బ్రహ్మాండ మహా పురాణము
28 - పురూరవుడు పితరులు కలిసికొనుట - అమావాస్యనాడు సాంవత్సరిక శ్రాద్ధము నాచరించుట
ఋషి ఇట్లనెను :
ఓ సూతా ! ఇలాపుత్రుఁడు రాజునయిన పురూరవుఁడు అమావాస్యనాడు ప్రతిమాసము దీవమున కరిగెడుపొఁడు అదేట్లు? అతఁడు పితరులకెట్లు తర్పణము చేసెను?
సూతుఁడిట్లనెను.
ఓ శాంశపాయని ! ఆతని ప్రభావమును నేను చెప్పెదను, మహాత్ముఁడు ఐలపుత్రుఁడు, ఎట్లు సూర్యునితోను, చంద్రునితోను సంయోగము నొందెనో నేను చెప్పెదను. శుక్ల కృష్ణ పక్షములందు, అంత సారమయుడైన, చంద్రునియొక్క అభివృద్దిని క్షేణ్యమును గూర్చి చెప్పెదను. పితృమంతుని పితృశ్రాద్ద నిర్ణయమును గూర్చి చెప్పెదను. (3) చంద్రుని నుండి అమృతప్రాప్తినీ, పితరుల తర్పణమును (సంతుష్టి పరచుట) గూర్చి చెప్పెదను. పితరుల యొక్క దర్శనమును గూర్చి పితృదర్శనము - కావ్యుల యొక్క దర్శనము అగ్నిష్వాత్తుల యొక్క సౌమ్యుల యొక్క దర్శనములను గూర్చి చెప్పెదను. (4) పురూరవుఁడు స్వపితరుల నెట్లు తృప్తి పరచేనో, వీనినన్నింటిని గూర్చి పర్వములను గూర్చి యథాక్రమము చెప్పెదను. (5) సూర్యచంద్రులు ఏక నక్షత్రముతో అమావాస్య యందు ఒక రాత్రి ఏక కుండలులై నివసింతురు. (సూర్యచంద్రులు ఒక్కచో సమీపమున నుండుట అమావాస్య). (6) ప్రతి అమావాస్యాదినమున పురూరవుఁడు సూర్యుని చంద్రుని చూచుటకు పోవును. వారిరువురు ఆతనికి మాతామహపితామహులు. (7) ఆతఁడు వారికీ నమస్కరించి వారి యనుమతికై (ఆజ్ఞకై కాలాపేక్షకు) నిరీక్షించును. ఆతఁడు తన పితృదేవతల కొఱకు సోముని నుండి అమృతస్రావము కొఱకు నిరీక్షించును. (8) విద్వాంసుడు ఐలుఁడయిన పురూరవుఁడు మాస శ్రాద్దమును చేయగోరి సోముని పూజించును. ఆతడు ద్విలవను, కుహూమాత్రను. ఈ రెంటిని విచారించి, సినీవాలీ ప్రమాణముల బట్టి సినీవాలి నుపాసించి (10), అట్లే ‘కుహూ’ మాత్రుడై ‘కుహూ’ కళను దెలిసి యుపాసించును. అప్పుడా కళ నుపాసించిచున్నవాడై కాలాపేక్షియై చూచును. (చంద్రకళ కనబడని యమావాస్య ‘కుహూ’ అనబడును. చంద్రకళ కనబడిన యమావాస్య ‘సినీవాలి’ యనబడును). ఆ సుధామృతమైతే (దేవత) మాసతృప్తికై పదునైదు సుధామృత పరిసవములతో చంద్రుని నుండి ప్రవీంచుచుండును. (12) తరువాత కృష్ణ పక్షభుజులైన దేవతల ప్రీతిచే సూర్యకిరణముల దహ్యమానమై వెంటనే స్రవించు సౌమ్య (చంద్ర సంబంధమైన మధురూప సుధామృతముతో ఆ రాజేంద్రుడు (పురూరవుడు) నిర్వాత పక్షములలో పైతృక విధి విధానమున దివమున పితరులను తృప్తి పరచెను. (13,14)
ఆతఁడు సౌమ్యులు, బర్హిషదులు, కొవ్యులు, అగ్నీష్వాత్తులు మొదలయిన పితరులకు తర్పణము చేయును. ఋతమ్, అగ్నిగా చెప్పఁ బడినది. అయ్యదియే సంవత్సరముగా గ్రహింపఁబడినది, (15) సంవత్సరముల నుండి ఋతువులు పుట్టినవి. ఆర్తవములు ఋతువుల నుండి పుట్టినవి. ఆర్తవములనఁగా అర్ధమాసములు (పక్షములు) అందుచే పితరులు ఋతువుల బిడ్డలు (16) ఋతువులు పీతామహులు. మాసములు అయనములు (సూర్యగతులు) సంవత్సరముల బిడ్డలు. దేవతలు ప్రపితామహులు; పంచాబ్దముల సమూహము బ్రహ్మయొక్క బిడ్డలు. (17) సౌమ్యులు చంద్రుని నుండి (సోమునీ నుండి) జన్మించిన పొరుగా నెఱుంగవలెను. శుక్రుఁడు కవి; ఆ శుక్రుని యొక్క సుతులు కావ్యులుగా నెఱుంగవలెను. ఉపహూతులు దేవతలుగా స్వీకరింపఁబడిరి. సోమజులు, సోమపులుగా స్మరింపఁబడిరి. (18) (ఆజ్య హోమము నారగించువారు ఆజ్యపులు, ఆజ్యము నేయి) ఆజ్యపులనే కావ్యపులుగా జ్ఞాపకముంచుకొనవలెను. పితరులు మూడు విధముల పోరు. వారు మూడు తరగతులవారు. వారి పేర్లు కావ్యులు, బర్హిషదులు, అగ్నిష్వాత్తులును. (19) గృహస్థులైనవారు యజ్ఞముల సాచరించువారు, ఋతువులు బర్హిషదులు. యజ్వలు (యాగములు చేయనివారు) కాని వారు గృహస్థులు అగ్నిష్వాత్తులు కావ్యులు, అష్టకాపతులు,ఆర్తవులు.. ఇక పంచాబ్దముల గూర్చి యెఱుంగుము. వానీలో సంవత్సరము అగ్ని, సూర్యుఁడు పరివత్సరము. (21) సోముఁడు ఇద్వత్సరము. పొయువు అనువత్సరము; వారలకు రుద్రుఁడు వత్సరము. ఈ యైదువత్సరములు ‘యుగ’మగును. (22) ప్రతిమాసము స్వర్గమున (దీవిని) అమృతమును అమావాస్యనాఁడు పొందు పితరులు, కావ్యులు, ఊష్మపులు, దీపాకీర్త్యులు, (23) పురూరవుఁడున్నంత ‘కాలము’ అమృతముతో వారికి తర్పణ మొనర్చెను. ఆ అమృతము చంద్రుని నుండి ప్రతిమాసము స్రవించును. వారిని ఆనందపరచును కనుక అదే సోమపాయులకు అమృతము. అందుచేతనే అది సౌమ్యామృతమని పిలువం బడినది. (చంద్రునికి సంబంధించిన అమృతము). అదే సుధ. అదియే తేనె (మధువు) (25)
ఛందనులని పిలువఁబడు ముప్పది మూఁడు దేవతలు క్రమముగా చంద్రుని యొక్క 15 (పదియైదు) కళలను త్రాగుదురు. ఆ కళలు అంబుమయములు, (26) అర్ధమాసము సుధామృతమును ద్రాగీ, చతుర్దశియందు దేవతలు వెడలి పోవుదురు. ఈ విధముగా సర్వదేవతలచేం ద్రాగబడి. అమావాస్యనాడు చంద్రుఁడు పదునైదవ భాగమయిన యంశ మిగిలిన దశకు చేరును. ఇది. సుషుమ్నచే యథాక్రమముగా నమావాస్యయందాప్యాయితమై యుండును, అంత ద్వీలవకొలమా పితృదేవతలు సుధామృతమును ద్రాగుదురు. ఒకే కీరణముతో (సుషుమ్నతో) త్రాగబడి క్షీణతను పొందిన చంద్రుని, సూర్యుఁడు వృద్ధి పరచును. మరల సోమపాయులు ఆకళలను త్రాగుదురు. అన్ని కళలు (అంశలన్నియు) త్రాగబడినప్పుడు, సూర్యుఁడు చంద్రుని మరల వృద్ధి పరచును. (30) రోజు తరువాత రోజు క్రమముగా చంద్రుని యొక్క కళ సుషుమ్నచే వృద్ధి పొందింపఁబడును. కృష్ణ కళలు తగ్గును. శుక్ష కళలు వృద్ధి పొందింపఁబడును. ఈ విధముగా సూర్యుని యొక్క వీర్యముచే చంద్రునియొక్క తనువు వృద్ధి పొందింపఁబడును. ఇట్లు వృద్ధి పొందింపఁబడి పున్నమినాఁడు సంపూర్ణ చంద్ర మండలము కనిపించును. (32) శుక్ల కృష్ణ పక్షములలో సోముని యొక్క సంసిద్దీ యిట్టిది. ఈ విధముగా చంద్రుఁడు పితృమంతుఁడు. (పితృదేవతలతో నుండువాఁడు) ఆతఁడే ఇద్వత్సరముగా స్మరింపఁబడును. (33) ఆతఁడు అమృతము స్రవించు పదునైదీంటీతో ప్రకాశవంతుఁడై యుండును. ఇఁక పర్వములను, పర్వముల సంధులను గురించేప్పెదను. చెఱుకు గడలో వెదురుగడలో గట్టీవియైన కనుపులున్నట్లు శుక్లపక్షములో పర్వములుండును. (35) పూర్ణిమా అమావాస్యలకు గల భేదము గ్రంథులు సంధులు. పక్షముల సమకూర్చుచు ద్వీతీయా తిథితో ఆరంభమగు చంద్ర దివసములే పర్వములు. పర్వ సంధులలో అస్వాధాన క్రియలు జరుపబడును. అందువలననే ప్రతిపత్తు పర్వముల కొదీయందున్నదీ. (37)
సాయాహ్నమున అనుమతి ప్రారంభమున నుండు కాలము రెండు లవములు. (అనుమతి నుండి 15వ రోజు చతుర్ధశితో కలిసియుచు పూర్ణీమాతిని తీసివేయగా) ద్విలవ మనంబడును. (పూర్ణిమ ప్రతిపత్తిథితో కలిసినప్పుడు, తరువాత వచ్చు తిధి ద్విలవము) పూర్ణిమ యందు అపరాహ్నకమైన కాలము ద్విలవమే అని తెలియవలెను. (38) కృష్ణపక్షపు మొదటి సగములో అపరాహ్నము ‘గతించిన’ తరువాతి కాలపరిమితి పూర్ణమాసి యనీ అంగీకరింపఁ బడినది. (39) (ఈ వ్యతీపాత నిర్వచనము సూర్య సిద్ధాంతమునందు కంటే భిన్నముగా నున్నది. సూర్యసిద్దాంతములో “సూర్యుడు చంద్రుఁడు వారి ‘విషువునకు’ ఎదురుగా నుండ వారియొక్క ‘పంపు’ యొక్క నిమిషములు సమానమై యుండ అదీ వ్యతీపాతుము అనీ ఉన్నది. మూలములో స్పష్టముగా లేదు.) వ్యతీపాతపు లేఖార్ధమందు సూర్యుడు ఒక యుగము అంతరములో నుండగా, చంద్రుని యొక్క రేఖ ఒక యుగము దూరము దయింపఁగా ఆ కాలపరిమాణమును వ్యతీపాతమందురు. (40) ఇది యెందువలననగ ఒక పూర్ణమాసపు కాలము గతింష, సూర్య చంద్రులోండొరుల దీకై చూచుకొందురు. ఆ సమయములో వారిరువురు 180°లో నుందురు. (40,41) సూర్యునిచే నిర్దేశింపం బడిన ‘కాలమును’ చూచిన తరువాత (అర్చకుఁడు పూజించువాఁడు) సంఖ్యాగణమునకు ముందునకు కదలును. అయ్యది “వషట్రియా కోలము” ఆ కాలము వెంటనే నిరూపింపఁబడును. (విధీయతే) (42) పూర్ణ చంద్రుని యొక్క పూర్ణ పక్షమున రాత్రి (సమయ) సంధి కూడ (ఆనందముగా విరాజిల్లును). వ్యతీపాతము పూర్ణమైన వెనుక, మధ్యాహ్న సమయములో, పూర్ణ స్వరూపములలో సూర్యచంద్రులు పరస్పరము వీక్షించుకొందురు. దానిని పూర్ణిముయందురు. (44) 45 పితృదేవతలు, దేవతలతో నంగీకరించెదరు గోన పూర్ణిమకు పూర్వమందలి కాలము (చతుర్దశీ తిధి)తో కలిసి నట్టిది అనుమతిగా స్మరింపఁబడును (45) పూర్ణిమను ‘రాక’ యందురు. రాత్రి ప్రకాశించునుగాన. చంద్రుని యొక్క రంజనము వలన (ఆ దినమును) ‘రాక’ యని బుద్ధిమంతులందురు. (46) సూర్యుఁడు చంద్రుడును కలిసి ఒకే నక్షత్రమునందు (‘కాక’ నుండి 15వ రాత్రి యందు) ఉందురో దానిని అమావాస్య యందురు. (47) ఆమావాస్య దీనము పూర్తికాగా (విడివడగా) ఇరువురు దగ్గరకు వచ్చి సూర్యచంద్రు లోండొరుల పరస్పరము చూచుకొందురు. ఇది జరిగినప్పుడు ‘దర్శ’ అందురు. {48) అమావాస్య) (49) (సందిగ్ధముగా మూలమున్నట్లు తోచుచున్నది. వైడ్ (59) అమావాస్య నాడు కృష్ణపక్షపు 15వ దినమున, శుక్లపక్షపు ప్రథమ దినమున, సంధి రెండు లవముల కొలము. ఈ సంధికాలము ‘కు-హు’ అను రెండక్షరముల యుచ్చారణకు పట్టుకాలము. చంద్రునకు పర్వకాలములు మూఁడుగా పరిగణింతురు. (49) చంద్రుఁడు కనిపించక యంతర్షితుఁడయిన నాఁడు అమావాస్య. అయ్యది మధ్యాహ్న కాలము నుండి ప్రవర్తించును. చంద్రుఁడు సూర్యుని దీవసార్ధమున చేరును. (50) 51 సూర్యునితో సహా చంద్రుఁడు సముద్ర (కాలపరిమితి) మునకు పోవును. ఆ కాల వ్యవధి ఉదయమున కు-హు నకును ‘సినీవాలి’ కిని మధ్య నుండును. ఆ సంధీ కాలములు రెండు. అయ్యది. తప్పక మధ్యాహ్నమున జరుగును. (51) శుక్లపక్షపు ప్రతిపత్తునాఁడు, సూర్యచంద్రుల బింబములు (గోళములు) విడివడియుండగా, అది “ఆహుతీ”కి సమయము. (అగ్నిలో ఆహుతులు సమర్పించుటకు) అదియే ధర్మపు వషట్రియా సమయము. అమావాస్య ఈ పర్వము యొక్క ఋతు ముఖముగా నేఱుంగవలయును. కృష్ణపక్షములో చంద్రుఁడు క్షీణించుచు పోగా దిషా సమయమున అమావాస్య పర్వము. అందుచేతనే సూర్యుఁడు అమావాస్య నాఁడే గ్రహణము నొందును. (54) అయ్యది పగటి పూట యందే గ్రహణము నొందును అందుచే అమావాస్య పగటి పూట తగ్గును (?) పండితులు జలాత్మకుఁ డయిన చంద్రుని యొక్క వృద్ధి క్షయముల ననుసరించి, శుక్ల పక్షపు దినములను నిర్ణయించినారు. అప్పుడు సూర్యచంద్రులిరువురు తమ్ము వ్యక్తము చేసికొందురు (దర్శయేతాం) (56).
ఆ పథము నుండియే చంద్రుడు సూర్యమండలము నుండి క్రమముగా నిష్క్రమించును. చంద్రుఁడు సూర్యునితో ఒక దివారాత్ర ముండును. రాత్రి మాత్రము ద్విలవ కాల ప్రమాణము విడిచి, (57) దర్శకాలము ఆహుతికి వషత్రియ సమయము (ఆహుతులు వషట్ కారముతో జరుగును), ఆ కాల ప్రమాణము కోకిల ‘కుహూ’ నాదముతో సమాప్తి నందును. ఆ కాల ప్రమాణములో గణింపఁబడిన అమావాస్యను ‘కుహూ’. అనిరి. చంద్రుఁడు క్షీణ శేషుఁడై యుండగా ఆ కాలమునకు సీనీవాలీ యందురు. (59) అమావాస్యను సూర్యుడు ప్రవేశించును, అందుచే అది ‘సినీవాలి’గా స్మరింపఁబడుచున్నది ‘కుహూం వీనా’ వీని కాల పరిమితి అనుమతి, రాకా, సినీవాలీ - లకు రెండు లవములు. కుహూ కుహూ కలిగినట్లుగా స్మరింపఁబడుచున్నది. (కోకిల ‘కుహు’ అని ఉచ్చరించుటకు పట్టెడు కాలము) (60,61) పూర్ణిమ మధ్యమున సూర్యచంద్రుల వ్యతీపాతము కలిసి వచ్చినప్పుడు అయ్యదీ ప్రతిపత్తుగా అంగీకరింపఁబడినది. ఆ పర్వ కాలము రెండు మాత్రలు. అయ్యదియే కుహూ సినీవాలీ కాలపరిమితులకు మధ్యమ స్థానము. దానీనీ ‘సముద్ర’ అందురు (?) (62) అర్కాన్ని మండలములో సోముఁడుండునది పర్వకాలము అదియే ‘కలాసమకాలము) వారీ కళలు సమముగా నున్న సమయము, ఇట్లు శుక్లపక్షములో, రాత్రియందు, పర్వముల సంధిలో పూర్ణచంద్రుఁడు గ్రహణము నొందును. చంద్రుఁడు పరిపూర్ణుఁడగును గాన, పదీయైదవ రోజున పూర్ణిమ కలుగును. (కలలు దీనక్రమమున వృద్ధి పొందుచు వచ్చును). అందుచే చంద్రునకు 15 కళలు. 16వది ఆతనిది. అందుచే చంద్ర సంబంధమైన జలము యొక్క క్షయము 15వ దినపు రాత్రి కలుగును. ఇట్లు పితరులు దేవతలు, సోమపులు, సోమవర్ధనులు, ఆర్తవులు, ఋతువులు, వృద్ధులు, దేవతలు వారిని పూజింతురు. ఇంక మాస శ్రాద్ధముల పాల్గొను పితరుల గూర్చి చెప్పెదను.
ఆ పితరుల గతిని, శ్రాద్ధ క్రియ యొక్క ప్రాప్తిని వాని సిద్ధాంతములతో కూడ చెప్పెదను. మరణించిన పితరుల యొక్క గతిని (రాకపోకలను) ప్రసిద్ధములయిన తపస్సులచే అవగాహనము చేసికొనుట యశక్యము ఇంక ఈ చర్మ చక్షువులచే గ్రహింపలేమని వేరే చెప్పవలయుసా? ఈ లౌకిక పితరులు దేవ పితరుల తరువాత స్మరింపఁబడుదురు. (69) దేవతలు సౌమ్యులు, కావ్యులు, అయఙ్వనులు, మరి అయోనిజులు. వీరందరు దేవ పితరులు. దేవతలందరు వారిని పలికింపఁజేయుదురు. వారికంటే నితరులు మనుష్య పితరులు. వారిని లౌకిక పితరులనుగా స్మరించెదరు. వారెవ్వరన తండ్రులు, తాతలు, తాతతండ్రులు. (పితృ, పితామహ, ప్రపితామహా! ఎవరు సామమంత్రములచే యజ్ఞముల నాచరింతురో వారంరదు సోమవంతులు ఎవరు హవిర్యజ్ఞముల నాచరింతురో వారినీ బర్హిషదులుగా స్మరించెదరు. (72) హోమముచే యజ్ఞముల నాచరించువారు హోమినులు. యజ్ఞముల కనర్హులయిన అయాజ్యులకు యజ్ఞము చేయు హోమినులు అగ్నిష్వాత్తులుగా స్మరింపఁబడుదురు. ధర్మముల యందలి సమానత్వముచే, సాయుజ్యులనుగా బ్రాహ్మణులు తలంతురు. (సాధర్యముచే అద్వైత స్థిని పొందినవారు సాయుజ్యలు). (73) తత్తదాశ్రమ ధర్మములందు, వ్యవస్థితులైనవారును, యజ్ఞాది కర్మల యందు శ్రద్దాయుక్తులును, అంత్యకాలమున (మరణ కాలమున) విసుగెత్తి అలిసిపోరు. (నశింపరు) (74) తపస్సు, బ్రహ్మచర్యము, యజ్ఞము, సంతానము, శ్రాద్దము, విద్య ప్రదానము అను ఏడింటి యందు ఆమరణము శ్రద్దగా ఆసక్తులై యుందురో వారు స్వర్గమున కరిగి, దేవతలతో, పితరులతో, సూక్ష్మజులతో, సోమముచే యజ్ఞ మాచరించిన సోమయాజులతో, దేహ పతనానంతరము, సమ్మోదమందెదరు, పితరులవలె వారు పూజలాచరింతురు. వారి బంధువులచే గానీ కులీనులచేగానీ తర్పణాధకములు (నివాపోదకములు) ఈయబడినచో సోమ లౌకికులును పితృదేవతలు, మాస శ్రాద్ధములయందు పాల్గొని సంతృప్తులగుదురు. మాస శ్రాద్ధములను గ్రహించు వారలు మనుష్య పితరులు.
వీరికంటే ఇతరులయిన పితృదేవతలు కలరు. వారు ఆచరించిన కర్మలచే జనములందు తగుల్కొనియున్నవారు వారు తమ ఆశ్రమ ధర్మముల నుండి భ్రష్టులు. వారు స్వధా స్వాహా వివర్జితులు. (79) భిన్నదేహులు, దురాత్ములు యముని యొక్క నివాసమున (యమలోకమున) ప్రేతలయిన వారు యాతనా స్థానమును చేరి (శిక్షా స్థానము) పొరొనరించిన దుష్టకార్యముల దలంచి శోకింతురు; దీర్ఘాయుష్మంతులు; బాగుగా శుష్కించి యెండిపోయినవారు; మీసములు గలవారు; వస్త్రములు లేని వీవస్తులు; క్రుత్తుచే (ఆకలిచే) పిపాసచే (దాహముచే) కూడినవారు; ఇక్కడకు అక్కడకు పరువెత్తుకోనీ పోవుపోరు; నదులను, సరస్సులను, చెఱువులను, నూతులను చేరవలయునని కోరుకోనువారు; ఇతరుల అన్న పదార్థములను అపహరింపఁదలంచుపోరు; ఇతర ప్రదేశాలకు తీసికొని పోవంబడువారు; భిన్నభిన్న ప్రదేశములలో నేలకు పడీదొర్లుపొరు; శాల్మలము, వైతరణి, కుంభీపాకము, కరంభమౌలుక, అసిపత్ర వనము, శీలాసంట్రేషణము మొదలగు ఘోర నరకములందు, స్వకృత కర్మల ఫలితముగా నానా విధమైన అత్యంత పీడనల ననుభవించువారు, (84) (బాధాయుతులయిన పీతృదేవతలు నశింపరు), అందున్న వారికి, లోకాంతర మధ్యలలో దుఃఖించుచు, నిరాశులై యున్న వారికి వారి బాంధవులు వారి నామ గోత్రములతో భూలోకమున దర్బాస్తరణముల (దర్బలపై) మూడు పిండములు కుడి చేతితో నోసంగినచో వారు, ప్రేత లోకముల నున్న పితరులను సంతోష పరచెదరు. తృప్తి పరచేదరు, యాతనా స్థానమును (శిక్షా స్థానమును) చేరనట్టివాగు, ఐదు విధములుగా నేలకు పడునట్టివారు, స్థావరత్వమును చేందుదురు. కదలని వస్తువులుగా పుట్టెదరు). పూర్వము వాచరించిన దుష్కర్మలచే నీచవంశముల పుట్టెదరు. వారు నానా తిర్యగ్యోనుల యందు, సోనో రూపములలో, పుట్టెదరు. లేదా శాస్త్ర గ్రంధముల యందు నిర్ధారితముకానీ యోనులలో జన్మింతురు. (88) వివిధ జన్మలలో పొరుపయోగించు ఆహార పదార్థములతో శ్రాద్ధములాచరించిన, వారి శ్రాద్ధములు ఫలవంతములగును. ఆ జీవి ఎక్కడ జీవించునో పూర్వము శ్రాద్ధమున అరులయిన పోరీకి సకాలములో ఆహారమును సమకూర్చిన వీధమున ఆహారమును పొందును. గోవులు తప్పి పోయినను: వత్సము ఎట్లు తల్లిని పొందునో అట్లు మంత్రము పితరులకు శ్రాద్ధమున సమర్పించిన ఆహార పదార్థములును తీసికొనిపోయి యొసంగును. (90)
ఈ విధముగా శ్రద్ధా యుక్తముగా, మంత్రయుతముగా సకలమున యధావిధి నాచరించిన శ్రాద్ధము ఫలరహితము కాదు. వ్యర్థము కాదు. (91) కుమారుఁడు (స్కంధుఁడు) దివ్య నేత్రములతో దర్శించి ఈ విషయములను చెప్పెను. ఆతఁడు గతాగతజ్ఞుడు. (పితరుల యొక్క గతిని. ఆగతిని నెటింగినవాఁడు). అంతియేకాక ప్రేతల యొక్క శ్రాద్ధ ప్రాప్తిని తెలిసినవాడు. (92) వారినీ బాప్తికులుగా ఊష్మపులుగా, దీపో కీర్త్యులుగా స్మరింతురు. కృష్ణపక్షము పొరికీ పగలు. శుక్లపక్షము పోరు నిద్రించుటకు రాత్రి. (93) ఈ విధముగా పితృదేవతలు (పితరులు) దేవతలు, దేవతలు పితరులు. ఋతువులు, ఆర్తవములు, అర్దమాసములు (పక్షములు) పరస్పరము (అన్యోన్యము) పితరులుగా స్మరింపం బడుదురు. (94) ఈ విధముగా పితరులు, దేవతలు. మనుష్య పితరులు వీరు శ్రాద్ధక్రియలు శ్రద్ధాయుతము సక్రమముగా జరుపబడ సంతోషింతురు. వారు ప్రీతులుకోగా వారి సంతానము కూడ సంతుష్టమగును. (95) ఈ విధముగా సోమపాయులయిన పితరుల యొక్క విచయము (పరిశోధన) చెప్పఁబడినది. ఈ విధమయిన పితృ సతత్త్వము సునిశ్చితముగ పురాణములయందు చెప్పబడినది. (96) సుధామృతపు ప్రాప్తి పితరులకు తర్పణము, పూర్ణామావాస్యల యొక్క కాల ప్రమాణము యాతనాస్థానము మీకు సూక్ష్మముగా చెప్పితిని. ఇదియే సనాతన సృష్టి. (98) సృష్టియొక్క వైశ్వరూపము పాక్షికముగ (కొంతభాగము) చెప్పబడినది. దానిని పూర్తిగా వివరించుట అశక్యము. ఐశ్వర్యము నభిలషించువారు దీనిని విశ్వసింపవలయును. ఈ స్వాయంభువమను సృష్టిని గూర్చి ప్రారంభించి సవిస్తరముగా ఆనుపూర్వకముగా చెప్పితిని. మరల నేను మీకేమి వర్ణింతును!
ఇది వాయుప్రోక్త బ్రహ్మాండ మహాపురాణమున పూర్వభాగమందు ద్వితీయానుషంగపాదమున అమావాస్య శ్రాద్ధమునందు పితృవిచయము అను (పరిశోధన) ఇరువది యెనిమిదవ అధ్యాయము.
Summary of chapter 28 of the Brahmānda Mahā Purana is as follows:
This deeply touching chapter illustrates the sacred bond between the living and the departed, recounting the pious meeting between king Purūravas and the heavenly ancestors. It gracefully emphasizes the vital importance of performing annual obsequies on the dark moon day, an act of supreme filial piety and devotion. The narrative inspires the faithful to honor their roots and sustain the celestial ancestors with loving offerings, ensuring the continued flow of divine blessings upon the earthly realm.