బ్రహ్మాండ మహా పురాణము
24 - జ్యోతిస్సుల సన్నివేశము అనునది
సూతుఁడిట్లనియెను :-
దీనిని విని మునులు సంశయాన్వితులైరి. వారు రోమహర్షణుని మరల నిట్లడిగిరి. ఇంతవరకు మీరు సవిస్తరముగా సెలవిచ్చినది గృహముల గుణించి ఇప్పుడు మీరు మాకు అయ్యవీయెట్లు దేవగృహములయినదియును జ్యోతిస్సులు ఎట్లుండినదియు వర్ణింపుఁడు (1,2) ఏతత్సర్వము జ్యోతిర్గణములగూర్చి సునిశ్చితముగా చెప్పఁగోరెదము,వాయువు ఇట్లు చెప్పెను. వారి పలుకులు విని సావధానుఁడైన సూతుండు వారి సంశయములను తొలగించు నుత్కృష్టమయిన వాక్కులను పలికెను. సూతుఁడిట్లు చెప్పెను. ఈ విషయములో సూర్యచంద్రుల ఉద్భవమును గూర్చి జ్ఞానముచేతను బుద్ధివిశేషముచేతను మహాప్రాజ్ఞులయిన వారు చెప్పినది మీకు ప్రవచించెదను. సూర్యుడు, చంద్రుఁడు, గ్రహములు దేవ గృహములుగా ఏ విధముగా స్మరింపఁబడినదో నేను చెప్పెదను. (దేవ గృహాణి - దేవతావాసములు) తరువాత (త్రివిధముల) యగ్ని యొక్క సముద్భవమును గూర్చి చెప్పెదను. (1) దేవతా సంబంధాగ్ని (2) భౌతికాగ్ని (3) నీటి నుండి పుట్టిన పృథివీ సంబంధమైన అగ్ని (విద్యుత్సంభవము) (అబ్యోని) (6) రాత్రి సమాప్తి కాగా అవ్యక్త జన్ముఁడయిన బ్రహ్మవలన అవ్యాకృతమైన యీ ప్రపంచము రాత్రి సంబంధమైన చీకటిచే నావరింపబడెను. (7) ఈ లోకము సర్వభూతముల యొక్క రూపములో నున్నప్పుడు వానీ వాని ప్రత్యేక లక్షణములు సష్టములై పోయినప్పుడు, లోక తంత్రార్థ సాధకుఁడయిన స్వయంభువుఁడు, ఖద్యోతము (మిణుగురు పురుగువలె) వలె, స్వయము ఆవర్బివింప వలెనను కోరికతో ఇతః తతః సంచరించెను. (8,9) ఆతఁడు (బ్రహ్మ) లోకోదీ యందు పృథివీని జలమును సంశ్రయించిన (ఆధారముగొన్న) అగ్నిని చూచెను. (9) ఆయగ్నిని ప్రకాశార్థము మూఁడు భాగములుగా విభజించేను. ప్రపంచమును పవిత్రీకరించు అగ్ని పార్థివాగ్నియని పిలువబడియెను. (10)
సూర్యునియందు ప్రజ్వలించు అగ్ని ‘శుచి’ అని స్మరింపఁబడినది. నీటి నుండి పుట్టిన యగ్ని ‘ఆబ్జ’ యయిన యగ్ని వైద్యుతాన్ని వాని లక్షణములను వచించెదను. (11) నీటి నుండి పుట్టిన యగ్నులు మూఁడు. (1) వైద్యులాగి, (2) జాఠరాగ్ని, (3) సౌరాగ్ని వీని వలననే సూర్యుఁడు స్వకిరణముల ద్వారా నీటిని త్రాగి ఆకాశమున ప్రకాశించును. (12) వైద్యుతాగ్నిచే సమావిష్టము (పుట్టిన) వార్ష్యము (వర్షసంబంధమైనది) నీటిచే ప్రశాంతి నొందదు. మానవుల కుక్షిస్థమయిన అగ్ని నీటిచే ప్రశాంతి నొందదు. (ఆరిపోదు). ఆ కారణమున సౌరాగ్ని వైద్యులాగ్ని, జాఠరాగ్ని ఈ మూఁడును ఇంధనము లేనివి. తేజము కొంత నీటియందుండునని యందురు, మరికొందరు తేజమునకు నీరే యింధనమని కొందరును అందురు. (14) కట్టెను మధింపఁగా పుట్టిన యగ్నికి ఇంధనము కర్ర; నీటిచే నీయగ్ని శమించును (చల్లారును, పవమానాగ్ని (పవిత్రీకరించున్ని) జ్వాలలు కలది; జాఠరాగ్ని దీనికి ప్రకాశము లేదు. తెల్లనిది, నీరూష్మము, సంప్రకాశకమునై ప్రభా (కాంతి) రూపకాండమున సూర్యమండలమున నుండు సౌరాగ్ని సూర్యుడస్తమించునపుడు రాత్రితో అగ్నిలో బ్రవేశించును. అందుచే నది దూరము నుండి ప్రకాశించును. అగ్నియొక్క ఉష్ణము సూర్యుడుదయింప సూర్యుని యందు ప్రవేశించును. అందుచే అగ్నీ వెలుగును. (17) (అగ్నీ వేదకాలపు ఆర్యులు అగ్నినీ ఒక గొప్ప దేవతగా భావించిరి. ఋగ్వేదమున అగ్ని యొనరించు వివిధ కార్యముల ననుసరించి అగ్నికి పలునామము. లీయబడినవి. పురాణ వాజ్మయము కూడా ఆ సంప్రదాయమునే యనుసరించుచున్నది. సర్వ గ్రహముల యొక్కసంభవమునకు కారణముగా భావింపఁబడు సూర్యుం ని గతికి కూడ అగ్నియే కారణముగా విశ్వసింపఁబడుచున్నది. ఒక్క సూర్యగతికే కాదు మూఁడు లోకముల స్థితికిని అగ్నియే ఆధారమనీ బావింపఁబడుచున్నది. సూర్యుని కిరణముల యందలి ఆగ్నియే నీటిని ఆవిరిగా పీల్చుచున్నది. తన్మూలముననే ఋతువులు కలుగుచున్నవి).
ప్రకాశము ఉష్ణము క్రమముగా సూర్యుని యొక్కయు అగ్ని యొక్కయు తేజస్సులు. (18) ఒకదానిలో నొకటి ప్రవేశించుట వనల అయ్యవి యొండొంటిని పోషించును వృద్ధి పొందించుకోనును. ఉత్తరార్ధ గోళమున ఆ విధముగనే దక్షిణార్థ గోళమున సూర్యుడుదయింపగా రాత్రి నీటిలో ప్రవేశించును. అందుచే నీరు పగటి వేళ వేడిగా నుండును; ఇయ్యది రాత్రి ప్రవేశము వలన (20) సూర్యుఁడస్తమింప పగలు నీటిలో ప్రవేశించును. అందుచే రాత్రులయందు నీరు తెల్లగా మెరియుచున్నట్లు (ప్రకాశవంతముగా) కన్పించును.(21) ఈ క్రమములో భూమియొక్క దక్షిణోత్తరార్ధ గోళములలో పగలు, రాత్రి, సూర్యోదయ సూర్యాస్తమయ సమయములలో నీటియందు ప్రవేశించును. (22) ఏ. సూర్యుఁడు తనకిరణములచే నీటిని త్రాగి తపించునో (ప్రకాశించునో) ఆతనిని ‘శుచి’ (అగ్ని) యని యెఱుంగవలెను. అయ్యది పృథివీ సంబంధాగ్నితో కలిసియున్నది. (23) శుచి (అగ్నికి వేయి కిరణములు. ఆతఁడు నేతి కుంభమును పోలి యుండును. అంతటను వ్యాపించిన సహస్రనాడులతో (కిరణములతో) అయ్యది నదుల యందలి నీటిని సముద్రముల యందలి నీటిని, కూపోదకమును, కులోదకాదికమును, స్థావర జంగమ వస్తువులయందలి నీటిని స్వీకరించును. వానియొక్క సహస్ర కీరణములు శీతోదక పాతములను, ఉషోదక పాతములను కలిగించును. ఆ కిరణములలో నాలుగు వందలు విచిత్రమూర్తుల వర్షించును, కుంభ వృష్టిని కలిగించు కీరణములు - చందనములు, సాధ్యములు, కూతనములు, అకూతనములు, అమృతములు అని పిలువ బడును. ఈ అన్ని కిరణములు వృష్టిని కలిగించును. (27) ఇవికాక వీనిలో మూడు వందలు ఇతర కిరణములు కలవు, అయ్యవి మంచునుండి వెలువడును. (హిమోద్గతములు).
హిమపాతమును తెచ్చు నాడుల పేరులు (కిరణములు) - దృశ్యములు, మేఘములు, యామ్యములు, ప్రొటీన్యములు (గర్జించునవి) సరిమితమైన కాంతి గలిగిన కిరణములకు ‘చంద్ర’ములు అని పేరు. ఉష్ణమును గలిగించు తెల్లని కిరణములు (శుక్లములు) సంఖ్యకు మూఁడు వందలు. వానీ సొమములు శుక్లములు, కుహకములు, ‘విశ్వభృతులు’. (29) సూర్యుఁడు ఈ కిరణములను మనుష్యులకు పితృదేవతలకు పక్షపాతము లేకుండ విభజించి, వారలకు తృప్తి కలిగించును. (30) సూర్యుఁడు మానవులకు ఓషధులతో పితృదేవతలకు ‘స్వధా’ హోమముల చేతను (ఆహుతులు). ఇంక మిగిలిన దేవతలందరకు అమృతము చేతను తృప్తిని కలిగించును. (31) వసంత గ్రీష్మముల యందు మూఁడు వందల కిరణముల మూలమున సూర్యుఁడు తపించును. వర్షాకాలమున శరత్కాలమున సూర్యుఁడు వర్షమును సొలుగు వందల కిరణముల మూలమున కురియును. హేమంత శిశిరములలో మంచును మూడు వందల కిరణములచే కురియును. ద్వాదశాదిత్యులు ఇంద్రుఁడు, ధాత, భృగుఁడు,పూష,మిత్రుఁడ,వరుణుఁడు, అర్యముఁడు, అంశుఁడు, వివస్వంతుఁడు, త్వష్ట, సవిత, పండ్రెండవవాఁడు విష్ణువు. (33) సూర్యుడు మాఘమాసమున వరుణుఁడు, ఫాల్గుణమున పూష, చైత్రమాసమున అంశుఁడు, వైశాఖమున ధాత, జ్యేష్ఠమాసమున ఇంద్రుఁడు, ఆషాఢమున సవిత; (35)
శ్రావణమాసమున వివస్వంతుఁడు (ప్రోప్డే) భాద్రపదమున సూర్యుఁడు, భృగుఁడు, అశ్వయుజ మాసమున పర్జన్యుఁడు (అర్యముఁడు). కార్తీకమున సూర్యుఁడు త్వష్ట, మార్గశీర్షమున సూర్యుఁడు మిత్రుఁడు, పుష్యమాసమున రవి సనాతనుఁడయిన విష్ణువు. అరకర్మ నాచరించు వరణుని యందు ఐదువేల కిరణములు. పూష ఆరువేల కిరణములతో ప్రకాశించును. భగవంతుడయిన అంశుఁడు ఏడువేల కిరణములతో ప్రకాశించును. ధాత ఎనిమిది వేల కిరణములతో, ఇంద్రుఁడు తొమ్మిదివేల కిరణములతో ప్రకాశించును. (సూర్యుఁడు) సవితృ నామముతో పదివేల కిరణములతో పోవును; భృగుఁడు పదునొకండు వేల కిరణములతో చరించును. మిత్రుఁడు ఏడువేల కిరణములతో సంచరించును; ఇంక త్వష్ట ఎనిమిదివేల కిరణములతో సంచరించును. వివస్వంతుఁడు తొమ్మిదివేల కిరణములతో భాసించును. (పర్జన్యుఁడు కాదు. వివస్వం తుం డు), విష్ణువు భూమిని ఆరువేల కిరణములతో తపింపచేయును. (40) వసంతమున సూర్యుడు కపిలవర్ణుఁడు; గీష్మమున సూర్యుఁడు కనకకాంతీయుతుఁడు; వర్షాకాలమున శ్వేతవర్ణుఁడు; శిశిరమున (ఎఱ్ఱని) లోహిత వర్ణుఁడు; హేమంతమున సూర్యుఁడు తామ్రవర్ణుఁడు; ఈ విధముగా ఋతువుల వలనఁ గలిగిన సూర్యుని వర్ణములు (రంగులు) చెప్పఁబడినవి. (42) సూర్యుఁడు ఓషధుల యందు బలమును కలిగించును. పితృదేవతలను సూర్యుఁడు స్వధాహుతులచే బలీయులను చేయును; సూర్యుడు అమరుల యందు అమృతము నోసంగును. ఈ విధముగా మానవులకు పితరులకు, దేవతలకు, మువ్వురకును మూఁడింటి నొసంగును. (43) ఈ విధముగా సూర్యుని రశ్మి సహస్రము లోకార్థ సాధన మొనర్చును. శీతల కిరణ, ఉష్ణకిరణ, హిమకిరణముల నొసంగుటలో ఋతువుల యందు మాత్రము భిన్నత్వము సూర్యుఁడు చూపును. (44) ఈ విధముగా శుక్ల ప్రభా భాస్వరమయిన మండలము సూర్యనామ సంజ్ఞతము. అదియే (సూర్యమండలమే)
నక్షత్ర, గ్రహ, చంద్రులకు ఆధారము ప్రతిష్ట. అంతియేకాక తజ్జన్మ స్థానము, (45) చంద్రుఁడు, నక్షత్రములు, గ్రహములు ఇవి యన్నియును సూర్యుని నుండియే పుట్టుచున్నవని యెఱుంగవలయును. చంద్రుండు నక్షత్రాధిపతి (నక్షత్రములకు రాజు), మణి సూర్యుఁడో గ్రహరాజు. (46) మిగిలిన పంచ గ్రహములను కామచారిణులయిన భగవంతులనుగాఁ దెలిసికొనవలయును. ‘పఠ్యతే చాగ్ని రాదిత్య ఉదకం చంద్రమాః స్మృతః’ వారు అగ్ని సూర్యుఁడు, ఉదకము చంద్రుఁడుగా చెప్పబడుచున్నారు (47) మిగిలిన గ్రహముల యొక్క ప్రకృతి స్వభావము చక్కగా వర్ణింపఁబడును వినుడు. సురసేనాధిపతియయిన స్కందుఁడు అంగారక గ్రహముగా చెప్పఁబడినాఁడు. (48) వేదజ్ఞాన విదులయిన బుధులు నారాయణుని బుధునిగా చెప్పుదురు. యముఁడు రుద్రుని యొక్క అవతారము; ఆతఁడే వివస్వంతుని కుమారుఁడు, స్వయముగా లోకప్రభువు, శనైశ్చరుఁడు మహాగ్రహము; ద్విజశ్రేష్ఠుఁడు, మందగామి; ప్రకాశవంతములయిన గ్రహద్వయము దేవతలకు అసురులకు గురువులు. (50) ఆ ఇద్దరు శుక్ర బృహస్పతులు; వారు ప్రజాపతి సుతద్వయము. యావత్రైలోక్యము ఆదిత్యుడే మూలముగా గలిగినది. అందు సందేహము లేదు. (51) దేవతలతో, రాక్షసులతో, మనుష్యులతో గూడిన యీ జగత్తు సమస్తము సూర్యుని నుండియే యుద్భవించినది. ఓ బ్రాహ్మణోత్తములారా! రుద్రుని యొక్క ఉపేంద్రుని యొక్క (విష్ణువు) ఇంద్రుని యొక్క చంద్రుని యొక్క దివొకసులయొక్క కాంతి, సర్వలోక సంబంధమైన జ్యోతిర్గణముల యొక్క కాంతియు, యది యంతయును సూర్యునిది; ఆతఁడే సర్వలోకముల కధిపతి ఆతఁడే మహాదేవుఁడు; ఇతఁడే ప్రజాపతి (ప్రజలకు ప్రభువు) సూర్యుండే త్రిలోకములకు మూలము. ఆతఁడే పరమదైవము. ఆతని నుండియే సర్వము పుట్టినది. ఆతనియందే సర్వము ప్రవిలీనము నొందును (54)
లోకము యొక్క ఆవిర్భావము, వినాశనము పూర్వమందు ఆ సూర్యుని నుండియే ఆవిర్భవించినవి. ఓ విప్రులారా !. సర్వ ప్రపంచముచే తెలియదగిన గ్రహము, దీప్తిమంతమైనదియు సూర్యుండే. (55) (కాలమానములన్నియు) క్షణములు, ముహూర్తములు, దివసములు, రాత్రులు, పక్షములు, మాసములు, సంవత్సరములు, ఋతువులు, యుగములు అన్నియును సూర్యునియందే నిధనము చెందును. మరల మరల పుట్టును. అందుచే సూర్యుని విడిచిపెట్టి కాలసంఖ్యామానము లేనేలేదు. (57) కాలమును, గణించుట వీడిచి నిగమములు లేవు; వైదిక దీక్ష లేదు, ఆహ్నికములయిన దినచర్యలు (క్రియలు) లేవు; ఋతువులే చక్కగా విభజింపఁబడక పోయినచో పుష్పములేక్కడ? మూలము లెక్కడ? ఫలము లెక్కడ? ఓషధి గణముల యొక్క పుట్టుక తృణ నిష్పత్తి ఎట్లు జరుగును? ప్రపంచమును ప్రకాశింప చేయువాఁడు, ప్రతాపనము కలిగించువాం డు, నీటిని తస్కరించువాడు నైన సూర్యుడు లేనిచో, దీవియందు భూమియందు గల సర్వ జంతువుల యొక్క చైతన్యమునకు, వ్యవహారమునకు, అభావము కలుగును. ఆతఁడే కాలము; ఆతఁడే అగ్ని; ఆతఁడే ప్రజల ప్రభువు. ప్రజాపతి; ఆతఁడే ద్వాదశాత్ముఁడు (పండ్రెండుగురయిన పొరడు). (61) ఓ ద్విజశ్రేష్ఠులారా ! చరాచర జీవసహితమైన త్రైలోక్యము నాతఁడే ఉష్ణముచే తపింపఁజేయును. ఆతఁడే యావల్పపంచము యొక్క తమస్సు (చీకటినీ)ను నాశనము చేయు తేజోరాశి (కాంతి పుంజము) (61) వాయువు యొక్క యుత్తమ మయిన మార్గము సంది సూర్యుఁడు, తన కిరణములచే, యావత్పపంచమున పార్వములందు, ఊర్వమున, అధః ప్రదేశమునదంతటను కాంతిని గలిగించును. (62) గృహమధ్య భాగమున వ్రేలాడగట్టబడిన కాంతిమంతమయిన దీపము పార్వభాగములు, ఊర్ధ్వమున, అడుగున సమముగా చీకటినీ నాశనము చేయునో, ఆ విధముగా జగత్పతి, సహస్ర కిరణుఁడు, గ్రహరాజును అయిన సూర్యుఁడు, తన కిరణములచే జగత్సర్వమును ప్రకాశవంతము చేయును. (64) ఇంతకు పూర్వము నాచే నుదాహృతమయిన సూర్యునీ సహస్ర కిరణములలో శ్రేష్ఠములయిన సప్తరశ్ములు సర్వగ్రహములకు యోనులు, (జన్మస్థానములు). (65)
ఆ సప్తరశ్ములీ విధముగా చెప్పబడినవి. సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ విశ్వశ్రవ, సంపద్వసు, అర్వావసు, స్వరాట్టు. సూర్యుని కిరణములందలి సుషుమ్నా కిరణము క్షీణించిన చంద్రుని మరల వృద్ధి పొందింపజేయును. (67) సుషుమ్లమను సూర్యరశ్మి క్షీణించిన చంద్రుని వర్ధిల్లజేయును. ఈ సుషుమ్నము తిర్యగూర్ధ్వ ప్రచారము గలదిగా కీర్తింపఁబడినది. పురోభాగముననున్న హరికేశమను రశ్మి నక్షత్రముల యోనిగా (జన్మస్థానము) కీర్తింపఁబడినది. (68) దక్షిణమున నున్న ‘విశ్వకర్మ’ అను సూర్యరశ్మి బుధగ్రహమును వృద్ధి పరచును. పశ్చిమమున నున్న విశ్వ శ్రవమను సూర్యరశ్మి శుక్రునికి జన్మ స్థానముగా పండితులచే స్మరింపఁబడుచున్నది. (69) సంపద్వసువను సూర్యరశ్మి లోహితునకు (కుజునకు) యోని జన్న స్థానము. ఆలివదీయైన అర్వావసువనెడి సూర్యరశ్మి బృహస్పతికి జన్మస్థానము. (70) స్వరాట్టు అను సూర్యరశ్మి శనైశ్చరుని సభివృద్ధి పరచును. ఈ విధముగా సూర్యప్రభావము వలన గ్రహములు, నక్షత్రములు, నక్షత్రములు తారకలు ఆకాశమున తిరుగుచున్నవి. అంతీయేకాదు యావద్విశ్వము జగము నీలచుచున్నవి. ఎన్నడును క్షయము (నాశనమును) పొందనివగుటచే వానికి నక్షత్ర సంజ్ఞ కలిగినది. (74) కిరణములచే పూర్వమే కలుగుచున్నవి యీక్షేత్రములు వచ్చి పడుచున్నవి. తరువాత సూర్యుఁడు, ఆయా స్థానములను నక్షత్ర తారకలను గ్రహించును. (73) ఎవరు తమ సుకృత ఫలితముగా తరించీ ఆశ్రయించి నందున, సుకృతాంతమున గ్రహములను ‘తారకము’ లని వానికి నామములు గలిగినవి. అవి శుక్లత్వమును గలిగి ప్రకాశించునట్టివగుట వానికి తారకములని పేరువచ్చినది. (74) ఆకాశమందలి, భూమియందలి, రాత్రులందలి తేజములను చీకటినీ, నిత్యము స్వీకరించు ‘ఆదిత్యుఁడు’ ‘ఆదత్తే ఇతి ఆదిత్యః’ నామము గలిగినది.
‘సవన’ అనుధాతువు స్యందనార్థమున గ్రహింపవలెను. నీటిని స్రవించుట వల్ల వేలుగు స్రవించుట వల్లను సూర్యుని సవితయందురు. అనేకార్థకమైన ‘చది’ ధాతువు ఆహ్లాదనము, శుక్లత్వము, అమృతత్వము, శీతత్వము అను నర్థములు గలదిగానీట భావింపబడును. (చందయతీతి చంద్రః (77) సూర్యుని యొక్క చంద్రునియొక్క మండలములు దీవ్యములు, భాస్వరము శుక్లములు. అవీ యాకాశమున తిరుగును. అవి శుభంకరములయిన వృత్తకుంభముల పోలియుండును. (78) చంద్రుని యొక్క మండలము ‘ఘనతేయాత్మకము’గా స్మృతము. శుక్లము, ఘన తేజోమయముయినది సూర్యమండలము ఘనతేజోమయము. దేవతలందరీ స్థానములను సర్వశః (అంతటను) సర్ప మన్వంతరములందు ప్రవేశింతురు. వారు నక్షత్ర సూర్య గ్రహాశ్రయమును చెందుదురు. అవియే దేవతా గృహములు, హరి ననుసరించి వారి నివాసమును బట్టి) ఆ స్థానములకా నామములు కలిగినవి. సూర్యుఁడు సౌర స్థానము చేరును. చంద్రుఁడు సౌమ్య స్థానము చేరును. శుక్రుఁడు శుక్రస్థానమును చేరును. అయ్యది చాలకాంతిమంతము మరియు షోడశోర్చిఃప్రభాభాస్వరము. బృహస్పతి ‘జైవ’ స్థానమును చేరును. లోహితుఁడు (కుజుఁడు) లోహితునకు నిర్ణయింపఁబడిన స్టానము చేరును. (82) శనైశ్చరుఁడు శనైశ్చరుని స్థానమును చేరును. బుధునికై నిర్దేశింపఁబడిన స్థానము బుధుఁడు చేరును. స్వరాష్ట్ర నుఁడు (రాహువు) స్వరానునకు సంబంధించిన స్థానమునం దుండును. (83) నక్షత్రములన్నీయు నక్షత్ర స్థానముల బ్రవేశించును. ఇవియన్నియు జ్యోతిర్గణముల యొక్క స్థానములు. వారందరు సుకృతాత్ములు. కల్పారంభమున ఈ స్థానములు స్వయంభువుఁడైన బ్రహ్మచే నిర్మితములు; భూత ప్రళయాంతము వరకు నీ స్థానములుండును.
అన్నీ మన్వంతరములందు అవియే దేవతల స్థానములు. అభిమానులు (దానితో దాలిత్యము పొందువారు) ఆ దేవతా స్థాపములయందే యుందురు. అతీతులైన దేవతలు అతీతులయిన పారీతోడను, భవిష్య దేవతలు భవిష్యద్దేవతలతోడను నుందురు. వర్తమానులు వర్తమానులలో నభిమానీంచి వారితో నుందురు. ఈ మన్వంతరములో గ్రహములు ‘వైతానీకులు’గా స్మరింపఁబడుదురు. (87) అదితీ పుత్రుడయిన వివస్వంతుఁ డు, వైవస్వత మన్వంతరమునందు సూర్యుఁడు. ధర్ముని సుతుఁడు, త్వషి సాముఁడు, అయిన ప్రభువగు వసువు చంద్రుఁడుగా స్మరింపం బడును. భార్గవ (శుక్ర) వంశమునకు చెందిన శుక్రుఁడు, రాక్షసుల పక్షమున యజ్ఞయాజకుడుగా తెలియబడుచున్నాఁడు. అంగీరసుని సుతుం డు బృహత్తేజుఁడునయిన దేవుఁడు దేవాచార్యుండు. (89) మనోహరుఁడైన బుధుఁడు త్వషిపుత్రుఁడుగా స్మరింపఁబడుచున్నాఁడు. సంజ్ఞా వివస్వతుల పుత్రుఁడు విరూపుఁడయిన శనైశ్చరుడు. (90) యువకుఁడయిన లోహితుఁడు (కుజుఁడు) వికేశికి అగ్నికి నుద్భవించెను. ఋక్షములను నామముతో నొప్పు నక్షత్రములు దక్షుని యొక్క కుమారికలనుగా దెలిసికొనవలెను. (91) స్వర్భానుపు (రాహువు) సింహిక యొక్క సుతుఁడు. అతఁడు భూత సంతాపకారుఁడయిన అసురుఁడు. (92) ఈ విధముగా సోముని యందు నక్షత్రముల యందు గ్రహములందు సూర్యుని యందు నభిమానులైన పారెల్లరు చెప్పఁబడిరి. (92) ఇవియన్నియు స్థానములు; ఆ స్థానములందుండు వారెల్లరు దేవతలు. సహస్రాంశుం డయిన వివస్వంతుని (సూర్యునీ) స్థానము. అగ్నిమయము. శుక్లము. (93) సహస్రాంశుఁడయిన త్విషి యొక్క స్థానము శుక్లము, మరియు నీటితో కూడినది. మనోజ్ఞుఁడయిన పంచకీరణుని యొక్క స్థానము శ్యామవర్ణము మరియు జలమయము. (94) శుక్రుని స్థానము 16 కిరణముల యందు పద్మము. ఇదికూడ నీటితో గూడినది; శుక్లము ప్రకాశవంతము; కుజుని రక్తవర్ణ స్థానము జలమయము. (95)
బృహస్పతియొక్క బృహత్థానము హరిద్వర్ణము. జలమయము. దానికి పండ్రెండు కిరణములు. మందుఁడైన శని స్థానము కృష్ణవర్ణము. జలమయము; దానికి ఎనిమిదీ కిరణములు. స్వర్భానుఁడయిన రాహువుయొక్క స్థానము. తమోమయము, అయ్యదీ ప్రాణులకు తాపమును గలిగించు స్థానము. తారకలన్నియును జలమయములు; వానికి ఒక్కోక్క దానీకొక్క రశ్మియే కలదు అని తెలియవలయును. (97) పుణ్య కీర్తిశాలుర కవి ఆశ్రయస్థానములు; రంగులో అవియన్నియును సుశుక్లములు. అవి ఘనీభూతతోయాత్మకములనీ యెఱుంగవలయును. అయ్యవి కల్పము యొక్క ఆదియందే నీర్మీతములు. (98) ఆదిత్యుని ప్రకాశ సంయోగము వలననవి కాంతిమయములని తెలియవలయును. సూర్యుని యొక్క విష్కంభము (వ్యాసము) తొమ్మిదివేలయోజనములు. దాని విస్తారము విష్కంభమునకు మూఁడు రెట్లు. చంద్రుని యొక్క విస్తారము (గోళము) సూర్యుని యొక్క వైశాల్యమునకు ద్విగుణమని (రెండింతలు) జ్ఞాపక ముంచుకొనఁబడినది. (100) స్వర్భానువు (రాహువు) సూర్యచంద్రుల వైశాల్యమునకు తుల్యుఁడు. రాహువు వారిద్దరికి క్రిందుగా ప్రయాణించును. (తిరుగును). భూమీయొక్క ఛాయను (ఉద్దృత్య) గ్రహించి ఆతఁడు మండలాకృతిలో నిర్మింపఁబడెను. స్వరానుని మూడవ బృహత్థానము తమోమయము, అయ్యది పర్వముల యందు సూర్యుని నుండి నిష్క్రమించీ (పైకి వచ్చి) చంద్రాభిముఖముగ బోవును. (102) సూర్య సంబంధమైన పర్వములయందు చంద్రుని నుండి ఆ స్వర్భానుఁడు సూర్యునికడకు తిరిగి వచ్చును. స్వర్ణకాంతిచే ప్రేరేపించును గాన స్వర్భానువనబడెను. (103) భార్గవుని (శుక్రునికి) మండలముయొక్క వ్యాసము, విస్తీర్ణము చంద్రునిలో పదియారవ వంతుగా విధింపఁబడినది. బృహస్పతి శుక్రునీకంటే నాలుగవ భాగము తక్కువ (పరిణామమున), కుజుఁడు శనైశ్చరు? డును బుధుని యొక్క విస్తీర్ణములో (3/4) మూడువంతులు, తారలు నక్షత్ర రూపములు ఆకారముగలవి. విస్తారమునను మండలమునకు బుధునితో సములు.
నిజమును దెలిపినవాడు నక్షత్రములు సాధారణముగా చంద్రునితో సంయోగము చెందియుండునని తెలిసికొన వలయును. తారా నక్షత్ర రూపములు ఐదువందల యోజనములు, 400ల యోజనములు, 300 యోజనములు 200 యోజనములు (దూరస్థితిత్వముచే) పరస్పరము తగ్గియుండును. (108) నక్షత్రముల మండలములు పూర్వాపర నికృష్టములు (హీనములు). ఒకటిన్నర యోజనములు నక్షత్రముల కంటే చిన్నదియైన నక్షత్రము లేదు. అన్నింటికన్నను ఉపరితలమున నుండి తమ మండలము దూరముగా నుండీ సంచరించు గ్రహములు మూఁడు. అవి బృహస్పతి, శని, కుజుఁడు, వానికి క్రిందుగా నాలుగు మహాగ్రహములు. అవి శీఘ్ర గమనము కలవి. అవి సూర్యుడు, చంద్రుఁడు, బుధుఁడు, భార్గవుఁడును. (111) అంతట నక్షత్రములు ఎన్ని కోట్లున్నవో అన్నీ కోట్ల తారకలు నున్నవి. ఈ నక్షత్ర రాశుల సంచారము నీయము పూర్వకముగా బ్రహ్మచే నీబద్ధము. వ్యవస్థితము. (112) వీనిలో సూర్యుని యొక్క గతి అయనక్రమమున ననుసరించి నీచోచ్చముల నందును. సూర్యుండుత్తరాయణమున నుండగా చంద్రుఁడు పర్వదినములలో తన కిరణములతో తొందరగా చరించుచున్నట్లగుపించును. దీనికి కారణమతం డు చాల ఎత్తున నుండుట! సూర్యుడు దక్షిణాయనమున నుండగా, అయ్యదీ నీచ (తక్కువ యెత్తుగల) మార్గము నాశ్రయించును. అయ్యదే ఎప్పుడును భూమి యొక్క లేఖచే ఆవృతము. ఇయ్యది అమావాస్యనాడు, పున్నమినాడును. అయ్యది నియమిత కాలములలో నగుపించదు. కాని అది అల్పకాలములో త్వరగా అస్తమించును. (115) అందుచే, అమావాస్యనాడు, ఉత్తరాభిముఖుఁడై స్థితి నొందియున్న చంద్రుఁడు దక్షిణా పథమున కన్పించును. ఇయ్యదియు ఎల్లవేళల నీసుమబద్దముగా గనింపదు. (116).
జ్యోతిర్మండలముల గతియోగముచే, సూర్యుడు, చంద్రుఁడు విషువద్దినములలో సమాసకాలములలో ఉదయింతురు. అస్తమింతురు. ఉత్తరాయణ పథములలో ఉదయాస్తమానముల కాలములు వేరువేరుగా నుండును. పూర్ణిమనాఁడు అమావాస్యనాడు, ఆ సూర్యచంద్రులు జ్యోతిశ్చక్రమును ననుసరించి పోవుదురని గ్రహింపవలెను. (118) సూర్యుఁడు దక్షిణాయన మార్గస్థుఁడై సంచరించునప్పుడు, గ్రహములకు క్రిందుగా (అధస్తాత్) సంచరించును. తనయొక్క మండలమును విస్తీర్ణముగా నొనర్చి చంద్రుఁడు సూర్యునియొక్కయూర్థ్వమున భ్రమణ మొనర్చును. నక్షత్ర మండలములన్నియును (యావన్నక్షత్రములు) చంద్రునకూర్ధ్వ భాగమున సంచరించును. (120) బుధుఁడు నక్షత్రముల మండలముల కంటే ఊర్ధ్వమున భ్రమణము సల్పును. భార్గవుఁడు బుధునికంటె ఊర్ధ్వమున చరించును. బుధుని కంటే ఊర్ధ్వమున కుజుఁడు తిరుగును; బృహస్పతి కుజునికంటే ఊర్ధ్వమున తిరుగును. ఆ బృహస్పతి గ్రహమున కంటే ఊర్ధ్వమున శనైశ్చరుఁడు, తిరుగును; ఆ శనికి పైకి సప్తర్షి మండలమున్నది. ఆ సప్తర్షి మండలమునకు పైని ధ్రువుడున్నాడు. (123) నక్షత్రములకు గ్రహములకు ఆంతర దూరము ఊర్ధ్వమున (ఉపరిషాత్) రెండు వందల సహస్ర యోజనములు. (123) గ్రహములు, చంద్రుఁడు, సూర్యుఁడు, ఆకాశమున దివ్య తేజస్సుతో తిరుగును. పోని యొక్క నియమిత క్రమములో, నవి నిత్యము క్రమముగా నక్షత్ర రాశితో కలిసికొని పోవుచుండును. (124) ములు, నక్షత్రములు, సూర్యుండు ఉచ్చగా, నీచముగా గాని, ఋజువుగాగాని వాని వాని పరస్పర సమాగమములోగాని, విడిగా నున్నప్పుడు కానీ (భేదేన) సంచరించుచు వచ్చును. అయినను అవి యన్నియు నొకే పర్యాయము సమముగా (యుగపత్) ప్రజలను చూచును. (125) ఇవి యొకదానికొకటి పరస్పరము ఎదురెదురుగా నున్నవి. ఒకదానితో నొకటి పరస్పర సమాయోగము చెందును. వాని పరస్పర సంయోగము ఎట్టి సాంకర్యమును (తికమకలను) గల్పింపదని బుధు లేంగవలయును. (126)
ఇదియే (ఇట్టిదే) భూమియొక్క జ్యోతిర్మండలము యొక్క ద్వీపముల యొక్క సముద్రముల యొక్క పర్వతములయొక్క పర్షముల యొక్క (ఉపద్వీపములయొక్క నదులయొక్క వాని యందుండువాని యొక్క నీయమిత సన్నివేశము. వీనియందే గ్రహములు, సర్వ నక్షత్రముల యందుండి సముత్తితములు. (128) చాక్షుషమన్వంతరమునందు, అదితి పుత్రుఁడయి వివస్వంతుఁడునగు సూర్యుఁడు గ్రహములలో ప్రప్రథమ గ్రహమైనవాం డు విశాఖా నక్షత్ర గణమండలము నుండి సముత్పన్నుఁడైనాఁడు. (129) ధర్మపుత్రుఁడయిన త్విషిమంతుఁడు, చంద్ర దేవుఁడు, వసుపుత్రుం డు, శీతరశ్మియయిన నీశాకరుఁడు కృత్తికయందు సముత్పన్నుఁడు. షోడశార్చిష్మంతుఁడు, భృగుపుత్రుఁడు నక్షత్ర గ్రహములయందు ప్రశస్తుం డు నయిన శుక్రుఁడు సూర్యునియనంతరము పుష్యమి (తిష్య) నక్షత్రమున జనించెను. ఆంగిరస పుత్రుఁడు, ద్వాదశార్చి ష్మంతుఁడు, జగద్గురువు నయిన బృహస్పతి గ్రహము, ఫల్గునీ నక్షత్ర కూటమున సముత్పన్నుఁడు. శ్రుతి యందు చెప్పబడినవాఁడు, నవార్చిష్మంతుఁడు, ఎఱ్ఱనీ (లోహిత) ఆంగము కలవాఁడు, ప్రజాపతీసుతుఁడునయిన కుజుఁడు పూర్వాషాఢా నక్షత్రరాశి యందు సముత్పన్నుఁడు. (183) సూర్య పుత్రుఁ డయిన శనైశ్చరుఁడు రేవతీ నక్షత్ర రాశియందుద్భవించెను. శారి ఆతనికి సప్త తేజఃకలితరశ్ములు కలవు. చంద్రసుతుఁడు, పంచార్చిష్మంతుఁడు నయిన బుధుఁడు ధనిష్టా నక్షత్ర రాశి యందుదీతుఁడు, (134) తమోమయుఁడు, మృత్యుసుతుఁడు, ప్రజాక్షయము నాపాదించువాఁడు, సర్వమును నాశనము చేయు మహాగ్రహము నయిన కేతువు ఆశ్లేషా నక్షత్ర రాశియందు పుట్టెను. స్వనామధేయ ప్రతిపాదితము లయిన నక్షత్రములయందు దక్షుని (27గురు) కూతుండ్రు పుట్టిరి. సహజముగా నల్లనీ మండలము కలవాఁడు, తమో వీర్యమయుఁడు.
సూర్య, చంద్రగ్రహ మర్ధనుఁడు అయిన రాహువు భరణీ నక్షత్ర రాశియందు సముత్పన్నుఁడు. భార్గవ గ్రహాదీగా నక్షత్రములు గ్రహములు అందరు తెలియబడవలయును. ఏలయన, జన్మనక్షత్రపీడలు కలిగినప్పుడు అవి వైగుణ్యమును (దుష్టత్వమును) పొందును కనుక, వారా దోషముచే బాధపడియెదరు. దానీకి గ్రహముల యందు భక్తి కలిగి యుండవలెను. (138) సర్వ గ్రహములకు ఆది ఆదిత్యుఁడు. తారా గ్రహములలో శుక్రుఁడు మొదటివాఁడు; కేతువు ధూపవంతులలో (తోకచుక్కలలో) మొదటివాఁడు. (139) నాలుగు దీక్కుల యందు విభక్తులైయున్న గ్రహములకు ధ్రువుఁడు కీలస్థానుడు. నక్షత్రములలో శ్రవిషాన క్షత్రము (ధనిష్ట మొదటిది; అయనములలో ఉత్తరాయణము మొదటిది. (140) పంచవరములలో మొదటిది సంవత్సరము, శిశిర ఋతువు ఋతువులలో మొదటిది; మాసములలో మాఘము మొదటిది. పక్షములలో శుక్లపక్షము, తిథులలో ప్రతిపత్తు (పాడ్యమి) రాత్రింబవళ్ల విభాగములలో పగలు మొదటిదిగా కీర్తింపఁబడినవి. (142) ఓ కాల విదులందు శ్రేష్ఠులారా! ముహూర్తములలో మొదటిది రుద్రుండు దైవతముగా గలిగినది. కాలవిభాగములో నిమేషము మొదటిది. ధనిష్ఠ మొదలుకొని శ్రవణము చివరి వరకు 5 సంవత్సరములొక ‘యుగము’. సూర్యుని యొక్క గతీ విశేషమున ఈ యుగ పంచవర్షములు)ము చక్రమువలె తిరుగును. కాలవీదులయిన వారిచే (పై కారణమున) దీవాకరుఁడు ‘కాలము’గా స్మరింపఁబడుచున్నాఁడు, చతుర్విధములయిన భూతములయొక్క కార్యప్రవర్తకుఁడు, కార్యనివర్తకుఁడు సూర్యుఁడే. అందుచే భగవానుడయిన రుద్రుఁడు సాక్షాత్తుగా కాలప్రవర్తకుఁడు, ఇదియే అర్థము నిశ్చయమును బట్టి జ్యోతిర్మండల గ్రహముల యొక్క సన్నివేశము.
ఇదీ లోకము యొక్క వ్యవహారార్థము భగవంతునిచే వినిర్మితము. ఉత్తరాశ్రవణముతో ధ్రువుని యందిది సంక్షిప్తమయినది (?) (147) వీని యందంతటను విస్తీర్ణముగా వృత్తాకారమువలె స్థితమై యున్నది. భగవంతునిచేనిది బుద్ధి పూర్వకముగా కల్పాదియందు సంప్రవర్తీతము. ఆతఁడే ఆశ్రయము. ఆతఁడే అభిమాని. ఆతఁడే జ్యోతిర్గణములకు ఆత్మ ఆతఁడే అద్భుతమయిన విశ్వరూపుఁడయిన 'ప్రధానుని యొక్క పరిణామము. యాథాతథ్యముగా (ఉన్నదున్నట్లుగా) జ్యోతిర్గణముల రాకపోకలు చూచుటకు చర్మ చక్షువులుగల మనుష్యులెవ్వరికి శక్యము కాదు. శ్రుతిచేతను, అనుమాన ప్రమాణముచేతను, ప్రత్యక్షమువలనను, హేతువు చేతను, నిపుణముగా పరీక్షించి, బుద్ధిచే పాండిత్య పురస్సరముగా విశ్వసింపదగినది. ఓ బ్రాహ్మణులారా ! నేత్రము, శాస్త్రము, నీరు, చిత్రణము, గణితము. ఈ యైదు సాధనములచేతనే (ఈ జ్యోతిశ్శాస్త్రము గ్రహింపఁబడినది) జ్యోతిర్గణ వివేచనము జరుగును.
ఇది పోయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందు, పూర్వభాగమున, ద్వీతీయానుషంగపాదమునందు జ్యోతిర్గణసన్నివేశము ఇరువది నాలుగవ అధ్యాయము.
Summary of chapter 24 of the Brahmānda Mahā Purana is as follows:
Reaffirming the sun's supreme position in the cosmic hierarchy, this section lovingly details how the solar deity nourishes and imparts radiant light to all other heavenly bodies. It serves as a beautiful spiritual metaphor, illustrating that just as the sun illuminates the planets, the supreme lord's boundless grace illuminates all individual souls. The devout reader is encouraged to remain open to this divine light, allowing it to kindle the inner spark of pure wisdom and eternal love.