3 - ధర్మసంతతి - స్వయంభువుని త్రైగుణ్యము - దేవర్షిసర్గము

ఋషులిట్లడిగిరి;

వైవస్వత మన్వంతరమున దేవతల యొక్క దానవుల యొక్క దైత్యుల యొక్క యుత్పత్తిని గూర్చి సవిస్తరముగా చెప్పుము. సూతుఁడిట్లు సమాధాన మొసంగెను.

            నేను ధర్మము యొక్క సంతతిని గూర్చి చెప్పెదను, తెలిసికొనుఁడు. ప్రాచేతసుఁడయిన దక్షుఁడు తన యొక్క కూతుండ్రను పదిమందిని భార్యలుగా ధర్మునకొసంగెను. వారు - ఆరుంధతి, వసు, జామ, లంబ, భాను, మరుత్వతి, సంకల్పముహుర్త, సాధ్య మరియు విశ్వ, ధర్మునకు సాధ్యకు పండ్రెండుగురు సాధ్యులుదయించిరి. దైవజులు, దేవతలతో పరిచయము కలిగిన వీరిని దేవతలకంటే నుత్తములుగా నున్నతులనుగా నిశ్చయింతురు. వీరిని జయదేవతలందురు. సంతతి కొఱకు బ్రహ్మయొక్క ముఖము నుండి వారు సృష్టింపఁబడిరి. అన్ని మన్వంతరములయందు వీరిని మంత్రశరీరులలో దేవతలనుగా స్మరింతురు. (5) ఈ పండ్రెండుగురి యొక్క నామములు యజ్ఞముల యందు సుప్రథితములు. (1) దర్శ (2) పౌర్ణమాసము, (3) బృహతీ (4) రథంతరము, (5) మనము (6) విత్త, (7) వివిత్తి, (8) ఆకూతి, (9) కూతి, (10) విజ్ఞాత, (11) విజ్ఞాత మరియు (12) యజ్ఞము. స్వాయంభువ మన్వంతరమున బ్రహ్మయొక్క శాపముచే వారు జీతులుగను, స్వారోచిష మన్వంతరమున తుషితులుగను, ఉత్తమ మన్వంతరమున సత్యులుగను, శామస మన్వంతరమున హరితులను పేరి దేవతలుగను, రైవత మన్వంతరమున వైకుంఠులుగను పుట్టిరి, చాక్షుష మన్వంతరమున వారు సాధ్యులను దేవతలుగా ఆత్మీయశక్తిచే (స్వతంత్రభావమున) నుదయించిరి. (9) ధర్ముని పుత్రులు సాధ్యులు చాక్షుష మన్వంతరమున నుదయించిరి. వారు పండ్రెండుగురు. దేవతలు. మహాభాగులు. వారే స్వారోచిష మన్వంతరమున మహా తేజస్వంతులు తుషితులను నామమున దేవతలు. వారు పరస్పరముమాట్లాడుకోనీరి : “చాక్షుష మన్వంతరము కొంత మిగిలియుండఁగా, మేమీ మహాభాగురాలయిన సాధ్యలో ప్రవేశించి, చాక్షుష మన్వంతరమున పుట్టెదము, అయ్యది మా యొక్క శ్రేయస్సున కగును.” ఇట్లు చెప్పిన తరువాత సాధ్యకు ధర్మునకు ఈ పండ్రెండుగురు ఉదయించిరి. వీరు స్వయంభువుని యొక్క వారసులు అందే మరల. నరుఁడు నారాయణుఁ డును పుట్టిరి. (14) వారు మొదట విపశ్చిత్తు ఇంద్రుడును. తరువాత సత్యుఁడు హరియును. పూర్వము వారు స్వారోచిష మన్వంతరమున తుషిత యొక్క కుమారులు.(15)

 తుషితులు సాధ్యులుకాగా, మన, అనుమంత, ప్రాణము, నరుఁడు, వీర్యవంతమయిన అపానుఁడు, వితీ, నయుఁడు, హయుఁడు, నారాయణుఁడు, విభువు, ప్రభువు అను నామములు వారికి చెప్పఁబడినవి. ఆ విధముగా ద్వాదశ సాధ్యులుదయించిరి.. (17) పూర్వమీదే స్వాయంభువ మన్వంతరమున జరిగినది. అంతియేకాక, మరల స్వారోచిష మన్వంతరమున గూడ తుషితుల నామముల నెఱుంగుడు. ప్రాణుం డు, అపానుడు, ఉదానుండు, సమానుఁడు, వ్యానుడు, చక్షువు. శ్రోత్రము, రసము, ఘ్రాణము, స్పర్శము, బుద్ధి, మనము. ఇవి పూర్వపు నామములు. వీనిని జ్ఞాపకముంచుకొనిరి. వస్తువులు పసుపుత్రులు. వారిని సాధ్యుల యొక్క అనుజులునుగా స్మరింతురు. ధరుఁడు, ధ్రువుఁడు, సోముఁడు, ఆయువు, అనలుఁడు, అనిలుఁడు, ప్రత్యూషుఁడు, ప్రభాసుఁడు - వీరు వసువులేనమండ్రుగా ప్రకీర్తితులు. (21) ధరుని పుత్రులు ద్రవిణుఁడు, హుశహవ్యుఁడు, రజస్సు. ధ్రువుని పుత్రుఁడు కాలుఁడు. ఆతఁడే లోకముల నియమించును (లోకప్రకాలనుఁడు) (22) భగవాన్వర్చస్సు, బుధుఁడు, గ్రహబోధనుఁడు, ధరోర్నీ కలితుఁడు - అను ఐదుగురు చంద్రుని సుతులు. ఆయుని కుమారులు - వైతండ్యుఁడు, సాముఁడు, శాంతుఁడు, స్కందుఁడు మరియు సనత్కుమారుఁడు వీరొక్కొక్క రాక్కొక్క తేజః పాదమున నుద్భవించిరి. (24) స్వాహ, అగ్నివలన కుమారులను కనెను. వారు - కుమారుఁడు; ఆతఁడు శ్రియా సంవృతుఁడు, సౌఖుఁడు, విశాఖుఁడు, నైగమేయుఁడు ఈ ప్రష్టజుఁడు నల్వురా కుమారుని తమ్ములు. కుమారుని తరుపోత పుట్టిన వారసులు - అనుజులు} {25) శివ అనిలుని భార్య మనోజవుఁడు, అవిజ్ఞాగతి - అను నీర్వురును ఆమె పుత్రులు. అనిలు న కిర్వురే కుమారులు, ప్రత్యూషసుని కుమారుఁడు ఋషి దేవలుఁడు. దేవలున కిద్దరు పుత్రులు వారు క్షమావంతులు మనీషిణలు. (27) బృహస్పతి యొక్క చెల్లెలు భువన. ఆమె బ్రహ్మజ్ఞురాలు. బ్రహ్మవాదిని. ఆమె యోగ సిద్ధురాలు. ఆమె నిస్పృహురాలు. ఆమె ప్రపంచమంతయు సంచరించుటకు శక్తురాలు. వసువులలో అష్టముఁడయిన ప్రభాసుని భార్య అయిన భువనకు ప్రజాపతి పతి విశ్వకర్మ సుతుఁడు. విశ్వధర్ముని భార్య. విశ్రుతులయిన దశ విశ్వేదేవులు విశ్వునకుదయించిరి. వారు - క్రతువు, దక్షుఁడు, శ్రవుఁడు, సత్యుండు, కాలుఁడు, కాముఁడు, ముని. (30)

పురూరవుడు, మార్ద్రవసుడు, రోచమానుఁడు. వీరు పదిమంది. ఈ మహానుభావులు విశ్వకు ధర్ముని వలన కుమారులుగా ఉద్భవించిరి. (31) మరుద్వంతులు మరుత్వతి వలనను, భానులు భానువు (ధర్ముని భార్య) వలన పుట్టిరి. ముహూర్తులు ముహూర్తవలన పుట్టిరి. లంబ ఘోషుని కనెను. సంకల్ప యందు విద్వాంసుఁడయిన సంకల్పుఁడు పుట్టెను. నవవీథులు (గ్రహమండలములు9) త్రిమార్గగాములు జమకు పుట్టిరి. (35) పృథివీ సంబంధమైన వన్నీయును అరుంధతి వలన పుట్టెను. ఇది విద్వాంసుడయిన ధర్మునీ యొక్క శాశ్వతసృష్టి. (34) ఓ సుప్రతులారా! తిథులతో ముహూర్తములను వివరించెదను. వానినీ వాని పేర్లతో వివరించుచుండగనే అవగాహన చేసికొనుఁడు. (35) అహోరాత్ర విభాగము నక్షత్రముల సమాశ్రయించి యున్నది. ముహూర్తములు సర్వనక్షత్రములు పగళ్ల యొక్క రాత్రుల యొక్క విభాగముల నేర్పరచును. దివారాత్రముల యొక్క 86 (ఎనుబది ఆరు) కంటే అధికముగ కళలు కలవు. రవి యొక్క గతి విశేషమును ననుసరించి యా కళలు అన్ని ఋతువుల యందు ప్రతి దినము నందు కలుగుచుండును. (37) అందుచేతనే, వేదవిదులయిన వారు, పర్వములయందు వాని యొక్క గతిని (సంచారమును) అంగీకరింతురు. విశేషరహితములయిన కాలములయందు, సావనమానము ననుసరించి తెలిసికొనవలయును. (38) రౌద్రము, సార్పము, మైత్రము, పిత్ర్యము, వాసవము, ఆష్యము, వైశ్వదేవము, బ్రాహ్మము - అనునవి ముహూర్తములు. ఈ ముహూర్తములు మధ్యాహము వరకు నున్నవి. ప్రాజాపత్యము, ఐంద్రము, ఇంద్రాగ్నులు, నిర్భతి, వారుణము, అర్యమ్లము మరియు భాగము అను ముహూర్తములు అపరాహ్నము నందలివి. ఇవి దీనముహూర్తములు దీవాకర వినిర్మితములు. కానీ వాని ప్రమాణమున 'శంకుచ్ఛాయా' విధానమున నెజుంగవలయును. రాత్రి యందలి పదునైదు ముహూర్తములు క్రమముగా అజైకపాదము అహిర్బుధ్యము. ఆ ముహూర్తముల అధిదైవములు - పూషన్, అశ్విన్, యమ, అగ్ని, ప్రజాపతి, సోముఁడు, ఆదిత్యుండు, గ్రహపతి, విష్ణువు, త్వష్ట వాయువు. ఇవి రాత్రి ముహూర్తములు. సంఖ్యకు పదియైదు, చంద్రుని యొక్క గతులను మొదటి నుండియు నాడికల నుండి గ్రహింపవలయును. ఈ ముహూర్తములు కాలావస్థితి నెఱింగించును. వానినీ దేవతలుగా గణింతురు. (ముహూర్త దేవతలు). సర్వగ్రహములకు మూఁడు స్థానములు విహితములయి యున్నవీ.

            ఆ స్థానత్రయము - 1.దక్షిణస్థానము, 2. ఉత్తరస్థానము, 3.మధ్యస్థానము. అని క్రమముగా నెఱుంగవలయును. “జారధవమన్నది మధ్య స్థానము. ఐరావతమన్నది ఉత్తర స్థానము. వైశ్వానర మన్నది దక్షిణ స్థానము. ఇట్లు తత్త్వతః స్థానములు నిర్దిష్టములు. అశ్విని, భరణి, కృత్తికల మండలములు “నాగవీథి' యని విశ్రుతము. (47) రోహిణీ మండలము, మృగశీర్చమండలము, ఆర్ధామండలము - వీనిని గజవీథి యందురు. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష - నక్షత్ర మండలము ఐరావతీ వీధిని ఏర్పరచును. ఈ వీధీత్రయము ఉత్తర మార్గముగా చెప్పఁబడినది. మఖ, పూర్వ ఫలుణి, ఉత్తర ఫల్గుణీ - నక్షత్రమండలములు ఆరబీ వీథిని కలిగించును. హస్త, చిత్త, స్వాతి నక్షత్రమండములను “గోవీథ” యందురు. విశాఖ అనూరాధ, జ్యేష్ఠ - నక్షత్రమండలములు 'జగద్దవీ' వీథిని గలిగించును.. వీడులను మధ్యమ మార్గములుగా చెప్పుదురు. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ మండలమును 'అజవీథి' యందురు. శ్రవణము, ధనిష్ఠ, శతభిష నక్షత్రమండలమును 'మార్టీ' వీధి యందురు. పూర్వాభాద్రపద, ఉత్తరాభాద్రపద, రేవతీ - నక్షత్రమండలములు వైశ్వానరీ వీథిగా కీర్తించెదరు. (52) ఈ వీథీత్రయము దక్షిణ మార్గముగా చెప్పుదురు. దక్షుండు తన (28) ఇరువది యెనమండ్ర (?27) కన్యలను సోమునకు వివాహమున నొసంగెను. వారందరు జ్యోతిః పథమున పరికీర్తింపఁబడిరి. వారందరు నక్షత్రమండల నామముల నుండిరి. వారికి అపత్యము (సంతానము) కలిగిరి. వారు దీప్తిమంతులు. అమిత తేజః పూరీతులు. మహాభాగురాండ్రు అయిన ఇతరుల పదునల్లురు కన్యలను కశ్యపుఁడు వివాహమాడెను. వారందరు లోకమాతలు. (55) వారు అదీతీ, దితి, దనువు, కాష్ఠ, అరిష్ట, అనాయువు, ఖశ, సురభి, వీనత, తామ్ర, మునీ, క్రోధపశ, కద్రులు. (కద్రూ నాగమాత). పొరీ సంతానము నెరుంగుఁ డు. (56) స్వాయంభువ మన్వంతరము పండ్రెండుగురు సురోత్తములు కలరు. వారు వైకుంఠులు - వారు రైవత మన్వంతరము నందు సాధ్యులు చాక్షుష మన్వంతరమున ఈ వైవస్వత మన్వంతరముపస్థితము కాగా, అదితిచే వారు ఆరాధితులు. వారందరు సమావీష్టులై పరస్పరము వారీట్లు పలికిరి. ఈ వైవస్వత మన్వంతరమున మనమందరమున మన యోగశక్తిచే, మన యొక్క తేజస్సు నుపయోగించి ఈ పూజ్యురాలయిన అదితిలో ప్రవేశింతము. మన మామె పుత్రులమయ్యెదము. అయ్యది మన యొక్క శ్రేయస్సునకు కాగలదు.” అనీ.

 ఇట్లు పలికి, అదితి కశ్యపులకు పండ్రెండుగురు ఈ జరుగుచున్న మన్వంతరమున పుట్టిరి. (మరీచీ పుత్రుడు కశ్యపుడు). వైవస్వత మన్వంతరములో శతక్రతువు విష్ణువు నరనారాయణులుగా మరలపుట్టిరి. (62) సూర్యునికి ఈ ప్రపంచమున ఉదయము అస్తమానము ఉన్న విధముగనే ఈ దేవతలకు జనన మరణములు కలవు. అని చెప్పబడినది.(63) ప్రాపంచిక విషయములయిన శబ్దాదులయందు వేదసంప్రదాయమున వారు సంసక్తులగుటచేతను వారు అణిమాద్యష్టశక్తుల యందు సిద్దులయందు సంసక్తులగుటచే దేవతలు మరల జన్మించిరి.(64) ఇట్లు ప్రాప్తించిన విషయానురాగ సంసక్తతయే కారణముగా వారు పునర్జన్మ నొందిరని జ్ఞాపకముంచుకొనవలెను. (64) స్వాయంభువ మన్వంతరమున బ్రహ్మయొక్క శాపము కారణముగా 'జయలు' అను పేరుగల దేవతలు 'జీతులు'గా నుద్భవించిరి. వారే స్వారోచిష మన్వంతరమున తుషితు'లుగా పుట్టిరి. ఉత్తమ మన్వంతరమున 'సత్యులు'గాను పుట్టిరి. ఆ దేవతలే తామస మన్వంతరమున 'హరులు'గా పుట్టిరి. అరిష్టవ రైవత) మన్వంతరమున వారు (ఆ దేవతలు} వైకుంఠులుగా పుట్టిరి. సాధ్యులుగా వారు చాక్షుష మన్వంతరమున పుట్టిరి. ఏడవదిన వైవస్వత మన్వంతరమున వారు ఆదిత్యులుగా పుట్టిరి. విభుఁడయిన కశ్యపుని కుమారులగు ద్వాదశాదిత్యులు - ధాత,అర్యముఁడు, మిత్రుఁడు, వరుణుఁడు, అంశుఁడు, భగుఁ డు, ఇంద్రుఁడు, వివస్వంతుఁడు, పూషుఁడు, పర్జన్యుఁడు, త్వష్ట, విష్ణువు, తుదిని జన్మించినను విష్ణువు ప్రధానుండే. (అజఘన్యో జఘన్యజః) సురభికి కశ్యపుని పుత్రులుగా పదునొక్కండ్రు రుద్రులు పుట్టిరి. వారు మహాదేవ ప్రసాదమున జన్మించిరి. ఆ పరమ పవిత్రురాలు వ్రతముల చేతను తపస్సు చేతను సతి (పవిత్రురాలు). ఏకాదశ రుద్రులు - అంగారకుఁడు, సర్పుఁడు, నిరృతి, సదసస్పతి అజైకపాదుఁడు, అహిర్భుధ్యుం డు, జ్వరుండు, భువనుఁడు, ఈశ్వరుఁడు, మృత్యువు, కపాలీయని ప్రపంచవీశ్రుతుఁడు. పవిత్ర వ్రతములచే, తపస్సుచే, సురభి యీ పదునొకండు రుద్రులను (దేవతలను) కనెను. వారందరు శ్రీభువనేశ్వరులు.(71) మహాత్మురాలయిన సురభి ఇద్దరు కూతుండ్రను కూడ కనెను. - వారు సౌందర్య నిధియైన రోహిణి. (72) గొప్ప యశస్వినియైన గాంధర్వీయు(73) లోక విశ్రుతలయిన నురు పుత్రికలు రోహిణీకి కలిగిరి. వారు సురూష, హంసకాళీ, భద్ర మరియు కామదుమ. అనువారు (74) కామదుఘకు ఆవులు పుట్టెను. సురూప ఇరువురు కుమారులను కనెను. హంసకాలి మహిషములను కనెను. భద్ర అజసంతతులను కనెను. గాంధర్వ బిడ్డలు అశ్వములు. అవి సువిశ్రుతములు అవియే ఉచ్చైశ్రవము మున్నగునవి. వానికి మనోజవము గలదు. అవి ఆకాశమున సంచరించును. గాంధర్వి తల్లిగా గల అశ్వములు దేవతల వాహనములు. అవి శ్వేత, శోణ, పిశంగ వర్ణములు. అంతీయేకాక అవి పచ్చనివి. అర్జునవర్ణము కలిగినవి.

 శ్రీమంతము చంద్రప్రభము నయిన యొక వృషభము సురభికి కలిగిను. ఆ వృషభమునకు ఒక మాల, ప్రకాశవంతమయిన మూపురము కలవు. ఆ వృషభము అమృతాలయసంభవము (?) సురభి యొక్క అనుమతితో నయ్యది మహేశ్వరునకు ధ్వజముగా నీయఁబడెను. ఈ విధముగా కశ్యపసుతులు (రుద్రులు) ఆదిత్యులు ప్రకీర్తింపఁబడిరి. (79) సాధ్యులు, విశ్వేదేవతలు, వస్తువులు ధర్మపుత్రులుగా స్మరింపం బడిరి. ఇంధనముల వశముచే ఒకే అగ్ని బహ్వగ్నులగునట్లు పితామహుడొక్కండు, కాని ఆతని కనేకములయిన మూర్తులు. బ్రహ్మ, అంతకుఁడు, పురుషుఁడు - ఈ మువ్వురొక్కమూర్తియే.కాని ఈ ముగ్గురు ఒకే యొక స్వయంభువుఁ డయిన ప్రభువునకు త్రివిధములయిన భౌతికశరీరములు అని యెఱుంగవలయును. ఈ భౌతిక శరీరములు (బ్రాహ్మీ, పౌరుషీ, కాలాఖ్యములుగా జ్ఞాపకముంచుకొనబడినవి. రజోగుణ ప్రధానమయిన రాజసీ తనువు ప్రజలను సృజించును. కాలాఖ్యమయినది ప్రజాక్షయకరీ సత్వగుణ ప్రధానమయిన పౌరుషీ శరీరము పాలీకగో ప్రజారక్షకముగా దలంతురు. మరీచి కుమారుఁడయిన కశ్యపుండు రాజసీయుతమైన బ్రహ్మయొక్క శరీరమయ్యెను. (84) అంతకృత్ (నాశనము చేయు) తామసీ సంబంధమయిన శరీరమును విష్ణువందురు. స్వయంభువుని యొక్క త్రిరూపములయిన తనువులు మూఁడు లోకములందుండు ననీ తలంతురు, ఆతఁడు, వివిధములయిన కాలసంబంధమైన రూపములను అషస్థలను వహించును. ఆతఁడే ప్రజలను సృజించును, పాలించును. సంహరించును. ఈ విధముగా స్వయంభువుని మూఁడు తనువులు జ్ఞాపకముంచుకొనఁబడినవి. (87) (ఆ కళలు) అయ్యవి 1. ప్రాజాపత్యము (ప్రజాపతి సంబంధములైనవి) 2.రౌద్రములు (రుద్ర సంబంధములయినవి), 3.వైష్ణవములు (విష్ణుసంబంధములయినవి)గా మూఁడు విధములు. తత్త్వద్రష్టలు, సాంఖ్య యోగముల యందు ప్రీతులు, యోగరతులు, బుద్దేశాలురు, ప్రభావజ్ఞులు, ఆభిజాత్యము యొక్క గొప్పతనము శక్తిని నెటింగీనవారు, వస్తువుయొక్క స్థితిని విచక్షణతో అంగీకరించి ప్రత్యేకముగా నెఱింగినవారును, అయిన మునులచే, ప్రాచీనములయిన ధర్మ శాస్త్రములండు ఈ త్రివిధ శరీరములు చెప్పబడినవి. (89) ఈ ప్రజలు, ఏకత్వమునను పృథక్త్వమునను భీన్నులు. భిన్నదర్శనులయినవారు ఇది గొప్పదీ ఇదీ గొప్పది కాదు. అని యందురు. (90) కొంతమంది బ్రహ్మనే ప్రధాన కారణమందురు. కొందరో ప్రజాపతియే కారణమందురు. మకాందరో భవుఁడే (ఈశ్వరుండే) అందరికంటే నధికుఁడందరు. ఇతరులు విష్ణువు గొప్పయందురు. (91) ఆధ్యాత్మిక (తాత్త్వీక)చింతనము కలిగిన వ్యక్తులు, వారీ వారి విజ్ఞానములచే ప్రభావితులు. వారు అనిష్టకరములయిన శకునాదులకు సంసక్తులగుట మనస్సులలో భ్రాంతి నొందుదురు. వారు సత్త్వ, కోల,దేశ,కార్య కర్మములను గమనించి చెప్పుదురు, ఆయా దేవతలు వీనికి కారణములని వారు సంస్మరింతురు. ఒకదానిని ప్రశంసించువాఁ డు ఇతరులను ప్రశంసించును. (83) ఒకదానిని నిందించినవాఁడు మిగిలిన వానీ నన్నీంటినీ కూడ నిందించును. అందుచే వీనిని తెలిసిన వాడెవ్వఁడును, దేవతలయందు ద్వేషము వహింపరాదు. (94) ఐశ్వర్యశక్తి వ్యవస్థితులయిన ఈశ్వరులను దెలిసికొన శక్తి చాలదు. ఏకత్వము నుండి త్రిధా భావము నొంది ప్రజలను (ఈశ్వరుఁడు) సమ్మోహపరచును.

            ఈ మూడింటి యొక్క భేదమును ప్రజలు తెలిసికొనుటకు ప్రయత్నింతురు. కోరుదురు. దెలిసికొనఁగోరువారు సంసక్తులు. పోరుదుష్ట చేతస్కులు, వారు వారి మనస్సులలో వీమోహితులు. వారనేకత్వమును చూచెదరు. ఏలయన - వారిట్లందురు “ఇదీ పరము (ఉత్కృష్టము), ఇది కాదు (నీచము). అని సంరంభమున భేదమును జూతురు. (నిజమునకు) యాతుధానులు - పిశాచులు వీరిలో భేదము లేదు. ఆతడు ఒక్కడే! కానీ విభిన్నముగా నుండును (పృథక్ష్వేన గుణమాత్రాత్మికములయిన దేహములను పొంది, ప్రజలను విమోహ మొనరించుచుండును. (98) వానీలో నెవ్వఁడొక్క దానిని పూజించునో ఆతఁడు మూడింటిని పూజించును. అందుచే నీ ముగ్గురు దేవతలు నైరంతర్యమున అధిష్టితులై అభిన్నముగా నుందురు. అందుచే వానీ యందలి పృథక్యము, ఏకత్వము, సంఖ్యాత్వము, అసంఖ్యాత్వము గమనించుటకు శక్యముగాదు. వాని యందలి యల్పత్వము కాని బహుత్వము కాని యెవ్వఁడెఱుంగ సమర్థుఁడు? (100) అందుచే ఆతఁడు సృజించి అనుగ్రహించును. సర్వవిధములను గ్రసించును. అందుచే అతని యందు గుణాత్మకత్వము లేనిచో ఆతని నొక్కండందురు. (101) బ్రాహ్మణులు ఆ ప్రభువయిన నారాయణుని వివిధములయిన రుద్ర బ్రహ్మ ఇంద్రలోకపాల ఋషి మను దేవ - నామములతో నొక్కండని యందురు. ప్రాజాపత్య, రౌద్రి, వైష్ణవి అను మూఁ డు తనువులును మన్వంతరముల యందు పునః పునః వచ్చును. ఆవర్తించును. క్షేత్రజ్ఞులు కూడ నీ విభుని యొక్క యను గ్రహమున పుట్టుచున్నారు. ఈ క్షేత్రజ్ఞులు తేజస్సుచే, యశస్సుచే, బుద్దీచే, శ్రుతిచే, బలములచే ఆ ప్రభునితో సమానముగా జన్మించుచున్నారు. వారిని చక్కగా గ్రహింపుము. మరీచి పుత్రుఁడయిన కశ్యపుండు బ్రహ్మయొక్క రాజసీభాగముచే నుదయించెను. (105) కాలుఁడయిన రుద్రుండు, బ్రహ్మయొక్క తామసీ లక్షణముచే జన్మించెను. యజ్ఞ స్వరూపుఁడయిన విష్ణువు బ్రహ్మ యొక్క సాత్త్విక లక్షణముచే పుట్టెను. ఓ బ్రాహ్మణులారా ! బ్రహ్మయొక్క శరీరములు పునః పునః సృష్టి ప్రయోజనము కొఱకు మూఁడు కాలములయందు ఆవర్తించును. అన్ని మన్వంతరము ఆరంభమునందు స్థావర జంగమాత్మకములయిన ప్రజలు (సకృదేవ) ఒకేయొకసారి పుట్టి, వారీ వినాశన పర్యంతముందురు. (ప్రళయమున నాశనము చేందుదురు). కల్పాంతమున రుద్రుఁడు ప్రజలను సంహరించును. కాలుండయి రుద్రుఁడు యుగాత్ముఁడైన యాతండు ప్రజలను సంహరించును. కల్పాంతము సంప్రాప్తముకాగా సప్తరశ్నియైన దీవాకరుఁడు సంవర్తకాదిత్య రూపమున మూడు లోకములను భస్మీభూతమొనర్చును. (110) ప్రజానుగ్రహ కారకుఁడయిన విష్ణువు ప్రజలను పాలించును. భిన్న భిన్న అవస్థల యందు ప్రజోత్పాదన కారణమును నతఁడే కలిగించును. సత్త్వ గుణ ప్రధానత్వము వహించిన పౌరుషీతనువయిన బ్రహ్మనుండి విష్ణువు మొదట పుట్టును. అతడు మనువు యొక్క స్వాయంభువ మన్వంతరమున ఆతని యంశచే పుట్టునని యెఱుంగవలయును.

 స్వాయంభువ మన్వంతరము ఆకృతియందు బ్రహ్మకు మనసా ఉత్పన్నుఁడు. మరల స్వారోచిష మన్వంతరము రాగా ఆ ప్రభువు తుషిత యందు అజితుడుగా జన్మించెను. ఆతనితో సహా ఇతరులయిన తుషిత దేవతలు నుదయించిరి. ఔత్తమమన్వంతరమున ఆజితుఁడే మరల ప్రభువు. ఆతఁడు సత్యయందు సత్యుఁడుగా పుట్టెను. ఆతనితో సహా సురోత్తములయిన సత్యదేవతలుదయించిరి. (115) తామస మన్వంతరమున ఆ ప్రభువు హరిగా హరిణీ యందు ఇతరులయిన హరులతో పుట్టెను. వైవస్వత మన్వంతరమున (రైవత?) ఆతఁడు (హరి) మరల వైకుంఠుఁడు అను నామముతో సర్వ రజో గుణములను పరిత్యజించిన దేవతలతో నుదయించెను. విష్ణువు మరీచి కుమారుఁడయిన కశ్యపునకు అదితి వలన నుదయించెను. (117) మూఁడడుగులచే లోకములను జయించి విష్ణువు త్రివిక్రముఁడై ఇంద్రునకీ లోకత్రయమును నొసంగేను. (118) ఈ విధముగా ఏడు మన్వంతరములయందు వీరు ఏడుమారు లుదయించిరి. గత మన్వంతరములందు ప్రజలు వారిచే సంరక్షింపఁబడిరి. (119) విష్ణుని వలననే యీ యావత్తు విశ్వము పుట్టినది. మరల ఈ ప్రపంచము అతని యందే లయమగును. విష్ణ్వంశము వలననే త్రిలోకాధిపతులు అమరులును పుట్టిరి. ఆ విష్ణువు వలననే ఆ దేవతలందరు తేజస్సుచే, బుద్దిచే, శ్రుతులచే, బిలముచే వృద్ధి పొందుచున్నోరు. విభూతిమంతము శక్తిమంతము (ఊర్జితము) అయినదేదియున్నదో యది యంతయు విష్ణుని యొక్క తేజోంశ సంభవముగా నుత్పన్నమైనట్టిదే. (121) కోందరు తనయంశము చేతనే విష్ణువు పుట్టెనని భావింతురు. కొందరి విషయమునంగీకరింపక వివాదించెదరు. వారేవో కొన్ని యుదాహరణముల నొసంగెదరు. ఆ మువ్వురి యందు భేదము లేదు. వారు స్వర్గాధివాసులు. (123) ఆ మువ్వురు వారంతట వారే యోగమాయచే పుట్టుదురు. వారి విభిస్తోంశలచే ఇతరులను విమోహింపఁజేయుదురు. అందుచే వారి యొక్క ప్రచారము నందు యుక్తమయినదీ కాని యయుక్తమయినది కాని మరేదియు లేదు. భూతాను వాదులో వారు మొట్టమొదటివారు. వారే భూతవాదులలో మధ్యస్థులు.. ఆ మువ్వురు భూతముల నంగీకరించువారితో సంబంధము కలఫారు. వారు గుణములను పరీక్షించిన తరువాత వారే ప్రజలననుగ్రహించెదరు. దుర్మార్గులనువారే స్వయముగా నిగ్రహించెదరు. (126) వారు నాకంటే పూర్వము పుట్టినవారు. అందుచే వారత్యధిక శక్తిమంతులయిన ప్రభువులు. సత్యమును సూచించు వ్యక్తులవలే వారును నీయుపాధుల నుపయోగింతురు. (127) వారు విశ్వమున కధిపతులు. వారు దేవతలకు దేవతలు. వారు సర్వప్రవర్తకులు. వారే మహత్కార్యములను సాధించిన కర్తలు జగదీశ్వరులు.(128)

            ఈ నాలుగు కారణములచే, శ్రుతీజులయినవారిచే వారందరు పరికీర్తితులు. స్తోత్రమాచరింపఁబడిరి. బాలిశులు (మూఢులు - అజ్ఞానులు) ఆ దేవతలను వివిధములయిన వారి లక్షణములతో విభాగశః తెలియరు. (129) ఈ సందర్భములో యోగీశ్వరులను గూర్చి ఈ శ్లోకమును ఉదాహరణముగా చెప్పెదరు. (యోగీశ్వరులు యోగానుభవమున శ్రేష్టులు) యోగీశ్వరుఁడు యోగసంబంధమయిన బలమును పొందిన తరువాత సర్వము నాచరించును. వారందరితో ఆ మహాయోగి సంచరించును. అతఁడో ప్రాపంచిక విషయానందమును పొందవచ్చును. తరువాత నతండే తపస్సు నాచరించును. మరల నతఁడు సూర్యుఁడెట్లు సర్వజ్యోతిర్గణములను సంహరించునో (ఉపసంహరించునో) అట్లే ఉపసంహరించును.

            ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందు మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున స్వయంభువుని త్రైగుణ్య స్వరూప వర్ణనమను తృతీయాధ్యాయము.