బ్రహ్మాండ మహా పురాణము
25 - విషంగపలాయనం
ఆ తరువాత తపోబలవంతులైన బలాహలాది సప్తసేనాపతులవధను విని భండాసురుడు నల్లనాగరాజువలే బుసకొట్టెను, మహోదరుల నిరువురి నేకాంతమునకు బిలిచి మంత్రాలోచనము జేసెను. భయంకరమైన పరాక్రమముగల భండాసురుడు రణమున జయింపదలచేను యువరాజు గూడ కోపముగలవాడై తన తమ్ముడైన విషంగునితో వచ్చి భండాసురుని నమస్కరించి మంత్రాలోచన స్థానమునకు జేరెను. కుటిలాక్షుడు, మొదలగు ఆప్తమంత్రులతో గూడి కోపముతో మసలిన హృదయముగలవాడై లలితా విజయమునకై మంత్రాలోచనము జేసెను.
భండుడనెను:- ఆశ్చర్యము. అయ్యో రాక్షసులకు కులభ్రంశము వచ్చినది. ఇప్పుడా బలవంతుడైన వీధి ఉపేక్ష చేయ మొదలిడినాడు నా సేవకుల నామము వీన్నంతమాత్రమున దేవతలు పరుగెత్తిపోపుచుండిరి. అట్టిమాకు ఈ వీపర్యాసము: (మార్పు వచ్చినది. దుష్టవిధాత బలవంతుని నపుంసకుని- జేయును. ధనికుని దరిద్రుని జేయును, దీర్ఘాయుష్కుని నాయుష్యములేనీ వానినీ జేయును. . భవితవ్యత దుఃఖముగానే భరింపబడును. మనబాహువుల బలమెక్కడ! ఈ దుష్ట సుందరియైన యాడదీయెక్కడ? ఆ సమయముననే విధి దీనిని జేసెను. విధి కఠినుడుగదా, ఎదిరింపనలవిగాని శౌర్యముగల సర్పీణీయొక్క మాయతో విజృంభించిన రాక్షససేనా నాయకులు యుద్ధభూమండలముననే వధింపబడిరిగదా! ఈ విధముగా మహామదముతోనాప్పిన స్త్రీ యొక మాయావతియగు స్త్రీ మనలను . చావమోదుచున్నదన నీక మన భుజములతో సంపాదించిన బలమునకు ధిక్కారము. ఈ మాటను జెప్పుటకు నానాలుక సిగ్గిలుచున్నది. . దుర్మదయైన యొక యాడుది నా సైన్యమునెట్లు మర్ధింపగలిగెను?. కావున నీచట దాని మూలమును ఛేదించుటకు ప్రయత్నము జేయవలె. ఆమె ప్రవృత్తి మిక్కిలి బలిష్టమైనదని నేను చారులవల్ల దెలిసికొంటిని. ఆమె యన్ని సైన్యములకును వెనుకనే యుండును. ఆమె ముందుగనే గుఱములయు ఏనుగలయు రథములయు సైన్యములు నడచును, ఈ సమయముననే పార్టీగ్రాహము {దండెత్తి వచ్చునామెకు వెనుకనుండి వధించుట) చేయవలె. ఈ పార్టీగ్రాహమును జేయుటకు విషంగుడు చతురుడుగావలెను , అతనితోడుగా మదోన్మత్తులు బహుసంగ్రాములలో మగ్గింపనలవిగాని వారునైన పదీయైడక్షౌహిణులసేనలు రణోత్సాహముతోనుండవలై, ఆమెకు. వెనుక నంతగా పరిహారములుండవు. లేదా కొద్దిపరివారములచే రక్షింపబడియుండును. కావున విషంగుడామెను సులభముగా బంధింపవచ్చును. కావున ఓ విషంగా! మదోత్కటుడవై (మదముచే నుబ్బిన చెక్కిళ్ళుగలవాడవై) బహుసన్నాహమును పూర్తిగా చేసి " రహస్యముగా సొమెను వెనుకనుండి బంధింపుము. మొదట పరాక్రమముతో కొద్దిసేనయె నీ వెంబడి రావలె, తరువాత దీక్పాలుర విజయములో విజృంభించిన సేనానులు సంసిద్ధులై రావలె. ఈ విధముగా పదునైదక్షౌహిణుల సేనలు నడచుగాక, నీవు గుప్తవేషుడవై ఆ దుష్టురాలిని దుమికి ఒడిసి పట్టి చంపుము. ఆమెయే సమస్త శక్తులకు మూలభూతయైన మహాశక్తి. అదీ సమూలముగా నశించినచో శక్తి సమూహామంతము నశించును. తామరతీవ యొక్క మూలము ఛేదించినచో నీటిపై దాని దళజాలమంతయు (సైన్యదళ సమూహామని యర్గాంతరము) నశించును. అట్లే శక్తులందరు నశింతురు. అందరికంటే వెనుక ప్రకాశించుచు నడచు రథము ఆమెది. దాని యెత్తు పదీయోజనములు. పెద్దముత్యము గొడుగుచే నందరికన్న నెత్తున శోభిల్లును. నాలుగు చామరములచే వీవబడుచుండును, దాని యెత్తేన జెండాల సమూహములు ఆకాశమండలమంతయు నొరయుచుండును. ఇట్టి రథమున ఆ దుష్టురాలు, లేడివంటి కన్నులగలది (రణమున) వచ్చును. రహస్యముగా ఈ గుర్తులతో 'నామెను గుర్తించి మీదికి దుమీకి.' యాదురాచారను జయించి కొప్పులాగి మర్దింపుము. తన. మహాబలసైన్యము ముందుకు పోగా స్త్రీ మాత్రమే రక్షణగల యామె వెంటనే నీకు వశముగాగలదు. నీకు సహాయభూతులైన సేనాపతుల పేరులివి. వారు నీకు యుద్ధమున చురుకుగా సహాయపడవలెను. మొదటివాడు మదనకుడు, రెండవవాడు దీర్ఘజిహ్వుడు, హంబకుడు, పులుములుడు, కక్షసుడు, కక్షివాహనుడు, ధుక్షసుడు, పుండ్రకేతువు, చండబాహువు, కుక్కురుడు. జంబుకాక్షుడు, జంభనుడు, తీక్షశృంగుడు, త్రికంటకుడు, చంద్రగుప్తుడు-వీరు పదునైదుగురు సేనానాయకులు, ఈ దమనాది మహాబలులైన సేనాపతులు ఒక్కొక యక్షౌహిణీ సేనతోగూడిన వారై నీతో గూడ వత్తురు. శత్రు రాజధానికి దెలియకుండ రహస్యముగా జేరి పార్టీగ్రాహము జేయుము. ఈ కార్యమున మహామహుల ప్రౌఢిమను వహించుచు ఓవిషంగా! ఉత్తమోత్తమమైన జయసిద్ధినీ బొందుదువు, దుష్టమంత్రోలోచన గల భండాసురుడు ఈ విధముగా మంత్రాలోచనముజేసి సైన్యపాలకులతో సురక్షితుడైన విషంగుని లలితపైకిబంపెను.
ఆ తరువాత యువరాజు. తమ్ముడగు విషంగదైత్యుడు శ్రీలలితాదేవి యొక్క పారిశ్రాహమున కుద్యతుడు' గాగా సూర్యుడస్తమించెను లోకభయంకరమైన మొదటియుద్ధదివసము గడువగా నాతనిని వెలివేటుటకై చీకటియయ్యెను, ఆ మొదటి సాటి చీకటి, దున్నపోతు మూపురమువలె, పొగ. వన్నెగలది, అడవి పంది, శరీరపుకాంతి గలది, శివుని కంఠమువలె నల్లనైనది. దట్టమైనది. పొదలలో " దట్టమైనది. వాని రంధ్రపు సందుల నుండి పరుగిడు చున్నట్లున్నది. భూ వివరముల నుండి వేల విధములుగా పైకి వెడలుచున్నట్లున్నది," పర్వతముల యొక్క గుహా మందిరము నుండి మిక్కిలి బయల్వెడలుచున్నట్లున్నది. ఒకచోట దీపకాంతుల సమూహములతో భీతిల్లినట్లు ప్రవర్తించుచున్నది. స్త్రీలు ధరించిన చెవికలుపల కాంతి నాధారముగ జేసికొన్నది కలువ వన్నెగలది) కాటుకయందేకీభూతమైన , ప్రౌఢదిగ్గజము వలెనున్నది ప్రకాశించిన పచ్చిక బయలుతో బద్ధమైత్రిని బొందినట్లున్నది. (పచ్చికబయలు కాంతిగలది). కదులుచున్న " కట్టేవంటి కత్తులతో ప్రియాలింగనము జేసికొన్నట్లున్నది. (కత్తిధారవలె నల్లనైనది), నల్లని వనపంక్తులలో రహస్యముగా ప్రవేశించినట్లు నల్లగానున్నది. " ఇట్టి చీకటిక్రమముగా విశాలమగుచు వ్యాపించెను. రాత్రీసుందరి తన నల్లని కవచకాంతితో. సమానమైన! చీకటితో విశ్వమునంతటినావరించెను. ఏమియు కనబడలేదు. కాని మిక్కిలి దుష్టులైన రాక్షసులకు రాత్రియే బలమునిచ్చునది. ఇదియంతయు వారి మాయావిలాసము. అది రాత్రీయందే వర్థిల్లును. తరువాత. మహౌజస్కుడైన విషంగుడు తన సైన్యమును . నడిపించేను. తెల్లని తీవలవంటి కత్తులకాంతులతో చీకటిగుంపులు పెంపొందినవి, దమనుడు మొదలగు. సేనాపతులు, నల్లని
ముండ్లుగల కవచములు ధరించిరి. నల్లని తలపాగాలు ధరించిరి. నల్లని కప్పువస్త్రముల ధరించిరి. మొత్తము పైన" మిక్కిలి విశాలమైన చీకటిలోవారేకమైన వారివలె నుండిరి. వారు అగ్రజునకు నమస్కరించిన విషంగుని ననుసరించిరి. అతడు. (విషంగుడు) కపట యుద్దముతో మహేశ్వరిని జయింపదలచెను. మేఘడంబరమను ముండ్లకవచమును రొమ్మున ధరించెను. అతని వేషసంగ్రహము . రాత్రి యుద్ధమున కనురూపమై యుండినది. వాని సేనకూడ కవచాదులను నల్లనివిగానే ధరించేను. రణదుందుభుల మోగలేదు." మద్దెలల గర్జనలు గూడ లేవు, ప్రణవము, ఆనకము, భేరి మొదలగు రణవాద్యములు ఘోషలు లేవు. చీకటి నావరించుకొని రహస్యమైన నడకలతో (రాక్షసులు బయలుదేరిరి. ఇతరులకు శత్రువులకు కనబడని గతులు నడకలు మార్గము గలవారు.. (కోశమునుండి సన్నద్ధముగ దీసిన ఖడ్గములు గలవారు.) వారు లలితా దేవి యొక్క సైన్యమునకు పశ్చిమాభీముఖముగా పోవుచున్నారు . అడుగడుగున ధ్వనితో గూడిన నిట్టూర్పును గూడ విడువక ఆవృతమైన యుత్తరమార్గముతో పూర్వభాగము నాశ్రయించిరి."సావధానులై బయలుదేరిన దానవులు. లలితాదేవి యొక్క పారిగాప్రమున (వెనుక నుండి బంధించుటకై మరల పురము యొక్క దిగ్భాగమునకు వెళ్లి మందపరాక్రములైరి. అడిగిన వారికి తమను లలితా సైన్యమునుగనే సూచించిరి. చప్పుడులేకుండగా కవచములతో గప్పబడిన శరీరము గలవారై,లలితా దేవి వెనుక భాగమునకు వచ్చిరి. దేవి యొక్క చక్రరాజ రథమును జూచిరి. అదిమేరు-మందర.... పర్వతములవలె నున్నది. జ్వలించుచున్న శక్తులతో జుట్టబడియున్నదీ, ఆ రథమున ముత్యముల గొడుగు క్రింద వేయి సూర్యుల." కాంతితో బ్రకాశించుచు పశ్చిమాభిముఖముగానున్న లలితా మహేశ్వరిని జూచిరి. ఆమె కామేశ్వరి మొదలగు లలితాదేవితో సమానమైన టైశ్వర్యముగల నిత్యాశక్తులతో పరిహాసపుమాటల వినోదముతో సేవింపబడుచున్నదీ. మీక్కిలి దురాశయుడైన విషంగుడు పైజెప్పిన . వృత్తాంతము గలిగి, సాటిలేని రణ ప్రయత్నముగల లలితాదేవిని, ఆమెముందున్న మహాసైన్యమును ఉత్కంఠంతో జూచుచు. ఆమెనే భావించుచు చక్రరాజరథేంద్రము యొక్క వెనుక భాగమున తన సైనికులతో గట్టిగా తాకుచుండెను. అచట అణిమాదిశక్తుల యొక్క పరీవారరూపమైన సేనయుండెను. అప్పుడు నూటికి మించిన యణిమాదిశక్తులు మహాకలకలముజేసిరీ. వజ్రపువేటు వేయగల ." పట్టిశములచేతను, దృఘణముచేతను, భీండిపాలముల చేతను, భుశుండుల చేతను శక్తిమండలమును. మర్ధించుచు మహాసత్వులైన దానవులు సమరమును మిక్కిలి బహుమానించిరి. దానవుల యాకస్మిక రణోత్సాహముచే విశేషముగామారిన యాకారముగలగినదై. చక్రరాజరథమునందున్న శక్తి మండలము అకస్మాత్తుగా క్షుభితమయ్యెను. చీకటులను సృష్టించు దానవులు కనబడని విటములతో (చీల్చెడి గొడ్డలివంటి యాయుధములతో) (రథమును) చీల్చుచుండిరి. ఆ తరువాత చక్రరథేంద్రము యొక్క తొమ్మిదవ పర్వముననున్న వారు (స్త్రీలు) కనబడని తమ శస్త్రములు కవచములుగలిగి. చీకటి గప్పిన రూపములు గల దానవులయొక్క బాణములచే నీటునటు గప్పబడిన మర్మములు గలవారివలెనైరి శక్తి మండలము మిక్కిలి బాధచెందినద, అపుడు శక్తుల సమూహము లలితాదేవిని గూర్చి కేకలువేసినది. అచట పూర్వానుక్రమముగా (తూర్పు దక్షిణ పశ్చిముల వరుసలో) సువిశాలమైన భయము వచ్చిపడినది-అని కర్ణాకర్ణికగా విని లలితాదేవి కోపము వహించెను. ఇంతలో చండుడైన భండాసురుడు దుర్మంత్రణ పండితుడై. పద్యక్షౌహిణులతోబాటు. - మహాతేజస్వియైన కుటిలాక్షుని బంపైను. ఆ కుటీలాక్షుడు వెనుక కలకలమును విని ముందున్న లలితా సైన్యము రాకుండగా మహాయుద్దమును జేసెను. కాగా లలితా దేవికి ముందును వెనుకను యుద్ధము జరిగెను. శక్తుల సైన్యమున మిక్కిలి తుములమైన గొప్పయుద్ధము జరిగెను. రాత్రి బలవంతులైన రాక్షసాధిపతులు. చీకటిచే నావరింపబడి విజృభించియు ఇటునటు కంటకమున పలుచనైరీ. దురాశుడైన నిషంగుని చేతను, దమనాధులగు సేనాపతుల చేతను, సేనలచేతను, కోట్లకొలది శత్రువులు కొట్టబడి - పడిపోయిరి: దానవుల శస్త్రమాలలచే నావరింపబడిన చక్రరాజరథము దట్టమైన కొంగలతో జుట్టబడిన హిమాలయ పర్వతమువలె బ్రికొశించినది-, దరాత్ముడైన విషంగుడు క్రింది రథపర్వము నాక్రమించి లలితాదేవిపై యొక బాణమును వదిలెను. అది దేవియొక్క విసనకర్రను చూర్ణముగావించెను . ఆ బాణము తప్పుటచే శక్తిమండలము సంభ్రాంతిచెందినది. కామేశ్వరి మొదలగు నిత్యాశక్తులు - మిక్కిలి కోపమును జేందిరీ. శ్రీదేవి ముఖకమలము కొద్దిగా కనుబొమ్మల ముడివైచినది. అది చూచి యుద్వేగముచెందిన నిత్యాశక్తులు మిక్కిలి శ్రమను వహించిరి. నిత్యాశక్తులు కాల స్వరూపిణులు. ప్రత్యేకముగా తిథులే విగ్రహముగా గలవారు. సామ్రాజ్ఞయైన " లలితాదేవి యొక్క కోపమును జూచి యుద్ధమునకు ప్రయత్నము చేసిరీ. మహోదయయు, మహారాజ్ఞియునై మహాదేవియైన లలితాదేవికి నమస్కరించిరి. కంఠమునందు యుద్ధకౌతుకముచే గద్గదికరాగా అకస్మాత్తుగా బయలుపెడలిన మాటలనిట్లనిరి.
తిథినిత్యాశక్తులు చెప్పిరి: - ఓ దేవదేవి! మహారాజ్ఞి! నీ ముందు చూడబడిన సైన్యము దండినీమంత్రనాథాది. "మహాశక్తులచే నభి. - పాలింపబడినది. దానిని తిరస్కరించి యెదిరించుటకు పిరికివారై దుష్టులైన రాక్షసులు మాయకపట పరాయణులై పార్టి గ్రాహ యుద్ధముతో (వెనుక వైపు జేరి చేయు కపట. యుద్ధముతో) చక్ర రాజ రథేంద్రమును బాధించుచున్నారు. కావున, చీకటి కప్పిన యాకారములుగల దానవుల మదమును మేము అణగగొట్టెదము. ఒక క్షణ కాలము చూడుము. ఈ వహ్నివాసినీ నిత్యాశక్తియు . - జ్వాలో మాలినియైన పరాశక్తియు - వీరిరువురిచే ప్రజ్వలింప చేయబడిన యుద్ధమును రాక్షసులు. చూడగలరా? పార్ప్ గ్రహ . యుద్ధమునకు బూనుకొనిన దానవుల మహామడమును జల్లార్చి శ్రీదేవి పదకమలముల సేవించుటకు వచ్చెదము, కావున ఓ మహారాణీ! ఆ దురాత్ముల మగ్గించుట కానొసగము. నిత్యాశక్తులిట్లనగా లలితాదేవి అట్లేయగుగాక యని యనెను. తరువాత నా కామేశ్వరీనిత్యాశక్తి . లలితా పరమేశ్వరిని నమస్కరించి యామె పంపగా, ధనువెక్కుపెట్టి. కూట యుద్దమునకు దీక్ష బూనిన యా దురాచార దానవులను జంపుటకై తన ముఖమును బాలసూర్యునివలె నెళ్తగా జేసి, ఓరోరీ! పాపాత్ములారా! నిలుడు! నీలుడు! మాయ నవలంబించిన మిమ్ములను తుత్తునియలు చేసెద. చీకటిని అవకాశముగా దీసికొని కపట యుద్ధ పరాయణులైతిరి," అని వారిని బెదిరించుచు అమ్ములపొది నుండి తీసిన బాణముతో కోపకృతమైన తడబాటు నడకతో పర్వము నుండి దిగెన. చేత విల్లెక్కుపెట్టినవారై “భగమాల' మొదలగు వారు తక్కిన నిత్యాశక్తులును పర్వమునుండి దిగిరి. జ్వాలామాలినీ నిత్యాశక్తీ, వహ్ని వాసినీ నిత్యాశక్తియు, యుద్ధము సిద్ధము సొగా తమ తేజములతో రణమున ప్రజ్వలించి ప్రకాశించిరి. యుద్దమండలము ప్రజ్వలింపగా దుష్ట రాక్షసులుగూడ తేజోవంతమైన శరీరముగలవారై మహా క్రోధము నందిరీ. కామేశ్వరి మొదలగు పదునైదు నిత్యాశక్తులు సాయుధలై సింహనాదము జేయుచు లీలగనే యాదైత్యులందరిని మర్దించిరి మందర పర్వత మథనమున సముద్రమున నెగసిన యల మండలమువలె యుద్ధభూమిలో మహా కలకలము గలిగెను. ఆ నిత్యా శక్తులు యుద్ధమున తిరుగుచు ధ్వని జేయు కంకణముల చేతులతో ప్రాణమను ధనువులను లాగి ఉద్దతమైన యుద్దమును విజృంభింపజేసిరి. మూడు జాముల వరకు ఈ విధముగా యుద్ధము జరిగెను, నిత్యా శక్తుల నిశిత బాణములచే అక్షౌహిణీ సేనలు సంహరింపబడినవి. మొద కామేశ్వరి తన బాణములతో దుష్టుడైన దమనుని జంపెను. భగమాలాశక్తి - సేనానాయకుడైన దీర్ఘ జీహుని జీల్చిచంపెను. నిత్యక్లిన్నా శక్తి హుంబీకుని, భేరుండాశక్తి హులుమల్లకుని జంపిరీ, వహ్నివాసాశక్తి కక్షసుని, నూరు శరములచే జంపెను. మహావజ్రేశ్వరీశక్తి కేకివాహనుని ఛేదించెను. శివదూతీ పుక్షసునీ యమాలయమునకంపెను. త్వరితా శక్తి భుజములచే నుద్దండుడైన పుండ్రకేతువును చీల్చిచంపెను. కులసుందరికానిత్యాశక్తి చండబాహుని, కుక్కురుని జంపెను." నీలపతాకయు విజయయు జయముచే నుద్దతలై జంబుకాక్షుని జృంభణుని రణమున బలిచేసిరి. సర్వమంగళీకానిత్యాశక్తి తీక్ష శృంగుని . ముక్కలు చేసెను. జ్వాలా మాలిని నీత్యాశక్తి ఉగ్రుడైన శ్రీకర్ణకుని జంపెను. చిత్రాశక్తి దుఃశీలుడు చిత్రుడునైన. చంద్రగుప్తుని చీల్చిచంపెను. దురాత్ములైన సేనానాయకులందరు 'చంపబడగా. పెద్దవాడైన విషంగుడు కోపించి బలవంతుడై ముందుకేగెను. జాము మిగిలియున్న రాత్రియందు రెండు ఘడియలు దురాశయుడైన యా విషంగుడు నిత్యాశక్తులతో యుద్ధముజేసి తనయశక్తత్వము నూహించి పారిపోవ మొదలిడెను. కామేశ్వరకరములచే లాగి వదిలిన బాణములతో కవచము ఛేదింపబడగా విషంగుడు మిక్కిలి వివశుడయ్యెను. చావగా మిగిలిన యోధులతో సహ ఫలాయనమే చిత్తగించేను. ఆ దుష్ట దానవుడు దండనాథాశక్తి యొక్క యమ దండ సమములైన బాణములచే, చంపబడవలసియుండుటచే, వానిని కామేశ్వరి తన బాణములతో జంపలేదు. ఆ దుష్టుడైన భండాసుర సోదరుడగు విషంగుడు పారిపోగా రాత్రి తెల్లవారినదీ, దిక్కులు నిర్మలములైనవి. పారిపోవు వీరుల ననుసరించుట యాచిత్యముగాదు - అని ఆనిత్యాశక్తులపుడు యుద్ధమునుండి విరమించిర. దానవుల శస్త్రముల తాకిడివల్ల గలిగిన గాయముల నుండి రక్తముల గారుచున్న యాకారములుగల యానిత్యాశక్తులు జయోద్ధతలై శ్రీ లలితాదేవిని నమస్కరించిరీ. ఈ విధముగా రాత్రిలో భయంకరమైన మహా యుద్ధము జరిగెను. లలితాదేవి శస్త్రక్షతములైన నిత్యాశక్తుల రూపముల జూచెను. ఆ మహారాణి లలితా దేవి యావార్త విని కృపాపూరీతమైన ఓర చూపుతో జూచెను. ఆ చూపు మాత్రమున వారి ప్రణములన్నియు మాయమైపోయినవి. నిత్యాశక్తుల పరాక్రమములకు శ్రీ లలితాదేవి మిక్కిలి ప్రీతీనందేను. మొదటి దివస యుద్దము.
ఇది శ్రీ బ్రహ్మాండమహాపురాణముననుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున
శ్రీలలితోపాఖ్యానమున విషంగపలాయనమను ఇరువదియైదవయధ్యాయము.
Summary of chapter 137 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter describes the grand battle where goddess Mantriṇī and goddess Daṇḍinī directly confronted and slain Bhandāsura's formidable brothers, Vishukra and Vishaṅga. It depicts the destruction of their magical weapons and dark Yantras through the power of sacred mantras and divine missiles. The seeking heart rejoices in the liberation of the worlds from these dark entities, praising the supreme commanders of the divine mother's army.