19 - బ్రాహ్మణ పరీక్ష  - శ్రాద్ధ దానము గ్రహించుటకు బ్రాహ్మణార్హతలు - పవిత్ర ప్రదేశములలో శ్రాద్ధము నాచరించుట వలన కలుగు ప్రయోజనములు

శంయువు ఇట్లు చెప్పెను.

"ప్రవక్తలలో శ్రేష్ఠుఁడో ! పితరులకు శ్రాద్ధ కాలమున ఈయబడినది (పెట్టఁబడినది) ఏ పదార్ధము తృప్తి నొసంగును? ఏయధి యొసంగిన చిరకాలము తృప్తి ఘటించును? ఏయది యనంతమైన ఆనందమును సమకూర్చుటకుపకరించును? బృహస్పతి ఇట్లు చెప్పెను.

శ్రాద్ద వీదులెతీంగిన శ్రాద్దమున నొసంగ వలసినవానిని నా వలన వినుము. అంతియేకాక వాని వలన గలుగు ఫలితములను యథాతధముగా వినుము. శ్రాద్దమున తిలలు, ప్లీహి, యవలు, మాషములు (మినుములు) జలతర్పణములు, ఫలములు, మూలములును ఒసంగఁబడిన పితృదేవతలోకమాసకాలము తృప్తినొందుదురు. (3) మత్స్యములతో శ్రాద్ద మాచరించిన పితృదేవతలు రెండు మాసములు తృప్తి పొందుదురు. హరీణమాంసముతో శ్రాద్ద మాచరించిన పితరులు మూఁడు మాసములు తృప్తి పొందుదురు. కుందేలు మాంసముతో శ్రాద్ధము పెట్టిన పీత దేవతలు నాలుగు మాసములు తృప్తి పొందుదురు. శ్రాద్ధమున పక్షి మాంసము పెట్టిన పీతరులు ఐదు మాసములు తృప్తి వహింతురు. (4) అడవి పంది మాంసముతో పెట్టిన పితరులు ఆరుమాసములును, మేక మాంసముతో పెట్టిన ఏడు మాసములును, అదియే కొండమేక మాంసమయిన ఎనిమిదిమాసములు, రురు మాంసము (ఒక విధమయిన లేడీ)తో శ్రాద్ధము పెట్టిన పితరులు తొమ్మిది మాసములు తృప్తిని, గవయ మృగమాంసముతో శ్రాద్ధము పెట్టిన పదమాసములు తృప్తిని పీతరులు పొందెదరు. [6] ఔరభ్రమాంసము శ్రాద్దమున పెట్టిన పీతరులు పదీ యొకండు మాసములు తృప్తిని పొందుదురు. ఓ బ్రాహ్మణులారా ! గోమాంసముతో శ్రాద్ధము పెట్టిన పితరులు ఒక సంవత్సర కాలము తృప్తి నొందుదురు. (7) ఖడ్గ మృగ మాంసముతో శ్రాద్ధము పెట్టిన అనంతమయిన ఆనందము కలుగును. (పితృ లోకమున) కుంజర చ్ఛాయా పర్వమున తేనెతో, నేతితో, పాయ సముతో శ్రాద్దమును పెట్టిన శాశ్వతానందమొసంగును. (చంద్రుఁడు మఖా నక్షత్రమున నున్నను, సూర్యుఁడు హస్తా నక్షత్రమున నున్నను, తిథి త్రయోదశియైన - ఆ పర్వకాలము గజచ్ఛాయా పర్వమందురు). నల్లమేక మాంసము నర్పించిన శాశ్వతమయిన తృప్తి పితరులకు కలుగును. ఏతద్విషయమున కొన్ని గాథలున్నవి. ప్రాచీన ధర్మముల నెటింగినవారు ఆ శ్లోకములను కీర్తింతురు. అవి పితృగీతలు. నేను వానిని కీర్తించేదను. వానిని సొ వలన నేఱుంగుఁడు. త్రయోదశి నాడు శ్రాద్దము నాచరించు వాఁడు (వ్యక్తి) మన వంశములో రాకుండునా?(10)

 శ్రాద్ధమును వర్గాకాలములోగాని, మఘానక్షత్ర సంయోగమునఁగాని అరుణ వర్ణము పూర్తిగా గలిగిన మేక మాంసముతో నాచరించు వంశ వర్ధనుఁడు మన వంశమున నుండ కుండునా? ఎక్కువ మంది పుత్రులను పొందవలయును. వారిలో అధమము ఒక్కడయినను గయకు వెళ్లును. ఒక్కడయినను గౌరీ వయస్సు గలిగిన ఎనిమిదేండ్ల ప్రాయమును గలిగిన కన్నెను వివాహమాడును లేదా ఒకడయినను వృషభోత్సర్జనము చేయును (?)

శంయువు ఇట్లనెను.

తండ్రీ ! అడుగుచున్న నాకు గయాదుల యొక్క ఫలమును చెప్పుము. దాతల కేపుణ్యము కలదో దానిని సమస్తము నాకు చెప్పుము. బృహస్పతి ఇట్లు సమాధానమిడెను. గయ యందాచరించిన శ్రాద్దము అక్షయము. అట్లే గయ యందాచరించిన జపములు హోమములు, తపములును. అయ్యది పితరుల యొక్క నివాసము, అందుచే ఓ తనయా ! అందరి ఫలమక్షయముగా స్మరింపఁబడినది. (18) 'గౌరీ' జాతి స్త్రీ రజస్వకానీ స్త్రీ యందు ఆమే 21వ ఏట ఉత్పాదింపఁబడిన సుతుండు గొప్ప యాగములను చేయును (?) ఇదీ దాని యొక్క ఫలితముగా స్మరింపఁబడుచున్నది.(14) వృషోత్సర్జనము యొక్క ఫలితమును చెప్పెద నేుంగుము, వృషోత్సష్ట పదితరము లీటు పదితరములటు పీతరుల పవిత్రీకరించును. వృషోత్సర్జనము తరువాత, ఆ వ్యక్తి నదీజలములలో దిగి స్పృశించిన నీరములు పితరులకు అక్షయ ఫలితముల నొసంగునని యుదాహరింపఁబడినది, ఆ వృషభము తన యవయవములయిన తోక మొదలగు వానీతో నేదానిచేత నయినను నీటిని స్పృశించిన ఆ నీరు శాశ్వత ఫలితమును పితరుల కొసంగు ననుటలో నేట్టి సంశయము లేదు. ఆ వృషభము తన కొమ్ములతో గానీ, డెక్కలతోగాని, భూమి యొక్క భాగమును గీకినచో (పెల్ల గించినచో) ఎడతెగకుండ, అయ్యది పితరులకు మధుకుల్యమును (తేనే కాలువను) నిర్మించును. అది అక్షయము . కూడనగును.(18) వృషోత్సర్జనము వలన, (నల్వ = 400 ఘనపుటడుగులు) శ్రుతి ననుసరించి, పితరులకు, ఒక వెయ్యి నల్వల పొడవు గల తడాగమును త్రవ్వినట్టి, తృప్తి ఘటిల్లును. (19) శ్రాద్ధ సమయమున గుడోన్మిశ్రమయిన నువ్వులను గాని, తేనెనుగాని, తేనెతో కలిసిన దానినిగాని యిచ్చినను, దానమున నొసంగునది యేదియయినను అక్షయమగును. దానముగా నీయబడువానినీ మనుష్యులు నిరంతర మొసంగవలయును. బ్రాహ్మణుని ఎవ్వరును పరీక్షింపరాదు. ఎల్లప్పుడు దానమీయవలె. (కాని) వేదములందు బ్రాహ్మణులు దేవ పితృకర్మలందు పరీక్షింపఁబడవలెనని చెప్పఁబడినది. - (20)

వేదముల నధ్యయనము చేసి తదనంతరము పవిత్రులయిన (వేద వ్రత స్నాతులు) బ్రాహ్మణులు పంక్తినీ పవిత్రీకరించుకోరు. భాషా విదులయినవారు, వ్యాకరణము నందాసక్తులయినవారు, పురాణములఁ జదివినవారు, ధర్మశాస్త్రములు పఠించినవారు, శ్రీనాచికేతమయిన పంచాగ్నులను పాటించువారు, సౌపర్ణ మంత్రముల నభ్యసించినవారు, షడంగవిదులు, బ్రహ్మదేవసుతుఁడు (బ్రహ్మను దేవునిగా భజించువాండు). వేదచ్ఛందస్సును నెఱింగినవాఁడు, సహజముగా జ్యేష్ఠ సామమును గానము చేయువాఁడు, పవిత్రములయిన తీర్థముల స్నానమాడినవాం డు పవిత్ర ధర్మ వ్రతముల నాచరించువాఁడు, యజ్ఞముల నాచరించి, తుదిని అవబ్బథ స్నానముల చేసినవారు, సత్య ప్రతులైనవారు, స్వధర్మ నిరతులు, అక్రోధనులు, లోభపరులు కానీ వారు, ఇట్టి వారిని శ్రాద్దమునకు ఆహ్వానింపవలయును. వారి కోసంగఁబడినది అక్షయమయిన ఫలితము నొసంగును, వీరే నీజముగా పంక్తి పావనులు. (26) యోగ వ్రతమందు సునీషితులయిన వారినీ, శ్రాద్ధ యోగ్యులయిన బ్రాహ్మణులను యజమానీ పూజించినచో, ఆతనిచే బ్రహ్మవిష్ణు మహేశ్వరులు పూజింపఁబడిన వారగుదురు. ఇట్టి బ్రాహ్మణులను పూజించినవారు, పితరులు పొందిన లోకములనే పొందుదురు. యోగ ధర్మము పవిత్రములయిన వానిలో పవిత్రమయినదిగను, మంగళకరములయిన పోనీలో మంగళమయినదిగాను చెప్పఁ బడినది. (28) సర్వ ధర్మములలో ప్రథమముగా యోగధర్మము చెప్పఁబడినది. ఇక అపాంకేయులను (పంక్తి బాహ్యులను) గూర్చి చెప్పెదను ఎఱుంగుము. (29) కితవుఁడు (మాయావి) మద్యమును త్రాగువాఁడు, పశుపాలకుఁడు (పశువులను పెంచువారు), వెలివేయఁబడినవాఁడు, గ్రామ మంతటికి సేవకుఁడయినవాఁడు, వడ్డీ వ్యాపారమున బ్రతుకువాఁడు, అంగడిలో వస్తువునమ్మడు వ్యాపారముచేయువాఁడు (50) ఇండ్లను తగుల బెట్టువాఁడు, భీషమును పెట్టువాఁడు, శూద్రుఁడు, (వృషలుఁడు), గ్రామ యాజకుఁడు (గ్రామ పురోహితుఁడు), తీరములు, ఇతర ఆయుధములు చేయునట్టి బ్రాహ్మణుఁడు, కుండాశి (నర్మ సచివుఁడు), సారా సేవించువాఁడు, సోమ రసమును (మద్యమును) విక్రయించువాఁడు. (31) సముద్ర ప్రయాణము చేసినవాఁడు, భృత్యుడైనవాఁడు (పిశునుఁడు)చాడీలు చెప్పువాఁడు, కూట సాక్ష్యములు చెప్పువాఁడు, తండ్రితో వాదులాడు వాఁడు, భార్య యొక్క ఉపపతినీ తన ఇంటిలో వుంచుకొనువాఁడు (32) అభిశస్తుండు (క్రూరుఁడు) దొంగ, ఎవని జీవిత శిల్పముపై ఆధారపడియుండునో వాఁడు, స్తోత్ర పాఠకుండు, పాచకుఁడు, తన మీత్రుల నిందించువాఁడు కాణుఁడు (ఏక నేత్రుఁడు) కుంటివాఁడు, నాస్తికుఁడు, వేదవర్జితుఁడు, ఉన్మత్తుఁడు (మదించినవాఁడు, పిచ్చివాఁడు) షండుడు, బ్రూణ హత్య చేసినవాఁడు, గురు తల్పగుఁడు. (34)

భీషర్జీవి, తిండిపోతు, పరస్త్రీని సేవించువాఁడు, ఎవఁడు బ్రహ్మ ప్రతములను, నియమములను విక్రయించునో యతఁడు, వీరందరు పంక్తిబిహ్యులు. నాస్తికున కొసంగబడినది నష్టమయినదే. బ్రహ్మవ్రతములను వదలినవాని తీయబడినది, వర్తకము చేయువాని కొసంగం బడినది, ఇహమందు కాని పరమందుగాని యుపయోగపడునది కాదు, (36) నిక్షేపహారకున తీయబడినది, చేసిన మేలు మరచిన వాని కీయం బడినది, వేదమును విసర్జించిన వాని కీయబడినది, పాణవిక మనఁబడు సంగీత యంత్రముపై పాడువాని కీయబడినది, కారుకునికి (శిల్పపుం బనివానికి) ధర్మ వర్జితునకీయబడినది ఇహలోకమున కానీ పరలోకమున గానీ వ్యర్థములు, నిష్ప్రయోజనములు. నీ షేధింపఁబడిన వానినీ కొనువాడు కాని అమ్మువాఁడు కాని, యట్టి క్రియలను ప్రోత్సహించువాడు కాని శ్రాద్దమున కనరుఁడు. వర్తకుఁడు శ్రాద్ధమునకరుఁడుకొఁడు. (38) విధవ యొక్క కుమారున కొసంగబడిన శ్రాద్ధ వస్తువు భస్మకృత హోమక్రియవలె వ్యర్థము. ఒకే కన్ను కలిగినవాఁడు శ్రాద్దమునకు బిలువఁబడిన దాతల యొక్క అరువది గుణములను పాడుచేయును. షండుడు నూరు గుణములను, పాడుచేయును. శిక్షత్రముచే బాధపడు వానినీ (బొల్లీవానిని) శ్రాద్ధమునకుఁ బిలిచిన యాతఁడు దాతయొక్క యైదువందల సుకృతములను పాడుచేయును. (39) పాప ఫలితములయిన రోగములచే బాధపడు వానిని శ్రాద్ధమునకుఁ బీలిచిన దాతల యొక్క యొక సహస్ర సుకృత ఫలములను నాశనము చేయును. బాలీశుఁడు  (మూర్ఖుడైన దాత తన దాన ఫలితముల నుండి భ్రష్ఠుఁడగును. (40) శిరస్సును వస్త్రముతో కప్పుకొని యన్నము తినువాఁడు దక్షిణాభిముఖముగా భోజనము చేయువాఁడు, చెప్పులు తొడుగుకొని భోజనము చేయువాఁడు, అవీధిగా దానము చేయువాఁడు శ్రాద్ధమున భోజనమునకుఁ బిలువం బడిన, తత్పలితము అసురేంద్రునకు దక్కునని బ్రహ్మ వీధించెను. కుక్కకాని, బ్రాహ్మణ హంతకుఁడుగాని, శ్రాద్ధ ద్రవ్యములను నెన్నడును. చూడరాదు. అందుచే వండిన యన్నమును తిలలతో చల్లిగానీ శ్రాద్ధమున పెట్టరాదు. తిలలు తీలలతో కూడిన వండిన యన్నము రాక్షసులకు తీలలు కుక్కలకు రీవృతము చెప్పబడినవి. (సూకరము) పంది శ్రాద్ధమును చూచి చూడగనే పాడుచేయును. కుక్కుటము (కోడి) తన రెక్కల గాలితో పాడు చేయును. రజస్వలయైన స్త్రీ తన కరస్పర్శతో శ్రాద్దమును పాడుచేయును. అంతియేకాక శ్రాద్ధకర్త కోప స్వభావముతో శ్రాద్ధము నాచరించిన, అదియును పాడగును. (44) పితృదేవతలు రమ్యములైన నదీ తీరములందు, సరసీరము లందు, వివిక్త స్థలముల యందు పెట్టం బడిన శ్రాద్ధములచే తృప్తి నొందుదురు. కుడి మోకాలి చిప్పును నేలకు నంట నీయరాదు. యోగము నభ్యసించువాఁడు మాటలాడరాదు. అందుచే (కర్త) కుడిచేతి ఉంగరపు వేలికి ధర్భల ముడిని దాల్చి, తిలలను చుట్టును చల్లుకొని శ్రాద్ధము నాచరించవలయును. ఈ విధముగా పితరులను తృప్తి పరచును. మొదట బ్రాహ్మణుల అంగీకారమును బడసి కర్త పవిత్ర కర్మలను అగ్నీకరణమున చేయవలయును. (47)

పితృతర్పణమును పితరులకు భూమి మీఁద లేదా (సూర్యరశ్మిలో) సూర్యకాంతిలో లేక పరచిన దర్భల మీఁదనయినను నిర్వాపము చేయవలయును. శుక్ల పక్షమున పూర్వాహ్లామున శ్రాద్ద మాచరించవలేను, దినమున తొమ్మిదవ ముహూర్తము రౌహిణము. కృష్ణ పక్షమున శ్రాద్ధమును రోహిణ ముహూర్తమున అపరాష్ట్రమున ఆచరించవలెను. రౌహిణ ముహూర్తమును దాటరాదు. ఈ విధముగా మహాత్ములు, మహా యోగులు మహాశక్తిమంతులునయిన పితరులను దేశకాలముల పవిత్రత్వము నెంగి పూజింపవలయును. పితరుల యందు సదా భక్తిచేతనే మానవుఁడు దుర్లభమయిన యోగమును పొందును. (50) శుభాశుభములయిన కర్మల విడిచి ధ్యానము చేతను మోక్షమును పొందవలెను. యజ్ఞము కోకు, ఆ విధముగా జగత్తును భ్రాంతి పరచుటకు బ్రహ్మ పదార్థము గ్రహీంపఁబడీ హృదయ గుహాయందుంచబడినది. తరువాత మహాత్ముఁడయిన కశ్యపునిచే బ్రహ్మము, అమృతము గుహ్యమునైనదీ, ఉద్దరింపఁబడినది. యోగములలో నుత్తమమయిన యీ యోగము సనత్కుమారునిచే ప్రోక్తమయినది. ఇదియే గొప్పదియైన బ్రహ్మ యొక్క పదము. అదియే దేవతలకు ఋషులకు మిక్కిలి రహస్య తమమైన సిద్దాంతము. పితృభక్తి చేతను, స్వకీయ ప్రయత్నము చేతను, మనీషులచే ఇది పొందబడును. సూక్ష్మముగా చెప్పవలయు నన్నచో పితరుల యెడ భక్తి కలిగినవాఁడు, పూర్వ పరముల యందు పితరులను భక్తితో పూజించువాఁడు, వీనినన్నింటిని నిస్సంశయముగా ప్రయత్నముచే పొందును. (55)

బృహస్పతి చెప్పెను,

ఎవనికీ శ్రాద్ధములలో దానము, భోజనము నీయవలయునో, ఎవనీ కోసంగఁబడినదీ మహత్పలమొసంగునో, ఏయే తీర్థము లందు, గుహలయందు ఆచరించిన శ్రాద్ధ మక్షయ మగునో, వేనీ యందాచరించిన స్వరమును పొందుదురో - ఇది యంతయు నీకు సంగ్రహముగా వివరింపఁబడినది. ఈ శ్రాద్ధ కల్పమును విని, యెవ్వఁడు, మనుష్యుఁడు, శ్రాద్దము నాచరించండో, ఆతఁడు నాస్తికుఁడు. తమసావృతమయిన ఘోర నరకమున ఆతఁడు నీమజ్జితుఁడగును. (57) పరివాదము చేయరాదు. యోగుల విషయములో ప్రత్యేకముగా పరీవాదము (నీంద) చేయరాదు. పరివాదము (వసిష్ఠ మహర్షి కాలము నుండి ధర్మశాస్త్రముల ననుసరించి, శ్రాద్దమున కాహ్వానింపఁబడు వారిలో యొక ప్రత్యేక స్థానము యోగులకున్నది. పురాణ కాలములో నది యొక గ్రుడ్డి నమ్మకముగా సాగినది. అంతవరకు ఒక యోగికీ భోజనమీడుట వందలాది బ్రాహ్మణులకు భోజనము పెట్టుట కంటే ఘనముగా నంగీకరింపఁబడినది. అందుచే యోగులను గూర్చి అవమానకరముగా మాటలాడుట నిషేధింపబడినది). అవమానము, నింద్యముగా పలుకుట. (58) అట్టి పరీవాదముచే నా వ్యక్తి యొక క్రిమి యై యచ్చటనే నరకముననే పరివర్తించుచుండును. ధ్యానపరులుగాని, మోక్షకాంక్షులుకాని యెవరు యోగులఁగూర్చీ నిందచేయుదురో, వారు ఘోరమయిన నరకమును పొందుదురు. శ్రాతకూడ (ఆ నిందలను విన్నవాఁడు) నిస్సంశయముగ ఘోర నరకమును చెందును. ఆ నరకము హోరదర్శనమయినది. అంతయు దట్టమయిన చీకటిచే ఆవృతమై యుండును. (60) యోగీశ్వరుల నిందించుట వలన మానవుఁడు స్వర్గమును చేరలేడు. ఇంద్రియ నిగ్రహము కలిగిన (యతాత్ములయిన) యోగుల నిందను ఎవఁడు వినునో యతఁడు చిరకాలము నరకమున నిమగ్నుఁడగును. సంశయము లేదు. అట్టివారు కుంభీపాకమున (నరకమున) నిప్పులో వేల్చబడుదురు; అంతియేకాక పోరీ నాలుకలు మాటి మాటికి తెగకోయఁబడును. (61) అట్టి మనుష్యులు సముద్రములో పారవేయఁబడిన చిల్లపెంకువలే నశింతురు. అందుచే మనోవాక్కర్మలచే యోగుల నవమానించుట మానవలయును. ఆతఁడిచ్చటనే యిహమందు పరమందును అనంత ఫలము నొందును, దానిలో సంశయము లేదు. (62) సర్వశాస్త్రముల పారగుఁడయినవాఁడు, తన విషయమై పారగత్వమును పొందఁడు. తన క్రియలచే నాతఁడీ మూఁడులోకముల మధ్యచరించుచుండును.

ఋగ్వేద మంత్రములను, యజుర్వేద మంత్రములను, సామవేద మంత్రములను, తత్సంబంధి, యితర శాస్త్రముల యొక్క పారము ముట్టిన హాఁడయినను, అవికారములను, అచాంచల్యమును వదలి బ్రహ్మను' పొందలేడు. అతఁడు నశించును. (63) ప్రకృతి యందలి సర్వ వికారముల యొక్క పారమును ముట్టిన వాండే, అవిద్య నేజింగిన వాఁడు మూఁడు వేదముల యొక్క పారమును పూర్ణముగానెరిగినవాఁడు, త్రిగుణముల పారము నందిన వాఁడు అంతీయకాక ఇరువది నాలుగు తత్త్వముల కడను చూచినవాఁడు, సంసారమునుత్తరించి యావలగట్టునకు చేరినవాఁడయి సర్వ విద్యాపారంగతుడగును. ఎవ్వడు బ్రహ్మకు విధియుతముగా వంకితమయినవాడో యతఁడు దానిని పూర్ణముగ నందును. అట్లే యతఁడు సర్వము ఆత్మయందు లీనమయిన స్థితిని గ్రహించును. (65) యోగమార్గము నవలంబింపనీ బ్రాహ్మణుఁడు సర్వ విజ్ఞానమున చేప్పబడు దాని సారమును ముట్టలేఁడు. (65) యోగమును నెఱింగినవాఁడు వేదముల యందు గ్రహింపదగిన ధాని నంతటిని అవగాహనము చేసికొనును. దానినే గ్రహింపవలయును. అది బ్రహ్మము. అప్పుడు వేదము నెఱింగిన వారాతనిని వేదపారగుఁడు అందురు. (66) వేదమును వేదితవ్యమును నెంగినవాఁడు యథాస్థితుఁడై యుండును. అనఁగా నీజముగా వేదముల నెటింగిన వాడు బ్రహ్మస్థితిలో నుండును. మిగిలినవారో శబ్దత: వేదముల తుదిని మాత్రమెటింగీన వారు. (67) పితృభక్తుఁడయినవాఁడు నిస్సంశయముగా యజ్ఞములను, వేదములను, కామములను, వివిధములయిన తపస్సులను, ఆయువును, సంతానమును పొందును. (68) శ్రద్దగా నొ శ్రాద్ధ కల్పమును నియమ పూర్వముగా అధ్యయనము. చేసినవాఁడు, సమస్త తీర్థదాన ఫలములను, (పై వాని నెల్లను) పొందును. ఆతఁడు పంక్తి పావనుఁడగును. బ్రాహ్మణులలో పంక్తి యందు ప్రథమమున నుండి భోజనమాచరించు వాఁడగును. ద్విజులకు విధేయుడగువాఁడు, వారిని భజించువాఁడు సర్వకామములను పొందును. (70) వానిని నిత్యమును వినువాఁడు, ఇతరులయిన ద్వీజులకు వినిపించువాడు అనసూయాపరుఁడు, జితక్రోధుఁడు, లోభమోహ వివర్జితుం డు తీర్థముల యొక్క ఫలములను, దానాదుల యొక్క ఫలితమును ఎల్లప్పుడును పొంది, మోక్షోపాయమును పొందును, శ్రేష్ఠమయిన స్వర్ణోపాయమును నిస్సంశయముగ నందును. ఇహ లోకమున ఉత్కృష్టమయిన పుష్టిని పొందును. అందుచే నీత్యమును శ్రాద్దము నాచరించవలయును. ఈ శ్రాద్ధ కల్పమును నెవ్వఁడు అతంద్రితుఁడై సమాహితచిత్తుఁడై సభలయందు, పర్వముల సంధి కాలముల యందు పఠించునో యతఁడు సంతానము - నందును. అత్యంత తేజోవైభవముతో దీనౌకసుల లోకమును పొందును. (73) ఈ కల్పము ఎవ్వనిచే చెప్పంబడినదో ఆ స్వయంభువునకు నమస్కారము. మహా యోగేశ్వరులకు నేనెప్పుడును ప్రణామ మాచరింతును, (74)

ఇది వాయు ప్రోక్త మహాపురాణమయిన బ్రహ్మాండ పురాణమున మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున శ్రాద్ధకల్పమున బ్రాహ్మణ పరీక్ష యనంబడు పందొమ్మిదవ అధ్యాయము.