతా వర్గములవలె వారు శక్తీ సముదితులు. వారందరు దేవ గంధర్వులలో ప్రధానులైన వారి పుత్రులు. వారు సుఖ రతులు. వారు ధార్మికులు, వారు తమకు గల వరములచే మిక్కిలి గర్వ సంపన్నులు. వారు యుద్ధములందు నేర్పరులు (శాండులు) మహాశక్తిమంతులు. (200) సర్వ జంతువులలో వారు క్షుద్రులు కారు. (నీచులుకారు) వారు బ్రాహ్మణులందు దేవతలందు భక్తి పరాయణులు. వార లేప్పుడు. అవిసి పోరు (పొడీపోరు - బలహీనులు కారు - అమ్లానులు), సత్యసంధులు; నానా విషయములలో వారు విశేషముగా వచించువారు, వారు మితభాషలు క్షమావంతులు; వారు ఆచార పరినిష్టితులు. వారందరు వనములకలంకారములు. బ్రహ్మయే స్వయముగా వారిని సృష్టించేను. (202) వానరులందరు లోకముల యందు భక్తి కోటకు సృజింపబడిరి. వారందరు రామకార్యము నందు సుబద్ధగుణులు. కపుల యొక్క అవతారము సర్వపాప వినాశనము. (203) ఇయ్యది ధన్యమయినది. పుణ్యమయినది. యశస్కరము. రమణీయము సుఖావహము. దానీనే కీర్తించెదను అతంద్రులై శ్రద్దగా వినుఁడు (204) ఊర్వదృష్టికి వ్యాఘఁడు పుట్టేను. ఆతఁడు మహాబలవంతుఁడు. వ్యాఘునికీ సోదరులు ఐదుగురు. చెల్లెండ్రు ఐదుగురు సోదరులు తమ చెల్లెండ్రను, పవిత్ర హృదయులు, అనురూప గుణాదులు కలిగిన వారు నయిన వానరులకు వివాహమున నొసంగీరి. అట్లే వ్యాఘుఁడు తన సోదరులకు అనుకూలురయిన శ్రీ బ్రహ్మాండ మహాపురాణమ్ భార్యలను పెండ్లి చేసెను. లోక విశ్రుతుఁడయిన శరభుఁడు కుమారుఁడు. శరభుని సోదరులు కూడ విద్వాంసులు వీర్యసమ్మతులు. (207) వారు వానరులకు రాజులు. సర్వ ధర్మ ప్రతిష్టితులు. శరభునికుమారుఁడు శుకనాముఁడు చాల బుద్ధి మంతుఁడు. మహాబలుఁడు. శుకుని కుమారుఁడు ఋక్షుఁడు మహాబలవంతుఁడు వ్యాప్తి ఉదరము నుండి పుట్టినవాఁడు. ఆతఁడు దురాసదుఁడు. ఆత్వడందుచే సర్వ వానరులకు చక్రవర్తి. సర్వశూరులకు అంగీకార్యుఁడు. ఆ ఋక్షుఁడు మహాతేజస్వి, సర్వ వానర యూధములకు ప్రభువు. శత్రు హంతకుఁడు, సర్వాస్త్రవిధి పారగుండు. వీరజుడు ప్రజాపతి. హేమ మయ వీభూషితురాలు, ఉత్తమ గుణగణయుత, తనకూతురునగువిరజను సర్వ గుణ విశిష్ఠుఁడయిన ఋక్షునకు విరజుఁడు స్వయముగా తీసికొని వచ్చి వివాహమున నొసంగేను. వానర యూధపుఁడయిన ఋక్షుఁడామె పాణిగ్రహణ మొనర్చెను. చారుహాసిని యైన యావిరజ అనవద్యాంగీ. సర్వసౌందర్యవతి. దర్శనీయ ప్రియదర్శను రాలయిన ఆమెను చూచి మహేంద్రుడామెనుప్రేమింపమొదలిడేను.
మహేంద్రునితోడ సంబంధమున విరజకు ఒక కుమారుండుదయించెను. ఆతఁడు వాలి. విక్రమవంతుఁడు. పౌరుషఖనీ, మహేంద్రునితో సమమైన పరాక్రమము కలవాడు, (214) అట్లే సూర్యుఁడును ఆమె వలన రహస్యముగా నొక సుతుని కనెను. ఆతఁడు సుగ్రీవుఁడు. వానర యూధపుండు. (215) వానర యూధపుఁడు ఋక్షుఁడు తన కుమారులనిద్దరను బల రూప శ్రీయా యుతులను చూచి అత్యంతానందము నొందెను. (216) ఆతఁడు బంగారు మాలిక గల తన జ్యేష్ఠుఁడగు వాలిని పట్టాభిషిక్తునిఁజేసెను, అభిషిక్తుఁడయి వాలి సుగ్రీవునిచే అనుగతుఁ డై స్వర్గమును ఇంద్రుఁడు పాలించినట్లు రాజ్యమును జేసెను. మహాత్ముఁడయిన వాలికి సుషేణుని యొక్క కూతురయిన తార భార్య. తార మహాప్రాజ్ఞురాలు. చంద్రునితో సమానమయిన సుందరమైన ఆననము కలది. ఆమె కనకాంగదుఁడు (బంగారు ప్రభుజకీర్తులుగల) అంగదుని కనెను. (219) అంగదునకు మైందుని యొక్క జ్యేష్ఠ కన్యయందు ఒక కుమారుఁడదయించెను. ఆతఁడో భీమ పరాక్రముఁడు. ఆతనీ నామము ధ్రువుడు. మహా యశస్వి. పవనుని కూతురు శుభకరురాలు నయిన రుమ సుగ్రీవుని యొక్క భార్య. ఆమె వలన సుగ్రీవునకు ముగ్గురు కుమారులుదయించిరి. వారు కీర్తిమంతులు. కుమారులకు స్వస్వరూపానుగతులను భార్యలను సమకూర్చి, సుగ్రీవుఁడు తన యనుచరులయిన వానరులతో వాలి పార్శ్వమునందే యుండెను. (222) ఉగ్రుఁడయిన సుగ్రీవుఁడు తన సోదరుడయిన వాలితో దేవుని వలె (అమరవత్) పెక్కు సంవత్సరములుండెను. కేసరి కుంజరుని కూతురయిన అంజనను భార్యగా బడసెను. పవిత్రురాలు యోగ్యురాలు అంజన పుంసవనమునకు వెళ్లెను. యౌవన భాగ్య గర్వితురాలయిన ఆమె కడకు వాయుదేవుఁడు వెళ్లాను. ఆమెతో ప్రేమ కలాపమాచరించెను. జగత్తునకు ఆయువు అయిన యావాయువు వలన ఆమెయందు హనుమంతుండుదయించెను. కేసరి కుమారులు భువియందు దీవియందు ప్రఖ్యాతులు. వారందరిలో జ్యేష్ణుం డు హనుమంతుఁడు. ఆతని తరుపోత వాఁడు మతిమంతుఁడు. మిగిలిన కుమారులు - శ్రుతిమంతుఁడు, కేతుమంతుఁడు, బుద్ధిమంతుఁ డయిన ధృతిమంతుఁడు. (226) హనుమంతుని సోదరులందరు అనురూపవతులయిన భార్యలనొందీ సుప్రతిష్టితులు, తండ్రి కుమారుల నందరను సుప్రతిష్టితులఁ జేసెను. వారందరు పుత్ర పౌత్ర సమన్వితులు. హనుమంతుఁడు బ్రహ్మచారి. ఆతడెవ్వతెను వివాహమాడలేదు. హనుమ సర్వలోకములతో రణమున యుద్ధము చేయు సముత్సాహ మొందెను. జవమున విస్తృత విజయములందు హనుము రెండవ గరుత్మం తుఁడు. అగ్ని పుత్రుఁడు నలుఁడు. బలవంతుఁడు; ఇతరులచే పరమ దుర్జయుఁడు ఆతడగ్నికి కనకబిందువువలనఁగలిగెను. నలుఁడు వానర పుంగవుఁడు. ఆ విధముగనే ఇతర వానర పుంగవులు కలరు. వారందరు బలవంతులు, మహాభాగులు. వారిలో ప్రధానులయిన హరియూధప యూదపుల నేఱుంగవలయును. ఆ వానర యూధపులు - తారుఁడు, కుసుముఁడు, పనసుఁడు గంధమాదనుఁడు, రూపశ్రీవిభవుఁడు, గవయుగ డు, వికటుఁడు, సరుఁడు, సుషేణుఁడు, సుధనుఁడు, సుబంధువు, శతదుందుభి.
వికచుఁడు, కపిలుఁడు, రౌద్రుఁడు, పారియాత్రుఁడు, ప్రభంజనుఁడు, కుంజరుఁడు, శరభుఁడు, దంష్టి కాలమూర్తి, మహాసుఖుఁడు, నందుఁడు, కందరసేనుఁడు, నలుఁడు, వారుణి, చీరవుఁడు, కరవుఁడు, తాముఁడు, చిత్రయోధీ, రథోతరుఁడు, భీముఁడు, శతబలి, కాలచక్రుడు, అనలుఁడు, నలుఁడు, యక్షాస్యుఁడు, గహనుఁడు, ధూమ్రుఁడు, పంచరథుఁడు, పారిజాతుఁడు, మహాదీపుండు, సతుపుఁడు, బలసాగరుండు, శ్రుతాయువు, విజయాకాంక్షీ, గురు సేవి, యథార్థకుడు, ధర్మచేతసుఁడు, సుహోత్రుఁడు, శాలిహోత్రుఁడు, సర్పగుఁడు, పుండ్రుఁడు, అవరగాత్రుం డు, చారురూపుఁడు, శత్రుజిత్తు. (237) (క్రింద చెప్పఁబోవు వారు కూడ వానరులలో ప్రసిద్ధులు), వికటుఁడు, కవటుఁడు, మైందుఁడు, బిందుకొరుఁడు, అసురాంతకుఁడు, మంత్రి, భీమరథుఁడు, సంగుఁడు, విభ్రాంతుఁడు, చారు హాసవంతుఁడు, క్షణ క్షణ మీ హారుఁడు, దృఢభక్తి, ప్రమర్ధనుఁడు. జాజలి, పంచముకుటుడు, బలబంధుఁడు, సమాహితుఁడు, పయఃకీర్తి, శుభుఁడు, క్షేత్రుఁడు, ఓందుకేతువు, సహస్రపాత్తు, నవాక్షుఁడు, హరినేత్రుఁడు, జీమూతుండు, బలోహకుఁడు, గజుఁడు, గవయనాముఁడు, సుబాహువు, గుణాకరుఁడు, వీరబాహువు, కృతి, కుండుడు, కృతకృత్యుఁడు, శుభేక్షణుఁడు, ద్వీవీదుఁడు, కుముదుఁడు, భాసుఁడు, సుముఖుఁడు, సురువు, వృకుఁడు, వికటుఁడు, కవకుఁడు, జవసేనుఁడు, వృషాకృతి, గవాక్షుఁడు, నరదేవుఁడు, సుకేతు, విమలాననుఁడు, సహస్వారుఁడు, శుభక్షేత్రుఁడు, పుష్పధ్వంసుఁడు, విలోకితుం డు, నవచంద్రుఁడు, బహుగుణుఁడు, సప్తహోత, మరీచీమంతుఁడు, గోధాముఁడు, ధనేశుఁడు, గోలాంగూలుఁడు, నేత్రవంతుండు. వీరు వానరులలో ప్రాధాన్యము వహించినవారు. ఈ వానరులందరు వారి వారి ప్రాధాన్యమును బట్టి వివరింపఁబడినారు. వారి నామధేయములనేక ములగుట వారిని వర్ణించుటకు శక్యము కాదు. వారలలో నొకొకఁడు పదికోట్ల యేనుగుల బలము కలవాఁడు. శత్రు తాపనుఁడయిన వాలీ ఈ వానర యూధములన్నింటికిని ప్రభువు. ఈ వానర యూధపులందరు సప్త ద్వీపములందున్నారు. వాలీ మాత్రము కిష్కింధలో నుండెను. మహా బలుఁడయిన వాలి ఒకసారి రావణుని ఓడించేను. ఆతనిని నతఁడు తన ఎడమ చేతితో పట్టుకొనెను. ఆతనిని తన ప్రక్క పెట్టుకొని (అదిమిపట్టి) యుంచి ధ్యానము నందుండెను. ఒక ముహూర్తకాలములో వాలి బయలుదేరి దక్షిణ పూర్వ పశ్చిమోత్తర సముద్రములను నాల్గు దిక్కులను ముట్టివచ్చెను. వానికి మనోవేగము వాయువేగము కలదు. ఆతనికి. శ్రమయన్నది లేదు. వ్యపగతశ్రముఁడు అంత దూరము ప్రయాణము చేసి వచ్చినను నతఁడు శ్రమ పొందలేదు. ఇంతటి పరాక్రమ వంతుఁడయిన వాలి రావణుని జయించెను రావణుఁడు స్పృహ తప్పి విహ్వలుఁడయి పడిపోయెను. వాలి వానీని తన పట్టు నుండి విడిచే యొక చెట్టు మొదట కూలవేసెను.
అధికమయిన బలముచే కఠినుఁడు కర్కశుఁడు నయిన వాలీ, చల్లని నీటిని రావణుని శీర్షము నుండి పాదపర్యంతము చల్లేను. రావణుం డు లబ్ది చేతనుఁడు కాగా వాలి ఆశ్చర్యచకితుఁడయ్యెను. రణము నందు ప్రచండుఁడయిన రాక్షసేంద్రునితో కపీశ్వరుఁడయిన వాలి, “భో ! భో! రాక్షసరాజేంద్ర ! మహేంద్రసమవిక్రమ ! నీవో అసంఖ్యేయములయిన బలములతో యోగ్యులయిన మంత్రులతో యముని జయించితివి. వరుణుని, కుబేరుని, చంద్రునీ, సూర్యదేవుని, అట్లే మరుద్గణములను, రుద్రులను, వరుణుని, కుబేరుని, చంద్రుని, సూర్యదేవుని, అట్లే మరుద్గణములను, రుద్రులను, ఆదిత్యులను, అశ్వినీద్వయమును, వస్తువులను, దైతేయులను, కాలకేయులను, మహాబలవంతులయిన దానవులను, సిద్దులను, అట్లే గంధర్వులను, యక్షులను, రక్షస్సులను, భుజంగములను, పక్షులలో శ్రేష్ఠములయిన వానీనీ, గ్రహ నక్షత్ర తారకులను, అట్లే వృద్ధి పొందిన జలదరితులయిన భూత పిశాచాదులను, మానవులను, రాజులను, వందల కొలది, వేల కొలది, జయించితివి. ఏవం విధమయిన గుణములను గలిగి,మనోవాయు సమ పరాక్రమము గలిగిన వారిని కలిగి యెట్లు నాచే జయింపఁబడితివి? వేగమున నీవు మనస్సులో వాయువుతో తుల్యుఁడవు. "మేరు పర్వతమును కదల్పంగల శక్తిమంతుఁడవే ! నీవు కృతాంతుఁడయిన మృత్యువు వలె ఆజయ్యుడవే! లోకమందలి పరాక్రమవంతుల నెల్లరను పలాయితులను గావించితివే ! వజ్ర తుల్యులయిన బలములను సమీకరించుకొని, పురములను జయించితినే! వజ్ర సమానులయిన నీ సైన్యములతో పర్వతములను నేలమట్ట మొనర్చితివే ! నీవో సప్త సాగరములను సప్త పర్యాయములు సంక్షోభింపఁజేసితివి. నీవు మహారథుఁడవు. నీకెట్టి వీకారము లేదు. నిర్వికారుఁడవు, జయము పొందుటలో ఆత్రమూని యుండెదవు. నీవు నీ బలము నందు విశ్వాసము గలవాఁడవు. బలవంతులలో బలివి. దుర్బలుఁడను, వానరుఁడను అయిన నాచే జయింపఁబడి సమాక్రాంతుఁ డవయితివే! నీవు బలవంతుఁడవు, దుర్జయుఁడవు అయికూడ ఏల నీ వీ విధముగా శపుఁడయితివి? ఏ కారణమున నీ విట్లయితివో, ఓ బ్రాహ్మణా ! ఓ రాక్షస పుంగవా ! చెప్పుము. (261) అభయము నీ కొసంగితిని. విశ్వసించుము. నీకెట్టి భయము లేదు !” అనెను. ప్రతాపవంతుఁ డయిన దశగ్రీవుఁడు వానీ పలుకులు వినెను. ఆతఁడు భయ సంవిగ్నుఁడు. వినయ పూర్వకముగా సాంత్వ పూర్వకమిట్లు పలికెను. “యుద్ధము నందు దేవతలు, రాక్షసులు, అందరు నాచే జయింపఁబడిరి. ఇదీ అసంశయమే. కానీ నీవంటి బలవంతుఁడింత వఱకు నాచే సచ్చటను చూడబడలేదు. అందుచే భయ రహితమయిన స్నేహమును నీతో నొనరింప గోరుచున్నాను. నా పక్షము నుండి శక్తిమంతుఁడైన యుద్ధ వీరుఁ - డెవఁడు నీతో యుద్ధము చేయఁడు.” ఇట్లు చెప్పఁబడి వాలి నీ పలుకులు సత్యమగుగాక” అనెను. (265) పూర్వమందే (ముందుగానే వారితో సంధి చేసికొని, రావణుఁడు తన సైన్యగణములతో సంతోషముగా లంక కరిగెను. (266) వాలీ పుష్కరమున యుద్దము నందు బలవంతుం డయిన రాక్షసేశ్వరుని జయించి, అనేకములయిన అన్నపాన సమృద్ధములయిన యజ్ఞములను చేసెను. యజ్ఞములలో అధికమయిన దక్షిణల నొసంగెను. వందల కోలఁది రాజసూయములను, నృమేధకములను, సర్వమేధములను సర్వదాన సమన్వితముగా ననేకము లాచరించెను, ఆతఁడు దేవతలను దేవేంద్రుని తర్పణముల సంతృప్తులను చేసెను.
వాలి బహు సంవత్సరములు బ్రహ్మను యజ్ఞ హోమాగ్నిచే సంతోషపరచెను. తమ్ముఁడయిన సుగ్రీవునితో సుఖవంతుఁడయ్యెను. అకుతో భయుఁడయిన వాలీ (భయమన్నది లేనట్టిఁడు) కపి రాజ్యమును పాలించేను. ఆతఁడు బ్రాహ్మణుల యెడ భక్తిమంతుఁడు. బ్రహ్మను అతఁడు ఉత్కృష్ట దేవతగా భావించెను.. ఆతఁడు ధర్మ క్రియా సేతువోయన వెల్లెను. సర్వ శాస్త్ర విశారదుఁడయిన ఫొలి బహు వర్షగణములు సుభించెను. వాలి యొనర్చిన యాగముల యందు దేవర్షియైన నారదుఁడీ శ్లోకమును ఆతనిని వర్ణించుచు పఠించెను. (272)
“యజ్ఞ హవనాదులందు, దానాదులందు జవమున, పరాక్రమమున త్రిజగములందు హేమమాలి వాలీ సదృశుడేవఁడు లేండు”
శాంశపాయనుండు పలికెను :
మహేంద్ర తనయుఁడు బలవంతుఁడునైన వాలి మహాప్రభావవంతుఁడు ! ఆతఁడు చక్రవర్తి. మహాప్రాజ్ఞుఁడు. వాలిని గూర్చి నీవు చెప్పితివి. వాలి సహస్రాదియజ్ఞముల నాచరించినవాఁడు. పరమదుర్జయుఁడు.
మార్తాండుటైయ్యెనో మాకు చెప్పుము. హేవీభో ! హేసువ్రత! దానియొక్క శాబ్ధికోత్పత్తిని యథాతథముగా చెప్పుము.
సూతుఁడిట్లనెను :
జీవరాశులు సృజింపబడుచుండ ప్రజాపతి మూఁడు లోకముల నుండి పరమమైన తేజస్సును తీసికొనివచ్చి, అదితి యొక్క హృదయమున ప్రవేశింపఁజేసెను. ఆ ప్రజాపతి మహాయోగ మహత్వ సంపన్నుఁడగుట, మొదట నా భగవానుఁడయిన ప్రజాపతి ఆ యదితీ గర్భమున నొక గ్రుడ్డును (అండమును) సృజించెను. ఆ యండమున శక్తిమంతమయిన గర్భముండెను. అయ్యది అతి మాత్రము వృద్ధి నొందెను. దేవత లందరు తేజో రహితులయిరి. అది తెలిసికొనిన తరువాత హృతలేజస్కులైన దేవతలు (279) వారందరు భయ భ్రాంతులైరి. ఓ ప్రభూ ! ఇది యెట్లు అయినది. దాని యొక్క బలము తేజస్సు సృష్టింపఁబడిన దానికంటే నధికముగా నున్నది. ఇంక మేమెట్లుండ" గలము? మేమందరమంత మొందినట్లే. ఇందున్న చరాచరములన సర్వ భూతములు అచిర కాలములో దగ్గపటలములు కాగలవు. ఇందు సందేహము లేదు. ఓ ద్వీజ సత్తమ ! ఆలోచించుము. అండములో నిక్షిప్తములయిన తేజో బలముల నుపసంహరింపుము. అయ్యదీ మాకు శ్రేయస్కరము కాఁగలదు. ఆ తేజస్సు యొక్క ప్రశస్తి ప్రభావము వెంటనే సర్వమును దహింపఁగలదు. ప్రజాపతి ఆలోచించెను. దానినతఁడు పైకి తీసి వేరొక యండము నందతఁడు బలమును ప్రవేశింపఁజేసెను. అప్పుడో ఆ శిశువు అండములో నుండెను. ప్రవేశ పెట్టబడిన శక్తియే యుండము. తత్తేజము శిశువుగా చెప్పుదురు. అయ్యది ఉదరము నుండి పైకి తీసి వేయబడినప్పుడు మృతపిండోపముగా నుండెను. (285)
అంత ప్రజాపతి దానిని పరిశీలించి, ఆ యండమును. రెండు భాగములుగ నొనర్చెను. ఆ రెండు శకలములను ప్రక్క ప్రక్కలఁబెట్టి చూడగా ఒక దానీయందు గర్భము దుర్బల భావముతో గూడి యుండెను. అయినను అది తేజో మయముగా నుండెను. వెంటనే యతఁడు దానిని తీసి అదితి తొడ పై పెట్టెను ఇట్లు చెప్పెను. “ఆతఁడదితికి పుట్టవలసియున్నది. కాని ఆతఁడు మృతుడై అంశముగా పుట్టియుండుటచే, బుధులాతనిని “మార్తండు' డని పేర్కొనిరి. ప్రపితామహుఁడయిన ప్రజాపతి ఆతని ముందు 'అయండమున అధికమయిన బలము కలిగించేను. ఆ యండము యొక్క కపాలములు రెండు అత్యంత బలము కలిగినవిగా భావింపఁబడినవి. (289) ప్రజాపతి (ప్రభువు}. ఆ రెండు అండకపాలములను వేరువేరుగా ఇరావతి నాభియందుంచి యామె కొసంగెను. సృజనేచ్చచే (సృష్టి కలుగవలయునను కోరికతో) ఆ యండ కపాలముల నామె యుదరములో ప్రవేశపెట్టెను, అంత ఇరావతికి బలవత్తరములయినవి లోక సమ్మతములయినవి దేవతా హోహనములై యుండుటకు అర్హములైనవి, మీక్కిలీ శక్తివంతములయినవీయునగు నాలుగు ఏనుగులు ఉదయించెను. అయ్యవి లోకముచే గౌరవింపఁబడెను. అయ్యవీ - ఐరావణము, కుముదము, అంజనము, వామనమును. వానిని గూర్చి విస్తరముగా మున్ముందు మీకు వివరించెదను. (292) సాక్షాత్ స్వకీయమయిన కిరణములతో ప్రకాశించునట్టి “సవిత' లోకమున ప్రధానుఁడు. దానికి కారణమని అధికమయిన తేజస్సు, అపరిమితమయిన బిలము. లోకాలోకాంతరముల బాహ్య ప్రదేశమంతయును చీకటీతో ఆవృతమై యున్నది. నిరాలోకము కాం రహితమునయిన యీ లోకమును భాసింపఁజేయునట్టిండు సవిత. ఓ ద్వీజులారా ! ఓ ద్విజసత్తములారా ! ఈ విషయమును పరాశర సూనుఁడయిన వ్యాసుని వలన విని యుంటిని. ఇంతకుఁ బూర్వమీయ్యదీ సనత్కుమారుని చేతను, వాయువు చేతను చెప్పండియున్నది. ఆ విషయమును గూర్చి బాగుగా విమర్శించి ఇతరులచే కూడ వేరు వేరుగా బహు విధముల వివరింపఁబడినది. (296) అమృతకల్పమయిన పురాణములను వినుట పుణ్యము, సర్వార్థ సాధకము. పురాణముల వినునట్టివారుజాత్యంతరశతమును పొందినను అభయముతో సంచరింతురు. (297) ఎవనీ గృహమున ఈ మార్తాండ కథయుండునో, ఆతనితో తుల్యుఁడు వేలోకఁడు లేఁడని గ్రహించుము, (298) ఆతనీ సంతానము అకాలమున నెన్నడును మరణమేందదు. ఋక్షుని యొక్క చెల్లెలు రక్ష అయ్యది యొక మీక్కిలి బలమయిన వానరము ప్రజాపతితోడి సంబంధమున నారక్ష యశస్వంతుఁడయిన జాంబవంతుని కనెను, ఆతఁడు శూరులలో నొకఁడుగా గ్రహింపఁబడెను. ఆతఁడు మిక్కిలి బుద్దీమంతుఁడయిన ఋక్షరాజు. (ఎలుగుబంట్లకు ప్రభువు), వ్యాఘ్యందాతని చెల్లెలు జాంబవతి కలిగెను. రాజీవ లోచనయయిన యామె తండ్రిచే వాసుదేవునకు (కృష్ణునకు) పత్నీగా నొసంగం బడెను. తరువాత ఋక్షరోజున కెందరో మహాబలులు పుత్రులు పుట్టిరి. పోరు, జయంతుఁడు, సర్వజ్ఞుఁడు, మృగరాట్, సంకృతి, జయుఁడు, మార్టారుఁడు, బలీబాహువు, లక్షణజ్ఞుఁడు, శ్రుతార్ధకృత్, భోజుఁడు, రాక్షసజిత్తు, పిశాచుఁడు, వనగోచరుఁడు, శంభుఁడు, శరభుఁడు, వ్యాఘుఁడు, సింహుఁడు అనువారు. వారికి పుత్రులు పౌత్రులు, వందల కొలది, వేలకొలది యున్నారు. ఈ ఋక్షముల యొక్క గణములే దేవతలచే దానవులచే పూజితులు. మార్జారులు మార్జారుని యొక్క వాదియొక్క పుత్రులు. (305)
వారు వందలు వేలుగా సంఖ్యలలోనున్నారు. వారందరు వీర్య సమన్వితులు, వారు శరభములకు మాంసాహారులయిన శ్వాపదాదులకు ఆచార్యులు. వారు చాలా శక్తిమంతులు. వారు మూషికముల యొక్క పక్షులయొక్క పృషదాదుల (మచ్చలున్న దుప్పులు) యొక్కయు మాంసమును భుజింతురు. వారెప్పుడును త్వరత్వరగా సంచరించుట యందును, ప్లవనము నందును గెంతుటయందును) సమర్ధులై యుందురు. వారు అన్నీ జంతువులను జంపెదరు, వారు గృహములందు పర్వత భాగములయందు వృక్షముల కోటరములందు గుహలయందు, గృహములయందు, గృహాంతరభాగములయందు వసించెదరు. (408) వారు వివిధములయిన రీతులు గల గతులలో సంచరింతురు. వారు చాలా తెలివైనవారు; గ్రామలందు కననగుదురు; అట్లే వారు వనములందును సంచరింతురు, సహజముగా వారు గ్రామ వనముల రెండింటి యందు సమానముగా సంచరింతురు. (309) వారు రాత్రులందు పగళ్ల యందు, సంధ్యా సమయముల యందు సంచరింతురు. వారు వివిధ వర్ణములలో (రంగులలో) నుందురు. వారు నల్లని మేఘవర్ణులు; కొందరు కపిల వర్ణులు; కొందరు అరుణవర్ణులు; కొందరు మెల్లకన్నులు కలవారు కొందరు నల్లని రంగువారు; కొందరు భక్తి చిత్రవర్లులు; మఱి కొందరు మచ్చలతో, చారలతో, వివిధములయిన రంగులు కలిగియుందురు. వారు భయంకరులు, నఖ డంప్లాయుధులు. అంతియే కాక నెమళ్లవలె కేకలు కూతలు వేయుదురు. (311) సరమకు ఇద్దరు పుత్రులు వారు శూరులు అత్యంత దుస్సహులు. వారి నామములు శ్యాముఁడు, శబలుఁడు వారిరువురు యమునీ యనుచరులుగా స్మరింపఁబడుదురు. వారిరువురియొక్క పుత్రులు దురాధర్పులు వారికి పుత్రులు పౌత్రులు కలరు వారి వంశము సారమేయులని (కుక్కలని) ప్రఖ్యాతి నొందిరి. (313) ఇప్పుడు, ఆజాతి జంతువులు ఘోరరూపులు మహాబలులు. వారు సర్వజాతి సమన్వితులయిన నరులను దుఃఖపెట్టెదరు. (314) గ్రామముల యందాసక్తమయిన నివాసము కలవారు, ఎవ్వడీ వక్రదంష్ణుల యొక్క జన్మను వినునో, ఎవ్వడీ జన్మ వృత్తాంతమును చెప్పునో, ఆతఁడు వక్ర దంష్టలు కల జంతువువలన భయముకానీ, దొంగల వలన భయముగాని లేక మరి యితరులెవ్వరివలన భయముకాని లేక యుండును. వారికి తత్కాల మరణము కాని యుండదనుట నిర్ణయము. (316) ఆతనికి చెరసాల యందు బంధన ముండదు. ఆతడు నీచయోనీజన్మ నోందఁడు. సంకర జన్మ నొందఁడు. మునులచే నాచరింపఁబడు వాన ప్రస్థాశ్రమ ధర్మము నవలంబించును. (317) ఆతఁడు దివ్యమయిన సంపత్తుచే ధనముచే కూడియుండును. జ్ఞానము నుండి జారిపోఁడు; దేవయోనుల యందు పుట్టును. (318) పదకొండు విధములయినట్టి వానరుల జాతులవారు; ద్వీపీనులు, శరభములు, సింహములు, వ్యాఘములు, నీలములు, శల్యకములు, ఋక్షములు, మార్జారలోహాసములు వానరములు, మాయువులు ఈ పదునొకండు వానరజాతులుగా సమ్మతములు. వీరీ యందరికి నాయకుఁడు ప్రతాపవంతుఁడు రాజునైన దేవాసుర యుద్దములందు భయంకరులు, శక్తి మంతులు, నీత్యమానీనులైన వారు, నయిన వారలను వాలీ చంపెను. (321) మదోతిక్తులయిన బలవంతుల నాశనము చేయుట కొలకే బ్రహ్మ యీ వాలిని సృజించెను. మహాత్ముఁడయిన బ్రహ్మచేనీ యీ వానరజాతి ఇంద్రునికి సహాయము చేయుటకై చేయబడినది. ఈ విధముగా కోతులు వివరింపఁబడిరి. ఇరావతి సంతానము నేఱుంగునది. (323).
భౌవనుఁడు (విశ్వకర్మ - ప్రపంచ నిర్మాత) సూర్యుని యొక్క అండకపాలద్వయమును రెండు చేతులతో దగ్గరగా పట్టుకొని సామవేద మంత్రమయిన రథంతర సామమంత్రమును పఠించెను. ఆ సామవేద మంత్రములు గానము చేయబడుచుండగనే భౌవనుఁడు ఇరావతి దగ్గరకు వెంటనే యరిగి పుత్రార్థము వాని నామె కొసంగేను. (325) ఆతఁడిరావతి కుమారుఁడగుటచే ఐరావతుఁడయ్యెను. ఆతఁడు దేవరాజునకు ఉపపోహ్యుఁడగుట (వాహనుడగుట)చే (మొదటమంతగరాట్) ఏనుగులలో రాజయ్యను, ఐరావతము (గజము) చాల శ్రీమంతమయినది. దానికి ధవళములయిన శ్వేతాభ్రముల ప్రకాశము కలదు. దానికి నాలుగు దంతములు. సువర్ణవర్ణముఁ గలిగిన ఏనుగు అంజనము, బలి యొక్క వాహనమయిన భద్ర మను గజమునకు ఆరు దంతములు. ఆ భద్రగజమునకు నలుగురు పుత్రులు. వారు - ఆంజనము, సుప్రతీకము, వామనము, పద్మము ఆడయేనుగ అభ్రము అభ్రమునకు నల్గురు పరాక్రమవంతులయిన పుత్రులు నీటనుబోగలవి. ఆ నల్గురు నాల్గు దిక్కులకు గజములయిరి. (దిగ్గజములు). ఆ నలుగురు భద్ర మృగ మందముస్తు సంకీర్ణము సంకీర్ణమైన అంజనగజము యముని వాహనము. భద్రమైన సుప్రతీకము అపాంపతియైన వరుణునీ వాహనము. మందమైన పద్మగజము తెల్లనిది. అది మైలవిలుని యొక్క (కుబేరునియొక్క వాహనము. మృగశ్యామమైన వామనగజము పావకియైన కార్తికేయునీ వాహనము. ఈతనికి ఎనమండ్రు పుత్రులు. వారు:పద్ముఁడు, ఉత్తముఁడు; పద్మగుల్ముం డు, అగజుఁడు,వాతగజుడు, గజుడు, చపలుఁడు, అరిష్ణుఁడు. ఈ యన్వయమందు ఉదగ్ర భావో పేతులు జన్మించిరి. (333) ఆ గజములు తెల్లని రోమములతో నఖములతో పింగళవర్ణములు. వానికి వివిధములయిన ఇతర వర్ణములు కూడ కలవు. సామవేదమువలన పుట్టిన ఇతర గజములఁ గూర్చి కూడ చెప్పెదను. సుప్రథితము లయిన కపిలము, పుండరీకము అను రెండు గజములు రథంతర సామమున, నుదయించెను. అవిసుప్రతీకగజమును గూడ మర్ధించునవి. ప్రమర్ధనుఁడు అధికమయిన యశస్సు సంపాదించెను. ఈ జాతీకి సంబంధించిన ఏనుగులు చాలా బలిష్ఠములయినవని పేరొందినవి. ఇవి ఇతర గజముల బలాతి శయమును గూర్చి శంకించునవి. ఇవి చాలా శౌర్యవంతములు. కానీ శీర్పము కోరలు దంతములు) చాలా పెద్దవి. వాని యొక్క రోమములు, నఖములు అతి ధవళములు. పుష్పదంతుడు బృహత్సామమున పుట్టెను. ఆతనికి ఆరుదంతములు. ఆతనికీ ఇరువురు సుతులు. ఒకఁడు పద్మపుచ్చవంతుఁడు రెండవవాఁడు తామ్రపర్ణుఁడు, అవి సంఘములుగా గుంపు గుంపుగా సంచరించును. వానికి దంతములు కలవు. ఈ వంశమునందే వ్రేలాడు పెదవులు కలిగి చూచుటకు మనోహరము లైనవి పుట్టినవి. వాని యొక్క చర్మము, నాలుక, శుండములు నల్లగా నుండును. వాని ముఖములు పీనములు విశాలములు. (388) వామదేవుఁడు, అంజనము, శ్యామము, వామనము సామమున జనించినవి. తరువాత వారుంగజము. ఆతని భార్య అంగన. నీలవంతుఁడు, లక్ష్మణుఁడు దాని పుత్రులు. (339)
ఆతని సంతతి యందు ఈ క్రింది విధములయిన గజములు పుట్టుచున్నవి. అవి మిక్కిలి చండములు; చాల పెద్దవి. భయంకరములు. వానీ శిరస్సులు కంఠములు అందములయినవి, వానీ వక్షస్థలములు విశాలము లయినవి. మిక్కిలి వేగవంతములు. వానికి క్రిందనుండి కాళ్లకు గొలుసులు వైచెదరు. (340) వైరూప్యమున సుప్రతీకము. కాని సామ్యము వలన సారూప్యమునందెను. దానికి ముగ్గురు పుత్రులు - వారు - ప్రహారీ సంపాతి, పృథువు అనువారు. ఈ క్రింది విధములయిన మతంగములీ వంశములో పుట్టు చున్నవి. అవి మిక్కిలీ ఎత్తయినవి (ప్రాంశువులు) వాని తాలువులు పెదవులు దీర్ఘములయినవి వాని శిరోజములు సువిభక్తములు సంభోగవిషయమున ఆమతంగజములు మృదువులు. అంజనమువలన అంజనగజము. సామమువలన అంజనావతీయను ఆడజగమును బుట్టినవి. సామము యొక్క శక్తిచే అంజనావతీ అంజన కుమారునకు అంజనను కనెను, వారిద్దరికి మతి ఇద్దరు కుమారులు, వారు ప్రమాధి పురుషుడును. (343) ఈ క్రింది విధములయిన ఏనుగులీ జాతిలో పుట్టెను. వారందరు మహావిభక్త శిరసులు. వారి శీరములు రెండుగా విభజింపఁబడి యుండెను. (కుంభస్థలములవీభాగము చక్కగా తీర్చబడి యున్నవని భావము). అయ్యవి స్నిగ్ధ జీమూత సన్నిభములు. అవి సుదర్శనములు. చూచుట కందముగా నుండును, వాని శరీరములు పుష్టి మంతములుగా నిర్మింపఁబడినవి. అయ్యవి పద్మము యొక్క కాంతి కలిగి యుండును. మంచియాకారములు కలిగినవి. పరిమండలములు (గోళాకారమున నుండును అవీ శూరవంతములు : దీనాయతముఖములు కలిగినవి. చాంద్రమస సోమము యొక్క ప్రభావమున కుముదద్యుతి (కలువల ప్రకాశము) కలది కుముదమనుగజము. అతనికి మహాపద్ముఁడు, ఊర్మిమాలియును కలిగెను. కుమారు లిద్దరు పింగళయందు జన్మించిరి. ఈ వంశముననుద్భవించిన ఏనుగులు ఈ క్రింది లక్షణ లక్షీతము లనియేలుంగుఁడు. శైలజీమూత సన్నిభములు అవి అత్యుత్తమములు శక్తిమంతములు, బుద్ధిమంతములు అవి ఇతర మతంగములతో యుద్దము సలుప వలెనని కాంక్షించుచుండును. దేవతలు, తమకు అసురలతో యుద్ధము కలిగినప్పుడు జయార్థము ఈ యేనుగుల నుపయోగించిరి. (347) దేవతలు తమ ప్రయోజనము కృతార్థము కాగా నీ ఏనుగులను పరిత్యజించిరి. అప్పుడా గజములు పూర్వోత్తదిక్కుల కేగెను. ఏవంవీధగజాన్వయముననుద్భవమయినవి, సుశిక్షితములు, వినీతములు (సౌమ్యములు) నన వీనినీ దేవతలు అంగదేశాధిపతి, సూత్రకారుఁడునైన లోమ పాదున కొసంగిరీ. వీవీధ నామములు గలిగిన ఏనుగుల నామములకు శభోత్పత్తిక్రమము ఇట్లున్నది. ద్వీరదము - రెండు రదములు గలిగినది. హస్తి - హస్తము (హస్తము తొండము) కలదీ. కరీ - కరము తొండము కలది. దంతీ - దంతములు కలిగినది. వాణము - ఇయ్యదీ శత్రు సైనికులను యుద్ధము లందు వారించునది. గజము - గర్జించునది. కుంజరము - కుంజముల యందు పొదల యందు సంచరించునది. నాగము - అలభ్యమైనదేదియును లేనిది. నాగము (న- అగమ్య). మతంగము - మదించి పోవునది. (మత్తంయాతీతి) (350) ద్వీపము : (ద్వాభ్యాం పీబన్ ద్వీపః) తొండము నోరు రెంటి రంధ్రముల ద్వారా త్రాగున. సామజము : (సామ జాతము) సామము వలన పుట్టినది. ఇది యీ గజార్థశబ్దములయొక్క నిర్వచన క్రమము. (351) ఏనుగుల జిహ్వాపరావృత్తి (నాలుక వెనుకకు మరలి యుండుట) అగ్నియొక్క శాపము వలన కలిగినదని చెప్పుదురు. ఏనుఁగు స్వకీయ మయిన బలము నేుంగ కుండుట, గూఢముష్కత వృషణములు దాగియుండుట. (Its seroturn lies hidden With in its body). ఈ రెండు లక్షణములు దేవతా శాపమున గజములకు కలిగినవని యెలుంగవలయును. దేవ, దానవ, గంధర్వ, పిశాచ, నాగ, రాక్షసులయొక్క కుమార్తెలకు దిగ్గజములవలన బహుబలాఢ్యములైన గజములు గలవు. ఇది గజముల పుట్టుక, సంతతి, నామనిర్వచనమున్ను, ఈ యేనుఁగుల రాజు అభ్రమము. కౌశికీ గంగా నదులకు ఉత్తరముగా నుండి సముద్రము వరకు వ్యాపించిన వనప్రదేశము ఏక దంతము గల అంజన యొక్క నివాస స్థలముగా నెడుంగవలయును. (355) వింధ్య పర్వతమునకు ఉత్తరముననున్న ప్రదేశము గంగానదికి దక్షిణమున నున్న ప్రదేశము ‘కేరు’ (కారుస) ప్రదేశముతో సహితము, గంగానదీ విడివడి యేగు ప్రదేశము సుప్రతీకుని యొక్క రాజ్యము. ఉత్కలమునకు పశ్చిమమున నున్నట్టిది. కావేరీ నదీకి పడమట నున్న ప్రదేశము, ఏకసూకు (?) నీయొక్క కుమారుఁడయిన వామనుని అరణ్యముగా స్మరింపఁబడుచున్నది. (357)
లోహితకు పడమట నున్న ప్రదేశము, సింధునదికి పశ్చిమముననున్న ప్రదేశము. -పర్వతమునకు దగ్గర వరకు గల యదీ పద్మగజవనముగా చెప్పఁబడినదీ. (358) భూతము భూతములకు (పిశాచాదులకు) జన్మ నొసంగెను. వీరందరు రుద్రుని యొక్క అనుచరులు. (359) (క్రింద చెప్పఁబడునట్టివి వారి గుణగణములు. వారు స్థూలకాయులు, కృశీభూతులు, చాల పొడుగైనవారు, పొట్టివారు, సములయినవారు; కొందరు వ్రేలాడు కర్ణములు కలవారు, కొందరు వ్రేలాడు పెదవులు కలవారు, కొందరు వ్రేలాఁడు దీర్ఘములయిన నాలుకలు గలవారు, కొందరికి ఉదరములు చిన్నవి, కొందరేకనేత్రులు, విరూపులు కొందరు, వికృత రూపులు కొందరు, కొందరు వ్రేలాడు పిలుందులు వారు, బలిసిన పిక్కల వారు, కొందరు నల్లనివారు, కొందరు తెల్లనివారు, కొందరు నీలవర్ణమువారు, కొందరు తెల్లని మొగములవారు, కొందరెట్టని ముఖములవారు(361) కొందరు బభ్రువర్ణమువారు, కొందరు శబలవర్థులు, ధూమ్రవర్ణులు కొందరు, కద్రూవర్లులు కొందరు, కొందరు ఎర్రని నాసములు (నాసికలు) కలవారు, దర్భకంటివెంట్రుకలవారు, కొందరు నిక్కబొడుచుకొనియున్న వెంట్రుకలవారు, సర్ప యజ్ఞోపవీతులు కొందరు. అనేక శీర్షములవారు, పాదములు లేనివారు, ఒకే శీరము కలవారు,
శీర్షములే లేనివారు కొందరు : భయంకరులు కొందరు; కొందరు వికటాకృతులు. కొందరు రెండు జిహ్వలు కలవారు; అసమము అనిష్పత్తియునైన అవయములు కొందరు; జడలు కట్టిన వెండ్రుకలవారు, కొందరు కుబ్జలు; కొందరు వక్రరూపులు; కొందరు వామనులు; కొందరు ఉత్తమములయిన సరస్సులను, సముద్రములను, పర్వతములను, నదులను, నదీతటములను ఆశ్రయించి యున్నవారు కొందరు, కొందరికి ఒకేచెవి; కొందరకు పెద్ద చెవులు, కొందరికి శంఖము వంటి చెవులు; కొందరికి చెవులే లేవు; కొందరు వక్రదంష్ణులు, గోళ్లు కలిగినవారు, దంత రహితులు కొందరు, జిహ్వలు లేనివారు కొందరు. (365) కొందరు ఏకహస్తులు, కొందరు రెండు హస్తములు కలవారు, కొందరు మూఁడు చేతులు కలవారు; కొందరు చేతులే లేనివారు; కొందరేక పొదులు, కొందరు ద్వీపాదులు కొందరు త్రిపాదులు, కొందరు ఫాదములే లేనివారు, కొందరు బహుపాదులు. (366) కొందరు మహాయోగశక్తి కలవారు. కొందరు స్వతస్సిద్ద బలవంతులు; కొందరు సునస్కులు, కొందరు మహాబలులులు; కొందరు సర్వత్ర సంచరింపఁగలవారు; ఎట్టి ప్రతిఘటనము లేనివారు కొందరు; బ్రహ్మజ్ఞులు, కామరూపులు కొందరు, (367) కొందరు ఘరాకృతులు, కొందరు శూద్రులు కొందరు పవిత్రులు. కొందరు మద్యమును మంచిదిగా నెంచువారు, కొందరు సుధార్మికులు. కూటదంతులు, మహాదంతులు, పెద్ద జిహ్వలు కలవారు, జుత్తు లేనివారు, వీకృతాననులుకోందరు. (368) కొందరు హస్తములతో తిందురు; కొందరు నోళ్లతో పెనగొని తినువారు; కొందరు కపాలములతో తినువారు, కొందరు ధనువులు కలవార; కొందరు సుత్తుల నుపయోగించువారు, కొందరు కత్తులను, కొందరు శూలములను, ధరించువారు, కొందరు దిగంబరులు, కొందరు చిత్ర చిత్ర వేషముల ధరించువారు, కొందరు చిత్రములయిన మాల్యములను మైపూతలను ధరించువారు, కొందరన్నము తినువారు కొందరు మాంసమునే తినువారు, కొందరు మద్యమును సేవించువారు కొందరు సోమరసము నాస్వాదించువారు (370) కొందరు చాల హోరాకారులు సంధ్యా సమయముల సంచరింతురు. కొందరు సౌమ్యులు వారు దీవాచరులు. కొందరు రాత్రుల సంచరింతురు. వారు ఖరస్పర్ములు, భయంకరులు నిశాచరులు. (371) వారంరదు భవుని (ఈశ్వరుని) ఉత్తమ దేవునిగా వారి మనస్సుల ధ్యానింతురు. వారలలో నెవ్వరికి భార్యలు లేరు. పుత్రులు లేరు. వారందరు ఊర్థ్వరేతస్కులు. ఆత్మలందు యోగశక్తులు గల శత సహస్ర సంఖ్య గల భూతములు గలరు. వారందరు భవ పరిచారకులు. భూతములందరు వివరింపఁబడిరి. కూష్మాండులు కపీశ వలన మరల మరల నుద్భవించిరి. వారు మిథున రూపమున (కవలలుగా) పుట్టిరి. వారందరు కపీశ వర్ణముచేత పిశాచులు. (374) కపీశ వర్ణము చేత పిశాచములందరు మాంసాశనులు. ఈ పిశాచ ద్వంద్వములు పదియారు పర్గములు. ఇది మొదటి వర్గము. వారి యన్వయ మిప్పటికిని కొనసాగుచున్నది. (375) వారి వంశీయులను నామముచే లక్షణములచే రూపములచే వివరించెదను. ఆ పదియారు వర్గముల వారు - (వారిలో ఒకరు పురుషుఁడు ఇంకొకరు స్త్రీ) చాగలుఁడు - చాగల; వక్రుఁడు - వక్రముఖీ; దుష్పూరుఁడు పూరణ. సూచికుంభపాత్రుఁడు కుంభీ; ప్రతుందుఁడు. ప్రతుంది; ఉపవీరుఁడు వీర; ఉలూఖలుఁడు ఉలూఖలీ; అకర్మకుఁడు కర్మకీ, కుషండుడు కుషండిక; పాణిపాత్రుఁడు పాణిపాత్రి; పాంశుఁడు, పాంశుమతి; తుందుండు నితుంది; నిపుణుఁడు, నిపుణీ; బాలాదుఁడు, కేషణాది; ప్రస్కందుడు స్కందికా.
పదియారు పిశాచముల యొక్క గణములు చెప్పఁబడినవి. ఆ పదీయారు పిశాచ గణములు ; అజముఖులు, వక్రముఖులు, పూరణులు, స్కందినులు, విషాదులు, అంగారకులు కుంభపాత్రులు, ప్రతుదకులు, ఉపవీరులు, ఉలూఖలీకులు, అర్కమర్కులు, కుషంగికులు, పాంశులు, పాడిపాత్రులు, నైతుందులు, నిపుణులు, సూచీముఖులు, ఉచ్చోషణదులు; వీరు షోడశగణములు. (383) ఈ విధముగా కూష్మాండ వంశీయులు చెప్పఁబడిరీ, పిశాచులు పురుషులు పిశాచులు (స్త్రీ పిశాచులు) ఆ వంశమున సముద్భవించిరి. (364) వారీ పుత్రుల యొక్క పౌత్రుల యొక్క సంతతి అనంతము వారు బీభత్సులు వికృతాకోరులు. అందుచే పిశాచుల యొక్క లక్షణముల నేలంగుడు. అజ్ఞముఖులనబడు పిశాచములు సర్వాంగ కేశభూయిష్ఠులు. వారి నేత్రములు వృత్తాకారముల నుండును. వారికి కోరల వంటి దంష్టలుండును. పెనుకోరల వంటి నఖములు. వారి అంగములు (అవయవములు) మెలికలు తీరి యుండును. వారందరు పరుషత్వ లక్షణులు. (386) కూష్మాండికలను పిశాచములకు చెవులు లేవు. వారికి రోమములుండవు. వస్త్రము లుండవు. వారు ఒక్కొక్కప్పుడు చర్మములను ధరింతురు. వారెప్పుడు ఆమిషయుతమయిన అన్నమును నభిలషించెదరు. (387) వక్రులనెడి పిశాచములు వారికి నచ్చిన రూపములను ధరింతురని యెఱుంగవలయును. వారందరు వంకర టింకరగా నడచెదరు. వారి అవయవములు, చేతులు, కాళ్లు, వంగీ యుండు. వారి శీలములు వక్రములు మాయాపూరితములు. నీతుందకులను పిశాచములు లంబోదరులు. కుండ పొట్టలు గలవారు. వారి ముక్కులు తుండములుగా నుండును (మొద్దు బారియుండును). వారి శరీరములు, అవయవములు, ఈలలు, చేతులు చాల పొట్టిగా నుండును, వారి ఆహారము సహజముగా బీజములు. తిల భక్షకులు, వారికి రక్తము ప్రియము. (389) అరమర్కులనెడి పిశాచములు, వానర రూపములు కలిగియుండును. వారు వాచాలురు; చెట్టు నుండి చెట్టునకు దూకుచు నివసింతురు. వారు వండిన అన్నమును తినగా కోరుదురు. వృక్షముల యందు వసించెదరు. పాంశులనెడి పిశాచములు తమ యవయముల నుండి దుమ్మును విడిచెదరు. వారు తమ చేతులను నేత్తియందుంచేదరు. వారి వెంట్రుకలు నిక్కపొడుచుకొని యుండును. వారి నేత్రములు పైకి నూడబెరుకబడి యున్నవో యన్నట్లుండును. వారు దేనినయినను వాసస్థానముగా గ్రహించి యుండగలరు. (391) ఉపవీరులనెడి పిశాచములు శ్మశాసోయతనస్థులు. వారు భ్రమరముల పోలియుందురు. వారు శుషులు ఎండియుందురు), వారు శూలముల దాల్చెదరు, చెట్ల బెరడుచే నిర్మింపఁబడిన వసనముల ధరింతురు. ఉలూఖలులు అను పిశాచములు, నిష్టగ్జాక్షులు. గ్రుడ్లు కదలాడవు. పొరి జిహ్వలు చాలా పెద్దవి. వానితో తమ నోటి పార్వములను నెల్లప్పుడు నాకుచు నుందురు. ఉలూఖలములు (రోళ్లు) వారీ ఆభరణములు. వారు ఖలులు వారు రత్నములను అవిచ్ఛిన్నముగా వెదజల్లెదరు. (393) పాణి పాత్రులను పిశాచములు మనుష్యులర్పించిన పిండములను భక్షించెదరు. వారికి ఏనుగుల వలె ఒంటేలవలె స్థూలములయిన శిరస్సులు కలవు. వారి పిల్లలు స్థూలముగా నుందురు. వక్రముగా నుందురు. (894) కుంభ పాత్రులనెడి పిశాచములు అదృష్టములయిన అన్నములను తిందురు. వారు సూక్ష్మరూపులు; రోమశులు, పింగళవర్లులు. కనబడుచు కనబడక సంచరించుచుందురు. (395)
నిపుణులనెడి పిశాచములు, ఇతరులతో సేవ్వరితో కలియకయే యొంటరీగా సంచరింతురు. కర్ణముల వరకు వ్యాప్తములయిన ముఖములు కలవారు. వారి కనుబొమ్మలు వ్రేలాడుచుండును. వారి నాసికలు స్థూలములు. (36) పూరణులనే పిశాచములు శూన్యాగారములనీన ప్రీతిమంతులు. వారు స్థూలరూపులు. పొట్టివారు. వారు తుండముల వరకు వ్యాపించిన హస్త పాదములు కలవారు. వారి చూపులు నేలకే చూచుచుండును. (397) బాలాదులను పిశాచములు సూతికా గృహములందుందురు. కానీ పాదములు చేతులు పృష్ఠ భాగము నందుండును. వానికి వాయువేగము కలదు. అయ్యవి వెనుకకు పరుగెత్తును. విపాదకులను పిశాచములు యుద్ధములందు రక్తమును త్రాగుదురు. అవి నగ్నములుగా సంచరించును. వారికిదియను నివాసము లేదు. వాని శిశ్నవృషణములు క్రిందికి వ్రేలాడుచుండును. స్కందినులను పిశాచములు, ఉచ్చోషిణులనీ పిలవఁబడు ఇతర పిశాచములు విస్తర్లలో విడువఁబడిన ఉచ్చిష్టముల తిందురు. ఈ విధముగ ఆపదియారు విధములయిన పిశాచములు వర్ణింపఁబడినవి. (400) పూర్వోక్ష విధములై దీనులయిన పిశాచములను చూచీ, బ్రహ్మకు దయ పుట్టెను. దయపుట్టి అల్పచేతస్కులయిన వారలకు బ్రహ్మ వరమొసంగెను. పోరు ప్రజలలో నంతర్థానము నొందుదురు. కామరూపీత్వము నందురు. ఉభయ సంధ్యల యందు వారు సంచరింపవచ్చును. వానికి వాసములను, బ్రతుకు తెరువులను కల్పించేను. కూలి పడిపోయిన భవనములు, జన శూన్యములయిన గృహములు, తక్కువ నీటి సదుపాయము గల భవనములు, విధ్వస్తములయిన గృహములు అనాచార శీలవంతులు నివసించు గృహములు, తుడిచి నీళ్లు చల్లబడని గృహములు, పరిశుభ్రముగా గోమయాదులచే నలుకబడనీ గృహములు సంస్కార రహితములయిన గృహములు. రాజమార్గములు, చిన్నచిన్న ప్రక్కవీధులు, నిష్కుటములు (జనులు వినోదము కొఱకు వచ్చిపోవు ఉపవనములు (పార్కు. నాలుగు మార్గములు కలియు చత్వరములు, పెద్ద పెద్ద ద్వారసీమలు, ఇంటి పట్టుల నుండు అటకలు, ఇండ్లలోని ప్రేయంతస్థులు, నిష్క్రమణ మార్గములు, మార్గములు కలియు సంక్రమ పథములు, (కూడలులు), నదులు, తీర్థములు, పవిత్ర కేంద్ర స్థానములు, శ్మశానము లందలి వృక్షములు, మహాపథములు మొదలయినవి. పిశాచములకు నివాసములుగా బ్రహ్మ వర మొసంగెను. ఈ స్థానములను పిశాచములు ఆక్రమించును. గుణహీనులయిన వ్యక్తులు, అధార్మికులయిన జనులు పిశాచములకు జీవన గ్రాసముగా దేవతలు నియమించిరి. ఎచ్చటేచ్చట సంకర వర్ణులయిన వ్యక్తులుందురో, దుర్వ్యసనపరులు మోసకారులయిన కుమ్మరులు, శ్రీ బ్రహ్మాండ మహాపురాణమ్ శిల్పులు, ఇతర కార్మిక జనములు, చోరులు, విశ్వాసహీనులు, సారాయి ద్రవములను రహస్యముగా తయారు చేయువారు, విశ్వాసఘాతకులు, దొంగలు, ద్రోహులు, అన్యాయముగా సంపాదింప ప్రయత్నించు వారియందు పిశాచములుందురు. పర్వముల యందు కాని, సాయం సంధ్యల యందు గానీ ఈ క్రింద చెప్పబడిన పదార్ధములు వానీకి బలిగా పేర్కొనంబడినవి. తేనె, సుర,మాంసము, అన్నము, పెరుగుతో కలిపిన అన్నము, కుండకొట్టబడిన తిలలు, ఇతరములయిన కూడని పదార్థములు, ధూపములు పసుపుతో చేసిన రొట్టెలు, నువ్వులతో తయారు చేసిన భక్ష్యములు
అవి తిల భక్ష్వ గుడోదనములు, నల్లని వస్త్రములు, అక్షులు పువ్వులతో గూడిన ధూపములు, ఇవి ఆ పిశాచములకు బలులు. (410) వీనిని పిశాచములకు ఆజ్ఞాపించిన తరువాత, బ్రహ్మ భూతములకు పిశాచములకు, దయ్యములకు నధిపతిగా శూలపాణి నొసంగెను. (411) అందమయిన “దంష్ట్ర” తన తనయులనుగా సింహములకు, వ్యాఘములకు జనన మొసంగెను. చిరుతపులులు, మాంసమును దీను ఇతర క్రూరజంతువులు కూడ సామే బిడ్డలే. (412) “ఋష” యొక్క సంతాన సృష్టిని సమగ్రముగా వెలుంగుము. ఆమెకు ఐదుగురు కుమార్తెలు. వారల పేర్లల నావలన వినుము. (413) వారీ నామముల నీటైటుంగ వలయును. మీన, అమీన, వృత్త, పరివృత్త, మరియు అనువృత్త. వారి సంతానమును గూర్చి వినుము. (414) పాఠీనములనఁబడు, సహస్ర దంష్టములు గలిగిన మకరములు (మొసళ్లు); ఇవి కాక తిములు, రోహితములు -ఇవియు మైసగణములుగా ('మీన' సంతానములుగా) విస్తారముగా చెప్పఁబడినవి; వాని సంఖ్య అత్యధికము. గ్రాహములు నాలుగు వర్గములుగా చేయఁ బడినవి. (గ్రాహములు మొసళ్లలో నొకరకము). (415) ఆ నాల్గురకములు - మధురములు, శంకువులు, ఉగ్రములు, శిశుమారములు, మీన వానికి జనన మొసంగెను. (416) ‘వృత్త’ వివిధ జాతులయిన కూర్మములకు, మఱియు ననేక విధములయిన జలచరములకు, నానావిధ శంఖ వికారములకు జనన మొసంగెను. (417) 'అనువృత్త’ వివిధ జాతులయిన మండూకములను (కప్పలను) కనెను. 'పరివృత్త' నానా వికారములు గల యైణీయములు, శంబూకములను (418) శుక్తి (ఆల్చిప్పలు - ముత్తెపుఁజిప్పలు) వీకారములను వరాట (గవ్వలు) వికారములను, శంఖ వీకారములను (419) కాలకంఠ వికారములను, జలూకా (జలగలు) వికారములను (మొత్తము 5 వికారములు) కూడ కనెను. ఈ విధముగ 'ఋష యొక్క 5 జాతులు పేర్కొనఁబడినవి. (420) తిర్యాహేతుకమయిన జీవరాశుల సృష్టి బహుళ-విస్తరమని చెప్పుదురు. అవి యన్నియు స్వేదము వలన పుట్టినవని చెప్పుదురు. స్వేదక్షిన్న శరీరముల నుండి ఈరు, (పేనుగుడ్డు), పేను మొదలగు అండములు పుట్టెను. మనుష్య స్వేద మలజముల నుండి పుట్టిన వానికి ఉశనములను జంతువు లందురు (అవి పేలు, నల్లులు మొదలయినవి), (422) నానా విధములయిన పిపీలికా గణములు (చీమలు), బహు పాదములు కల కీటకములు, నానా విధములయిన శంఖములు, రాళ్లు (కీలకా వరములు) స్వరూపమున సూదుల యంతగా చిన్నవి - ఇవియు, అనేకములయిన యిట్టివియు, జంతువులు స్వేదము వలన పుట్టినవి. వీనిలో చాలా జీవులు సూర్యునిచే వేచ్చ జేయఁబడిన నీటి నుండియు, అట్లే వాన నుండియు పుట్టినట్టివి. (424) వీనిలో చాలా జంతువులు లేళ్ల శరీరముల నుండి, ఇతర జంతువుల శరీరముల నుండి పుట్టినవి. మక్షికలు (ఈగలు) ఇతరములయిన చిన్న చిన్న జంతువులు బురద గల రొంపి నుండి పుట్టినవి. తీత్త్రులు పుత్తికలు (తెల్లచీమలు) దుమ్ము నుండి పుట్టినవి. వానిలో కొన్ని నీలములు కొన్ని వివిధ వర్ణములు, వాని సంఖ్య అధికము. ఈ జంతువులు నీటి వలన స్వేదము వలన పుట్టినవి. కాశ (రెల్లు) గడ్డి మొదళ్ల నిలువగా నున్న నీటి నుండి వివిధములయిన కీటములు, నలదములు (పెక్కు కాళ్లు కలిగినవి) పుట్టేను. అవి మూఁడు రకములు - సింహలములు, రోమలములు పిచ్ఛిలములని చెప్పబడినవి. (427)
ఈ విధముగా ఇవియు ఇతరములయినవి జలముల నుండి స్వేదము నుండి జనించినవిగా తలచెదరు. అట్లే మినుములు, నల్లపెసలు పెసలు నానఁబోసిన గింజల నుండి (అపరాల నుండి) క్రిములు పురుగులు పుట్టుచున్నవి. బిల్వ ఫలముల నుండి, నేరేడు పండ్ల నుండి, మామిడి పండ్ల నుండి, పూగఫలముల నుండి (వక్కలు), ముద్గముల నుండి (పచ్చ పెసలు) పనసఫలముల నుండి, తండులముల నుండి వృక్షముల యొక్క కోటగముల నుంచబడినట్టివి, శుష్కములయినట్టివి యయిన గింజల నుండి జంతువులు (క్రిములు) పుట్టును, అంతీయేకాక యని ఇతరములయిన వాని నుండియు పుట్టును. కాని యెల్లప్పుడు కాదు, లేదా ఎక్కువ కాలము కాదు. (430) జంతువులు (కీటక జీవులు) తురగములు మొదలయిన వాని నుండియు, విషములు మొదలయినవాని నుండియు పుట్టును. గోమయమును గోతులలో నుంచి బహుకాల ముంచిన క్రీములు పుట్టును. (431) ఓ బ్రాహ్మణులారా ! పురుగులు, క్రీములు, కాష్టముల నుండి (కర్రదూలముల నుండీ) పుట్టును. వృశ్చికములు (తేళ్లు) ఎండిన గోమయము నుండి, స్వేదము నుండి పుట్టును. గోవుల నుండి, గేదెల నుండి మరియు ఇతర జంతువుల నుండియు, క్రిములు పుట్టును. క్రిములు చేపల వలన కూడ పుట్టును. అంతియేకాక అన్నకూటములు (అన్నపు కుప్పలు) నుండి వివిధ క్రిములు పుట్టును. నానా వికారములయిన జీవులు (జంతువుల) పక్షుల రెక్కల కలను కట్టగా కట్టి కుప్పలుగా విడిచిన వాని నుండి పుట్టును. అట్లే చిన్న చిన్న పురుగులు, జలగలు కూడ పుట్టును. చిన్నవీ అయిన విష సంబంధమైన క్రీములు పావురముల వలన, కురరాదుల వలన (ఒక విధమైన పక్షి) మరియు ఇతరములయిన పక్షుల వలన కూడ కలుగును. ఇతర క్రీముల జాతులు ఈగల జాతులు నుద్భవించును. (435) సామాన్యముగా, దోమల యొక్క సంతతి, నల్లని కందిరీగల జాతి, నీలువయుండిన కుళ్లు నీళ్ల గుంట యందు, కయ్యల యందు జనించును. (456) మణీచ్చేదములైన వ్యాలములు (సర్పములు) పోతజములనబడినవి. (437) శతవేరిరకములు (క్రిములు) ఆవుపేడకళ్ల నుండి పుట్టును. ఈ విధముగా స్వేదజములయిన వివిధ క్రిమి జాతులు వివరింపఁబడినవి. ఇవి యసంఖ్యేయములు. ఇవి యన్నియును వాని పూర్వజన్మకర్మ ఫలితముగా పుట్టునని యెఱుంగవలెను. (438) నైర్ఋతి వలన పుట్టిన ఇతర జంతువులను ఉపసర్గజముగ తలపవలెను. (439) కొన్ని భూతములు యోని నుండి పుట్టును. (బ్రతికియున్నట్టి జంతువుల గర్భము నుండీ) కొన్నింటినీ ఔత్పత్తికము”లుగా స్మరింపవలెను. (?) దేవతలందరు ప్రాయికముగా ఉపపత్తిజులని తెలియవలయును. కొందరు దేవతలు యోనిజులు. మరి కొందరు దేవతలు (అనీమిత్తతః) ఏదో కారణమున పుట్టుదురు. (440) సగము ఇద్దరు పుత్రులను కనెను - వారు - దుల్లోలకుఁడు, లలోహుండును. (441) వారికి సృమరాదులు నలుగురు సంతానము. దుల్లోలును ఎనమండ్రు కుమారులు. వారు :- శ్యాములు (నల్లనివారు), శబలులు (వివిధ వర్ణములు), లోహితులు (ఎఱ్ఱనివారు) అంజనులు (కాటుకవలె నల్లనివారు) కృష్ణులు (నల్లనివారు) ధూములు ఆరుణులు కద్రులు (కద్రూ వర్గము వారు) (442) సురస నూరుగురు పాములను కనెను. వానికి నొకటి కంటే నెక్కువ తలలు కలవు. (445) తక్షకుఁడు సర్పములకు రాజు (సర్పము ఒక సర్పజాతి). వాసుకి నాగులకు రాజు. క్రోధవశాస్వయమునకు చెందిన యీ సర్ప సంతతి తమో గుణ బహుళమయినది. (444)
తాత్రయందు పులహుని సంతాన సృష్టి విసుడు. తామకు ఆరుగురు విఖ్యాతలయిన కూతుండ్రు పుట్టిరి. వారు - గ©, భాసి, శుకి, క్రౌంచి, శ్యేని, ధృతరాష్టికాం అరుణుని వలన గృధీకీ ఇద్దరు పుత్రులు. వారు వీర్యవంతులు, మహాబలులు. ఆ ఇద్దరు సంపాతి, జటాయువులు. వీరిరువురు పక్షి సంతతిలో సత్తములు. సంపాతికీ విజయులు, ద్వీరాస్యులు, ప్రసహులు, పుత్రులు. జటాయువునకు కంక, గృధ్ర, కర్షకులు, పుత్రులు. గురుడుని భార్యలు ఐదుగురు - భాసి, క్రౌంచి, శుకీ, ధృతరాష్ట్ర మరియు శ్యేని, వారికి పుట్టిన పిల్లలఁ గూర్చి నేను మీకు చెప్పెదను. (448) గురుడునకు శుకి వలన ఆరుగురు ప్రసిద్ధ పుత్రులు :- సుఖుఁడు, సునేత్రుఁడు, విశిఖుఁడు, సురూపుండు, సురసుడు, బలుఁడు. వారి పుత్రులు, పౌత్రులు మొత్తము 14 వేల మంది. (450, 451) వారు మహాత్ములు. పన్నగాశనులు (పాములను దినువారు) వారి వంశము విస్తరించుట వలన, పుత్రుల యొక్క పౌత్రుల యొక్క సృష్టిచే (జననములచే) వారు వివిధములగు స్థానములందు నివాసనమునకై వ్యాపించిరి. ఆ స్థానములను యథా క్రమము చెప్పెదను. (451) ఆ స్థానములు - యావత్ శాల్మలీ ద్వీపము, దేవకూట పర్వతము. (452) మణిమంతము, - (ఇది శైలేంద్రము. దీనికి 1000 శిఖరములు), పర్ణమాలము, శతశృంగమయిన సుకేశము, పంచశిఖరములు గల కౌరరము, హేమకూట పర్వతము, ఈ పర్వతములు శిఖరముల మహాత్ములయిన వారిచే దట్టముగ (అధికముగా) నివసింపఁబడియున్నవి. వీరందరు గరుడుని పుత్రులు. వారికి ప్రపంచ ప్రభంజన సమవేగము కలదు. వారికి గల వివిధములయిన గరుడములు పద్మరాగములయిన మణులచే జాజ్వల్యముగ ప్రకాశింతురు. (454,455) ఈ క్రింది వారు భాసీ పుత్రులుగా గణింపఁబడుదురు. భాసములు (రాబందులు), గుడ్లగూబలు, కాకకుక్కుటములు, మయూరములు, కలంవీకలు, వాధీణస, క్రౌంచ, శ్యేన, కుదర, సారస, బకములు - మాంసమును తీను ఇతరములయిన వివిధ రూప పక్షులు. (456) సుందరీయైన (భామినీ) ధృతరాష్టి - వివిధ జాతి హంసలకు, చక్రవాకములకు, వీవీధ జల చర పక్షులకు జనన మొసంగెను. ఓ బ్రాహ్మణులారా ! శ్యేని. అనేకులయిన పుత్ర పౌత్రులకు జనన మొసంగెను. ఆమె కుమారులు సోత్రులు లెక్కించుటకు అసంఖ్యాకులు. (458) గరుడ సంతానము చెప్పబడినది. ఇక 'ఇర' యొక్క సంతతిని గూర్చి వినుఁడు. ఇర కమలలోచనులయిన కన్యలమ కనెను. పొరు ముప్పురు. (459)
వారు మువ్వురు - లత, లత మరియు వీరుధ. వీరు వనస్పతులకు, వృక్షములకు, వీరుధములకు {లతలకు) తల్లులు. వనస్పతియైనలత పుష్పముల వలన ఫలముల నొసంగు వృక్షములను కనెను. అలత ఫలగ్రహములగు (పిందెతో గూడిన సొరకాయ మొదలగు) పుష్పములను వహించు వృక్షములను కనెను. (461) వీరుధ యొక్క పిల్లలు - గుల్మములు, లతలు, వల్లులు (తీగెలు) కదలాడు లతలు, చర్మమే సారముగా గల తృణజాతి (వెదుళ్లపొదవంటీ) గరికలు. అంతటితో తద్వంశము సమాప్తి నొందినది. (462) వీరందరు కశ్యపదాయాదులు. వీరందరు స్థాణు జంగమ సంతతులు. వారందరిం గూర్చీ వ్యాఖ్యానించితిని. ఈ సమస్త ప్రపంచము వారి పుత్ర పౌత్రాదులయిన వారి సంతతి వ్యాపించియున్నది. (463) ఈ సృష్టి ప్రకరణము నాచే చెప్పబడినది. (అనఁగా) మరీచీ కుమారుఁడయిన కశ్యపుని సృజనము సూక్ష్మముగా నాచే కీర్తింపం బడినది. ఒక వంద సంవత్సరముల కాల వ్యవధిలో నయినను ఈ సృష్టిని పూర్తిగా వివరించుటకు శక్యము కాదు. అదితీ సహజముగా ధర్మశీల. దితి సహజముగా బలశీలురాలు. సురభితపశీల దనువు సహజముగా మాయాశీల. ముని సహజముగా గంధశీల. క్రోధ సహజముగా అధ్యయన శీల. అరిష్ట సహజముగా గీతశీల - సంగీత ప్రియ. ఖశ క్రూరశీల. కద్రుక్రోధశీల క్రోధ సహజముగా శుచిశీలినీ, (467) వినతా సహజముగా వాహశీల. తాము సహజముగా ఘాతశీలినీ. ఇర - అనుగ్రహశీల, అసాయువు తీండి యందు ప్రీతీ కలది. (468) ఇవి లోకమాతల యొక్క శీలములు. సర్వత్ర ఇట్లే యుండును. కశ్యపుని బిడ్డలు తమ జన్మ ప్రభృతి వారి వారి తల్లుల స్వభావములను వహించీనవారు. ధర్మము వలన, శీలము వలన, బుద్ధిచే, క్షమచే (ఓర్పు) బలముచే రూపముచే, రజస్సత్త్వతమోద్రిక్తులు, ధార్మికులు, అధార్మికులు, వీరందరు మాతృతుల్యాభిజాత్యలక్షణ సంపన్నులై కశ్యపుని ఆత్మజులయినను (470) వారు దేవతలు, అసురలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు, డీశాచులు, పశువులు, మృగములు, పక్షులు, వీరుధములు (లతలు) (471) దేవతలును ఇతరులును, దక్షుని కూఁతులయిన దాక్షాయణుల వలన జన్మించిన వారగుట, దాక్షాయణులు మానవప్రకృతులగుట చేతను దేవాదులను మనుష్య ప్రకృతులుగా తెలియుదురు. (తమ సంభవ స్థానమునకు మానవ వ్యక్తులే ఆధార భూతులు (స్థానములని) యెలుంగుదురు). అన్ని మన్వంతరముల యందు, మొత్తము దేవతల యొక్క సంభవము మానవ వ్యక్తుల యందే యగుట, మానవ వ్యక్తులు శ్రేష్ఠులు. (473) ధర్మార్థ కామ మోక్షములకు మానవులు సాధకులు. వారి నుండి సురలు అసురలు ఉద్భవించిరి. వారు అర్వాక్ర్తజాతులు. కార్యసిద్ధి కొఱకు మానవులలో వారు పునః పునః జన్మించుచున్నారు. ఈ విధముగా వంశప్రభవము విస్తరముగా వివరింపఁబడినది. (475)
దేవతల యొక్క అసురులయొక్క గంధర్వుల యొక్క అప్సరల యొక్క యక్ష రాక్షసుల యొక్క పిశాచముల యొక్క సుపర్ణుని యొక్క సర్పముల యొక్క పక్షుల యొక్క వ్యాలముల యొక్క (క్రూర మృగముల యొక్క సమళ్ల యొక్క ఔషధముల యొక్క క్రిమి కీటముల యొక్క పక్షుల యొక్క సూక్ష్మములు క్షుద్రములయిన జలజంతువుల యొక్క పశువుల యొక్క శ్రీమంతులయిన బ్రాహ్మణుల యొక్క పుణ్య లక్షణములతో గూడిన యీ కథ వినిన వారికి, అనసూయులకు ఆయురైశ్వర్యముల నొసంగును. ఇయ్యదీ ఆరోగ్యమును క్షేమమును సమకూర్చును. ఇయ్యది అనసూయులయిన వ్యక్తులచే సంతతము వినవలయును. అవగాహనము చేసుకొనవలయును. (476) మహాత్ములయిన వారి వంశోత్పత్తిని గూర్చి గౌరవాస్పదములయిన బ్రాహ్మణ సదస్సులలో ఎవడు సంతతము పఠించునో ఆతఁడు ఉత్తమ సంతానమును పొందును. అనంతమైన ధనము నందును. మరణానంతరము శోభనమయిన గతిని పొందును.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణమందలి మధ్యమ భాగమందలి తృతీయమైన ఉపోద్ఘాత పాదమందలి కాశ్యపేయవర్ణనమను ఏడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 45 of the Brahmānda Mahā Purana is as follows:
This awe-inspiring chapter recounts the miraculous birth and celestial transformation of the storm deities known as the Maruts through the compassionate intervention of lord Indra. It beautifully describes their transformation from potential destruction into radiant guardians of the atmosphere who assist the gods in upholding cosmic harmony. The devout reader rejoices in the divine mercy that transforms adversity into blessing, praising the lord's eternal providence.