బ్రహ్మాండ మహా పురాణము
59 - వైవస్వతోత్పత్తి
బృహస్పతి ఇట్లు చెప్పెను. ఇట్లు చెప్పఁబడి ఋషులు పరమానందము నొందిరి. అంత అధిక శుశ్రూషాభావముతో తదనంతర వృత్తాంతమును మరల నడిగిరి. ఋషులిట్లనిరి. అమిత తేజస్వులయిన రాజుల యొక్క వంశముల యొక్క స్థితిని ప్రభావమును వంశక్రమము ననుసరించి అడుగునట్టిమాకు చెప్పుము. వారలచే నీ విధముగా ప్రశ్నింపఁబడి, వాక్యకోవిదుఁడు, ఆఖ్యానకుశలుఁడు నగు రోమహర్షణుఁడు, తదనంతర "కథాశ్రవణకుతూహలురయిన ఋషులకీట్లు చెప్పెను. పూర్వము ఋషియైన వ్యాసుఁడు, అడిగిన నాకు చెప్పిన విధమున అమిత తేజస్వులయిన రాజుల యొక్క వంశముల యొక్క స్థితిని ప్రభావమును క్రమముగా చెప్పెదను. నా వలన మీరెఱుంగుఁడు. వరుణుని భార్య స్తుత. ఆమె సౌందర్యవతి సురసుందరి. ఆమెకు పుత్రులు ఇరువురు వారు కలి వైద్యుఁడును. కలిపుత్రులు మహావీర్యులు, ఆయుఁడు, విజయుఁడును. వైద్యునిపుత్రులుమహాబలులు, జయుఁడు, ఘృణి,మునీ యనువారు. వారుభయులుమహాబలులు, వారు పెండ్లికి ఇచ్చిన కన్యలను చంపి తినెడివారు లేదా తమ్ము ప్రేమించి వచ్చినవారినీ భక్షించెడివారు. వారోండొరులను భక్షించిరి. వారోండొరులను చంపిన తరువాత వినాశనమునొందిరి. కలి (వేటొకఁడు)సురయొక్క కొడుకు.. ఆతని పుత్రుఁడు మదుఁడు. కలి యొక్క పెద్దభార్య హింస. ఆమెనికృతస్మృతి- క్రూరురాలు, అవిశ్వాస పరురాలుగా ప్రసిద్ధ. ఆమెకుకలి వలన నల్గురుపుత్రులుపుట్టిరి. వీరుపురుషాదులు. మనుష్యులఁదినువారు. వారు నాకుడు విఘ్నుఁడు. భద్రము డు విధముఁడు. శిరస్సు లేనివాడు విఘ్నుఁడు, నాకుడు శరీరమే లేనివాఁడు భద్రమునకు నొకేచేయి ఇంక వీధముఁడు ఒకేయొక కాలుకలవాఁ డు, తామసియైన పూతన భద్రముని భార్య. ఇఁకరేవతి విధమునిభార్య వారిరువురకు వేలాదిపుత్రులు.
నాకుని భార్య శకుని. విఘ్నుని పత్ని అయోముఖి. వారి కుమారులు రాక్షసులు. వారు మహావీర్యులు. ఉభయ సంధ్యల సంచరింతురు. రేవతీపూతన పుత్రులు నైఋతులు, ఆ రాక్షసులందరు దుష్టగ్రహములు. వీరందరు రాక్షస స్వభావులు ప్రత్యేకముగా బాలల గ్రహములు. వీరందరి అధిపతి స్కందుడు. ఆతడబ్రహ్మసమ్మతించినప్రభువు. బృహస్పతియొక్కభగినీ వరసీ.ఆమెబ్రహ్మచారిణి. (15) ఆమె యోగశక్తిసిద్ధ. ఆమె సర్వప్రపంచమునందు ఎట్టి సంసక్తతలేక సంచరించును, ఆమెవసువులలో ఎనిమిదవ వాఁడయిన ప్రభాసునకు భార్యయయ్యెను. దేవతయైనవిశ్వకర్మ ఆమెకు జన్మించెను. ఆతఁడే శిల్పులకు ప్రజాపతి. ఆతఁడు వీరాట్ విరాట్రూపములకల్పించేను. ఉదారధీమంతుఁడయిన త్వష్ట ధర్మపౌత్రుఁడు, తనయోగసిద్ధివలన దేవతలకు సహస్రసంఖ్యను .మీంచి శిల్పకర్తయయ్యెను. ఆతఁడేసర్వదేవతలకు విమానముల నిర్మించి యిచ్చెను.మహాశిల్పియైన యీతని శిల్పములపై మానవులు జీవింతురు. (మానవులాతని శిల్యవిద్యను అనుకరించి శిల్పవిద్యాజీవికులగుదురు). ప్రహ్లాదుని కుమార్తె అయిన విరోచన, ప్రఖ్యాతవహించినది. ఆమె త్వష్ట యొక్క పత్ని. ఆమె విరోచనుని భగిని, త్రిశిరునీ తల్లి. త్రిశిరుఁడు ధీమంతుఁడయిన విశ్వరూపుఁడు, ఆతఁడే దేవతల కాచార్యుఁడు.మయుఁడు విశ్వకర్మయొక్కసుతుఁడు, ఆతఁడే స్వయముగా విశ్వకర్మ. ఆతని చిన్నచెల్లెలు సురేణు. ఆమె ప్రఖ్యాతురాలు. సవిత యొక్క భార్యయైన త్వష్టయొక్క కూతురు 'సంజ్ఞ'గా వీశ్రుత. ఆమె వివస్వంతునీ వలన మహాభాగు డయిన మనువును కనెను, ఆతఁడే జ్యేష్ణుఁడు. తరువాతయమ, యమున లను జంటపిల్లలను కనెను, ఆమె బడబా (ఆడగుర్రము) రూపము నొందీ కురుదేశములకు వెడలెను, మహాభాగయైన ఆమె ఆశ్వినులను కనెను. వారు అశ్వరూపమువహించిన సూర్యుని యొక్క బిడ్డలు. ఆమె తన నాసికా ద్వయము నుండి అంతరిక్షమున వారినీ కనెను, నాసత్యుఁడు, దస్యుఁడు, మార్తాండుని కుమారద్వయము ఋషులిట్లడిగిరి. బుధులు వివస్వంతుని నేల మార్తాండుడని పిలిచిరి?
ఆ పుణ్యవతీ ఏల వారలను నాసికా పుటముల నుండి ప్రసవించేను? దాని నెఱుఁగకోరుచున్నాము. మాకది సర్వము వివరింపుము. సూతుఁడిట్లనెను. పుట్టిన చాలకాలము వరకు ఆమె యండము (గుడ్డు) భిన్నము కాక యట్లే యుండెను. త్వష్ట ఆ యండమును భిన్నమొనర్చెను. గర్భవధ వలన భ్రాంతుఁడై కశ్యపుఁడు అచ్చట నుండి వెడలిపోయెను. అండము రెండుగా కాగా, త్వష్ట దానిని చూచి ఇట్లనెను. “ఈ యండము న్యూనమయినది కాదు. ఓ అనఘ ! నీవే స్వయముగా మార్తాండుడవగుము”. ఓ అనఘ ! నీవే స్వయముగా మార్తాండుడవగుము. ఆతఁడు అండములో నున్నను! అతఁడు మృతుఁడు కాడు. అని తండ్రి స్నేహముతో పలికెను. ఆతనీ యా పలుకుల విని, ఆ నామము తదర్ధమునకు సమన్వితముగా నున్నది యనిరి. ఆ యండము ద్విధాకృతమయినప్పుడు ఇట్లు ఆతఁడు చెప్పఁబడెను. మార్తాండుడవుగా నుండుము. అందుచే పురాణజ్ఞులచే, ‘మార్తండ’ అనీ భావింపఁబడెను. ఇంక వివస్వతుండయిన మార్తండునీ సంతానమును చెప్పెదను. సప్తునీయొక్క భార్య యయిన సంజ్ఞ ముగ్గురను కనెను. వారు మనువు, యమి, యముఁడు, ఛాయ తపతిని శనైశ్చరునీ కనెను. వారు అందుచే మార్తండునీ కుమారులుగా వీడితులు. (32) వివస్వంతుఁడు (సూర్యుఁడు) మహాయశస్వి. కశ్యపునకు దాక్షాయణికి కలిగెను. వివస్వంతునకు సంజ్ఞ భార్య యయ్యెను. ఆ సంజ్ఞ త్వష్ణ కూతురు. మొదట ఆమె సురేణు నామమున వీఖ్యాత. తరువాత సంజ్ఞయయ్యోను. ఆమెయే అతి తేజస్వి భగవంతుఁడునయిన మార్తండుని భార్య “నిజముగా అండములో నతఁడు మృతుఁడు కాఁడు”. అని కశ్యపుడు ప్రేమతో పలికెను. కానీ అమృతుఁడని తెలిసీకాదు. అందుచే సూర్యుండు మారుండుడయ్యెను. వివస్వంతుని యొక్క తేజస్సు నిత్యమభ్యధికము. దానితోడనే కశ్యపాత్మజుఁడయిన సూర్యుడు మూడులోకములను తపింపఁజేయును. సంజ్ఞ వలన రవికి ముగ్గురు బిడ్డలు. ఇద్దరు కుమారులు వారు మహావీర్యులు ఒక్క కన్యక ఆమె తెలిసినదే.
వైవస్వతుని కుమారులలో మనువు జ్యేష్ఠుడు. తరువాత యముండు పుట్టెను. అతఁడు శ్రాద్ధ దేవుఁడు. మనువు, ప్రజాపతి, తరువాత యమ, యమి ఇర్వురు కవలలుగా పుట్టిరి. వివస్వంతుని యొక్క భరింపరాని తేజస్సును రూపమును చూచి, సంజ్ఞ సహింపలేకపోయినది. ఆమె స్వకీయమైనఛాయను, తనతో సమానవర్ణము కలదానిని సృజించెను, సంజ్ఞ ఛాయ నుండి సముద్ధతయైన యామహాభాగ ప్రాంజలియై యొక్క సంజ్ఞతో ఇట్లు పలికెను. “నేను చేయవలసిన కార్యమేమియో వచింపుము అనీ అప్పుడు సంజ్ఞ ఆమెతో, నీకు భద్రమగుగాక. నేను నీ తండ్రి యొక్క భవనమునకు పోవుదును. ఎట్టి శంకయు లేకయే నీవిటనా భవనములో నివసింపవలెను. ఈ బాలకులిద్దరు వరవర్జినియైన కన్యకను నా కొఱకు నీవు పోషించవలెను. ఈ నియమమును నీవు భగవంతునకు తెలియజేయరాదు. అనెను. ఈ బాలకులిద్దరు నావారు. ‘అట్లే’ అనెను ఛాయ. ఇట్లు చెప్పి ఆ తపస్వినియైన సంజ్ఞ సిగ్గుపడిన దానివలె, త్వష్టయొక్క సమీపమున కరిగెను. తండ్రి వచ్చినట్టి ఆమెను చూచీ క్రుద్ధుఁడై సంజ్ఞతో భర్తయొక్క సమీపమునకు పొమ్ము” అని పునః పునః నీయోగీంపగా ఆమె-ఆడ గుఱ్ఱమయి తన నిజరూపమును నిందించీ ఆచ్ఛాదించుకొనెను. ఆమె ఉత్తర కురుదేశములకేగి యచ్చట తృణఖాదనమొనర్చెను. ద్వితీయ సంజ్ఞను (సంజ్ఞారూపముతోనున్న, ఛాయను) సంజ్ఞగా చింతించి, ఆదిత్యుఁడు ఆదిత్య వర్చస్వులయిన పుత్రులను గాంచేను. ఆ కుమారు లిద్దరు మనువుతో సాదృశ్యరూపాదులుకలిగి యుండిరి. వీరిరువురిలో ఒకఁడు శ్రుతశ్రవుండు సావర్ణి మనువుగా నగును. రెండవవాఁడయిన శ్రుతకర్మ శనైశ్చరగ్రహముగా నెఱుంగవలెను. ఎవడు మనువు గానయ్యెనో అతఁడు సావర్ణి, అనీ చెప్పఁబడును, పృధ్వీ లక్షణము కలిగిన సంజ్ఞ (ఛాయ) పూర్వముదయించిన బిడ్డలకంటె వీరి యందధిక ప్రేమ వహించెను. మనువు తత్సర్వము క్షమించెను. కాని యముఁడు క్షమింపలేదు. ఆమె తన తల్లికి సవతీ యగుటవలన ఆతఁడు ఆమెను గూర్చి దూషించెను. మిక్కిలిగా నతఁడు దుఃఖితుఁడయ్యెను.
ఛాయను రోషము వలన, బాల లక్షణము వలన, భావిరానున్నకార్యము యొక్క బలముచేతను, వైవస్వతుఁడయిన యముఁడు సంతర్జనము చేసెను. కోపముచే సావర్ణిజనని యముని శపించెను. “నీ తండ్రియొక్క భార్య యశస్వినియునైన యామేను ఆకస్మికముగా చరణముచే తర్జించితివి.” నీ చరణము నిస్సంశయముగ పడిపోవగలదు. ఆ శాపము వలన యముఁడు అధికముగా పీడితమానసుఁడయ్యెను. మనువుతో కూడి వెడలి ధర్మాత్ముండు యముఁడు సర్వము తండ్రికి తెలియబలికెను. “అధికముగా శాప భయమున నీర్విగ్నుఁడనై సంజ్ఞా వాక్యములచే వినిర్జింపం బడితిని. ఆమెపై నాపాదమునెత్తితినీ నిజమే. కానీ నాపాదమామే శరీరమున పడలేదు. ఇది బాల్యహేతువుచే గానీ అజ్ఞానముచేగానీ జరిగినది. నీవునన్ను క్షమింపనరుఁడవు. ఓ లోకేశ తపింపచేయు పోరలలో శ్రేష్ఠుఁడా ! నేను శపింపఁబడితిని. ఈ మహా భయము నుండి రక్షింప భవత్రసాదము తగును. (57) ఇట్లు ప్రభువు వివస్వంతుఁడు చెప్పఁబడి, యంతయువీని, ఇట్లు పలికెను. “ఓ పుత్ర ! అసంశయముగా దీనికేదియో గొప్పకారణముండియుండవలయును. నీవు, ధర్మజుండవయ్యు, సత్యవచస్కుడవయ్యు క్రోధవశుఁడవయితివి, అంతీయేకాక నీ మాతృవచస్సులు అసత్యములు కాజాలవు. కృములు నీమాంసమునుతీసికొనీ భూతలమున కేగగలవు. ఓ ప్రాజ్ఞ ! అప్పుడు నీ పాదము మరల సుఖము పొందును. శాపపరిహారమువలన నీవు రక్షింపఁబడితివి. ఇట్లు నీ జనని వచనములు సత్యములగును. (61) సూర్యుండు సంజ్ఞతో నిట్లనెను- అందరు తనయులు మనకు సమానమే యయినప్పుడు, వారీలోనొకని నధికముగా నీవెట్లు ప్రేమించితి?” అంత సజ్ఞ దానిని పరీహరించుచు, వివస్వంతునీతో నిజము చెప్పలేదు. అంత యాతఁడు యోగమునొంది తన్మూలమున సత్యమునెటింగెను. వివస్వంతు డామెపై కోపించెను. సర్వనాశనముతో నామేను శపింపఁదలంచెను. అంత ఆమే వివస్వంతునకు యథాతత్త్వము వచించెను.
వివస్వంతుఁడు వీని క్రుద్ధుఁడై త్వష్టకడకు పరువెత్తుకొని పోయెను. త్వష్ట యధాన్యాయము వివస్వంతు నర్చించేను. ఆతఁడు. తన్ను నిర్దగ్గుని చేయతలపోసి యుండుట, ఆతనిని నెమ్మదిగా స్వాంత్వపరచెను. “అతి తేజస్సుతో ప్రజ్వలించు నీ రూపము మిక్కిలి శోభించుట లేదు. ఆ రూపమును భరింపలేక సంజ్ఞ గడ్డి బయళ్ళలో గడ్డి తినుచు తిరుగుచున్నది. శుభచారిణియైన నీ భార్యను నీవీప్పుడు చూడగలవు. ఆమే శ్లాఘ్య సంపన్న యౌవనముతో కలకలలాడుట నీవు నీ యోగస్థితిని పొందీ చూడగలవు, నీ కనుకూలమయినచో ఈ పద్ధతి పూనుము. ఓ అరిందము ! నీవు మొదటి నుండి వహించుచున్న యీ తేజోరూపమును నేను మార్చెదను. ప్రథమతః వివస్వంతుని రూపము పైకి క్రిందికి ప్రక్కలకు వ్యాపించు తేజస్సు గలిగి యుండెడిది. ఓ దీవనస్పతీ ! ఆ నీ రూపముచే దేవి సంజ్ఞ పీడింపఁబడినది. అందుచే నీ ఆశ్చర్యకరమైన తేజో రూపము కిరణములను చక్ర రూపమున వ్యాపింప చేయుచున్నది. (70) త్వష్ట రూపనిర్వర్తనము కొఱకు అనుజ్ఞాతుఁడయ్యెను. అంత త్వష్ట వివస్వంతుఁ డయిన మార్తండుని రూపమును మార్చుటకు ప్రారంభించెను. ఆతఁడాతని రూపమును నొక కదలాడు గుండ్రని చక్రమున పెట్టి (తరవిటిపట్టునట్లు) అనియమముగా ఎత్తు పల్లములతోనున్న రూపమును (భ్రమిపై పెట్టి) తరణీ! పట్టెను. సూర్యతేజస్సు తగ్గిను. నీర్మూలిత తేజస్కుడు, తేజ సాపహృతుఁడు, నగు ప్రభాకరుఁడు శుభదర్శనుఁడై, యోగస్థితి నొంది బడబా (ఆడ గుర్రపు రూపమున నున్న) రూపమున నున్న భార్యను చూచెను. (73) స్వతేజస్సుచే నీయమాది వ్రతములచే, సర్వభూతములకు అశ్వరూపమున అదృశ్యమైన యామెతో ముఖము ద్వారా లైంగిక (మైథున) సంబంధము వహించెను. మైథునాంతమువ పరపురుషునితో సంబంధమేమో యనీ యామె శంకతో వీవస్వతుని శుక్రమును తన నాసికా పుట ద్వారముల నుండి బహిర్గమింప జేసెను. ఆ శుక్రము నుండి దేవతలు, పుట్టిరి. వైద్యశ్రేష్ఠులయిన అశ్వనీ ద్వయము పుట్టెను. “నాసత్య”, “దస్రల” నంబడు వారు ద్వాదశమూర్తికి (సూర్యునకు) పుట్టిరి. ఈయెనమండ్రు ప్రజాపతులు సూర్యసంతానము. వీరందరిని భార్యకు భాస్కరుండు చూపించేను.
భార్యను చూచి ఆతఁడు సంతోషమొంది ఆమెతో నీట్లనెను. “యముఁడు నీ శాపము వలన మిక్కిలిగా పీడిత మనస్కుఁడయ్యెను. ఆతఁడు ధర్మముచే నితరులను రంజించును. అందుచే నతఁడు ధర్మరాజు అయ్యెను. ఆశుభకర్మ వలన ఆతఁడు పరమద్యుతి స్థానము నొందెను. ఆతఁడు పితృణామాధిపతిత్వము, లోకపాలత్వము నొందెను. ఆతఁడు మనువు. ప్రజాపతి. ఆతఁడు. మహాయశస్వియునైన సావర్ణి. భవిష్యత్సావర్లెవమన్వంతరము నాతడు మనువగును. ఆ మహా ప్రభువు, ఇప్పటికిని, మేరు పర్వతముపై ఘోరతపము చేయుచున్నాఁడు. ఆతని సోదరుఁడగు శనైశ్చరుఁడు అందు గ్రహత్వమును పొందెను. (తరణిని సాన పట్టిన సూర్యునీ శరీర సంబంధ కాంతి ఖండములచే), త్వష్ట విష్ణుని. చక్రమును నిర్మించెను. ఆ చక్రమునకు గొప్ప మహామహాత్వమున్నది. దాని కెందును ఎదుర్కోలు) తిరస్మృతి (ప్రతివారణము) లేదు. అయ్యదే దానవులకు ప్రతిపోరణము. యవీయసీ (చిన్నదీయైన) నీచెల్లెలు యమున యశస్వినీ ఆమె లోకపావనియైన శ్రేష్టమైన యమునానదీయయ్యెను. వారీలో జ్యేష్ఠుఁడు మనువు. మహాతేజస్వి. ఆతని సృష్టియే ఇప్పుడు మనమందరమును, విస్తరముగా వైవస్వత (సూర్యకుమారుఁడు) మనువును గూర్చి చెప్పెదను, వైవస్వతుని యొక్క మహాతేజస్వులయిన ఏడుగురీ పుత్రుల జననమును నెవ్వరయిన వినినను చదివినను, వారు ఆపద నుండి విముక్తు లగుదురు. మహా యశస్సు పొందెదరు.
ఇది వాయుప్రోక్త మవబ్రహ్మాండపురాణమందలి తృతీయ ఉపోద్ఘాతపాదమున వైవస్వతోత్పత్తి యనెడు ఏబది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 97 of the Brahmānda Mahā Purana is as follows:
In grand and awe-inspiring prose, this chapter describes the cosmic dissolution, or Pralaya, that marks the end of a Kalpa day of the creator. It depicts scorching solar rays drying up the oceans, followed by catastrophic fires and torrential celestial downpours that submerge all three worlds into a single infinite ocean. The devout soul meditates with deep reverence on the supreme lord who slumbers peacefully upon the cosmic serpent Ananta amidst this primal ocean.