బ్రహ్మాండ మహా పురాణము
66 - అమావసువంశవర్ణనము
సూతుఁడిట్లు చెప్పెను.
చంద్రుని పుత్రుఁడు బుధుఁడు. బుధుని కుమారుఁడు పురూరవుఁడు ఆతఁడు తేజస్వి దానశీలుఁడు. యజ్వ. విపుల దక్షిణల నొసంగినవాం డు. ఆతఁడు బ్రహ్మవాది. పరాక్రమ లక్షణుఁడు. శత్రువులకు యుద్ధమున అజేయుఁడు అగ్నిహోత్రము లాచరించినవాఁడు. అనేక యజ్ఞముల చేసినవాఁడు, సత్యవాక్కు ధర్మబుద్ది. మనోహరస్వభావుండు, రహస్య మైథునుఁడు. మూఁడు లోకముల యందు సౌందర్యమున అప్రతిమానం డు, యశస్వినియైన ఊర్శశి స్వాభిమానగర్వమును పరిత్యజించి బ్రహ్మవాది, దాంతుఁడు, ధర్మజ్ఞుఁడు, సత్యవాదీయుడు అయిన పురూరవుని వరించెను. ఆ మహారాజాఉర్వశితో పది సంవత్సరములు చైత్ర రథ వనమున, ఎనిమిది సంవత్సరములు రమ్యమందాకినీ నదీతీరమున, ఏడు సంవత్సరములు అలకానగరమున, ఆరువత్సరము విశాలపురమందు, మరల ఏడేండ్లు వనోత్తమమునైన నందనమున, ఎనిమిదేండ్లు గంధమాదనో ద్యానమున, పదియేండ్లు మేరు గిరీ శృంగమున, 8 సంవత్సరములు ఉత్తరకురుదేశమందలి కలాపి నగరమున గడిపెను. ఆ ముఖ్యములైన దేవతలు సంచరించు వనములందు ఊర్వశితో అత్యంత ముదముగా రాజు క్రీడించేను, (8) ఋషులిట్లడిగిరీ గాంధర్వ స్త్రీ ఊర్వశీ మానవుఁ డయిన రాజును విడిచి యెట్లు స్వర్గమును చేరెనో మాకు చెప్పుము. సూతుఁడిట్లు సమాధాన మొసంగెను. బ్రహ్మవలన శాపము ననుభవించి యామె మనుష్యునీ చేరేను. తన యొక్క శాప విమోచనము కొఱకు ఆమె యొక నీయమము చేసెను. “నగ్నము కాకుండ..దర్శనము, కామము లేకుండ మైథునము” రెండు మేషములను (మేకలను) శయనము కడనుంచుట ఇవీ జరుగునంతవరకూ నేను (ఊర్వశి)పురూరవుని కడనుందును. అంతీయకాక, “నా ప్రధానాహారము నేయి, అది యైనను రోజున కోక్కమారే ఈ నియమములను ఓరాజా నీవంగీకరించి, ఎంతకాలము నీవీ నియమముల నియమముగా పాటింతువో అంతకాలము నేను నీతో నుండగలను.
ఇది మన పరస్పర నియమము. రాజు ఆమె యొక్క నియమములను పాటించేను. ఈ విధముగా నామె శాపమోహితయై ‘ఐలు’నీతో అభీగామినియై యనురాగముతో, అరువది నాలుగు సంవత్సరములుండెను. (14) ఊర్వశి మనుష్యత్వమొందెను. తత్కారణమున గంధర్వులు విచారాన్వితులైరి. గంధర్వులిట్లు పలికిరి. ఓ మహాభాగులారా స్వర్ణాలంకారమయినది ఊర్వశి. మరల స్వరమునకెట్లా వరాంగన వచ్చునో ఆలోచించుం డు. అంత మహామతియైన విశ్వావసుఁడను గంధర్వుఁడు, ఆమె యొద్ద నుండి ఆమెకు సంబంధించిన మేకల రెంటిని దొంగిలించుకొనిపోయెను. తరువాత ఆమే స్వర్గమున కరిగెను. ఆమే తోడి విరహముతో రాజు ఇందు నందు సర్వార్డీనీ సంచరించెను. ఆమెను నతఁడు కురుక్షేత్రమున కనుగొనెను. ఆమెతో నతఁడు సంభాషించెను. ఆమే రాజుతో “గంధర్వుల కడకు వెడలుము” అనేను. ఆతఁడల్లొనర్చెను. గంధర్వులాతనికోక అగ్నిస్థాలిని (అగ్నితోడిగిన్నెను) ఇచ్చిరి. మహా రథుఁడయిన రాజు దానితో స్వర్గమున కరిగెను. పూర్వము ఒక్కడే అగ్ని. కానీ ఇలుడు (ఇల యొక్క కోమరుఁడు) దానిని మూఁడగ్నులు చేసెను. (19) ఓ బ్రాహ్మణులారా ! ఐలుఁడు తద్విధమయిన ప్రభావము గల రాజాయెను. ఆ మహారాజు, యమునా నదియొక్క ఉత్తర తీరమున ప్రతిష్టానమున ప్రయాగయందు పుణ్యతమదేశమున మహరులచే నలంకృతమైనచోట రాజ్యమును స్థాపించేను. ఆతనికీ ఆరుగురు పుత్రులుదయించిరి. వారందరు ఇంద్ర సమతేజస్వులు, వారందరు గంధర్వలోకమున సువిదితులు పోరు-ఆయువు, ధీమంతుఁడు, 'ఆమావసువు' విశ్వావసువు, శ్రుతాయువు మరియు ఘృతాయుపు. వీరందరు ఉర్వశీసుతులు. భీముడు, రాజు (పరాక్రమవంతుఁ డు), విశ్వజిత్తు అమావసువు యొక్క తనయుఁడు. కాంచన ప్రభాదీప్తుఁడయిన రాజు భీమునకు దాయాది. విద్వాంసుఁడయిన కాంచన ప్రభువునకు మహాబలుఁడయిన సుహోత్రుఁడు పుత్రుఁడు సుహోత్రునకు కేశినీ గర్భమున జహ్నువుదయించెను. ఆతని యొక్క వితతయిము జరుగుచుండగా, గంగ ప్రవాహగతి మార్చి అనివార్యమయిన భావ్యర్థదర్శనమున, తద్దేశమునంతటినది వరదతో ముంచెత్తేను.
యజ్ఞవాటిక గంగలో మునిగిపోయినది. దానిని చూచి సంక్రుద్ధుఁడయిన సుహోత్రుని పుత్రుఁడు గంగను త్రాగి వైచేను. రాజరీ గంగను త్రాగివైచుట చూచిన సురరులు గంగానదిని జిహ్నపు దుహితగా జాహ్నవిగా తీసికొని వచ్చిరి. (సృష్టించి ప్రవహింపఁజేసిరి). యౌవనాశ్వుని పౌత్రియయిన కావేరిని జహ్నువు పెండ్లాడెను. (28) యౌవనాశ్వుని శాపముచే గంగ తన యొక్క సగభాగము నుండి కావేరి నుత్పాదించేను, (కావేరికి ఉదయ మొసంగెను). కావేరి అనిందితురాలు. జహ్నుని యొక్క భార్య. సరిత్తులలో శ్రేష్టమైనది. జహ్నువు భార్యయన కావేరి వలన సునహుఁడను ధర్మాత్ముని కనెను. ఆసునహునీ కుమారుఁడు అజకుఁడు. (30) అజకుని యొక్క దాయాది అలాకాశ్వుఁడు. మహాయశుఁడు. ఆతఁడు మృగయాశీలుఁడయ్యెను. ఆతని కుమారుఁడు కుశుఁడు, కుశుకునకు పుత్రులు దేవవర్చస్సులు నలుగురు. వారు కుశాంబుఁడు, కుశనాభుఁడు, అమూర్తరయరసుఁడు మరియు వసుపు, కుశికుఁడు. (కుశాంబుఁడు) రాజసత్తముఁడు పుత్రార్థియై తపస్సాచరించేను. వర్ష సహస్రము గడచెను. ఇంద్రుఁడాతనీ యుగ్ర తపస్సు గమనించెను. శాశ్వతుఁడయిన ఇంద్రుఁడు తానే యాతనికి పుత్రు నొసంగసమర్థుఁడైనను, ఆతనికి తానే పుత్రుడయ్యెను. పాకశాసనుఁడు కుశికునకు గాఢయను పేర పుత్రుఁడయ్యెను. (35) పౌరకుట్సీ (పురుకుత్సుని కూతురు) గాథ్ యొక్క భార్య యయ్యెను. ఆమెకు మొదట మహాదృష్టవంతురాలు మొదట ‘సత్యవతి’ యను కన్యక యుదయించెను. రాజయిన గాధీ సత్యవతిని పుత్రకాముఁడయిన “ఋచీకునకిచ్చి వివాహము చేసెను. భర్తయైన ఋచీకుఁడు ఆమె యందు ప్రీతుఁడు. ఆతఁడు భార్గవుఁడు. భృగునందనుఁ డు, ఋచీకుఁడు స్వపుత్రార్థమును గాధికి పుత్రుని కోటకును చరువును సిద్ధముచేసి తన భార్యతో ఇట్లనెను.
ఈ చరువు నీవు పుచ్చుకోనవలయును. ఇది నీ తల్లికిమ్ము, ఆమెకు దీప్తిమంతుఁడు, క్షత్రియర్షభుఁడు నగు పుత్రుండుదయించును. యుద్ధమున ఆతఁడు క్షత్రియులకజేయుఁడు. మహామహా బలవంతులయిన క్షత్రియులను చంపును. ఇక, నీవో కళ్యాణి ! ధృతిమంతుని, తపోధనుని, శమాత్మకుని, ద్విజశ్రేష్ఠుని కందువు ఈ రెండవ చరువీ విధముగా ప్రాప్తింపఁజేయును” అనీ ఈ విధముగా భార్యతో చెప్పి భృగు నందనుఁడయిన ఋచీకుడు తపస్సాచరింప నభిరతుఁడై యరణ్యమున కేగెను. అంత, గాధి భార్యతో కలిసి, తీర్థయాత్రా ప్రసంగమున తన కూతురయిన సత్యవతిని చూడగోరి ఋచీకాశ్రమమునకు వచ్చెను. సత్యవతీ అవ్యగ్రమనస్సుతో, అచరుద్వయమును గ్రహించి, సంతోషముతో తల్లికి నివేదించెను. సత్యవతి అవ్యగ్రమనస్క స్పషార్ధముగా నాచరుద్వయమొసంగేను. తల్లి, దైవవశముచే, కుమార్తెకు తనకు నిర్దేశింపఁబడిన - చరువు అజ్ఞానముచే నొసంగెను. (40) (చరువులు వ్యత్యస్తములయినవి) తల్లిచరువుస్తామే చరువును స్వీకరించెను. సత్యవతి గర్భము దాల్చెను. క్షత్రీయంతకరునీ గర్భమున ధరించెను. ఆమె దీప్తమయిన తనువుతో ఘోర దర్శనురాలుగా దోచెను. ఋచీకుడు ఆమెను చూచి, యోగశక్తిచే విమర్శించి, భార్యతో “ఓ వరవర్ణినీ ! నీవు నీ తల్లిచే వంచింపఁబడితివి. చరువులు తారుమారుగటచే నీవు క్రూరకర్మాతిదారుణుఁడయిన పుత్రుని కందువు నీ తల్లికి ఇంతకు పూర్వము చెప్పినట్టి లక్షణయుతుఁడయిన తపోధనుడుదయించును. నేను నా సర్వస్వమైన బ్రహ్మతపస్సు ఈ చరువున సమర్పించితినీ”. అని చెప్పెను. పూజ్యురాలయిన సత్యవతి భర్తను ప్రసన్నుని చేయుచు 'నా కుమారుఁడట్టివాఁడు కారాదు. నీవలన కుబ్రాహ్మణుఁడు నాకు పుట్టరాదు”. అని పలికెను. అంతముని యిట్లనెను. “ఓ పూజ్యురాలా ! ఇది నీవు గాని నేను గాని సంకల్పించినది కాదు. తల్లియొక్క తండ్రియొక్క కారణమున పుత్రుఁడుగ కర్ముఁడగును. అని.
ఇట్లు ఋషి పలుక, మరల సత్యవతి ఇట్లు పలికెను. “ఓ మహర్షీ ! నీవు కోరినచో లోకాలను సృజింపఁగలవే ! కోరి కుమారుల నేల సృజింపలేవు? శమాత్మకుఁడయినవాఁడు, ఋజు స్వభావుఁడైనవాడునునైన కుమారు నొసంగ అరుఁడవు. ఇట్లు చేయుటకు అశక్యమైన ఓ ద్విజోత్తమ ! మన పౌత్రుడిట్టివాఁడగుత” తన తపము యొక్క ప్రభావముచే, అతడామెను ప్రసన్నురాలనుజేసి “అతఁడు నా పుత్రుఁడగుగాక లేక పౌత్రుఁడగుగాక ఓ వరవర్ణినీ ! నాకెట్టి విశేషము (భేదము) లేదు. ఇయ్యది నీవు చెప్పినట్లే కాగలదు” అనెను. (55) అ కారణముచే సత్యవతి తపస్సు నందాసక్తిగలవాఁడు ఇంద్రియ నిగ్రహవంతుడు శమాత్మకుడు, అయిన జమదగ్నిని కనెను. రుద్ర విష్ణువులకు సంబంధించిన భృగుని యొక్క చరువు యొక్క విపర్యయము పూర్వము జరిగెను. అతని తల్లి తినిన చదువున వైష్ణవమైనయన్నీ యొక్క జమనము వలన జమదగ్ని అయ్యోను. (57) విశ్వామిత్రుని తన దాయాదిగా పొందిన తరువాత కుశిక నందనుఁడయిన గాధి బ్రహ్మర్షి సమమైన స్థితిని పొందెను. ఆతఁడు బ్రహ్మచే కోరబడెను, (58) అట్టి సత్యవతి పుణ్యురాలు. సత్యవ్రత పరాయణురాలు కౌశికి యనెడు మహానదిగా నయ్యెను. అయ్యది నదులలో శ్రేష్ఠమయినదియై ప్రవహించెను. ఇక్ష్వాకు వంశ ప్రభువై రేణుకుఁడు అను రాజు కలఁడు. ఆతని కూతురు మహాభాగ్య వంతురాలు, ఆమె రేణుక, ఆమెకు 'కమలినీ' యనునామాంతరము. కమలినీయైన రేణుక యందు అర్చీకుఁడయిన జమదగ్ని, తపస్సుచే ధృతిచే, సమాధిచే, సర్వవిద్యాపరిపూర్ణుని ధనుర్వేదపారగుని క్షత్రియారణ్యమునకు ప్రజ్వలించు పావకుని వంటి సుదారుణుఁడైన వానిని రాముని కనెను.
బ్రహ్మవిదులలో శ్రేష్ఠుఁడయిన జమదగ్ని, తపోవీర్యముచే, ఔర్వునకు కుమారుఁడయిన ఋచీకునకు సత్యవతి వలనఁగలిగెను.. శునః శేపుఁడు మధ్యముడు, శునః పుచ్చుఁడు కనీష్ణుఁడు. ధర్మాత్ముఁడయిన విశ్వామిత్రుఁడు విశ్వరథుఁడుగా ప్రఖ్యాతుఁడు. ఆతఁడు భృగు ప్రసాదమున కుశీకాన్వయ వర్థనుడుగా జన్మించెను. (65) మునియైన శునఃశేపుండు విశ్వామిత్రుని పుత్రుఁడయ్యెను. ఆతఁడు (శునఃశేపుండు) హరిశ్చంద్రుని యజ్ఞమున యజ్ఞపశువుగా నియమితుఁడయ్యెను. మరల విశ్వామిత్రునకు శునఃశేపుని దేవతలొసంగిరి. దేవతలచే నీయబడుటచే నతఁడు తరువాత ‘దేవరాతు’డయ్యెను, విశ్వామిత్రుని పుత్రులలో శునఃశేపుఁడు అగ్రజుండుగా ఖ్యాతుఁడు. మధుచ్ఛందుడు, కృతదేవుడు, ధ్రువుడు, అష్టకుఁడు, కచ్చపుడు, పురాణుఁడు అను వారు కూడ విశ్వామిత్రుని కుమారులే. మహాత్ములయిన కౌశికులయొక్క గోత్రములనేకములు. (69) ఆ గోత్రములు పార్టీవులు, దేవరాతులు, యాజ్ఞవల్క్యులు, సమర్పణులు, ఉదుంబరులు, వాతడ్యులు, తలకాయనులు, చాంద్రవులు, లోహిణ్యులు, రేణువులు, కారీషవులు, ఫణినులు, బభ్రువులు, ధ్యానులు, ఉప్యులు, శ్యామాయనులు, హిరణ్యాక్షులు, సాలంకృతులు, గాలవులు. దేవలులు, యామదూతులు, శాలంకాయనులు. భాష్కలులు, లాలాట్యులు, బాదరులు, మరియు ఇతరులును ధీమంతుఁడైన విశ్వామిత్రుని గోత్ర సంబంధీకులు. కుశిక వంశీయులు చాలమంది యున్నారు. వీరు ఇతర ఋషుల గోత్రములతో వివాహ సంబంధముకలవారు. (73) కౌశీకులే, సౌశ్రుతులు మరియు సైంధవోయనులు, ఇతరులును వీరందరు యోగేశ్వరుఁడు, పుణ్యుఁడు, బ్రహ్మరి, కౌశికుఁడునైన విశ్వామిత్రుని పుత్రులలో శునఃశేపుఁడు అగ్రజుం డు. విశ్వామిత్రునకాదృషద్వతికినీ బుట్టినవాడు అష్టకుడు. లౌహితుండు అష్టకునిసుతుఁడు. ఈ విధముగా జహ్నుగణము నాచే చెప్పబడినది.
ఋషులిట్లు ప్రశ్నించిరి. విశ్వామిత్రుఁడు మొదలయిన నృపులచే బ్రాహ్మణ్యముసమధిగతమయినది, దానినివారు ఏ విధమైన లక్షణముచే, ధర్మముచే, పాండిత్యముచే, తపస్సుచే పొందిరి? ఏ ఏ నామములతో బ్రాహ్మణ్యమును క్షత్రియులు. పొందిరి? తపస్సు చేతనా, దానము చేతనా, విశేషముగా తెలియగోరు చున్నాము. ఇట్లు అడుగబడి అర్ధవద్వాక్యముల సాతఁడిట్లనెను. ధనవంతుఁడు అన్యాయముగా సంపాదింపఁబడిన ధనాది ద్రవ్యములచే ద్వీజసత్తములను ఆహ్వానించి, ధర్మాభికాంక్షియై యజ్ఞమాచరింప ధర్మఫలము సాతఁడు పొందఁడు, (79) ఒక వ్యక్తి ధనలో. భాదిగుణములచే నీరంకుశుఁడయి, రాగమోహాన్వితుఁడై ప్రవర్తించి, తుదిని తన్ను. పవిత్రీకరించుకొనుటకు తీవ్రముగా జపతపములాచరించి, అధికముగా దానము లొసంగీన, ఆతని దానములు ఫలరహితములగును. హింసకుఁడు దురాత్మకుఁడు ధర్మప్రవృత్తిచే ఉత్తమకార్యములు చేయగోరును ధనము నన్యాయముగా సంపాదించీ ఆతఁడు దానములు చేయవచ్చును, యజ్ఞముల నాచరింపవచ్చును. ఇది వట్టి మోహము. ఆ ... దురాత్ముని కలంకీతమైన దానము సత్పలితము నీయదు. ఒక వ్యక్తి ధర్మార్జితములైన విత్తములను , అరులయిన వారి కొసంగిన, ఒక వ్యక్తి.. మనస్సులో కోరికల కాంక్షింపక దానము లొసంగిన, పూజ లొనర్చిన ఆతఁడు దాన ఫలమును పొందును. ఆ ధానము సుఖము నొసంగును దానముచే భోగము నొందును. పత్యముచే స్వర్గము నొందును. సుతప్త తపస్సుచే ఉత్తమ లోకములు చేరి యందుండును. తపస్సు కంటే సత్యము. శ్రేయోదాయకము. సత్యము కంటే జ్ఞానము శ్రేష్ఠము. ద్విజాతులయిన క్షత్రియులు బ్రాహ్మణత్వమును తపస్సుచే పొందిరి. నరపతియైన విశ్వామిత్రుఁ డు, మాంధాత, సంకృతి, కపి, కాశ్యుఁడు, పురుకుత్సుడు, శల్యుడు, ప్రభుండైన గృత్సమదుఁడు, ఆర్ట్స్ షేణుఁడు, అజామీథుఁడు, భార్గవ్యోముఁ డు, కక్షివంతుఁడు, ఔసీజుఁడు, శిశిరుఁడు, రథాంతరుఁడు, శౌనకుఁడు, విష్ణువృద్ధుఁడు, ఇతర నృపులు క్షత్రోపేతులు. వీరందరు ఋషిత్వమును తపస్సుచే పొందిరి. ఆ రాజర్షులందరు గొప్ప సిద్ధిని పొందిరి. ఇక ముందు మహాత్ములయిన ఆయువువంతాదుల గూర్చి చెప్పేదను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున, తృతీయోపోదాతపాదమునందు, భార్గవచరితమున అమావసు వంశానుకీర్తనమను అరువదిఆరవ అధ్యాయము.
Summary of chapter 104 of the Brahmānda Mahā Purana is as follows:
In celebrating tone, this section sings the praises of the future Manus and the prosperous, virtuous worlds that will flourish under their compassionate rule. It describes how future earth will be filled with abundance, peace, and spiritual devotion under their benevolent stewardship. The narrative inspires a joyful, optimistic vision of the future, reaffirming that divine goodness forever triumphs across all temporal cycles.