బ్రహ్మాండ మహా పురాణము
53 - సగరచరిత్రము - సాగరుల వినాశనము
జైమిని యిట్లనియెను.
వారచటికీ చేరగా ఇంద్రునిచే ప్రచోదితుఁడయిన వాయుదేవుఁడు తత్క్షణముననే పాతాళలోకమునకు ఆయాగాశ్వమును అపహరించుకొని పోయెను. రాజపుత్రులందరికీని కనపడకుండగనే, వాయుదేవుఁడా యశ్వమును అపహరించీ మహామునియైన కపిలుని యొక్క సమీపమునకు తీసికొనివచ్చెను. అంతట అశ్వము కనబడనందున నృపాత్మజులందరు కలవర మొందిరి. ఆ గుఱ్ఱమును వెదకుచు వారు ప్రపంచము నంతటిని చుట్టుముట్టిరి. వారు పర్వతములు నగరులు అరణ్యములు గల భూమినంతటిని వెదకి వెదకి యజ్ఞపశువయిన గుఱ్ఱమును కనక అత్యంత దుః ఖమొందిరి. అంత వారు ఋషులచే పరివృతమయిన యయోధ్యను చేరిరి. తండ్రిని దర్శించిరి. నమస్కరించరీ. సర్వము. నేతనికి నివేదించిరి. “ప్రపంచమంతయును తిరిగిన పిమ్మట మేము సముద్రమును (వరుణాలయమును) ప్రవేశించితిమీ. మేము ఆ యశ్వమును కన్నాకుగా రక్షించుకొని వచ్చుచున్నను, ఎవ్వండో దానిని దొంగిలించు కొని పోయెను”. ఇట్లు వారు చెప్పగా నృపోత్తముఁడు క్రోధాకులుఁడై) అధర్మ పారాయణులారా! ఇచ్చటి నుండీ వెడలిపొండు. తిరిగి మీరు రావద్దు. మీరు జీవించి యుండగా నా గుఱ్ఱము ఓ దురాత్ములారా ! ఎట్లు వినష్టము కాగలదు? తురగము లేకుండ మీరిచ్చటకు వచ్చుటలేదు. ఇదీ సత్యము”, అనెను. అంత వారందరు కూడికానీ, ఆ ప్రదేశము నుండి బయల్వెడలిరి. వారు పరస్పరము “ఇప్పుడు కూడ గుట్టము మనకు కనంబడకపోయినచో మనమేమి చేయుదుము” సశైల కానన యుతముగా నీ వసుంధర నెల్ల గాలించితీమీ. గుఱ్ఱము కానరాలేదు సరి! దాని సంబంధమయిన వార్త కూడ తెలియలేదు.అందుచే సముద్రముతో సొరంభించి, పాతాళము వరకు త్రవ్వి భూమిని విభజించెదము. మనమో పాతాళలోకమున ప్రవేశింతుము. గుఱ్ఱము కొఱకై వెదకుదుము”. అని యీ వీధముగా నిశ్చయించుకొని, క్రూరనిశ్చయులయిన సగరసుతులు సముద్రముయొక్క తటముతో ఆరంభించి సర్వత్రభూమిని త్రవ్వి పోసిరి,వారు త్రవ్వుచుండగా వసుధ అధికముగా విహ్వలయై ఉద్విగ్నమయ్యెను. సాగరుల క్రూర చేష్టితమును దిలకించి సర్వభూతములు దుః ఖమున రోదించెను. అంతవారు భారతఖండమును త్రవ్వి, భూతలమున దానిని చిమ్మీపారవైచి భూమిపై ఒక వేయి యోజనముల ప్రదేశమును సముద్రమునకు కలిపిరి. పాతాళము వరకు భూతలమును త్రవ్వగా, నృపనందనులు పాతాళమున సంచరించు అశ్వమును చూచిరి. వారధికానంద భరితులైరీ, అందరు కలిసికొనిరి. సంతోషమున నవ్వుకొనిరి. అతిగర్వముతో కొందరు వికట నృత్యముల నాచరించిరి.
ప్రకాశించు తేజస్వి, వృద్ధుఁడు, పద్మాసనాసీనుఁడు, నాసాగ్రమున నిక్షిప్తము చేసిన దృష్టి కలవాఁడు, ఋజువై విశాలమయిన శిరోగ్రీవము: కలవాఁడు, ముందునకు పొడుచుకొని వచ్చిన వక్షస్థలము కలవాడు, తన తేజస్సుచే, పరిపూర్ణముగా నంతటను వ్యాపించియున్న వాఁడు, సర్వత్ర గాలిలేనిచోట (నీవాతప్రదేశమున) నుంచీన దీపమువలె, స్వాతంప్రకాశితమైన అశేషవిజ్ఞానమయవిగ్రహుఁడు సమాధిగతచిత్తుఁడు, నిభృతాంబోధితుల్యగంభీరుండు, ఆరూఢయోగుఁడు, వీధిననుసరించి ధ్యేయమయిన పరమాత్మయందు విలీనమనస్క్యుడు, యోగీంద్ర శ్రేష్ఠుఁడు, శాంతుఁడు, జ్వాలామాలాపరీవానలుఁడు, మహాత్ముఁడునునయిన కపిలుని చూచిరి. కొంతకాలమాతనిం గూర్చి పరస్పరము పారాలో చించుకొనిరి. ఒకముహూర్తకాలము వారు హృదయములో నధికసాధ్వసమునందిరీ, అంత, కాలమృత్యుచోదితులై సాగరులు ఈతఁడే అశ్వమును. దొంగిలించినవాఁడు. ఇంక ఆ విషయమున సంశయము లేదు. అని ఆ మహామునిని వారు చుట్టిముట్టిరి.ఇతఁడు అశ్వహర్త, దురాశయుం డు; అందుచే మనకాతండు వధ్యుఁడు. ఆతడు సామాన్యునివలె ఆసీనుఁడై యున్నాడు. అనీ దుష్టబుద్ధులయిన వారందరు. ఆసన్న మరణులయి, క్రుద్ధులయి మహామునినీ వెంటనే ధర్షించిరి.
జైమినీ ఇట్లు పలికెను.
అంత అదీనాత్ముఁడు, ధ్యానభంగముచే ప్రధర్షితుఁడు, అయిన కపిలుఁడు అత్యంత క్రోధావిష్ణుఁడయి, అధికముగా సంక్షుణ్ణుఁడయ్యెను. ఆ దురాత్ములచే ధర్షితుఁడయి ధురాధరుఁడు అసామాన్యుఁడునైన కపిలుఁడు కంపించెను. కల్పాంతమున వీయు ప్రచండప్రభంజనమువలె, అర్ణవగంభీరమయిన ఆతని శరీరమునుండి కోపపావకుఁడు విజృంభించెను.సముద్రసదృశమై ఆతని శరీరము నుండి విజృంభించిన అగ్ని ఆదిశేషుని ముఖము నుండి వెల్వడిన సంకర్షణాగ్ని తుల్యమై పాతాళమును దహింపగోరునట్లు విజృంభించెను. సాగరులాచరించిన ధరణ క్రోధ పరామర్శలచే ఆ మహర్షి క్రోధము ప్రదీపితమై ప్రకాశించెను. ఆతనీ నేత్రములయున్మీలనముచే వహ్నిచక్రసమద్యుతివలే అగ్నిచక్రము బయల్వెడలెను. ఆతని నేత్రములు అరుణారుణ దీప్తములయ్యెను, ఉషస్సమయమున ఆకాశమునప్రకాశించు సూర్యునివలె చంద్రునివలె ఒకదాని తరువాత, నొక్కటి ప్రకాశించెను. కల్పాంతమున ఉద్వర్తమానములైన నేత్రములతో ఆతడు నృపనందనులను వీక్షించెను.
పరులకత్యంతముపతాపమును గల్గించునదీ, సర్వలోక జుగుప్సితమయినదియునగు అశుభకార్యమునాచరించు పాడేవఁడు సుఖమును పొందును? పాపులయిన సాగరులు, స్వకర్మలచే, సర్వభూతజాలమును గట్టిగా నేదీంచిరి. వారందరు బ్రహ్మదండముచే చంపఁబడిరి. వారొనరించిన దుష్టక్రియలచే వారు నరకమునకు పోయిరి. అందు శాశ్వతీస్సమాః జీవితమును వెళ్లబుత్తురు. అందుచే ఉత్తమమైన కర్మ ఇప్పుడే బుద్ధిమంతులు సలుపవలయును, లోక నిందీతములయిన కార్యములు దూరముగా పరిత్యజింపఁబడదగినవి. విజ్ఞానిచే, యావజ్జీవము శ్రేయస్సు కొఱకు యత్నమాచరింపఁబడవలెను. ఎవ్వనికిని ఏ మాత్రపు ద్రోహమయినను ఆచరింపరాదు. ఏలయన, జీవితమనిత్యము కదా ! ఈ శరీరము కూడ ఎల్లప్పుడును అనిత్యము సంపదలో చంచలములు. సంసారము నిస్సారమయినది. పండితుఁడైన వాడేట్లు వీనిని విశ్వసింపగలఁడు! ఈవిధముగా దేవతలు మునీంద్రులు పరస్పరము భాషించుకొనిరి. మునియైన కపిలుని యొక్క క్రోధమనెడు అగ్నికి సాగరులు ఇంధనములై నశించిరి. నిర్దస్త్ర దేహులయిన సాగరులు, వేంటనే, వారి భస్మముచే భూమిని విషభ్య మొనర్చి, స్వకర్మలచే సాగరులు వెంటనే నరకము నొందిరి. సాగరుని కుమారులను అశేషముగా దహించిన వెనుక, ఆ మహర్షి క్రోధజమయిన అగ్ని క్షణములో లోకముల నన్నింటిని దగ్ధముచేయ నుద్యత మయ్యెను. దివి యందున్న దేవతలు, భయభీతులయిరి, వెంటనే కపిలుని సమీపించిరి. మహాత్ముడయిన ఆ మహర్షిని, క్రోధాగ్ని శమనార్థము స్తోత్రమాచరించిరి.
ఇది వాయుప్రోక్తమైన బ్రహ్మాండపురాణమున మధ్యమభాగమున తృతీయ ఉపోద్ఘాతపాదమున సగరచరితమున సాగరవినాశనమను ఏబదిమూఁడవ అధ్యాయము.
Summary of chapter 91 of the Brahmānda Mahā Purana is as follows:
With prophetic vision, this chapter details the future kings of the Paurava lineage who were destined to rule during the challenging age of Kali Yuga. It outlines the gradual decline of royal power, longevity, and moral strength as the dark age advances over centuries. The devout listener is advised to cultivate inner spiritual shelter, realizing that physical kingdoms are fleeting while the kingdom of divine devotion remains eternal.