బ్రహ్మాండ మహా పురాణము
34 - దిక్పాలాదిశివలోకాంతరకథనం
అగస్త్యుడనెను :- రుద్రుడధిదేవతగాగల షోడశావరణచక్రమన నేమి? అచట నున్న రుద్రులు ఏ పేరులతో వీలుపబడిరి-1, ఏయే యావరణ బింబములలో, వారు ఏయే పేరులతోనుందురు. వారి పేరులు యౌగికములా? వారు చేయుపనిని బట్టి (నటనము జేయుట వల్ల వచ్చిన 'నటి' మొదలగువాని వలె) వచ్చినవా? రూఢములా! (డిత్తుడు డపిత్తుడు. మొదలగు. పేరులవలె వారుచేయుపనీ వల్ల గాక కేవలము నిరర్థకముగా బెట్టిన పేరులవంటివా?) దయానిధీ, చెప్పుము-2.
హయగ్రీవుడనెను:- అచట ముత్యముల గుంపుతో నిర్మింపబడిన రుద్రాలయముగలదు. అదీ ఐదు యోజనములవిస్తారము ఐదు యోజనముల పొడవుతో నొప్పును-3. పదునాలు ఆవరణములతో గూడినది. మధ్య పీఠముతో మనోహరమైనదీ. ఆమధ్య పీఠమున మండుచున్న కోపము గలిగి ఎక్కుపెట్టిన ధనువు గలిగి ముక్కంటియైన రుద్రుడు ఎల్లప్పుడుండును. ఓ మునీ! ఘటోద్భవా! త్రికోణమున ముగ్గురు రుద్రులు చెప్పబడిరీ-5, (రుద్రాధ్యాయమున ‘2వ అనువాకనామములు పురాణకారునితో స్వీకరించబడినవి) వారు హిరణ్య బాహువు, సేనాని, చీక్కులకు పతి (దీక్పతి) యనుపారు. (తేజోవంతమైన బాహువులు గలవాడు, సేనానాయకుడు కుమార స్వామి రూపుడు ఆత్మావైపుత్రనామాసియనుసూక్తి వలన శివపుత్రుడు శివుడేయగును- దిక్కుల కన్నింటికిని పతియైన వాడు అష్టమూర్తి). వృక్ష స్వరూపులు, బంగారు వర్ణపు (కోతి వర్ణపు) వెంట్రుకలు గలవారు, ఉత్తముడైన పశుపతి శష్పింజరుడు, (లేతగడ్డివలే పచ్చనైనవాడు. పసుపు ఎఱుపు గలిసిరంగు గలవాడు.) త్విషీమంతుడు (కాంతిమంతుడు), పథీనాంపతి శ్రాస్తోక్తములైన దక్షిణ - ఉత్తర - తృతీయమార్గములను అర్చిరాది మార్గములకుగు పతియైన వాడు. - వీరు ఆుకోణములందున్నవారు, బభ్రుశులు (వృషభవాహనులు), వివ్యాధి (శత్రువుల వేధించువాడు), అన్నపతి, హరికేశుడు ఉపవీతి (యజ్ఞోప వీతముగలవాడు), పుష్టానాంపతి (అన్నివిధముల పుష్టిజెందినవారికిని ప్రభువైనవాడు), భవుడు, హేతి (శత్రువులకు ఆయుధ స్వరూపుడు). వీరు ఎనిమిది కోణము లందుండుపారు. తరువాత పది దళములు గలయావరణమున (చుట్టునందు) ఉండుపారు - మొదటివాడు జగతాంపతి (జగముల ప్రభువు) రుద్రుడు, ఆతతావి (విస్తారధనువుచే రక్షించువాడు. - విస్తారముగా నంతటను రక్షించువాడు) క్షేత్రపతి, సూతుడు (యజ్ఞమునకు సంబంధించిన దారు కర్మచేయువాడు-సారథి) నేను (వక్త హయగ్రీవుడు), వనపతీ, రోహితుడు (ఎఱ్ఱనివాడు) స్థపతి (బ్రృహస్పతిష్టి చేతయజ్ఞమును స్థాపించువాడు) (7,8,9,10) (శిల్పి), వృక్షపతి, వీరందరెప్పుడును ధనువునేక్కుపెట్టి సిద్దముగా నుందురు. మంత్రి మంత్రాలోచనకుశలుడు), వాణిజుడు (వర్తక స్వామి), కక్షపతి (వనములోని పొడలను పాలించువాడు) నాలుగవవాడు భువంతి (భూమిని విస్తరింపజేయువాడు) ఐదవపాడు వారివుడు (ధన ప్రభువు) ఓయగస్త్యా! ఓషధీపతి అవవాడు-(11;12). ఉచ్చైర్ఘషుడు (బిగ్గరగా. నరచువాడు), ఆక్రందయంతుడు (శత్రువులనేడ్పించువాడు), పతిపతి (ప్రభువులకు ప్రభువు), కృత్స్నవీతుడు మొత్తము విశ్వమునే రక్షకై చుట్టినవాడు-చుట్టబడిన సైన్యము గలవాడు, ధావంతుడు శత్రువులను పరుగెత్తే వెంటాడువాడు. సత్త్వనాంపతి (శరణాగతులైన సాత్త్వికులను పాలించువాడు)-13, - ఈ పండ్రెండుగురు పంచమావరణమున పండ్రెండు దళములలో నుండువారు. సహమానుడు (భక్తుల దోషముల సహించువాడు-శత్రువులను తిరస్కరించువాడు, నిర్వ్యాధి (నిశ్శేషముగా వ్యాధి లేనివాడు-విరోధులను మిక్కిలి బాధించువాడు), అవ్యాధీనాం ప్రతి (వ్యాధికానీ వానికీ ప్రభువు అంతటను బోధించు శూరులసేనలకు ప్రభువు}-14. కకుభుడు (సూర్యుని ప్రకాశింపజేయువాడు), నీషంగి (నిండైన యమ్ములపొది గలవాడు, స్త్రీనానాంపతి (దొంగలను తన యధీనమున నుంచుకోను. ప్రభువు) నిచెరువు (నిశ్శేషముగా వీశ్వమంతటను చరించువాడు)-వీరు ఆతవ యావరణమునందలి రుద్రదేవతలు-15. పరీచరుడు (విశ్వమునంతయు చుట్టి తీరుగువాడు), అరణ్యపతి (అరణ్యపాలకుడు), సృకావీ (వజ్రమునే రక్షించువాడు-వజముచే రక్షింపబడిన శరీరము గలవాడు వజ్రశరీరుడు), జిఘాతుడు (శత్రువులకు ఘాతకచోరస్వరూపుడు.) దొంగలకు ప్రభువై వారిని దొంగతనము చేయకుండగా నియమించువాడు} అసిమంతులు (ఖడ్గధారి), సుప్రాజ్ఞుడైన నక్తంచరుడు (ప్రజ్ఞానియై రాత్రియందు జాగరముగా నుండువాడు-యానిశా సర్వభూలానాం తస్యాం జాగర్తి సంయమి). ప్రకృతిపతి (ప్రజలందరికీని పాలకుడు), ఉషీషి (తలపాగా గలవాడు), గీరిచరుడు (హిమగిరి కైలాసములచరించువాడు), కులుంచానాంపతి (గృహక్షేత్రాలను దొంగలనుండి కాపాడువాడు), ఇషుమంతులు (అమోఘమైన బాణములు గలవారు), ధన్వావిదులు .. (ధనువులతో రక్షించువారు), ఆతన్వానులు (ధనువులతో బాణములను శత్రువులపై విస్తరింపజేయువారు), ప్రతిదధానులు (శత్రువులపై బాణముల నెక్కుపెట్టుచున్నవారు)-15, 16, 17, 18. అచ్చంతులు (ఎక్కుపెట్టి బాణములను లాగువారు)- ఈ పదునాలుగురు పదునారు దళములందుండువారు. వీసృజంతులు (బాణములను ప్రయోగించువారు), అస్యంతులు (బాణములను లక్ష్యములలోనుంచు (చేరునట్లు చేయు వారు), విధ్యంతులు (బాణములను లక్ష్యములను ఛేదించునట్లు చేయువారు), ఓ యగస్త్యా-19. ఆసీనులు (కూర్చున్నవారు), శయానులు (శయనించువారు), జాగ్రతులు (మేలుకొని యుండువారు), తిష్టంతులు (నిలబడువారు), ధావంతులు (పరుగెత్తువారు), సభాస్వరూపులు, సభాధిపులు, -20. అశ్వస్వరూపులు, అశ్వపతి స్వరూపులు, అవ్యాధినులు (అంతటను బాధింపగల స్త్రీ స్వరూపులు) వివిధ్యంతులు (బాణములతో లేక శూలములతో మిక్కిలి క్రుచ్చి కుచ్చి బాధించు స్త్రీ మూర్తి స్వరూపులు), గణాధ్యక్షులు (గణములపతుల స్వరూపులు), (రుద్రమున ఉగణులు ఉత్కృష్ట గణరూప సప్తమాతృకాది స్త్రీ మూర్తి స్వరూపులు), బృహంతులు (రుద్రమున తృంపతులు=హింసన సమర్థ స్త్రీ స్వరూపులు), విశాల స్త్రీ స్వరూపులు, వింధ్య మర్దనుడవైన యో యగస్త్యా!-21. గృత్సుడు (ప్రాపంచిక సుఖములకు లోభించిన వారి స్వరూపులు) - ఈ యెనమండుగురు అష్టమావరణమున నుండు దేవతలు, గృతాధిపతులు (విషయలంపట పాలకులు), వ్రాతులు (నానాజాతీయ సంఘ స్వరూపులు), వ్రాతాధిపులు (నానాజాతీయ సంఘపాలకులు)-22. గణులు (ప్రమథ గణ స్వరూపులు), గణపులు ( ప్రమథ గణపాలక స్వరూపులు), విశ్వరూపులు (గజతురగాదీ విశ్వప్రాణి స్వరూపులు), విరూపకులు (వికృత నగ్నాది స్వరూపులు), మహాంతులు (అణిమాది మహత్స్వరూపులు), క్షుల్లకులు (అణిమాద్యైశ్వర్య హీనులు), రథులు (రథములు గల వారి స్వరూపులు), అరథులు (రథములు లేనివారి రూపులు)-23. రథులు (రథ స్వరూపులు), రథావయవస్వరూపులు వేద స్వరూపులు, “మ.భా.హయాంశ్చచతురోవేదాన్ సర్వవేదమయంరథమ్) రథపతులు, సేనాస్వరూపులు, సేనానాయక స్వరూపులు, క్షత్తలు (సారథి స్వరూపులు), సంగ్రహీతలు (యుదోపకరణముల సంగ్రహించువారు), తక్షులు (వడ్రంగులు), రథ కారకులు (రథముల జేయువారు)-24. కులాలుడు (కుమ్మరివారు)-వీరందరూ రుద్రులు. వీరు తొమ్మిదవ యావరణమునందలి దేవతలు, కర్మారులు (కమ్మరిపారు), పుంజిష్టులు (సమూహము నందుండువారు-పక్ష్యాదీ సమూహముల జంపువారు), నిషాదులు (వేటగాండ్రు), ఇసుకృత్తుల గణములు (బాణములను జేయువారీ సమూహములు)-25. ధన్వకారులు (ధనస్సులను జేయువారు), మృగయులు (వేటకాండ్రు), శ్వనయులు (కుక్కలను గొలుసులు గట్టినడుపువారు) శ్వానులు (శునక స్వరూపులు), అశ్వములు, అశ్వపతులు (ఇచట రుద్రమును బట్టి శ్వములు శ్వపతులు - అనీ యుండవలెను. 21వ శ్లోకములో అశ్వములు అశ్వపతులు చెప్పబడినారు), భవుడు (ప్రాణుల యుత్పత్తికి కారణుడు), రుద్రుడు (రోదన హేతు దుఃఖమును ద్రవింపజేయువాడు)-26. శర్వుడు (ప్రళయమున భూతములను హింసించువాడు), పశుపతి (జీవులను సంసారబంధమునుండి రక్షించువాడు, నీలగ్రీవుడు (నల్లని కంఠము గలవాడు), శతకంఠుడు (తక్కిన కంఠము తెల్లగా నున్నవాడు), కపర్ది (జటాజూటము గలవాడు), వ్యుప్తకేశుడు (ముండితకేశుడు - విశేషముగా నాటుకొని మొలచిన వెంట్రుకలు గలవాడు - ఊర్థ్వకేశుడు), సహస్రాక్షుడు (అనంత నేత్రములు గలవాడు), శతధన్వుడు (నూరు ధనువులు గలవాడు), గిరీశుడు కైలాసగిరియందు శయనించువాడు), శిపివిష్టుడు (చర్మమును ధరించిన వాడు కిరణములతో వ్యాపించిన సూర్యరూపుడు, హరిహర స్వరూపుడు), ఓ యగస్త్యా! మీఢుషముడు మేఘరూపమున. మిక్కిలి వర్షించువాడు- వీర్యముతో మిక్కిలి తడుపువాడు) -, ఈ పదుగురు. పదియవ కాలమున (ఆవరణమున) నున్నవారు-28. ఇక పదునొకండవ చక్రమున (ఆవరణమున) నున్న రుద్రులు వీరు-ఇషుమంతుడు (బాణధారి), ప్రస్వుడు (అణురూపుడు), వామనుడు (పొట్టేవాడు - వామన స్వరూపుడు), బృహంతుడు (ఆకారమునవిశాలుడు), వర్షీయసుడు (మిక్కిలి వృద్దుడు, అన్నింటికన్న పెద్దవాడు అనలస్తంభలింగరూపమున వృద్ధుడు, గుణవృద్ధుడు) వృద్దుడు (వయస్సుచే అధికుడు), సమృద్ధి (సంపన్నుడు)-29. అగ్ర్యుడు (జగదుత్పత్తికి ముందున్నవాడు), ప్రథముడు (అన్నింటికి ముందున్నపోడు - సభా ప్రథముడు), ఆశువు (తొందర గలవాడు - వేగము గలవాడు), అజీరుడు శబ్దాది విషయ స్వరూపుడు-(గతికుశలుడు), శీఘయుడు (శీఘ్రగామీ), శీభ్యుడు (నందీశ్వర స్వరూపుడు,ఉదక ప్రవాహామున నుండువాడు), ఊర్మి స్వరూప రుద్రుడు {అలల స్వరూపరుద్రుడు), అవసనరుద్రుడు (ధ్వనిలేని స్థిరజలమున నుండు రుద్రుడు), ప్రోతస్యుడు (ప్రవాహము నందున్నవాడు), ద్వీప్యుడు (జలమధ్య భూమియందున్నవాడు)-30. జ్యేష్ఠుడు (విద్వేశ్వర్యాదులచే నధికుడు), కనిష్ఠుడు (విద్యేశ్వర్యాదులు లేని నిర్గుణుడు), పూర్వజుడు (సృషాదిలో హిరణ్య గర్భరూపుడు), అవరజుడు (జగదవసానమున సంహారమునకై కాలాగ్నిరూపుడు), మధ్యముడు (ఆద్యంతముల మధ్యకాలమున దేవతిర్యగాదీరూపుడు), అవగమ్యుడు (రుద్రమున అపగల్భుడు -అపగల్భాయచ అని. యున్నది. అప్రొడడు బాలుడు) (తెలియదగినవాడు), జఘన్యుడు (గ్రవాదులకు వత్సరూపమున నున్నవాడు)-31. బుద్యుడు (వృక్షాదుల మూలశాఖారూపుడు - సంసార వృక్షమునకు మూలరూపుడు), సోభ్యుడు (పుణ్యపాపములతో లోకమున బుట్టిన వాని స్వరూపము గలవాడు), ప్రతిసర్యుడు (వివాహ కంకణమున కర్ణుడు - భూషణమాలలు ధరించినవాడు-సేనల వెనుక రక్షకుడు), యామ్యకుడు (యమలోకమున పాపి శిక్షకుడు)-32. క్షేమ్యుడు (మోక్షారుడు), వోచవుడు (ఇచట రుద్రమున ఉర్వర్యాయచయనియున్నది. కాబట్టి క్షేమ్యోర్వర్యోద అని పాఠముండవలె. వోచవుడు -%) ఉర్వర్యుడు. (సర్వసస్యములతో నొప్పిన భూస్వరూపుడు), ఖల్యుడు (కళ్లము రూపమునందినవాడు), శ్లోక్యుడు వైదిక మంత్ర స్వరూపుడు - వైదీక మంత్ర ప్రతిపాద్యుడు), అవసానకుడు (వేదాంత ప్రతిపాద్యుడు-ఉపనిషత్పతపాద్యుడు), వన్యుడు (వనవృక్షాదిరూపుడు), కక్ష్యుడు (షోదయందు లతాదిరూపుడు), శ్రవుడు (శబ్దరూపుడు), ప్రతిశ్రవుడు (ప్రతిధ్వనిరూపుడు)-33. ఆశుషేణుడు (వేగవంతమైన సేనాస్వరూపుడు), ఆశురథుడు (వేగవంతమైన రథస్వరూపుడు), శూరుడు (యుద్ధధీరరూపుడు), అవభిందుడు (శత్రువులను సంహరించువాడు), వర్మి (కవచధారి), వరూధి (రధరక్షకమును, రథిక రక్షకమును నైన వ్యాఘ్రచర్మ స్వరూపుడు), బిల్మీ (యుద్దమున బిలములతో రంధ్రములతో గూడిన శిరస్త్రాణము గలవాడు-చీల్చి చెండాడువాడు)-34 కవచి {కవచము గలవాడు), శ్రుతుడు (వేదములందు వినబడినవాడు -ప్రసిద్ధుడు), సేనుడు (రుద్రమున శ్రుతసేనాయచ అని యున్నది వేద ప్రసిద్ద సేనానీ అనీ యర్ధము) (సేనా స్వరూపుడు), దుందుభ్యుడు (భేరి స్వరూపుడు), అహనన్యుడు (భేరిని మ్రోయించు దండ స్వరూపుడు), ధృష్ణుడు (యుద్ధమున వెనుజూపనివాడు - దిట్టముగా శత్రువులనెదురింపగలవాడు) - వీరు పదునొకండవ యాచరణమున నున్న రుద్రులనబడినవారు. ఇక పండ్రెండవ యావరణమున నున్న రుద్రులు మహాకాయులు మహాబలులును-35. ప్రమశులు (స్వపర సైన్య వృత్తాంతముల పరామర్శించువారు), దూతలు (పరసైన్య వృత్తాంతముల తెలియజేయ నేర్పరులైన దూతల రూపము వహించినవారు), ప్రహితులు (దౌత్యమునకుగాని గూఢచర్యమునకుగానీ పంపబడిన వారి రూపమునందినవారు), నిషంగులు (నడుము ప్రక్కన వ్రేలాడు కోశములో నున్న ఖడ్గములు గలవారు), ఇషుధిమంతుడు (అమ్ములపొదులు గలవాడు), తీక్షేషువు (వాడియైన బాణములు గలవాడు), ఆయుధ (బహువిధములైన ఆయుధములు గలవాడు)-36. స్వాయుధుడు (తనదైన యాయుధము త్రిశూలము గలవాడు), సుధన్వుడు (శోభనమైన పినాకమనుధనువు గలవాడు), సృత్యుడు (సన్మార్గ స్వరూపుడు కాలీబాట స్వరూపుడు, పథ్యుడు (సన్మార్గమున హితుడైనవాడు రథాదులుబోవు విశాలమార్గస్వరూపుడు, కాప్యు (కసంబద్ధుడు-ఇచట రుద్రమున కాట్యాయచయని యున్నది ఐ కాలువ యందున్న జలస్వరూపుడు), నాట్యుడు (నాట్యస్వరూపుడు. (ఇచట “నీప్యాయచ' - నీప్యుడు అనీ రుద్రమున నున్నది. అర్థము కడిమిచెట్టు స్వరూపమున నున్నవాడు కాలువలోని జలస్వరూపమున నున్నవాడు), సూదుడు (బురద ప్రదేశమున జలరూపుడు-వంట జేయువాడు), సరస్యుడు (సరస్సులో జలరూపుడు)-37. నాథమానుడు (ప్రార్థించువాడు ఇచట రుద్రమున 'నాద్యాయచ' అని యున్నది. సాద్యుడు=నదీజల రూపుడు), వైశంతుడు (అల్పసరోజలరూపుడు), కుప్యుడు (వెండి బంగారులు గాని యితర లోహముల స్వరూపమునందినవాడు. (ఇచట “కూప్యాయచ' అని రుద్రము. కూపజలరూపుడని యర్థము), (దీని తరువాత “అవట్యాయచ' అని రుద్రమున నున్నది అదీ వదిలివేయబడినది అర్థముభూరంధ్రజలరూపుడు. వర్యుడు (వర్షజలరూపుడు), "అవర్యుడు (వర్షనిరపేక్షిత జలరూపుడు), మేఘ్యుడు (మేఘస్థ జలరూపుడు), విద్యుత్యుడు (మెఱుపుతోడిచరించు రూపుడు-మెపుతో చరించువాడు)-38. ఈధ్యుడు (నిర్మల శరత్కాల మేఘస్తుడు), ఆతప్యుడు (ఎండతో వర్షించిన జలరూపుడు), వాత్యుడు (వాయువుతో గూడిన జలరూపుడు-సుడిగాలి వాన రూపమునందినవాడు), రేష్మియుడు (ప్రళయకాలమునందలి వడగండ్ల వర్షరూపమునందినవాడు), వాస్తవ్యుడు. (గవాదిపశుధనముందును వాని సుఖమునను ఉన్నవాడు), వాస్తుపుడు (గృహనిర్మాణ భూమి పాలకుడు), సోముడు (ఉమాదేవితో గూడియున్నవాడు చంద్రస్వరూపుడు, వీరు పండ్రెండవ యావరణమున నున్న మహాబలులైన రుద్రులు-39. ఓ మునీ! పదమూడవ యావరణమందున్న రుద్రులను వినుము. రుద్రుడు (రోదనమూల దుఃఖ హరుడు), తాముడు (ఉదయ సూర్యునివలె నేనైనవాడు), శంగుడు (సుఖమును బొందించువాడు), పశుపతీ (పశుపాలకుడు-జీవులను రక్షించువాడు), ఉగ్రుడు {శత్రుభయంకరుడు), భీముడు (విరోధి భయంకరుడు), అగ్రేవధుడు (ఎదుటనే చంపువాడు, దూరేవధుడు (దూరమున గూడ జంపువాడు), హంత (చంపువాడు), హనీయసుడు (అందరిని సంహరించువాడు), (హననక్రియ జరుగుచోట నెల్ల హంతయైనవాడని భావము), వృక్షుడు (కల్పవృక్షాది వృక్షస్వరూపుడు), హరికేశకుడు (హరితకేశములు గలవాడు), (లేదా హరికేశక వృక్షుడు, హరీతకేశములు గల కల్పవృక్షాది వృక్షస్వరూపుడు), శారుడు (ఓంకార ప్రతిపాద్యుడు, శంభుడు (విషయ సుఖమును గలుగజేయువాడు) మయోభువు (మోక్షసుఖమును గలుగజేయువాడు), శంకరుడు. (లౌకిక సుఖమును గలుగజేయువాడు), మయస్కురుడు = (మోక్షసుఖమును గలుగజేయువాడు), శివుడు (పంచాక్షరీ మంత్ర ప్రతిపాద్యుడై శివైక్య భావము నిచ్చువాడు, కళ్యాణరూపుడు), శివతరుడు' (అతిశయించి కళ్యాణకరుడు -- ఇతరులకు కూడా కళ్యాణకారి) తీర్యుడు (ప్రయాగాది తీర్థములందుండువాడు), కూల్యుడు (నదీ తీరములందు శ్రీంగరూపమున నుండువాడు), పార్యుడు. (సంసార పర తీరమును జేర్చువాడు, ముముక్షు ధ్యేయుడు) అవార్యుడు (సంసారమధ్యమున కామ్యఫల ప్రదుడుగా, ఎవ్వానికిని వారింపనలవికానివాడు), ప్రతారణుడు (ప్రకృష్టమంత్రజపాదులతో పాపములనుండి తరింపజేయువాడు), ఉత్తరుడు ఊర్థ్వలోకములకు తరింపజేయువాడు-42. ఆతార్యుడు (కామ్యకర్మల ఫలములనిచ్చి మరల సంసారమునకు జేర్చువాడు), ఆలాద్యుడు (కర్మఫలముననుభవించు జీవునకు ప్రేరకుడు), శషుడు గంగాతీరాదులందలి కుశాదీ తృణరూపుడు), రుద్రమున క్రమానుసారముననిదీకలదు, కాని యిచట నదివదిలి వేయబడినదీ.) ఆరవవాడు ఫేన్యుడు (నదీమధ్య నురుగు రూపము నందినవాడు), వీరు త్రయోదశావరణగతరుద్రులు. ఇక పదునాలుగవయావరణము నందలి రుద్రులు. వీరు -43. సికత్యుడు (ఇసుక నేల రూపుడు), ప్రవాహుడు (ప్రవాహస్వరూపుడు), ఇరిణ్యుడు (చవిటినేలలో బుట్టిన పదార్ధ స్వరూపుడు), ప్రపథ్యుడు (బ్రహ్మసేవిత మార్గస్థుడు), కింశీలుడు (చిన్నరాళ్లు గల ప్రదేశ రూపమునందినవాడు), క్షయణుడు (నివాస యోగ్య దేశ స్వరూపుడు)-44. కపర్ది (జటాబంధము గలవాడు), పులస్త్యుడు (భక్తుల యెదుట నుండువాడు), గోష్యుడు (గోశాలలోని వస్తురూపుడు), గృహ్యుడు (గృహవస్తురూపుడు), తల్యుడు (మంచమున పరుండువానియాకారమున నున్నవాడు), గేహ్యుడు (ధనికుల భవనమందుండువాడు), కాట్యుడు (దుర్గమారణ్య స్వరూపుడు), ఉరుదీపకుడై గహ్వరేషుడు గొప్పదీపమై విషమమైన గీరిగుహాదులలో నుండువాడు)-45. {ఇచట రుద్రములోని క్రమాగతమైన హ్రదయ్యాయచ-హ్రదయ్యుడు అర్థము నీటిమడుగు రూపుడు వదిలివేయబడినది), నివేష్యుడు (నీహారజల స్వరూపుడు), పాంగవ్యుడు (పరమాణువులందుండువాడు), రజస్యుడు (ధూళియందున్నవాడు), శుష్క్యుడు (ఎండుకట్టెలందుండువాడు), హరిత్యుడు (ఆర్టస్వరూపుడు), లోప్యుడు (కఠిన ప్రదేశ స్వరూపుడు), ఉలప్యుడు (బ్బజతృణ (మొదేపు రెల్లుగడ్డి) స్వరూపుడు), ఉర్యుడు (భూపదార్థ రూపుడు), సూర్యుడు (చక్కని యలలుగల నదీరూపుడు)-46 పర్జ్యుడు (ప్రత్రస్వరూపుడు), పర్ణశద్యుడు (శుషుపర్ణ సమూహ స్వరూపుడు), అవగురమాణుడు (ఎత్తిన యాయుధముల రూపమునందినవాడు), అభిఘ్నంతుడు (ప్రహర్తృరూపుడు - ఎదుటనుండగనే చంపువాడు), ఆక్టిదంతుడు . (కొంచెము దుఃఖింపజేయువాడు), ప్రక్లిదంతుడు (మిక్కిలి దుః భీంపజేయువాడు), కిరీకులు (భక్తులకు ధనము లోసగువారు)-47. దేవానాంహృదయులు (దేవతలకు హృదయస్వరూపులు)--ఈముప్పది యిరువురు రుద్రదేవతలు సాయుధులై ఓ ప్రాజ్ఞమునీ! పదియైదవయావరణమున నుందురు.-48. పదునారవయావరణమున తూర్పు మొదలుకొని ద్వారములందుండు రుద్రులు వీరు-వీక్షిణత్కులు (విగతమైన క్షీణము గలవారు-ఎప్పుడైనను క్షయమునందనివారు) విచిన్వత్కులు (కోరిన యర్థమును సంపాదించువారు), నిర్ఘతనాయకులు (ఆనర్హతులు, రుద్రమున) (అంతటను నిశ్శేషముగా పాపముల నశింపజేయువారు), అమీతులు (అంతటను స్థూలీభావమును బొందువారు)-వీరందరు మిక్కిలి తపించిన వారై మహారుద్రుని నుపాసింతురు. (ఇచట కృష్ణయజుర్వేదీయ సంహితలోని చతుర్ధకాండమున పంచమప్రపాఠకములో ద్వితీయానువాకమునుండి నవమానువాకము వరకు జెప్పిన రుద్రులు పదునారు ఆవరణములలో నుండి రుద్రాలయాధి దైవతమైన మహారుద్రుని సేవింతురు. ఆ మహారుద్రుడు సైతము శ్రీలిలితాపరమేశ్వరిని ఆజ్ఞాబద్ధుడై సేవించును. కావున రుద్రాధ్యాయ పరమధ్యేయయము శ్రీలలితా పరమేశ్వరియే యని వ్యక్తమైనది)
ఈవిధముగా పదునారు భవనములలో వేలకొలదిగా నున్న రుద్రలచే-50. సేవింపబడిన మహారుద్రుడు లలితాదేవి యాజ్ఞను ప్రవర్తింపజేయువాడై జగముల సమృద్ధికే ముత్యములచే నిర్మింపబడిన భవన శ్రేష్ఠము యొక్క కోణమున నుండును. శతరుద్రీయమున లెక్కింపబడిన యీ మహాబలులైన రుద్రులు లలితా భక్తి సంపన్నులై రాత్రింబవళ్లు పాలింతురు. వీరు దేవి యొక్క భక్తులుగాని వారికి విఘ్నముల గూర్చుచుందురు-52. ఈ విధముగా ఇంద్రాది దీక్పాలకులు ముత్యాల భవనము నాశ్రయించియుండి లలితా పరమేశ్వరి సేవను జేయుచున్నారు-53. మారుత యోజనమైన వాయు యోగము గల దైవయోగముగల) ముత్యాల భవనములోపల మరకతమణి నిర్మితమైన భవనము గలదు. అది నాలుగు యోజనముల యెత్తు-54. గలిగి పూర్వమువలె గోపురములు మొదలగు వాని నిర్మాణములతో నొప్పియున్నది. అచట ఆగ్నేయాదులైన మూలదిక్కులలో నున్న శ్రీదండనాథ యొక్క నాలుగు భవనములున్నవి. అవి మంత్రిణుల గృహవిస్తరములు. అవినీతిచక్రరథశ్రేష్ఠము యొక్క పర్వముల నాశ్రయించియున్నవి-56. భండాసుర మహాయుద్దమున ఆ దేవులు (స్త్రీలు) అచట జాగరూకతతో నుండిరి. అచట నిర్మింపబడిన చదరపు నేలలు. మరకతమణుల వరుసలచే పొదగబడి శుభముగా నున్నవీ-57. అవి హేమలతా వనములతో నొప్పినవి. అన్ని వస్తువులతో నిండినవి. అచట సమస్త దేవులు (స్త్రీలు) దండనాథ నాశ్రయించినవారు-58. హలోద్ధర్ణ హలొద్దర్ణముసలములు గూడ తిరుగుచున్నవి. లెక్కకు మిక్కుటమైన తాటి చెట్లు క్రొత్త బంగారు వన్నెలతో చిత్రింపబడినవి-59. ఒక యోజనము పొడవైన కొండములు గలవి. విశాలములైన యాకులు గలవి. బంగారుబెరడు గలవీ, దట్టమైనవి. మంచినీడ గలవి. ఫలములతో పగిలినట్లున్నవి. (వీరగరాసినవి)-60. మూలమునుండి యాకుల వరకు వ్రేలాడుచున్న కల్లు కుండలతో నిండినవి. ఇవియన్నియు దండనాథ యొక్క సంతోషము కొఱకు శిల్పులచే చేయబడినవి-61. పొంగిన యా తాటికల్లు ప్రవాహమును త్రాగి త్రాగి మత్తెక్కినవారై జృంభిణి మొదలగు చక్రస్థిత దేపులు, హేతుకుడు మొదలగు భైరవులును-62. ఏడుగురు నిగ్రహ దేవులును మదవీవశలై నాట్యము జేయుచుందురు నాలుగు విదిక్కులలో (ఆగ్నేయాదులలో) దండీని యొక్క విశాలపు చూపులున్నచోట-65, తూరుపు మొదలగు దీగ్భాగములలో దేవితో సమానమైన తేజస్సు గలవారుందురు. ఉన్మత్త భైరవి, స్వప్నేశియు అన్ని దిక్కులలో నుందురు-64. దండనాథ యొక్కనివాసము కేవలము. అభిమానీకమే. (అభిమానము వల్ల చెప్పబడినదే - నామమాత్రమైనదే) ఆమె యొక్క సేవో వాసము వేరు. మహాపద్మాటవీ స్థలమున నుండును. ఆమె యొక్క కక్ష (గృహభాగము) మిక్కిలి దూరమగుటచే సేవకొంకు ఆమె గృహమచటనున్నది-65. తరువాత మరకతమణి నిర్మితమైన భవనము. అది యేడు యోజనముల వెడల్పు, పొడవులు గలది. దాని ప్రాకారము (కోటగోడ) పగడములతో రూపొందినది. ప్రాతఃకాల సూర్యునివలె నేనైననదీ-66. ఆచటి స్థలములన్నియు పగడములతోనే నిర్మింపబడినవి. అటులనే పగడము వంటి కాంతి గలిగి తామర కములము నందున్న బ్రహ్మ బ్రహ్మలోకమునుండి మునివరులతోను మరీచి మొదలగు ప్రజా స్రష్టలతోను వచ్చి యేమరుపాటు లేక శ్రీ లలితా దేవి నిత్యసేవలో నున్నాడు. పదునాలుగు విద్యలు వేలకొలది యుపవిద్యలును-69. బ్రహ్మలోకమునాశ్రయించి మహత్తరములైన అరువది నాలుగు కళలును శరీరముదాల్చినవై పగడముతో నిర్మించిన ప్రాకారమున లలితాదేవియాజ్ఞచే జగముల సంపద్వృద్దికై యున్నవి-70. తరువాత వాయుయోజనముగల పగడ ప్రభవనములో మాణిక్యములతో నిర్మించిన మండపస్థానము గలదు. దాని నన్నిదిక్కులజుట్టి లలితా సేవలోనుత్సాహము గల విష్ణులోకమున్నది-71. ఆ విష్ణులోకమున సనాతనుడైన (అందరికన్న పూర్వుడైన) సాక్షాత్తు మాధవుడైన విష్ణువు నాలుగు విధములుగాను, పది విధములగును, పండ్రెండు విధములుగను వేరువేరు మూర్తులుగలవాడై (లలితాసేవకై) యెల్లప్పుడుండును-72. భండాసుర మహాయుద్దమున శ్రీదేవి గోళ్లనుండి బుట్టిన దశావతార దేవతలు గూడ మాణిక్య మండపమున నున్నారు -73. తూరుపు కక్షాంతరములనుండి, విశేషించి యాతని కక్షయందు మాణిక్యపు రాళ్లతో పైన యాచ్చాదనము (ఛత్తు) నిర్మింపబడినది-74. అచట కక్షాంతరమున శంఖ చక్ర గదల ధరించి విష్ణుదేవుడు పండ్రెండు మూర్తులతో ఖిన్నుడై తూరుపు మొదలుకొనియున్న దీక్కులందు రక్షించును-75. నేరేడుపండు కాంతిగల చక్రధారియైన కేశవుడు తూరుపు దీక్కున రక్షించును. నల్లని మేఘము వర్ణములోనున్న శంఖధారియైన నారాయణుడు నల్లకలువరేకు వలే నల్లనైన మధుమంతుడైన మాధవుడు పశ్చిమ దిశయందు రక్షించును. ధనువును ధరించి చంద్రకాంతి గల మహాత్ముడైన గోవిందుడు దక్షిణ దిక్కున రక్షించును-77. పద్మకింజల్క వర్ణము గలిగిన హలధారి బలరామునియవతారమైన విష్ణువు ఉత్తరమున రక్షించును. రోకలి ధరించిన మధుసూదనుడు ఆగ్నేయదిక్కున రక్షించును-78. అగ్నిప్రభ గలిగిన ఖడ్గపాణియైన త్రివిక్రముడు నైరుతిదిక్కున రక్షించును. బాలసూర్యకాంతీ గలిగి - వజ్రాయుధము గలిగిన వామనుడు పోయువ్య దిక్కున రక్షించును -79. పుండరీక (కమల) కాంతి గలిగి పట్టిశ్రమను సాయుధమును ధరించిన శ్రీధరుడు ఈశాన్య దిక్కున రక్షించును. మేరపు వంటి కాంతీ గలిగి ముద్దరాయుధము ధరించిన హృషీకేశుడు పశ్చిమ దీక్కును రక్షించును-80. వేయి సూర్యుల కాంతి గలిగి శార్జమను ధనువును ధరించి మాణిక్యములతో నిర్మించిన మండప స్థానమును అనులోమముగా, అనుకూలముగా చుట్టియుండును-81. సర్వాయుధములు గలవాడు, సర్వశక్తులు గలవాడు, సర్వజ్ఞుడు, సర్వతోముఖుడు (అన్ని వైపుల ముఖములు గలవాడు), ఆర్ధపురుగువలె నెల్డని పట్టువన్నె గలవాడు, పాశము చేతియందు గలవాడు. అపరాజితుడు (ఓడనివాడు)-82. సర్వాత్ముడు, లలితాభక్తి నిండినవాడును ఐన దామోదరుడు మాణిక్య మండపస్థానమును విలోమముగా (వ్యతిరేకముగా) చుట్టి యుండును-83. ఈవిధముగా అంబుజేక్షణుడైన భగవంతుడగు విష్ణువు పండ్రెండు దేహములచే మాణిక్య మండపగతుడై విష్ణులోకమున విరాజిల్లుచుండును-84. ఆ తరువాత మారుతయోజనము గల నానారత్న భవనములో సహస్ర స్తంభకమను మండపము గలదు. అదీ మనోహరమైనది-85, నానారత్నములు పొదిగినది. నానారత్నములు అలంకరించినది. నానారత్నములతో నిర్మింపబడిన ఎత్తైన భవనము అచటనున్నది-86. వేలస్తంభములతో ఒక పంక్తి యడ్డముగా ప్రవర్తిల్లినది. నలువైపుల అటువంటి పంక్తులు అనేకముగా నున్నవి-87. పూర్వమువలే రత్నదారువుల (చెక్కలతో) పైకప్పు గూడ నున్నది. ఈవిధముగా నట స్ఫురించిన కాంతితో గొప్పనైన శివలోకమున్నది-88. అచట ఆకారముదాల్చిన శైవాగమములు ఇరువదియెనిమిది. అచట నుండి భృంగి-మహాకాలుడు మొదలగువారు ఉత్తములు-89. ఇరువది యాగురు తత్త్వదేవతలు వేలకొలది గజాననులు శివలోకోత్తమమున సహస స్తంభ మంటపమున నుందురు-90. ఈశ్వరుడు సర్వవిద్యల ప్రభువునే చంద్రశేఖరుడు అట లలితాబ్దాపాలకుడై లలితాజ్ఞను నేరిలివేర్చువాడై యుండును-91. లలితామంత్రమును జపించువాడు, నిత్యము ఆనందమే మనోవ్యాపారముగా గలవాడు. శైవీదృష్టితో తన భక్తులకు మంత్రసిద్ధికై యుండును-92. అంతస్సులోను బహిస్సులోను ఉన్న తమమును భేదించుటలో మిక్కిలి సామర్థ్యముగల ప్రకాశ (కాంతి) స్వరూపురాలైన మామేధాశక్తిని ప్రకాశింపజేయుచుండును-93. సర్వజ్ఞుడు (సర్వము తెలిసినవాడు) సర్వమునకు కర్తయైనవాడునైన మహాదేవుడు (శివుడు) దేవీశ్రీ భక్తి నిండినవాడై సహస్రస్తంభమండపమున నుండుచుండును-94.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణముననుత్తరభాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున దీక్పాలాదీశివలోకాంతరకథనమను ముప్పదినాల్గవ యధ్యాయము-34.
Summary of chapter 146 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter outlines the subtle practice of Nyāsa, wherein the practitioner places sacred mantras and divine deities onto specific parts of their own physical and subtle bodies. It teaches that through proper Nyāsa, the worshipper's body is transformed into a living temple of goddess Lalitā, purifying all bodily channels and mind. The devout soul performs these sacred rites with deep devotion, realizing their own intrinsic divinity.