బ్రహ్మాండ మహా పురాణము
38 - భార్గవ చరితము
వసిష్ఠుఁడిట్లనెను.
కృష్ణుఁడతర్జానము చెందగా, సుమహాయశస్వియైన రాముఁడు శ్రీకృష్ణుని దర్శనానుభావముచే తన్ను సముద్రిక్త శక్తి సంపన్నుగా తలపోసికోనెను. ఆకృతవణునితో గూడి ప్రజ్వలించు నగ్నివలె దీపించి, రాముఁడు మాహిష్మతీపురిని చేరెను. ఆ మహిష్మతీ నగరమున సరీచైష్ణము, దర్శనమాత్రముచేతనే పాపులను సహితము పుణ్యవంతులను చేయునది పుణ్యవంతమయినదియు నగు నర్మద కలదు. పూర్వమందు, ఇందు ప్రవేశించిన ఈశ్వరునిచే త్రిపురాసురుని వినాశనము కొఱకు యత్నమాచరింపఁబడినది. అందలి దేవ స్వరూపులయిన మనుష్యుల యొక్క పుణ్యము వర్ణింప సాధ్యము కాదు. భార్గవకుల నందనుఁడయిన పరశురాముఁడు నర్మదా నదిని చూచి సంప్రీతుఁడయి నమస్కార మాచరించెను. ఆతఁడు శత్రుసాధన తత్పరుడు. ఓ నర్మదా ! ఈశ్వరు నుండి సముద్భూతమయిన దానా! నీకు నమస్కారము. నాకు వరదవు కమ్ము. వెంటనే ఓ శోభన స్వరూపురాలా ! నా శత్రువులను నాశనము చేయుము. అని పాపనాశనియైనట్టి నర్మదకు నమస్కరించెను. వెంటనే కార్తవీర్యార్జునునకు దూతను రాముఁడు పంపెను. “ఓ పుణ్యవంతుఁడవయిన దూతా ! నేను చెప్పునది నీవు రాజునకు చెప్పుము. నీవెట్టి సందేహము పొందనవసరములేదు. దూత యెచ్చటను వధ్యుండుకాఁడు. ఏ బలమును సమాశ్రయించుకొని, యో మూడ! జమదగ్ని మునీని తిరస్కరించితివో, ఆ మహర్షి పుత్రుఁడు నీతో యుద్దముచేయవచ్చియున్నాఁడు. ఓ మందబుద్దీ ! నీవు శీఘ్రముగా బయటికీరమ్ము. రామునితో యుద్దము చేయుము. భార్గవుఁడయిన రాముని నీవు పొంది, వెంటనే లోకాంతరమున కరుగుము. రాజునకీ సందేశమును చెప్పి, ఆతని ప్రత్యుత్తరమును ఆలకించి, వెంటనే తిరిగి రమ్ము. నీకు భద్రమగుగాక, ఈ విషయమున ఆలస్యము మంచిది కాదు. రామునిచే పంపఁబడిన దూత హైహయ భూపతికడ కరిగెను. తద్రజ సభలో రాముఁడు పంపిన సందేశము సర్వస్వము వినిపించెను. ఆత్రేయ (ర్షి) భక్తుఁడు మహాబలపరాక్రముండు అయినరాజు దూదితమును వినెను. అధికక్రోధవంతుడయ్యెను. ఆ దూతకుత్తరమొసంగెను.
కార్తవీర్యుఁడిట్లనెను.
నేను దత్తాత్రేయుడొసంగిన (భూమిని) భుజబలముచే జయించితిని. రాజులను బంధించితిని. స్వపురమునకు తీసికొని వచ్చితినీ. బంధించితిని. ఆ బలము నా యందున్నది, నీతో నిప్పుడు యుద్ద మాచరించెదను.
ఇట్లు పలికి కార్తవీర్యుఁడు వెంటనే దూతను పంపివైచెను. అంత సేనాపతిని పిలిపించి ఆతనికి వక్తలలో శ్రేష్ఠుఁడయినరాజు “మహాభాగ! వీరవర ! నా సైన్యమును సిద్దము చేయుము. భార్గవ వంశజుఁడయిన రామునితో నేను యుద్ధము చేసెదను. ఆలస్యము చేయకుము.” అని చెప్పెను. మహావీరుఁడు సేనాధ్యక్షుఁడు, చతురంగ సమన్వితమయిన సైన్యమును సజ్జీకరించుటవిని కార్తవీర్యుఁడు సంతోషముతో సూతుండు తీసికొనివచ్చిన రథము నారోహించెను. ఆ మహారాజు. చుట్టును, సామంతులు, మండలేశ్వరులు, అనేక సంఖ్యగల అక్షౌహిణీ సైన్యముతో రాజును పరివేష్టించి యుండిరి. మహారాజ సైన్యపారావారమున, కోట్ల కొలది ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, పదాతులుండిరి. వారి లేక్కయసంఖ్యాకము. ఆ సైన్యము నందు, నానావంశ సముద్భవులు, మహావీరులు, మహాకాయులు, నానావిధ యుద్ధ విశారదులు, నానా శస్త్రాస్త్ర ప్రయోగములందు కుశలురు, నానా విధ వాహనముల నధిరోహించినవారు సొనాలంకార సంయుక్తులు రాజులున్నారు. అసంఖ్యాకములయిన ఏనుగులు వానిమగధార నలంకరింపఁబడియున్నవి. దానీకెన్నియో భూషణము లమర్పఁబడినవి. అవియన్నియు తత్తన్మహామాత్రులచే (ఏనుగుల మలచు వారిచే) నియమింపఁబడుచున్నవి. ఆ మత్తేభములు అనేక విధములుగా ప్రకాశించుచున్నవి. నానాజాతి (దేశ) హయముల వలన నుత్పన్నములయినవి, వాయువేగము కలిగినవి, మహారాజు యొక్క అశ్వ శిక్షకులయిన సాదులచే, నానా విధ యుద్ద శిక్షణము నందినవియగు హయములు అందు ప్రకాశించుచుండెను. ఇంక రథములు సుదీర్ఘములు, జవనాశ్వములతో కూడియున్నవి. చక్ర భ్రమణ నిర్దోషములు కలిగినవి. ఆ చక్రభ్రమణ ధ్వనులు వర్షాకాల మేఘ గర్జనలతో నుపమింపఁదగినవి. ఇఁక పదాతులు (కాలిబంట్లు) వీరందరు ఖడ్గములను చర్మములను ధరించిరి, వారందరు “నేను, ముందు, నేను ముందు” అను అహంకార వచోయుక్తులు, కార్తవీర్యార్జునుని సైన్యము ముందుకు కదలగా, అప్పుడే ఆకాశము పది దిక్కులయందు భూరజస్సుచే ప్రచ్ఛాదితమై పోయెను. నానావిధ యుద్ధవాద్యముల ఘోషలచేతను, గుఱ్ఱముల హేషాధ్వానములచేతను, ఏనుగుల యొక్క బృంపాతములచేతను, ఆకాశము దద్దరిల్లిపోయెను. రాజయిన కార్తవీర్యుఁడు త్రోవలో విపరీతములు ఆతనిని మృత్యుదౌత్యకరములు నగు శకునములను చూచేను. జుట్టు విరజిమ్ముకొన్నట్టిది, ముక్కు కోయబడినట్టిది, చిరిగిన గుడ్డ, పీలిక దాల్చినది, ఇంచుమించుగా దీగంబరమైనదియు, ఏడ్చుచున్నదియు నల్లని వస్త్రము దాల్చినట్టిదియునగు యొక వనితను రోజు చూచెను. అంతీయేకాక, చినుగు పీలికలను దాల్చి, నేల పైడి, భగ్నశరీరుడై, వస్త్రహీనుఁడు, కాషాయ వస్త్రముల దాల్చినవాఁడు, అంగహీనుఁడు, దుఃఖిత మనస్కుడునయిన యొక వ్యక్తిని రాజు చూచెను. ఉడుమును, కుందేటిని, ముండ్ల పందిని, రిక్తకుంభమును, సరీసృపమును (పాకుకొనుచు పోవు పాము వంటిది), కార్వాసమును (నూలు కండిని) కుందేటిని, నూనెకడవను, ఉప్పును, ఎముక ముక్కను, తన దక్షిణపు వైపున భయంకరమయిన భైరవ రవమును చేయుచునున్న ఒక నక్కను (పుల్కసుఁడు నీచకులజుఁడు) రోగియైన పుల్కసుని, వృషభమును, గ్రద్దను, భల్లూకమును రాజు చూచెను. ఈ దుశ్శకునములను చూచియు రోజు కాలపాశావృతుఁడయి యుద్ధమునకు వెంటనే ప్రయాణమయ్యెను. నర్మదా నద్యుత్తర తీరమున ఒకవటచ్ఛాయలో అకృతవర్ణునితో నున్న రాముఁడు శతకోటి నృపావృతుఁడై, సహస్రాక్షౌహిణీ యుక్తుండయి ఉపాగతుఁడయిన కార్తవీర్య నృపవరుని చూచెను. అత్యంత సంతుష్టుడయ్యెను, చిరసమీపీతమయిన కార్యము నేడు సిద్దికై తరలి వచ్చినది అదియే నృపాధముఁడయిన కార్తవీర్యుఁడు నా దృష్టి గోచరుడగుట అని పలికి, లేచెను. పరశు ఆయుధమును జేపట్టేను. క్రుద్ద కేసరి వలే రాముఁడు శత్రు వినాశనమునకై విజృంభించెను, సైనికుల యొక్క వధ క్రైసముద్యతుఁడయిన రాముని శరమును దాల్చిన మృత్యువు వలె చూచి ఎల్లరు అధికముగా కంపించిరి. వాయు వేగముతో ఎందెందు భార్గవుఁడు, రోషయు తుఁడయి పరశును కదలించేనో, అందు భుజములు, ఊరువులు, కంఠములు, సంఛన్నములయి ఏనుగులు, గుఱ్ఱములు, నరులు, నేలకుపడిరి. మదించిన యేనుగు పరువెత్తుచు ఎట్లు వనమును ఛిన్నాభిన్నము చేయునో అట్లే భార్గవరాముఁడు. మనో వాయజవముతో సంచరించి కార్తవీర్యుని సేనను సర్వనాశనము చేసెను. రణము నందు శస్త్రధారులలో శ్రేష్టుడయిన రాముఁడు శత్రు ప్రహరణము చేయుట చూచి, మత్యదేశపురాజు తన మహారథము నధిరోహించి, తన ధనుస్సు ఎత్తి, నారిని సంధించి వారితో బాణమును లాగి, అగ్నితుల్యోగ్రతేజుఁడై బాణముల వర్షించుచు రాముని చేరెను. వచ్చుచున్న కార్తవీర్యుని చూచి రాముఁడు మహోగ్రమయిన ధనువును గ్రహించి కోపముచే నెగిరిపడుచు వాయవ్యాస్త్రమును సంధించెను.
అతిబలుఁడు, మనస్వియు నయిన మత్స్యదేశరాజు మంగళుడు వచ్చేడు బాణ వర్షమును నివారించుచు, రామునిపై పర్వతాస్త్రమును ప్రయోగించి విడిచెను. వాయవ్యాస్త్రమును తదస్త్రము స్తంభింపజేయ, అస్త్రవిధాన దక్షుఁడయిన రాముఁడు, తదస్త్రబలము నేఱింగి, మత్స్యరాజు విమోచనము చేయు బాణ పరంపరల ప్రసభమున నివారింప, విధి మంత్ర యుక్తముగా నారాయణాస్త్రమును ప్రయోగించెను. రామునిచే నారాయణాస్త్రము రాజును చంప ప్రయోగింపఁబడ దిక్కులన్నియును అత్యంతమయిన తేజస్సుతో ప్రజ్వలించెను. మత్స్య భూపతి ప్రకంపించి పోయేను. ఆమత్స్యరాజు వణకిపోవుట రాముఁడు చూచి నాల్లుబాణములచే ఆతని వాహనములను చంపెను. ఒకేయొక బాణముతో మంగళుని ధ్వజమును ఛేదించెను. రెండు బాణములతో ఆతనీ చాపమును, ఒక బాణముచే నాతని సారథిని కొట్టి మత మూడింటిచే రథమును నేలపడంగొట్టెను. రథమును విడిచి భూమిపై నిలిచిన మంగళుని తనచేతిలోని గండ్రగొడ్డలిచే రాముడు శీర్షమున కొట్టెను. ఆతఁడో తలపగిలి, నెత్తురును కక్కుచు, మాటిమాటికీ మూర్ఛనొందుచు గాయముచే మరణించెను. ఇక ఆతని సైన్యము అస్త్రములచే ప్రదగ్ధము చేయబడీ క్షణకాలములో బుగ్గిగానై వినాశనము చేయబడెను. చంద్రవంశ సముద్భవుఁడు నృపతి శ్రేష్ఠుఁడయిన మంగళుఁడు రాజు మరణింపగా రాముఁడు సంతోషము పొందెను.
ఇది వాయుప్రోక్తము మహాపురాణమునయిన బ్రహ్మాండపురాణమున మధ్యమభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున భార్గవచరితమున ముప్పది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 76 of the Brahmānda Mahā Purana is as follows:
In vivid, devotional prose, this section describes Parashurāma's pilgrimage to the sacred Mount Kailāsa to behold the supreme lord Shiva and seek his divine blessings. It paints a breathtaking picture of the celestial mountain, shimmering with divine light and echoed with sacred chants of worshipping gods. The yearning soul travels along on this spiritual journey, longing to behold the blissful form of lord Shiva residing in his heavenly abode.