బ్రహ్మాండ మహా పురాణము
31 - చతుర్యుగాఖ్యానము - వర్ణములు - జీవిత విధానము
31 - చతుర్యుగాఖ్యానము - వర్ణములు - జీవిత విధానము
సూతుఁడిట్లు చెప్పెను.
ఇంక ముందు మరల ద్వాపరము యొక్క వీధినీ (స్థితిని) చెప్పెదను. త్రేతాయుగము గతింపగా ద్వాపరయుగ మారంభమగును.(1) త్రేతాయుగమున ఎట్టి సిద్దీని ప్రజలు పొందిరో, అయ్యది ప్రజలతో సహా నష్టమగును. ద్వాపరాదీలో (యుగము మారగా) (2) ద్వాపరము నందు మరల ఆ ప్రజలలో వర్ణముల కలకలుపు, సంకరము కలుగును. సర్వ కార్య కలాపములు విపరీతత్వము నొందును. (3) ద్వాపర యుగమున ప్రవృత్తి (కార్యకలాపములు) రజస్తమోగుణయుక్తము అందుచే యజ్ఞ ప్రాధాన్యము, న్యాయ పాలనము, మదము, దంభము, క్షమ, బలములు ఇదీ రజస్తమములతో గూడిన ద్వాపరము నందలి ప్రవృత్తిగా జెప్పబడినది. [4). మొదట కృతయుగమున సంస్థితమై యున్న ధర్మము, త్రేతాయుగమున కూడ ప్రవర్తించును. ద్వాపర యుగమున ధర్మము అధికముగా వ్యాకులీ భూతమయి, పరిణమించి, కలియుగమున పూర్ణముగా నశించును. (5) ఆ యుగమున వర్ణములకు పూర్ణ విధ్వంసము కలుగును. అట్లే ఆశ్రమ చతుష్టయము ఒకదానితో నొకటి కలిసి సంకీర్ణత్వము చెందును. ఆ యుగమున శ్రుతి స్కృతులకు మధ్య విరోధము ద్వైవిధ్యము కలుగును. (6) శ్రుతి స్మృతుల ద్వైవిధ్యముచే నిశ్చయ మొందుటకు వీలులేదయ్యెను. అనిశ్చయత్వము యొక్క ప్రాబల్యముచే ధర్మతత్వమున ఇదమిత్థమను నిశ్చయత్వము లేదయ్యెను. (7) ధర్మము యొక్క స్థితి చేడినందున (ధర్మము లేనందున) మానవులలో మిత్రులలో కూడ అభిప్రాయ భేదము కలుగును. పరస్పరము విభిన్న మనస్కత వలన, దృక్పథముల విభిన్నత్వము వలన, ఇది ధర్మము, ఇదికాదు అను నిశ్చయము పొందబడదు. కోణముల యొక్క వికల్పత్వముచే, అస్పష్టతచే తత్పరిణామములయిన కార్యములయందు (ఫలితము లందు) ప్రజలలో విభిన్నమైన యభిప్రాయము లుదయించును. కార్యములు కూడ నిశ్చయ రూపము నొందవు. మతి భేదము చేతను, భ్రాంతి విదృక్పథముల చేతను, దృష్టి భేదము చేతను శాస్త్రముల సముదాయమందు విభిన్నత్వము కల్పింపఁబడినది. (10)
త్రేతాయుగము ఒకే యొక వేదము. దానికి నాలుగు పాదములు. అని వీధింపఁబడినది. ఆయుః ప్రమాణము సంక్షయమగుటచే ద్వాపరయుగమున వేదము విభజింపఁబడును. (11) ఋక్ యజుస్సామ వేదముల సంహితా భాగములు మహరులచే విభిన్నముగా మంత్రముల కూర్పుల భేదముతో, బ్రాహ్మణముల భేదములతో మంత్ర భేదములతో, స్వర వర్ణముల మార్పులతో దృక్పథ విభిన్నత్వములతో మార్పులు కల్పింపఁబడినవి. కొన్ని కొన్ని స్థలముల నయ్యవి సమానములు. కొన్నిచోట్ల పూర్తిగా మారినవి, ఇవియు దృష్టి భేదముననే గలిగినవి. ఇట్టి పరిస్థితీయే బ్రాహ్మణములకు, కల్ప సూత్రములకు, మంత్ర ప్రవచనములకు, కలిగినది. ఇతరులు కొందరు వీని ననుసరించిరి. మరి కొందరు వీనిని (ఈ మార్పులను చేర్పులను) ప్రతిఘటించిరి. అంగీకరింపక వేలుగా కోందరుండిపోయిరి. (14) ద్వాపరము నందు అవి ప్రవర్తింప నారంభించెను. మరి కలియుగమున నవి నీవర్తనము చెందును. యజుర్వేదమున ఒకే ఆధ్వర్యవముండును. కానీ యజుర్వేదము కాలాంతరము రెండుగా నయినది. (15) సామాన్యవిపరీతార్థపద్దతులచే శాస్త్రజాతము తికమకలయినది. ఆధ్వర్యవుల ప్రస్థాన బాహుళ్యముచే (యజుర్వేదము) బహుధా వ్యాకులీకృత మయినది. (16) ఈ వ్యాకులత్వము అధర్వ ఋక్ సామవేదములందలి వీకల్ప పాఠములచే కలిగి ద్వాపరయుగమున భీన్నదర్శనములచే వ్యాకులీకృతమయినది. (17) ఆ వేదాదులు పెక్కు భేదభాగములు, విభిన్న భాగములు, వికల్ప పాఠములు కలిగినవి. ఇట్లు ద్వాపరమున విపరిణమింప నారంభమై ప్రవర్తించి తరువాత కలియుగమున వినాశనము చెందును. (18) ఈ విపరీతముల ఫలితములు ద్వాపరమున మరల కలుగును. తత్ఫలితములు వర్షము యొక్క అభావము, మరణము, రోగము, ఇతర బాధలు. పాక్కర్మ జములయిన దుః ఖముల వలన నిర్వేదము మరల కలుగును, నిర్వేదము వలన పొరలకు దుఃఖమోక్షవిచారణము కలుగును. (20)
విచారణము వలన వైరాగ్యము కలుగును, వైరాగ్యము వలన దోషదర్శనము. దోష దర్శనమున ద్వాపరయుగమున జ్ఞానము కలుగును. (21) మొదటి స్వాయంభువ మన్వంతరమున, ఆయజ్ఞానులకు, ద్వాపర యుగమున శాస్త్ర గ్రంథములకును శత్రువులు బయలు దేరుదురు. (22) ఆయుర్వేద శాస్త్రమున, తత్సంబధి అంగశాస్త్రముల యందు, జ్యోతిష శాస్త్రమునందు, అర్థశాస్త్రమునందు, హేతుశాస్త్రములందు (తర్కమున) ఎన్నియో వికల్పములు, సంశయములు, అనిశ్చిత విషయములు కలవు. (23) ఆ విధముగనే, శాస్త్ర భాష్యములయందు ప్రక్రియా సూత్ర విద్యల యందు, కల్ప సూత్రములయందు, వికల్పము లెన్నియో ఘటిల్లినవి. వేరువేరు స్మృతి (ధర్మ) శాస్త్రములు ప్రస్థానములు (భిన్న భిన్న మతములు - అభిప్రాయములు) కలవు. ఇవీ ద్వాపరయుగమున సంభవించును. ఏలయన మనుష్యులయందు విభిన్న దృక్పథములుండుట వలన (24, 25, 26) మనస్సుచే, వాక్కుచే, కర్మచే, (వార్త, వ్యవసాయము) ద్వాపరమున కష్టముపై, శరీర శ్రమచే, వ్యవసాయము, ఇతర వృత్తులు వృద్ధి చెందును. వృత్తుల యందలీ చైతన్యము వ్యాపారాశ్రయమై యున్నది. సిద్దాంతముల వినిశ్చయత్వము మాత్రము లేదు. (27) వేదశాస్త్రముల ననుసరించి రచనలు బయలు దేరినవి. కాని అందు అనేకముల యొక్క సంకరము కలిగినది. వర్ణాశ్రమ విధ్వంసము కామ క్రోధములు ద్వాపరమున వృద్ధి చెందును. రాగము, లోభము, వధ ప్రవర్తిల్లును. ఈ ద్వాపరమునందే వ్యాసుడు వేదమును నాలుగు భాగములుగ విభజించెను. (28) ద్వాపర యుగము అంతమైన వెనుక సంధ్యాయుగములో (యుగమునకు యుగమునకు మధ్య కాలములో) ద్వాపరయుగ కలియుగముల మధ్య కాలములో కూడ నీట్లే జరుగును, ద్వాపరయుగ లక్షణముల ధర్మ గుణహీనములై ప్రతిష్ఠ చెందును. ఏవం విధముగనే సంధ్యాంశ కూడ సాగును. (తిష్య - కవి) ద్వాపరయుగము యొక్క మిగిలిన దానిని బట్టి కలియుగ వివరణములఁ దెలిసికొనుము. (30)
శేషించిన ద్వాపరయుగ లక్షణములచే కలి యొక్క ప్రతిపత్తి, లక్షణాదికములాధారపడియుండును. హింస, అసూయ, అనృతము, మాయ తపస్వుల వధించుట ఇవీ కలియొక్క లక్షణములు. అయినను ప్రజలు కొంత సాధింతురు. అది ధర్మము యొక్క కృత్స్నత్వము. ధర్మము పరిక్షయము నొందును. (32) మనస్సుచే వాక్కుచే కర్మచే శ్రమపడి క్లేశముతో సాధించినను వార్త (వ్యవసాయము) వృద్ధి చెందునో చెందదో సంశయము, కలియుగమున మరణాంతకములు (ప్రమాదకరములు) అయిన రోగములు ప్రబలును. ఆకలిచే భయముచే నీత్యము ప్రజలు బాధల నొందెదరు. (33) వర్షము లేకపోవుట వలన నధికమయిన భయము కలియుగమున కలుగును. దేశములన్నింటియందును ఏఫర్యయములు విపరీత కష్ట నష్టములు కలుగును. కలియుగమున ధర్మశాస్త్రములయిన స్మృతులయందు ప్రామాణ్యబుద్దీ లేదు. (34} కలియుగమున ప్రజలు వివిధ వయస్సులలో మృతి చెందుదురు. కొందరు తల్లి గర్భమునందే మరణించెదరు. కొందరు యౌవనమునందు మృతి చెందుదురు. కొందరు వార్ధక్యమున కొందరు కౌమారమున మరణింతురు (బాల్యవయస్సున). దుష్టముగా యజ్ఞములు చేయుటవలన, వేదములను చక్కగా నధ్యయనము చేయకపోవుటవలన, దుష్కృతముల వలన, ధర్మశాస్త్రాదులకు విపరీతార్థములు చెప్పుటవలన, బ్రాహ్మణులు చేయు కర్మల యందలి దోషముల వలన ప్రజలకు ప్రమాదము, భయము కలుగును. (36) హింస, మాయ, అసూయ, క్రోధము, ఈర్షా, అసహనము మొదలగునవి కలియుగ మందలి ప్రజలకు కలుగును. ప్రతి జీవియందు రాగము లోభము కలుగును. (37) కలియుగము రాగా అత్యంత సంక్షోభము కలుగును. నరులకు పరమాయుర్దాయము వేయి సంవత్సరములు, (38) ద్విజవంశమున పుట్టినవారు వేదముల నధ్యయనము చేయరు. యజ్ఞముల నాచరింపరు. క్రమముగా క్షత్రియులు, వైశ్యులు నరులు నాశనము నొందుదురు. ఆధమ యోనుల పుట్టిన శూద్రులకు బ్రాహ్మణులతో సంబంధము కలుగును. వారితో బ్రాహ్మణులకు శయనాసన భోజనములు కలుగును.
ఆ కాలమున శూద్రులు రాజులు దేశమున పాషండ మత ప్రవర్తకులు. ప్రజలు గుణహీనులు. ఆగుదురు. ఆయుః ప్రమాణము, బుద్దీ బలము, శరీరబలము, రూపము కులము నశించును. శూద్రులు బ్రాహ్మణాచారపరులు మరి బ్రాహ్మణులు శూద్రాచార పరులగుదురు. దొంగలు రాజవృత్తి నవలంబింతురు. రాజులు చోరుల ఆచారముల నవలంబించి చోరులవలె జీవింతురు. యుగాంతమాసన్నమగుచుండ భృత్యులు అసుభృతులుగా (చక్కగా భరింపబడనిపొరిగా) జీవింతురు. (43) ఓ మునిసత్తమ ! యుగాంతము నందు స్త్రీలు శీలరహితలు అనృతపరులు నగుదురు. వారు సురాపాన పరురాండ్రు, మాంస ప్రియురాండ్రు మాయావినులు నగుదురు. (44) ఓ మునిసత్తమ ! యుగాంతకాలమున ఏకభర్తృకలుండరు. క్రూర జంతువులు వృద్ధి చెందును. గోవులు మున్నగు పశువులు క్షీణించును. (45) యుగాంతము నందు సాధువులు మరలిపోవుదురు. (ధర్మపుర స్మృతులు కారు) వేటుగా నుందురు. వారి యందు విద్యా ప్రవృత్తి (ధర్మరతి) క్షీణించును. ఆ సమయమున ఉత్తమ దానమూలమయిన ధర్మము సకృత్తుగా గోచరించును. (46) నాలుగు ఆశ్రమముల విధింపఁబడిన ధర్మము శిధిలమైపోవును. ధర్మము పరిణమించును. పతనమగును. ఆ సమయమున భూమి అల్పఫలమొసంగును. కాని ఒక్కొక్కచో అధిక ఫలితములు కూడ నొసంగును. (47) రాజులు తమకు వచ్చు పన్నులు మొదలయిన వాని ననుభవించెదరే కాని ప్రజా రక్షకులు కారు. యుగాంతమునందు వారు స్వరక్షణపరులగుదురు. (48) రాజులు రక్షకులు కారు. బ్రాహ్మణులు శూద్రోప జీవులు అగుదురు. ద్విజసత్తములందరు యుగాంతమున శూద్రులకు పాదాభివందనము చేయుదురు. సామాన్య జనులు అన్న విక్రేతలగుదురు. బ్రాహ్మణులు వేదములను విక్రయించెదరు. యుగాంత కొలమాసన్నము కాగా ప్రమదలు (యౌవన స్త్రీలు) తమ శరీరముల నమ్ముకొందురు. (జారిణీ స్థితికి దిగజారెదరు).
కలియుగమున ఉత్తమ బ్రాహ్మణులు కూడ తమ తపస్సును, యజ్ఞ ఫలములను నమ్ముకొందురు. కలియుగమున పెక్కురు యతులుగా నగుదురు. (ఇంద్రుఁడు) వరదేవుఁడు విచిత్ర వర్షములు కురియింప నయ్యది యుగక్షయసూచనమని చెప్పుదురు. ఈ యథము (యుగమున నెల్లరును వర్తకులే యగుదురు. (52) జనులందరు అసత్యపు (దొంగ) తూకములతో, మానములతో వర్తకమాచరించి వస్తువులమ్ముదురు. సంఘమంతయును వ్యాధ (కిరాతులు) రూప జనులతోను, పొషండులతోను సమావృతమై యుండును. (53) యుగాంతము సముపస్థితముకాగా - పురుష సంఖ్య అల్పము, స్త్రీల సంఖ్య యధికమునగును. ప్రజలందరు యాచకులగుదురు. పరస్పరము బిచ్చమెత్తుకొందురు. (54) యుగము క్షీణించుచుండగా పొందిన యుపకారమునకు ప్రత్యుపకృతి చేయు వ్యాకర్త ఉండడు; ఇతరులను గాసిల చేసి బాధ కల్పింపని వాడుండడు; పరుష వాక్కులు లేని వారుండరు; అర్జవ వంతుఁడైన. వాఁడు, అసూయా రహితుఁడెవ్వఁడును ఉండడు. యుగము యొక్క అంత్యలక్షణము, భయ ప్రమాదములను శంకించుట, అంత వసుంధర యంతయును ఐశ్వర్య (ధన వసు) శూన్యమగును. (56) పాలకులు నిజముగా రక్షకులే యైనను రక్షకులుకారు. వారు పరుల రత్నములను నగలను దొంగిలింతురు. అంతీయే కాక పరుల భార్యలను పీడించెదరు (విమర్శించెదరు - చెరిచెదరు) ప్రజలందరు కామాత్ములు. అంతీయేకాక దుష్టమైన భావములు కలవారు, వారు అధములు; సాహస ప్రియులు, ఘాతుక కార్య మాచరించెదరు. ఉత్తమ క్రియాప్రనష్టులు ధూర్తులు శఠులు. వారు జుత్తు వీరబోసికొందురు ముడివేయరు. వారు దయాశూన్యులు. (58) ఈ కలియుగాంతమున పురుషులు పదియారేండ్లు నిండక పూర్వమే పిల్లలను కందురు. పదీయారేండ్లకు లోపు స్త్రీలే బిడ్డలు కందురు. యుగాంతమున శూద్రులు తెల్లని దంతములతో (శుక్లదంతైః) కాషాయ వస్త్రములతో తలలు గొరించుకొని, ఇంద్రియజేతలగుదురు. (59)
శూద్రులు యుగాంతమున సస్యచోరులు. అట్లే వస్త్రములు దుస్తులు దొంగిలింతురు. (60) కొందరు దొంగలు ఇతరులయిన దొంగల నుండియే దొంగిలింతురు. ఒక తస్కరుని వద్ద నుండి విలువైన వస్తువులను దొంగిలించు వేటిక తస్కరుఁడుండును. జ్ఞానకర్మలు అదృశ్యముకాగా, లోకము సర్వము నిష్క్రియత్వము నొందును, కీటకములు, ఎలుకలు, సర్పములు మాటిమాటికి మానవుల నెదుర్కొని భయపెట్టును పీడించును. అప్పుడు క్షేమము, ఆరోగ్యము, సామర్థ్యము శాశ్వతముగా పొందుట దుర్లభము. (62) దేశములు క్షుద్భయ పీడితములై కౌశీకుల కొఱకు నిరీక్షించును (కౌశికులు దాచపెట్టఁబడిన ధనముకై వెదకువారు). దుఃఖాభిఫుతులయిన వారలకు పరమాయుః ప్రమాణము వంద సంవత్సరములు, (63) కలియుగమున వేదములన్నియు కనంబడి కనబడవు. వేదములను ప్రజలు చదువరు. అవగాహన చేసికొనరు. యజ్ఞములు కేవలము ధర్మపీడితములై నశించును. (64) కలియుగము వచ్చిన తరువాత పలువిధ పాఖండులు నాస్తికులు బయలు దేరుదురు. కాషాయ వస్త్రముల దొల్చునట్టి బౌద్ధులు, జైనులు, కాపాలికులు తదితరులు చెలరేగుదురు. వేదములవిక్రయింతురు మరికొందరు పవిత్రతీర్ధ స్థలములనే అమ్మొదరు. (65) పాషండులు నాస్తికులు వర్ణాశ్రమ ధర్మాచారములకు శత్రువులు. కలియుగము ఆరంభముగా ఇట్టివారు పుట్టుదురు. (66) ధర్మార్థకోవిదులు శూద్రులు వేదముల సధ్యయనము చేసెదరు. శూద్ర జాతులయిన రాజులు అశ్వమేధ యాగములఁ జేసెదరు. స్త్రీలను, బాలురను, గోవులను ఇతరులను పరస్పరము వధించి ప్రజలు ఒండొరులు స్వకార్యముల సాధించుకొందురు. ప్రజలత్యంతమ ధర్మాభినిలేశులగుట, కలియుగమున, ప్రజ ప్రవృత్తి తామసిక మగును. స్వకీయములైన దుఃఖములను వెళ్లబోసికోనుటచే ప్రజలు అల్పాయుష్కు లగుదురు. వారీ దేహములు అల్పాయుషములు. దీనికి కారణము వారు రోగములచే బాధనొందుదురు. పరస్పర వైర భావమున ప్రజలలో భ్రూణహత్య నాచరించుట (గర్భస్థ శ్రీశువులను చంపుట) ప్రవర్తించును. అందుచే కలియుగ మారంభము కాగా, ఆయుస్సు, బలము, రూపము క్షీణించును. (70)
ఆ సమయమున ప్రజలు అల్పకాలములో సిద్దీని పొందెదరు. కలియుగాంతమున ద్విజసత్తములు, ధన్యులు (పవిత్రులు) ధర్మమాచరింతురు. (71) ఈ ద్విజసత్తములు శ్రుతి స్మృత్యుదితములైన ధర్మములను అనసూయులై యాచరింతురు. త్రేతాయుగమున ఆచరించిన ధర్మము ఒక సంవత్సర కాలము ఫలిత మొసంగును. ద్వాపర యుగము నందొకే మాసమున ఫలిత మొసంగును. (72) ప్రాజ్ఞుఁడైనవాఁడు ధర్మము నోచరించినచో, యథాశక్తి తాను కోరిన ఫలితము నొందును. ఇది కలియుగావస్థ, సంధ్యాంశమందలి స్థితిగతుల నెఱుంగుము. (73) ఆ దీనముననే యుగయుగము సిద్దులు మూడు మూడు పాదములు తగ్గును. ఈ కలియుగముగ స్వభావమును బట్టి సంధ్యలలోనవి యట్లే యుండును. (74) సంధ్యా స్వభావము సంధ్యాంశములు పాదశేషములై ప్రతిష్ఠితములగును. (75) యుగముల యంత్యమున సంధ్యాంశ కొలములో ఒక ధర్మ నియంత శాస్త్ర) యవతరించును. అసాధులయిన భృగులను చంపుటకై ఆతఁడావిర్భవించును. ఆతనిని ప్రమతి’ యందురు. ఆతఁడు చంద్రవంశీయుఁడు. (76) పూర్వము స్వాయంభువ మన్వంతరమున ఆతఁడే మాధవాంశతో (విష్ణు) పుట్టెను. ఒక యిరువది సంవత్సరములు భూమి నంతటిని గుఱ్ఱములు, రథములు, ఏనుగులు, గలిగిన సైన్యముతో పర్యటించేను. గృహీతాయుధులయిన వందల కొలది, వేలకొలదీ బ్రాహ్మణులతో పరివృతుఁడై మ్లేచ్ఛులను సర్వత్ర చంపెను. శూద్ర యోనిజులయిన పాషండులను, రాజులను ఎల్లరను నతండు చంపెను. అత్యంత ధార్మికులు కానీ వారలెల్లరను దేశము నందంతటను చంపును. (80)
శక్తిమంతుఁడు మంత్రకృత్తు మ్లేచ్ఛులను చంపినపోఁడు వర్ణ వ్యత్యాసమున పుట్టిన వారిని వారి అనుజీవులను చంపిన ప్రభువు ఉదీచ్యులను (ఉత్తర దేశము వారలను) మధ్య దేశీయులను (మధ్యదేశమున నివసించు ప్రజలను) పర్వతముల నివసించు వారలను, ప్రాచ్యదేశ ప్రజలను, పడమటి దేశ వాసులను, వింధ్య పర్వత చరియల యందు నడచుచు జీవించు వారలను, దాక్షిణాత్యులను, ద్రావిడ దేశీయులను, సింహాలేయులను, గాంధార దేశీయులను, పారద దేశీయులను, పహ్లవులను, యవనులను, శకులను, తుషార దేశీయులను, బర్బర దేశీయులను, చీనా దేశీయులను, శూలీకులను, దరదులను, ఖశులను, లంపాకారులను, కతకులను, బహువిధ కిరాత జాతులను చంపును. బలవంతుఁడయిన ప్రభువు చక్రమును ప్రయోగించి కిరాత జాతుల నందరను వధించును. (84) సర్వభూతములకు అగోచరుఁడై ఆ ప్రభువు మాధవునీ, అంశచే పుట్టెను. పూర్వ జన్మమున ఆతఁడు మహావీర్యవంతుఁడు, ‘ప్రమతి’ అను పేరుతో ప్రఖ్యాతుఁడు. పూర్వము కలియుగమున నతఁడు చంద్రుని గోత్రమున నుద్భవించెను. (86) ఆతనికి ముప్పది రెండేండ్లప్పుడు విజయయాత్ర సోరంభించెను. ఇరువది సంవత్సరముల పాటు అతఁడు సర్వత్ర సర్వభూతములను మానవులనునెల్ల చంప మొదలిడెను. (87) మహాక్రూరకర్మచే సర్వమును ధ్వంసముచేసి, పృథివియందాతఁడు భీజములను మిగిల్చెను. అధార్మికులు పాపాచరణులు నయిన వృషలులను, వారిని పరస్పరము కోపగింపచేసి, ఆకస్మికముగ మోరలను క్రోధోద్దీపులనుచేసి, ఆతఁడు స్వాధీనము చేసికొనెను. (88) ఆ తరువాత గంగాయమునా నదుల మధ్య ప్రదేశమున నతఁడు తన యనుచరులతో సహితము శాంతియుత నిష్టతో ఆవాస మొనర్చెను. తరువాత అతఁడు కల్పము గతింపగా వేలాది మేచ్చరాజులను తన సైనికులతో వీణాశన మొనరింపం జేసి తనవారితో తన శాశ్వత వాసమున కరిగెను. యుగాంతమున సంధ్యాంశకాలము సంప్రాప్తింపగా అక్కడక్కడనే కొలది మంది జనులు మిగులుదురు.
వారందరు విపరీత గ్రహ యోగముచే దురదృష్టవంతులు. వారిలో చాలా మంది లోభావోష్టులు. గుంపులు గుంపులుగా ఒండొరులు కొట్టుకొని పరస్పరము. గాయపరచుకొనిరి. (92) అరాజకము ప్రబలినది. యుగవశమున నంక్షయము సంప్రాప్తముకాగా, ప్రజలు పరస్పర భయముచే బాధితులయిరి. (93) వారు వ్యాకులత్వము చెందిరీ, భ్రష్టమనస్కులై పరీభ్రాంతులైరి. వారు గృహములను భార్యలను విడిచిపెట్టిరి. స్వప్రాణములపై ఆశ వదలుకొనిరి. బ్రతికి బట్టకట్టగలమను ఆశ వారికి పోయినది. నిష్కారణముగా వారందరు విశేషముగా దుఃఖితులయిరి. (94) శ్రుతుల మీఁద స్మృతులమీద ఆధారపడిన ధర్మము నశించినది. ప్రజలొండొరులను చంపుకొనిరి. వారు మర్యాదా రహితులు (మంచి చెడ్డ అవధులు లేనట్టివారు). స్నేహ రహితులు, సిగ్గువదలినవారు, తమవారు లేనివారు. నీరాక్రందులు ఏడ్పులు విడిచినవారు. (95) ధర్మము ప్రతి హతము కాగా (ఇంతకుం బూర్వము 52 అంగుళముల ప్రమాణములో నుండువారు) 25 అంగుళములకు ప్రస్వ శరీరులు ప్రజలయిరి. విషాదముచే సంక్షుభితేంద్రియులయి బుడ్డీ పోగొట్టుకొనిరి. వారు పిల్లలను భార్యలను విడిచి పారిపోయిరి. ప్రజలు అనావృష్టిచే కొట్టబడిరి. దుః భీతులయిరి. వ్యవసాయక కార్యములు విడిచిరి, తమ దేశ ప్రాంతములను విడిచిరి. ఇతర ప్రదేశములకు వెడలిరి. ఇంక వారు సముద్ర ప్రాంత ప్రదేశములను, నదీ ప్రాంతములను, పర్వత ప్రదేశములను ఆశ్రయించిరి. సుదుఃఖితులై మాంసముతో ఫలములతో దుంపలతో జీవించిరి. వారు ఆకులను, తోళ్లను, వస్త్రములుగా ధరించిరి. ధర్మక్రియాదులను వారు విడచిరి. వారి కుటుంబములను విడిచి పెట్టిరి. సమాజధర్మము లన వర్ణాశ్రమ విధులనుండి పరిభ్రష్టులయిరి. భయోద్రిక్తమయిన సాంకర్య జీవితమునందిరి. అట్టి పరమ నీచస్థితిని వారు పొందిరి. ఏ కొందరో అల్ప సంఖ్యాకులు ప్రజలు మిగిలిరి. వార్ధక్యముచే, వ్యాధులచే, ఆకలిచే, బాధితులయిరి. దుఃఖముచే నిర్వేదము నొందిరి. నిర్వేదముచే విచారణ స్థితికి చేరిరి. విచారణము వలన సామ్యావస్థకు చేరిరి. సామ్యావస్థ వలన బోధ (జ్ఞాన) స్థితికి చేరిరి. ఆ సంబోధ స్థితి నుండి ధర్మ శీలత్వము కలుగును. ఈ విధముగా కలియుగమున మిగిలిన వారు ఉపశమనము నొందిరి. మనో నిగ్రహమును బడసిరి. (101)
యుగాంతము పరిణామమును పొందుచుండగా, ప్రజలు నిద్రపోయినట్లు, ఉన్మత్తులయినట్లు సంమోహితులై విశ్రాంత మనస్కులై యహోరాత్రములుందురు. భవిష్యత్తు అనివార్యము 'బలీయమగుటవలన, కృతయుగము వచ్చినది. పవిత్రమయిన కృతయుగము ప్రవర్తింప ఆరంభమయినప్పుడు, కృతయుగపు ప్రజలు కలియుగము నుండి మిగిలిన {కలిశిష్టాః) వారి వలన జన్మించినవారు అప్పటికున్న సిద్దులు అదృశ్యులై సంచరింప మొదలిడిరి. సప్తరులు కూడ అచ్చట వ్యవస్థితులై యున్నారు. బ్రాహ్మణులు క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు బీజ స్థానీయులుగా స్మరింపఁబడుచున్నారు. (105) (వారే రాబోవు సంతతులకు మూల బీజముగా స్మరింపఁబడుచున్నారు). ఆ సమయమున వారు (కలితైః) కలియుగము వలన పుట్టిన వారితో నిర్విశేషులుగా (సమానులుగా)నైరి. వారిలో నెట్టి భేదమును లేదు. సప్తర్వులు వారికి తదితరులకు ధర్మమును వివరింతురు. (106) ధర్మము వర్ణాశ్రమాచార ప్రవర్తనముతో కూడికొని యున్నది. అది ద్వీవిధము భౌతముడ వేదముల యందు విధింపబడినది. స్మార్తము స్మృతుల యందు వీధింపఁబడినది. ప్రజల కొఱకు, కృతయుగమున ధర్మము ధర్మకార్యానువర్తనులయందు ప్రతిష్ఠితమై యున్నది. భౌత స్మార్త ధర్మములు కృతయుగమున సప్తర్వులు నిరూపింప వానిలో కొన్ని ధర్మములాయుగముయొక్క అంతము వరకు ధర్మముయొక్క వ్యవస్థార్గము నిలిచియుండును. ఇచ్చట యుగక్షయము వలన నిది జరుగును. (108) మునులు మన్వంతర కాలము వరకు అధికారమున నుందురు. ఇది యెట్టిదన అరణ్యము నందలి తృణాదీకములు దావాగ్నిచే దగ్ధములగును. కాని ఆ తృణముల మూలములు వేరులు దగ్ధములు కాను. చెడిపోవు. ఈ తృణ సంబంధమయిన వేరుల నుండి గడ్డి మొలక లుదయించినట్లు కృతయుగమందలి ప్రజలు కలియుగ ప్రజల నుండి వృద్ధి పొందుదురు. ఈ విధముగ యుగముల వరుసకు అవిచ్చిన్నత్వముండును. ఒకయుగముతో సంబంధము చెడక వేడొక యుగముతో మన్వంతరము సమాప్తమగు వరకు నుండును. (111)
సుఖము, ఆయుర్దాయము, బలము, రూపము, గుణము (ధర్మము) ఐశ్వర్యము, ప్రేమ ఇవీ వచ్చు అనుగామి యుగములందు మూడు వంతులకు క్రమముగా దీగజారును. (112) యుగ సంబంధమయిన ధర్మ సిద్ధులు పవిత్రత్వము సంధ్యాంశయందు క్షీణించును. ప్రతిసంధి రెండు యుగముల మధ్య సంక్రమము. బ్రాహ్మణులారా ! ప్రతిసంధి ఈ విధముగా నాచే కీర్తింపఁబడినది. (113) సమస్తమైన చతుర్యుగములకు ఈ విధమైన గణనోవిధానమే జరుగును. ఈ చతుర్యుగ సంక్రమము వేయిరెట్లు గుణింపగానీది (ఆకాల పరిమాణము) బ్రహ్మగారికొక పగలుగా చెప్పఁబడినది. ఇందు ఆర్జవత్వము జడీభావము (జడస్వభావము) భూతములన్నింటికిని యుగక్షయ లక్షణము. (115) ఇయ్యదియే సర్వ యుగములకు లక్షణముగా స్మరింపవలయును. ఈ చతుర్యుగముల సంఖ్య డెబ్బదీ యొక్కటిచే గుణింపగా, అది క్రమముగా సంక్రాంతి చెందగా (క్రమ పరీవృత్తి, చెందగా) ఆకాల ప్రమాణమునకు “మనోరంతర” మందురు. (71 చతుర్యుగములు ఒక మన్వంతరమగును) ఈ నాలు యుగములలో నేయది ఏ క్రమములో జరుగునో, తద్విధముగా తత్ర్కమములో ఇతర యుగములందును జరుగును. ఈ విధముగా భేదములు కూడ ప్రతి సృష్టియందును నుత్పన్నములగు చుండును. (ధాతా యధా పూర్వ మకల్పయత్ అన్నది వివరింప బడినది) అట్టేవి ముప్పదీయైదు దాని పరిమితులకు తక్కువ గానీ యెక్కువగాని యుండవు. ఆ విధముగా యుగములతో సహా కల్పములు స్వలక్షణములతో కలుగుచుండును. ఇదియే యని యుగముల యొక్క లక్షణము. యుగ స్వభావము వలన యుగముల యొక్క పరీవర్ణనముల చిరకాలము నుండి జరుగుచున్నవో ఆ విధముగనే భూత సంస్థితి (జీవలోకము) క్షయోదయములలో కలిగి యొక విధముగా శాశ్వతముగా నుండదు.
ఈ విధముగా జరిగిపోయిన ముందు జరుగవలసిన సర్వయుగముల యొక్క లక్షణములు, అన్ని మన్వంతరములలో క్రమముగా సూక్ష్మముగా వివరింపఁబడినవి. ఒక మన్వంతరము వర్ణింపఁబడినచో సర్వ మన్వంతరములు వర్ణింపఁబడినట్లుగానే గ్రహింపుము. అట్లే ఒక కల్పము వర్జింపఁబడినచో ఇతర కల్పము వర్ణింపఁబడినట్లే తెలిసికొనుము. ఆ విధముగనే భవిష్యన్నన్వంతర కల్పము లందలి పరిస్థితులు గూడ పండితులచే అనుమాన లక్షణమును బట్టి తెలిసికొనవలయును. భూత భవిష్యన్మన్వంతరములలో సర్వజీవులు తుల్యాభిమానులు, తుల్య నామ రూపములతో నుందురు. (121,124) ఈ మన్వంతరములో అధికారులయిన అష్టవిధులైన దేవతలు, ఋషులు, మనువులు, వారందరు వారీ ప్రయోజనము దృష్ట్యా సమానులే. పూర్వ యుగము నందు ప్రభువు (భగపోసుఁడు) వర్ణాశ్రమముల యొక్క విభోగమును కల్పించును. ఆ విధముగనే యుగ స్వభావములను గూడ ఆ ప్రభువు విధించును. వర్ణముల యొక్క ఆశ్రమముల యొక్క విభాగములు, యుగములు, యుగ సంబంధమైన సిద్దుల అనుషంగమునుండి (కావలసిన ఫలితములుగా) వర్ణింపబడినవి. ఇక సృష్టి యొక్క సర్గమును గ్రహించుడు. ఇక యుగముల యొక్క స్థితిని (పరిస్థితిని) క్రమముగా విస్తరించి వర్ణించెదను.
ఇది వాయు ప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణమందలి పూర్వభాగమందలి ద్వీతీయానుషంగపాదమున చతుర్యుగాఖ్యానమనెడి ముప్పది యొక్కటవ అధ్యాయము.
Summary of chapter 31 of the Brahmānda Mahā Purana is as follows:
Here, the divine narrative gracefully elaborates on how the sacred duties, social castes, and stages of human life dynamically adapt across the changing tides of the four Yugas. It emphasizes that while the outer expressions of dharma may transform with time, the core essence of righteousness, purity, and devotion remains eternal. This chapter gently guides the faithful to embrace their destined roles in life with profound dedication, offering all their earthly actions as a fragrant sacrifice to the supreme lord.