43 -  త్రిచత్వారింశో ధ్యాయః

హయగ్రీవ ఉవాచ:-

ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరి హృదయేదేవి శిరోదేవి కవచదేవి నేత్రదేవి ఆస్యదేవి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్నే భేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి విద్యేశ్వరి పరశివదూతీ త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే 'విజయే సర్వమంగలే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వరి మంత్రేశమయి షష్ఠీశమయ్యుద్యానమయి లోపాముద్రామయ్యగస్త్యమయి కాలతాపనమయి ధర్మాచారమయి ముక్తకేశీశ్వరమయి దీపకలానాథమయి విష్ణుదేవమయి ప్రభాకరదేవమయి తేజోదేవమయి మనోజ దేవము అణిమాసిద్దే మహిమాసిద్ధే గరిమసిద్ధే లఘిమసిద్ధే ఈశిత్వసిద్ధే వశిత్వసిద్దే ప్రాప్తిసిద్ధే ప్రాకామ్యసిద్దే రససిద్దే మోక్షసిద్దే బ్రాహ్మి మహేశ్వరీ కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణీ చాముండే మహాలక్ష్మి సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరీ సర్వోన్మాదిని సర్వమహాంకుశే సర్వఖేచరి సర్వబీజే సర్వయోనే సర్వాస్తఖండిని త్రైలోక్యమోహిని చక్రస్వామిని ప్రకటయోగిని బౌద్ధదర్శనాంగి కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణి అహంకారాకర్షిణి శబ్దాకర్షిణీ స్పర్శాకర్షిణి రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణీ చిత్తాకర్షిణి ధైర్యాకర్షిణి స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి గుప్తయోగిని సర్వాశాపరిపూరకచక్రస్వామిని అనంగకుసుమే అనంగమేఖలే అనంగమాదీని అనంగమదనాతురేవంగవేగిన్యనంగాంకశే-నంగమాలిని గుప్తతరయోగీని వైదికదర్శనాంగి సర్వసంక్షోభకారకచక్రస్వామిని పూర్వామ్నాయాధిదేవతే సృష్టిరూపే సర్వసంక్షోభిణీ సర్వవిద్రావిడి సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసంమోహిని సర్వస్తంభిణి సర్వజృంభిణి సర్వవశంకరి సర్వరంజిని సర్వోన్మాదిని సర్వార్థసాధికే సర్వసం పత్రపూరిడి సర్వమంత్రమయి సర్వద్వంద్వక్షయంకరి సంప్రదాయయోగిని సౌరదర్శనాంగి సర్వసౌభాగ్యదాయకచక్రే, సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ర్పదే సర్వ ప్రియంకరీ సర్వమంగళకారిణి సర్వకామప్రదే సర్వదుఃఖవిమోచిని సర్వమృత్యుప్రశమిని సర్వవిఘ్ననివారిణి సర్వాంగసుందరి సర్వసౌభాగ్యదాయినీ కులోత్తీర్ణయోగిని సర్వార్థసాధకచక్రేశి సర్వజ్ఞే సర్వశక్తీ సర్వైశ్వర్యఫలప్రదే సర్వజ్ఞానమయి సర్వవ్యాధినివారిణి సర్వాధారస్వరూపే సర్వపాపహరే సర్వానందమయి సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సితఫలప్రదే నియోగిని వైష్ణవదర్శనాంగి సర్వరక్షాకరచక్రస్థీ దక్షిణామ్నాయే స్థితిరూపే వశిని కామేశి మోదీని విమలే అరుణే జయిని సర్వేశ్వరి కౌలిని రహస్యయోగిని రహస్యభోగిని రహస్యగోషిని శాక్తదర్శనాంగి సర్వరోగహరచక్రేజి పశ్చిమామ్నాయే ధనుర్బాణపాశాంకుశదేవతే కామేశి వజ్రేశి భగమాలిని అతిరహస్యయోగిని శైవదర్శనాంగీ సర్వసిద్ధిప్రదచక్రగే ఉత్తరామ్నాయేశీ సంహారరూపే శుద్ధపరే బిందుపీఠగతే మహాత్రిపురసుందరీ పరాపరాతిరహస్యయోగిని శాంభవదర్శనాంగి సర్వానందమయచక్రేశి అనుత్తరామ్నాయాఖ్యస్వరూపే మహాత్రిపురభైరవి చతుర్విధగుణరూపే కులే-అకులే కులాకులే మహాకాలీనీ సర్వోత్తరే సర్వదర్శనాంగీ నవాసనస్థితే నవాక్షరి నవమిధునాకృతే మహేశమాధవవిధాతృమన్మధస్కందనందీంద్రమనుచంద్రకుబేరాగస్త్యదుర్వాసక్రోధభట్టారకవిద్యాత్మికే - కల్యాణతత్త్వత్రయూపే శివశివాత్మికే పూర్ణబ్రహ్మశక్తే మహాపరమేశ్వరి మహాత్రిపురసుందరీ తవ శ్రీపాదుకాం పూజయామి నమః “క ఏ ఈల హ్రీం హస కహల హ్రీం సకల హ్రీం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం శ్రీం”

అగస్త్యుడనెను:- అశ్వముఖుడా! మహాప్రాజ్ఞుడా! కరుణామృత సముద్రుడా! శ్రీదేవీదర్శనమునకై దీక్షయేటిదో తెలుపుము. (1)

హయగ్రీవుడనెను:- నీకు దేవతా భావమున్నచో, పురుషులకు పాపపంకమును గడిగివేయు దీక్షను జెప్పెదను-(2) చేతిలో శివ పురమును ధ్యానించి మూలాంగమాలినిని జపింపవలె. గురువు శిష్యుని శరీరమును తాకవలె. ఇది “స్పర్శదీక్ష” యనబడినది. -సీ. కన్నులు మూసుకొని కామాక్షిని ధ్యానించి, ప్రసన్నమైనదుద్దిగలవాడై గురువు శిష్యుని బాగుగా జూడవలె.. ఇదీ దృగీక్ష యనబడును. -4, గురువు యొక్క చూపుమాత్రమునను మాటాడుటవలనను, తాకుటవలనను వెంటనే జ్ఞానము గలుగును. అది “శాంభవీదీక్ష" యనబడును-5 దేవి యొక్క దేహమేట్టిదో గురుదేహమట్టిదీ. గురుని యనుగ్రహమున శిష్యుడు గురురూపియై ప్రకాశించును. -6. చిరకాలసేవచే చక్కగా సంతసించిన గురువరుడు ఊరక శిష్యుని సంకల్పించును. (మనమున దలచును) అది “మానసీ దీక్ష" అనబడును-7. అన్ని దీక్షలలోనిదియే యుత్తమోత్తమము. మొదట క్రీయాదీక్షను జేయవలె. దానివిధానమును జెప్పెద-6, శుక్లపక్షమున ఒక శుభదినమున మనమును శుచిగా జేసికొని, యథావిధిగా నాలుక-ముఖముల మలమును శుద్దిజేసి (దంతధావనముతో ముఖముగడిగికొని) స్నానమాచరించి-9 సంధ్యావందనముజేసి, పరమగురుదేవుని స్మరించుచు, ఏకాంతమున నుండి శ్రీమన్మానియై నియతాహారముగలవాడై శిష్యుడు-10. శిష్యునివలెనే సిద్దమైన గురుడును పూజామందిరమున బ్రవేశింపవలె, దేవీసూక్తముతో బాటు సమాతృకముగా విద్యాన్యాసము జేయవలె-11. పురుషసూక్తముతో షోడశోపచారములతో ఆవాహనము జేసి యాసనమిచ్చి పాద్యము (పాదోదకము)ను, అర్యము (హస్తోదకము)ను ఇచ్చి, యట్లే-12. స్నానము జేయించి, వస్త్రమును ఆభరణములను గంధమును పుష్పములను సమర్పించి, యట్లే ధూపమును, దీపమును నైవేద్యమును, తాంబూలమును ఈయవలె. ప్రదక్షిణమును-15, ప్రణామమును, జేయవలె. ఈ ప్రసిద్ధములైన ఉపచారములతో త్రిపురాంబికను సంతోషపెట్టవలె. తరువాత సహస్రాక్షర విద్యతో పుష్పాంజలిని సమర్పింపవలె-14. ఓం ఐం హ్రీం ఓం ఐం క్లీం సౌః ఓం. (ఇచట ఓం పరబ్రహ్మబీజము ఐం-సరస్వతీ బీజము హీం=గౌరీబీజము. శ్రీంఇలక్ష్మీ బీజము. క్లీం=నిత్యాదేవిబీజము. సౌః=త్రీపురాబాలా బీజము. ఐంక్లీం సౌః-లలితాబాలామూల మంత్రము. మొత్తమీది సరస్వతీ గౌరీ లక్ష్మీబీజాక్షరములు చేర్చిన లలితాబాలామూలమంత్రము. దీని కాద్యంతములలో, బ్రహ్మబీజమైన ఓంకారము సంపుటీ కృతము.) త్రిపురసుందరి నీకు నమస్కారము. హృదయమునందుండి హృదయమేదైనట్టిదేవికి నమస్కారము శిరమునందుండు దేవికి నమస్కారము రక్షణ కవచమునందుండు దేవీకి నమస్కారము నేత్రములందుండు దేవికి, ముఖమునందుండు దేవికీ, కామేశ్వరికీ (కామేశ్వరపత్నికి-కామములను వశమందుచుకొని వానికీశ్వరియైనదానికి) భగమాలినికి (అప్లైశ్వర్యములుమాలగా ధరించినయామెకు, సూర్యులను మాలగాధరించినయామేకు) జ్ఞానవైరాగ్యములను మాలగా ధరించినయామెకు, నిత్యక్లిన్నకు=నిత్యము దయార్దకు, భేరుండకు, వహ్నివాసినికి అగ్నిలోనివసించు నామెకు అగ్నిరూపిణికి, మహావజ్రేశ్వరికి=మహావజ్రమువలె దుర్భేద్యమైనయామెకు, విద్యేశ్వరికి=సర్వవిద్యలకు మంత్రములకీశ్వరికీ, పరశివదూతీకి, త్వరితకు=భక్తరక్షణలో త్వరితకు, కులసుందరికీ= సుషుమ్నామార్గసుందరీకి శక్తిరూపిణియైన సుందరికి(కు? సుషుమ్నామార్గః , కులంశక్తి రితిప్రోక్తం) నిత్యారూపిణికి, నీలపతాకకు=నల్లనిధ్వజము గలయామెకు, విజయకు (సర్వత్రవిజయకు), సర్వమంగళకు, జ్వాలామాలినికి ఇజ్ఞానజ్వాలలు మాలగానున్నయూమెకు, చిత్రకు =చిత్రరూపిణికి, మనోనిత్యకు, వరమేశ్వరికి, మంత్రేశమయికి ఇఆయామంత్రములయధి పతులలోనిండియున్నదానికీ, షష్ఠీశమయికి జషష్టము మనము దానికీశులు యోగులు ఆయోగులతో నిండియున్నదానికి, ఉద్యానమయికి, లోపాముద్రామయికి, అగస్త్యమయికీ కాలతాపనమయికి-యమునితపింపజేయు శివమయికి, ధర్మాచారమయికి, ముక్తకేశీశ్వరమయికి=కాళికాపతిమయికి, దీపకలానాథమయికి= దీపమయికి చంద్రమయికిని, విష్ణుదేవమయికి, ప్రభాకరదేవమయికీ = సూర్యదేవమయికి, తేజోదేవమయికి=నక్షత్ర తారాగ్రహ దేవతలలోనిండియున్నదానికి, - మనోజదేవమయికి=మన్మథునిలో (మన్మథుడు తనలో) నిండియున్నదానికి, అణిమా సిద్ధి స్వరూపిణికి, వశిత్వసిద్ధిస్వరూపిణికి, ప్రాప్తిసిద్దిస్వరూపిణికి ప్రాకామ్యసిద్దిస్వరూపిణికి, రససిద్ధవైద్యస్వరూపిణికి, రససిద్ధకవి స్వరూపిణికి, మాహేశ్వరికి=మహేశ్వరశక్తి స్వరూపిణికి, కౌమారికి=స్కందశక్తి స్వరూపిణికి, విష్ణుశక్తి స్వరూపీణీకి, పరాహావతార విష్ణుశక్తి (సర్వభూమ్యుద్ధరణశక్తి) స్వరూపిణికి, ఇంద్రాణికి-ఆంద్రశక్తి స్వరూపిణీకి, చాముండికి, మహాలక్ష్మికి, సర్వ సంక్షోభిణికి అందరిని క్షోభపెట్టుదానికి, అందరినోడించి పరిగెత్తించునామెకు, అందరినాకర్షించు నామెకు, అందరిని వశపరచుకొనుదానికి, అందరినున్మత్తులజేయునామెకు, అందరినీ మంచి మార్గమున బెట్టుటకు గొప్పయంకుశముధరించినయావెకు, నర్వఖేచరికి =అందరియింద్రియములబ్రవర్తింపజేయు శక్తి స్వరూపిణికి, సర్వబీజకు=వీశ్వమూలకారణమైనదానికి, సర్వయోనికి=అందురుజన్మించుస్థానమైన ప్రకృతి స్వరూపిణికి, సర్వాస్తఖండినికి, త్రైలోక్యమోహినికి = త్రిలోకముల మోహింప జేయునామెకు, చక్రస్వామినికిమూలాధారాదిషట్చక్రముల స్వామినికి లేక సహస్రారచక్రస్వామినికి, ప్రకటయోగినికి ప్రసిద్ధురాలైన యోగినికి, బౌద్దదర్శనాంగికి=జ్ఞానతత్వమేయంగమైన దానికి= జ్ఞానస్వరూపిణికి = శూన్య (అవికార) స్వరూపిణికి, కామాకర్షిణికి= కోరికలనన్నింటికి ఫలములిచ్చుటకైయాకర్షించునామెకు, కామజయమునకు కామమునాకర్షించునామెకు, అహంకారాకర్షిణిజ్ఞపోగొట్టుటకైయహంకారమునాకర్షించునామేకు, శబ్దాకర్షిణి =శబ్దములనీన్నింటినీ తనను బోధించునట్లుగా నాకర్షించునామెకు, స్పర్శాకర్షిణికి రూపాకర్షిణికి, రసాకర్షిణికి గంధాకర్షిణికి-పంచభూతముల సూక్ష్మరూపములైన చరాచరముల పంచతన్మాత్రల నాకర్షించునామెకు (సృష్ట్యుపసంహర్తకు అనీభావము) చిత్తాకర్షిణికి అంతరింద్రియమైనవనమును తన యందునీలుపుటకా కర్షించునామెకు, ధైర్యాకర్షిణికి, స్మృత్యాకర్షణికి, సామాకర్షిణికి ఆపేరు నాకర్షించునామెకు=నామాది వికారములను ఆకర్షించి తత్త్వమును బ్రకాశింపజేయునామెకు, బీజాకర్షిణికి ప్రపంచబీజమును (ఏకాత్మత్వమునకై) ఆకర్షించునామెకు, ఆత్మాకర్షిణీ= - జీవాత్మయొక్క పరమాత్మైక్యమునకు జీవాత్మ నాకర్షించునామేకు, అమృతా కర్షిణికి, భక్తులకానందామృతమునాకర్షించునామెకు, శరీరాకర్షిణికి= అమృతత్వసిద్ధికై శరీరమునాకర్షించునామెకు, (ఈయాకర్షిణీ శబ్దాంతాలన్నియు 'కామముతో, బుద్దితో నాకర్షించునామెకు, ఇత్యాదిగా జెప్పవచ్చును) గుప్తయోగీనికి-రహస్యమైన పరమాత్మ స్వరూపమున గలసినయామేకు, సర్వాశాపరిపూరక చక్రస్వామీనికి=సర్వాశలను నింపుచక్రమునకు స్వామినియేనయామెకు) (సంసారచక్రమునకు స్వామినికి అనంగకుసుమకు=మన్మథబాణమైన యామెకు (శ్రీవమనోహరణమున) అనంగమేఖలకు = ఆయంగమేలేనంతగా సన్ననైన నడుమున మొలనూలుగలయామెకు మన్మథుని బంధించునామెకు, అనంగమాదిని=మన్మథుని మదింపజేయునామెకు, అనంగమదనాతురకు=అనంగుడైన మదనునిచే (శివ ప్రాప్తికై) ఆతురమైన యామెకు {అనంగరేఖకు) మన్మథరేఖవలె శివునాకర్షించునామేకు' అనంగాంకుశకు=మన్మథుడను. మదగజమునకు అంకుశమువంటిదానికి, అనంగమాలినికి, శివునాకర్షించుటకై యనంగుని పుష్పబాణమాలనుగా ధరించినయామెకు. (లలితా పరమేశ్వరి మన్మథ స్వరూపిణియగుటదీ యుచితము) గుప్త తరయోగిని. మిక్కిలి రహస్యముగా సహస్రారమున శివునితో గలియునామెకు, వైదిక దర్శానాంగికి=వైదిక దర్శనమేయంగమైన యామెకు వైదిక తత్త్వస్వరూపిణీకి) సర్వసంక్షోభణ కారకచక్రస్వామినికీ, పూర్వామ్నాయాధిదేవతకు, సృష్టిరూపకు, సర్వసంక్షోభిణికి, సర్వవిద్రావిడికి, సర్వాహ్లాదినికీ, సర్వసంమోహినికి, సర్వస్తంభినికి-అందరిని స్తంభింపజేయునామెకు, సర్వజృంభిణికి, సర్వవశంకరీకి, సర్వరంజనికి, సర్వోన్మాదినీకి, సర్వార్థసాధికకు, సర్వసంపత్ర్పపూరణికి అన్ని సంపదలనింపునామెకు, సర్వమంత్రమయికి, సర్వద్వంద్వ క్షయంకరీకి=సమస్తద్వైతభావమును నశింపజేయునామేకు (అద్వైతభావమును గలిగించునామెకు), సంప్రదాయయోగిని సంప్రదాయమును పాటించునామేకు, సౌరదర్శనాంగికి సౌరదర్శనమే యంగముగలయామెకు (సూర్యఆత్మాజగతః అనుశ్రుతి ప్రకారము జగము సూర్యాత్మకము ఇది సౌరదర్శనము సూర్యాత్మకత్వమంగముగలయామెకు, సూర్యునకాత్మ స్వరూపిణి యని భావము). సర్వసౌభాగ్యదాయక చక్రకు, సర్వసిద్దప్రదకు, సర్వసంపత్ర్పదకు, సర్వప్రియంకరీకి, సర్వమంగళకారిణికీ, సర్వకామప్రదకు, సర్వదుఃఖ విమోచినికి, సర్వమృత్యుప్రశమినికి- అందరిమృత్యువులను ప్రశమింపజేయగలిగినయామెకు, సర్వవిఘ్ననివారిణికి, సర్వాంగసుందరికి, సర్వసౌభాగ్యదాయినికి కులోత్తీర్ణయోగినికి-సుషుప్న మార్గమున నుత్తీర్ణయై సహస్రారమును సదాశివునితో గూడినయోగినికీ, సర్వార్థసాధక చక్రేశికి=సర్వార్థముల సాధించు చక్రమునకీశ్వరీయైన యామెకు, సర్వజ్ఞకు, సర్వశక్తికి, సర్వైశ్వర్యఫలప్రదకు, సర్వజ్ఞానమయికి, సర్వవ్యాధి నివారిణికి, సర్వాధారస్వరూపకు =భూస్వరూపిణికి మూలాధార స్వరూపిణీకి, సర్వరూపకు, సర్వపాపహరకు, సర్వానందమయికి- అందరీయానందములుతానైనయామెకు, సర్వరక్షాస్వరూపిణికి=అందరిని రక్షించు స్వరూపముగలయామెకు, సర్వేప్పిత ఫలప్రదకు, నియోగిని=సర్వమును నియోగించు (ఇట్లుండుమని శాసించు)నామెకు వైష్ణవ దర్శనాంగికి=విశిష్టాద్వైత స్వరూపిణికి, సర్వరక్షాకర చక్రస్థకు అందరికినిరక్షణమునీచ్చు చక్రమున (మండలముననున్నయామెకు, దక్షిణామ్నాయమున కీశ్వరియైనయామేకు, స్థితిరూపకు (జగత్తుస్థితిరూపకు) వశినికి=అందరిని వశమునందుంచుకొనునామేకు, కామేశికీ-కామునకేయీశ్వరీయైనయామెకు కామములను తనవశమునందుంచు కొన్నయామెకు, మోదీని=నిత్యసంతోషిణికి, విమలకు అరుణకు- ఎఱ్ఱనైనయామెకు, జయినికి= జయించునామెకు, సర్వేశ్వరికి, కౌలినికి=శశివశక్తి సామరస్యము గలయామెకు, రహస్యయోగినికి=రహస్యముగా శివునితో గలయునామెకు, రహస్యభోగినీ-రహస్యముగా శివుని భోగముగలిగినయామేకు, రహసగోషిని, రహస్యమును కాపాడునామెకు శాక్తదర్శనాంగికీ-శక్తి తత్వదర్శన శాస్త్రమే తనయాకారముగా గలయామెకు, సర్వరోగహరచక్రేశ్, పశ్చిమామ్నాయకు, (తత్స్వరూపిణికి) ధనుర్బాణ పాశాంకుశదేవతకు, కావేశీకి, వజ్రశి=వజ్రాయుధమునకీశ్వరిదైనూనెకు (వజ్రములకీశ్వరీయైనమొకు) భగమాలినినికీ, అతి రహస్యయోగినికి అతిరహస్యమైన సహస్రారమున సదాశివునితోగలియునైమెకు, శైవదర్శనాంగికి-శివాభేదమును భోధించు శివతత్వశాస్త్రమే తనయంగముగాగలయామెకు, సర్వప్రసిద్దపదచక్రగకు=సర్వప్రసిద్ధమగు పరతత్త్వమునకు స్థానమైన చక్రముననుండునామెకు, మహాత్రిపురసుందరకి, ఉత్తరామ్నాయేశికి, సంహారరూపకు, శుద్ధరూపకు, బిందుపీఠగకు= సహస్రారపీఠమునందున్నయామెకు, మహారాత్రిపురసుందరికీ, పరాపరాతిరహస్యయోగినికి =పరాజవరాపశ్యంతీ మధ్యమావైఖరులలో మొదటి వాగ్రూపము అపరాజపశ్యంతిమొదలుమూడు వాక్కులరూపము, వీనికంటేనతిరహస్యమైన మూలవాగ్రూపమున పరబ్రహ్మలోగలసియున్నయామెకు, వ్యక్తావ్యక్తవాల్మూల స్వరూపకు, శాంభవదర్శనాంగికి=శాంభవతత్త్వ స్వరూపిణికి, సర్వానందయయచక్రేశికి=సర్వానందయచక్రమైన సహస్రారచక్రమునకీశ్వరీయైనయాకు, త్రిపురసుందరీకి= బ్రహ్మవిష్ణుశివ శరీరముల కధిష్టానమైన పరశివుని సుందరికి, త్రిపురవాసినీకి =శివునియందే యుర్థాంగిగానివసించునోమెకు, త్రిపురశ్రీకి ఇపంచమచక్రాధిషాంత్రికి, త్రిపురమాలినీకి అంతర్దశారచక్రాభిమానియైనదేవతకు, త్రిపురసిద్దకు= శివునియందలి సిద్ధస్వరూపిణీకి, త్రిపురాంబకు అష్టమచక్రాభిమానీనీయైన దేవతకు సర్వచక్రస్థకు =అన్ని చక్రములలో నున్నదేవతకు త్రిపురసుందరీ దగ్గరనుండి యాటు షట్చక్రాధిదేవతలనిపించును) అనుత్తమ్నాయ మను స్వరూపముగలయామెకు, మహాత్రిపురభైరవీకీ, చతుర్విధ గుణరూపకు, కులరూపిణికి=శక్తిరూపిణికి, అకులే-శివునిలో తనదైన శక్తిరూపిణికి, కులాకులే-శివశక్త్యాత్మీకకు, మహాకాలినికి =శివశక్తి సామరస్యముకాలము. అదిగలమహదేవికి, సర్వోత్తరకు=అందరికన్నయున్నతమైనయామెకు, సర్వదర్శనాంగికి, సమస్త తాత్త్వికస్వస్వరూపిణికి, నవాసనస్థితకు = తొమ్మిది యాసనములందున్నయామెకు (నవార్ణమంత్రమందున్నయామెకు) నవాక్షరి=నవార్ణమంత్రస్వరూపిణికి, మహేశుడు - మాధవుడు - విధాత -మన్మథుడు స్కందుడు-నందీ-ఇంద్రుడు మనువు-చంద్రుడు- కుబేరుడు-అగస్త్యుడు. దుర్వాసుడు- క్రోధుడు (దుర్వాసక్రోధము) భట్టారకుడు-వీరవిద్యల స్వరూపిణీకి, కల్యాణ తత్త్వత్రయరూపకు (మంగళకరమైన బ్రహ్మ, విష్ణు, శివ తత్వరూపకు) శివ-శివాత్మికకు, పూర్ణబ్రహ్మశక్తికి-పూర్ణమైన బ్రహ్మశక్తి స్వరూపిణికి, మహాపరమేశ్వరికి= పరమేశ్వరికన్న గొప్పనైనయామెకు, మహాత్రిపురసుందరికి= మహాశివుడైన సదాశివుని సుందరికి (త్రిపురము-శివుడు) నమస్కారము. వీరందరి స్వరూపిణియైన -మహాత్రిపురసుందరి యొక్క శ్రీపాదుకలనుబూజించి నమస్కరించి దేవీతాదాత్మ్యమును భావించుచున్నాను.

క ఏ ఈ ల హ్రీం, హసకహల హ్రీం, స క ల హ్రీం, ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం శ్రీం =ఇది బాలామంత్రగర్భితమైన షోడశ్రీమంత్రము.

ఐం క్లీం సౌః = అహం బ్రహ్మాస్మి-నేను బ్రహ్మను, సౌః క్లీం ఐం=బ్రహ్మైవాహమస్మి బ్రహ్మనే నేను, అని బాలామంత్రార్ధము. క ఏ ఈ ల హీం= ఓమాయాత్మక పరదేవతా! లజ్జారూపమున అష్టపాశాత్మికమైన యవిద్యను నివర్తింపజేయుము. ఏజమాయాత్మిక పరదేవతా! కబ్రహ్మవిషయమున, హీం=లజ్జీపలక్షిత అష్టపాశాత్మకమైన యవిద్యను, ఈల=నీవర్తింపజేయుము. హసకహలహీం=బ్రహ్మయొక్క పరోక్షవృత్తిని (గ్రాహక శక్తిని) ప్రకాశింపజేయుము. క-బ్రహ్మయొక్క హలహీం=గ్రాహకశక్తిని, హస=ప్రకాశింపజేయుము, సకలహీం  (ఈల) సర్వాంతఃకరణవృత్తిని నివారింపజేయుము. సకలహీం=సర్వాంతఃకరణవృత్తిని (బ్రహ్మజ్ఞానమును గుఱించి నాకుగల సకల వివిధమైన యజ్ఞానమును) ఈల అన్నదానిని అనువర్తింపవలె, ఈల-పోగొట్టుము. శ్రీం-సుఖము, ఆనందమును అనుగ్రహింపుము.

పంచదశీ మంత్ర వ్యాఖ్య

మంత్రము : క ఏ ఈల హ్రీం 'హసకహల హ్రీం’ సకల హ్రీం

1. క ఏ ఈల హీమ్. (వాగ్భవకూటము) :

క 1) కన దీపౌ కన్యంతే ప్రకాశ్యంతే అనేన శబ్దజాలానీతి కః 'ప్రకాశింపజేయునుగాన కః

ఏ 1) ఇక్ స్మరణే 2) ఇజ్. అధ్యయనే ఈయ్యతే సర్యతే అధీయతే. వా సర్వవేదశాస్త్రాదీకం అనేనేతి 'ఏః ఏచ కచ పునః పునః - ప్రకాశమానబుబధిరితి.

దీనిచేత సర్వవేద శాస్త్రాదికము స్మరింపబడును. లేదా అధ్యయనము చేయబడును గాన “ఏ”, ఏ అనునదియు 'క' అనునదియు మరల మరల ప్రకాశించు బుద్ది అని భావము.

ఈ ఈ(ఇవి) వ్యాప్తా ఈయతే వ్యాప్నోతీతి 'ఈ', పునః పునః ప్రకాశమానబుద్ధివ్యాపనమితి. దీనిచే మరల మరల వ్యాపించు బుద్ధి అని భావము.

లహరీ పరోక్షతయా లహీ.

మ్ ‘మాజ్' మానే. మియత ఇతి మ్ పునః పునః ప్రకాశమాన బుద్ధి వ్యాపాన లహరీ నిర్మాణం. మరల మరల ప్రకాశించు' బుద్ధిని - వ్యాపించు లహరీ నిర్మాణము.

అనేక ధర్మాఖ్య పురుషార్థ సాధన బ్రహ్మవర్చసా సమ్యగ్బుద్ధి నిర్మితి రుక్తా తస్మాదేవ వాగ్భవముచ్యతే. ఇష్టదేవతా ప్రకాశనాత్మకత్వేన వాగ్గాల ప్రవర్త కత్వాత్ ఋగ్వేదాత్మకత్వం

 దీనిచేత ధర్మమనెడి పురుషార్థమును సాధించు బ్రహ్మవర్చస్సుతో సమ్యగ్బుద్ధి యొక్క నిర్మాణము చెప్పబడినది. ఇష్టదేవతా ప్రకాశనాత్మకమగుటచే వాగ్దాల ప్రవర్తక మైనందువలన నిది ఋగ్వేదాత్మకము.

II. హ సక హలహీ ఈ మ్. మధ్య కూటము.

 హ హన హింసాగత్యోః. హన్యంతే నేన ఐహికాముష్మిక తాపత్రయాణీతి హః. దీనిచేత ఇహలోక పరలోక తాపత్రయములు నశింపజేయబడును గాన హః' అనేన శత్రు రోగాది ప్రత్యక్ష బాధా నివృత్తిః దుష్కృతజన్యాముష్మికబాధానివృత్తిశ్చకా, దీనిచే శత్రు రోగ ఆది బాధల నివృత్తియు, దుష్కర్మ వల్ల గలిగిన పరలోక బాధల నివృత్తియు జెప్పబడినవి.

స . సీయంతే ఉపభుజ్యంతే అనేన సర్వధన కనక వాహన భూమ్యాది సంపత్ర్పచయా ఇతి సః స్యతేః సనోతేశ్చ అవసాదనార్థ కత్వాత్ సకలరాజపరిచ్ఛదజాల ముక్తమ్

దీనిచేత సర్వధన కనక వాహన భూమ్యాది సంపత్సమూహములు సకల రాజభోగములును అనుభవింపబడును గాన, సౌ.

క -కము కాంతా కామ్యంతే ప్రక్చందనవనితా మదన విషయణోగా అనేనేతి 'కః. అనేన ఐహికాముష్మిక సకల విషయభోగ ఉక్తః దీనిచేత హారములు చందనము సుందర తరుణులు మొదలుగు మదన విషయ భోగములు కోరబడుచున్నవి గాన 'కం'.

దీనిచేత ఇహలోక పరలోకములలోని సకల విషయోపభోగము చెప్పబడినది.

హ . “ఓహాజ్’ గతా = హీయతే ప్రాప్యతే హసకానాం హః = హసకహః. ఉపద్రవనివృత్యర్థసంచయహిమభోగావాప్తిరితి యావత్

2 . కనయతీతి “కః' దీనిచేత శబ్దజాలములు ప్రకాశింపబడునుగాక “కం'

హసకానాం = హసకముల యొక్క హః = ప్రాప్తిః హసకహః అనబడును. తత్పురుషసమాసము. ఉపద్రవములు పోవుటయు, ధన సమూహముల యొక్కయు కామభోగముల యొక్క ప్రాప్తియు అని యర్థము.

లహీ లహరీ - అస్యాః ఆధిక్యం: లహరీ యొక్క అధిక్యము.

ఈమ్ 'ఈ' దీప్తా. ఈయతే ప్రకాశ్యతే అనేన దిగంతేషు కీర్తీజాలం ఇతి ఈః. హసకహలహీశ్చ ఈశ్చ (సవర్ణదీర్ఘః) = హసకహలహీః తాసాం నిర్మాణం హసకటాలహీం. అనేన అర్థ-కామపురుషార్థనిర్మితి రుక్తా తస్మాదేవ కామరాజత్వం. స్వకయాభీష్ట సాధన కర్మజాత విధాయకత్వాత్. యజుర్వేదస్యార్థకామమోః క్రియాసాధకత్వాద్యజుర్వేదాత్మకత్వమ్ (క్షత్రియోపాస్య త్రిష్టుప్ ఛందస్సారః)

దీనిచేత దీగంతముల వరకు కీర్తీజాలము ప్రకాశింపజేయబడును గాన ఈ 'హసకలహీ' యును 'ఈ'యును (సవర్ణదీర్ఘము) ‘హసకహల హ్రీం' అగును. కాగా, దీనిచేత అర్థ-కామ పురుషార్ధముల రెంటి యొక్క నిర్మాణము చెప్పబడినది.

తన యభీష్టమును సాధించు కర్మల సమూహమును విధించుట వలన కామరాజత్వము. యజుర్వేదము అర్థకామముల కర్మలను సాధించునది గాన నిది యజుర్వేదాత్మకము (ఇది క్షత్రియోపాస్యమగు త్రిష్టుప్ ఛందపు సారణము.)

III. సకల ప్రీ ఈ ఇమ్

సకల సకలం= కలాభిరవయవైః శివోదీతతైర్వా సహితా సకలా, అధవా సకలం = కలాభిః చతుఃషష్టికలాభీర్వా సహితా సకలా కళలతో అనగా అవయనములతో గాని, శివాది తత్త్వములతో గాని కూడినది.

హీ - 'హృజ్' హరణీ సంహృతిశక్తిః. హరతి సర్వమంత్రకలాం (జగత్) ప్రీ-లుప్తసకారశబ్దః ప్రపంచ సంహృతి వాచకః! సర్వమంత్ర కళారూపమైన జగత్తును హరించునది. 'హీ' ఇది లోపించిన సకారము(8) గల శబ్దము. ప్రపంచ సంహృతి వాచకము.

ఈ సృష్టిశక్తి. ఈయతే ప్రకాశ్యతే సర్వం జగత్ అనయా ఇతి ఈ. ఈ = ప్రకాశః. ఆత్మైక్యగమనమ్

దీనిచేత జగమంతయు ప్రకాశించును గాన ఈః ప్రకాశము ఆలౌక్యగమనము.

  ఇమ్ ఇది పరమైశ్వర్యే స్థితిశక్తిః సర్వేషాం నియంతృత్వన వర్తత ఇతీ ఇ. ప్రీశ్చ ఈశ్చ ఇశ్చ (సవర్ణదీర్ఘ)=స్త్రీ. అథవా విహరతి సర్వం ప్రపంచ రూపేణేతి హీః. హరిరూపేణ విహరణ రూపేణ ఇందతి పరమనియంతృత్వేన వర్తతే. సకల ప్రపంచ దేహేంద్రియాదికం ద్రవీకృత్య అనిర్వచనీయ ప్రకాశరూపాత్మైక్యగమకమత్యర్థః. అథవా హృదయపుండరీకమధ్యసుషిరాం తరదహరాకాశే వర్తమాన మహాకాశాంతర్గతాతిసూక్ష్మాతిప్రకాశత్మ స్థానోర్వగత దీపశిఖా (తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః) ఇది స్థితిశక్తి. అందరికిని నియంతవలె నుండునదీ గాన ఇ. 'స్త్రీ' యు, 'ఈ'యు, 'ఇయు (సవర్ణదీర్గము) = హీ అనబడును. లేదా సర్వమును ప్రపంచరూపమున విహరించును గాన హీః హరి రూపమున విహరణ రూపమునను ఇందతి పరమనియంతగా నుండును. సకల ప్రపంచ దేహేంద్రియాదికమును ద్రవీకరింపజేసి అనిర్వచనీయ ప్రకాశరూపముతో నాత్మైక్యమును బొందించునదని యర్ధము, లేదా హృదయకమల రంధ్రంతరములోని దహరాకాశములోనున్న మహాకా శాంతర్గత అతి సూక్ష్మాతి ప్రకాశముగల ఆత్మస్థానము పైనున్న దీపశిఖ అని యర్థము. (తస్యాఃశిఖాయా అన్నది శ్రుతి) సకలాచ సా స్త్రీ చ = సకలహీ 'ఇపు' ఇచ్ఛాయాం ఇష్యతే అత్యంతాభీష్టత్వేన విరించి విష్ణ్వాది స్తందిపర్యంతం చేతనవర్గెః కాంక్ష్యత ఇతి= ఈ

ఈ - హిమవతో హిమ పాతే పూత్తరేష్యితి శ్రుతేః

మే- మీతేర్వా మినోతేర్వా ఇదం సర్వం భవతి

మః - నాదానుకారీ శబ్దః. అనేన పరబ్రహ్మణః చీచ్ఛక్తిరుచ్యతే

సకలమైన హీ= సకల స్త్రీ గడ్డిపోచ నుండి బ్రహ్మాదుల వరకు మిక్కిలి యిష్టమైనదిగా ప్రాణి సమూహముచే కోరబడునదీ ఈ అనబడును. 'మ్' అనునది నాదముననుకరించు శబ్దము. దీనిచే పరబ్రహ్మయొక్క చిచ్ఛక్తి చెప్పబడుచున్నది.

సాదస్య శుద్ధ చైతన్యస్య స్థూల రూపత్వాత్ శుద్ధ చైతన్యాత్మక చిచ్ఛక్తిః ఉన్మనీనాదాది భ్యోతిష్యతీతత్వాత్ అవాఙ్మాన సగోచరాం మీనోతి తో నాదః. సర్వాత్మని తాదాత్మేన 'ఈ' నిరతిశయసత్యానందానుభవప్రకాశకనాదాత్మకచిచ్ఛక్తిరీత్యర్థః తత్రఖలు సర్వే ప్రపంచ మియంతే సృజంతే చ. హీచత్ ఈ చహీం సకలం చ తత్ హీ ఈ. చ= సకలహీం =సకల హృదాకాశపర్తి (దీప శిఖాంతర్గత సర్వతత్వాధిష్ఠాతృనిరతిశయ సత్యానందాను భవ ప్రకాశ సాదాత్మికా చిచ్ఛక్తి. అనేన మోక్షసాధన నాద-లయయోగా నందానుభవ ఉక్తః, తస్మాదేవ శక్తిఖండ ఉచ్చతే చిత్తవృత్తి నిరోధన ప్రధానత్వాత్, వైశ్యోపాస్యమాన జగతీచ్ఛందస్సారః సామవేదస్య గాన ప్రధాన నాదవిలీన చిత్తత్వాత్ సామవేదాత్మకత్వం,

నాదము శుద్ధ చైతన్యము యొక్క స్థూలరూపము. శుద్ధ చైతన్యాత్మక చిచ్ఛక్తి ఉన్మనీనాదాదులకన్న అతీతమైనది. కావున 'మ్' - నాదము అవాఙ్మానసగోచరమైన చిచ్చక్తిని కొలచియూహించును. సర్వాత్మునితో తాదాత్మ్యము జెందిన 'ఈ' నిరతిశయ సత్యానందాను భవప్రకాశకనాదాత్మక చిచ్చక్తియనీ భావము. అచటి అందరును ప్రపంచమును కొలచియూహింతురు. సృజింతురుగూడ, హీ చ తత్ ఈ చ=హీం. సకలంచ తత్ హీ ఈచ- సకలహీం, అనగా సకల హృదయాకాశముననుండు దీప శిఖలోనున్న సర్వతత్వాధిష్టాతయగు నిరతిశయ సత్యానందముయొక్క యనుభవమును ప్రకాశింపజేయు నాదాత్మకమైన చిచ్చక్తి. దీనివల్ల మోక్షసాధనమైన నాదలయ యోగానందానుభవము జెప్పబడినది. కావుననే శక్తిఖండము చెప్పబడుచున్నది. యోగము చిత్తవృత్తి నీరోధమే ప్రధానముగా గలది. వైశ్యోపాస్యమానమగు జగతీచ్ఛందపుసారము, సామవేదము గాన ప్రధాన నాద విలీన చిత్తకమైనది. కావున దీనికి సామవేదాత్మకత్వము. 

క ఏ ఈల హ్రీం హ స క ప ల హ్రీం స క ల హ్రీం

ఉత్తరోత్తర ప్రకాశబుద్ధి వ్యాపనాతిశయ వాగృత్యా, అనిష్టనివారణ భోగభాగ్యాది వృద్ధ్య తిశయ కీర్తిజాల జనక దహరాంతర్గత (దీపశిఖాంతర్గత) సర్వతత్త్వాధిష్ఠాతృ నీరతీ శయానంద సంవీదను భావ ప్రకాశక సాదాతీతా చిచ్ఛక్తి:  బుద్ది ఒక దివ్యమైన ప్రకాశము. అది ఉత్తరోత్తరముగా (పైపైకి) ప్రకాశించును. అది వ్యాపించిన తీరును వ్యక్తము జేయునది వాగ్వ్యాపారము. అది స్థూలముగానాద రూపము, సూక్ష్మముగా చిచ్ఛక్తి రూపము. అది అనిష్టనివారణమును జేసి భోగభాగ్యాదుల బెంచి యనుభవింప జేయుటయేకాక దిగంతముల వరకు వ్యాపించు కీర్తులను సంపాదించిపెట్టును. అది హృదయకమలాంతస్సులో వెలుగుచున్న దివ్యజ్యోతిని జేర్చి యందున్నని రితిశయానందానుభవమునందజేయును. అది నాదాతీతమైనచిచ్చక్తి. - (సూచన : ఈ వ్యాఖ్య శ్రీ శ్రీ ముంజులూరి నరసింహారావుగారు సేకరించిన వానిలోనుండి సేకరింపబడినది. గ్రంథం పేరు తెలియరాలేదు. “వంశస్యారహస్యము” కావచ్చును.)

  (ఇచట సహస్రాక్షర విద్య (ఖడ్గమాల)లో బాలాత్రిపురసుందరీ మంత్రము మొదలగువానికి యథామతి వివరణములీయబడినవి. సరిగాకున్న విజ్ఞులు కలయుచోసవరించుకొందురుగాత అని ప్రార్థన)

 పై సహస్రాక్షరవిద్యతో దేవికి పుష్పాంజలి నొసగవలె. కానిచో పూజ వ్యర్ధ్యమని వేదవాదులు చెప్పుదురు-51. ఆ తరువాత ఆవుపేడతో భూమీ నలుకవలె, దానిపై మట్టి రావి-మామిడి-నేరేడు-మేడిచెట్ల బెరడులను చివురాకులనుగప్పవలె. వానీపై నొక పెద్ద క్రొత్త కుండ నుంచవలె. దానిలో తూమెడు శాలిధాన్యమును, తూమెడు బియ్యమును, శుద్దమే పవిత్రమైన తూమెడు నీళ్ళును పోయవలె, కుండయొక్కయగ్రమున పండిన కొబ్బరి కాయనుంచవలె-16, 17, 18. దాని గంధపుష్పాదులతో బూజించి ధూపదీపాదులజూపవలె. హృదయమున శ్రీచింతామణి మంత్రమును మాతృకను జమీంపవలె-19. కుంభమును దాకుచు తనను లక్ష్మీని పొందిన వానినిగనే భావించుచు నూటయెనిమిది మారులు. జపముకాగా మరల దీపమును జూపవలె-20. శిష్యునీ ఔలిచీ రహస్యమున వానికన్నులకు బట్టగట్టవలె. వానితోగురువు మూడుమారులు సాష్టాంగ ప్రణామములజేయింపవలై-21. వానిచేతిలో పలుంచీ ఇషాంజలీని జేయింపవలె, విష్ణువు యొక్క కరుణరాశిగానైనదానా! పర్యంజ్యోతిర్మయియైన యీశ్వరి! ఈ పుష్పాంజలిని నీ పాదపద్మములపై సమర్పించుచున్నాను. నాకు పరంధామవు పరంబ్రహ్మవు, పరదేవతవును నీవే.--23 ఇవ్వేళటి నుండి నాపుత్రులను శరణాగతుడనైననన్నును రక్షింపుము. -అనీ - పలికి శిష్యుడు గురుని పాదకమలములను శిరముపై ధరింపవలె-24 ఇదినా. జన్మాంతర మునజేసిన సుకృతము, (పుణ్యము). బ్రహ్మయొక్కయు, విష్ణువు యొక్కయు శివుని యొక్కయు సేవచేలభించిన పాదుకలు గురువుచే నాశిరమున నుంచబడినవి-25. అనిపలికి, - భక్తినిండినవాడై మరలలేచి, శాంతిమంతుడై వినయవంతుడై అభిమానములేని వాడై గురువుయొక్క యెడమప్రక్కన గూర్చుండవలె-26. - తరువాత గురువు సొరకాయ (బుజ్జి)లోని (కమండలముగాజేసికొన్న సొరకాయదులోని) జలముతో ఎడమ ప్రక్కన నివేదింపవలె. తరువాత కన్నుల. గట్టినబట్టను విడదీసి అర్చన క్రమమును జూపవలై-27. శర్కర-తేనే-నెయ్యి-అరటి పండ్ల, పాయసరూపమున మహాత్రిపురసుందరికి నైవేద్యమర్పించవలెనని యాదేశింపవలె-28. మెల్లగా శిష్యుని యెడమచెవిలో షోడశాక్షరమంత్రమునుపదేశింపవలె. తరువాత వెలుపలికి వచ్చి పట్టువస్త్రము పఠలిచీన చెక్కపీటపై-29 పవిత్రుడైన శిష్యుని తూరుపుముఖముగా గూర్చుండజేసి సమంత్రకముగా కుంభజలములతో స్నానముజేయించవలె-30. మరల శిష్యుడు శదోదకములతో స్నానము జేసిన వస్త్రములను ధరించి, మంత్రమును నూటయెనిమిది మారులు జపించి తరువాత నీద్రబోవలె-31. శుభస్వప్నము కనబడినచో ఉత్తమపుణ్యము లభించినట్లు భావింపవలె, దుష్టస్వప్నముగలిగినచో వేయియెనిమిది (1908) మారులు జపముజేయవలె-32. యుక్తమార్గమున త్రిపురాంఐ యొక్క సేవను జేయవలె. ఏ స్వప్నము గనబడనిచో సిద్దీ చాలకాలమునకు లభించును-33. పరమభక్తితో దేవీశేషకలాధీకమును (తక్కిన దేవీకళలనధికముగా) స్వీకరింపవలె, వెంటనే యాశిష్యుడు పంక్తిపావనులలో పావనుడగును-34 శరీరమును అర్థమును (ధనమును) ఆ శ్రీగురువున కీయవలె. ఆతని కధీనుడై నిత్యము చరింపవలె. ఆతనీమాటను జవదాటరాదు-35. గురువు ప్రసన్నుడై యరక్షణములో మోక్షలక్ష్మినీ అనుగ్రహించును. అట్టి సంసారతారకుడైనగురువు సామాన్యముగలభింపడని యెఱుగవలె-36. గుకారమునకు అంధకారమనియర్గము.. రుకారమునకు దాని నిరోధకుడనియర్ధము. అంధకారమును నిరోధించువాడు గావున గురువనబడుచున్నాడు-87. జ్ఞానరూపియైన గురువును బొంది మరొక గురువును జేరరాదు. గురుని కఠిన వాక్యమును ఆశీస్సునుగా భావింపవలె-38. మొదట గురువునకభివాదనమొనర్చి ఆతని నుండి లౌకికముగాని, వైదికముగాని, చివరకాధ్యాత్మికముగానియైన జ్ఞానమును పొందవలేను-39. ఈవిధముగా మూడుదీక్షలను జేసి విధేయమును చేయదగినదానిని) గురువు మరల బోధింపవలె. గురుభక్తి సదాచారము. గురుద్రోహము పాతకము-40. ఆయనయడుగులు  తరింపజేయునవి. ముక్తినిచ్చునవి ఇదిదేహమున్నంతవరకు క్రమము (నడచుట). గురువునెదుట అసత్యమాడినందున గలిగిన పాపము-41. అది గోబ్రాహ్మణ వధకన్న మిన్నయైనది. బ్రహ్మమొదలు గడ్డిపోచలవణకును నాకు గురు సంతతియే. అట్టి సర్వపూజకునైన నాకు భూమండలమున నందరు పూజ్యులే-అని సర్వానుకూలుడైన వాడు శిష్యుడనబడును-43. శీలము మొదలగు విమలములైన యనేక గుణములతో సంపన్నమైన భావనగలవాడు. గురుశాసనముననుండువాడును శిష్యుడనబడినాడు-44.. జపమున నలసినపుడు మరల ధ్యానము జేయవలె. ధ్యానమున నలసినపుడు మరల జపముజేయవలె. జపధ్యానాదులలోయుక్తు (సమర్థుడైనవానికి తొందరగా మంత్రము సిద్దించును-45, ధ్యానసామర్థ్యమున కీటము భ్రమరమైనట్లు సమాధి సామర్ధ్యమున నరుడు బ్రహ్మీభూతుడగును-46. ప్రళయకాలమున ప్రపంచము లయమై (పరమాత్మలో లీనమై) కనబడదు. అట్లే నేత్రములను మూసికొనవలెను.. సర్వలయమును భావింపవలె. కనబడుటయటుంచి తలంపునగూడను రాదు. మనము గూడ లయము జెందవలె. ఇదీ ధ్యానలక్షణము-47. వర్ణాతీతమై వీకారములేని పరతత్త్వము దెలిసినపుడు మంత్రములు తమమంత్రాధిపులతో బాటు సేవకులైతాను జెప్పినట్లువినును-48. ఆత్మైక భావములోనున్నవానీ యొక్క చేష్ట దర్శనము. ఆత్మైకయోగము తపము, ఆయోగము ఆత్మమంత్రము: ఆత్మ నిరీక్షణమే ఆత్మధనము-49. దేహాభిమానము పోయి పరమాత్మ తెలియబడినపుడు మనస్సుబోయినచోటులెల్లసమాధులేయగును-50. అంతటనున్నదియు, శాంతమైనదియు, ఆనందస్వరూపమై అద్వయమైనదియు (ఏకమైనదియునైన ఆత్మను జూచినవానికి ఇకపొందదగినదియు తెలియదగినదియునైనదేమియు మిగిలియుండదు-51. కోటీపూజలతో సమమైనది స్తోత్రము. కోటి స్తోత్రములతో సమమైనది. జపము. కోటి జపముతో సమమైనది ధ్యానము. కోటిధ్యానములతో సమానమైనది లయము. (పరమాత్మలో నాత్మలయము)-52 దేహము దేవాలయమనబడినది. జీవుడే మహేశ్వరుడు. అజ్ఞానమను నిర్మాల్యమును త్యజింపవలె. పరామాత్మ నేనే అనుభావమును గూర్చుకొనవలె-53 ఊకతో బద్దమైనది ద్రోహి(వరిగింజ)యగును ఊకలేనపుడు తండులము (బియ్యపుగింజ)యగును అట్లే పాశముతో బద్దుడు జీవుడు అనబడును. పాశము వదిలినవాడు మహేశ్వరుడు -54. ఆకాశములో పక్షిజాతుల(కాళి) నడకతెలియదు. జలములలో జలచరముల (కాలి నడకతెలియదు. అట్లేమహాత్ముల యొక్క మహావృత్తము తెలియదు-55. నిత్యార్చనమును (ప్రతిదినము చేయునది) పగలు చేయవలె, నైమిత్తికార్భనమును (ఏదేని ఒక కారణమున ప్రత్యేకముగజేయు నర్చనము) రాత్రియందుచేయవలె, కోరికతో జేయునర్చనము రాత్రిలోను పగటీలోను జేయవలెను-అనునది శాస్త్రనిశ్చయము-56. కోటికోటి మహాదానములవలనను, కోటికోటి మహావ్రతములవల్లను కోటికోటి మహాయజ్ఞములవల్లను పరాశ్రీ పాదుకాస్మరణము గలుగును-57. జ్ఞానమువల్లగానీ (బ్రహ్మజ్ఞానము కలిగినగాని) అజ్ఞానము వల్లగాని (సాంసారికమువల్లగాని) దేహమున్నంతవరకు కర్మముక్తికోకు వర్ణాశ్రమాచారము (బ్రహ్మచర్య-గార్వస్య-వానప్రస్థ సన్యాసము)లను ఆచరింపవలేను వదలరాదు-5ి. గురువునోటినుండి మాటగా వచ్చినదంతయు శాస్త్రము అనబడును. నీషిద్దమైనను గుర్వజ్ఞను జేయవలెను. గుర్వాజ్జనుల్లంఘింపరాదు-59. ఉత్తమజాతి-ఉత్తమవిద్యా-బహుధనములతో నొప్పినవాడైనను సంతోషముతో గురువునకు సాష్టాంగ దండప్రణామముజేసి మూడు ప్రదక్షిణములు చేయవలె-60. దైవతమునుగాని గడ్డిపోచనుగాని గురువనుబుద్ధితో నమస్కరింపవలె. లోహముతోను మట్టితోను జేసిన ప్రతిమను గరువనుబుద్ధితో సమస్కరీంపవలె-61. గురువును ధిక్కరించినగాని, నీవనియేకవచముతో బలికినగాని, వాదమున బ్రాహ్మణుని జయించినగానీ, రహస్య శాస్త్రములను బయలుపరచినగాని, నరులుబ్రహ్మ రాక్షసులగుదురు-62. నీత్యము పరమాత్మతో అద్వైతమును (ఏకత్వమును) భావింపవలెను. కాని, గురువుతో ఏకత్వమును భావింపరాదు. వేదశాస్త్రాగమాదికములను గాని, ఇతరుల సిద్ధాంతాచారములను గానీ నిందింపరాదు-63. ఒకే గ్రామమున నున్న శిష్యుడు గురువును మూడు సంధ్యలలోను ప్రణమిల్లవలెను క్రోశమాత్రదూరమునున్న శిష్యుడు గురువును ప్రతిదినమును నమస్కరింపవలెను-64. అర్ధయోజనముననున్న శిష్యుడు గురువును ఐదు పర్వములలో నమస్కరింపవలె, ఒక యోజనము నుండి పండ్రెడు యోజనములవరకు-65, ఆయా యోజన సంఖ్యతో లెక్కించిన మాసములతో గురువును నమస్కరింపవలె. మిక్కిలి దూరముననున్న శిష్యుడు బుద్ధిపుట్టినపుడు గురువు కడకు వెళ్లవలె-66. ఒట్టి చేతులతో రాజును, దేవతను, గురువును సమీపించరాదు. ఫలములు, పుష్పములు, వస్త్రములు మొదలగు వానిని యథాశక్తి సమర్పింపవలె-67, సాక్షాత్తు పరశివుడే స్వయముగా మనుష్య చర్మముతో బద్దుడై (మనుష్యరూపుడై) మంచి శిష్యునిననుగ్రహించుటకై భూమిపైన రహస్యముగా పర్యటించును-68. నీరాకారుడైనను సద్భక్తరక్షణమునకైయే శివుడు సాకారుడగును. దయానిధియైన యాతడు లోకమున సంసారివలే మెదులును-69. గురువు మూడు కన్నులు లేని శివుడు నాలుగు భుజములు లేని విష్ణువు, నాలుగు ముఖములు లేని బ్రహ్మ-అని యనబడినాడు-70, గ్రుడ్డివారు ఉదయించిన సూర్యుని జూడలేరు. అట్లే పరతత్త్వ స్వరూపుడై కన్నులయెదుటనేయున్న - గురువును భాగ్యహీనులు చూడలేరు-71. తత్త్వ చింతనముత్తమము. జపచింతనము మధ్యమము.. శాస్త్రచింతనము అధమము. లోకచింతనము అధమాధమము-72. గురువునకు మీంచిన తత్వము లేదు. జ్ఞానమున కన్న మించిన సుఖములేదు. భక్తికన్న మించిన పూజలేదు, మోక్షమునకు మించిన ఫలములేదు-73. సమస్త వేదములలోను, శాస్త్రములలోను, బ్రహ్మ-విష్ణు-శివాదులలోను శ్రీకామాక్షి పరాత్పరయని యచటచట శబ్దములతో స్పష్టముగా జెప్పబడుచున్నది-74 శచీ-ఇంద్రులు, రోహిణీ-చంద్రులు, స్వాహా-అగ్నులు, ప్రభా-రవులు, లక్ష్మీనారాయణులు, వాణీ-బ్రహ్మలు, పార్వతీ పరమేశ్వరులు-75. అగ్ని-సోములు, బిందు -నాదములు, ఆధారాధేయ నోములైన ప్రకృతి-పురుషులు, భోగ-మోక్షములు-76. ప్రాణ-అపానములు, శబ్ద-అర్థములు.. విధి-నిషేథములు, సుఖ-దుఃఖములు మొదలగు జంటలు కనబడుదురు లేదా వినబడుదురు-77. సర్వలోకములలోని పై జంటలందరు నిశ్చయముగా బ్రహ్మస్వరూపములు. బ్రహ్మ-విష్ణు శివాదులు నిత్యమును ధ్యానించు ఉత్తీర్ణమైన అమరజ్యోతి కామాక్షి యను పేరుగలదిగా విజ్ఞులు దెలియుదురు. ఈ విధమైన శక్తి మార్గమున పురుషుడుగా నున్నవాడు-7879. శ్రీదేవి యొక్క అనుగ్రహమునకు స్థానము. భుక్తిముక్తులకు అతడు స్థానము. మంత్రముతోగాని మంత్రములేకగాని కామాక్షి నర్చించువారు-80. స్త్రీలుకాని, వైశ్యులుగాని, శూద్రులుగాని, పరమగతిని బొందుదురు. మంత్రపూర్వకముగా బూజించు. క్షత్రియుల విషయమున జెప్పవలెనా? వారు తప్పక పరమగతి బొందుదురు-81. సంసారులైనను వారు నిశ్చయముగా విముక్తులగుదురు. సంశయములేదు. శక్కర, తేనె-నెయ్యి-అరటిపండ్లు పాయసరూపమయిన నైవేద్యమును పంచపర్వములందు ఎల్లప్పుడును నివేదింపవలె. శక్తిగలిగి కూడ పూజింపనివాడు దేవీశాపమును బొందును-82. 83. శక్తిలేనపుడు భావించిన ద్రవ్యములతో నిత్యమంబిక-నర్చింపవలె. గృహస్థుడు-మంగళాచార సంయుతుడై-84. అనుకూల స్త్రీలు సఖులుగా గలవాడై మహాలక్ష్మిని అర్చింపవలె. ఓ అగస్త్యా గురువు మూడుమారులు ఆచారమును జెప్పవలె-85. శిష్యుడు. గ్రహించనటైన ఆ పాపముశిష్యునిది. గురునిదిగాదు. లక్ష్మీ-నారాయణులను, పోబ్రహ్మలను, పార్వతీపరమేశ్వరులను-86. శ్రీగురువును గురుపత్నిని, తల్లిదండ్రులను బుద్ధితో ధ్యానింపవలెను. (పరమార్థ తత్త్వమును దెలిసి ధ్యానింపవలెను)- అనియిది యంతయు ఓ యగస్త్యా! నాచే సంగ్రహముగా జెప్పబడినది-87. ఇంతమట్టుకు వినుటవల్ల నరుడు సర్వజ్ఞుడు బుద్ధిమంతుడును అగును-88.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున నలుబది మూడవయధ్యాయము.