3 - ప్రతిసర్గ - ప్రపంచ విలయనమ్

సూతుఁడిట్లు చెప్పేను.

స్వయంభువుని యొక్క (బ్రహ్మ యొక్క) పరస్యాంతము - ఒక పగలు, ఒక రాత్రి యొక్క అంతమునందు బ్రహ్మ యొక్క యొక రోజు యొక్క అంత్యమున ప్రత్యాహారమును (ఏలయమును) చేప్పెదను. బ్రహ్మ యొక్క ఉనికి అంత్యమయినప్పటి విలయము చెప్పెదను.

ప్రత్యాహార సంపూర్ణ కాలమున అవ్యక్తము వ్యక్తమును గ్రహించును. విశ్వ మంతయు ఈశ్వరుఁడు వ్యక్తమును సృజించినట్లే సుసూక్ష్మముగా వ్యక్తమయియుండెను. ద్యణుకము (రెండు అణువులు కలది) ద్యణుకముతో మహాఘోరమయిన సర్వ వస్తు వినాశనము ప్రారంభమయి, ‘పర’తో సమాప్తము, కల్పము యొక్క తుదను ఉపస్థితము కాగా, అంతీయకాక యది యెవరీకి కనరాకయుండ, తుది మనువు యొక్క మన్వంతరము యొక్క తుదను, కలియుగాంతమున, సర్వము విలయమొందియుండ, దీనినీ సంహారమందురు. సంప్రక్షాలనము జరుగుట ఆరంభముకాగా, ప్రపంచము యొక్క ప్రత్యాహారము. తప్పనిసరియైన, ఆ విలయన సమయములో భూత తన్మాత్ర సంక్షయమున మహదాది వికారముల యొక్క విశేషాంతము యొక్క సంక్షయమున, ప్రతిసంచరము (పునః విలీనము) తన స్వభావమున (స్వ లక్షణమయిన గంధ గుణము తీసివేయబడిన) భూమి వినాశమునకు అనుకూలముగ (అర్షముగ నుండును. (గంధతస్మోత్రము ప్రణష్టమయిన భూమీ) భూమి యొక్క సూక్ష్మ లక్షణమయిన గంధము వినష్టముకాగా, భూమితోయావస్థమారును. తోయము అప్పుడు అన్నింటిని పరీవ్యాపించి ఇందు అందు సంచరించును. సర్వమును నింపి (యుండును) తోయ లక్షణమయిన రసము (రుచి) జ్యోతితో (అగ్నీ భూతముతో) ఆలీనమగును. కలిసి పోవును.-9. రసతన్మాత్ర సంక్షయము వలన అప్పుడు నీరు (తోయుము) నశించును. రసము తేజస్సుచే అపహృతముయినప్పుడు నీరు జ్యోతిష్యమును పొందును (అగ్ని భూతత్వమును పొందును)-10.

నీరు గ్రహింపబడ, తేజస్సు (అగ్ని భూతము) అన్ని పక్కలకు సర్వతో ముఖముగా తన చుట్టు చూచును. అంత అగ్ని సర్వత్ర వ్యాపించి నీటిని గ్రహించును (గ్రహించి) ఆవిరిగా పరిణమింపఁజేయును.

అంత నీ ప్రపంచము క్రమముగా మెల్లగా అగ్నిచే (జ్వాలలచే) నింపబడును, అంత జ్వాలలన్నికడలకు వ్యాపించును. పైకి, క్రిందికి, ప్రక్కలకు - అంత వాయు (భూతము) రూప లక్షణమును గ్రహించును. (ప్రకాశకమును వాయువు) శీనును. అంతనది దీపార్చివలె మారుతము ప్రతీయమానమగుసు-13. (వాయువు యొక్క దుమారముతో) అగ్ని యొక్క రూపతన్మాత్రము ప్రనష్టమయి అగ్ని హృతరూపుడగును. అగ్ని ఉపశామ్యుఁడగును. వాయువు గొప్పగా వీచును. వాయు భూతమయిన తేజస్సు నిరాలోకముకాగా తేజస్సు వాయువులో నిమజ్జనమయి వాయువుతో తాదాత్యము వహించును. వాయువు తన కారణముతో సంబంధమునొంది, ఊర్ధ్వము, క్రింద, పక్కదశ దిక్కులు నీపును. ఆకాశము వాయు లక్షణమయిన స్పర్శ గుణమును గ్రహించును-16. అప్పుడు వాయువు ప్రశామ్యమయి యుండును. ఆకారము వెనుక అనావృతమయి, ఎట్టి రూపము లేక రంగులేక రుచి లేక, స్పర్శ లేక వాసన లేక యుండును. సర్వమును శబ్దముచే నింపుచు ప్రకాశించును. అది విలీనముకాగా శబ్ద లక్షణమయిన ఆకాశము మిగిలి వెనుక నుండును-18.

శబ్ద మాత్రమయిన ఆకాశము సర్వమును వ్యాపించియుండును. ఆకాశము యొక్క శబ్ద గుణము మరల భూతముల గ్రసించును-19. అన్ని భూతములు, ఇంద్రియములు ఒకే యొకసారి భూతాదులతో విలీనమగును. ఈ భూతాది అభిమాన లక్షణము గలది (అహంకారము). భూతాది తామస లక్షణమని గ్రహింపవలెను.-20. బుద్దీతో లక్షితమయిన మహత్తు బుద్దీని గ్రహించును. మహత్తు బుద్ధి లక్షణము కలదీ, సత్యమును గూర్చి ఆలోచించువారు, మహత్తును ఈ క్రింది సర్వ నామములతో వ్యవహరింతురు - అవీ - సంకల్పము, (ఆలోచన) వ్యవసాయము (నిశ్చయము) బుద్ధి (వివేకము) మనః (మనస్సు, లింగము. (హేతువు) మహాన్ (గొప్పది) మరియు అక్షరము (అవి నాశనము)-22.

భూతములు గుణ సామ్యములో కలియగా (గుణముల సమానత్వము) మహత్తు కూడ విలీన మగును. అప్పుడు గుణ సామ్యము , (మూడు గుణముల యొక్క సామ్యము) తనలో తానే (అవతీష్ఠతే) ఉండును-23. (ఆత్మలో నుండును). భూతముల యొక్క కారణములన్నియు, ప్రసంయమమునందు విలీనమగును. ఈ విధముగా తత్త్వముల యొక్క ప్రసంయమము (పునః విలీనత్వము) వాని కారణములతో సహా యుండును.-24. ఓ బ్రాహ్మణులారా! ఈ తత్త్వ ప్రసంయమము ఆవర్తకముగా తిరిగి తిరిగి వచ్చునట్టేదిగా) చెప్పబడుచున్నది. ధర్మము, అధర్మము, తపస్సు, జ్ఞానము, శుభము పవిత్రత్వము సత్యానృతములు (సత్యము - అబద్ధములు) ఊర్థ్వ అధోభావస్థితులు, సుఖ దుఃఖములు, ప్రియా ప్రియములు మొదలగునవి సర్వము, ప్రపంచస్థమైనవనియు గుణ లక్షణములనియు జ్ఞాపక ముంచుకొనవలయును 26. జ్ఞానవంతులయొక్క శుభము, అశుభము, జ్ఞానేంద్రియముల తోడి సంబంధములేక - వారి గుణములు పాపములు ప్రకృతిలో నిమజ్జనమగును (విలీనము చెందును)-27. ప్రకృతిలో విలీనమయిన, జంతువుల యొక్క జీవుల యొక్క పాప పుణ్యములు, శరీరము దాల్చిన జీవులకు పుట్టుకతో వచ్చునట్టివియని స్థిరీకరింపఁబడినవి. -28. ఆ మంచి చెడ్డలే (పుణ్య పాపములే) విభిన్న పరిస్థితులలో జీవులను తత్తత్ శరీరములను కలియును. వారు కారణములతో సహా జంతువులతో సహితము - ఫలితపు స్థితి పొందినవేమో అన్నట్లు ఉండును. చైతన్యవంతములయిన గుణములు (సత్త్వాదులు) క్షేత్ర ఖునిచే నధిష్ఠితమై, సర్గమునందు ప్రతి సర్గమునందు సంసారమునందు వానితో నవి సంబంధమును కలిగియో లేక ఒక దానితో నొకటి విడివడియో, వానీ వాని కారణము సంబంధముగా ఇందు నందు సంచరించును.

చైతన్య కారణమయిన వృత్తులు మూడుం వీధములు - అవి రాజసీ, తామసీ, సాత్వకీ వృత్తులు. అవి పురుషాధిష్ఠితమై వ్యవహరించును. అవి గుణమాత్రములు.

ఊర్ధ్వ దేహాత్మకము సత్వము, అధో భాగాత్మకము తమము. ఆ రెంటి యొక్క ప్రవర్తకము యొక్క మధ్య ఇచ్చటనే (ఇహలోకముననే)రజస్సు ఆవర్తకమై యుండును -33. ఈ విధముగానవి చేతో గుణాత్మకములై మూఁడు విధములుగ, సాగును-34.

లోకములందు సర్వ భూతములయందు, మానవులందరు, అవిద్యా ప్రత్యయారంభులయి కార్యము లాచరింపదొడగుదురు. జ్ఞానవంతులు దానిననుసరించరాదు.

ఈ మూడు గతులు పాపాత్మికములుగ అశుభములుగ జ్ఞాపకముంచుకొనవలెను. అంత తమస్సుచే అబీభవులయి ఆ జంతువులు యథార్థ స్థితిని చేరలేవు-36.

అతత్త్వ దర్శనము వలన ఆ వ్యక్తి వివిధ బంధములు పొందును అతఁడు ప్రాకృతమైన బంధముచే, వైకారిక బంధముచే తృతీయమైన దక్షిణా బంధము చేతను బద్ధుఁడయి వలయముగా తిరుగుచుండును.

అజ్ఞానముచే కలిగిన ఈ బంధత్రయము చెప్పబడినది. 38

అనిత్య విషయములందు నిత్యవిషయములను భావము దుఃఖ విషయమునందు సుఖదర్శన భావము తనది కానీ విషయమున తనదను భావము, శుచికాని దానియందు శుచిమంతమను నిశ్చయము-ఇవి మనోదోషములు, ఇయ్యవీ జ్ఞాన దోషవిపర్యయమున కలుగును.

రాగద్వేషముల నివృత్తి జ్ఞానమని ఉదాహరింపఁబడినది.

అజ్ఞానము తమోగుణము మూలముగా గలది. రజస్సు కర్మద్వయ కారణము. (శుభాశుభద్వయ కర్మలు). భౌతిక దేహమును మరల పొందుట, కర్మము యొక్క దోషఫలము. అందుమూలమున మహాదుఃఖము ప్రవర్తించును. 41

తృష(కోరిక) శ్రోత్రముల వలన నేత్రముల వలన, చర్మము వలన, జిహ్వవలన, నాసిక వలన పుట్టును. ఇదియే పునర్జన్మమునకు కారణము. ఇయ్యది చేయబడిన కర్మలు కారణముగా కలుగును.        

తృష్ణతో ఆహతుడైన వాడు (కోరిక కలవాఁడు) బాలుఁడుగా చెప్పబడును.

స్వకృతములయిన కార్యముల ఫలితముగా, జీవుఁడు నూనెగానుగు వలే అచ్చటనే గుండ్రముగా తిరుగుచుండును 43 అందుచే అజ్ఞానము అనర్థములకెల్ల మూల కారణము. ఆ యజ్ఞానము శత్రువని యెఱింగి, జ్ఞానము. కొంకు యత్నము నాచరింపవలెను జ్ఞానార్థి (జ్ఞానమును గ్రహించువాడు). సర్వమును త్యజించును. త్యాగము వలన బుద్దీ అభీషంగమునుండి విడివడును. వైరాగ్యము కలుగును వైరాగ్యమువలన పరిశుద్దుఁదగును. శుద్ధుఁడు సత్త్వమునుండి విడిపడును. 45 అందుచే, విశేషముగా చెప్పెదను రాగము(కోరిక) ప్రాణుల నపహరించును తన్ను నిగ్రహించుకొననివాని విషయములలో విషయముతోడి సంబంధము అధికమయిన సంబద్ధత (అభిష్వంగమును) కలిగించును.

అనిష్టము, ఇష్టము, ప్రీతి, ద్వేషము, తాపము, విషాదము, దుఃఖలాభమున తాపము, సుఖమును గూర్చి అనుస్మరించుట-ఈ మొదలగునవి విషయ సంబంధమయిన కోరికలు ఇవియే పునర్జన్మమునకు మర్త్యలోకమున కారణముగా జ్ఞాపకముంచు కొన వలెను. బ్రహ్మమొదలుకొని స్థావరముల తుదివరకు మర్త్యలోకమున సంసార (జననమునకు )మనకు కారణము-48. ఇయ్యదీ అజ్ఞాన పూర్వకముగా గలిగినది అందుచే (1) జ్ఞానమును విసర్జించవలయును.

ఋషులయొక్కపలుకులను ప్రమాణముగా (అనుసరణీయ సూత్రములుగా) నెవ్వడంగీకరింపఁడో, లేదా శిష్టుల ఆచార వ్యవహారములకు విలువనీయండో వర్ణాశ్రమాచారములకు వీరోధకముగా ప్రవర్తించునో అతనికీ నరక మార్గము తప్పదు ఇది తిర్యక్ యోని జననమునకు కారణము-50. పశుపక్ష్యాదులు తిర్యక్కులు. తిర్యక్ యోనీ యందు జననము యాతనా స్థానమనీ బుద్ధిమంతులు చెప్పుదురు. ఈ యాతనలు త్రివిధములు. తిర్యక్ యోని యందలి జననము షడ్విధము. సర్వశః జ్ఞాన కారణమునకు ప్రతిఘాతము (అడ్డంకి)గా ఉన్నది. అనైశ్వర్యము ప్రతీఘాతాత్మకముగా వెలుంగ వలయును (అనైశ్వర్యము భగవచ్చక్తి కాని, నిగ్రహణ శక్తి కాని లేకపోవుట) ఈ విధముగా భూతాదులయందు తామసీవృత్తి నాల్గువిధములు. మనస్సు సత్త్వ గుణము యొక్క బలముపై నాధారపడియుండును ఏలయన మనస్సు సత్వగుణములవలెనే వ్యక్తమగును తత్త్వముల యొక్క తత్త్వ దర్శనమును గ్రహించి (చూచిన తత్త్వము వ్యక్తమగును. తత్త్వముల యనేకత్వము, క్షేత్రజ్ఞుల యొక్కనానాత్వములో-నానార్థ దర్శనమని చెప్పఁబడినది-54.

నానార్థ దర్శనము జ్ఞానము. జ్ఞానము వలన యోగమనీ చెప్పబడినది. దానిచే బద్ధుఁడయిన వానికి బంధత్వము. దానినుండి విముక్తుఁడైస్తవానికి మోక్షము.

సంసారము (జనన మృత్యువలయము) నుండి విముక్తుఁడైనవానీకి, లింగమునుండి మోక్షము కలిగి, మోక్షము పొందును. సంబంధమునుండి సంబంధము లేకపోవుటచే అచైతన్యము కలిగియుండుటచే ఆ వ్యక్తి ఆత్మయందే (స్వాత్మయందే) యుండును-56.

స్వాత్మయందలి అవస్థితియందు కూడ, అనేకత్వముచే సత్వముచే విరూపాఖ్యత్వము చెందును (విషయదోషరహితుఁడగును)

ఈ విధముగా సూక్ష్మముగా జ్ఞానమోక్షముల లక్షణము వివరింపఁబడినది 57, తత్త్వ దరులచే మోక్షము త్రివిధముగా చెప్పం బడినది.

మొదటిది అజ్ఞానముచే వియోగము (విడుదల) రెండవదానిలో, మోక్షము రాగ సంక్షయము వలన వస్తువున ప్రేమాను బంధములేక పోవుట) మూడవది -తృష్ణ (ఆన-కోరిక) యొక్క క్షయము మోక్షకారణమని వ్యాఖ్యానింపబడినది. నూక్ష్మ శరీరము లేకపోవుట-లింగాభావము. లింగాభావము వలన కైవల్యము. కైవల్యము వలన నిరంజనము (శుద్ధమూదోషరహితమునైన స్థితి)-59. నీరంజనత్వము వలన శుద్ధత్వము. దానికంటే వేళాక నీయంత (నాయకుఁడు) లేడు. అందుచే, దోష దర్శనము వలన వైరాగ్యమును గూర్చి చెప్పేదను. (వస్తువుల యందలి దోషగుణమును చూచి యూహించి తెలిసికొని వైరాగ్యము వస్తువు నందు(గలుగును) 60.

దివ్యములు మానుషముల విషయములు (పదార్థములు} పంచలక్షణములు కలవి, అప్రద్వేషము (ద్వేషము లేకపోవుట), అనభిష్వంగము (ప్రేమానుషంగము-అనురాగము-లేకపోవుట)-ఈ రేండును దోషదర్శనము వలన చేయవలయును, తపము(దుఃఖము) ప్రీతి, (ఆనందము) విషాదము (విచారము) వీనిని పరిత్యజించవలెను. విసర్జనముచే వైరాగ్యమును పొంది, శరీరి (శరీరము కలవాడు) ఆత్మ నిర్మముడు (దేనియందునభిమానము లేనివాఁడు) అగును-62

వ్యక్తి యిట్లు విషయముల గూర్చి మనస్సులో నాలోచించవలయును-ఈ ప్రపంచమనిత్యము; శుభంకరమైనది కాదు; దుఃఖమయము. ఇట్లు తెలిసికొని, దానిని గూర్చి ఆలోచించీ సత్త్వ గుణమును సేవించుటచే విశుద్ధములైన కార్యముల నాచరించ వలెను. వ్యక్తి విషయాత్మకమైన సబంధ బద్ధత్వమును తన స్వాధీనములో నుంచుకొని, పరిపక్వ దోషగుణ జ్ఞానమున కలిగిన కషాయ గుణభావమును గలిగి సర్వవస్తు గతదోషములను చూచును.

అంత మరణకాలమున (ప్రయాణకాలమున) ఉషా (శరీరపు ఉష్ణము) ప్రకుపితము (అధికము) అయి శరీరమున తీవ్రమయిన వాయువుతో కూడి (ఆవ్యక్తి) శరీరమును ఉపాశ్రయించి సమస్తములైన దోషములను అడ్డగించును-65.

వాయువు ప్రాణస్థానములను ఉద్ఘాటించి మర్మస్థానములను ఛేదించి దాని (అతిక్రమించి) చల్లదనముచే మిక్కిలిగా కోపించి,అంతట పైకి లేచిపోవును-66.

(ఆ వాయువు) అయ్యది సర్వప్రాణులయొక్క ప్రాణస్థానముల యందుండును. అప్పుడా జ్ఞానము సంగ్రహముగా ఆకృతమై యుండ, కార్యములు (కర్మలు) సంవృత్తములు అగును. తననాభి అధిష్టానముగాగల జీవి ఇతః పూర్వమాచరించిన కర్మలచే ప్రేరేపించబడును. వాయువు, అష్టాంగముల నుండి ప్రాణవృత్తిని కలత పరచి కార్యములను ఛేదించును. తుదీనీ, శరీరమును పరిత్యజించి ఊపిరిని పీల్చుటకు అడ్డుపడును. అప్పుడు నిరుచ్ఛ్వాసము కలుగును ఈ విధముగా ప్రాణములచే పరిత్యక్తుడై మృతుండని పిలువఁబడును-69.

ఈ లోకమున స్వప్న సమయములో నిద్రపోవు వ్యక్తి ఇటు అటు తీసికొనిపోవునట్లు చూచుచున్నాము. దానికి (స్వప్నమునకు)లోబడిన వానికి రంజనముగానే ప్రీతికరముగా ఉండును. కాని అందు ఒకచోట నుండి వేక చోటునకు తీసికొని పోవు వ్యక్తి (నేత) లేండు-70. మూఁడవదియైన తృష్ణాక్షయము, మోక్షలక్షణమని వ్యాఖ్యానము చేయఁబడినది. శాబాదులయందు విషయములయందు దోషదృష్టిని గలిగియుండుట పంచలక్షణము, ద్వేషము లేకుండుట, అధికమయిన అనుషంగము లేకపోవుట, దుఃఖము ప్రీతీని పరిత్యజించుట,అనునది. ఈ విధములయిన ప్రకృతియొక్క లయము (వినాశనము-పరీత్యాగము) ప్రపంచముతో సబంధించినట్టే ప్రధాన విషయములివ్వీ-72.

పూర్వమందుచెప్పినట్లు అష్ట ప్రకృతులను తెలియవలయును. అవి అవ్యక్తముతో నారంభమయినవి. భూతములలో సమాప్తమొందినవి. ప్రకృతినుండి ఆవిర్భవించినవి.

శాస్త్ర నియములతో విరోధించని వాఁడు శిష్టుఁడు. అతఁడు వర్ణాచారయుక్తుడు, వర్ణాశ్రమము ధర్మానుష్టానము దేవతాస్థాన ప్రాప్తికి కారణము-74. బ్రహ్మతో నారంభించి పిశాచాదులతో నంతమొందునవి దేవతల యొక్క అష్టస్థానములు ఈ అష్టలక్షణములకు కారణము అణిమాది యెనీమీదీయైన శక్తులు కారణము-75.

అణిమాదులు దేవతా సంబంధమైన అష్టసిద్దులు, అయ్యవి శబ్దాది లక్షణమందు అప్రతిహతమయి నిమిత్తమునందు చూడబడును. (నిమిత్తము కారణము). ప్రకృతిజములయిన యీ అష్టరూపములు క్షేత్రజ్ఞునకు అను సంధింపబడినవి. గుణములలో నివి క్రమముగా నుండును.

వర్షాకాలమున కనులున్నవారు మేఘమును ప్రత్యేకముగా చూచేదరు. అట్లే, సిద్ధులు తమ దీవనేత్రములతో జీపులను వారు ఆహారము తినునప్పుడు త్రాగునప్పుడు భిన్న భిన్న యోనులను ప్రవేశించునప్పుడు ఒక క్రమ పద్ధతిలో పరుగేత్తుచున్నప్పుడు క్రిందకు, ప్రక్కలకు పరుగెత్తుచున్నప్పుడును చూడగలరు. జీవము, ప్రాణము, లింగము, కరణము అను నాలుగు పర్యాయ పదములతో ప్రత్యేకముగా ఏకార్థ పదములతో వ్యక్తము చేయబడును. ఇది వ్యక్తావ్యక్త ప్రమాణముల లక్షణము. జీవుండు అవ్యక్తముతో అనుగ్రహముతో సమాప్తమై సర్వమును సంపూర్ణముగా అనుభవించును అయ్యది క్షేత్రజ్ఞునిచే అధిష్ఠితము ఈ విధముగా తెలిసికొని శుచియై, జ్ఞానము వలన విముక్తుఁడగును-81.

సత్యము గ్రహింపఁబడిన నష్టమయిన తత్త్వము స్పష్టముగా తెలియును కాని, బ్రతికియుండని భిన్నమయిన శరీరములయందు, ప్రత్యేకజీవుఁడుకరణము అవ్యక్తము నుండి జ్ఞానులనుండి భేదించును. గుణముల రూపమునను, ప్రాణరూపమునను, ఉన్న శరీరమునుండి పూర్తిగా విముక్తిచెందినవాడు లోపల గింజ దగ్డమయి వీభ్రష్టమయిన దానినుండి మొలక రానియట్లు, ఎన్నడును వేరొక శరీరమును ధరింపడు-83. జ్ఞానయుక్తుఁడయిన జ్ఞాని, సర్వవిశ్వముతో సంబంధములేని మనస్సు శరీరము కలిగియుండును-84. ప్రకృతిని సత్యమని చెప్పుదురు. వికారము అనృతమని చెప్పుదురు. అసధ్భవమును అనృతము గాను సత్యమును తెలిసికొనవలెను అనామరూపుడయిన క్షేత్రజ్ఞునకు నామ రూపములు చెప్పుదురు-86.

అందుచే క్షేత్రమును తెలిసికొనును. తత్కారణమయిన క్షేత్రజ్ఞుండని చెప్పబడును. క్షేత్రజ్ఞుఁడు క్షేత్రమునకు పోవువాడగుట అయ్యది శుభము (మంగళకరమని) చెప్పుదురు - 87.

క్షేత్రజ్ఞుఁడు స్మరింపఁబడును అందుచే క్షేత్ర మెరిగిన వారు దానీనీ క్షేత్రమందురు క్షేత్రమును చూచెదరు. క్షేత్రము తత్పత్యయము చూడబడినది. క్షేత్రజ్ఞుడు ప్రత్యయములో నెల్లప్పుడుండును (ప్రత్యయము తెలివి, ఆత్మజ్ఞానము) .

క్షేత్రమును తెలిసినవారు దానిని క్షేత్రముగానెలుంగుదురు. కారణము దాని యొక్క అపవిత్రత్వము నాశనము క్షతత్రాణము వలన భోజ్యత్వము వలన, విషయత్వము వలన-89.

‘మహత్తు’తో ఆరంభించు సర్వ వస్తువులు, విశేషముతో అంతము నొందునట్టివి, విభిన్నమయిన రూపమును. వహించును. అవి వికార లక్షణముల గలిగినవి. అందుచేనని విలక్షణములు. అందుచే, అక్షరము (నాశనము చెందనిది) క్షరమును (నాశనము చెందుదానిని) సమీపించును-90. అదీ వికారముతో సహితము నశించును గాన, “క్షర”మని పిలువబడినది-91.

దీనిని క్షేత్రమందురు, కారణము అయ్యది పురుషుని ప్రపంచ స్థితి నుండి నరకము నుండి రక్షించుటచే అయ్యది దుఃఖము నుండి రక్షించునదగుట వలన కూడ క్షేత్రమని పిలువబడును-92. సుఖ దుఃఖములు అహంభావము వలన భోజ్యమువలన (విరుద్ద ధర్మములచే) అయ్యది ‘విభువ’ని స్మరింపబడుచున్నది.-93. అయ్యది అక్షరమని కూడ నీ దిగువ కారణములచే చెప్పఁబడును. నక్షరతే (వ్యర్థము క్షయము కాదు) నక్షరతి - అయ్యది నశింపదు. అయ్యది వికారము నుండి వ్యాపింపదు. అయ్యది తగ్గిపోదు (క్షీణత్వమొందదు)-94. పుర ప్రత్యయికము వలన ‘పురుష’ అని చెప్పుదురు. (పురుషుఁడన శరీరము నందున్న వాఁడు) శరీరము ఆత్మకు స్థానము-95. ఆతండు శుద్ధుఁడు. అనిరంజనుఁడై ప్రకాశించును. ఆతఁడు జ్ఞాత తెలిసినవాఁడు). అతఁడు అజ్ఞానము నుండి వివర్జితుఁడు. అస్తి (ఉన్నాఁడు) అన్న దాని కంటే నతడు వేరయిన వాఁడు. నాస్తి లేనివాఁడు, బద్ధుఁడు ముక్తుఁడు గతి కలిగినవాఁడు, స్థితః (ఉన్నవాఁడు). ఆతఁడు నిర్ణేతుకుడుగాన ఎట్టి హేతువు (కారణము) లేనివాడగుట నిర్దేశింపఁబడ శక్తుఁడుగాడు. ఆతనికి పాపము లేదు. -97.

శుద్ధత్వము వలన (పవిత్రత్వమువలన) నతఁడు దృశ్యుడు కాఁడు. అతడు ద్రష్ట స్థితిలో నుండుట వలన ద్రష్టు ఆతఁడు సమదర్శనుఁడు, ఆతని యొక్క బుద్ధి వలన (ఆత్మ జ్ఞానము వలన) ఆతఁడు. న్యూనుఁడుకాడు. అతఁడు ఎట్టి కారణములేని వాఁడు. ప్రమోహము చెందడు.

జ్ఞానిని దర్శనాత్మకముగా శాంతార్థము చూచినపుడు దృశ్యా దృశ్యముల నిర్దేశ్యము దుష్కరము. దానిని ధరించుట (వహించుట) కష్టము. అదీ అత్యుత్తమము. జ్ఞాత ప్రత్యేకముగా దర్శింపబడడు (అతడు సర్వత్ర నుండుట వలన)-100. కారణము యొక్క లక్షణము శక్తి యొక్క సామర్థ్యముతో నున్న ద్రష్ట తన ఆత్మ శక్తిచే నియమించుకొనును, ఆతఁడు. తన యాత్మయందే యుండును (కారణమునందు - ప్రకృతియందు)-101. ఆత్మ, ఉన్నదా, లేదా అది వేడొకటియా, బ్రతికి ఉన్నదా, లేదా, బ్రతికి లేదా, అయ్యది ఇచ్చట నున్నదా, వేడొక చోటనా, అది ఒక్కటియా, వేరయినదా, అది క్షేత్రజ్ఞుండా!

లేక పురుషుఢా, అయ్యది ఆత్మయా లేక ఆత్మలేనిదా, అది జడమా లేక ప్రాణిమంతమా? అయ్యది కర్తయా చేయు నదియా లేక కార్యములు చేయనదియా, లేక అది అనుభవించు నట్టిదియా, లేక ఇతరులచే అనుభవింపబడునట్టిదియా, దానినీ పొందిన తరువాత (భోజ్యమా, భోక్తయా) దేనినిజేరి (యధత్వా) తిరిగిరారు, (నని వర్తంతే) క్షేత్రజ్ఞుండు - నిరంజనుఁడు - అయ్యది పదములచే వచింపబడ శక్యము కానిది (అవాచ్యము) వర్ణించుటకు శక్యము కానిది.

అయ్యది హేతు వాదులచే గ్రహింపబడరానిది. అప్రతర్యము (తర్కింపబడరానిది) అచింత్యము, అవార్యము, వచనములచే ఆలపింపబడరానిది సత్యము యథార్థము పదములచే వ్యక్తీకరింపబడరానిది అదీ మనస్సు గ్రహింపఁబడదగినదియు కాదు -105. క్షేత్రజ్ఞుండు మొ పదములచే వ్యక్తము చేయబడగలపోడు కాఁడు, అదీ నీర్గుణము, శుద్దము, శాంతము, అనిరంజనము, మరియు అక్షయము. అయ్యది సుఖదుఃఖములు లేనిదీ. అదీ నియమితము. శాంతము. అయ్యది నిరాత్మకము వాచ్యావాచ్యములుండవు. అయ్యవి సంహారములు - విస్తారములు. వ్యక్తా వ్యక్తములు, తరువాత అవి సృజింపఁబడును. గ్రహీంపఁబడును. వ్యక్తమై యుండును.

క్షేత్రజ్ఞునిచే అధిష్టితమై సర్వము సర్గము నొందును -108. దాని యంత్యమున బుద్ధి పూర్వకముగా నదీ అధిష్టానమును చేరును సాధర్మ వైధర్మములచే పరస్పర సంయోగ కృతము పురుషుని యొక్క సంయోగము ఆరంభ శూన్యమనీ ఘోషింపఁబడినదీ-110.

ఎంత కాలము సర్గ ప్రతి సర్గలుండునో, అంతవరకు జగత్తు స్థితిమంతమై యుండును. మొట్టమొదట సంనిరుధ్య పురుషార్థము బుద్ధి పూర్వకముగా సర్వము జరుగును.

ఈ ప్రకృతి సృష్టికి నాశనమునకు కూడా కారణము. లేదా ఇది ఈశ్వరునిచే జరుగును. దీనికి మొదలుగాని, వినాశనము (అంత్యము) కాని లేదు ఇది ప్రపంచమును (జగత్తును) అభిమాన పూర్వకముగా భయపెట్టుచు (విత్రాసయంతీ) చేరును -111.

ఈ విధముగా ప్రకృతి యొక్క తృతీయ సర్గము (సృష్టి) కారణ లక్షణమై, వివరిపఁబడినది. అత్యంతమైన కాలమునెంగి వ్యక్తి విముక్తుఁడగును. ఈ విధముగా మూడు విధములైన ప్రతి సర్గము యొక్క విలీనము విస్తరముగా క్రమముగా చెప్పబడినది. ఇంక దేనినీ నేను చెప్పనారంభింపవలయును.

మూడవ సర్గ సమాప్తము.