4 -  ఉపసంహారపాదమున, “బ్రహ్మాండావర్తమను”

ఋషులు పలికిరి:

మీ చే వర్ణింపబడిన సుమహాఖ్యానము వింటిమీ. మనువులతో బాటు ప్రజల యొక్క అత్యద్భుతములయిన కృత్యములను, ఋషులతో సహితము దేవతల అద్భుత క్రియలను పితృ దేవతల యొక్క గంధర్వుల యొక్క భూతముల యొక్క పిశాచముల యొక్క సర్పముల యొక్క రాక్షసుల యొక్క దైత్యుల యొక్క దానవుల యొక్క యక్షుల యొక్క పక్షుల యొక్క అద్భుతములయిన కృత్యములను వివిధములయిన ధర్మ నిశ్చయములను విచిత్రములయిన కథా యోగములను జన్మ వృత్తాంతములను మీ మధుర మయిన హక్కులతో విని మనస్సులకు కర్ణములకు అమృత సన్నిభమయిన ప్రీతినీ పొందితిమీ-4.

సూతుని ఈ విధముగా ఆరాధించి, మహర్షులు సత్కరించి ఆ సత్రము నందున్న వారందరు మరల సృష్టి (సర్గమును) గూర్చి ప్రశ్నించిరి.

“ఓ సూత! మహాప్రాజ్ఞ! సృష్టి క్రమము మరల ఎట్లు ప్రారంభించును అన్ని బంధములు నాశనము చేయబడి, సర్వతః తమస్సులో అంధకారములో విలీనమయి యుండ, వికారములు విస్పష్టములై యుండ, అవ్యక్తమునందు ఆత్మ స్థితమైయుండ, అనుభవయోగమున వివిధ వస్తు పరికరములతో బ్రహ్మ యొక్క సృజన క్రియ ఆరంభము. కాక యుండ, సృష్టి ఎట్లు ప్రారంభమగును? మాకు చెప్పుము.

ఇట్లడుగబడి లోమ హర్షణుఁడు సృష్టి క్రమమును మరల చెప్ప ప్రారంభించెను.-8. ఈ సందర్భములో సృష్టి క్రమము ఎట్లు జరుగునో చెప్పెదను, ఇదీ యంత చూచిన దానిని బట్టి అనుమానముతో గ్రహించవలెను. దానికి తర్కమును చేప్పెదను-10. (దృ షేనైహనుమేయం చ తర్కం వక్ష్యామీ యుక్తితః) అవ్యక్తుఁడయిన బ్రహ్మ అపరోక్షుఁడు, ఆతని గ్రహణము అసాధ్యము. 1) ఏలనన? వేదవాక్కులు గూడమనస్సుతోబాటు వెళ్లి యాయవ్యక్తమును బ్రహ్మను చేరలేక తిరిగి వచ్చును. 2) కావున ఆపరోక్షమైన బ్రహ్మ చేరనలనికాదు.-11. వికారములతో ప్రతి ఇష్టమైన గుణము సమముగానుండును. ప్రధానము పురుషుల సాధర్మ్యముతోనేయుండును.-12. ఎల్లప్పుడు ప్రాణుల ధర్మాధర్మములు అవ్యక్తమున ప్రలీనమగును, సత్త్వగుణమున సత్త్వమాత్రాత్మమైనధర్మము ప్రతిష్టితమైనది.-13. తమోగుణము తమోమాత్రాత్మ కథర్మముండును. ఆయా రెండు అవిభాగముగా గుణసామ్యముననుండును. ప్రధానము యొక్క సమస్తకార్యము బుద్ధి పూర్వకమెవర్తిల్లును. అబుద్ధిపూర్వకముగా క్షేత్రజ్ఞుడు ఆగుణములనధిష్ఠింపగలడు -15. క్షేత్రక్షేత్రజ్ఞులు భయలు ప్రవర్తిపదగినప్పుడు జీవుడాగుణములనభిమానించి ప్రవర్తించును. అప్పుడు వారురిద్దరు బోజ్యభోక్తృత్వ సంబంధములనందుదురు. కావున అక్షరమైన అవ్యక్తము సామ్యముననుండి గుణాత్మకమగును. క్షేత్రజ్ఞాధిష్ఠితమై గుణసామ్యవైషమ్యమమును బొందును. దానివలన క్షేత్రక్షేత్రజ్ఞులు వ్యక్తము ప్రవర్తిల్లును-18.

క్షేత్రజ్ఞాధిష్ఠితమయిన సత్త్వగుణము మహత్తుతో నారంభించి, విషమ భూతముల యొక్క తుది వరకు చతుర్వింశ గుణాత్మకమును ఉత్పత్తి చేయును. -19 క్షేత్రజ్ఞుఁడు, ప్రధానుఁడు, పురుషుడు వ్యవహరింపనారంభింప ఆది దేపుండు ప్రధానుని ఆశీర్వదించునందురు. (అర్థము సరిగా లేదు 21-23 వణకు)

మరల మరల సృజింపఁబడి గుణములు పూర్వ జన్మమందలి హరీ గుణములచే మరల. పొందును-31. హింస, అహింస, మృదుత్వము, క్రూరత్వము, ధర్మము, అధర్మము, అనృతము సత్యము. కాని యేగుణములు పూర్వ జన్మమున కలవో వానినే తిరిగీ. పొందును. పూర్వ లక్షణముల వలన ఆ గుణములే వారికి రుచించును.-32. మహాభూతముల యందలి ఇంద్రీయుము లందలీ, భౌతిక రూపముల యందలి నా నాత్వము, భూతముల యందలి విప్రయోగము - ఇవీయన్నియు గుణముల వలన ప్రవర్తించును -33. ఈ విధముగా ప్రతీ సర్గము క్రమముగా సూక్ష్మముగానాచే చెప్పబడినది. ఇంక సంక్షిప్తముగా బ్రహ్మ యొక్క సముద్భవమును కూడ చెప్పెదను. -34 అవ్యక్తము నుండి, కారణము నుండి, దాని నుండి, సత్ అసత్ నుండి ప్రధానుని వలన పురుషుని వలన మహేశ్వరుం డు పుట్టును. -35 ఆతఁడు బ్రహ్మ సంజ్జితుఁడై మరల సంభావితమగును. అతఁడే లోకములను మరల సృజించును. అయ్యవి డు పుట్టాను. నేవీ, ఆలు అభిమానగుణాత్మకములు. -36. అహంకారము మహత్తు నుండి పుట్టినది. మరల దాని వలన భూతములుత్పన్నములయినవి. భూతములు ఇంద్రియములు ఒకే సమయమున ఆత్మ నుండి పుట్టినవి.

భిన్నభిన్నమయిన భూతములు భిన్న భూతముల వలన పుట్టినవి. ఈ విధముగ సృష్టి ప్రవర్తనము వానిని గూర్చిన వివరము ఇంతకు పూర్వము నేను విని యెఱింగినంత మీకు చెప్పితిని. నేను చెప్పిన విధముగా ఆ సృష్టి క్రమమును మీ మనస్సుల జ్ఞప్తి యుంచుకొనుడు. లోకోత్పత్తిని, దాని సుస్థితిని, దాని వ్యయమును, నైమిశారణ్య మహర్షులు వినీరి. సత్రమున (యాగశాల యందు) అవభృతమాచరించిరి. పవిత్రులయిరి. శుద్ధులయి పుణ్యలోకముల పొందుదీరీ. -39, ఆ విధముగనే మీరలు యథావీధి దేవతల ఆర్చింపుడు. అవభృథస్నానమాచరింపుఁడు శుద్ధులగుడు ఆ యుష్యాంతమున దేహములను పరిత్యజించి కృతార్థత్వమొంది పుణ్యలోకములను పొంది ఈ విధముగా నానందింపుఁడు. -40 ఈ నైమి శేయులు, సత్రిణః! సత్ర యజ్ఞమాచరించినవారు స్పషా (స్పృశించి) (?) చూచి, అవభృథ స్నాతులయి స్వర్గమున కరిగిరి. -41 ఓ బ్రాహ్మణులారా! మీరు కూడా నా విధముగా వివిధములయిన మఖములను (యజ్ఞముల) నాచరించిన తరువాత, మీ జీవితాంతమున మీరు స్వర్గమునకు తప్పక పోవుదురు. -42. కథా స్వీకరణమునకు ప్రక్రియ ప్రథమ - పాదము. మిగిలిన భాగములు - అనుషంగము, ఉపోద్ఘాతము, ఉపసంహారము. -43. లోకహితమున నా సక్తుఁడయి భగవానుడయిన సాక్షాద్వాయువు నైమిశమున యజ్ఞ శాలనుపొంది నాలుగు భాగములలో గూడిన ఈ పురాణమును చెప్పెను.

ఈ ప్రధాన సృష్టిని పూర్తిగా అవగాహన చేసికొని అట్లే ఈశ్వరకాతీతమయిన సృష్టినెంగిన మేధావి అజ్ఞానమును పొందడు. భగవత్రసాదమును పొందును భగవత్రసాదమును పొందును.

ఓ బ్రాహ్మణులారా!

ఎవ్వరీ పురాతనముయిన ఇతి హాసమును విందురో, ఇతరులకు వినిపింతురో, బోధింతురో, వారు మహేంద్ర స్థానములందు పెక్కు సంవత్సరములు బ్రహ్మతోడి సాయిజ్యమును పొంది బ్రహ్మతో సహ మొదింతురు-48. ప్రజా ప్రభువుల యొక్క మహాత్ముల యొక్క పృథివీశుల యొక్క కీర్తిమంతుల కీర్తిని ప్రస్తుతించు వారు బ్రహ్మ భూయత్వమును మోక్షమును పొందుదురు. బ్రహ్మ ఐదీయైన కృష్ణ ద్వైపాయనునిచే (వ్యాసర్షిచే) ప్రోక్తమైన ఈపురాణము ధన్యము, యశస్కరము, ఆయుష్యమిచ్చునది, వేద సమ్మితమైనది. అత్యంతైశ్వర్యము, తేజము గలిగిన మన్వంతరేశ్వరుల యొక్క కీర్తిని దేవతల కీర్తిని ఋషీశ్వరుల కీర్తిని, ఎవరు కీర్తింతురో వారు పాపముల నుండి విముక్తులయ్యెదరు. అనంతమైన పుణ్యమును పొందెదరు.

ఏ పండితుఁడు ప్రతి పర్వము నందు దీనిని చదివి వినిపించునో, ఆతఁడు వీధూతపాపుడయి మోక్షమును పొందును. ఎవడు ఈ బ్రహ్మాండ పురాణమును శ్రాద్ధమున బ్రహ్మణులకు వినిపించునో అది పితరులకు చెందును సర్వ కామములను సమకూర్చును. శాశ్వత, శుభములనొసంగును. ఇది ప్రాచీనమైనదగుట పురాణము. ఇప్పటికిని నిలిచి యుండినందున పురాణమనబడును.

పురాణ శబ్దము యొక్క శాల్జికార్థమెఱింగిన యతఁడు సర్వ పాపముల నుండి విముక్తుడగును. అట్లే త్రివర్ణముల వారీ ఇతిహాసమును చదివిన పాపముక్తులగుదురు. ఈ ఇతి హాసమును విని, ఎవడు తన మనస్సును ధర్మా చరణమునకు నీయోగించునో అతఁడు తన శరీరమున రోమకూపములు సర్వశః. ఎన్ని కోట్ల సంఖ్య నుండునో, అన్ని వేల సంవత్సరములు బ్రహ్మ సాయుజ్యమును పొంది, అతఁడు దేవతలతో ఆనందించును -57. ఈ శాస్త్రము పవిత్రమయినది, పుణ్య ప్రదమైనది యశః కరము పాప హరమైనది. ఈ పురాణమును బ్రహ్మ వాయు దేవునకు (మాతరిశునకు) ఒసంగెను. అతని నుండి ఉశనసుడు దీనిని పొందెను, ఆతని వలన బృహస్పతి పొందెను. అంత బృహస్పతి దీనిని సూర్యునకు (సవితకు) ప్రవచించెను -59, సప్త దీనిని మృత్యువునకు చెప్పెను. మృత్యువు ఇంద్రునకు . చెప్పెను. ఇంద్రుడు వసిషునకును వసిషుఁడు సారస్వతునకు. చెప్పెను. -60. సారస్వతుఁడు త్రిధామునకు చెప్పెను. త్రిధాముఁడు శారద్వతునకు శారద్వతుఁడు శ్రీవిష్ణునకును, త్రివిష్ణుండో అంతరిక్షునకు నొసంగేను-61, అంతరిక్షుఁడు చర్పునకు, చర్యుడు త్రయ్యారుణునకు, వివరించెను. త్రయ్యారుణుని నుండి. ధనంజయుఁడు పొందెను. ధనంజయుఁడు కృతంజయున కొసంగెను.. కృతంజయుని వలన తృణంజయుఁడు తృణంజయుఁడు భారద్విజునకు చెప్పెను. భరద్వాజుఁడు గౌతమునకు చెప్పెను. గౌతముఁడు దానిని నిర్యంతరునకొసంగెను -63. నిరంతరుఁడు. వాజశ్రవునకు చెప్పెను. వాజశ్రవుఁడు సోమశుష్యునకొసంగెను సోమశుష్యుఁడు తృణ బిందువనకొసంగెను తృణ బిందువు దక్షునకిచ్చెను దక్షుఁడు శక్తికి చెప్పెను. గర్భస్థుఁడయిన పరాశరుఁడు శక్తి వలన వినెను. పరాశరుని నుండి జాతుకర్ణుడు వినేను జాతు కర్ణుని నుండి ద్వైపాయనుడు వినెను (వ్యాసుఁడు) ద్వైపాయనుని వలన బ్రాహ్మణోత్తమ! నేను పొందితిని - 66. నేను అమిత బుద్ధి మంతుడయిన పుత్రునకు చేప్పితిని. ఈ వాక్యమే బ్రహ్మ మొదలుకొని గురువులకు చెప్పబడినది. -69. ఇదీ ధన్యము యశస్కరము పుణ్యము ఆయుష్యము సర్వార్థసాధకము పాపఘ్నము. పండితులు బుద్ధిమంతులు గురువులకు ప్రయత్న పూర్వకముగ నమస్కరించవలేను బ్రాహ్మణులచే నీయ్యది నీయమపూర్వకముగా విన వలసినదీ. పవిత్రము ఉత్తమమైనదియునగు నీ పురాణమును అశుచులకు, పాపులకు, విశ్వాస హీనులకు, పండితులు కానివారికి, అధమ పక్షము ఒక సంవత్సరమయినను చదువని శిష్యునకు నీయరాదు, తన కుమారుని వంటి వాడు కానీ వాని కీయరాదు. అపోతున కీయరాదు. ఇది పవిత్రము ఉత్తమము. బ్రహ్మకు నమస్కారము. ఉత్తములలో నుత్తముఁడైనవానికి వర ప్రదాతకు అవ్యక్త యోనునకు నమస్కృతులు. అతడు సూర్యలోక ప్రతిష్టితుఁడు. ఆతడే యజ్ఞ స్వభావుడు. ఆతఁడు దేవతలకు ప్రభువు ప్రజాసృష్టి కర్త. అతనికి ఆరంభము యోని(కారణము) అవ్యక్తమని చెప్పుదురు. ఈ కాలము, గతి రెండును అతని వ్యక్త దేహము. వహ్ని అతని ముఖము. సూర్యుడు చంద్రుడును ఆతని నేత్రములు. దిక్కులాతని శ్రోత్రములు వాయువు ఆతని ఘాణము (ప్రాణము)

అతని వాక్కులు వేదములు అంతరిక్షమాతని శరీరము క్షితి (భూమి) పాదములు. రోమకూపములాతని నక్షత్రములు, యావదాకాశమాతని శిరస్సు. విద్యలు, ఉపనిషత్తులాతని పుచ్ఛము. ఆ దేవదేవునికి జనులకు జనన స్థానమైన వానికి, యజ్ఞాత్మకునకు, సత్యలోక ప్రతిష్ఠితునకు, వరములకు వరమైన వానికి వరదుఁడయిన మహేశ్వరునకు బ్రహ్మకు ఆది ప్రథమ వ్యక్తికి నమస్కారము.

ఇదీ వాయుప్రోక్తమైన బ్రహ్మాండ మహా పురాణమున ద్వాదశసాహస్ర సంహితయందు ఉత్తర భాగమున, ఉపసంహార పాదమునందు బ్రహ్మాండావర్తమను చతుర్థాధ్యాయము

సూచన ఇంతవరకు అమవాదకర్త డా దివాకర్ల రామమూర్తి.

సంపూర్ణము.