బ్రహ్మాండ మహా పురాణము
1 - ఉపసంహార పాదః
బుద్ధిమంతుఁడైన సూతుని వలన మూఁడవ పాదము విని, ఋషి సత్తములతనీ నాలుగవ పాదమును గూర్చి అడిగిరి.
ఋషీశ్వరులిట్లడిగిరి.
మాయందలి దయచే నీవు తృతీయ పాదమును చెప్పితిని. ఇక చతుర్ధమైన సంహార పాదమును విస్తరముగా కీర్తించుము. మాకు మన్వంతరము లన్నింటిని గూర్చి చెప్పుము. పూర్వము వచ్చినవి తరువాత వచ్చినవి యైన మన్వంతరములగూడ చెప్పుము. సప్తరుల గూర్చి, ప్రస్తుత మన్వంతరమందలి మహాత్ముని యొక్క సృష్టిని గూర్చి అన్ని భాగములను విస్తరముగా క్రమాను బద్ధముగా, మాకు చెప్పుము.
సూతుఁడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను.
యథాతథముగా దానీనంతటిని మీకు చెప్పెదను మునీ సత్తములారా! ఉప సంహార పాదమైన ఈ చతుర్థమును చెప్పెదను, బ్రాహ్మణులారా! ఆలకింపుఁడు ప్రస్తుతమనువు వైవస్వతుఁడు ఆతఁడు మహాత్ముఁడు, సృష్టినంతటిని వివరముగా క్రమ బద్ధముగా వినుఁడు.
నేను వివరింప, భవిష్యత్ సప్తమన్వంతరముల సంగ్రహమును లోకముల పంచము యొక్క ప్రళయమును వినుఁడు ఈ మన్వంతరములు చక్కగా చెప్పబడినవి. సప్త మన్వంతరములలో పుట్టిన ప్రజల గూర్చి చెప్పితిని. భవిష్యత్మన్వంతరముల గూర్చి నా వలన వినుఁడు. వైవస్వతుని కుమారుఁడయిన సావర్ణమనువు యొక్క వివరములు చెప్పెదను, భవిష్యత్తు సంక్షేపముగా తెలిసికొనుఁడు. భవిష్యత్తునందలి ఋషులు 7. ఏడుగురుగా సంస్కృతులు వారు అనుశికవంశుజుడుగాలవుడు, జమదగ్ని వంశజుడు భార్గవుడు, ద్వైపాయునుడైన వసిష్టుడు శరద్వంతుని పుత్రుడు కృపుడు అత్రివంశజుడైన దీప్తిమంతుడు కాశ్యపవంశజుడైన ఋష్యశృంగుడు, ద్రోణపుత్రుడైన అశ్వత్థామ, వీరు ఏడుగురు భవిష్యత్కాలముల పరమర్పులు. దేవతలు మూఁడు విధములుగా నుందురు. సుతపులు అమితాభులు సుఖులు, వీరిలో ఒక్కొక్క వర్గము 20 మంది దేవులను కలిగియుండును. వారి నామములను - ప్రత్యేకముగా చెప్పెదను. సమాహితులై వారి నేఱుంగుఁడు. సుతప వర్గపు. వారు - ఋతువు, తపుఁడు, శుక్రుఁడు, కృతి, నేమీ, ప్రభాకరుండు, ప్రభాసుఁడు, మసకృత్తు, ధర్ముడు, తేజుండు, రశి, క్రతువు, విరాట్, అర్చిష్మంతుఁడు, ద్యోతనుడు, భానుఁడు, యశస్సు, కీర్తి, బుధుఁడు, ధృతి, ఈ విధముగా ఈ ఇరువది సుతపులను నామములచే పరికీర్తితులు. అమితాభ వర్గమునకు చెందిన ఇరువది దేవతలు - ప్రభువు, విభువు, విభాసుఁడు, జేత, హంత, అరిహ, ఋతువు
సుమతీ, ప్రమతి, దీప్తి, సమాఖ్యాతుఁడు, మహస్సు, మహాత్ముడు, దేహి, ముని, ఇనుఁడు పోష్ట సముఁడు, సత్యుఁడు, విశ్రుతుం డు; వీరిరువదిమందీ అమితాభులు. వారు క్రమముగా చెప్పబడిరి. సుఖవర్గపు ఇరువది మందియు దాముఁడు, దాని, ఋతుం డు, సోముఁడు విత్తుఁడు, వైద్యుడు, యముడు, నిధి . హోముఁడు, హవ్యుఁడు హుతుఁడు, దానుఁడు, దేయుఁడు దాత, తపుఁడు శముడు, ధ్రువుఁడు, స్థానుండు విధానుఁడు మరియు నీయముఁడు. వీరిరువది మంది, సుఖ వర్గమువారుగా సావర్ణుని ప్రథమ మన్వంతరమువారుగా చెప్పఁబడిరి. వారు మహాత్ముఁడు మారీచుఁడునయిన కశ్యపునిసుతులు. ఆ మన్వంతరమున కశ్యపునకు అరువది దేవతలు కలుగుదురు. అతఁడే ప్రస్తుత మనువు. సావర్ణి మనువునకు తొమ్మండుగురు పుత్రులుదయింతురు. వారు - విరజుఁడు, అర్వరీవంతుఁడు, నీరోకుండు మరియు ఇతరులు ఇతర సావర్ణ మన్వంతరమున ఇతర నవ సుతులను చెప్పెదను. ఇతరులయిన సావర్ణమనువులు, బ్రహ్మ యొక్క భవిష్యత్కుమారులగుదురు. వారు నలుగురు. వారికి దివ్య దృష్టి కలదు. వారు మేరు సావర్ణి మొదలగువారు. వారు దక్షుని యొక్క దౌహిత్రులు - కూతురయిన క్రియ యొక్క కుమారులు వారు మేరు పృష్టమున గొప్ప తపస్సుచే యుక్తులు. వారికి గొప్ప మహస్సు కలదు. వారు బ్రహ్మాదులచే జననమొందిరి, ధీమంతుఁడైన దక్షునిచే నుద్భవించిరి. వారు, మరణించి, మహర్లోకమునకరుగుదురు. వారు మేరువు నాశ్రయింతురు భవిష్యత్మనువులగుదురు. మహానుభావులయిన వారు చాక్షుషమన్వంతరమున - పూర్వము పుట్టిరి. వారంతట వారే భవిష్యనన్వంతరమున జన్మించెదరు . ప్రాచేతసుఁడయిన దక్షుని యొక్క దౌహిత్రులయిన, ఆమనువులలో ఐదుగురు సావర్ణులని నామకరణము చేయఁబడిరి. నలుగురు పరమ ఋషులకుఁబుట్టిరి. ఒకడయిన సావర్ణి వైవస్వతునకు పుట్టిన సావర్ణి కుమారుఁడు. సంజ్ఞ యొక్క జ్యేష్ఠ సుతుఁడు మనువు ఇతఁడు వైవస్వతుని కుమారుఁడు. వారి యొక్క శుభంకరమయిన సముత్పత్తి వైవస్వత మన్వంతరము సంప్రాప్తమయినప్పుడు కీర్తివర్ధనులగుదురు. ఈ పదునాల్గురు మనువులు వేదములందు, స్కృతులయందు, పురాణములయందు, కీర్తింపబడిరి. వారందరు శక్తిమంతులు, ప్రభవిష్ణుపులు వారందరు ప్రజలయొక్క పతులు. అంత్యకాక సర్వ భూతములకును పతులు. సప్త ద్వీపయుతము, సపట్టణము నయిన ఈ పృథివియంతయు. పూర్వము యుగ. సహస్రము ఈ నరేశ్వరులచే పాలింపఁదగినది. వారి యొక్క విస్తృత వర్ణనము, వారి ప్రజలతో తపస్సుతో గూడ చెప్పబడును. స్వాయం భువులయిన మనువులు పదునాలుగురు. వారు ఒక్కొక్కసారి మన్వంతరాధికారమును వహింతురు. వారి యధికారము విని వృత్తముకాగా .వారు మహర్లోకమునాశ్రయింతురు.
వారియందు ఆరుగురు గతించిరి; మిగిలినహారు ఎనమండుగురు. పూర్వ మనువుల యందు, ప్రస్తుత మనువుల యందు, వైవస్వతమనువు శాసించును. దేవతలలో, ఋషులలో, దానవులలో మిగిలినవారిని గూర్చి చెప్పెను. ఓ బ్రాహ్మణులారా! మీకు భవిష్య జ్ఞానములను గూర్చి, వారి సంతానములతో సహా చెప్పెదను. వైవస్వత మనువు యొక్క విస్తర వర్ణనము దాహరణముతో వారి వివరము నెఱుంగవలయును. ఏలయన వారందరు వైవస్వతమనువు కంటే తక్కువ వారు కారు. అధికులునుకారు. పునరుక్తి బహుత్వము వలన మన్వంతరముల వివరములను భూతములయినవి కాని భావ్యములయినవి కాని వచింపను, అందుచే, కులముల యొక్క సంసృష్టి విభాగశః తెలిసి కొనవలయును. వాని యొక్క సిద్ద్యర్ధము విస్తరముగా క్రమముగా తెలిసికొనవలయును. 38. దక్షుని కన్య ధర్మిష్ణ సువ్రతా నామమున ప్రసిద్ధ. కన్యలందరియందు ఆమె వరిష్ఠ, వీరిణి యొక్క జ్యేష్ఠ సుత. తండ్రి ఆతని కన్యను తీసికొని బ్రహ్మకడకేగెను. (బ్రహ్మ వైరాజుఁడు) బ్రహ్మ ధరునితో భవునితో సేవింపబడుచు నందుండెను. ధర్మ భవుల సమీపమున కూర్చుండి యున్న దక్షునితో బ్రహ్మయిట్లనెను. 'ఈ నీ కూతురయిన సువ్రత నలుగురు కుమారులను కనును. వారు నలువురు మనువులు నాలుగు వర్ణముల శుభ ధర్మములను నిర్వహింతురు, బ్రహ్మ యొక్క పలుకులు విని దక్షుఁడు, ధర్ముడు, భవుఁడు - ఈ మువ్వురు మనసా బ్రహ్మతో సహా ఆ కన్యను చేరిరి. కన్యను చేరిరి.
వెంటనే ఆ కన్య సదృశానురూపులయిన నలుగురు కుమారులను సత్యాభిధానులను కనెను. పుట్టిన వెంటనే ఆ కుమారులు కార్యముల నాచరించుటకు సంసిద్ధులయిరి. వారు శ్రీతో అన్వితులు, ఉప భోగ సమర్థశరీరులు; సద్యోజాతులయి వేదములుచ్చరించునట్టి వారిని చూచి, బ్రహ్మయు ఇతరులును ఆశ్చర్య చకితులైరి. 'ఇతడు నాపుత్రుఁడు, నొపుత్రుఁడు అని వారిని పోరు తమ ప్రక్కకు ఆకర్షించుకోనిరి, తమకు పోరుద్భవించినట్లుగా ఊహించి వారిట్లనిరీ' ఎవఁడు శరీర స్వభావముచే తుల్యుఁడో అతఁడు కుమారుఁడు, ఎవఁడు సదృశరూప వీర్యుఁడో అతనిని గ్రహింతుము గాక ఎవనికి ఎవఁడు సముఁడో వర్ణముచే నతఁడాతనిని గ్రహించునుగాక. మనకు భద్రమగుగాక. తండ్రి తోటి సమానమయిన రూపమునతని పుత్రుఁడనుకరించును. అందుచే ఆత్మ సముఁడు పుత్రుఁడు. వీర్యము వలన పితృమాతల సముఁడు నగును. ఈ విధముగా సమయము నేర్పరచుకొని అందరు సుతులను గ్రహించిరి. .
చాక్షుషమన్వంతరమతీతమయి వైవస్వత మన్వంతరము ఆరంభముకాగా రేచ్యుఁడను కుమారుఁడు, ప్రజాపతియైన రుచికి పుట్టెను. భూతీవలన, కవికి పుత్రుఁడుగా పుట్టినయతఁడు భౌత్యుఁడు. వైవస్వతమన్వంతరమున వివస్వంతునకిరువురు మనువులు పుట్టిరి. ఒకఁడు వైవస్వతమనువుగా ప్రసిద్ధుఁడు; రెండవవాఁడు సావర్ణునిగా ప్రసిద్ధుఁడు. విద్వాంసుఁడయిన వైవస్వత మనువును సంజ్ఞా కుమారునిగా జ్ఞాపకముంచుకొనవలెను. మిగిలిన రెండవ వైవస్వతమనువు సువర్ణకుమారుఁడుగా నేఱుంగవలెను. సావర్ణి మనువులు నలుగురు, వారు మహర్షి జాతులు తపస్సుచే సంభృతాత్ములు వారు వారిమన్వంతరములందు స్వ కార్యార్థ సాధకులగుదురు. ప్రథమ మన్వంతరమున మూఁడు వర్ణములుగా దేవతలు పుట్టెదరు. అప్పుడు దక్షుని యొక్క కుమారుఁడయిన మేరుసావర్ణి మనువగును. ఆ త్రివర్గము-పరులు, మరీచిగర్భులు, మరియు సుధర్మోణులు, వైవస్వతాంతరమున మహాత్ములందరు దయింతురు. వారందరు దక్ష పుత్రుని పుత్రులు, ప్రజాపతియైన రోహితుని పుత్రులు. ఒక్కొక్క వర్గము నందు పండ్రెండుగురుందురు. వారు భవిషత్కాల దేవతా గణములు. ఐశ్వరుడు, గ్రహమైనరాహువు వంశుఁడు మరియు పారులయిన ఎనిమిది గ్రహములు 'పారులు' ద్వాదశులుగా తెలియవలెను. మిగిలిన వారి నేరంగుఁడు. పండ్రెండుగురు మారీచులు క్రమముగా వాజీపుఁడు, వాజిజిత్తు, ప్రభూతి, కకుద్మి, దధిక్రావంతుఁడు, విపక్వుఁడు, ప్రణీతుఁడు, విజయుడు మధువు, ఉతథ్యుఁడు, ఉత్తమకుఁడును. సుధర్మాణులను చెప్పెదను సొమముల బట్టి వారినెలుంగుఁడు. వర్ణుడు అథగర్వి, భురణ్యుఁడు, ప్రజనుఁడు, అమితుఁడు, అశితుఁడు, ద్రవకేతువు,జంభుఁడు, అజుండు, శక్రకుఁడు, సునేమీ, మరియు ద్యుతయుఁడు సుధర్మాణులుగా ప్రకీర్తితులు, వారిలో ఇంద్రుఁడు భవిష్యత్తులో 'అద్భుత' నామకుం డగును. ఈ అద్బుతుఁడే స్కంధుడు, పార్వతీ సుతుఁడు, కార్తికేయ నామాంతరుఁడు. వేరొక నామము.పావకీ. రోహిత మన్వంతరమునందలి ఏడుగురు ఋషులు- పులస్య వంశీయుఁడయిన మేధాతిథి, కాశ్యప వంశీయుఁడయిన. వసువు, భృగువంశ్యుఁడయిన జ్యోతిష్మంతుఁడు, అంగీరస వంశ్యుడయిన ద్యుతిమంతుఁడు, వసిష్ఠ సంతతివాఁడయిన వసినుఁడు, అత్రి వంశీయుఁడయిన హవ్య వాహనుఁడు, పులహ వంశీయుండైన సుతపుఁడు ఈ క్రింద చెప్పఁబడిన వారు ప్రథమ సావర్ణి యొక్క తొమ్మండుగురు కుమారులుగా ప్రకీర్తితులు: ధృతి కేతువు, దీప్తి కేతువు, శాపుఁడు, హస్తుఁడు, నిరామయుఁడు, పృథుశ్రవసుఁడు, అనీకుఁడు, భూరిద్యుమ్నుడు, మరియు బృహద్యశుం డు. మన్వంతరము యొక్క పదియవ పర్యాయమున మనువు రెండవసావర్ణి. ఇతఁడు భవిష్యత్మన్వంతరమున ధర్మునీ పుత్రుడు.
సుధామానులు, విరుద్ధులు అను రెండు గణములు గలవు. వారందరు దీప్తి మంతులు, వారు ఒక వంద మంది. ఋషులు చెప్పిన 100 (నూరు) ప్రాణములు (పురుషులుగా) వారు మనుదేవులు,ధర్మ పుత్రులు. వారికి భవిష్యదింద్రుఁడు విద్వాంసుఁడు ‘శాంతి నాయకు’డు. సప్త మహరులు - పౌలహ వంశీయుడు హవిష్మంతుఁడు, భృగు వంశీయుఁడయిన సుకీర్తి, ఆత్రి వంశీయుఁడయిన ఆపోమూర్తి, వసిష్ఠ వంశీయుఁడు ఆపవుఁడు, పౌలస్త్య వంశజుఁడు అప్రతీముఁడు, కాశ్యప వంశీయుఁడైన నా భాగుఁడు, ఆంగీరసుఁడయిన అభిమన్యుడును. చెప్పఁబోవునట్టి పదిమందియు మనుపుత్రులు - సుక్షేత్రుఁడు, ఉత్తమౌజుడు, భూరిసేనుఁడు ,వీర్యవంతుఁడు ,శతానీకుఁడు, సువర్చసుఁడును. మూఁడవ సావర్ణి యొక్క పదునొకండవ మన్వంతరమును మహాత్ములయిన దేవతల యొక్క గణములు మూలం డుగా ప్రఖ్యాతములు నీర్వాణరతులు, కామగులు, మరియు మనోజవులు. దేవతల యొక్కయీ మూడు గుణములు ప్రఖ్యాతము త్రి దివొకసులయిన యీ యొక్కొక్క దేవతా గణములలో ముప్పది దేవతలుందురు. నెలకగు ముప్పది పగటి ప్రొద్దులు దేవతా గణమును - 'నిర్వాణరతులు'. రాత్రిముప్పది ప్రొద్దులు విహంగములనీయు కవు లందరు. మనోజవులని మూఁడవ గణముగా చెప్పుఁబడినవారు,ముహూర్తుములు. ఈ విధముగా దేవతలు ప్రకీర్తింపబడిరి.
వీరందరిని బ్రహ్మ యొక్క భవిష్యన్మానస కుమారులుగా నెంతురు. వీరికి ఇంద్రుఁడు సురరాట్ వృష నాముఁడుగా కీర్తింపఁ ".బడును. వారి సప్తర్సులను చెప్పద నెలలుంగుఁడు వారు - కాశ్యపుడయిన హవిష్మంతుఁడు, భృగువంశీయుడయిన వపు షంతుఁడు, అత్రివంశజుఁడు ఆరుణి, వషిష్ణవంశీయుఁడయిన నాగుఁడు, అంగీరసవంశయుఁడుగా తెలిసికొనవలసిన పుష్టి, పౌలస్త్యుని వంశీయుఁ డు నిశ్చకుఁడు మరియు పౌలహుఁడయిన అతితేజుడును. పండ్రెండవ మన్వంతరమున మనువు రుద్రుని యొక్క కుమారుఁడగును. చతుర్ధ సావర్ణుఁడు రుద్ర సావర్ణఁడగును. మన్వంతరమునందలి దేవతల గూర్చి వినుఁడు.
ఈ మన్వంతరమున భవిష్య ద్దేవతలు, పంచగణములుగా చెప్పఁబడిరి.-83. వారు, హరితులు, రోహితులు, సుమనులు, సుకర్మాణులు, మరియు సుతారులు
ఈ క్రింద పేర్కొనబడిన 10 మందియు హరితులుగా స్మరింపఁబడుదురు. వారు - విద్వాంసుడు, సహస్రదుఁడు, పర్వతుఁడు, అనుచరుఁడు, అపాశువు, మనోజవుఁడు, ఊర్జుఁడు, స్వాహుఁడు, స్వథ, తారుఁడు.
తపుఁడు, జ్ఞాని, మృతి, వర్చసుడు, బంధుఁడు, రసుఁడు, రాజు స్వర్గపాదుఁడు, పుష్టి, వీధి, ఈ పదిమంది రోహితులుగా స్మృతులు. తుషితునితో ఆరంభించి చెప్పబడిన 33 (ముప్పది ముగ్గురు) సుమనసులుగా తెలిసికోనవలెను, ఇక సుకర్మాణులను తెలిసికొనుడు. వారు సుపర్వుఁడు, వృషభుఁడు, పృష్ఠుఁడు, కపి, ద్యుమ్నుఁడు, విపశ్చితుఁడు, విక్రముఁడు, ప్రముఁడు, విభృతుఁడు, కాంతుం డు, ఈ దేవతలు సుతారులు పూర్తిగా నెఱుంగుడు. వరుఁడు, దివ్యుఁడు, అంజిష్ణుండు,, వర్చస్వి ద్యుతీమంతుఁడు, కవి, శుభుఁడు, హవీ, కృతప్రాప్తి, వ్యాపృతుఁడు, వీరు సుతారులుగా నామతః ప్రకీర్తితులు.. వారిలో అధికముగా మహాయశుఁడు, ఋతధాముఁడు, ఇతఁడు వారలకు ఇంద్రుఁడు. సావర్ణులలో తుది ఏడుగురు, మన్వంతరములందు ఈ దిగువ పేర్కొనిన ఏడుగురు ఋషులు గొప్ప కార్యముల సాధించినవారు. - వసిష్టుని కొడుకయిన దృతి అత్రీవంశమునకు చెందిన సుతపుడు, ఆంగీరుని వంశమునకు చెందిన తపోమూర్తీ కాశ్యపుఁడయిన తహారతి ఏడవవాఁడు, తపోధృతి, ఇతఁడు భృగువంశమునకు చెందినవాఁడు, సావర్ణమనువు యొక్క యంతరమున వీరు సప్తర్షులే.
దేవవానుఁడు, ఉపదేవుఁడు, దేవశ్రేషుఁడు, విదూరథుఁడు, మిత్రవంతుఁడు, మిత్ర సేనుఁడు, చిత్రసేనుఁడు, అమిత్రపుఁడు, మిత్రబాహువు, సువర్చసుఁడు - పండ్రెండుగురు మనువుయొక్క సుతులు. భవిష్యత్ త్రయోదశ రౌచ్యమన్వంతరమున స్వయంభువు మూడే దేవత గణములను పేర్కొనెను. వారందరు బ్రహ్మగారి మానస పుత్రులు. వారందరు మహాత్ములు సుత్రామాణులు, సుధర్మాజులు సుకర్మాణులు. ఈ మూఁడు దేవతా గణములు చెప్పఁబడినవి వారందరు సోమపాయులు. వారిలో సుత్రామణులు మువ్వురు వారే ముప్పది మూఁడు దేవతలు, వారందరు యాజ్ఞికులచే పూజింపఁబడుదురు.
వారు ప్రత్యేకముగా నేతితో పృషదాజ్యముతో (పేరుకొన్న నేయి పాలతో కలిసిన) గ్రహశ్రేషునితో (సూర్యునితో) పూజింపఁ బడవలయును. సుత్రామాణులు ప్రయాజ్యులని. కూడ చెప్పబడుదురు. వారే ఇప్పుడు ఆజ్యమును గ్రహింతురు, సుత్రామాణులు అనుయాజ్యులనీ కూడ పిలువబడుదురు. ఏలయన వారు పృషదాజ్యమును గ్రహింతురు కనుక. ఆ సుధర్మాణులు. ఉపయాజ్యులుగా ప్రకీర్తితులు. ఈ విధముగా దేవతలు ప్రకీర్తితులు.
మహాసత్తుఁడయిన దివస్పతి వారికీ ఇంద్రుఁడగును. పులహాత్మజుని యొక్క పుత్రులు రుచి కుమారులుగా తెలియవలెను. త్రయోదశ. మమన్వంతరమునందు ఏడుగురు ఋషులు - అంగిరస వంశ్యుండైన ధృతిమంతుఁడు, పులస్త్యవంశమునకు చెందిన అవ్యయుఁడు, పౌలహవంశీయుఁడయిన తత్వదర్శి, భార్గవవంశ్యుఁడయిన నీరుత్సుకుఁడు, అత్రీవంశీయుఁడయిన నిష్ణుకంపుఁడు, కాశ్యప వంశీయుడయిన నిర్మోహుఁడు వసిష్ణవంశ్యుఁడయినసుతపుడు.వీరు పదమూడవ మన్వంతరమున ఋషులు, పదమూడవ మన్వంతరమున ఈ క్రింది వారు రౌచ్యమనువు కుమారులు. వారు పది మందీ, వారు -చిత్రసేనుఁడు, విచిత్రుఁడు, నయుఁడు, ధర్ముఁడు, ధ్రుతుఁడు, భవుఁడు, అనేకుఁడు, క్షతవీదుఁడు, సురసుఁడు, నిర్భయుండును. వీరు రౌచ్యుని మహాపుత్రులు. భౌత్యుని యొక్క పదు నాల్గవ మన్వంతరమున, దేవతలలో ఐదు గణములుండునని చెప్పఁబడినది. చాక్షుషులు, పవిత్రులు, కనిష్టులు, భాజతులు వాచి వృద్ధులును - స్వరములు ఏడు. అవి నిషాదముతో ప్రారంభీంచును. వానీని సప్త చాక్షుషములని యెఱుంగుఁడు. బృహదాద్యములయిన సప్త సామములను, ఏడు కనిష్టములుగా వెలుంగుఁడు, ఏడు లోకములు పవిత్రములు. మీ. ఆ ఏడు సముద్రములు భ్రాజితములు-108 వాచావృద్దులయిన ఋషులను, స్వాయంభవమనువు యొక్క మన్వంతరములు గనెఱుంగుఁడు, మన్వంతరమందలి సర్ప ఇంద్రులును తుల్య లక్షణులని యెఱుంగవలెను. తేజస్సుచే, తపస్సుచే, బుద్దిచే-బల-శ్రుతి, పరాక్రమములచే సమాన లక్షణులు. మూడు లోకములయందు చరాచరములు స్థిరా స్థిరములునయిన సత్యములను ఇంద్రులు జయింతురు. అందరికంటే ఘనులు ఇంద్రులు భూతాపవాదీనులు, భూతవాదీనులు, హృష్టులు, మధ్యస్థులు.
భూతాపవాదీనులు శక్తులు ప్రవాదులకు మూడు వేదములు, భౌత్యమన్వంతరమున ఏడుగురు ఋషులు-అగ్నీధ్రుఁడు, ఇతఁడు కాశ్యప వంశీయుఁడు, పులస్త్య వంశీయుడయిన మాగధుఁడు, భృగు వంశీయుఁడయిన అగ్ని బాహువు, ఆంగీరసవంశీయుఁడు శుచి, వసిష్ఠ వంశీయుడయిన శుక్రుఁడు. పులహ వంశీయుఁడయిన యుక్తుఁడు, అత్రి వంశీయుఁడని చెప్పబడిన స్వజితుఁడును.
ఇక మనుని పుత్రులను వినుము, వారు ఉరుఁడు, గురుఁడు, గంభీరుఁడు, బుద్ధుడు, శుద్ధుఁడు, శుచి, కృతి, ఊర్జస్వి, మరియు సుబలుఁడు. ఈ నలుగురు సావర్ణి మనువులు బ్రహ్మ కుమారులు వివస్వంతుని కుమారుఁడు సావర్ణి మనువుగా చెప్పబడును. మనువులైన రౌచ్యుఁడు, భౌత్యుండు, పులహుని భార్గవుని కొమరులుగా క్రమముగా భావింపఁబడుదురు.
భౌత్యుని కాలమున కల్పము వెంటనే పూర్ణమగును
సూతుఁడిట్లు చెప్పెను.
బహుచతుర్యుగముల తుదను, మన్వంతరములు గడచి పోయిన వెనుక, సర్వము నిశ్శేషముకాగా దానిని సంహారమందురు. మన్వంతరమున భార్గవ వంశజులయిన ఏడుగురు, దేవతలు, మూడు లోకములందు, చతుర్యుగ కాలములనుభవించి గతించెదరు. పితరులతో మనువులతో సహా మన్వంతరము క్షీణింప, త్రైలోక్యము సర్వము అనాధార మగును. అంత స్థానికుల (మూఁడు లోకములనధివసించు మహావ్యక్తులు) శుభ్రములైన స్థానములు నక్షత్రముల నుండి, ఋక్షముల నుండి, గ్రహముల నుండి విడివడి ప్రభ్యశ్యములగును. త్రిలోక్యేశ్వరులు గతింప, త్రైలోక్యంపుటధిపతులు, అజితులు, మరియు ఇతరులైన పదునాలుగు గణముల దేవతలు నివసించ మహర్లోకమున కరుగుదురు. (వారా కల్పవాసులు) అనగా అజితారులు చిరకాల వాసులు. (కల్పములో నుండి యుండువారు) వారే, నిజమయిన సర్వ మన్వంతరములందుండు చతుర్ధశ దేవ తాగణములు. వారు వారి అనుచరులతో సహా, జనలోకమున సశరీరులని చెప్పబడుదురు. ఈ విధముగా జనలోకమునకు మహర్లోకము నుండి దేవతలకు, అహంకారము ఇతరములయిన ప్రధాన హేతువులు మిగిలియుండును. స్థావర వస్తువులు అంతమునొంద, భూలోకము మొదలు మహర్ లోకము వరకు గల లోక స్థానములు శూన్యము కాగా, దేవతలు పైకి (ఉరద్ధ లోకములకు) చన, అది కల్పవాసినులు సాయుజ్యము చెందుకాలము. దేవతలను, ఋషులను, పితరులను దానవులను బ్రహ్మ (సంహృత్య) ఉపసంహరించి (సృష్టిని) యుగాంతమున తన కాలపరిణామమును గ్రహించి, తన సృష్టికి సమాప్తము చేయును. అది ఒక్క రోజు బ్రహ్మకగును బ్రహ్మ దీవా రాత్రులదెలిపినవారు. బ్రహ్మకు చతుర్యుగ సహస్రాంతము ఒక పగలు, రాత్రి 4 చతుర్యుగ సహస్రాంతము అగునని చెప్పుదురు.
సర్వ భూతముల ప్రతిసంచరము మూఁడు విధములు - ప్రతి సంచరమనఁగా విలయనము (వీలయము, నాశము) నిర్వాణములు. మువ్విధములు. నైమిత్తికము (కొన్ని సంవత్సరముల కొక్కక్కసారి వచ్చునది). ప్రాకృతికము ప్రకృతికి సంబంధించినది. 3వది - ఆత్యంతీకము (తుదిని కలునది) సర్వ భూతమల నైమిత్తిక ప్రళయము, బ్రహ్మచే కల్పాంతమున కల్గించు దహనము (కల్పదాహము). - ఈ ప్రసంయమము (నిగ్రహణము, పరిత్యజనము) ప్రతీ సర్గమున కలుగును. కరణముల సంక్షయము (సాధనోపాయముల) నాశనము
ప్రతి సర్గలో జరుగుట ప్రాకృత మనంబడును. జ్ఞానము వలన ఆత్యంతీకమనబడినది. కారణముల యొక్క అసంభవము (లేమి కలుగమి) (జ్ఞానోదయమువలని ప్రళయము ఆత్యంతీకము. ఏలయన ఇది కారణములేమి) ప్రహరము 16వ దీవాభాగము. ప్రహరాంతమున బ్రహ్మ దేవతలను నాశనము చేయును. ఈ దేవతలు త్రైలోక్యవాసులు. బ్రహ్మ మరల సృష్టి నారంభించును. బ్రహ్మతన యొక్క సుషుప్తియందు ప్రజలను సంహరించును. యుగ సహస్రాంతమున యుగక్షయము సంప్రాప్తము కాగా ప్రజాపతి (బ్రహ్మ) ప్రజలను ఆత్మస్థులను చేయుట కారంభించును. (తనలో విలయమొనర్చుకొనును, అప్పుడు సంతత శతవార్షికి (నూరేండ్లుండునదియైన . అనావృష్టి కలుగును. దాని వలన, స్వల్ప సారములు (స్వల్ప శక్తిమంతములు) అయిన సత్వములు, తమంతట తామే భూమిలో కలిసిపోవును. అంత సప్తరశ్మి (సూర్యుఁడు) తన ఏడు రశ్ములతో తన రథముననుదయించును. అసహ్యము (భరింప శక్యములుకాని) లైన రశ్ములుగల భగవాన్ రవి నీటిని త్రాగును. అతని డెబ్బది 1) హరితకిరణములు ప్రకాశించుచు మెల్లమెల్లగా నాకాశమున వ్యాపించి వివర్తముజెందును. భౌమమైన అగ్ని యొక్క తేజము కాష్ఠములను ఇంధనములను, నీటితోనే(పచ్చతనముతోనే) మిక్కిలిగా దహించును (వెల్లును). అందుచేతనే ఉదకభృత్తయిన సూర్యుండు తపించునని చెప్పుదురు. నా వృష్యా తపతే సూర్యః నా వృష్ట్యా పరిషీచ్యతే వృష్టిలేక సూర్యుడు (మండుచు) వెలుగడు. వృష్టిలేక తడుపబడడు వృష్టిలేక పరివేశము జెందడు. అనా వృష్టియప్పుడు సూర్యుడు తపించును. అందుచే సూర్యుడు నీటితో ప్రజ్వలించును. సూర్యుని సప్తరశ్ములు నీరు త్రాగి దీప్తములగును. మహాసముద్రము నుండి ఆ యేడు రుశ్ములు నీటిని త్రాగును. నీటిచే ప్రజ్జ్వలింప జేయంబడి, సూర్యులేడుగురు అగుదురు. అంత సూర్యులయిన యా యేడు రశ్ములు చతుర్దశలను దహించును చతుర్లోకమును సూర్యఖులై దహించును. ఆ. కిరణములతో ఏడుగురు సూర్యులు ఊర్థ్వమును అధః ప్రదేశమును తిరుగును, యుగాంతమందలి అగ్ని ప్రతాపముతో సప్త భాస్కరలు ప్రకాశింతురు. ఆ నీటిచే ప్రదీప్తములయిన సప్తరశ్ములు బహు సాహస రశ్ములతో తమనుజుట్టి సర్వ స్వమును పరివ్యాపించి వసుంధరను దహించుచుండును ఆ సప్తరశ్ముల ప్రతాపముచే దహ్యమానమయిన వసుంధర అద్రులతో, నదులతో అర్ణవములతో నిస్నేహమై రగులనట్టిది) యుండును.
సూర్యరశ్ములు, సంతతము ప్రవృద్ధములై ప్రజ్వలించునవి, పరస్పరము సంస్పృష్టములగుచున్నవియు అన్నియును ఏకత్వమును పొందినట్టివియునగు సూర్యాగ్నులు ఏకజ్వాలయగును అయ్యది సర్వలోక ప్రణాశకరము. ఆ యగ్ని అనుమండలీభూత వలయగతులతో . వృద్ధి పొంది తన యొక్క తేజస్సుచే ఈ సర్వ చతుర్లోకమును వెంటనే భస్మాసాత్కృతి యొనర్చును అంత స్థావరములు, జంగమములు అన్నియును ప్రలీనముకాగా ఈ భూమి వృక్షరహితము, నిస్త్రృణమునయి తాబేటి- షృష్ణము (వీపు) వలెనగును. సర్వము ఆ సూర్యాగ్ని జ్వాలలచే పూర్ణమయి అంబరీషమువలే ఒక ఘనమయిన అగ్ని కందుకమువలె జగత్తంతయు నగును ప్రపంచమంతయు ప్రజ్జ్వలించు (కాగిన) పెనము వలెనగును. భూతల మండలి సర్వ సత్వములు, సముద్రాంతరములయిన ప్రాణులు అన్నియును ప్రలయము చెంది, బూడిదయై మట్టిగా పరిణమించును ద్వీపములు, పర్వతములు, వరములు మహాసముద్రము ఈ అన్నింటిని సర్వాత్ముఁడయిన పావకుఁడు భస్మసోత్కరించును. సమిద్ధమగు (ప్రజ్జ్వలించు). అగ్ని పృథివిని ఆశ్రయించి, జ్వలించుచు సముద్రముల నుండి, నదుల " నుండి పాతాళము నుండి సర్వశః నీటిని త్రాగును. అభివృద్ధి పొందిన యీ సంవర్తకమైన అగ్ని దీప్తము, ఘోరమునై, శైలములను గ్రహములను అతిక్రమించి సంవర్థితమునై లోకాలనన్నింటిని సంహరించును. అంత, భూమిని భేదించుకొని రసాతలము ప్రవేశించి శోషిల్లజేసి సంవర్తకాన్ని పాతాలమును పొయులోకమును దహించి విడిచిపెట్టును. అయ్య పృథివినీ దహించి, ఊర్థ్వమున దివమును దహించును ఆసంవర్తకాన్నీ యొక్క అనేకములయిన జిహ్వా (శిఖలు) సహస్త్రములు, ప్రయుతములు, అర్బుదములయిన {అసంఖ్యేయ) యోజనములవరకు పైకి పెరుగును. అధికముగా ప్రజ్జ్వలితమైన అగ్నీ గంధర్వులను, పిశాచములను, పాములతో గూడిన రాక్షసులను, దహించును, ఆ యగ్ని పూర్తిగా, భూగోళ లోకమును, భువర్లోకమును, స్వర్లోకమును, మరియు మహర్లోకమును దహించును, అయ్యది కాలాగ్నియై లోక చతుష్టయమును ఘోరముగా దహించును. లోకములన్నియు, పైన క్రింద పక్కన సర్వత్ర ఈ అగ్నిచే వ్యాప్తములై సంవర్తకములైన ఘనములు (మేఘములు) పైకి లేచును. యావద్వీశ్వము తదగ్ని యొక్క తేజము వ్యాపించి శనైః (నెమ్మదిగా) పెద్ద అయోగుడతుల్యమయి ప్రకాశించును. అంత సంవర్తక మేఘములు ఆకాశమున విజృంభించును. అయ్యవి కొన్ని గజకుల (సమూహముల) ఆకారములు; అవి విద్యుల్లతలచే ప్రకాశించును. కొన్ని జ్వాలలు నీలోత్పల శ్యామములు, కొన్ని కుముద సన్నిభములు కొన్ని వైడూర్య మణి సంకాశములు మరికొన్ని ఇంద్రనీలతుల్యములు.
(కొన్ని విశిఖ జ్వాలలు) శంఖములతో, మల్లెలతో తుల్యములు, కొన్ని జాత్యంజన నిభములు (నల్లని కాటుక వలె నున్నవి), ధూమ్ర వర్ణములయిన మేఘములుకొన్ని, (కొన్ని, సంవర్తక మేఘములు పీత వర్ణములు) కొన్ని మేఘములు గాడిదల వర్ణములు కలవి, కొన్ని మేఘములు లక్క వర్ణములు, కొన్నీ మనళ్ళిలా సదృశములు, ఇతరములైన మేఘములు పావురముల వర్ణములు కలవి. కొన్ని సంవర్తక మేఘములు మిణుగురు పురుగుల వర్ణములు- కలవి, కొన్ని హరితాలనిభములు కొన్ని క్రీడాగార తుల్యములు కొన్ని మీనకుల వర్గములతోనుపమింపఁదగినవి, కొన్ని చాషపత్రనిభములు. అట్టి సంవర్తక మేఘములు ఆకసమునకేగును. కొన్ని సంవర్తక మేఘములు ఉత్తమపట్టణ సదృశములు. కొన్నింటిని ఏనుగుల గుంపులతో పోల్చవచ్చును. కొన్నీ మేఘములు పర్వతోషమములు. కొన్ని విశాల భూతల వర్ణ సదృశములు కొన్ని క్రీడాగార నీభములు. మేఘములకు భిన్న భిన్న ఆకారములు కలవు. అవి ఘోర రూపములు కొన్ని, భయంకర గర్జనలను స్వరముల నినదించును. సంవర్తక మేఘము నభస్తలమును నిండియుండును. తరువాత (ఈమేఘములు) భయంకర నినాదములు చేయుచు, ఏడు విధములై, సూర్యాత్ములై, అగ్నిని శమింపచేయును (చల్లార్చును) ఆ మేఘములు ద్రోణవృష్టి గురియును ఆ మేఘములు సుఘోరము, అశివమునయిన అగ్నిని నాశనమొనర్చును. అత్యంతముగా వర్షించిన నీటితో జగత్తు నిండిపోవును.సీటిచే స్వకీయమైన తేజస్సు అభిభూతమయిన అగ్ని నీటి యందు ప్రవేశించును. వర్షముచే అగ్ని నష్టము కాగా, పావకోద్భవములయిన పయోదములు బృహజ్జల పరీవాహములచే జగత్తు నంతటినీ ముంచెత్తి బ్రహ్మప్రబోధింపఁబడి (మేఘములు) ధారలచే నీ భూమిని నింపును. ఇతర మేఘములు సముద్ర తీరమును సలీలౌఘములచే ముంచెత్తును. పర్వతములను ద్వీపములను ముంచెత్తి జలముండును. మరల నభస్తలమునుండి పయోధరముల నుండి భూమి యందు నీరు పడును భయంకరమైన వాయువు ఆకాశమున నంతటను వ్యాపించియుండును స్థావర జంగమ సత్త్వములన్ని ఘోరముగా నష్టమై ఆ ఏకార్ణవమయిన నీటియందు వినాశనముచెంద, పూర్ణముగా యుగసహస్రము నీండగా, దానిని నిశేష కల్పమందురు. అంత నీటిచే ఆవృతమయిన లోకమును బుధులు ఏకార్ణవమందురు. అంత, భూమి, జలము, ఆకాశము వాయువు ఏకార్ణవమగును. అన్నీ నాశనము కాగా (చల్లారగా) సర్వము అంధీభూతమై
యొప్ప, ఏది భూమియో ఏదీ జలమో ఏది గాలియో ఏదియు స్పష్టముగా కనబడక యుండును. భూ సంబంధమైనవి, సముద్ర జల సంబంధములు, అంతియేకాక దైవ్యములు, (దేవతా సంసృష్టికరములు) అన్నియును చైతన్యరహితములయి (అసరంత్యః) కదలాడక ఏకములు 'సలిలమను' పేరునుమరల పొందును. అప్పుడా సలిలముగతాగతికము లేనిదీగా స్మరింపఁబడును. అర్ణవమనీ పిలువఁబడు నీరు ఈ భూమినంతటిని నిండి యుండును. 'భా' అనుపదము వ్యాప్తికి, దీప్తికి (ప్రకాశమునకు) వాడబడును. ఈ నీరు భస్మమును. సర్వమును పూర్తిగా పరివ్యాపించి, ప్రకాశించును. అందుచే నీరు. అంభస్సు అని పిలువబడినది. ఆ (అర్) ధాతువు, నానాత్వము, శీఘ్రము అను అర్థములనుపయోగింపఁబడును. ఆ సముద్రపు ఏకార్ణవత్వము శీఘ్రముగా కాదు అందుచే అవి సరములు అయినవి. అర్ ధాతువు శ్రీఘత్వార్ధకము. వెంటనే కాకుండుటచే నరులయినవి. బ్రహ్మ యొక్క సహస్ర చతుర్యుగములు గడచిపోగా అంతకాలం. జగత్తు ఏకార్ణవమగును. అప్పుడు. ప్రజాపతి యొక్క సర్వవ్యాపారములు ఆగిపోవును. (నివర్తంతే) ఆ ఏకమయిన ఏ కార్ణవమున స్థావర జంగమ వస్తువులన్నియు నందు నశింపగా బ్రహ్మ సహస్రాక్షుఁడు సహస్రపాదుఁడునగును. త్రయీ మయుం డుగా చెప్పబడిన ప్రథమ ప్రజాపతి పురుషుఁడు, సహస్ర శీరుండు, సుమనస్క్యుడు, సహస్ర పాదుఁడు, సహస్ర నేత్రుఁడు, సహస్ర వదనుఁడు, సహస్రవాక్కు సహస్ర పాదుఁడు, సహస్ర బాహువు గా చెప్పఁబడినాఁడు. ఆతఁడు ఆదిత్య వర్ణుఁడు, సర్వ ప్రపంచ రక్షకుం. డు, అద్వితీయుడు. (అపూర్వుఁడు). ప్రథమతురాట్ (అందరిని జయించిన (మించిన) మొదటివాఁడు, హిరణ్యగర్భుఁడు, మహాపురుషుం డు, రజోగుణమునకు దూరమైన వాడుగా అతఁడు వర్ణింపఁబడినాడు. చతుర్యుగ సహస్రాంతమున, సర్వత్ర సలిలము ఆవృతమయియుండ ఆప్రభువు సుషుప్తియందభిలాషుడగును. అతఁడు ప్రకాశమును (వెలుగును) కోరని కారణమున రాత్రి సౌతఁడు సృష్టించును. అండజ స్వేదజాదీ చతుర్విధజీవగణము ఆతనిలో లీనమయి ఆతని యందుండి పోవునట్టి మహాత్ముని కాలుని సప్తర్షులు చూచెదరు, భృగ్వాదులు వారి పూర్వపు లక్షణములు పూర్వమే చెప్పఁబడినవి. వారు (ఆసప్తమహరులు) సత్యాదులను, సప్తలోకములను స్వచక్షువులతో చూచెదరు. బ్రహ్మ యొక్క రాత్రి కాలములందు వారు. బ్రహ్మను చూచెదరు. రాత్రుల నిద్రించు 'కాలుని సప్తరులు చూచెదరు.
ఆతడు కల్పములకు పరమేష్టియగుట, ఆతడే ఆద్య సష్ట ప్రజాపతి. ఆ విధముగా పండుకొని తానే సర్వము గ్రహించి ఆ మహాత్ముం డు తన యందుంచుకొనును. ఆతఁడు సర్వకృత్. అంత సర్వకృత్ అయిన ప్రజాపతి, ఏకము ఏకార్ణవమయిన సముద్రమున, చీకటిలో నుండును.
అంత రాత్రి సమాప్తముకాగా ప్రజాపతీ నిద్ర నుండి మేల్కొనును. ఆతని మనస్సు సృష్టింపవలెనని ప్రేరేపింప నతఁడు సృష్టింప కోరిక పూనును. ఈ విధముగా ప్రజాపతి లోకములను సృష్టించి ప్రశాంతుఁడు అయిన తరువాత బ్రహ్మకు సంబంధించిన నైమిత్తికమయిన విలీనము కలుగును. అప్పుడు సర్వ భూతములు, దగ్గములయిన శరీరముల నుండి విడి వడునని జ్ఞాపకముంచుకొనవలెను. సర్వ భూతములు సూర్య కిరణములచే దగ్గభూతములు కాగా, దేవతలు, యోగులు, మనువులు ఆ ఏకార్ణవజలప్లావమున గంధర్వులు, మొదలగు సత్త్వములు, పిశాచములతో సహ, సర్వశః నశించును. కల్పదావముచే ప్రతప్తములు కాని వారు కల్పాదీని జనలోకమునాశ్రయంచి నరకమును పొందియున్న ఏ యే తిర్యగ్యోనులును ఉన్నవో యవి యన్నియు దగ్ధములయిపోవును. పాపము నుండి నీర్జూతములగును. విశ్వమంతయు జలప్లుతమై యున్నంత కాలము ఆసత్త్వములన్నియు నీటి యందు నిమజ్జనము చెందియుండును. రాత్రి పోయి సంధ్య వచ్చిన పిమ్మట ఆ సత్త్వములన్నియు అ వ్యక్త యోనియయిన బ్రహ్మ నుండి జన్మించును . ఋషులు మనువులు, దేవతలు, ప్రజలు, మొదలగు చతుర్విధ వ్యక్తులు అందరు మరల పుట్టెదరు. సిద్ధులు కూడా జనన మరణములు కలిగియుందురని చెప్పబడినది. లోకమున సూర్యుని ఉదయము అస్తమయము కలుగునట్లు సర్వ భూతముల జనన మరణములు క్రమముగా జరుగును. సర్వ భూతముల యొక్క పునర్జన్మ, నాశనానంతరము “సంసార” మనంబడును. వరానంతరము వృక్షాది సర్వజీవరాశులు ఎట్లు తిరిగి యుద్భవించునో, అట్లే స్థావరములు మొదలయినవి ప్రజలు నీయమానుకూలముగా, ప్రతీ కల్పమందు. పుట్టును. ఋతువులు, ఋతువులననుసరించి వివిధ లక్షణములు కలుగు నట్లే బ్రహ్మ యొక్క పగళ్లయందు రాత్రులందు లక్షణములు చూడనగును. సర్వ భూతములు స్థావరములు జంగమములు బ్రహ్మను ప్రజాపతిని, కాలములో వినోశసమయమున చేరును సృష్టి సమయమున వానీ నుండి వచ్చును. ఆతఁడు మహా ప్రభువు అనంత యోగి కల్పాదుల యందు పునః పునః సర్వ భూతములనోతడు సృజించును. ఆప్రభువు వ్యక్తుఁడు అవ్యక్తుఁడును, మహేశ్వరుడు ఆతనీదే ఈ జగత్తంతయూ ఆతఁడే మొదట నీటిని సృజించెను. ఆ నీరు భూమీ యొక్క తలమునకు పూర్వము వచ్చినట్లే వచ్చి చేరును. అవి పైకి క్రిందికి సూర్యుని వలన పోవును.
అట్లే మానవులు పారొనరించిన శుభాశుభకర్మల వలన పైకి క్రిందికి పోవుదురు. ఆ మానవులు వారి యొక్క తనువు యొక్క మార్పులలో ఒక శరీరము నుండి వేడొక శరీరమునకు ఇందు నందుందిరుగుచు పోవుదురు.
అందు దేవతలు మనువులు, ప్రజాప్రభువులు స్వర్గగతసిద్ధులు ఇతరులు కూడ నుందురు. పరిణామము చెంది, వారిచే సృజింపబడి ధర్మవంతులు తమ చరిత్రను (కీర్తిని) అనుసరించి వారు జన్మము చెందుదురు.
అందుచే, ఇకముందు, “ఆభూత సంప్లవమును” గూర్చి వివరించెదను. (ఆ భూత సంప్లవమును గూర్చి చెప్పుటకు కొలము, కాల గుణమును గూర్చి చెప్పఁబడినది) ఓ బ్రాహ్మణులారా! రానున్న మన్వంతరములను. ప్రజా సృష్టితో, దేవతాసృష్టితో వివరించితిని. మొత్తము పదు నాలుగు మన్వంతరములు అవీ సహస్ర చతుర్యుగ కాలము వ్యాపించును. ద్వీసహస్ర చతుర్యుగములు పూర్తి కాగా దానిని “విశేష కల్ప” మందురు. దీనిని బ్రహ్మ యొక్క ఒక రోజుగా (తద్గణనమును బట్టి) యెఱుంగవలెను-దాని సంఖ్యను తెలియుడు . లబ్దక్షణము నిమేష్యష (కనురెప్పపాటుకాల)ముతో సమానము (నిమేషము మనిషి కనురెప్పపాటు కాలము). పది యైదు నిమేషములు ఒక కాష్ఠ, తొమ్మిది నిమేషములు ఒక క్షణము లేదా 5 నిమేషములోక క్షణము నిమేషములు-ఒక కాష్ఠ కాష్ఠలు ఒక ప్రస్థ ప్రస్థములు ఒక ఉదకము. ఇంకొకటి కలిపినరి ప్రస్థములు ఒక లవ. 30 లవలు ఒక కలయగును. 30 కలలు ఒక ముహూర్తము 30 ముహూర్తములు ఒక పగలు రాత్రి. ఇది స్థితి , ఒక పగలు, ఒక రాత్రి కలిసీ (3X30) = 900 కలలు, సూర్య చంద్రుల గతులను బట్టి వానిని తెలిసికొన వలెను. 15 నిమేషములు ఒక కాష్ఠ యగును. 30 కాష్ఠలు ఒక కల యగును. 30 కలలు ఒక ముహూర్తము. (వేళిక ప్రమాణమును బట్టి) కల ముహూర్తములో పదియవ భాగముగా జ్ఞాపక ముంచుకొనవలెను 45 కలలు ఒక ముహూర్తమగును. ఈ విధముగా ముహూర్తములు లవములు. వానితో పరిచయమున్న వారిచే పరిగణింపబడినవి. "అట్లే మాగధుల మానముచే 13. పలముల నీరు ఒక జల ప్రస్థమగును. నీటితో నింపిన 4.ప్రస్థలు ఒక “నాలి కోచ్చయ"మగును. అది 4 అంగుళముల నాలుగు బంగారు మినపగింజలచే రంధ్రములు చేయబడిన గుల్లవంటి దీనిని నీటిలో వేసిన పట్టునంతటి కాలము నాలికోచ్చయముగా వచ్చును). పగలు రాత్రులు సమానమయిన రోజులలో రెండు నాలికలు ముహూర్తమగును ఈ గణనము సూర్యుని యొక్క చిత్రమయిన గమనమునుబట్టి ఎప్పుడునుండును.
600 కలల కంటే అధికమయిన కాలము ఏది కలదో దానిని మానుషదీనముగా తెలిసికొనవలెను. నక్షత్ర సంబంధమైన దినము (పశిలిజిబెలిజ్ ఫిజీగి) అంతకంటే మటీ పది కలలను అధికముగా కలిగియుండును. ఇదీ సావన మాసానుగుణముగా ఒక సంవత్సరము మానుషముగా గణింపబడును. అది “దివ్య మహోరాత్ర” రాత్రి పగలు కలసిన మాసమని శాస్త్ర నిశ్చయము. ఈ దినమును అనుసరించియే మాసములు, అయనములు, ఋతువులు, సంవత్సరములు గణింపవలయును. ఈ విజ్ఞానము పదప్రయోగము (పద నిర్మాణము) దానిపై ఆధారపడి యున్నవి. కలల యొక్క పరిమాణము కల యని చెప్పబడును. బ్రహ్మకు ఒక దీనముగా చెప్పబడినది, దేవతాగణన సంఖ్యను బట్టి ఒక కోటి, 20 లక్షల 90 వేల రోజులు.
ఈ కాల గణనమును ఋషులు వినినారు ఆశ్చర్యపడినారు. పరమాద్భుతమనినారు. తరువాత సంఖ్యాసంభజనమునకు సంబంధించిన జ్ఞానమును గూర్చి యడిగినారు.
ఋషులిట్లడిగిరి.
కొలతలు, గణనమును మేము మానుష గణానాదులలో వినగోరుచున్నాము. ఆ కథనము సంక్షేపార్థపదాక్షరముగా నుండగోరెదము. లోకహిత రతుఁడయిన వాయుదేవుఁడు ఆ ఋషుల పలుకుల వినెను. దివ్య చక్షుషము కారణముగా సంక్షేపముగా వాయు ప్రభువు పలికెను. బ్రహ్మ యొక్క రాత్రి పగలు ఇంతకు పూర్వము వివరింపఁబడెనట. సంవత్సరము నందలి రోజులను సాధారణ మానమున గణించు బ్రహ్మ యొక్క దీనక్షయమునకు ఎన్ని రోజులో గణించి చెప్పెదను, 4,32,89,80,000 నాలుగు వందల ముప్పటి రెండు కోట్ల ఎనుబది తొమ్మిది లక్షల ఎనుబది వేల మానుష సంవత్సరములు. ఇదియే లక్ష ప్రలయ కాల ప్రమాణము. ఈ విధముగా బ్రాహ్మణులు కాల మానమును గణించిరి.
సర్వ లోకము 7 గురు (సప్త) సూర్యులచే దగ్గ పటలము చేయబడినప్పుడు చతుర్విధములయిన సర్వ ప్రజలు (భూత జాలము అంతయు) మహా భూతముల యందు విలీనమైపోవును. ప్రపంచమంతయు జల ప్రలయ నిమగ్నమై స్థావర జంగమములు నష్టముకాగా, ప్రలయ ప్రవృత్తి సమాప్తము కాగా ప్రజాపతి ఉపశాంతుడు కాగా, వెలుతురన్నది లేక సర్వము ప్రదగ్ధమై నిశాకాలతమః పటలముచే ఆ వృతమై యుండగా,
సర్వము ఈశ్వరాధిష్టితమై యుండ అదియే ఏ కార్ణవము సంభవించుటకు. కాలము ఆ ఏకార్ణవము యొక్క విస్తృతి బ్రహ్మ యొక్క రోజుతో సమానవ్యాపృతి గలిగినది రాత్రి సలిలావస్థ చెందును. (అచంచలమయి యుండును). ఆ సలిలావస్థ నివృత్తమయిన నది ప్రగలుగా స్మరింపఁబడును. ఆ బ్రహ్మరోజులలో పగళ్లు రాత్రులు ఒక దాని వెంట నొకటి వచ్చును. పరమాత్ముని యొక్క అహోరాత్రమును “ఆభూత సంప్లవమందురు” ప్రపంచము నందు త్రిలోకముల యేయే గతి మంత్రములు ధ్రువములు నైన, సత్త్వములు కలవో అవి భూతములలో సంప్రతనమగును.
భూత కాలమందలి, వర్తమాన కాలమందలి, రానున్న (అనాగత) . కాలమందలి ప్రజలు. ఈ విధముగా విలీనమగుదురు.
అపరార్థ గుణీకృతమయిన దివ్య సంఖ్య చెప్పబడినది. అపరార్థమనఁగా ఒకటీ తరువాత 7 సున్నలుగల సంఖ్య 1,0000000). (పరార్థమనగా 16 అంకెలు గల సంఖ్య (100,000,000,000,000,000) అపరార్థమనగానంతకన్న మించిన (18 సున్నాలుగల 19 అంకెలు గల సంఖ్యనోపును చూ (Aple Dictionary) పరమాత్మకు పరార్థ ద్వయకాలవత్సరములు పరమాయువు చెప్పబడినది.
అజుఁడయిన ప్రజాపతికిని ఆయువు ఇంత మాత్ర కాలము. ఈ ఏవంవిధ) స్థిత్యంతరమున పరమేష్ఠియయిన బ్రహ్మకు ‘ప్రతిసర్గ” కలుగును. (Realisouption) జంఝామారుతము యొక్క వేగమునకు దీపము ఆరిపోవునట్లు ప్రతి సర్గమున బ్రహ్మగారు ప్రశాంతి చెందుదురు.
బ్రహ్మ తాను సృష్టించిన మహత్తులో (పరమేశ్వరునిలో) విలీన మగును. ఈ మహత్తు అవ్యక్తమున లీనమగును. తరువాత సత్వ రజస్తమోగుణములు సామ్యత్వము బొందును.
ఈ విధముగా మీకు ఓ (బ్రాహ్మణులారా!) ఆభూత విప్లవమును గూర్చి చెప్పితిని, నీటితో బ్రహ్మ యొక్క సంప్రక్షాళన సంయమము నైమిత్తిక (సంప్రలీన) సంఘటనము.
మీకు సంక్షేపముగా నిది చెప్పితిని. ఇంక నేమి మీకు వర్ణింతును? ఎవ్వడు దీనిని జ్ఞాపక ముంచుకొనునో, నిత్యము వినునో, వర్ణించునో, యతుఁడు గొప్ప స్థితిని పొందును.
ఇది మహా పురాణము, వాయు ప్రోక్తమునయిన బ్రహ్మాండ పురాణములో ఉత్తర భాగమున, చతుర్థ ఉపసంహారపాదమున ఆభూతసంప్లవాఖ్యవర్ణనమను ప్రథమాధ్యాయము సమాప్తము.
Summary of chapter 113 of the Brahmānda Mahā Purana is as follows:
This sacred opening chapter of the final section reverently describes the grand dissolution of the cosmic egg, where all manifested existence gracefully returns into the unmanifested supreme reality. It portrays how the physical elements dissolve step by step under the majestic power of divine time, bringing an end to the temporal play of creation. The devoted soul reflects upon this cosmic cycle with deep awe and peace, recognizing that beyond all temporary form lies the unchangeable, eternal essence of the supreme creator.