40 - చత్వారింశోధ్యాయః

అగస్త్యుడనెను : శ్రీకామకోటి పీఠమున నున్న మహాత్రిపురసుందరి కామక్షియనుపేర ప్రసిద్ధురాలై ఏయే విలాసములు చేసెను-1. ఓ ప్రవక్తలో వరిష్టుడవైన హయగ్రీవా! మహేశ్వరియై త్రిపురసుందరియైన యా మహాదేవి శ్రీకామాక్షియను పేర భూమండలముననున్నదై యేమి చేయును? ఈమె యొక్క దివ్యమైన చరితమును. నాకు జెప్పుము.

హయగ్రీవుడనెనుః- ఓ యగస్త్యా ఇక్కడ నున్నప్పటికిని కామాక్షీదేవి అందరి హృదయములందుండును. ప్రాణులకు వారివారి కర్మానుసారము ఫలితములనిచ్చును(3) లోకములో నడచుచున్నదంతయు ఈమె యొక్క విచేష్టయే. (వ్యాపారమే). ఒకడు ఏదో తలంచును. కాని యీమె స్వేచ్ఛగా చేయును. (తనయిష్టమైనట్లుగ ఫలితమునిచ్చును)-4 త్రీపురాధీ శక్తులు ఆమె యొక్క యవతారములే ఈమెయే మహాలక్ష్మి పూర్వమీమె మూడండములు సృష్టించేను-5. ముగ్గురు శక్తులకు గూడ పురత్రయము నీవాసము. ఒక యండమునుండి అంబికయు పురుషోత్తముడును (విష్ణువు) బుట్టిరీ-6. తరువాత మరొకయండమునుండి. వాయు శివుడును బట్టిరి. మహేశ్వరీ లక్ష్మితో విష్ణువును, - పార్వతితో పరమేశ్వరుని, సరస్వతితో బ్రహ్మను జతగూర్చెను. బ్రహ్మను లోకములను సృష్టించుకార్యము నందు నియోగించెను. వాసుదేవుని రక్షణమున, సంహారమున ముక్కంటిని నియోగీంచెను-8 వారందరు నెల్లప్పుడు సుఖమునిచ్చునా మహాలక్ష్మినీ ధ్యానింతురు. వీరు బ్రహ్మలోకమునను వైకుంఠమునను, కైలాసమునను వసింతురు-9, ఒకానొకపుడు కైలాసశిఖరమున పార్వతీదేవి విహరించుచు వెనుకనుండి మహేశ్వరుని రెండు కన్నులను మూసెను -10. అతనీ నేత్రము చంద్రసూర్యులగుటచే ముల్లోకముఅంధకారము జుట్టుకొనియంతయు వెలుగులేనిదయ్యెను-11. దానివలన సమస్తలోకములు వదలిపెట్టబడిన దేవపితృ క్రియలుగల వయ్యెను. (దేవపిత్యక్రియలు జరుగలేదు). ఏమిచేయుటకును దోషక ప్రజలేమియు దేలియకుండీరి-12. దానిని జూచి భగవంతుడైన రుద్రుడు పార్వతితో నిట్లనెను, దేవి! నీవు నౌకన్నులు మూయుటచే పాపము చేసితివి-15, ఋషులు తమతపములు వదిలిరి. వైదీకులు సంధ్యావందనముచేయని వారైరి. అంబికా! నీచే సమస్త వేదిక. కర్మ నశింపజేయబడినది-14. కావున పాపశాంతి కొఱకు దుష్కరమైన తపముజేయము. కాశీకి వెళ్లి. యచట కొంతకాలము వ్రతము నాచరించపుము-15. తరువాత కాంచీపురమునకు వెళ్లి యచట కామాక్షిని జూచెదవు. నీవు సర్వపాపహారిణియైన యా శివను (పార్వతి) ఆరాధింపుము-16, కంపా నదీతీరమున తులసిని ముందుంచుకొని తపముజేయము. అని యాదేశించి మహాదేవుడచటనే యంతార్థానముందెను-17. ఆ పార్వతియు భర్తయాజ్ఞననుసరించి యట్లేచేసెను. చాలాకాలము ఏకాగ్రహృదయే కష్టపడిన శివ (పార్వతి)-18. యొక్క యెదుట కామాక్షి ప్రత్యక్షమై యిట్లు పలికెను. ఓ సుప్రతియైన వత్సే నీయత్యుగ్రతపమునకు సంతసించితిని-19, తరువాత పార్వతి కండ్లుదెరచీ తనయెదుటనున్న పరాంబికను జూచెను. ఆమె పదివేల బాలసూర్యులతో సమానముగా వెలుగుచుండెను. సర్వాభరణములనలంకరించికొనియుండెను-20. కిరీటము హారములు భుజకీర్తులు కంకణములు మొదలగువానినలంకరించుకొనెను. పాశము, అంకుశము, చెలకువిల్లు, ఐదుబాణములు చేతులలో గలిగియుండెను-21. కిరీటమువైన ప్రకాశించు. చంద్రరేఖ యలంకారముగా నుండెను, ఆమే బ్రహ్మ విష్ణు-రుద్రులకు ఈశ సదాశీవపదములనిచ్చునది-22 ఇక పైపదములేని సగుణ బ్రహ్మనుగాసామెను జెప్పుదురు. "ఆమె ఇహలోక పరలోకములను రెండు ప్రపంచముల నిర్మాణమును చేయించునది. అట్టి పరాంబికను పార్వతి చూచెను-23. తరువాత .. ఆమహారాణిని జూచి పార్వతి మహానందమున నోలలాడెను. సర్వశరీరమున గగుర్పాటు. నిండెను. సంతోషమున కన్నులు వికసించెను-24 - చండికా మంగళాదులగు తన సఖీజనముతోబాటు సాష్టాంగ ప్రణామము జేసెను. ప్రదక్షిణము జేసి-25. చేతులు జోడించి మరల నమస్కరించెను. తనతోనేక స్వరూపిణియైన యా మహాత్రిపుర సుందరీ దయతో జూచి-26. బాహువులతో కౌగిలించుకొని స్నేహముతో నీట్లనెను. “వత్సే నీ మనస్సు గోరిన రుద్రుని భర్తగా బొందుము-27. లోకమున నీవుగూడ రక్షకై నాయాజ్ఞను నెరవేర్పుము. నేను నీవు అను భేదమెక్కడిది? నిఃసంశయముగా నీవే నేను-26, ఓ కల్యాణీ నీకేమీ పాపము సంభవించినది? నీవే పాపములను ఖండించుదానవు, యోగీంద్రాలు నిన్నే బహురూపిణిగా జెప్పుదురు-29, వత్సే! ఇది లీలామాత్రము. పరలోక విడంబనము. ఈ విధమున చిలికిన మహారాణియైన యంబికకు సర్వమంగళ పార్వతి భక్తితో ప్రణమిల్లీ చూచుచు పరమప్రీతినీ పొందెను-30. పార్వతీ స్తుతింపగనే యాపరాశక్తి యామె హృదయములో బ్రవేశించేను. ఓమునీ ఆమె (పార్వతి) మిక్కిలి సంతసించెను. అంత పార్వతి యాశ్చర్యమంది మాటిమాటికి చింతించుచు అనేను చూచినది స్వప్నమా? లేక భ్రమయా?-32. అని విమర్శించి చుట్టంతట జూచేను, తరువాత చిరునవ్వు నవ్వు జయ-విజయయను సఖులను జూచి ప్రసన్నవదనయై నమస్కరించిన సఖులతో నిట్లనెను-38. ఓ ప్రియసఖులారా! ఇంతకాలమెచటికి బోయితిరి! నేను జూచిన కామాక్షిని మీరు చూచితిరా-34 సఖులు, ఆ మాటలు విని సంతసమున వికసించిన కన్నులు గలవారై పూజింపదగిన పుష్పములను ముందుంచి ఇట్లుపలికిరి-35. నిజముగా మేము గూడ నాపరాశక్తిని జూచితిమి. ఇదీ స్వప్నముగాదు. భ్రమగాదు. ఆ పరాశక్తి సాక్షాత్తుగా నీహృదయమును బ్రవేశించినది. అని పలికి ఆమె ప్రక్క వీనయముతో తలవంచి కూర్చుండిరి-36. ఏకామ్ర వృక్షమూలమున భగవంతుడైన శివుడు. భవానీ విరహముచే పీడితుడై, యా, గౌరీ సంప్రాప్తికై నియతేంద్రియుడై, కామాక్షిని ... ధ్యానించెను-37. అచట గూడ శ్రీవిద్యాదేవతయైన పరాదేవి ప్రత్యక్షమైనది. సంతసించినదై నిశ్చలముగా తన్నుధ్యానించు శివునితో నిట్లనెను-58, ఓ మన్మథుని మదమునణచినవాడా నీ ధ్యానమును జాలింపుము. సాయాజ్ఞలోనున్న మన్మథుని మరల నంగీకరింపుము. ఇచట నాయాజ్ఞతోనే ఏకామ్రమను సాపీఠమున యెల్లప్పుడుండుచు. నీ ప్రీతికై నీవేవచ్చి యోసువ్రతుడా నా సన్నిధిలో కంపానీరమున నుండు గౌరిని అనుగ్రహింపుము-40. యోగము వల్లను గౌరీ వియోగము వల్లను గలిగిన రెండు. తాపములను (బోగొట్టుకొనుము). వదిలివేయుము అని పలికీ యాపరమయైన రమ (పరాశక్తియైన లక్ష్మి) శివుని హృదయమున నంతర్థానమయ్యెను-41. వెంటనే శివుడు లేచెను. మనమున మిక్కిలి సంతసించెను. ఆమె యనుగ్రహమును బొంది సర్వదేవతలచే సేవింపబడెను-4 రెండు ప్రపంచములుగానున్న చరాచరజగమంతయు సామెవిలాసమున నామెలోబుట్టి యామెలోనే లీనమగును. అట్టి యా మహాత్రిపురసుందరినే హృదయమున ధ్యానించేను. వివాహమంగళాలంకారమునలంకరించుకొనుచున్నదియు, కంపానీరవాసినియు, దయార్ద హృదయము, శివయునైన గౌరిని అప్పుడు వివాహవిధితో అంగీకరించి తీసికొనివచ్చి వృషభమునెక్కి కైలాస శిఖరమునకు వెళ్లెను-43,44,45. ఓ పాపరహితుడా! అగస్త్యా! ఆదిలక్ష్మీ ప్రభావమును జెప్పెదను. దానికై మజాక ప్రాజ్ఞుని చరితముజేప్పెదను వినుము-46. బ్రహ్మ యొక్క సభకు వెళ్లి యట త్రిమూర్తులు గూర్చొనియుండిరి. దీక్పాలురు, దేవతలందరును, సనకాదియోగులును-47. దేవరులైన నారదాదులును, వశిషాదీతాపములును అచటకివచ్చిరి. వారందరును గలిసి బ్రహ్మకును శివునకును ఐదుముఖములుండుటచే భేదమును గమనింపలేకుండిరి-48, వారొకరినొకరు బ్రహ్మయెవడు? శంకరుడెవడు? అని అడుగుకొనుచుండిరి. ఆ విధముగ మాట్లాడుకొను వారీ మధ్యన వెంటనే శివుడంతర్షితుడైయుండెను-49. అపుడు పంచముఖుడైన బ్రహ్మ నల్లనైన నారాయణుడు వారిరువురికినీ “నేను బ్రహ్మను నేను బ్రహ్మను” అని వాదముకలిగెను-50. ఓ యజ్ఞానీ నానాభికమలమునుండి బుట్టిన నీవు నాకు బుత్రుడవు అనేను, సృష్టికర్తనైన నేను బ్రహ్మను, పేరులోని సాధర్యమువలన నట్లైనది, నీవును రుద్రుడును మీరిరువురును సృష్టికర్తనైన నాకు బుత్రులు-51. అని మాయామోహితులైన యా యిరువురి మధ్యనవారిరువురికీ తన యొక్క మహాత్యమును 'నేను బ్రహ్మను' అని చూపుచు మహేశ్వరుడు మహా జ్యోతిస్తంభ (గొప్ప వెలుగు స్తంభ) రూపమున ఆవిర్భవించెను-52. తరువాత ఈతని మహేశ్వరునిగా దెలిసియే విష్ణువు ఊరకుండెను. ఐదు ముఖములుగల బ్రహ్మ పారినవమానించి యట్లే యుండెను. ఎదుట బ్రహ్మయొక్క శిరస్సులకు పైన జ్యోతిశ్చక్రము (వెలుగుతో నేర్పడిన చక్రము) ఏర్పడెను-53. ఆ చక్రమధ్యన ఉమతో గూడ శివదేవుడు చక్కగానుండెను. బ్రహ్మపైకి జూచెను. మరల నవమానించి యిట్లుపలికెను-53. అది విని త్రిపురాంతకుడైన శివుడు మిక్కిలికోపమునందెను. అట్లే కోపముతోనే వికారముగా విష్ణువును జూచెను-35. వారిరువురి వికారమువల్లనే కోపముతో గూడిన భైరవుడు పుట్టెను. అపుడాతడు గోటితోనే బ్రహ్మయొక్క ఒక తలనుద్రుంచెను. హాహాయని యచటి యందరును ఏడ్చుచు పరువెత్తిపోయిరి-56. తరువాత భైరవుడు గోటినంటియున్న బ్రహ్మతలను ఎన్నిమారులు విదిలించినను అదీ వదలలేదు-57, ఆ బ్రహ్మ హత్యాపాపవిముక్తికై భూమి మీద తీరిగి సమస్త పుణ్యక్షేత్రములను, గంగాది మహానదులను సేవించెను. దాని వలన గూడ కపాలియైన (బ్రహ్మకపాలమును ధరించియున్న) భైరవుడు బ్రహ్మహత్యా పాపమునుండి విముక్తుడుగాలేదు. విషాదము నీండిన ముఖముగలవాడై శోభాహీనుడుగాగనబడెను. చాలాకాలమునకు పూర్వము బ్రహ్మయుండిన కాంచీనగరమును జేరెను-59.. అచట భిక్షాటనము జేయుచుచుండెను. ప్రతిదినము పంచతీర్ణములలో స్నానము జేసి పరాశ్రీని సేవించుచుండెను. ఆ పంచ తీర్థములు భూలక్షణాంకీతములు-60. ఆ బిల్వలుడైన భైరవుడు మిక్కిలి భ్రమించినవానివలె కొంతకాలమచటనే యుండెను. కాంచీక్షేత్ర నివాసమున క్రమముగా ఆశయములు (కోరికలు) నియమితములయ్యేను-61: సమస్తభయములు విదిలిపోయెను. ఉత్తరమున లక్ష్మితో సేవింపబడినదియు దక్షిణమున వాసుదేవునితో (విష్ణువుతో) సేవింపబడినదియు-62. నైన (విష్ణు-లక్ష్మికుడియెడమల సేవింతురని భావము). శ్రీదేవిని మనసుతో వహించుచు(ధ్యానించుచు) శ్రీకామకోషమునకు (కామకోటి పీఠములోని యంతరహమునకు వచ్చి దాని యెదుటనిలిచెను. ఆత్మను, నిగ్రహించినవాడై యాదీలక్ష్మీపదధ్యానమును విస్తరింపజేసేను-63, కదిలించు గాలిలేనిచోట దీపమువలె, తరంగములు లేని సముద్రమువలె అంతర్వాయువుల నిరోధించుటచే అచలుడుగానున్న యీశ్వరుడు కదలలేదు-64. సర్వాత్ముడైన భైరవుడు తైలధారవలె ఎడతెగకుండగా ననుస్యూతముగా శైలతనయానాథశ్రీధ్యానసంతతినీ (పార్వతీ పతియైన శివుని శ్రీదేవియొక్క ధ్యానసమూహములను) విస్తరింపజేసేను-65. బ్రహ్మగాని, విష్ణువుగాని, సిద్ధుడైన కపిలుడుగానీ, తక్కిన సనకాదులుగానీ, శుకాదిమునులుగాని, ఆ సమాధినిష్ఠయందు ఏవిధముగను సమర్థులుగారు-66. ఆ తరువాత శ్రీభావయోగముతో శివుడు శ్రీభావమును బొందెను. అంత, ప్రభామండలమునందుండు శ్రీదేవి ప్రసన్నురాలయ్యెను. అర్ధరాత్రిలో నెదుట నీలిచి వాకిస్వరూపిణియైన యా శ్రీదేవి పలికెను-67. ఓ శ్రీకంఠ! సర్వపాపముల హరించువాడా! నీకేమీ పాపముగలదు? నీవు నా స్వరూపునివి. దేహమెట్లందువా! అదిలోక  విడంబనము (లోకమును మోసగించి యెక్కిరించుటకు)-68. రేపటి దినమునకు బ్రహ్మహత్యనుండి క్షణంలో విముక్తుడవగుదువు-అనిపలికి యటమపోసింహానేశ్వరి అంతర్థానమందెను-69. భైరవుడు గూడ, సంతసించి శ్రీదేవిని జూచుట వలన కృతార్థుడై (ధన్యుడై), ఆ మిగిలిన రాత్రిని శ్రీదేవీ ధ్యానపరాయణుడై గడపి-70. ప్రొద్దున పంచమహాతీర్థములో స్నానముజేసి, సంధ్యోపాసనముగావించి చేతినంటియున్న బ్రహ్మకపాలమును మాటిమాటికి విదిల్చుచుండెను-71 ఐనను అది వదులుట లేదు. దాని వలన మిక్కిలి వీచారమును - బొందెను. - ఇది. స్వప్నమా! మాయయా! మానసభ్రాంతియా! -72. ఈ విధముగ మాటి మాటికి చింతించీ ఈశుడు - శోకవ్యాకులమనస్కుడయ్యెను. తరువాత శివుడు స్వయముగనే శోకమును నిగ్రహించి ధీరశ్రేష్ఠుడై-73. తులసీమండలమునకు నమస్కరించి, ఎదుటనీలిచి పూజించి, ఇంద్రియ సమూహములనన్నింటిని నిగ్రహించి. మరల సమాధిస్థుడయ్యెను-74 ఒక జాముగడవగనే మరల ---- దేవి సన్నిధికి వచ్చెను. (ప్రత్యక్షమయ్యెను) “ఓ శంభో! సమాధి చాలు. ఈ సరోవరములో మునుగుము”, అని, యాదేశించి యంతర్థానమందెను. అతడు గూడ చింతింపసాగెను. ఇది మాయయా! స్వప్నమా? ఇపుడు నేనేమి చేయవలెను-76. రేపటికల్ల క్షణములో బ్రహ్మహత్యనుండి ముక్తుడవగుదువు -అని శ్రీపరాదేవి చెప్పినది. ఇప్పుడు దినములో : జాము గడిచినది-77. ఇదియంతయు మిథ్యయే (అబద్దమే)-అని - భగవంతుడు మిక్కిలి చింతాక్రాంతుడయ్యెను. ఆకాశవాణి మాత్రము నీటిలో మునుగుము అని గర్జించేను-78. అదివినీ సందేహము వదిలి నీజమును నిశ్చయించి శంకరుడు గంగా సరసిలో మునిగెను. మునిగిలేచినవాడై యచటి కాళిని జూచీ “ఇదియేమ'ని చింతించుచు గోటినంటిన కపాలముతో క్షణకాలమూరకయుండెను-80. తరువాత బాలచంద్రధరుడైన శివుడు నుదుటిపై యెండగాయు సూర్యుని జూచేను, వశియైన (ఇంద్రియనిగ్రహము గలవాడైన) శివుడు భిక్షణకై యా నగరిలో ప్రవేశించెను-81, కొన్ని గృహములకు వెళ్లి . మార్గమధ్యన దిరుగుచు ఆ భవుడు ఎదుట శ్రీదేవతాకృతిలోనున్న ఒక మొలనూలును, కాంచిని జూచెను-82 ఆమె యాతనికి జ్యోతిర్మయభిక్షనిచ్చి వెంటనే యంతర్భావమందెను. ఆక్షణముననే అతనిగోటి చివరనుండి బ్రహ్మకపాలము జారిపడెను-83. ఈశానుడు ఆయద్బుతమును, ఉత్తమమైన కామాక్షీలమును జూచి ప్రసన్న (శాంతి వహించిన) ముఖముగలవాడై - పరాదేవిని మాటిమాటికి బహుమానించేను. (పలుమారులు తలంచెను)-84. కాంచీపురియనుపురి పుణ్యమైనది. కంపానదియనునది పుణ్యమైనది. ఆ కనబడినదే. కామాక్షీ దేవత-అనుసంభావన (మంచిభావన) ప్రత్యక్షముగా గలిగినది-85. ఈ విధముగ దేవీ కటాక్షమున హరుడు సంకటమునుండి విముక్తుడై స్వస్థుడై పరాశ్రీని కొనియాడుచు స్వస్థానమునకు వెళ్లాను-86.

ఓ కుంభజా: మరొక దేవీవిలాసమును జెప్పెద వినుము. శ్రీమహాదేవీప్రభావము వినువారికెల్లప్పుడును కోరికలను దీర్చునది-87. దశరథుడు అను పేరుగలవాడు అయోధ్యకధిపతియైన రాజు, సంతానములేని వాడై చాలాకాలము శోకాకులుడై యుండెను-88. బుద్ధిమంతుడైన రాజు తన పురోహితుడైన వశిష్టుని రహస్యస్థలమునకు బిలిచి ఆచార సంశుద్ధుడై సర్వశాస్త్రార్ధములను దెలిసిన యాతనితోనిట్లనెను-89. శ్రీనాథుడా! (బృహస్పతీ! విద్యానాథా) ఎన్నోకాలములుగడిచినవి. పుత్రుడు గలుగలేదు. సంతతికొకైన తాపమునాకు మిక్కిలి వృద్ధిచెందుచున్నది. ఏమిచేసిన సంతానసంపద కలుగునో జెప్పుము-90

వసిష్ఠుడనేను :- ఓరఘువంశములోని మహారాజా! నీకురహస్యము జెప్పెదను. అయోధ్య, మధుర, మాయ, కాశి, కాంచి, అవంతిక,-ఇవి పట్టణములలోనుత్తమోత్తమములైనవి. మిక్కిలి పుణ్యవంతములైనవి-1, ఈ నగరి యొక్క సాంనీధ్యమాత్రమున (ఈనగరిలో నున్నందున) మహాత్రిపురసుందరినీ అర్చింతురు. అయోధ్యయందు ఈమె అధిదేవతను అర్చింతురు-92, ఈమెతో సమానురాలైన యే పరదేవతయు లేదు. ఓ రాజా! ఇతరులందరు ఈమెనే అర్చింతురు-95. బ్రహ్మ-విష్ణు-మహేశాదులు తమ స్త్రీలతోబాటు ఎల్లప్పుడు ఈమెను బూజింతురు. కొబ్బరికాయల వరుసలతోను, పనసపండ్లతోను, అరటి పండ్లతోను-94. పెద్దపెద్ద పాత్రలకొలది తేనెలతో, నేతులతో, శర్కరలతోను, గోప్పపాయసరాశులతోను, సిద్ధద్రవ్యవిశేషములతోడను త్రిపురాంబికను బూజింపవలెను. ఆమె మనకు వెంటనే కోరిన దాని నొసంగును-95. ఈ విధముగా తన పుత్రప్రాప్తికైచెప్పిన గురువైన వసిష్టునికిష్టమైన కానుకలిచ్చి దశరథమహారాజా తనిని పంపించేను-96. తరువాత రాజేంద్రుడైన దశరథుడు గురువు చెప్పిన విధముగనే లలితా పరమేశ్వరిని పరమభక్తితో బూజించెను. -97. ఈవిధముగా ప్రతిదినము పూజించి ప్రీతమనస్కుడై అయోధ్యాదేవతలకు నెలవైన కాంచీలోనుండి కామాక్షిని సేవించెను-98. నీశ్చలమైనయుల్లాసమును దీపింపజేయు (ప్రేరేపించు) అర్థరాత్రి గడపగనే కొద్దిగా నిద్రాలసుడైన దశరథుని యెదుట త్రిపురాంబిక ప్రత్యక్షమయ్యెను-99. అపుడామెయిట్లున్నది. నాలుగుభుజములలో పాశము, అంకుశము, ధనువు, బాణములు అలంకరించియున్నవి. వేషము సర్వశృంగారముతోనొప్పినది. సర్వాభరణభూషితయైయున్నది. అట్లుండి ఇందుమతీపుత్రుడైన దశరథునితో నీమాటలు పలికెను-100. ఓ శ్రీమంతుడవైన దశరథా! పాపరహితా! నీకు పుత్రభాగ్యమున్నది. కాని నీవు పూర్వము చేసిన విశ్వాసఘాత కర్మలు (నమ్మకద్రోహమున చేసిన పనులు) ఉన్నవీ-101. ఆ పాపకార్యముల శాంతికై కాంచీపురవరమునకు వెళ్లి కంపాసరసిలో స్నానముజేసి యట పవిత్రురాలనైన నన్ను జూడుము-102 కాంచీపురము యొక్కమధ్యన గుహాకాశమధ్యనుండి ఏడు ద్వారములుగల బిలముతోగూడిన కామకోష్ఠమను అంతర్గృహముండును. అది సామ్రాజ్యమును సూచించునది, అది త్రీపురుషులకు (బ్రహ్మవిష్ణుమహేశ్వరులకును) సిద్దులనిచ్చునది. దానిని విపాపుడెవై (పాపములేనివాడవై) ప్రవేశింతువు. అచటనే మహాసింహాసనేశ్వరియైన నేను తూర్పుముఖము గలదాననై యుందును-104 స్వరూపము మహాలక్ష్మీస్వరూపము. రెండు భుజముల పద్మములధరింతును. చక్రేశ్వరిని. మహారాజ్ఞిని, స్థూలచక్షువులకు (సూక్ష్మమును జూడలేనివారికి) కనబడను-105. నౌకన్నునుండి పుట్టిన గౌరి నాకుడివైపుననుండును. ఆమె సౌందర్యమునకు హద్దు. (అంతకన్నమించిన సౌందర్యములేదు) సర్వాభరణములనలంకరించికొన్నది-106. నాచేత కల్పింపబడిన నివాసముగలది. రెండుభుజముల పద్మముల ధరించినది. మహాలక్ష్మీరూపములో కృత్యరూపమాయన్నట్లున్నదీ-107. ఆమెను పీఠమునుండి శిరస్సువలకు నాయంశమునబుట్టిన దాని జూచువానికి మహాపాతకములు వేగముగా నశించును. ఉపపాతకవిషయము చెప్పవలెనా? -108. చెడు సంస్కారముగాని, చెడుబుద్ధిగాని, చెడు తర్కముల సమూహముగాని, చెడుదేహముగాని, చెడు భావముగానీ దేవుడులేడను బుద్ధి (నాస్తికత్వముగానీ ఇవియన్నియు నశించిపోవును-109. శర్కర, తేనె, నేయి, దీనితోగూడిన పాయసములతోను, వివిధములైన భక్ష్యభోజ్యములతోను, షడ్రసములతో గూడిన పదార్థములతోను నాకు మహాపూజను జేయుము-110. అచటనే నేను సుప్రసన్నురాలనై నీపరమును (కోరికను) పూర్తీచేయుదును-అని ఉపదేశిచి సామ్రాట్టియైనయపరాదేవి యంతర్థానమందెను-111. రాజు (దశరథుడు) కూడ వెంటనేలేచి 'ఇది యేమని యాశ్చర్యమంది, శుభలక్షణముతో గనబడుకౌసల్యాదేవిని మేలుకొలిపి-112. యామేకాదరముతో నా రాత్రి వృత్తాంతమును జెప్పెను. అది విని యాకౌసల్య యపుడు సంతోషమునందేను-113. సంతసించిన రాజు ప్రొద్దుననే భార్యతోబాటు అనేక మంత్రులతో గూడి కాంచీపురమునకు వచ్చెను-114. రాజు కౌసల్యతోబాటు కంపానదిలో స్నానముజేసి పావనియైన యామహదేవిని దర్శించి తరువాత పంచతీర్థములలో స్నానముజేసి-115. యా తీర్థక్షేత్ర నివాసులను ఆమెను భక్తితో పూజించువారీని ఆవులు, భూమి-వస్త్రములు-బంగారము మొదలగువస్తువులదానముచే సంతోషపెట్టెను-116. తరువాత నారాజశ్రేషుడు భక్తితో నాలయ మున బ్రవేశించి, వినయముతో మూడు ప్రదక్షిణలుచేసి-117. తరువాత కౌసల్యతోసహ మూలసంనిధికి వచ్చెను. శ్రీకామ కోష్ఠముననున్నట్టియు, త్రిమూర్తులకు తల్లియైనట్టియు, శ్రీచక్రస్వరూపిణియై మహాత్రిపురసుందరియైన యంబను భార్యతోబాటు భక్తిమంతుడై సాష్టాంగముగా (జాగిలి) మొక్కేను-119. అది స్వపురమై త్రిపురమైనధామము, దానిని పూర్వమిక్షాకరాజులు ప్రవర్తింపజేసిరి, అదీ సశిష్యుడైనదుర్వాసునిచే పూజకొఱకై ప్రకల్పితమైనది-120. దాసీదాసులతో ధ్వజారోహోత్సవముతోను గృహోత్సవముతోను గూడినది. అచట తనగురువు చెప్పిన విధముగా స్వాత్మారపూజను జేసెను -121. రాత్రి స్వప్నములో జూచీన రూపముచేయా స్వపురమున తేజోరూపమున జూచెను. రాజసత్తముడైన దశరథుడు అక్కడ గూడ నారూపమునే ధ్యానించెను -122. పౌలకాలము ధ్యానించి మహారాజు మంచి వస్త్రములను పెక్కింటిని దీవ్యములైన ఆయతనములను (యజ్ఞశాలలను) ఆమెకిచ్చిస్తోత్రము జేసెను-123. పాదముల చీవరవ్రేలాడునుత్కుృష్టమైన యాభరణములతో సుందరమైనదానా! కాలిగజ్జెలపైని రత్నకాంతులతో మనోహరమైన పాదపద్మములు గలదానా! పీతాంబరమునందు మెరయు సుకుమారమైన బంగారు మొలనూలు గలదానా, భుజకీర్తులతోను కంకణములతోను అలంకరింపబడిన తీవవంటి బాహువులుగల దానా-124. పుండ్రమనుశ్రేష్టమైన చేలకు వింటితో బ్లాకాశీంచు మృదువైన యెడమ చేయిగలదానా! రత్నాంగుళీయకములతోను పుష్పబాణములతోను ఒప్పిన కుడి చేయిగలదానా! స్తనమండలమున విశేషముగ బ్రకాశించు తెల్లనిహారములుగలదానా! పాశము, అంకుశము, భుజభూషణములు-వీనిచే బ్రకాశించిన భుజములతో నందమైనశరీరముగలదానా! -125. ముఖకాంతిచే శరత్కాల చంద్రబింబమును జయించినదానా! కమ్మలరత్నకిరణములచేనలంకరింపబడిన చెక్కిళ్ళగలదానా! ఎడమచేతిలో చక్కని తామరతూడుగల కమలమునుధరించినదానా! కరుణా ప్రవాహమును బ్రవహించు కనుకౌలుకులు గలదానా! మహేశ్వరి! -126. మణిహారపుమణులతో బ్రకాశించు శంఖముబోలికంఠముగలదానా! నుదుటనున్నచంద్రరేఖతో వెలుగెత్తిన ముంగురులతో శోభించుదానా! చిరునగవు మెఱుగులనొప్పినదానా! మనోహరమైన ముక్కుగలదానా! నేత్రశోభతోజయించిన కమలదళములు గలదానా! -127 చక్కని తీవ వంటి కనుబొమలుగలదానా! చక్కని ముఖముగలదానా! చక్కని నుదుటి చిత్రముగలదానా! యోగీంద్రులమనముల నెడికమలములనుండు హంసిస్వరూపిణి రత్నములు వరుసగా బొదిగిన బంగారు మహాకిరీటముగలదానా! సర్వాంగ సౌందర్యవతీ దేవాధిపునిచేత (ఇంద్రునిచేత) నమస్కరింపదగిన దానా!-128, కోరికల కనువైన వరములిచ్చుదానా! దయతో తడసిన (మెత్తనైన) చిత్తముగలదానా! సామ్రాజ్య సంపదచే అభిమానముగలదానా! చక్రమునకు సాథమైనదానా! ఇంద్రాదిదేవతలచే పూర్తిగా సేవింపబడిన పాదకమలములుగల దానా! సింహాసనమునకీశ్వరి! (మహాత్రిపురసుందరీ!) నాయందుచక్కగా నీలువుము -129, అని భక్తితో స్తుతించి యారాజు వెలుపలికి వచ్చి యామెకుడిభాగముననున్న మహాగౌరినీ జూచెను-130. భూమిపై సాష్టాంగదండ ప్రణామము జేసి, మరల నామెనుస్తుతించి, యామెకు గూడ గొప్ప విలువైన వివిధములైన వస్త్రములను-131. గొప్ప విలువగలిగివెలగలలేని గొప్పభూషణములను, ఇచ్చెను. ప్రదక్షిణము జేసి భార్యతోబాటు బయటికి వచ్చి-182. తనగురువు చెప్పిన రీతిలో మహాపూజను జేసి, యామెనే ధ్యానించుచు ఏడు రాత్రులుండెను-133. ఎనిమిదవదినమున దేవికి నమస్కరించి భక్తితో చూచుచు మనమున తల్లీ! నాకోరికనిమ్ము అని ప్రార్థించెను-184 దానికి సుప్రసన్నురాలైన ... కామాక్షి ఆకాశవాణి ద్వారా ఇట్లనెను. “ఓరాజా నాయంశగల నలుగురు కుమారులు నీకు గలుగుదురు”-134, అనుపలుకును విని సంతసముతో వికసించినముఖముగలవాడై అనన్య శరణుడై మాతయైన ఆపరాశ్రీదేవికి సాష్టాంగముగ ప్రణమిల్లి-136. మనస్సుతోనే  వెళ్లివచ్చెదనని శలవుదీసికొనీ, భార్యలతోను. మంత్రులతోను ఆ యిందుమతీపుత్రుడైన దశరథుడు అయోధ్యానగరికి జేరెను -187. ఇట్టి ప్రభావముగల శ్రీకామాక్షి సర్వలోకములహితమును గోరును. సమస్త భక్తులయొక్క కోరికలను మిక్కిలి సంపూర్ణముగ నెరవేర్చును-138. . లోకములలో పెక్కురు ఈ పరదేవతయైన కామాక్షిని శాస్త్రీయముగా భక్తితో నుపాసించి న్విశేషముగా కోరికలను బొందిరి-139. ఓ మునీ, ఇప్పుడు గూడ భక్తిమంతులు తమకోరికలను బొందుచునేయున్నారు. కామాక్షియొక్క దయాదృషులకు పాత్రులగువారు ముందు {భవిష్యత్కాలమున) గూడ అనేకులుగాగలరు. ఈశ్రీదేవి మాహాత్యమును వర్ణించుటకు ఎవడు సమర్థుడు? నేనుగాను, శంభువుగాడు, భ్రహ్మకాడు, విష్ణువుకాడు. తక్కినవారి విషయమై చెప్పనేల?-141. ఈ విధముగా మహాలక్ష్మియొక్క ఉజ్వలమైన శీలమును కొంచెము చెప్పితిని. అది వినువారికిని చదువువారీకిని సర్వపాపములను హరించునది. అనియనబడినది-142.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణముననుత్తరభాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున నలుబదీయవయధ్యాయము.40