26 - కార్తవీర్యుఁడు జమదగ్నిఆశ్రమమును దర్శించుట

వసిష్ఠుఁడిట్లు పలికెను :-

 మాతా పితలచే నిట్లు అడుగబడి, ఓ రాజా ! రాముడు కృతాంజలియై తానాచరించిన దెల్ల వారలతో చెప్పెను. వారల కాతఁడు క్రమముగా తాను తపమాచరించుట, శంభుని ఆదేశమున తీర్థానము, ఆ శివుని యాజ్ఞ చేతనే దేవల కొఱకు రాక్షసుల వధించుట, హర ప్రసాదమున అకృతవ్రణ దర్శనాదీకమును చెప్పేను, (3) తత్సర్వమును, అంతీయేకాక, వేరుగా తనచే నాచరింపఁబడినదియు, సంతుష్ట మానసులయిన పితరులకు రాముడు వివరించెను. (4) వారు ఆతడు చెప్పిన తతర్మ సవిస్తరము వీనీ, సంహృష్ణులయిరీ, ఓ రాజా ! వారిరువురు హరాంతరంగులయిరి. (5) ఈ విధముగా భృగు పుంగవుఁడయిన రాముఁడు వారలకు విధేయాత్ముఁడయి శుశ్రూష యొనర్చెను. తన సోదరులకు కూడ శుశ్రూష యొనర్చెను. ఆ సమయముననే, హైహయేశ్వరుడొకఁడు చతురంగ బలాన్వితుఁడయి అరణ్యమునకు వేటకుం బోవ నభిలషించెను. గగనము బంధూక కుసుమారుణ వర్ణముతో రాగరంజితమయ్యెను. ఆ అరుణాంశువులు నక్షత్ర గణముల కాంతి నపహరించెను, ప్రాభాతిక వాయువులు మందముగా వీచుచుండెను. ఉదయకాల మారుతములు కేతకీ వన సమూహము నుండి బయలువెడలి కుముదాకరములను సంస్పృశించుచుండెను. నర్మదానదీతీరమునందలి వృక్షముల యందలి గూండ్లలో నివసించు పక్షులు విహరించుచు, మధురముగా కూయుచు, మనస్సునకు శ్రోత్రములకు సుఖావహముగా నుండెను. ముని బృందములు నర్మదా తీర స్ధములయిన తీర్థముల కరిగి, పాపమును తొలగించు జలముల యందు నిలబడి, శాశ్వత బ్రహ్మ సంబంధీ స్తోత్రములను పఠించుచుండిరి. పవిత్ర కార్యనిర్వహణమునకు విధిమంతమయిన స్నేహము గలిగి తత్తత్కార్యము లాచరించి సరిత్తటము నుండి వారి ఆశ్రమములకు ముని ముఖ్యులు తిరిగిపోవుచుండిరి వీర త్నులయిన ముని పత్నులు ప్రత్యేకముగా గృహకృత్యముల యందు నిమగ్నులై యుండిరి.మును ల యొక్క కుమార్తెలు హోమార్గము పాలను ధేనువుల నుండి పిదుకుచుండిరి. ముని కుమారులు పాలను తస్థానములకు తీసికొని పోవుచుండిరి. అగ్నిహోత్రము నాచరించుటకై జనములు తొందరపడుచుండిరి. సరోజములు వికసించినవి. భ్రమరకదంబము గానము చేయుచున్నది. పక్షులు తమగూండ్ల నుండి బయలు వెడలి సర్వత్ర సంచరించు చుండెను.

 మత్తేభములపై అనతి వ్యగ్ర మనస్సులతో సావధానముగా పోవు వారికి, రథములపై, తురంగములపై పోవు వారికి మందపవనముల గాత్రానందమును గలిగించు సమయమున, ఆశ్రమోపాంతములకు పుష్పములను జలమును జనముల తీసికొని పోవుచుండ, స్వాధ్యాయము నందు సమర్థులు, అజీనాంబరముల ధరించిన బహు వ్యక్తులచే, నానా విధములయిన మంత్రములు సమ్యక్కుగా ప్రయోగింపఁబడుచుండ, ప్రెష మంత్రములు పఠింపఁబడుచుండెను. హోమముల కొకు అగ్నులు ఆహ్వానింపఁబడుచుండెను. వేదముల యందు చెప్పఁబడిన మంత్రముల ననుసరించి యథావిధి తంత్రోక్తములయిన క్రియలు విపులముగా జరుపబడుచుండెను. జ్వలదగ్నిశీఖాకారమున, తమస్సును తపింపఁజేయు తేజస్సున సూర్యుఁడు చీకటిని తొలగగొట్టెను. మేదినీ యంతయు వెలుతురుచే ఆవరింపఁబడియుండెను. సవిత యుదయించుచుండెను. రాత్రి సంబంధమయిన చీకటి నశించుచుండెను. నక్షత్రములు అంతర్షితములయ్యెను. దిక్కులు ప్రకాశవంతములయ్యెను. హైహయవంశశ్వరుఁడు అయినరాజు, ఉదయకాలమున ఆచరింపవలసిన కార్యముల నిర్వర్తించి, పురోహితులతో, మంత్రులతో, స్వవయస్కులగు శ్రేయోవంతులగు రాజులతో అనంతమయిన సైన్య సమూహము యొక్క భారమున వసుధాతలమును క్రుంగజేయుచు, అశ్వరథకుంజరములతో సర్వదిక్కులను రథఘోషముచే ప్రతిధ్వనిల్లజేయుచు, తన బలముల యొక్క పద విక్షేపమున ప్రక్షుణమైన భూమి రేణువులతో ఆకాశము విమానశతముచే ఆవరింపఁబడియుండెనో యన్నట్లు కప్పుచు, స్వనగరము నుండి బయలువెడలెను. వింధ్యాదీసంబంధియైన ఘోరమయిన వనమును బల సముదాయములతో ప్రవేశించి, మహారాజు మిక్కిలిగా వనమంతటిని సంక్షోభిల్లునట్లు చేసెను. ఆ వనమును తన సైనికులచే చుట్టుముట్టి, వాడియైన శరములచే సానా విధములయిన క్రూర మృగములను చంపెను. లాగి విడిచిన శితబాణములచే కొట్టబడి గాయపడిన శరీరములతో శార్దూలములు నేలకొరిగెను. పదాతులయిన సైనికుల ఖడ్గములచే ఖండింపబడిన శరీరములతో పెద్ద పులులు నేలకు వ్రాలెను. అడవి పందులు కొన్ని రక్త సిక్తమయిన శరీరములతో నేలపై పర్వతములు ఒరిగిపడునట్లు పడెను. లేళ్లు ప్రచండమైన శక్తితో విడువబడిన బాణముల తలలు చీలి నేలకొరిగెను. బాణ సముదాయముచే కొట్టబడి సింహములు, వరాహములు, శరభములు, శర ఖండిత శరీరములై వనమందంతటను రక్తార్ట శరీరాలతో పడిపోయెను.

 అయ్యది యుగాంత కాలమేమో యన్నట్లు, వనమంతయు అల్లకల్లోలమై ఆకులత్వము చెందెను - కొన్ని హరిణములు వలలో చిక్కుకోవేను. కొన్ని వలలోఁబడ సిద్దముగ నుండెను; కొన్ని లేళ్లను వేట కుక్కలు తజుము చుండెను. కొన్ని లేళ్లు భయాకులమై పరువెత్తుచుండెను. కొన్ని ఆర్తములై భయంకరముగా ఆక్రోశించుచుండెను. ఏలయన ఆ యడవి మృగములన్నియు భయాతురము లై యుండెను. వాడియైన శరములతో కొందరు సైనికులు, సింహములు, పెద్దపులులు, ముండ్లపందులు, కుందేళ్ల గుంపులు, గోమాయువులు; గవయ మృగములు, వృకములు, కృష్ణసారములు, ద్వీపులు, ఖడ్గమృగములు, విచిత్రాంగములు: గల జాన్షి మృగములు, చిరుతపులులు మొదలగు మగవంటి నవేషములను చంపిరి. విధవర్ణములు గలిగిన లేక్షను, న్యంకులను దుప్పులను, సైనికులు చంపిరి. పాలఁడ్రాగు పిల్ల కేసరులను భవనములో నున్న వానిని, ముదునటి వానిని కొన్నింటినీ జంతువుల జంటలను వారు చంపిరి. (35) నిశితములైన శస్త్రములచే శస్త్ర వధ్యారములన ముగములను సైనికులు చంపిరి. హింసాకరములయిన షుగములను విశేషముగా చంపి నృపసైనికులందరు అధికముగా అలిసిపోయిరి. సూర్యుఁడు గగష మధ్యస్థుఁడయ్యెను. నసైన్యముగా రాజు ఘర్మ సంతప్తుఁడయ్యెను. నర్మదా నదిని దాహము తీర్చుకోమటకు చేరేమ. ఆతడు సబల పోహనుఁడై, నీటిలోనికి దిగి వారు స్వేచ్చముగా స్నానమాడిరి. రాజు కూడ ఆకలిచే దాహముచే పరిపీడితుఁడు అందు వారందరు స్నాన మాడిరి. సుఖవంతమణ చల్లనివగు నర్మదా జలములను త్రాగి, స్వచ్చములయినవి స్వాదుపులయినవియును (మర తూండ్లను తినిరి.చిరకాలము.నీటిలో క్రీడించిరి. తరువాత బల పహితముగా రాజు తీరవు నెక్కెను. తరుఃఖండోపమండితమయిన తరమున రాజు విశ్రమించేము సూర్యుడు క్రిందకు దిగెను. వేడి తను పైన్యముతో అనుచరులతో రాజు, వింధ్యాదీవనగహ్వరము నుండి, ఇంక పురమునకు నిర్ణమింపఁదలంచెను. రాజు బయలుదేరి, నర్మదా నదీ తీరము నాశ్రయించియున్న మహాత్ముఁడు పుణ్యశీలుఁడునయిన జమదగ్ని ఆశ్రమమును చూచెను. అంత సైన్యమును మరలించి, వానిని దూరముగా నుంచి, కొలదీమంది పరీచారకులతో, పురోహిత పురస్సరుఁడై ఆయాశ్రమమునకు వచ్చెను. ఆతఁడా రమ్యమైన ఆశ్రమలోనికరిగెను మునిశ్రేష్ఠుఁడయిన మునిని సమీపించి శిరస్సువంచీ రాజు నమస్కరించెను జమదగ్ని నృపోత్తముని విధివదరపాధ్యాసనములచే ఆశిషములచే నభినందించి పూజించేను. వనిచే విహిత విధిని పూంపండి గౌరవింపఁబడెను.

 ఆ యాశ్రమమును ప్రవేశించి ఆ మహాముని పురః ప్రదేశమున పరిశుభ్రమయిన ఆసనమున రాజు కూర్చుండెను. కుశాసనమున ఆసీనుఁడయిన ముని ఆసీనుఁడయిన రాజును, పుత్త్ర మిత్రాది బంధువుల గూర్చి కుశలప్రశ్న చేసెను. ఆ మునిశ్రేష్ఠుఁడు రాజుతో కొలది కాలము మాటాడి, ఆ రాజును ఆతిథ్యము కొఱకు ఆ మంత్రించెను (పిలిచెను). ఆ రాజు సంతోషించి జమదగ్నితో సీట్లు సంభాషించెను. “ఓ మహర్షీ ! నాకనుజ్ఞ నీప్పింపుము. సా పట్టణమునకు పోయెదను. నేను సమగ్ర వాహన బలములతో నుంటిని. ఆ కారణమున, ఓ మహామునీ! వనములందు లభించు వానిని తినెడు నీచే మాకాతిథ్యము నొసంగుట అశక్యము. అదీకాక, ఇప్పుడు మాకు నీవు నీ తపసామర్థ్యముచే ఆతిధ్య మొసంగుటకు శక్తిమంతుఁడవయినను, పట్టణమునకై పోవుటకు అనుజ్ఞ నీయగోరుచున్నాను. కాని పక్షమున, ఓ మునిసత్తమ! ఖలులయిన సైనికులచే, అత్యంతము, నియమమునకు క్షయమును గలిగించు పీడ తపస్వులకు కలుగును.

వసిష్ఠుడిట్లు చెప్పెను.

ఈ విధముగా రాజు పలుక ముని పుంగవుఁడాతనితో నీట్లనెను. 'దయ దలంచి క్షణముండుము.          నీ         సపరివారమున కంతటకిని క్షణములో ఆతిథ్యమును సంపాదించెదను. ఇట్లని ఆ ముని, కామగవిని (కామధేనువును) ఆహ్వానించెను. దానితో 'ఈతఁడు నా అతిథి. ఆతఁడు ఉపాగతుఁడు (వచ్చియుండెను). ఇప్పుడు నీపొతనికి సత్కృతి ఆచరించుము” అని. ఆ కామధేనువిట్లు చెప్పఁబడి, ముని యందలి గౌరవముచే నృపతీ వర్యునకెట్టి ఆతిథ్యము యోగ్యమో దానిని సంపూర్ణముగా సమకూర్చెను. అంత భృగుపుంగవుని యొక్క ఆశ్రమము దేవతారాజయిన ఇంద్రుని నగరమగు అమరావతితో తుల్యమైనదయ్యెను. మహాశక్తి మంతమయిన సురభి ప్రభావముచే ఊహింపనలవికాని వీభూతి విషయమయిన రూపము అనన్యసాధ్యమైన దాశ్రమమయ్యెను. అంతీయేకాక, అనేకములయిన రతోజ్వల చిత్రహేమ ప్రకాశమాలలచే ఉన్నతమై, పరిపూర్ణమై, యుండెను. లోపల ఆశ్రమము పూర్ణచంద్రుని శుభ్రద్యుతితో నిండి ఆకాశమంటు శృంగములు (శిఖరములు) గల ప్రాసాద సమూహముచే సంతటను నీండి ప్రకాశించెను. ఆ భవనములు కంచు, ఇత్తడి, రాగి, బంగారు లోహముల వర్ణములతో సౌధోపల దారు మృత్తులతో అంతియేకాక వేరువేరుగా కలిసియున్న అనేక భవనములతో నేత్ర మనోహరమై వెలుగొందెను. అందు మహార్హమైన రత్నోజ్జల హేమవేదికలు, కలవు.

విహారోద్యానములందు కలవు. మధ్య విశ్రాంతి భవనములు గలిగిన పర్వతములకు పోవుటకు సోపానములు కలవు. అయ్యప్ స్తంభములతో, వాసములతో, ద్వారములతో, గొళ్లెములతో, గోడలతో, గడపలతో, డాబాలతో, ముంగీకులతో కూడి యుండెను. ఆయశ్రమము వలఖీ సమూహముతో, అలిందములతో, చతురస్ర ప్రదేశములతో, సుందర పుష్పలతా గోపురములతో, ఒక మహానగరమువలె ప్రకాశించేను. స్తంభములపై గోడలపై నానావిధ విచిత్రములయిన చిత్రములు, వర్ణలేఖలు కలవు. అవి యన్నీయు రత్నములచే స్థగితములు. అయ్యవి వివిధములయిన ఎత్తులు గలిగిన బంగారు సింహాసనములతో నొప్పి యుండెను. వానియందు విశిష్టములయిన రత్నములు కలవు. భక్ష్య భోజ్యాదులు గలిగిన అన్నపానములతో గూడిన భాండములు గలిగిన కొన్ని ప్రదేశములు కలవు. దేవతల కుచితమయిన సర్వ సంపత్సమన్విత ములయిన గృహములు నేత్ర మనోభిరామములు గలవు.. నగరోపమానమయిన ఆయాశ్రమము మనోహరాకారములు గలిగిన వధువులతో ప్రకాశించుచుండెను.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందలి మధ్యభాగము నందలీ, తృతీయోపోదాతపాదమునందు అర్జునోపాఖ్యానమందు ఇరువది యారవ అధ్యాయము.