బ్రహ్మాండ మహా పురాణము
28వ అధ్యాయము
వసిష్ఠుఁడిట్లనేను :-
రాత్రి గడచెను. సూతులు వంది మాగధులు నిద్రించుచున్న రాజు సమీపమునకు అవ్యగులైచనిరి. రాజును ప్రబోధించుటకు (మేలు కోలుపుటకు) ఉచ్చైస్వరమున గోనమాలపించిరి, పొరీ కంఠ స్వరము వీణావేణు ధ్వనులతో సమ్మిశ్రము, మనోహరకరతాలములతో నను గతమయి, సమస్త శ్రుతియుతమై (యా మధుర స్వరము) ప్రశస్తమై సు(శ్రావ్యమై యొప్పెను. వారి కంఠములు మధురస్వరయుతములు, మిక్కిలి స్పష్టముగా నుండెను. సంగీత జ్ఞాన సంభరితములయిన మూర్చనా గ్రామ సూచితములు. వారు తారమంద్రలయాన్వితముగా మనోహ్లాదకరముగా గేయమును గానము చేసిరి. నిద్రపోవుచున్న మహాత్ముఁడయిన రాజునే మేలుకోల్పుటకు మెల్లగా మృదువుగా సూత మాగధులు వివిధ వచస్సులతో నిట్లు పలికిరి. “ఓ రాజేంద్ర ! చూడుము. ఇప్పుడు చంద్రుఁడస్తమించుచున్నాఁడు. ఏలయన, నిజముగా నీయొక్క ముఖ పద్మకాంతిచే వివృద్ధి పొందు నీ తేజస్సుచే చంద్రుఁడు పరాజితుఁడు. “ఓ విభూ ! ఇప్పుడు నీ ఆననాంభోజమును చూచు సముత్సుకముతో చీకట్లను పారద్రోలి సూర్యుం డుదయమును సంప్రాపుఁడైనాఁడు. ఓ రాజా ! చంద్రవంశమౌళి శిఖామణీ ! నిద్దుర చాలును. మహామతీ! ఇప్పుడు మేల్కొనుము'. అను వంది మాగధుల స్తోత్రపాఠములు విని క్షీరాబ్దియందలి శేషశయనమునుండీ పంకజ లోచనుఁడయిన విష్ణువు మేల్కొనునట్లు మహారాజు మేల్కొనెను, నేత్రములు నిద్ర నుండి విడివడ సముత్తితుఁడై మహారాజు ఆదరముతో నిత్యకర్మలను జయాదికములను అశేషముగ స్వస్థచిత్తుఁడై యాచరించెను, దివ్యములయిన మాలలతో గంధాదులతో అలంకరించుకొని, అభీష్ట దేవతలకు నమస్కరించీ ధేనువు నర్చించి, మాంగళ్యాలంబములయి దూర్వాంకురములను అంజనాదులను అద్దములను, మంగలద్రవ్యములను రాజు దర్శించెను. అర్హులకు దానము లొసంగేను. గో బ్రాహ్మణులకు నమస్కరించేను. నగరము నుండి నిష్క్రమించి భాస్కర్టోపస్థానమును ఆచరించెను. అంతలో మంత్రులు సామంతులు; సోయకులు రాజును సమీపీంచి దర్శించిరి. చేతులు కట్టుకొని సొంజలులై వారు రాజునకు నమస్కరించిరి, అంత రాజు స్వ పరి వారముతో పరివృతుఁడై తపోనిధిని సమీపించెను. సూర్యకాంతిని తిరస్కరించు కిరీటముతో రోజు ఆ మహాముని పాదములకు నమస్కరించెను.
మునిపుంగవుఁడు వినయపూర్వముగా వంగిన రాజును ఆశీస్సులతో నభినందించెను. మధుర వాక్కులతో కూర్చుండుడని ముని పలికెను.. ఆసీనుఁడయిన నరపతిని గూర్చి, ప్రీతమానసుఁడై మహర్షి, “ఓ రాజా ! రాత్రి సుఖముగా గడచినదా? ఓ రాజేంద్ర ! మాకు వనమున లభించు వస్తువులతో వనమున జీవీతము, మృగధర్మములతో తుల్యముగా ఎట్లో దానితో నొకదానితో వర్తించుటయే శక్యము. అరణ్యమున నాగరిక జనులకుండుట అత్యంత దుస్సహము. ఓ రాజేంద్ర! అభ్యాస రహితమయినది వహించుట సర్వము దుష్కరము. మహారాజు అనుచర జనముతో పెక్కుమార్లు వనవాస క్షేశముననుభవించి యుండుట భవత్సమున్నతిని ఉగ్గడించెను.” అని ఆ మునివర్యునిచే ప్రీతి పూర్వకముగా చెప్పబడి, రాజు నవ్వుచు మరల నిట్లుత్తర మొసంగెను. “బ్రహ్మర్షి ! పలుకులతో నేమి ప్రయోజనము. మీ గొప్పతనము మాచే చూడఁబడినది. మేము విస్మయ మొందుటెంత? భవన్మహిమచే సర్వలోకము విస్మితావహ మయినది. భవత్రతాపముచే సంజాతమయిన మహా విభవముచే ఆశ్చర్య చకీతులయి, ఆహూతులయి, ఓ మహామునీ ! ఈ నా సైనికులు ఇచ్చటి నుండి నగరమునకు పోవనిచ్చగీంపకున్నారు.(21) త్వత్సదృశుల అచింత్యమయిన బ్రహ్మవర్చస్సు సర్వజగత్తున కాధార భూతమయినది. ఓ పరమపూజ్య ! సర్వ ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములు మీ తపః ప్రభావముచే ధ్రువీకరించుటకు మీరు సమర్గులరు, ఇదీ (మీరు చేసినది) యొక చిత్రము కాదు. లోక పూజితమయిన భవన్మహా తపస్సిద్ధీని చక్కగా దర్శించితిమీ ఇఁక పురమునకు పోవుదుము. నా కనుజ్ఞ దయచేయుఁడ.
వసిష్ఠుఁడిట్లనెను :-
కార్తవీర్యునిచే నీట్లు చెప్పఁబడి మహాముని రాజును సాదరముగా గౌరవించేను. ‘అట్లే’ యని రాజునకు ప్రత్యుత్తర మిచ్చెను.
రాజు మునీవర్యునిచో సమనుజ్ఞాతుఁడై ఆ యాశ్రమము నుండి సర్వ సైన్య పరివృతుఁడై స్వనగరమునకు బయలుదేరెను. (26) పోపుచు మార్గములో రాజిట్లు ఆలోచించెను. ఈ మహాముని తపస్సు యొక్క సిద్ది లోక విస్మయ కారిణి. తపః ప్రభావము చేతనే, శ్రేష్ట మయినది, సర్వ కామములను సమకూర్చునదియు నయిన యీ ధేనువు లబ్దమయినది. నా యీ సమస్త రాజ్యముతో నేమి ప్రయోజనము? అనల్పమయిన యోగముచే పొందిన సంపదతో నేమి ప్రయోజనము? గోవులలో రత్న భూతమయిన ఈ ధేనువు మునివర్యునకున్నది. ఈ గోవు చేతనే స్వర్గ సంపదయంతయు నిజముగా ఉత్పాదింపఁబడినదే ! త్రైలోక్య పూజితమయిన ఇంద్రుని యొక్కయైశ్వర్యపదమంతయు ఈ ధేనువులోని పదియారవ భాగముతో సరితూగదని నేను తలంతును. ఈ విధముగా నాలోచించు రాజును తరువాత మంత్రియైన చంద్రగుప్తుడు సమీపించి, కృతాంజలి పుటుఁడై “ఓ రాజశార్దూల ! పట్టణమునకు ఎందుకు తిరిగి పోవుచున్నారని రాజ్యమును రక్షించుటచేగాని, పట్టణమును రక్షించుటచేగాని నీకేమి ప్రయోజనము? ఓ రాజా ! గోవులలో రత్నము వంటిదయిన యీ గోవు ఎంతకాలము ఇచ్చటి నుండి కదలింపఁబడి నీ గృహమును చేరదో అంతవరకు నీ రాజ్యము ఐశ్వర్య రహితము. శూన్య సదృశము. ఓ రాజ ! వేడొక ఆశ్చర్య జనకమయిన విషయము నాచే దర్శింపఁబడినది. దానిని వినుము. మనోజ్ఞములు భవనములు, స్త్రీలు మనోజ్ఞలు. ప్రాసాదములు వివిధాకారవంతములు.. ధనమే సంక్షయ రహితము. నేను చూచుచుండగనే అవి ఆ మహర్షి ధేనువు నందు క్షణములో విలీనములు. ఓ రాజా ! ఆ ధేనువు వలన క్షణములలోనవి పూర్వ తపోవనముగా నయినవి. అట్టి అద్భుత ప్రభావము గల ధేనువు కలవానికి ఏది దుర్లభము! రత్నహారి సామ్రాట్టగుట, రత్నమును పొంద నర్హతగల వాడవగుట, ఆ ధేనువు నీచే స్వీకరింపఁ దగినది. ఈ కార్యము మీ కంగీకృతమయినచో మీ అనుజీవులచే విషయము మునికి ఎటింపం దగినది”. అనెను. రాజు ఇట్లనెను.
ఇయ్యది ఈ విధముగా నేనాలోచింషను, ఏలయన. ఇది. అసాంప్రతము. ఆయోగ్యము అగుటవలన బ్రాహ్మణ ధనమపహరింపం బడరాది ఆది నా మనసు శంకించుచున్నది. అని యీ విధముగా పలుకు రాజుతో పురోహితుఁడిట్లనేమ ! ఆ పురోహితుఁడు. గర్గుఁడు. మతి. మంతులలో శ్రేష్ఠుఁడు. ఇతఁడు ధాజును గరించునట్లుండెను. బ్రాహ్మణస్వమును ఆపదయందు కూడ వెన్నడును హరింపరాదు. బ్రాహ్మణ స్వముతో సమముగా దుర్ధరఘునది జీరముకానిది ! ప్రపంచమున వేకటి లేదు. విషమ తన్ను ఉపయోగించిన వానినే చంపును. ఓ హైహయ ప్రభూ ! కాని బ్రాహ్మణ ధషమనెడ అరణినుండి కలిగిన అగ్నిహోత్రము కులమును సమూలముగా దహించును, ఇది అనివార్యమైనది. బ్రాహ్మణన్వము లోకమున దుర్జరము. జీర్ణించుకోవడానిది. ఇయ్యది పుత్త్రపౌత్ర - మరణాంతపటమయిషది. దాని వలని విపాకము. చాల దుర్భరమైనదీ అసదాత్యులు ప్రభష ముపస్తూ అశ్వర్యముచే మీమూతమయినది. ప్రలోభితమయిన క్షేత్రముచే దూరముగా వికర్షింపబడిన షేత్రము. గల. ఐశ్వర్య వడ మనస్సు. మీ రుష్కార్యము, వాచరింపదు? సీ రుష్ట మనస్సు యొక్క దుష్కర్మల ఫలములను వీవు కాక వేడొక్కడెవ్వఁడెలుంగును? ఓ రాజా ! నీవు బ్రాహ్మణుల నుండి, ఆదాషమును తీసికొని పోవుటను గూరి) ఆలోచించు చుంటివి. కానీ 'దాని మొసంగుటను కూర్చీ కాదు. నీవుదక్క వేటోక్కడైవ్వడిట్టిది యొనర్చును ఓ మహాబాహో ! ఉత్తముఁడవయిన నీవు (ఈదృశ్యుడవయిన నీవు) సజ్జన నిందీతమయిన కర్న ఆచరింపకుము. నిజముగా ఇట్టి కర్నీ లోకము లందలి నీ యశస్సునకు హానీకరము. నీవో, మహావంశమున నుద్భవించితిమి నీ వంశ రాజులందరు వదాన్యులు దాతలు. ఈ నిందితమరణన్న కర్మ నాచరించి నీ యశస్సును నాశము చేసికొనకుము. కొందరనుజీవకులున్నారు. వారు సహజమ దుష్మచరణానరులు, రాజు యొక్క ప్రషనత్వము షషేక్షించి ఆ ధుష్ట పరివారము 2జము దుఃఖ సముద్రము ముంచెదరు. ఐశ్వర్య మదమతుండైయెవడు స్వకృత్య విషయమున విచేతనుఁడై యుండునో, ఎవని యొక్క ప్రవర్తనము అనుయాయుల సలహాలననుసరించునో యతఁడు వెంటనే వినాశవము నొందును. ఇనుముతో చేయబడిన నావ వలె, దుష్ట బుద్దీయైన మంత్రి (అజ్ఞాతముని స్వభావుఁడు) దుర్బుద్ధి సముద్రములో తనతో సహా నిమజ్జనము చేయును. అందుచే రాజశార్దూల ! మూడుఁడయిన మంత్రి యొక్క మతమును అనుసరించుట తగదు.. అని యీ విధముగా స్వామికి శ్రేయస్కరముగా పలుకు వచస్సును త్రోసిపుచ్చి మంత్రి రాజుతో మరల నిట్లనియెను.
“ఇతఁడో బ్రాహ్మణుఁడు. స్వజాతి యొక్క హితమునే ఆకాంక్షించును. మహారాజకార్యములను బ్రాహ్మణులు తెలిసికొన శక్తులు కారు. రాజే, రాజ కార్యములను, స్వమనీషతో నేర్వవలయును. తెలిసికొన వలయును. బ్రాహ్మణుఁడు భోజనమును గ్రహించుట తక్క ఇతర కార్యములను నెఱుంగఁడు. బ్రాహ్మణుఁడు నిందింపబడ తగఁడు. నిత్యమును నతఁడు వందనీయుఁడు. బ్రాహ్మణులకేప్పుడు ధన మొసంగవలయును. దానము లాసంగవలయును. అంతకంటే నెప్పుడును అధికము వారి వలన సాధింపబడరాదు. అందుచే ఓ నృప ! ఆ ధేనువును స్వీకరించి, స్వపురమున కరుగుము. అట్లు కానిచో, రాజ్యమును పరిత్యజించి, అడవికి తపస్సాచరింప చనుము. ఓ రాజా ! బ్రాహ్మణులకు క్షమావత్త్వము. క్షత్రియునకో దండనము ధర్మము కావున బలాత్కరించి హరించుటలో ఎట్టి దోషము కానరాదు, గోవులు, అశ్వాదులు మొదలయిన వానిని మూల్యముగా నొసంగి, ఋషీశ్వరుని గోవును నీవు ప్రగ్రహించుము. ఆ ధేనువు నీచే స్వీకరింపఁదగినది. నీవు రత్న గ్రహణమున కరుఁడవు, తపోధనులకు రత్న సంగ్రహణము నందలి ఆదరణ మెక్కడ? తపోధనుల బలము శాంతము. ఆతఁడు నీయెడల ప్రీతిగలవాఁడు. నీ యందు ప్రీతియుతుఁడు.. అందుచే, నీచే యాచితుఁడై తప్పక ధేనువు నొసంగును. లేదా, గోహిరణ్యాకములనో, అభివాంఛితమయిన వేకదానినో విపులమయిన విత్తమునో గ్రహించి యాతఁడు ఆ ధేనువును నీకొసంగగలఁడు. ఐశ్వర్యము నపేక్షించు రాజు మహారత్నమును నిర్లక్ష్యము చేయరాదు ఇట్లు నాకు తోచుచున్నది. ప్రభూ ! మీరెట్లు తలంతురు? అనెను, రాజిట్లు పలికెను. నీవే వెళ్లుము. ఆ విప్రుని విశేషముగా ప్రసన్నుని చేసికొనుము, ఆతని అభీప్సితము నొసంగుము. ఓ మంత్రి, ఆ గోవును తీసికొనిరమ్ము, అంత వసిష్ఠుఁడిట్లనెను. రాజుచే నీట్లు చెప్పఁబడి మంత్రి వీధిచోదితుఁడై వెనుకకు తిరిగి, జమదగ్ని యొక్క ఆశ్రమమునకు శీఘ్రముగా నరిగెను. రాజు నగరమునకు తిరిగి పోవగా, అకృతవణునితో కూడికొని, యజ్ఞ సమిధలను తెచ్చుట కొఱకు రాముఁడును వనమున కరిగెను.
తరువాత మంత్రి స్వబలగముతో గూడికొని ఆ ముని ఆశ్రమమును చేరెను. ముని శార్దూలునకు నమస్కరించి యిట్లు పలికెను.
చంద్రగుప్తుఁడిట్లు పలికెను.
ఓ బ్రహ్మన్ ! నృపతి యిట్లు ఆజ్ఞాపించెను. “రాజు రత్నభాజనుఁడు. ఈ ధేనువో రత్న తుల్యమయినది. అయ్యది భూమిలో గోవులయందు అత్యుత్తమమైనది. అందుచే, రత్నములనుగాని, సువర్ణమునుగానీ, యథోచితముగ మూల్యముగా చెప్పి, గోరత్న భూతమయిన ధేనువును, తీసికొనివచ్చి నాకీయ నరుఁడవు” అనీ. జమదగ్ని ఇట్లు ప్రత్యుత్తర మొసంగెను.
ఇది నా హోమధేనువు. ఇతరున కెవ్వనికి ఈయ దగినది కాదు, రాజు మహోవదాన్యుఁడు గౌత. బ్రాహ్మణస్వము నతఁడెట్లు కోరును అనెను.
మంత్రి ఇట్లనెను :
తాను రత్నభాకగుట రాజు నీ ధేనువు కాంక్షించెను, పదివేల గోవులకు ప్రతిగా రాజు నీ వలనంగోరెను. అందుచే నీవు రాజునకు ఈ గోవు నీయ నరుఁడవు.
జమదగ్ని ఇట్లనెను :
దీనిని అమ్ముటకు కానీ కోనుటకు కాని నేనెన్నడును కర్తను గాను. అయ్యది హవిరానీ (హవిస్సు ధరించునది) అందుచే నేనీ గోవు నీయంగోరను. (70)
మంత్రీ ఇట్లనెను :
ఓ బ్రాహ్మణా ! రాజ్యార్ధముగాని సకలరాజ్యముగాని స్వీకరించి రాజునకే గోవు నిమ్ము. ఈ ఒక్క ధేను నొసంగుటవలన నీకు శ్రేయస్సు కలుగును.
జమదగ్నీ ఇట్లనెను :
ఓ దుర్మతీ ! బ్రతికి యుండఁగా నా బొందిలో జీవముండఁగా ఇంద్రునికైనను బృహస్పతి వచ్చి యాచించినను దీని నీయను. అట్టీండను నీవు వచ్చి యడిగి నంత మాత్రాన, రాజున కేట్లో సంగుదును!
మంత్రీ ఇట్లనెను ;
స్నేహ భావ పురస్సరముగా నీవే స్వయముగా స్వేచ్ఛగా రాజునకు గోవునిమ్ము. బలాత్కారముగా తీసికొని పోయినచో అప్పుడు నీవేమి చేయగలవు!
జమదగ్ని ఇట్లనెను :
బ్రాహ్మణులకు దాత రాజు. ఆతఁడే అపహరించిన, నేనో విప్రుడను. ఏమీ చేయఁగలను ! స్వేచ్ఛా వితరణముగాక -వసిష్ణుఁడనెను.
ఇట్లు చెప్పఁబడి పాప చేతనుడయిన ఆ మంత్రి క్రుద్ధుఁడై ఆ మునీశ్వరుని యొక్క ధేనువును బలాత్కారముగా తీసికొనిపోవ ఆరంభించెను.
ఇది వాయుప్రోక్తము, మహాపురాణము అయిన బ్రహ్మాండపురాణమువ మధ్యభాగమందు, తృతీయోపాదాతపాదమున అర్జునోపఖ్యానమున భార్గవచరితము ఇరువది యెనిమిదవ అధ్యాయము.
Summary of chapter 66 of the Brahmānda Mahā Purana is as follows:
Shifting the majestic narrative focus, this chapter details the celestial origins of the Lunar Dynasty, beginning with the luminous birth of king Purūravas. It describes the divine lineage descending from the moon god, highlighting the unique beauty, intellectual brilliance, and spiritual depth of this royal line. The faithful listener is captivated by the poetic splendor of this genesis, praising the supreme architect who adorns the world with diverse divine dynasties.