37 - గృహరాజాంతరకథనం

హయగ్రీవుడనెను : సర్వజ్ఞాద్యంతరాలము యొక్కపైన ఓయగస్త్యా వశిన్యాద్యంతరమున్నదని తెలియవలెను. అది యిరువది మూరల యెత్తెనదీ. పదునారు వందల మూరల విస్తారముగలదీ-1, పూర్వమువలెనే సోపానమందరము. (మెట్లుగల మందిరము) అది సమస్త రోగముల. బోగొటు సర్వరోగహరచక్రము అను పేర ప్రసిద్ధమైనది-2, అచట తూరుపు దక్షిణము మొదలగు దిక్కుల వరుసలో వశిని మొదలగు వారు దేవతలు. వారచట స్వరములు లేని వారు. అందులో మొదటిది వశినీశ్వరి-3. తరువాతది కవర్లతో గూడినది కామేశ్వరుడను వాజ్మయముగలది. ఇక చవర్ధతో గూడిన వాగీశియైన మోదీని మూడవది-4, ట వర్ధతో నలంకరింపబడినది విమలయను సరస్వతి, తవర్గతోనట్లే కూడిన యైదవది వాక్రృధారణ-5, పవరతో పెంపోందిన యారవది జయినీగా సమ్మతము. యకారము మొదలు నాలుగు వర్ణములకోణమున సర్వైశ్యర్యాది వాజ్మయి యుండును. శకారము మొదలు అక్షరములతో నెనిమిదవది కౌలినిగా సమ్మతము. ఈ దేవతలు జపమునందాసక్తలు. ముత్యములసొమ్ముల నలంకరించు కొన్నవారు-7. ఎల్లప్పుడును కదలాడుచున్న గద్యపద్యములనెడి లహరులతో లాలింపబడినవారుగా నిష్టపడినవారు. చెవులకింపైన కావ్యములతోను మధురములైన నాటకములతోను ఓ మునీ! శ్రీదేవిని వినోదింపజేయుచుందురు-8. ఓవాతాపినిజంపీనయగస్త్యా! వీరు తమ రహస్యనామములతోనే ప్రసిద్ధులు. తమ చక్రమునకు నాయిక (స్వామిను)లు. సిద్దనామముతో బిలువబడుదురు-నీ, ఈ చక్రమును సంరక్షించునది ఖేచరియనబడినది. వశిన్యాద్యంతరాలము యొక్కపైన ఓవింధ్యపర్వతగర్వాపహారీ!-10. ఇరువదిమూరల యెత్తె. పదునారు వందలమూరల విస్తారముగల అస్తమను చక్రముగలదు. అచట బాణాదుల దేవతలు-11. ఐదుగురు బాణేశ్వరీదేవతలు, ఐదు కామేశ్వర బాణములు, ఆదిస్త్రీపురుషులైన యిరువురి యొక్క ప్రదీప్తములైన రెండు అంకుశములు రెండు ధనువులును క్రొత్త చేకులలో ప్రకల్పింపబడినవి. (చెఱకు వీండ్లరెండు ధరంచినదని భావము) కాంతులీనురెండు పాశములు, ఓ మునీ! నాలుగస్త్రములును కల్పింపబడినవి-15, కామేశ్వరివి నాలుగు మహేశ్వరునివి నాలుగు, మొత్తము ఎనిమిది యాయుధములు ప్రజ్వలించి ప్రకాశించును-14: ఇవి భండాసురమహాయుద్దమున దుష్టరాక్షసుల రక్తమును ద్రావుటచే మిక్కిలి తృప్తి చెందినవైన దివ్యాస్త్రములు. ఆమెలో నతీజాగరూకములైయున్నవీ-15, ఈ ఆయుధములకు పరీవారాయుధములు చాలినంతగా నున్నవి. ఇంక తక్కిన యస్త్రములు గూడ గలవు. వాటిసంఖ్య కోట్లకొలది-16. వజ్రశక్తి, శతఘ్ని, భుశుండీ, ములసము, కృపాణము, పట్టిశము, ముద్గరము, భిందిపాలకము-17, -ఇవి మొదలగు శస్త్రములు వేనవేలుగలవు. ఇవి మదవివశలైన అష్టాయుధమహాశక్తులను సేవించును-18. ఇక, ఓ మునీ! శస్త్రాంతరాళము (శస్తాగారము 7) పైన ఇరువది మూరలు ఎత్తైనదియు, పదునాఱువందల మూరల విస్తారముగల ఒకనివాస భవనము గలదు. అదీ మువ్వురు సమయేశీ శక్తుల స్థానముగా జెప్పబడినదీ-19. కామేశాదులు ముగ్గురు అచట దేవతలు. తక్కినది చతుర్థిక. ఆమెయే సమస్త విశ్వములను సృష్టించు లలితేశ్వరి-20. ఆ ముగ్గురి నామములను వినుము. అందులో కామేశి మొదటిది. తరువాత వారు వజ్రేశి, భగమాల, వారు వేలరీతులలో సేవింతురు-21. సమస్త దర్శనములకు వివిధ దేవతలైన కామేశ మొదలగు మహోదయలు ఆమెను (లలితను) అటసేవింతురు-22. వీరి ప్రస్తావమును నీత్యాశక్తుల ప్రస్తావమున చక్రిణులకును యోగినులకును శ్రీదేవీ పూరణుస్వరూపిణీ-23. కామేశ్వరదేవుని తొడపై పరుండు లలితాంబిక కాశమేశ్యాదులలో నాలుగవది. ఆమె నిత్యాశక్తులలో పదునారువది అనబడినదీ-24. యోగిని చక్రదేవతలలో తొమ్మిదవదనబడినది. ఓ ఇల్వలసంహారీ! సమయేశియంతరాల (మద్యదేశము)ముపైన నాథాంతరమను భవన ప్రదేశముగలదు. అదీ యిరువది మూరల యెత్తైనది. పదునాఱువందల మూరల విస్తారముగలది. పూర్వభవనములవలెనే మెట్లతో నలంకరింపబడినదీ-25, 26, అచట, కామేశదేవునిచే నీ లోకముల రక్షించుటకై సృష్టించబడిన నలుగురు యోగనాథులున్నారు. అచటి నాథలు మహాదేవి యొక్క యోగశాస్త్ర ప్రవర్తకలు. అందరికిని మంత్రగురువులు. సర్వవిద్యలకు మహా సముద్రమువంటివారు (నిధులు). వారి నామములను వినుము-27.28. మిత్రి, శోడిశుడు, చర్యుడు, ఓ మునీ! వారిచేత రక్షకోజకై పాదుకాత్మకములైన యనేకలోకములు సృష్టింబడినవి-29. దివ్యవిద్యలుగలవారు, మానవ సమూహములు సిద్ద సమూహములు, సురులు, తాపసులను సాలోక్య సిద్ధిని, సారూప్యసిద్దీని, సాయుజ్యసిద్ధిని బొందిన వారును-30. గొప్పగురువులు, వీరనేకులై గురువులను సేవింతురు. తరువాత నాథాంతరాలముయొక్కపైన యుత్తమనివాస గృహము గలదు-30,31. అదీ కూడ నీరువదీమూరల యెత్తైనది. పదునాఱువందల మూరల విస్తారముగలది. అదీ నీత్యాంతరమనబడిన నిత్యాశక్తీ, మందిరము. ఇచటి నీత్యాశక్తులు పదునైదుగురు-32. ఇక కామేశ్వరి నిత్య, భగమాలినీ నిత్య, నీత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసినీ-33. మహావజ్రేశ్వరి, దూతీ, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలినిక, చిత్ర-వీరు పదునైదుగురు అనబడిరి. వీరు దేవీ స్వరూపలు, మహాబలపరాక్రమవతులు-35. ప్రథమనే (ప్రతిపదనే) ప్రధానతిథిగా బొందినవారు, ముల్లోకములను వ్యాపించినవారు, భూత-భవిష్యత్-వర్తమాన కాలస్వరూపలు, కాలమును మ్రింగు పండితలు (యమునీ మ్రింగుపండితలు)-36, చాలాకాలమును బొందగోరు బ్రహ్మాది సమస్తులకు వారివారి శతాయుష్యరూపలై దేవియాజ్ఞచే నుండిరి-37. నిత్యప్రయత్నశీలలు, నిర్భయలు, శ్రీదేవి పరాంగమునుండి బుట్టినవారు-వీరు జగముల సంపద్వధీకై చిత్స్వరూపిణియైన లలితను సేవింతురు-కర్. వారి భవన రూపములనంది ప్రకాశించినవారు పదునైదుగురైన ఈశ్వరలు. సృష్టి బిందుచక్రమున షోడశియొక్క భవనమున్నది-39. ఇక, ఓ మునీ! నీత్యోంతరాలము యొక్కపైన అంగదేవ్యంతరము (అంతరము=భవనములదు. అదీ యిరువది మూరల యత్తైనది-40, పదునారు వందల మూరల విస్తారముగలది. పూర్వమువలె సోపానము గల మందిరము. ఓ మునీ! దానియందు హృదయదేవి మొదలగు శక్తులుండును-41. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, వర్మదేవి, దృష్టిదేవి, శస్త్రదేవి, అని హృదయదేవ్యాదులు ఆరుగురు అనబడిరి-41, 42, ఆ కామేశ్వర స్త్రీలు మిక్కిలి దగ్గరివారు, కొత్తయందము నిండిన యంగములు గలవారు. సావధానలు, ఆయుధములు ధరించినవారు-43. బిందు పీఠమున చుట్టును తిరుగుచున్నవారు మదించినయాకారముగలవారు. లలితాదేవి. యాను . ప్రవర్తింపజేయువారు; ఇంద్రియములను వశమునందుంచుకొన్నవారి యొక్క పీఠములందుండువారు-44 ఇక అంగదేవ్యంతరమునకు పైన మండలాకారమున బిందునాదమహా పీఠము గలదు. అది పదీ మూరల యెత్తైనది-45. ముప్పది రెండు వందల మూరల విస్తారముగలది. ఉదయించు సూర్యుని బోలినదీ.. దీనిని బిందుపీరమని తెలియవలె, అదీ శ్రీపీఠమని కూడా పిలువబడును-46, మహాపీఠమని తెలియవలె. విద్యాపీఠమని కూడ బిలువబడును. ఏబది పీఠములు ధరించునానందపీఠమనీ కూడాచెప్పబడును-47, పంచబ్రహ్మమయమైన యాయానందపీఠమున ముల్లోకములకు మూలమైన పంచరత్నము (ఐదు రత్నములుగల గొప్ప మంచము వెలుగుచుండును-48. ఆమంచము (సింహాసనము) యొక్క కాళ్ళు : నాలుగు. అవి పది మూరల యెత్తైనవి. మూడు మూరల విస్తారముగలవి-49. అవి బ్రహ్మ-విష్ణు-మహేశాన-ఈశ్వర రూపములు. ఎల్లప్పుడు శ్రీదేవియొక్క ధ్యానయోగము చేత శక్తిభావమును బొందినవి-50, అందులో నొకటి మైదుపాదములుగలది. మందార పుష్పములతో సమానముగా నెల్లనైనదీ. అది బ్రహ్మాత్మకమనీ యెరుగవలెను. అదీ ఆగ్నేయదిగ్భాగముసాశ్రయించియుండును-51. నాలుగవ మంచపాదము- కొండగోగుపూవుసారవుకాంతి గలది. (వచ్చనైనది). అదీ. ఈశ్వరాత్మకమని యెఱుగవలె.. ఈశాన్యదిగ్భాగమునాశ్రయించినది-52. వీరందరు సర్వాయుధులు: సర్వాభరణభూషితులు. పై భాగమునను క్రిందుభాగమునను. స్తంభరూపముగలిగి మధ్యన పురుష రూపములుగలవి-53. వారు శ్రీదేవి ధ్యానమున మూసుకొన్న కన్నులుగల వారు. శ్రీదేవీ ధ్యానముననే నిశ్చలమైన శరీరముగలవారు. వారిపైన మంచముయొక్క ఫలకము సదాశీవుడు-54. విచ్చినదానీమ్మ (పండు) కాంతిగల ఫలకము) అదీ పదునారు వందల మూరల విస్తారముకలది-ఇరువది నాలుగు వందల మూరల పొడవైనది. ఎల్లప్పుడు ప్రకాశించునా కారముగలదీ-55. అంగదేవతల యంతర(భవనము మొదలుకొని మంచము యొక్క ఫలకము వరకు చింతామణులతో నిర్మింపబడి తత్త్వరూపములైన (చింతామణి రూపములైన) మెట్లు ముప్పదియాఱు వినివేశములతో (ద్వారములతో) వెలుగుచుండెను. ఆరోహక్రమముననే (ఎక్కునప్పటిక్రమముననే) మెట్లను జెప్పుచున్నాను-57. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, గంధము, రసము, రూపము, - స్పర్శము, శబ్దము; ఉపస్థ, పాయువు, పాదములు-58, చేతులు, వాక్కు ఝణము, జిహ్వ, త్వక్కు నేత్రము, శ్రోతము, అహంకారము, బుద్ధి, మనస్సు, ప్రకృతి, పురుషుడు-59. నియతి, కాలము, రాగము, కళ, విద్య, మాయ, శుద్దవిద్య, ఈశ్వరసదాశివశక్తి శివ-అను-60. నీ ముప్పదియాఱు తత్త్వసోపాన పంక్తులుగా జెప్పబడినవి, మంచమునకు తూరుపు దిక్కున పూషసోపానపంక్తియని చెప్పబడినది-61. ఇక మంచము యొక్క పైన హంసతూలికాతల్పముగలదు. అది ఒక మూరెడు మాత్రమెత్తైనది. పదునారు పందల మూరల విస్తారముగలది-62 రెండేసి కాళ్లదిండ్లతోను తలదిండ్లతోను ఒప్పినది. అరువది నాలుగు గడ్డకముల యొక్క (బంగారు పాత్రలయొక్క-చెక్కిన చేపపిల్లల యొక్క యెళని కాంతితో బ్రకాశించినది-63, దానికి పైన కుసుమపూవు రంగుగల వస్త్రముచే నుత్తరీయము గలదు. అది పద్మరాగమణీ కాంతిగలది. పవిత్రమైనది. మెత్తనైనది-64. దానికిపైననుండుచు భగవంతుడై యాదిదేవుడైన కామేశ్వరుడను శివుడు. వెలుగుచుండును. అతడు తూరుపుమొగమై యుదయముతో గూడినపోడు శృంగారవేషమున మెరయుచున్న వాడు, ఎల్లప్పుడును పదునారేండ్ల ప్రాయమువాడు-65. ఉదయించు సూర్యబింబము వలె వెలగువాడు. నాలుగు చేతులు మూడుకన్నులు గలవాడు. హారములు, భుజకీర్తులు, కిరీటము, కంకణములు మొదలైనవానితో నలంకరింపబడినవాడు-66, మనోహరమై చిరునవ్వు వెన్నెల నిండిన చెంపలు గలవాడు-67. అతని తొడపై కూర్చొని పాపఘ్నియై భగవతీయైన లలితాంబిక ప్రకాశించుచున్నది. ఆమె బాల సూర్యునివలై నెల్లగా నున్నది. ఎప్పుడును పదునాండ్ల ప్రాయముగలది. నవయౌవనమునముదించిన-68. అమలిన పద్మరాగమణి కాంతిగలది. ఎట్టకమలమువంటి నఖకాంతులు గలది, లత్తుక శోభయవసరములేక సహజముగనే యెలుపును ప్రవహించు పాదములుగలది-69. మధుర ధ్వనిగల చిరుగజ్జిల బడుచున్న కంకణములతో మోహింపజేయునది, మన్మధుని శ్రేష్టమైన యమ్ములపొదుల మదమడంచు పిక్కలు గలది-70. ఏనుగతొండమువంటి చేతులు, అరటిస్తంభముల వంటి తొడలును గలది. మెత్తని యెఱని చిన్నని పట్టు వస్త్రముచే నలంకరింపబడిన పిరుదులుగలది. మణికట్టుయొక్క వైశాల్యముతో బ్రకాశించినదీ-71. సగముతోడలను గప్పు వస్త్రపుముడి గలది. రత్నముల మొలనూలుతో ప్రకాశించినది. ఆమె లోతైన నాభియను సుడిలో తీవకులను నలలకాంతీయను ప్రవాహము(నదిXగలది-72. మొగ్గవంటి చనుమొనలపై తూగాడు నూర్ణముతాల్యహారములు గలది-73. దిరిసెనపూవు రేకు కాంతి వంటికాంతీ గల నాలుగు భుజములు గలది. ఆ భుజములు భుజకీర్తులతోను, కంకణపంక్తులతోను అలంకరింపబడినవి. ఉంగరములుగల వ్రేళ్ళుగలవి. ఇట్టి భుజములు గలది. పతిచేయితాకి యున్న శంఖము వలె సుందరమైన కంఠముగలది-75. ముఖమనునద్ధమున గుండ్రముగానున్న గదువగలది. ఎట్టుని పెదవులు గలది. శుభ్రములు, వరుసలో శుద్దములు, విద్యాస్వరూపములునై ప్రకాశించునవి, మల్లెమొగ్గల శోభలో మెరయుచున్నవియు నైన పండ్లచే (దంతములచే) వెన్నెలల విరజిమ్మునది-76. లావైన ముత్యముల గ్రుచ్చినయనేకాభరణములతో ఐకాశించినది. మొగిలిపూవులోపలి దళముల వరుసలవలె మిక్కిలి పొడవైన కన్నులుగలది-77. అర్ధచంద్రునివలె సుందరమైన ఫాలభాగమున చక్కగా వాలిన ముంగురుల సమూహము గలది. చెవికమ్మలతోడి మణికుండలములతో నలంకరింపబడిన చెవులుగలది-78. కొత్త కర్పూరకస్తూరీలతోనెల్లప్పుడు సుగంధముగల తమలపాకు విడేము గలది. తిలకముగానున్న రత్నమువలె బ్రకాశించు ఫాలనేత్రముతో విరాజిల్లినది-80. గాఢాంధకారమువలె దట్టమైన సన్నని, వెంట్రుకల సమూహములుగలది. సీమంతరేఖలో నిడిన సిందూరరేఖతో వెలుగుచున్నది-81. తలపై మెలియుచున్న చంద్రకళ నలంకరించుకోన్నది. మదముతో చంచలములైన కన్నులుగలది. సమస్త శృంగారవేషములలో నొప్పినది, సమస్తాభరణములనలంకరించికొన్నదీ-82. సమస్త - లోకములకు " తల్లియైనదీ. సదానందమును వర్ధిల్లిచేయునది. బ్రహ్మ-విష్ణు-గిరీశ-ఈశ-సదాశివులకు మూలకారణమైనది-83. తనకడకన్నులలో జాలుపోరు-కరుణాప్రవాహముననందరినీ: సంతసింపజేయునది. ఇట్టి లలితాంబ కామేశ్వరాంకమున బ్రకాశించుచున్నది-84. ఇతర దైవతముల పూజలకు ఆమె (లలితా) పూజ ఫలమని పెద్దలు తెలియుదురు. ఆమె పూజకు ఫలము ఆమె పూజయేయని కూడ అందురు-85 కోట్ల వేల యేండ్లలో గూడ సామ్యొక్క ఒక్కయంశము గూడ వర్ణింపనలవిగాదు. ఇక లలితాదేవిని సంపూర్ణముగా నేనెట్లు వర్ణింపగలను-86. ఆమె వాక్కులకు మించిన రూపముగలది. ఇక ఆమెను వర్ణించుటకు వాక్కులెట్లు సమర్థమగును? వేదము “యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ (అన్నీ వాక్కులును. మనస్సుతో సహా ఆమెను పొందలేక మరలి వచ్చినవి). అనీ, వేదము జెప్పినదిగదా! -87. పెక్కులు చెప్పనేల! తత్వ(నిజ)మైన విషయమును వినుము దీనిని పక్షపాతమునగాని, స్నేహమునగాని, మోహమున (భ్రాంతితో గానీ నేను చెప్పుటలేదు-86, ఓ తపోనిధీ! కల్పతరువు శాఖలు లేఖలు (కలములు)అగుగాక. ఏడు మహాసముద్రములన్నియు మషీషాత్రములు (సిరాబుడ్లు) అగుగాక-89. ఏబది కోట్ల యోజనములు) విస్తీర్ణముగల భూమి పత్రము (కాగితము) అగుగాక, దాని లేఖన కాలము సంఖ్యలో చివరి సంఖ్యతో లెక్కించిన కాలము వరకు (సంఖ్యాప్రమాణము ఏకాది పరార్ధ పర్యంతము అని ఆంతవరకు శాస్త్రకారులు చెప్పుదురు) అగుగాక-90. సమస్తలోకములు ప్రత్యేకముగా కోటి (అనంత )బాహువులు వ్రాయుగాక, ఓ యగస్త్యా! చెప్పువారందరు బృహస్పతి సమానులైనను సరే!-91. ఐనను ఆ శ్రీదేవి యొక్క కమలము.వంటీ. పాదములోని ఒక్క వ్రేలి వెలుగుయొక్క వేయి యంశలలో ఒక చిన్ని యంశము యొక్క వర్ణనము గూడ వర్ణింపబడదు. మొత్తముపైన ఆమె గుణములను స్తుతించుటలో ప్రవృత్తియంతయు నిష్పలము. (ఇచట పుష్పదంతకృత శివమహిమ్నస్తోత్రపద్యము స్మరింపనగును)

ఈ రెంటిలో దేనికేది మూలమో నిక్కముగా దెలియదు, పౌరాణికమే మూలముగా నోపును. ఇందులోని ఐృహస్పతి సములను శారదగా సంస్కరించుట జరిగినది. శారద లిఖించుట మహోన్నత భావన. అదియు, పారమునందదనుట మరింత మహోన్నతము.) బిందుపీఠముచుట్టను చదరముగా మహామాయాజవనిక వ్రేలాడుచుండును. అది నల్లని కాంతిగలది-93. దేవియొక్కపైన నలుబది మూరలయెత్తున ముల్లోకములలోను దుర్లభమైన ఇంద్రగోప వీతానము (ఆర్ల పురుగుల రంగుగల చందుకటు, చాందినీ, దోమతెర) కట్టబడినది-94.. అచటనున్న యలంకార సమూహము ముల్లోకములలో దుర్లభము. వానీని వర్ణింపబోవుచునా వాడి సిగ్గున కంఠముననే అడ్డీ రాకున్నది-95, అచటి సమస్తమును ఆమెయే తెలియును, అచటి సౌభాగ్యమునెవడు వర్ణింపగలడు?-96. ఈ విధముగా లలితాంబిక భండదైత్యవధకోఱకై జ్ఞానాగ్నినుండి బుట్టినది. ఆమె సమస్తదానవులను నిశ్శేషముగా దహించివైచినది-97. దివ్యశిల్పులచే నిర్మింపబడిన పదునారు క్షేత్రములు గల భవన రూపమైన శ్రీ నగరమును అధిష్టించి యెల్లప్పుడు జగమును రక్షించును-98 ఈ విధముగనే తక్కిన శ్రీపురములు గూడ గలవు. ఆపురములలో భేదము లేదు. పేరు మాత్రమే వేరు-99. నానా వృక్షములుగల మహోద్యానము మొదలు క్రమముగా శ్రీపుర కథను జెప్పువారు పరమగతిని బొందుదురు-100. వినువారు, అడుగువారు, వెదకువారు ఆమెస్తోత్రచరిత్రాది పుస్తకములను ధరించువారును పరమగతి- బొందుదురు-101. శ్రీపుర పద్దతిలో ఆయాసాన విభేదములు - జూపుచు శిల్పిజనులచే శ్రీదేవియొక్క మహాభవనమును నిర్మింపజేయువారును పరమగతిని బొందుదురు-102.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవోగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున గృహరాజాంతరకథనమను ముప్పది యేడవ యధ్యాయము 37