16 -  ససేనావిజయయాత్రా నామ షోడశోఽధ్యాయః

 ఆ తరువాత జగన్మాతయైన లలితా పరమేశ్వరి ముల్లోకములకు కంటకుడైన భండాసురుని జయించుటకు బయలుదేరెను-1. ఆయుద్ద ప్రయత్నమున శక్తిసేనచే మ్రోయించబడిన బహువిధ వాద్యములతో దిక్కులు పిక్కటిల్ల మ్రోగినవి. ఆ వాద్యములు సప్త సముద్రములను సైతము మద్దెల యాకారములనుగా జేసినవి. అత్యున్నతములైన మద్దెల ధ్వనులు ఆకాశమెల్లనింపుచున్నవి-2. మృదంగములు, మురజములు, పటహములు, అతుకులీంగణములు, సేలుకములు, ఝల్లరులు, రాంఘలు, హండుకములు, హుండుకములు, ఘటములు-3. ఆనకములు, ప్రణవములు, గోముఖములు, అర్థచంద్రికలు, యవమధ్యములు, ముష్టిమధ్యములు, మర్దలములు, డిండిమములును-4. ఘర్ఘరములు, బరీతములు, ఇంగ్యాలింగ్య ప్రభేదజములు, ఉద్ధకములు, ఏతుహుండములు, నిఃసాణములు, బర్బరములు-5. హుంకారములు, కాకతుండములు, ఇంకను తక్కిన వాద్యభేదములును లలితాదేవియొక్క సమరోద్యమమున శక్తిసేనతో మ్రోయింపబడినవి-6. లలితా పరమేశాని యొక్క అంకుశాస్త్రమునుండి బయలువెడలిన సంపత్కరీ యనుదేవి తనశక్తులతో కదలేను-7. అనేక కోటియేనుగులు, గుఱ్ఱములయు, రథములయు పంక్తులచే సేవింపబడుచు లేత సూర్యునివలె నెఱనైన సంపదీశ్వరి మదించినదియు, ఉన్నతమైనదియు, యుద్ధనైపుణ్యము గలదియు, ఒక పర్వతముతో సమానముగానున్న ‘రణకోలాహల’ మను ఏనుగనధిరోహించెను-9. మహాసేనయంతయు ఘోరమైన ధ్వనిజేయుచు సామెననుసరించినది. శత్రుసేనలహింసించగలయేనుగరాజునుండి కదులుచున్న జెండాల వరుసలచే యాకాశమును వ్రాయుచున్నట్లున్నది-10. సంపదీశ్వరి యొక్క వక్షస్సుననున్నదియు ఆమె పైన స్తనములకు కొద్ది సంకటముగలిగించునదై ముళ్ళుదేలిన కంటక కవచసన్నాహముప్రకాశించెను-11. కోపించిన యముని బొమ్మముడివలె నామె చేత ధరించిన తీవ వంటి ఖడ్గము భయంకరమై ప్రకాశించుచున్నదీ-12. ఉత్పాతపాతమున చలించిన పర్వతముల వలే కోట్ల సంఖ్యలోనున్న. గోప్పగొప్పయేనుగులు ఆమెననుసరించివెళ్లినవీ-13. ఆ తరువాత లలితాదేవియొక్క పొశాయుధమునుండి బుట్టినశ్రీ అతిత్వరితమైన విక్రాంతి (నడక పరాక్రమము)గలదై అశ్వమునధిరోహించి ముందు కదిలెను-14. ఆమెతోబాటు. అశ్వసైన్యముకదలినది. గుజముల సకిలింతలతో తరంగితమైనట్లున్నది. నడకలో గిట్టలనెడిగుద్ధళ్లతో భూమీ పగుళ్లువారినదీ-15. వనాయుజములు, కాంబోజములు; పాదములు, సింధుదేశజములు, టంకణములు, పర్వతీయములు, పారసీకములు-16. అజానేయములు, ఘట్టధరములు, దరదములు, కాలవందిజములు, వల్మీకములు, యావనోద్భూతములు, గంధర్వములు (ఇవి భిన్నభిన్న దేశముల బుట్టినయశ్వజాతులు). తూర్పుదేశమున బుట్టినవి, కైరాతకములు, ప్రాంతదేశజములు-ఈ గుఱ్ఱములు చక్కని శిక్షణతో వినీతములై వేగవంతములై స్థిరచిత్తములై చక్కగా మనుష్యులను మోయునవి-18. స్వామిచిత్తమును విశేషముగా దెలిసినవి. మహాయుద్ధమునకు సహించునవి. అనేక శుభలక్షణములు గలవి. క్రోధమును జయించినవి (శాంత స్వభావము గలవి). శ్రమను జయించినవి, పంచధారలలోని శిక్షణతో నొప్పినవి. (అస్కందితము, రీతకము, రేచితము, వళితము, ప్లుతము ఇవియైదు అశ్వగతులు, పంచధారలు)-20. ఫలశుక్తి క్రియలతో గూడినవి, శ్వేతశుక్తులతో గూడినవి (శుక్తి=సుడి). దేవపద్మమును, దేవమణినీ, దేవస్వస్తికమును, గలిగియున్నవి-21. స్వస్తికము, శుక్తికము, గడురము, పుష్పగండిక-ఇవీ గుఱ్ఱముల శుభలక్షణములు జయమును రాజ్యమును ఇచ్చునవి. ఈ శుభచిహ్నములు గలిగి వాయువేగము గలవై యామెను (శ్రీని) అనుసరించినవి-22. అపరాజితమనుపేరుగలది, మిక్కిలి తేజోవంతమైనది, చురుకైనది, మిక్కిలియెత్తైన యాకారముగలదీ, కళ్లెముతో ప్రకాశించినముఖము గలది-23. రెండు ప్రక్కలను పాలి ప్రకాశించుచున్న వెంట్రుకలసమూహముగలది, లావైన తోక వెంట్రుకల కదలికలచే తాకబడుచున్న స్తనములుగలది-24. పాదములకు పైగా గట్టబడిన మణులు పొదగిన చీరుగజ్జెలతో ప్రకాశించునది. గిట్టల గట్టితికీడులచే భూమండల మహా వాద్యమును విజయ సమృద్దికొఱకు వ్రాయించినట్లున్నది. ఏదేని సూచనగా ధ్వనిజేయుచున్నవానికై చూపించినగతి క్రమము(నడక) గలది-26. చంచలములైన చామరముల మీషతో పైకెగిరీపరుగెత్తుటకై రెండు రెక్కలు ధరించినదాయన్నట్లున్నది. చిరుగంటల సమూహముతో గూడిన మనోహరములైన గుఱ్ఱపు తొడవులతో గూడినదీ-27. వీనియొక్క ధ్వనుల మిషమున రాక్షసులను హుంకరించున్నదాయన్నట్లు మహాదేవియశ్వారూఢయై వెళ్లాను-28. నాలుగు చేతులతో పాశము, అంకుశము, పేముబెత్తెము, కళ్ళెములగు పగ్గములను ధరించి, బహువిక్రమశోభినియై-29. లేత సూర్యునివలెనెఱఱ్ఱనిదై, తరంగములవలే ప్రకాశించుమొల నూలుగలదై, గుఱ్ఱమును నాట్యము జేయించుచున్నదాయన్నట్లు గుఱ్ఱమునెక్కి (యామహాదేవి) వెళ్లాను-30. ఆ తరువాత శ్రీదండనాథయొక్క సైన్యము బయలుదేరు భేరీధ్వని జగమంతయు చెవిటీగా జేసినదీ-31, కోరములైన వజ్రబాణములతో దశ దిక్కులు పిక్కటిల్లజేయుచు రాతివలె మిక్కిలి యుద్ధతములైన భుజములు గల కొందరు శక్తులు (స్త్రీ శక్తులు) విజృంభించినవి-32. కొందఱు చండీ శక్తులు (స్త్రీ శక్తులు) సేనా ముఖమునన్నువై, కత్తిని ఊలును దీసికొని, రణమునకు దూకీనవి-33, నూర్లకొలదీ బత్తెపు దెబ్బలతో అత్యంత సైన్యసంబాధమును, (సైన్యముగుమిగూడుటచే పరస్సరము గలుగు బోధను) నివారించుచున్నవై విశేషముగా నెగిరి తిరుగుచున్నవి-84. ఆ తరువాత మహిషాంకమును (దున్న పోతుగుర్తుగా గలవి) మృగాంకమును, సింహాంకమును ధరించుచున్న పతాకలపంక్తులు గల శక్తులు (సేనలతో) ముందే కదలినవి-35. తరువాత శ్రీ దండనాథయొక్క శ్వేతచ్చత్రమును వేయి విధములుగా కరములజాచి పట్టుకొని కొందఱు శక్తులు (స్త్రీలు) తెచ్చిరి-36.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున

ససేనావిజయయాత్రయను పదునాఱవ యధ్యాయము.