9 - పితృకల్పము శ్రాద్ధకర్మాదుల నియమములు      

ఋషులిట్లనిరి :  

పూర్వజన్మలో దక్షుని కూతురుగా భవాని సతిగా జన్మించెను. ఆమె రెండవ పర్యాయము ఉమగా ఎట్లుద్భవ మొందెను. పితృదేవతల కూతురయిన మేనక యందు శైలరాజు ఆమెను కనెను. ఆ పితరులెవ్వరు? పితరులకు మానసిక పుత్రిక మేనక కదా? వారి మనుమఁడు మైనాకుడు; వారి మనుమరాలు ఉమ (దౌహిత్రుఁడు మైనాకుడు, దౌహిత్రి ఉమయునైన, ఆ పితరులేవ్వరు). ఏకపర్ణ, ఏకపాటల, నదులలో శ్రేష్ఠురాలయిన గంగయు పితరుల దౌహిత్రులు. హిమాలయుని యొక్క కూతుండ్రలో గంగ పెద్దది? ఇదియంతయు నీచే నిర్దేశింపఁబడవలయును. మాకు దానీనీ వివరింపుము. [4) నీకు మంగళముగు గాక ! శ్రాద్ధ క్రియా విధిని గూర్చి వినగోరుచున్నాడు. వారెవరి పుత్రులుగా స్మరింపం బడిరి? వారెట్లు పీతరులయిరి? వారెట్లు సముత్పన్నులయిరి? వారి నామములెవ్వి? వారి స్వభావమెట్టిది? స్వర్గమున దేవతలయిన వారికి వారు పితరులా? ఈ విధముగా పితరుల యొక్క యుత్తమోత్తమమయిన సృష్టిని (జననమును) తెలిసికొనుటకు కోరుచున్నాను. మేమొనరించు శ్రాద్ధములు వారలనెట్లు తృప్తి పరచుచున్నవో, తెలియగోరుచున్నాము. (7).పితరులు అదృశ్యులుగా నేలయుండిరి? అట్లుండుటకు కారణమేదిగా స్మృతులలో చెప్పఁబడుచున్నది? స్వర్గము నందు ఏ పితరులుందురు? నరకము నందెట్టి వారుందురు. (8) పితరుని, పితామహుని, ప్రపితామహుని యొక్క నామముల నుచ్చరించుచు పెట్టబడిన మూఁడు పిండములు ఎట్లు పీతరులకు చేరును? వారొక వేళ నరకములో నున్నచో ఆ పితరులెట్లు ఫలితము లోసంగు ఆశీర్వచనముల నీయ సమర్ధులు? (10) పితరులన్న వారెవరు? ఎవ్వరీని మనము పూజింపవలయును స్వర్గమున దేవతలు కూడ పితరులను పూజింతురనీ మేము విందుము. ఇంతకుం బూర్వము పలువురచే విని యున్న వారిని గూర్చి వివరముగా వినగోరెదను. వారు స్పషాభిధానులు. అయినను వారిని గూర్చి చెప్పుటకు నీవరుండవు.(12)

సూతుఁడిట్లు చెప్పెను ;

నా శక్తి కొలది, నేను విన్న విధానము ననుసరించి, నా బుద్ధిని పురస్కరించుకొని నేను చెప్పెదను. పితరులు దేవసూనులు. (దేవతల బిడ్డలు). వారు మున్వంతరములందు పుట్టుచున్నారు. (13) ఇంతకు పూర్వమే వచ్చిన వారు (అతీతులు). ఇంకను రావలసిన వారు (అనా గతులు) క్రమముగా శ్రేష్టులు కనిష్టులు. ఇతర మన్వంతరములందు, పీతరులు దేవతలతో సహితముగా వెళ్లియుండిరి. ఇప్పుడు (సాంప్రతం) ఏ పితరులు వర్తమానమున నుండిరో వారిని గూర్చి చెప్పెదను. శ్రాద్ధ దేవుఁడు మనువు. ఆ శ్రాద్ధ దేవుఁడే వారికి (పితరులకు) శ్రాద్ధ క్రియను ప్రవర్తిలఁజేయును. (15)

దేవతలు తన్ను పూజింతురని బ్రహ్మ దేవతలను సృజించెను. ఆతనిని విసర్జించి ఆ దేవతలు ఫలార్థులగుట తమ్ము తామే పూజించుకోనిరి. (16) “మీరు మూఢులు, నష్ట సంజులు కాగలరని బ్రహ్మచే వారు శపింపఁబడిరి. అందుచే మీకు ఏమియు తెలియదు. లోకములందు మీరు మూఁ ఢులగుదురు.” అని బ్రహ్మ శపించెను. (17) అంత వారు మరల మరల బ్రహ్మకు నమస్కరించి క్షమింపుమని ప్రార్థించిరి. లోకానుగ్రహము కొఱకు బ్రహ్మ మురల వారితో పలికెను. (18) “మీరు ధర్మ వ్యభిచార మొనర్చితిరి. తత్పాపపరిహారమునకు ప్రాయశ్చిత్త మొనర్పుఁడు. మీరు మీ పుత్రులను పరిపృచ్చింపుఁడు. తన్మూలమున జ్ఞానమును పొందుఁడు. (19) అంత వారు ప్రాయశ్చిత్తము నొనరింపఁగోరి, నియతాత్ములయి రహస్యముగా పుత్రులను అడిగిరి. (20) వారల కొఱకు వియతాత్ములయిన కుమారులు వాజ్మనఃకరజములయిన ఫాష నివారణము కోకు ధర్మజులగుట ప్రాయశ్చిత్తముల నుడివీరి. (21) లబ్ది సంజులు జ్ఞామలువయిన దీనౌకసులు ప్రీతులయి వారల కుమారుల నిట్లడిగిరి - “నిజముగా మీరు మా పితరులు : ఏలయన ధర్మమును గూర్చి, విజ్ఞానమును గూర్చి, వైరాగ్యమును గూర్చి ప్రపంచ వస్తువు గూర్చి మీవలన మేము ప్రబోధితులమైతిమి. మీకెట్టీ వరమును మేమొసంగవలయును?” మరల బ్రహ్మ పలికెను. నీజముగా మీరందరు సత్యవాదులు. అందుచే, మీరేది చెప్పితిరో యది సత్యమగును. అన్యధా కాదు. ఇది మీరు చెప్పినది - మీ కుమారులనే మీరు మీ పితరులుగా చెప్పి యుంటిరి”. వారు మీ పితరులగుదురు. ఈ వరము మీరు వారికీయుడు”. పరమేష్టియయిన బ్రహ్మయీ విధముగా పల్కియుండిన కారణముచే, కుమారులు పితృత్వ స్థితి నొందిరి. మరి తండ్రులు పుత్రత్వ స్థితి నందిరి, అందుచే ఆ కుమార పితరుల కియ్యది ధర్మశాస్త్రములో చెప్పఁబడిన పితృకుమారుల స్థితిత్వము. (26) ఈ విధముగా ఊపుత్రులు పీతరులు, పితరులు పుత్రులు” అని బ్రహ్మ వచించిన తరువాత బ్రహ్మ మరల “పీతరుల ఆత్మవృద్ధి కొఱకు నిట్లు పలికెను. (27) ఎవరయిన అనిష్టులయిన పితరులకు శ్రాద్ధ మాచరించినచో తత్పలితమును రాక్షసులు దానవులు పొందుదురు. (28) శ్రాద్దముల వలన ఆప్యాయితులయి, అవ్యయుఁడయిన సోముని దీనదినము వృద్ధి పొందించుచు, పీతరులు వృద్ధి పొందుదురు. చంద్ర దేవుఁడయిన సోముఁడు, శ్రాద్ధ క్రియల వలన వృద్ధినీ బలమును పొంది, ప్రజలను వృద్ధి పొందించును. అంతియేకాక చరాచరాత్మక వస్తు సముదాయమయిన పర్వతాదులతో గూడియున్న యావత్రపపంచమును కూడ వృద్ధిని పొందించును. (30) పుష్టికాములయిన యెవ్వరు శ్రాద్ధముల నాచరింతురో వారికీ పితరులు పుష్టినీ పుత్రుల నెల్లప్పుడొసంగెదరు. వారు నామ గోత్రముల ననుసరించి వార్తలకు శ్రాద్ధముల పిండత్రయ మొసంగుదురు. పితరులు పీతామహులు సర్వత్ర నుందురు.

శార్దముల నాచరించుట వలన పితరులు సంతాన వృద్ధిని కలుగఁజేయుదురు. పరమేష్టియయిన బ్రహ్మచే నట్టి యాజ్ఞ పూర్వము చేయం బడినది. తన్మూలమున దానము అధ్యయనము తపస్సు ఎల్లప్పుడు సిద్ధమగును. పితరులు జ్ఞాన ప్రదాతలు. ఈ విషయమున నెట్టి సంశయము లేదు. (34) ఈ విధముగా పితరులు దేవతలు, దేవతలు పితరులు. దేవతలు పితరులు అన్యోన్యము (ఒకరొకరికి) పితరులు. (35) ఆత్మ పదార్థ మెఱింగిన సూతుని వలన బ్రహ్మ వచస్సుల వీని, మునులు మరల సూతునికీ ప్రత్యుత్తరముగా ఇట్లు పలికిరి.

 ఋషులు పలికిరి :

మునిగణముల వర్గము లెన్నియున్నవి? ఏ కాలమున నీ ముని గణములు కలిగిరి? దేవతలలో వారు శ్రేష్ఠులు. దేవతల కొఱకు వారు సోమవర్థనులు. అని సూతుఁడిట్లు చెప్పెను. ఇంత వఱకు శ్రేష్ఠమయిన పితరుల యొక్క సృష్టిని గూర్చి నేను మీకు చెప్పితిని. దానిని గూర్చియే పూర్వము శంయువు' తన తండ్రియయిన బృహస్పతిని గూర్చి ప్రశ్నించెను. . (38) పుత్రుఁడైన శంయువు వినయాన్వితుఁడై సర్వ జ్ఞానార్థ కోవిదుఁడును, ఆసీనుఁడునై యున్న బృహస్పతిని గూర్చి యీ ప్రశ్న అడిగెను. పితృదేవతలని పిలువఁబడు వీరెవరు? వారెంతమంది? వారి నామములు క్రమముగా నెవ్వి? వారెట్లు సముద్భవించిరి? వారు పితృత్వము నెట్లు పొందిరీ? (40) ఎందుండి పితరులు పూర్వము యజ్ఞమును నిత్యమును పరిపోషించి అభివృద్ధి పరచిరి? మొట్టమొదట ఈ మహానుభావులకు శ్రాద్ధ క్రియ లేట్లు కలిగినవి? (అవీ యెందులకు కలిగినవి?) శ్రాద్ధ క్రియలను ఎవ్వరికి ఆచరింపవలయును? శ్రాద్ధ క్రియల నొనరించినఁ గలుగు మహాఫలమేమి? శాశ్వత గుణములు గలిగిన నీ శ్రాద్ధము లాచరింప పవిత్ర స్థలములు నదులు తీర్థములేవి? (42) ద్విజోత్తముఁడు ఎందు (ఏ ప్రదేశమున) శ్రాద్ధమాచరించి సర్వ సంపదలను పొందును? శ్రాద్ద మాచరించుటకు కాలమేదీ (సమయమేది)? ఆ సమయాసమయముల గూర్చీ విధి నిర్ణయ మెట్లున్నది? ఓ భగవన్ ! మీరు నన్నడిగిన విషయమును సవిస్తరముగానేను క్రమశః చెప్పియుంటిని. మహామతి యయిన బృహస్పతి ఈ విధముగా ప్రశ్నింపఁబడి ప్రశ్న వీదుదులలో శ్రేష్ఠుఁడయిన యాతఁడు ఈ విధముగా ఆనుపూర్వీకముగా చక్కగా చెప్పియుండెను.

బృహస్పతి ఇట్లు చెప్పెను.

ఓ వత్సా ! ఎయ్యది నీవు వినయమున, యథా న్యాయము గంభీరముగా ప్రశ్నించి యడిగితివో దానిని నేను నీకు చెప్పెదను. (46)

            అప్పుడు, దివి (స్వర్గము) అంతరిక్షము, పృథివి, నక్షత్రములు, దిక్కులు, సూర్యచంద్రులు, అట్లే అహోరాత్రములు లేవు (కలిగి యుండ లేదు). అప్పుడీ ప్రపంచ మంతయును చీకటిచే నిండియుండెను. అప్పుడు ఒక్కడే యొక్కడయిన బ్రహ్మ ఇతరు లెవ్వరును ఆచరింపలేని తీవ్రము పరమమునయిన తపస్సాచరించెను. బ్రహ్మవిత్తముఁడు సర్వవేదముల నెంగినవాడు, సర్వజ్ఞానవిదులలో శ్రేష్ఠుఁడును నయిన తండ్రిని శంయువు మరల నడిగెను. 'సర్వ భూతేశుఁడయిన ప్రజాపతి ఎట్టి తపస్సు నాచరించెను'? అని బృహస్పతి చెప్పెను. తపస్సు లన్నింటిలో శ్రేష్ఠతమమయిన తపస్సును ఆతఁడాచరించెను. ఆ తపస్సును 'యోగమందురు. భగవంతుఁడయిన ప్రజాపతి ధ్యాన మాచరించి లోకములను సృజించెను. (50) బ్రహ్మ లోకచక్షువు. ఆ దివ్య చక్షువుచే బ్రహ్మ భూతభవిష్యత్ జ్ఞానమును, సర్వలోకములను, వేదములను, అమృతమయములు శాశ్వతములయిన యోగములను, సృష్టించెను. (51) ఆతనిచే సృష్టింపఁబడిన లోకములు 'సంతానక' నామకములు. ఆ లోకములలో భాస్వంతులయిన 'వైరాజ' వంతులని ప్రఖ్యాతి పొందిన దేవతలు నివసింతురు. వారు స్వర్గమున, దేవతలకు దేవతలు, (52)అంతకు పూర్వమే యోగముచేతను తపస్సు చేతను యుక్తుడయిన బ్రహ్మ దేవతలను సృష్టించెను. వారు సనాతనులు బ్రహ్మయోగ యుక్తులు. (53) వారందరు 'ఆది దేవతలు'గా ప్రసిద్ధులు. వారు సహజముగా మహాసత్త్వులు. మహాశక్తిమంతులు. వారు సర్వకామప్రదలు. వారు సర్వదేవ దానవ మానవులచే పూజారులు. వారిలో ఏడు గణములున్నవి. వారందరు త్రైలోక్య పూజితులు. వారిలో మువ్వురు మూర్తి (రూప) రహితులు. ఆకార విశేషములు లేనివారు. మరియు వారిలో నలుగురు సమూర్తులు, రూపవంతులు. (55) భావమూర్తులయిన వారు వారిలో మువ్వురు వారీ ఉపరితలమున నుందురు (ఉపరిష్టులు) అనగా సూక్ష్మరూపులు. వారికి క్రింద నల్గురున్నారు. వారు సూక్ష్మమూర్తులు. తరువాత దేవతలు గలిగిరి. తరువాత భూమీ కలిగెను. ఇదియే లోకపరంపర. వారు ప్రపంచమున వర్షింతురు. పార్టీ నుండియే మేఘములు ఉత్పత్తి నొందినవీ, (57) ధన్యము (అన్నము) (ఇతర భోజన పదార్ధములు) పర్జన్యుల నుండి పడిన వర్షముచే వృద్ది పొందును. (ఇది ప్రజా ప్రపంచ సృష్టి). పోనీ వలన (మేఘముల వలన) వారి యోగబలముచే సోమము, అన్నము, వృద్ది పొందుటచే, వారు లోకములకు పితరులుగా లోక సత్తములుగా చెప్పబడినారు. వారు మనోజవులు, వారు 'స్వధను భుజించెదరు. వారు సర్వకామ పరిష్కృతులు. వారు లోభమోహభయాదులు లేనివారు. నిశ్చింతులు శోకవర్ణితులు, వారు వారీ యోగమును (పైన చెప్పఁబడిన లక్షణములను) పరిత్యజించి సుదర్శననాములయిన లోకములను పొందిరి. (60)

            వారు దివ్యులు, పుణ్యవంతులు, పాపరహితులు, మహాత్ములు నగుదురు. తరువాత సహస్ర యుగముల యనంతరము వారు బ్రహ్మవాదులుగా నగుదురు. (ఆధ్యాత్మిక విద్యావంతులు అగుదురు). మూర్తి రహితులు (అమూర్తులు - రూపము లేనట్టివారు) మరల వారీ యొక్క యోగశక్తులను పొంది, మోక్షమును పొందెదరు. ముక్తులగుదురు. వ్యక్తావ్యక్తమును పరిత్యజించి (దేహమును విడిచి) (రూపమును ధరించుట, రూప రహితులుగ నుండుట) వారి యొక్క మహా యోగబలమున, వారు ఉల్కలవలె (తోకచుక్కలవలె లేక విద్యుత్ర్పభవలే మెఱుపువలె) అదృశ్యులగుదురు. (నశించెదరు). (63) శరీరములను విడిచిన తరువత, వారీ యోగ బల సహాయమున, వారు (నిరాఖ్యోపాస్యతను) ఇతరులచే పూజింపఁబడు, ఉపాసింపఁబడు స్థితిని, నదులు సముద్రములో కలిసి పేరు లేని వగునట్లు నామరహిత స్థితిని పొందుదురు. ప్రయత్న పూర్వకముగా వేద విధులను ఆచరించుట చేతను, గురు పూజలచేతను, వారు యాగములను చేయుదురు. (64) శ్రాద్ధముల వలన ప్రీతులయిన పితరులు యోగశక్తులను పొంది, ఆ యోగ శక్తిచే సోమమును వృద్ధి పరచి, బలపరచి, తన్మూలమును మూఁడు లోకముల వారు జీవింప జేయుదురు. (65) అందుచే గొప్ప యోగశక్తిని పొందుటకు శ్రాద్ధము సదా ఆచరించవలెను, నీజముగా యోగము పితరుల యొక్క శక్తి. సోమము (చంద్రుఁడు) యోగము వలన ప్రవర్తించును. (66) ఒకఁడు శ్రాద్ధ సమయమున వచ్చీనట్టి వేయి వందల బ్రాహ్మణులకు భోజనము పెట్టవలయును. లేదా శ్రాద్ధ సమయమునకు వచ్చిన ప్రతివ్యక్తికి భోజనము పెట్టవలయును. వినుము, మంత్రజ్ఞు నొక్కనికి భోజనము పెట్టిన వేయివందల మందికి భోజనము పెట్టుటతో సమానము. తన యింటికి వచ్చిన యెంతమందియైన మంత్రజ్ఞులకు భోజనము పెట్టవచ్చును. (స్నాతకులు గృహస్థులు) వినుము. ఒక్క స్నాతకుఁడు గృహస్థు పూజింపఁబడిన ఆ మంత్రజ్ఞులందరిని పూజించుటతో సమమగును. (మంత్రజ్ఞుల పూజించుటతో తుల్యము స్నాతకుల పూజించుట), వేయి మంది మంత్రజ్ఞులగాని, వేయి మంది స్నాతకులగాని చేసిన భోజనము ఒక్క యోగాచార్యుడు చేసిన భోజనముతో సమానము. అయ్యది మహా భయము సుండి రక్షించును. (70) గృహస్థ సహస్ర సంఖ్యకు, వానప్రస్థ శతమునకు, బ్రహ్మచారి సహస్రమునకు పెట్టిన భోజనము కంటే యోగి కొకనికీ పెట్టినది అధికమయినది. (శ్రేష్ఠతమము). ప్రజాపతి ఇట్లు చెప్పెను. 'నాస్తికుఁడు’ కాని అధర్మపరుఁడు కానీ సంకీర్ణవంశ్యుఁడు కాని తస్కరుఁడు కాని- యోగికి శ్రాద్ధకాలమున భోజనము పెట్టుట కంటే వేటిక క్రియచే మోక్షమును (తరణమును) పొందజాలఁడు”. పుత్రుఁడు' కాని, పౌత్రుఁడు కాని ఒక్క ధ్యానికి భోజనము పెట్టినచో మంచి వర్షము పడిన కర్షకులు సంతోషించునట్లు పితరులు సంతుష్టులగుదురు. (72) ధ్యాన నిష్టులు లభింపకపోయినచో, బ్రహ్మచారీకి భోజనము పెట్టవలెను. ఒకవేళ బ్రహ్మచారీయు లభ్యుఁడు కాని పక్షమున ఉదాసీనుఁడయిన గృహస్థునకు భోజనము పెట్టవలయును. (ఉదాసీనుఁడు ప్రాపంచిక విషయములందాసక్తి లేనివాఁడు). (73)

బ్రహ్మాను శాసన మిట్లున్నది.

వందయేండ్లు ఒంటి కాలిపై నిలఁబడి, వాయు భక్షకుఁడై తపమాచరించు వానీకంటే ధ్యానయోగి గొప్పవాఁడు (ఉత్తముఁడు). (74) అమిత తేజస్వులయిన పితరులలోని ప్రథమగణము గూర్చి యిప్పుడు చెప్పఁబడినది. ఈ పితృగణము సర్వలోకములను పవిత్రీకరించుచు ఎల్లప్పుడును నుండును. ఇంక, ఇకముందు పితరులలోని సర్వగణములను గూర్చి వారి సంతతిని గూర్చీ భావనా సంస్థితిని గూర్చి యథా క్రమముగా చెప్పెదను. (76)

ఇది వాయుప్రోక్తము మహాపురాణము అయిన బ్రహ్మాండపురాణమున, మధ్యభాగమున తృతీయోపాద్ఘాతపాదము నందు పితృకల్పమను నవమాధ్యాయము.