21 - ఔర్వ పరశురాముల సంవాదము

వసిష్ఠుఁడు చెప్పెను.

ఈ విధముగా మహాత్ముఁడు మహాతేజస్వీ యయిన జమదగ్ని ప్రవర్తించుచుండ, ఓ రాజా ! బహు సంవత్సరములు గడచెను. ఓ నృపశార్దూల ! రాముఁడు సర్వధర్మ భృతులలో శ్రేష్ఠుఁడు. వేద వేదాంగ తత్త్వజ్ఞుఁడు; సర్వశాస్త్ర విశారదుఁడు. మహామతి యయిన రాముడు వినీతాత్ముఁడయి పీతరులకు సేవ చేసెను. తన ప్రవర్తనచే ప్రీతీని కలిగించుచు వర్తించేను. కొన్ని సంవత్సరములిట్లు పితృ శుశ్రూషచే రాముఁడు మతిమంతులలో శ్రేష్ఠుఁడయిన వాఁడు కాలము గడిపెను. ఇట్లుండగా, ఒకప్పుడు మహాతేజస్వి రాముఁడు, దైవముచే నియోజితుఁడయి పితామహ గృహమునకు పోవ దలంచెను. భృగు పుంగవుఁడయిన రాముఁడు శిరస్సు తండ్రి యొక్క పాదములపై నుంచి నమస్కరించి, బద్దాంజలియై వినయ పూర్వముగా ఇట్లు పలికెను. ఓ తండ్రీ ! నీకు, తల్లికిని, ఇప్పుడొక విషయము విజ్ఞాపించుకొన కోరుచున్నాను. మీరు దయతో వినంగోరెదను. తాతగారిని (పితామహుని) చూడవలయునని ఉత్కంఠతమనస్కుడనై యుంటినీ. అందుచే మీ అంగీకరాముచే తాతకడకు వెళ్లేదను. ఆత్రముగా నభిలాషతో పలుమార్లు తాత రమ్మని పిలిచేను. ప్రీత మనసయైన పితామహి కూడ పిలిచెను. నన్నుగని బహు ముఖము లందగోరినది. నిజముగా' తండ్రినీ పితామహనీ చూచుట మిక్కిలి ప్రియవు కదా. అందుచే నేను వారల కడకుఁ బోవుటకు మీరుభయులు అనుచురింపఁగోరెదను.

వసిష్ఠుఁడిట్లు పలికెను.

అత్యంత సంభ్రాంతముగా (ఉత్సుకతతో) చేప్పఁబడిన ఆతని పలుకులు విని తల్లిదండ్రులు ఆనందాశ్రువులచే నిండిన నేత్రములు గల పొరయిరి. ఆ పూజ్యుడయిన రాముని ఆలింగనము చేసికొని మూర్ధమును సాదరముగా మూస్కొని ఆశీస్సులిడి, ఆభినందించి వారిరువురు నీట్లు పలికిరి. (12)

నాయనా పీతామహా గృహమునకు సుఖముగా వెళ్లిరమ్ము, పితామహునీ యొక్కయు పితామహి యొక్కయు ప్రీతి కోలకు దర్శనము కొలికును, అక్కడకు వెళ్లుము. సంప్రదాయమును న్యాయముననుసరించీ శుశ్రూషాపరాయణుఁడవై కొంతకాలము వారి గృహమున వారి యానందము కొఱకుండుము. ఎక్కువ కాలమందుండక, మరల పోరియొక్క ఆంగీకారముతో ఇచ్చటకు నన్ను చూడవలయునను కోరికతో సుఖముగా రమ్ము, పుత్త్ర దర్శనము లేకుండగ నిన్ను చూడక అర క్షణమయినను యుండలేను. అందుచే తాతగారింట ఎక్కువ కాలముండవలదు. (16) తాతయొక్క ఆజ్ఞానుసారము ప్రపితామహుని సన్నిధికి వెళ్లినను, నాయనా, త్వరగా ప్రపితామహుని అంగీకరాముతో శీఘ్రముగా తీరిగి రమ్ము. (17)

వసిష్ఠుఁడిట్లు చేప్పెను.

వారీ విధముగా పలుక, మహామతియైన రాముడు వారికి ప్రదక్షిణము చేసి నమస్కరించి, పితరులచే అనుజ్ఞాపింపబడి పితామహ గృహమున కరిగేను. (18) రోముఁడు దియలుదేరి భృగువంశ శ్రేష్ఠుఁడు మహాత్ముఁడు నైన ఋచీకుని ఆశ్రమమును ప్రవేశించేను.. ఆ యాశ్రమము ముని శిష్యోపశోభితము, వేదాధ్యయన ఫషల యొక్క విపులత్వముచే సర్వత్ర ప్రతిధ్వనులీనుచుండెను. సహజ వైరము వీడి ప్రశాంతముగా వర్తించు జంతువులచే కూడియున్నది. సమస్త జంతువులచే మనోహరముగా నున్నది. గమ్యమయిన ఆశ్రమమును రాముఁడు ప్రవేశించి, ఎదురుగా మున్ముందు రాముఁడు ఆసనమున కూర్చుండియున్న పితామహుని చూచేను. ఋచీకుడు, దిష్టస్థుఁడు (మహాగ్ని గుండమున నున్న) అగ్నిహోత్రునీవలె, తన తపస్సుచే జ్వాజ్వల్యమానముగా ప్రకాశించుచుండెను. దక్షిణ చేతను కూడియున్న మహాయజ్ఞము వలే సత్యవతిచే (పితామహీచే) ఉపాసింపఁబడుచుండెను. (22) ఆ యిద్దరు తమ్ము సమీపించుచున్న రాముని పోరు చాలసేపు వీమర్శతో ఇంతకు పూర్వమెన్నడును చూడబడనీ వానివలె పదేపదే పరిశీలించిరి. “ఎవ్వఁడీ తపోరాశి ? సర్వరిక్షణ పూజితుఁడు. లుండయినను గోంభీర్యముచే, వినయాదీ లక్షణములచే బలవంతుఁడుగా ప్రకాశించుచున్నోఁడు”, అనీ ఫోరనుకొనుచుండగా ఆనందముతో, కౌతుకముతో రోముఁడు మెల్లగా వారి సమీపమునకు వినాయాన్వితుఁడై యరిగి, మతిమంతుఁడయిన యతఁడు స్వనామగోత్ర ప్రవరను) చెప్పి, సంతోషాత్ముఁడయ పితామహుల పాదములను శిరస్సుచే హస్తద్వయముచే స్పృశించి అభివాడి మేనర్చెను,

అంత వారిద్దరు ప్రేతమనస్కులైరి. ఈముని లేవనెత్తీరి. ఆతనినీ ఆశీస్సులచే అశీనందనములచే ముహుర్ముహుః ముంచెత్తిరీ, వివిధరీతుల నాతనీని వారభినండిరచిరీ. హోరాత్రువులచే నీండిన నేత్రములతో ఓ రోజో ! ఆతఁడు తన్నడిగిన పొనీకెల్ల రాముడు ప్రతి సమాధాన మొసంగెను. తరుషోత తన యెక్క తన సోదరుల యొక్క తల్లితదండ్రుల యొక్క కార్యకలాపవతిల గూర్చి చెప్పెను. వారిరువురకు ప్రీతి గలిగించు గుణములతో తాతగారీ నివేశమున రాముడు వసించేను. (32) ఆయాశ్రమమున సర్వభూత నయనానందనుఁడై రాముఁడు శుశ్రూషణ పరారుణుండై కొన్ని మాసములు వసించెను. తరువాత భృగువంశ శ్రేష్ఠుఁడయిన రాముఁడు, పీతామహుల అంగీకారముతో తాతగారి తండ్రి నివాసమగు నాశ్రమమునకు సోవతలంచెను. (34} ప్రీతి యుక్తులున లోతపోదుల ఆశీస్సులచే నళినండితఁడరు వారు నిర్దేశించిన విధముగా తాతతండ్రియైన ఔర్వరి ఆశ్రమమునకు రాముఁ డరిగేను. చ్యవనమహరీకి (?) విధిపూర్వకముగా నమస్కరీంచి మహాగుణ సంపన్నుఁడయిన రాముఁడు ఆతనిచే అనుష్టాతుఁడయి భృగువుయెక్క ఆశ్రమమునకు వర్ష పూర్ణుఁడై యరిగెను. భృగు మహర్షుల ఆశ్రమ మండలము ప్రవేశించెను. ఆయాశ్రమము శాంత మనస్కులయిన మునికులతో సర్వత్ర నిండియుండేనం. మనోహరము, శీతలము, సర్వర్లు గుణాన్వితము, నలరున ఛాయలతో నిండి, ఫలపుష్పసమన్వితములు నయిన వృక్షములచే సంవృతమయినది, నానావిధములయిన పక్షకులముల రవములచే మనస్సుకు, చెవులకు సుఖమును గలిగించునది సర్వత్ర వివిధములయిన వేదఘోషలచే ప్రతీర్వనీంచుచున్నది. మంత్రములయిన ఆహుతుల వలనఁగలిగిన సర్వత్ర వ్యాపించిన ధూమగంధముచే సమస్త వేప సమూహమును చెదరగొట్టు చుండెను.

సమిధలను కుశలను తీసికొనివచ్చు ముని కుమారకులు మేఖలతో అజినములతో నలంకృతులయిరి. వారిచే ఆశ్రమము సర్వత్ర శోభిల్లుచుండెను. పుష్పములతో జలసంపూర్ణ పాత్ర హస్తములతో ఇటునటు సంచరించుముని కన్యలచే ఆశ్రమము శోభించుచున్నది. ఆశ్రమ పర్ణశాలా సమీపమందలి తరుచ్ఛాయలందు, పిల్లలతో కూడిన హరిణములు విశ్వాస పూర్వకముగా శంకా రహితముగా పరుండియున్నవి. ఆడ నెమళ్లు మగ నెమళ్లు మధుర షడ్జమ నాదములతో నృత్యము చేయుచుండెను. ఋష్య మృగములు (ఒకజాతి లేళ్లు) గుంపులు గుంపులుగా, తిన్న ఆహారమును నెమరు వేయుచు ఆమర నృత్యములకు సాక్షులుగా నిలబడి యుండెను. ఆ మయూరములు ఆ లేళ్ల కమితమయిన ఆనందమును గలిగించుచుండెను. ఆ యాశ్రమములో నీవారధాన్యములు చల్లబడినవి. నీవార ధాన్యముల ప్రోగులు ఎండలో వృక్షచ్ఛాయలో ఎండ వేయం బడినవి. ఆధాన్యము ప్రక్కనే సంచరించుచు లేడికూనలు సయితము వానిని ముట్టకుండెను. ఆశ్రమములో హోమములు సకాలమున జరుగుచుండెను. గౌరవనీయులయిన యతిధులు ఆహ్వానింపఁబడుచుండిరి. వేదాధ్యయనము అభ్యసింపబడుచున్నది. అంతీయేగాక ఆగమోదీత ధర్మ విషయాదికమెల్ల వినుర్శింపఁబడుచుండెను. స్మార్తము వల్లె వేయబడుచున్నది. శ్రాతార్థము విచారింపఁబడుచున్నది. దేవతల యొక్క పితృదేవతల పూజాదికము లారంభమైనవి. ఆ తపోవనము సర్వభూతమనోహరముగా నుండెను. అందేందుచూచిన తపస్విజనులుండిరి. కాపురుషులు లేరు. ఆశ్రమము తపోవృద్ధీకరము. పుణ్యప్రదము, సర్వసత్త్వ సుఖాస్పదము. రెండవ బ్రహ్మలోకము వలె తపోధనుల కెల్లరకు నానందకరమయినది. పుషసౌరభ భ్రామ్య మధుపముల యొక్క నాదముచే ప్రతిధ్వనించుచున్నది. వీచునట్టి పలు విధములయిన వాయువులతో సర్వత్ర మనోజ్ఞము. ఇట్టి వివిధ గుణములతో కూడియున్న ఉత్తమమయిన ఆశ్రమమును రాముఁడు చూచెను. వినయగుణ పూరితాత్ముఁడై యా యాశ్రమమును దేవతలు సుకృతులు ప్రవేశించు అమరాలయము వంటి దానిని రాముఁడు ప్రవేశించెను. ఆశ్రమమును ప్రవేశించి స్వప్రపితామహుని దర్శించేను. ఆ మహర్షి చుట్టును ముని శిష్య శతము కూర్చుండియుండెను. వ్యాఖ్యాన వేదిక యొక్క మధ్య కుశాసనమున మహర్షి ఉపవిష్ణుఁడై యుండెను. ఆ మహర్షి తెల్లనీ మీసములు, గడ్డము, జటలు, కూర్చము. బ్రహ్మసూత్రము మొదలగు వానిచే ప్రకాశించుచుండెను. అతఁడు పద్మాసనస్థుఁడై యుండెను. ఆతని శరీరము యోగపట్టముచే సంవీతము. వ్యాఖ్యా ముద్రతో విలసిల్లు ఆతని దక్షిణ పాణితలంబుజము వెలుగుచుండెను.

యోగ పట్టముపై ప్రకాశించు ఆతనీ వామ హస్తముంచబడి యుండెను. ఆరణ్యవాక్యముల యొక్క సూక్ష్మమయిన అర్ధము యొక్క తత్వము వివరించి ముని ముఖ్యులకు ఆ తపోనిధి వినిపించుచుండెను. మహాత్ముఁడైన తండ్రి యొక్క తాతగారిని చూచి రాముఁడు మెల్లగా ఆతని సమీపమున కరిగెను. మునీశ్వరుని చేరు రాముని చూచి దూరమున నుండియే ఆతని ప్రభావప్రధర్షితులై మునులందరు శంకను పొందిరి. ఆ భృగు మహర్షి రాముని ఆగమమున సంతోషించెను. ఇతరములయిన కథాలాపములను కట్టి పెట్టి ఆతనినీ చూచుచునే యుండిపోయెను. రాముఁడాతనిని సమీపించెను. వినయము చేతను వంచిన ఆసనముతో సంప్రదాయ న్యాయము ననుసరించి, ఉపేంద్రుఁడు బ్రహ్మకు వలె నమస్కరించెను. భృగుపతియయిన ఖ్యాతికి యధాన్యాయము రాముఁడు నమస్కరించి వినయాన్వితుఁడై మునులకు వారి వారి వయఃక్రమము ననుసరించి నమస్కరించెను. వారందరిచే రాముఁడు సంతోషముగా ఆశీస్సులచే అభినందింపఁబడెను. (61) వారియొక్క యనుజ్ఞను బడసి మేధావియైన రాముఁడు నేలపై కూర్చుండెను. రాముఁడు నేలపై కూర్చున్న పిమ్మట, అచ్చటి వారందరిచే, ఆశీస్సులచే నభినందింపఁబడిన తరువాత, భృగువు ఆతనిని చూచి కుశల ప్రశ్నలడిగెను. వత్స ! నీవు కుశలమే కదా ! నీ పితరుల ఆరోగ్యవంతులే కదా ! నీ సోదరులకు, నీ తండ్రి తండ్రికి క్షేమమే కదా? ఇప్పుడు ఇక్కడకు నా వద్దకు ఏ పనిని పురస్కర్టించుకొని వచ్చితివి? ఎవ్వరిచే నయినను ఆదేశింపఁబడి వచ్చితివా? లేక నీవే స్వయముగా కోరి వచ్చితివా? అని అడుగబడి, యాతనికి న్యాయము నతిక్రమించక సర్వమును పూర్తిగా వివరించెను. అడిగిన దేల్లయు వివరించెను. తల్లి యొక్క తండ్రి యొక్క మహాత్ములయిన సోదరుల యొక్క తండ్రిగారి తండ్రి యొక్క కుశలము దర్శనమును గూర్చి చెప్పెను. భృగువును ప్రేమ గౌరవ పురస్పరముగా ఇతరములయిన సకల విషయములను గూర్చీ రాముఁడు విన్నవించెను. ఆతఁడేమి వాంఛించెనో కూడ రాముఁడు చెప్పెను. భృగువు రామునిచే సముదీరితమైన డెల్ల వీనెను. (68)

రాముని పలుకులు వీనీ, ఆతని ప్రేమతో వీక్షించి, భృగువు ప్రీతిమంతుఁడై యాతనిని విశేషముగా నభినందించేను, ఈ విధముగా ఉత్కృష్టములయిన కార్య కలాపములచే తాతగారికి ప్రీయ మాచరించుచు, కొన్ని దినములు రాముఁడు ఆశ్రమము నందుండెను. ఒకనాఁడు ఏకాంతముగా మునీ వోత్తముఁడు “నాయనా ! ఇటు రమ్ము" అనీ రాముని ఏకాంత ప్రదేశమునకు పిలిచెను. వచ్చి, ఆసీనుడైయున్న మునికి కృతాంజలియై నమస్కరించి ఆతని ముందు రాముఁడు నిలబడి యుండెను. భృగువు, సంతుష్టమయిన యంతరాత్మచే ఆశీస్సులచే నతనిని అభినందించి శంకారాహితుఁడై యున్న రాముని సాదరముగా నాలోకించి, వత్స ! ఇప్పుడు నిన్ను గూర్చి నేనేమి వచింప నుంటినో వినుము. ఇది సర్వలోకము యొక్క క్షేమము కోకు, నీ క్షేమమునకు, మా క్షేమమునకును. నాయనా ! నా ఆదేశమును గ్రహించి, మహాగీరియైన హిమవంతమున కరుగుము, (74) ఇప్పుడే ఈ ఆశ్రమము నుండి తపస్సాచరింప ధృతమనస్కుండపై హిమాలయమున కరుగుము. పూజ్యుఁడో అందొక శుభమైన ఆశ్రము పదమును నిర్మించుకోనుము. తపస్సు చేతను, నియమము చేతను మహాదేవుని ఆరాధించుము. అనన్య,తుల్యమయిన తపస్సుచే అచిరకాలములో మహాదేవునకు ప్రీతిని పుట్టించుము. నీవు గొప్ప శ్రేయస్సును పొందెదవు. ఇంక నీవు ఆలోచింపవలసిన పనిలేదు. నీ యొక్క భక్తికి శంకరుఁడు వెంటనే ప్రీతుఁడగును. ఆ మహాదేవుఁడు మనసా నీ వేది కోరుదువో నీ కోటకు దానిని చేయగలఁడు, భక్తవత్సలుడు, జగన్నాథుఁడు, అయిన ఆ శంకరుఁడు సంతోషింపగా, పుత్త యథేప్సితమయిన అస్త్ర సముదాయమును సర్వస్వమును నీవు వరమడుగుము. దేవతల యొక్క హితము కొఱకు, నీవు చేయవలసిన, దుష్కర మయిన కరణీయము, అనేకములయిన శస్త్రముల చేతనే సాధ్యమునగు నభ్యధికమయిన కర్మ కలదు. అందుచే నీవు దేవ దేవేశుఁడయిన శంకరుని సమారాధనము చేయుము ! అత్యుత్కృష్టమయిన భక్తితో గూడుకొని నీవు నీ యభీష్టమును పొందగలవు.

ఇది వాయు ప్రోక్తమునయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున ఇరువది యొకటవ అధ్యాయము.