బ్రహ్మాండ మహా పురాణము
14 - మదనకామేశ్వరప్రాదుర్భావో నామ చతుర్దశోఽధ్యాయః
హయగ్రీవుడనెను. ఈ కాలములోనే లోకపితామహుడైన బ్రహ్మ మహర్షులతోగూడ నాదేవేశిని జూచుటకేతెంచెను-1. గరుడు నారోహించిన వాడై విష్ణువు సైతమేతెంచెను. వృషారూఢుడై యఖిలేశ్వరిని చూచుటకు శివుడు గూడ నేతెంచెను-2. నారదాది దేవర్పులు మహేశ్వరికడకు వచ్చిరి. అపురోగణములందరును ఆమెకడకు వచ్చిరి-3. విశ్వావసువు మొదలగు గంధర్వులు యక్షులును వచ్చిరి. బ్రహ్మచే ఆదేశింపబడి, వీశాంపతి (రాజైన) విశ్వకర్మ-4. దేవపురమువంటి దివ్యమైన నగరమును నిర్మించెను. తరువాత భగవతియై సర్వమంత్రములకధీ దేవతయైన దుర్గ-5. విద్యాధిదేవతయైన శ్యామయు అంబికకడకు వచ్చిరి. బ్రాహ్మీమొదలగు మాతృదేవతలును సర్వభూతగణములతో బాటు వచ్చిరి. (బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి ఇంద్రాణి, చాముండ-వీరేడుగురు మాతృదేవతలు)-6. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము వశిత్వము-అనెడు ఎనిమిది సీదులు వచ్చినవి. అట్లే కోట్ల కొలది యోగినులు వచ్చిరి. భైరవులు, క్షేత్రపాలులు, గణాగ్రణియైన మహాశాస్త్ర-7, మహాగణేశ్వరుడు, స్కందుడు, బటుకుడు, వీరభద్రుడు-వీరందరూ వచ్చి నిత్యము దేవికి ప్రణుతులై స్తుతించిరి-8. అట్టి విశ్వకర్మ నిర్మించిన నగరి, రమ్యమైనది. బురుజులతోగూడి కోటగోడలతో తోరణములతో నొప్పినది. గజ-అశ్వరథముల శాలలతోనొప్పినది. రాజవీధులతో విరాజిల్లినది-9, అచట సామంతరాజులయు, అమాత్యులయు, సైనికులయు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, వేతాలులయు దాస-డీసీజనములయు సుందరములైన యిండ్లుగలవు-10. మధ్యన ద్వారములతోను, గోపురములతోను భూషితమై దివ్యమైన రాజ గృహముగలదు. అనేకశాలలు బహంసభా భవనములును గలది-11. నవరత్నమయమైన సింహాసన సభ యున్నది. దానిమధ్యన చింతామణి వినిర్మితమై దివ్యమైన సింహాసనము గలదు-12. అదీ స్వయం ప్రకాశము దానివంటిది మరొకటి లేదు. ఉదయించిన సూర్యునివలె ప్రకాశించునది. దీనిని జూచి లోక పితామహుడైన బ్రహ్మాయిట్లు చింతింపసాగెను-13. దీనిని అజ్ఞానియైన బాలుడెక్కియుండినచో ఈ నగర ప్రభావమున వాడు సర్వలోకములకును అధికుడగును-14. కేవలమొక పెండ్లియాడని స్త్రీకాని, స్త్రీ లేని పురుషుడుగాని రాజ్యార్థులుగారు, మంగలాచారములతో గూడి మహాపురుష లక్షణములు గలిగి, అనుకూల స్త్రీతో నున్న వానినే రాజ్యమున నభిషేకింపవలెనని శ్రుతి చెప్పును-15. ఈ మహాదేవి ఉత్తమ స్త్రీగను, ఆకారము దాల్చిన శృంగారదేవతగను బ్రాకాశించుచున్నది. శంకరుడుదప్ప ఈమెకు దగిన వరుడు ముల్లోకములలోను లభింపడు-16. కాని శంకరుడు జడలుగలిగి, కపాలమాలను ధరించి, బేసికన్నులుగల వాడై (ముక్కంటియై), చిత్రవర్ణములుగలిగి, బూడిదబూసికొన్న సమస్త శరీరము గలవాడై, కాటియెముకల నలంకరించుకొన్న వాడైయుండును-17. ఈ విధముగా అమంగలములకు నెలవైన వానిని సుమంగళియైన యా మహాదేవి వరించునా? అనీ చింతించుచుండగనే యా బ్రహ్మయొక్కయెదుట మహేశ్వరుడు-18. కోటి మన్మథుల సౌందర్యము దివ్యశరీరము దీవ్యవస్త్రములను దివ్యమాలలను ధరించి, ధివ్యగంధములబూసికొని-19. కిరీటము, హారములు, భుజభూషణములు, కర్ణకుండలములు, మొదలగువానిచే నలంకరింపబడినవాడై జగన్మోహనరూపమును ధరించి (బ్రహ్మదేవునియెదుట) ఆవిర్భవించెను-20. ఆ కుమార స్వరూపియైన శంకరుని లోక పితామహుడైన బ్రహ్మ కౌగిలించుకొని యా సుందరశరీరధారీకి కామేశ్వరుడనీ నామధేయము జేసెను-21. ఆ పరాశక్తి కీతడనురూపుడైన వరుడని నిశ్చయించి యాతనితో గూడ దేవికడకు దేవతలందరుపోయిరి-22.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ పరాశక్తిని స్తుతించిరి. ఆ లేడిపిల్లకన్నుల వంటి కన్నులు గల మహాదేవిని జూచి కుమార శంకరుడు తన సమస్త క్రియలను మరచి మన్మథావిష్టుడయ్యెసు-23. సన్నని సుందరదేహముగల యా మహాదేవియు ఆకారముదాల్చిన మన్మథునివలెనున్న కుమారశంకరునీ జూచి మదనావిష్ణ సర్వాంగియై యాతని స్వాత్మరూపునిగా దలచెను. పరస్పరము బాగుగా చూచుకొనగోరి వారిరువును కామపీడితులైరి-24. సర్వభావ విశేషములనుదెలిసి, ధృతిమంతులై, మనస్వులై మనమును తమ వశమునందుందుచుకొన్నవారై) ఇతరులకు దెలియరాని చరిత్ర కలవారై (పరమాత్మ స్వరూపులై మనోవాగతీతులై) కూడా ముహూర్తకాలము కామవశులై యస్వస్థచేతనులైరి-25. ఈ తరువాత బ్రహ్మ లోకైకనాయికయైన మహాదేవితోనిట్లనెను. ఈ దేవతలు, ఋషులు, గంధర్వాపురోగణములును ఈశివైన నిన్ను పరమయుద్ధమున సప్రియను (ప్రియునీతో గూడినదానినిగా) జూడగోరుచున్నారు-26. ఓదేవి! నీకు ప్రియతముడైన యా ధన్యపురుషుడెవడు? లోకసంరక్షణములకు పరమపురుషుని బొందుము-27. ఈ పురమునకు రాణివగుము. ఈ శ్రేష్ట (సింహా)ఆసనమున గూర్చుండియుండుము. అపాపులై, మహాభాగ్యవంతులైన దేవరులచే నభిషేకింపబడి, సామ్రాజ్యచిహ్నముతోగూడి, సర్వాభరణభూషితవై, నీ ప్రియునితో గూడ సింహాసనమున గూర్చున్న దానినిగా నిన్ను మేము చూడగోరుచున్నాము-29.
ఇదిశ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున మదనకామేశప్రాదుర్భావమను పదునాల్గవయధ్యాయము.
Summary of chapter 126 of the Brahmānda Mahā Purana is as follows:
This captivating chapter recounts lord Vishṇu assuming his enchanting Mohinī form to bewitch and disarm the demonic forces during the ancient churning of the nectar ocean. It lovingly describes how lord Vishṇu propitiated goddess Lalitā to embody her divine feminine charm, successfully recovering the nectar of immortality for the gods. The devout heart marvels at the unity of divine forms, worshipping the supreme mother as the source of all divine charm and cosmic preservation.