20 - శ్రాద్ధకల్పము

బృహస్పతి ఇట్లు చెప్పిను.

(వేదకాలములో పితృదేవతలు మూఁడు తరములవారు. కాని పురాణ కాలమున వారు వసువులుగా, రుద్రులుగా, ఆదిత్యులుగా విభజింపం బడిరి (తండ్రి, తండ్రితండ్రి, తండ్రితాత). తరువాత పురాణములలో పితృదేవతల సంఖ్య 7కు పెరిగినది. వారు ప్రజాపతి సుతులు. మహాత్ములందరియందు, మొదటి వర్గము (గణము) యోగుల యొక్క యోగశక్తిని వృద్ధిపొందించును. ద్వితీయగణము దేవతలది; మూఁడవ గణము దానవాదులది. మిగిలిన వారు వర్ణుల గణముగా నెఱుంగవలెను. ఈ విధముగా వారందరు చెప్పఁబడిరి, (3) సర్వజ్ఞానావస్థితులయిన పితరులను దేవతలు పూజింతురు. నాలుగు ఆశ్రమములు యధాక్రమము పితరుల పూజింతురు. ఆగమ విధానము ననుసరించి (శ్రుతీపద్దతిని) సర్వవర్ణములవారు పితరులను పూజింతురు. అట్లే మిశ్రమ జాతులవారు మ్లేచ్చులు కూడ వారిని పూజింతురు. ఎవరు ఏతరులను భక్తియుతులై పూజింతురో, పితరులు వారిని ఆనందపెట్టెదరు. సీతరులు, పితామహులు వారికి పుష్టినిచ్చెదరు; సంతాన మొసంగెదరు. అంతీయేకాక పుష్టికామునకు ప్రజోకామునకు స్వర్గము నొసంగెదరు. దేవకార్యముల కంటే పితృకార్యములు విశిష్టములయినవి. (7) దేవతల కంటే ముందుగా పితరులను తృప్తి పరుపవలయునని స్మృతులు వచించును. పీతరుల యొక్క యోగగతి చాల సూక్ష్మమయినది. ప్రసిద్ధమయిన తపస్సుచే నయినను దానినీ నరులు తెలిసికొనలేరు. (8) అట్టి పరిస్థితులలో చర్మనేత్రముచే పితరుల యోగగతిని తెలిసికొనుటకు సాధ్యమా ! దేవతలగుదురుగాక పితరులగుదురుగాక అందరికీ, వెండిపాత్రగానీ వెండిపాత్రతో గూడిన పాత్రగాని ఉత్తమమైనది. పవిత్రీకరించునది. బంధువులు మూఁడు పిండములను, తమ గోత్రములను నామముల నుచ్చరించుచు ఆరజత పాత్రలతో నొసంగెదరు. శాస్త్ర విధి ననుసరించి, నేలను దర్భలతో పరచి భూమి మీఁద కూడ పిండములను నీయవచ్చును. ఆ పిండములను పెట్టునప్పుడు అపసవ్యముగా యజ్ఞోపవీతము నుంచి మరి పెట్టవలయును. అట్లు పిండముల నెందు పెట్టినను పితరులు సంతోషించెదరు. (11) పితరులకు కల్పించు ఆహారము ఆ కర్తయొక్క ఆహారమే యగును. తప్పిపోయిన ఆవుదూడ (వత్సము) తిరిగి తల్లి కడకు గోష్టమునకే (గోశాలకే) వచ్చి చేరునో, అట్లే పితరులకు అర్పింపఁబడిన ఆహారము పితరులకే వచ్చి చేరును. ఆ జంతువు (ఆ వీతరుఁడు) ఎక్కడ నున్న నచ్చటకు ఆ మంత్రమే అర్పింపఁబడిన ఆహారమును తీసికొనిపోయి చేర్చును. నామగోత్రముల యుచ్చారణము ఆయాహారమును పితరులకడకు తీసికొనిపోవును. (13)

సమాప్తాశ్చాయం శ్రాద్ధకల్పః.

ఆ పితరులు శతయోనులలో శత సంఖ్య జన్మల నెత్తినను, వారిని తృప్తి అనుసరించును. పితరుల యొక్క ఆదీ సృష్టి యందు, 'అక్షయ' లోక స్థితిని అర్థించు పితరులకు పరమేష్టియయిన బ్రహ్మ యొక్క శక్తి యది : ఓ యనఘా ! ఈ విధముగా ఈ పితరులు, లోకములు, కుమార్తెలు, దౌహిత్రులు (మనుమలు యజమానులు (శ్రాద్ధము నాచరించువారు) నాచే వివరింపఁబడిరి, ఓ పుత్ర ! పితరులు నీకు యథా క్రమము వివరింపఁబడిరి. (16) శంయువు ఇట్లు చెప్పెను. అహో ! ఓ తండ్రీ ! దివ్యమయిన పితృసృష్టి యంతయు నీచే కీర్తింపఁబడినది, లోకములు, వారి కుమార్తెలు, వారి మనుమలు - అందరిని వింటిని. దానములు శౌచ విధాన సహితముగా పోనీ ఫలితములతో గూడ కీర్తింపఁబడినవి. ద్విజుల యొక్క అక్షయ్యత్వము సర్వము యథాతథము ఉదాహృతమయినది. నేఁడు మొదలుకొని వీనినీ యథాతథముగా చేయుదును. (కర్తనగుదును)

బృహస్పతి యిట్లనెను :

ఈ విధముగా పూజ్యుడయిన అంగీరో ఋషి పూర్వము ఋషులకు చెప్పెను. అప్పటి నుండి 5000 సంవత్సరములు గతించినవి. బ్రహ్మవాదులయిన ఋషులచే శ్లోకములు పఠింపఁబడినవి. వెయ్యేండ్లు సాగిన సత్రయాగమందు సంశయములను తీర్చుటకు వారలచే (ఆ ఋషులచే) యడుగబడి ఆ ఋషి చెప్పెను. ఆ సత్రమున సదసస్పతి (అధ్యక్షుఁడు) పరమాత్మయైన బ్రహ్మ. ఆ సత్రయాగమున బ్రహ్మ అగ్రేసరత్వము వహించెను. శాశ్వత లోకప్రాప్తినోరు పితరులకు అచ్చటనే ఆహారము (అన్నము) ఒసంగబడెను.

సూతుఁడిట్లనెను,

ధీమంతుఁడయిన తన కుమారునిచే అడుగబడి బృహస్పతి పితరుల యొక్క సృష్ట్యాదిని కూర్చి వివరించెను. అయ్యదియే ఇప్పుడు నాచే సముదాహృతమైనది.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమందలి మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున శ్రాద్ధకల్పమను ఇరువదవ అధ్యాయము సమాప్తము.