బ్రహ్మాండ మహా పురాణము
72 - స్తవసమాప్తి
సూతుఁడిట్లుచెప్పెను. మనుష్య ప్రకృతియందవతరించి కీర్తింపఁబడు దేవతల నెఱుంగుము. సంకరణుఁడు, వాసుదేవుఁడు, ప్రద్యుమ్నుం డు, సాంబుడు. అనిరుద్ధుఁడు. వీరయిదుగురు వంశవీరులుగా కీర్తింపబడిరి, సప్తర్పులు, కుబేరుఁడు, యజుఁడు, మణివరుఁడు, శాలూకి, " నారదుఁడు, విద్వాంసుఁడయిన ధన్వంతరి, నందినుడు, మహాదేవుండు, సాలంకాయనుఁడు, ఆదిదేవుఁడయిన విష్ణువు వీరు దేవతలతో మానవప్రకృతుల నందిన దేవతలు, ఋషులిట్లడిగిరీ.. విష్ణువెందులకు అవతరించెను. విష్ణుని యొక్క అవతారము. లెన్ని స్మరింపఁబడినవి? భవిష్యత్తున నింకెందరు మహాత్ములు ప్రాదుర్భవింతురు? పునః పునః బ్రహ్మ క్షత్రియ కుటుంబములలో ఆతఁడేల నిట జనించును? శత్రుమర్ధసుం డయిన ఆతనీ ఆకృష్ణుని కర్మలను విపులముగా వినుటకు కోరుచున్నాము. దయతో చెప్పుము. అనుపూర్వికముగ ఆతని ప్రాదుర్భావములను గూర్చి చెప్పుము. ఓ పూజ్య ! ఆతని అవతారమును, ఆతని ప్రకృతిని మాకు చెప్పగా నీవఝుండవు. దేవతాశత్రు సూదనుఁడయిన ధీమంతుఁడు - విష్ణువు, వసుదేవకులమున వాసుదేవత్వము నొంది జన్మించేను? పుణ్యమైనది, పుణ్యమాచరించిన వారితో అలంకృతమైనది, అమరులచే నావృత మయినదియునగు దేవలోకమును విడిచి మర్త్యలోకమున కిచ్చటకేగుదెంచెను? ఆ భగవానుఁడో దేవతలకు మనుష్యులకు.నేత, బ్రహ్మ జననమునకు కారణమైనవాఁడు, ఎందుకొఱకు స్వకీయమైన దివ్యమైన ఆత్మత్వమును మనుష్యుని యందు సమావేశమొనర్చెను? ఆతఁడొక్కడే మానవుల మనోమయమయిన చక్రము వర్తింపఁజేసినవాఁడు. చక్రమును ధరించినవారలలో శ్రేష్ఠుఁడయిన హరి బుద్ధిలో ఏల మనుష్యులలో నుదయింప నెంచెను? ఆతఁడే ప్రపంచము నంతటికి సార్వకాలీకముగ రక్షణ నొనర్చును.
ఆ భగవానుండేల భూమీనవతరించి, గోపాలుఁడుగా వర్తించెను? అతడు భూతాత్మ సర్వభూతముల కాధారభూతమయిన సర్వాత్మ, ఆతడే సర్వ (పంచ) భూతములను సృజించెను. ఆతఁడే శ్రీగరుఁడు. శ్రీగరుఁడయిన యతఁడు భూమీయందు సంచరించు స్త్రీగర్భమున ఆవృతమయి యుండెను? ఆతఁడే లోకములను క్రమముగా జయించి, దేవతలను ఐశ్వర్యవంతులను చేసెను. జగత్తునందు మార్గములు - స్థాపింపఁబడెను. వామనావతరామున శ్రీక్రమమైన వస్తువు వహింపఁబడినది. సురసత్తముఁడయిన యతఁడు భూమిని జయించి సురలకొసంగెను. బలిని జయించి రాజ్యము దేవతల కొసంగెను. మహావీరుఁడు పూర్వదైత్యుఁడు నయిన హిరణ్యకశిపుని సింహ మానవ సంబంధమైన శరీరద్వయము దాల్చి చంపెను? సర్వాత్ముఁడు అయిన హరి పూర్వము ఔర్వమను బడబానలుఁడై సంవర్తకుడైన విభుఁడయ్యేను. పాతాళస్థుఁడు అర్ణవగతుఁడు నయి హరి తోయమయమయిన హవిస్సును త్రాగెను. భిన్న భిన్న యుగములయందు (విద్వాంసులయిన ఋషులు) ఆతనిని హరిని) సహస్ర చరణుఁడని, సహస్రాంశుఁడని, సహస్ర శిరసుఁడనియు పిలిచెదరు. ఆతని యొక్క పవిత్రమయిన నాభీయే అరటిగా పితామహుఁ డయిన బ్రహ్మ సముద్భవించెను. అప్పుడు యావత్ర్పపంచము ఒక మహాసముద్రము. అదీ పంకజము. కాని యదీ పంకము నుండి (బురదనుండి) పుట్టినది కాదు. ఆతని వలననే సర్వదైత్యులు తారకామయమను యుద్ధము నందు సర్వదేవమయము, సర్వాయుధధరమయిన వపువును ధరించీ చంపెను. తన మహాబలముచే ఉత్సక్తుఁడయిన కాలనేమిని కూడ చంపెను. అతఁడే శాశ్వతమయిన యోగము నొంది, మహా తీమీరమునందు (ప్రళయకాలమున) క్షీరోదయయిన అమృత సముద్రము యొక్క ఉత్తరప్రాంతమున యోగనిద్ర యందు శయనించును. పూర్వము తనయొక్క దివ్యమయిన తపఃప్రభావమున సురారణియైన అదితి తన గర్భమున ఇంద్రుని శ్రీహరినీ ధరించెను. దైత్యగణమును గర్భము నష్టమగుననెడి భావముతో అదుపులో నుంచెను. దైత్య స్త్రీలు భగవంతుని వలన భయము నొందిరి. గర్భ భంగమును పొందునట్లు నిరోధమున నుంచెను.
ఆ ప్రభువే ప్రజలు నివసించుటకు స్థానములను లోకములను సృజించి, దైత్యులను నీటిలో శయనించు వారలను చేసి, దేవతలను ప్రకాశించు త్రిదీవమున (స్వర్గమున) నివసింపఁజేసి, సురల కథిపతిగా పురుహూతుని (ఇంద్రుని) చేసెను. ఆ ప్రభువే వివిధములయిన యజ్ఞ కర్మలను, వానీకి ఆవశ్యకములయిన ఇతర వస్తు సముదాయమును సృజించెను. ఈతఁడు గారపత్యమును, ఆహవనీయము అను అగ్నులను, మాస శ్రాద్ధములయిన అన్వాహార్యములను, సృజించెను. అంతియేకాక, ఆతఁడే, యజ్ఞమున కంగ భూతములయిన వేదినీ, కుశలను స్రువమును, ప్రోక్షణాదులకయిన నీటిని, శ్రుతమును (మంత్ర గ్రంథములను) ఆవభృథ్యమును (యజ్ఞాంతమున పవిత్రీకరించుటకు పవిత్రోద కస్నానమును) సృజించెను. తరువాత ఆతఁడే ఋషులను, సృజించెను, వారు యజ్ఞముల యందు, దేవతలకు హవ్యభాగముల భాగములను అర్పింతురు. ఆతఁ డే (హరి) సురలను హవ్యమును స్వీకరించు వారలనుగా చేసెను. పితరులను కవ్యమును స్వీకరించు వారలనుగా చేసెను. పవిత్రమైన యజ్ఞ కర్మవలన భోగార్డులను అర్హులను చేసెను. పవిత్రమయిన యజ్ఞకర్మ యందు, ఆ ప్రభువే యజ్ఞముగా వ్యవహరింపఁబడెను. ఆతఁడే యజ్ఞమునకు అవసరములయిన, యూపములను స్తంభములను), సమిథలను (హోమమునకు పనికివచ్చు రావికముక్కలు మొదలగునవి) స్రువమును (యజ్ఞమున నేతిని తీసికొని వ్రేల్చుటకుపకరణము) సోమమును (సోమ లతయొక్కరసము). పవిత్రములను చేతికి యజ్ఞాదికర్మల యందు ధరించు దర్భలతో కూర్చబడి ధరించునవి) పరిధులను (పవిత్రమైన పలాశవృక్షపు చీతుకులు వీనినీ యజ్ఞ వేదికకు నలుప్రక్కలను పరచెదరు), సృజించెను ఆతఁడే యజ్జీయమైన అగ్నులను, సదస్యులను (పవిత్రమైన యజ్ఞకర్మనాచరించు శ్రోత్రియులను) యజమానులను (యజ్ఞము నాచరించువారలను) ఉద్దాతలను (సామవేద ఋక్కులను మంత్రములను చదువు వారిని) మరియు నితరులను ఆతఁడే సృజించెను. ఆతఁడే. క్రతూత్తమములయిన అశ్వమేథములను, విచిత్రములయిన రాజసూయ క్రతువులను, సృజించెను. పొరమేష్ణ్యకర్మతో (పరమేష్టికి సంబంధించిన కర్మచే) లోకములను యజ్ఞమును స్థాపించెను. ఆతఁడే ఉద్గాతలను (వేదములను పఠించువారలను) కూడ సృజించెను. ఆ ప్రభువు పెక్కు వస్తువులను (విషయములను) సృజించెను. ఆతడే జీవగణముల కాధారభూతుఁడు. క్షణములు, నిమేషములు, కాష్ఠలు, కలలు (కాలము యొక్క పరిమాణములు) కొలత్రయము (భూత, భవిష్యద్వర్తమానములు) ముహూర్తములను (48 నిముషముల కాలము) తిథులను, మాసములను, దీనములను, సంవత్సరములను, ఋతువులను, (కొలములోని) పవిత్రయోగములను, ప్రమాణత్రయమును (విషయ సత్యపరిజ్ఞాన సాధనము (ప్రత్యక్ష, పరోక్ష, అనుమాన ఇత్యాదులు). ఆయుః ప్రమాణమును, క్షేత్రమును, బలమును, క్షణమును, రూప సౌష్టవమును, మేధావీత్వము (తెలివితనము) శౌర్యము శాస్త్ర పారణమునకైన బుద్ధి విశేషమును, శ్రీవిద్యలు, త్రేతాగ్నులును, త్రివర్ణములు, త్రిలోకములు, కాలత్రయము, శ్రీకర్మలు, శ్రీమాత్రలు, త్రిగుణములు, సర్వజీవభూతములు ఆతనిచే సృజింపఁబడెను.
వారి వారి కర్మలచే ఆతఁడే లోకేశ్వరులను సృజించెను. సర్వభూత గణాత్ముఁడయిన యాతనిచే సర్వభూతగణములు సృజింపఁబడెను. తనయోగబలముచే క్షణముల నాతదే సమకూర్చును. ఆతఁడే వానితో రమించును. పుట్టునట్టి వారికి పోవునట్టి వారికీని, వచ్చి పోవువారలకెల్లరకును ఆతఁడే సర్వత్ర వివిధేశ్వరుఁడు. ఆతఁడు ధర్మయుక్తులకు గతి పాపకర్ములకు అగతి (పొందదగినవాఁడు కాఁడు), చాతుర్వర్యములకు నుత్పత్తి కారణుఁడు, చాతుర్వర్ణ్యములకు రక్షకుఁడు, నాలుగు విద్యలను (వేద చతుష్టయము అన్వీక్షికీ, త్రయీ, వార్తా, దండనీతులను తెలిసినవాఁడు, చతురాశ్రమ వాసులకు ఆశ్రయణీయుఁడు; ఆతఁడు. దిగంతరుఁడు (రెండు వస్తువులకు మధ్య నుండు అవకాశము) ఆకాశము, భూమి, నీరు, వాయువు, అగ్ని, జ్యోతిర్యుగమయిన సూర్యుఁడు చంద్రుఁడు, ఆతఁడు యుగేశ్వరులతో సముఁడు, అంతియేకాక రాత్రించరులతో సముఁ డు. ఆతడే గొప్ప ప్రభువుగా వేదములలో కీర్తింపఁబడెను. ఆతఁడే గొప్ప తపః స్వరూపుడు. ఆతనినే తమస్సునకు పరమందున్న వానీనిగా కీర్తింతురు. ఆతఁడే పరం పరమాత్మవంతుఁడు. ఆతఁడే ఆదిత్యులలో ప్రాగ్రేసరుఁడు ఆతడే దైత్యుల యంతమునకు కారణుఁడు. ఆతం డు యుగాంతముల యందంతకుఁడు, ఆతఁడేలోకాంతకాంతకుఁడు. ఆతఁడే లోక సేతువులకు సేతువు. (సేతువు బ్రిడ్జి). ఆతఁడే మధ్య కర్ములకు (పవిత్ర కర్మలకడ్డు తగులువారికి) పవిత్రమైన యజ్ఞము. వేదములఁ దెలిసిన వారికతఁడే వేద్యుఁడు (తెలిసికొనఁదగినవాఁడు) శక్తిమంతములయిన ఆత్మ కలవారలకు ఆతఁడు ప్రభువు. జీవద్భూతములకు నతఁడు సోముని వంటి వాఁడు (చంద్రుఁడు). అగ్ని వర్చస్వులకతండు అగ్నిభూతుఁడు. మనుష్యులకు ఆతఁడు మనువు వంటివాఁడు. తపస్వులకు తపము వంటివాఁడు, నయతృప్తులకతఁడు వీనయుఁడు; తేజస్వులకు ఆతఁడు తేజస్వి. ఆతఁడు విగ్రహము దేహము గలవారలకు నెల్లరకు విగ్రహుఁడు. గతి గలవారలకు గతి.
ఆకాశము వాయువునకు నుత్పత్తి స్థానము. హుతాశనుఁడు (అగ్ని) వాయువు ప్రాణముగా గలవాఁడు. దేవతలు హుతాశనుడు ప్రాణముగా గలవారు. అగ్నికి ప్రాణము మధుసూదనుఁడు. రసమము నుండి రక్తము పుట్టును. శోణితము నుండి మాంసము పుట్టును. మాంసము నుండి మేదస్సు (కొవ్వు పుట్టును. కొవ్వు నుండి అస్థి ఎముకలు పుట్టును. అస్థి నుండి (ఎముక నుండీ) మజ్జ, మజ్జ నుండి శుక్రము పుట్టును. రసమూలమయిన కర్మచే శుక్రము నుండి గర్భము గలుగును. అచటనీరు మొదలు చేరును. దీనిని సౌమ్యరాశీ యందురు. గర్బము ఘనీభవించును (ఆశ్న = రాయి;ఘనీభూతము). దానిని ద్వితీయరాశి యందురు. శుక్రము సోమాత్మకముగా నెలుంగవలెను. ఆర్తవము బహిష్టు రజస్సు రక్తము - పావకాత్మకము. ఈ రెండును రసము ననుసరించును. శుక్రము నందు శశిపావకులు కలరు. శుక్రము కఫ వర్గమునందలిది. కఫవర్గమున శుక్రము గలుగును. శోణితము పిత్త వర్గమునందలిది. కఫమునకు హృదయము స్థానము, పిత్తమునకు నాభి స్థానము. హృదయం (గుండె) శరీర మధ్యమున నున్నది. అయ్యదియే మనస్సునకు స్థానముగా నేఱుంగుము. నాభి ఉదరము నందున్నది. అచ్చటనే దేవుడయిన హుతాశనుఁడు. మనస్సు ప్రజాపతి, కఫము చంద్రుఁడు. పిత్తము అగ్ని. అందుచే శరీరజగత్తు అగ్నిసోమాత్మకముగా స్మరింపం బడును. గర్భము కర్కంధు సన్నిభము. కర్కంధుగంగరేగుపండుతో సమానమయిన గర్భమును వాయువు పరమాత్మతో గూడి ప్రవేశించును. అయ్యది ఐదు విధములుగ నుండి శరీరమును వృద్ధి పొందించును. ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము. ప్రాణము పరమాత్మను వృద్ధిచేయుచు పరివర్తించును. అపానము పశ్చిమకాయమును (క్రింది భాగమును) వృద్ధి పరచును. ఉదానము జీవియొక్క సగభాగమును వృద్ధి పరచును. వ్యానము. సర్వ శరీర భోగములకు వ్యాపించి యున్నది. సర్వ సంధులయందు సమానము వాయువు వ్యాపించియుండును. తరువాత దానియొక్క భూతవ్యాప్తి ఇంద్రియగోచరమగును. పంచభూతములు ఇంద్రియముల నన్నింటినీ వ్యాపించి, తమతమ కార్యముల నాచరించును. భౌతిక శరీరమున పృథీవీతత్త్వసంబంధమైనది పార్థివ మందురు. పంచవాయువులు వాయువు యొక్క లక్షణములు గలిగినవి, ఇంద్రియముల యొక్క ఛిద్రములు ఆకాశయోనులు. జలభూతము వలన శరీరమున జలస్రావము జరుగును. జ్యోతిర్భూతము నేత్రముల
యందు ప్రత్యక్షము, అందుచే ఛిద్రములు వానీ నామములతోడనే యవి స్మరింపఁబడు చున్నవి.
పరమాత్మయైన (పంచభూతముల) పురుషుని శక్తిచేతనే జ్ఞానేంద్రియములు కానివానీ ప్రత్యేక లక్షణములను-వస్తువులనుండి గ్రహించు చున్నవి. ఈ విధముగా సనాతనుఁడయిన పురుషుఁడు అన్నింటిని ఒక్కడే సృజించుచున్నాఁడు. మర్త్యమయిన యీ లోకములో విష్ణు వేట్లు నరత్వము ఫూనీ వచ్చెను? ఓ మహాత్మా ! ఇదీ మా సంశయము, ఇదీయొక విస్మయావహ కృత్యము ! లక్ష్యమును చెందినవారలకు ఆతఁడు గతి (లక్ష్యము). ఆతఁడేట్లు మానుష సంబంధమైన తనువును గ్రహించెను. విష్ణుని యొక్క మహతర్మలను యథాక్రమము వినఁగోరు చున్నాము. విష్ణువే యొక పరమాశ్చర్యకరమైన వస్తువు. ఈ విధముగా వేదములు, దేవతలు వచింతురు. ఓ మహామతీ ! ఆశ్చర్యకర మయిన విష్ణుని యొక్క యుత్పత్తిని మాకు చెప్పుము. ప్రఖ్యాతము బలవీర్యుడైన మహాత్ముని ప్రాదుర్భావమును వచింపుము. కర్మలచే ఆశ్చర్య భూతుఁడయిన విష్ణునియొక్క సత్త్వస్వరూపము ఇందు వర్ణింపఁబడవలెను. సూతుఁడిట్లు ప్రత్యుత్తర మొసంగెను. మహాత్ముఁడయిన విష్ణుని యొక్క ప్రాదుర్భావము వర్ణించెదను, భృగునీ భార్య యొక్క వధ వలన గలిగిన దోషముచే, భృగుని యొక్క శాపముచే భగవంతుఁడయిన విష్ణువు మనుష్యుల యందు ఎట్లు పుట్టెనో చెప్పెదను. యుగాంతముల యందు దేవతా కార్యసిద్ధి కొరకు భృగుని శాపముచే మనుష్య లోకమున జనించిన విషయము చెప్పెదను గ్రహింపుము. యుగధర్మములు పరావృత్తములుకాగా (వ్యతిరేక స్థితిలో ప్రవర్తిల్ల), కాలము. శిథిలము కాగా, ధర్మ వ్యవస్థానమును స్థాపించుటకు మానవలోకమున ప్రభువు అవతరించును. ఇది భృగుని యొక్క శాపముచే జరిగినది. అది పరోక్షముగా దేవాసురకర్మకము.
ఋషులిట్లడిగిరి. అయ్యది దేవాసురులచే నెట్లు సంప్రాప్తమయినది. ఆ దేవాసుర కథను వినఁగోరుచున్నాము. సూతుఁడిట్లు ప్రత్యుత్తర మిచ్చెను. దేవాసుర కథ యెట్లు జరిగినదో చెప్పెదను. వినుఁడు. పూర్వము హిరణ్యకశివుఁడను దైత్యుఁడు త్రిలోకములను శాసించెను. తరువాత లోకత్రయము బలిచే అధిష్టితమయినది. తరువాత దేవతలకు అసురులకు సఖ్యమేర్పడెను. పదియుగముల కాలము ప్రపంచ మవ్యాహృతమై యుండెను. దేవతలు అసురులు వారివారి నీదేశ స్థాయులై యుండిరి. కాని బలి బద్ధుఁడు కాగా దేవాసురలకు మధ్య భయంకరమయిన యుద్దమయినది. ఇయ్యది దేవాసురుల యుభయ పక్షములకు మహా ఘోరమయిన క్షయకారణమయినది. వారి ద్వీపముల కొఱకు చాలా యుద్ధములు వారి మధ్య జరిగినవి. ఈ వరాహ కల్పము నందు, పది రెండు ద్వీపములు “షండోమర్కాంతగములుగా” స్మరింపఁబడినవి. వాని నామములు చెప్పెదను క్రమముగా వినుము, ప్రథమము నారసింహము (నరసింహావతారము) రెండవది వామనము (వామనునీ జన్మచే కలిగినది) తృతీయము వారాహము. చతుర్థము అమృతమథన సమయమున సంగ్రామము. పంచమము సుఘోరమైన తారకామయ యుద్ధము. తారను చంద్రుడు ఎత్తుకొని పోవుట వలన గలిగినది. ఆరవది ఆడీబకము ఏడవది తైపుర యుద్ధము. అంధకారము ఎనిమిదవది. ధ్వజము తొమ్మిదవది. వార్హము వృత్రాసురునకు సంబంధించినది దశమము. పదకొండవది మౌరవృత్తము హాలాహలము. ఇక పండ్రెండవది కోలాహలము భయంకరయుద్ధము. దైత్యుఁడయిన హిరణ్యకశిపుండు నృసింహునిచే చంపఁబడెను, మూఁడడగులు కొలిచి మూడులోకము లాక్రమించినప్పుడు వామనుఁడు బలిని సంహరించెను. అప్పుడు ద్వంద్వ యుద్ధమున హిరణ్యాక్షుఁడు వధింపఁబడెను.
హిరణ్యాక్షుడు మహాబలుడు, మహాసత్వుండు, యుద్దముల యందు పరాజితుఁడు వరాహదంష్టచేత నా రాక్షసుఁడు రెండుగా చీల్చబడెను. అమృత మథన సమయమున ఇంద్రుఁడు ప్రహ్లాదుని నిర్జించెను, ప్రహ్లాదునీ కుమారుఁడు వీరోచనుఁడు నిత్యముఇంద్రునీవధకై ఉద్యతుఁడై యుండెను. ఇంద్రుడాతనిని తనవిక్రమముచే తారకామయయుద్ధమున చంపెను. ఈశ్వరుని వలన అవధ్యత్యము విశేషాస్త్రములను పొందిన జంభుఁడు ఇంద్రునిచే ఆరవయుద్దమున చంపబడెను. ఆయుద్దములో ఇంద్రుని విష్ణువు ఆవేశించెను. దేవతలు రాక్షసుల యొక్క గొప్ప శక్తిని ఎదిరించి భరింప అశక్తులైనప్పుడు త్రిపురాసుర యుద్దమున ఈశ్వరుఁడు రాక్షసులను సంహరించెను. దేవతలు, దానవులు, రాక్షసులు అంధకాదిక యుద్ధమున దేవతలచే మానవులచే చంపఁబడిరి. ఆ రాక్షసాదులు పితృదేవతలతో కలిసి పోయిరి. వృత్రాసురునితో కలిసిన దానవుల నెల్లరను, ఇంద్రుడు విష్ణునిచే సంవర్థింపఁబడి చంపెను. ధ్వజ యుద్దమున, మాయాఛత్రముచే కప్పబడి యోగవిదుఁడైన విప్రచిత్తుల డు సహోదరునితో యుద్ధము చేయ, దైత్యులను దానవులను విశేషముగా సంహరించు నాతనినీ, ఇంద్రుఁడు వందవేల ధ్వజములలో చొచ్చుకొని చంపెను. హాలాహల యుద్ధమున సర్వదేవతలు తన్ను పరివృతులు కాగా, 'కోలాహల రజి' యను యుద్ధమునందు, ఇంద్రుఁడు సర్వదేవతలతో పరివృతుఁడయి దైత్యులను చంపెను. యజ్ఞాంతమున జరుగు: అవభృథమున షండామర్కులు” దేవతలచే జయింపఁబడిరి. ఈ విధముగా దేవతలకు అసురులకు మధ్య పండ్రెండు గొప్ప యుద్ధములు జరిగెను. ఈ యుద్ధములు సురలకు దైత్యులకు కూడ వినాశనము కల్గించెను. ఆ యుద్ధములు సామాన్య ప్రజలకు అశుభదములు, హిరణ్యకప్పుడు రాజుగా అర్చుద వరములు పాలించి ప్రకాశించెను. (మూఁడు కోట్ల 7 మీలీయనుల, 280 సంవత్సరముల ఏండ్లు) దివసస్పతియైన బలి, 10 కోట్ల ముప్పది మిలియనుల అరువది వేల సంవత్సరములు ఏలెను (13 కోట్ల 60 వేల యేండ్లు).
అసురలతో సహాప్రహ్లాదుఁడు జయించి బలి పరిపాలించినంతకాలము పరిపాలించెను. ఈ మువ్వురు అసురులకు ఇంద్రులుగా ప్రఖ్యాతులు. వారుమహాశక్తిమంతులు మహౌజసులు. పదియుగముల కాలము. దైత్యులయధీనములోనీ సంస్థ యుండెను. తిరిగి రాష్ట్రము పదియుగములు వ్యాప్తము నొంద శుక్రుఁడు శపించెను. అప్పుడు బలీయొక్క అవ్యగ్రమైన యీ త్రైలోక్యము మహేంద్రుఁడు స్వాధీన పరచు కొనెను. ప్రహ్లాదుడు మరణించెను. ఆతని త్రైలోక్య విభవము కాల పర్యయమున క్రమముగా సా త్రైలోక్యము పాకశాసనునకు (ఇంద్రునకు) సంప్రాప్తించేను. అంత యజ్ఞము సరలను పరిత్యజించి దేవతలను పొందెను, ఆ యజ్ఞము దేవతలను పొందగా అసురలందరు శుక్రునితో సంప్రదించి, మనమందరము కన్నులప్పగించి చూచుచుండగా యజ్ఞమేల దేవతలను పొందెను? ఇందు మనముండ జాలము. మనమిప్పుడు రసాతలము ప్రవేశీంతము - ఇట్లు చెప్పఁబడి శుక్రుఁడు వీషన్లుడై పలుకులచే వారలను ఆశ్వాసించి” భయపడకుఁడు, సో ఆధ్యాత్మిక తేజస్సుచే మీమ్మందరను రక్షించెదను. వరము, ఓషధులు, సర్వ వస్తువులతో ఈ (రస) ప్రపంచము - ఇవి యన్నియు పూర్తిగా సురలతోడనే యుండనిండు, పాపమువారిదే యగుగాక. నేను వానినెల్లను మీకొసంగెదను. అయ్యదియంతయు నాయందే యున్నది” అనెను. అంత ధీమంతుఁడైన శుక్రునిచే కార్యము వహింపఁబడుట చూచి, దేవతలు ఉద్విగ్నులైరి. భయపడిరి. విజిగీషతో దేవతలు మంతనములు సలిపిరి. “ఈ గురుడైన శుక్రుఁడు మనలనుండి యన్నీంటినీ బలాత్కారముగా గ్రహించుచున్నాఁడు. మంచిది. వెంటనే బయలుదేరుము. కానిచో వారల నతఁడు పెంపొందించును. వారలను బలాత్కారముగా చంపి మిగిలిన వారలను పాతాళమునకు తరిమీవైచేను. అందుచే దేవతలు సంరబ్దులై దానవులను సమీపించి వారలను చంపిరి. దేవతలచే చంపబడినదానవులు శుక్రుని కడకు పరుగిడిరి.
దేవతలచేఁదరుమబడిన దానవులను చూచీ శుక్రుఁడు భయపడిన దితీకుమారులయిన దానవులను రక్షించెను. అచటనే నిలఁబడియున్న దేవతలను శుక్రుఁడు చూచి ఇదంతయు కర్మ దైవకృతమని తలంచెను. అంత శుక్రుఁడు ధ్యానమాచరించి, పూర్వవృత్తమును అనుసరించుచు, దానవులతో నిట్లనెను. “త్రైలోక్యము సర్వము వామనునిచే మూఁడడుగలచే జయింపఁబడెను. బలి. బంధింపఁబడెను, జంభుఁడు చంపఁబడెను. విరోచనుఁడు నిహతుఁడయ్యెను. పండ్రెండు సంగ్రామములయందు మహాసురలు దేవతలచే చంపఁబడిరి. ఆయా యుపాయములచే, ప్రధానులయిన వారెల్లరు చంపఁబడిరి. యుద్ధానంతరము మనము ఏ కొద్దిమందో ఇప్పుడున్నాము. మీ కొలకు ఒక (నీతిని) ఉపాయమును ఆలోచించెదను. కొంతకాలము మీరుపేక్షింపుఁడు. నేను మహాదేవుని కడకు, మంత్రము కొఱకు విజయము. కోటకు వెళ్లేదను. హోత, మంత్రములచే, అని ప్రజ్వలింప చేయును. తన్మూలమున దహింపఁజేయును. అందుచే నేను మంత్రము. కోటకు దేవుఁడయిన నీలలోహితుని కడకుపోవుచున్నాను. తిరిగి ఇచ్చటకు వచ్చీ మిమ్ము అనుగ్రహించెదను. మీరో, వనమునందు నారచీరలు కప్పుకొని తపస్సాచరించుఁడు. నేను వచ్చు వలకు దేవతలు మిమ్ము చంపరు. మహేశ్వరుని వలన అప్రతీపములయిన మంత్రముల పొంది, మనము దేవతలతో మరల నొకసారి యుద్ధము చేయుదము. తన్మూలమున మీరు విజయమొందెదరు.” అని దానవులు వారలలో వారూహించుకొని, దేవతలతో నీట్లనిరి.” మేమందరము శస్త్రములను వదలితిమి. మీరు లోకములనన్నింటిని ఆక్రమించుఁడు. మేమో నారచీరలు కప్పుకొని తపస్సాచరించెదము. ప్రహ్లాదుని యొక్క సత్యములైన వాక్యములను వినీ దేవతలు సంతోషించిరి. అంత దేవతలు తమ యస్త్రములను దానవులు పరిత్యజింపగా భయరహితులై సంతోషించి వెనుకకు మరలిరి.
కావ్యుఁడు (శుక్రుఁడు) పొరలతో (దానవులతో) నిట్లనెను. “ఓర్పువహింపుఁడు. కొద్దికాలము నిరీక్షింపుఁడు, నిరుత్సుకులై తపస్సు ఆచరింపుఁడు. కాలము కార్యార్థ సాధకము. ఓ దానవులారా ! మీరు మా తండ్రి ఆశ్రమము నందుండి ప్రతీక్ష సల్పుఁడు". అనీ అనుచరులకు సందేశించి శుక్రుఁడు మహాదేవుని చేరెను. నమస్కరించి, జగత్ర్పభువైన ఈశ్వరునితో నిట్లనెను. “ఓ ప్రభూ ! 'బృహస్పతి యందు లేని మంత్రములను నేను కోరుచున్నాను. వానిని దేవతలను ఓడించుటకు కోరుచున్నాను. అంతియేకాక దేవతలనిన దానవులకు భయము లేకుండుటకు”. ఇట్లు చెప్పఁబడి ఈశ్వరుఁడిట్లనెను. “ఓ బ్రాహ్మణా ! మంత్రములను కోరుచో నేను చెప్పు పవిత్ర వ్రతమును, బ్రహ్మచర్యమాచరించుచు, పూర్తిగా ఒక వేయి సంవత్సరములు, సమాహితుఁడవై, ఆచరింపుము.తల క్రిందకు వ్రేలాడగా, పవిత్ర హోమగుండమునుండి వచ్చు, ధూమమును ఆఘ్రాణింపుచు తపస్సు వేయి సంవత్సరము లాచరించిన నా వలన మంత్రమును, అసురహితమునకై పొందెదవు.” అనెను. అని ఈశ్వరుఁడు చెప్పగా మహా తపశ్శాలియైన శుక్రుడు, భగవానునీ పాదముల నంటి నమస్కరించి మంచిది' అట్లే ప్రతమును ఉద్దిష్టమైన విధమున నాచరించెద ననేను, అంత దేవునిచే నియుక్తుడై ధూమ కృత్తయిన కుండను ధరించీ అసురుల హితము కొఱకు వెడలెను. ఆతఁడు మహేశ్వరుని కడ, బ్రహ్మచర్యము ననుసరించుచుండుట దేవతలు తమ రాజనీతి వలన నెఱింగిరి. “రాక్షసులు శస్త్రముల వదలిరని యెటింగిరి. అట్టి క్లిష్ట సమయములో, కోప వంతులయిన దేవతలు, బృహస్పతిని ముందుంచుకొని, అందరు ఆయుధముల గ్రహించి, రాక్షసులవైపు దాడి వెడలిరి. రాక్షస గణములు దేవతాగణములను మరల ఆయుధవంతులనుగా చూచి, వారందరు భయపడి లేచిరి. వారిట్లు తలపోసిరి. “శస్త్రములను వదిలితిమి. అభయ మొసంగబడినది, మన ఆచార్యుఁడు వ్రతస్థితుఁడయ్యెను. అయినను దేవతలు, తమ శత్రువులను జయించు కోరికచే, వారందరు నీయమభంగ మాచరించిరి.
మీరిప్పుడు ఆచార్యుఁడు లేనివారు. మీకు భద్రమగుగాక. మీరు వారలను విశ్వసించితిరి. మేమందరము వల్కలములు, లేడిచర్మములు ధరించి నిష్క్రియులము, నీష్పరిగ్రహులము, మేము దేవతలను జయించుటకు శక్తిమంతులము కాము. యుద్ధము లేక మనము కావ్యమాతను శరణుపొందుదము” అని తలచిరి. అంత రాక్షసులు భీతులయి ఆమె యభయమునర్జించిరి. అభయార్డులయిన దైత్యుల కామె అభయ మొసంగేను. ఆమేవలన నభయ దాన మీయబడీ ఆదరింపఁబడిన రాక్షసుల చూచి, వారి బలాబలములను విచారించి, దేవతలను వారినీ తీవ్రముగా ముట్టడించిరి. దేవతలు రాక్షసులను వధించుటచూచి, (శుక్రునీతల్లి) కోపోద్రిక్తురాలై “ఇంద్రుని వినాశనమొనరింతు ననేను. అధికమయిన సంరంభముతో కోపముతో ఇంద్రుని వెంటనే సంస్తంభింపజేసి ఆమె యందుండీ వెడలిపోయెను. తరువాత మూడునివలె స్తంభింపజేయబడిన ఇంద్రుని చూచీ, దేవతలు మీక్కిలి భీతులయిరీ, ఇంద్రుడీ వీధముగా వశీకృతుఁడగుటచూచి ఆ ప్రదేశము నుండి దేవతలు పలాయనము చిత్తగించిరి. దేవతా సంఘములు తరలి పోయిన పిమ్మట విష్ణువు ఇంద్రునితో నిట్లనెను. “ఓ సురేశ్వర ! నాలో నీవు ప్రవేశింపుము. నీకు భద్రమగును నేను నిన్ను తీసికొని పోయెదను." విష్ణువట్లు పలుకఁగా ఇంద్రుఁడు విష్ణువునందు ప్రవేశించేను. ఈ విష్ణునిచే పురందరుఁడు రక్షింపఁబడుట దేవీ చూచెను. క్రుద్దురాలయ్యెను. ఇట్లు పలికెను. “ఓ ఇంద్రా ! నా శక్తిచే విష్ణునీతో సహితముగా నిన్ను దహించెదను. సర్వభూతముల నా తపోబలమును చూచెదరుగాక. నా తపశ్శక్తి చూతురుగాక". అనీ. ఆమేచే అభిభూతులై ఇంద్రుఁడు విష్ణువు - ఇరువురు దేవతలు తమలో తామిట్లు కృత్రిమాలోచనలు సాగించిరి. “మన మిర్వురమెట్లు ఆమెచే విముక్తులగుదుము” అని విష్ణువీంద్రునితో ననెను. అంత ఇంద్రుఁడు “ఓ ప్రభూ ! ఆమె దహింపకపూర్వమే ఆమెను చంపుము. మనలో నన్ను విశేషముగా ఆమె అభీభూతునీ చేసెను. ఈమెను జయించుము. చంపుము. ఆలసించకుము” అనెను. అంత విష్ణువు ఆమెను పరిశీలించి చూచి, స్త్రీ వధను ఆచరించుటకు సంసిద్ధుఁడయ్యెను.
ఆపదలోనున్న శుక్రుని తలంచి, అసురధ్వంసకుఁడయిన ప్రభువు, విష్ణువు తనకార్యములో త్వరపడెను. ఆతఁడు శుక్రుని తల్లికంటే తొందరగా చేయనెంచెను. తాను చేయదలంచుకొనీనది క్రూరమైనదని విష్ణువు గ్రహించి, మాధవుఁడు అస్త్రమును సంధించి శుక్రమాతృశిరశ్ఛేదనము చేసెను. ఘోరమయిన ఆ స్త్రీవధను చూచి శక్తిమంతుఁడు భృగువు కోపించెను. అంత తన భార్యను చంపిన కారణమున భృగువు విష్ణునీ శపించెను. ఏ కారణమున స్త్రీని చంపబడకూడదను ధర్మము నెంగియు స్త్రీనిచంపితివో ఆకారణముచే నీవు మానవులలో ఏడుసార్లు జన్మించెదవు. అందుచే ఆ శాపముచే, ధర్మము నష్టము చెంద మరల మరల సర్వలోకహితము కొఱకు విష్ణువు మనుష్యులతో జన్మించవలెను. విష్ణునితో మాటాడిన తరువాత, ఆతఁడే ఆ శిరస్సును తీసికొని ఆమె శరీరము నందు సమయోజనము చేసి యిట్లు పలికెను. విష్ణువు వలన నష్ట జీవులను నేను పునర్జీవితులను చేసెదను. సర్వధర్మకార్యచయము నాకు తెలిసియున్న పక్షమున సత్యధర్మ పవిత్రక్రియలు నాచే నాచరింపఁబడి యున్న పక్షమున, నేను సత్యమునే పలుకు వాడనైన విష్ణునిచే నష్టజీవులు తిరిగి పునః జీవితలగుదురు గాక. ఆతని సత్యవచశ్శక్తి వలన దేవి సంజీవితురాలయ్యెను. ఆమెపై చల్లని నీరములు చల్లిన తరువాత నీవు జీవించుము' అనీ పలికెను. అంత నిద్ర నుండి లేచినట్లుగా నామే లేచుటచూచి భూతము లన్నియు ఆశ్చర్యపడెను. 'సాధు సాధు' అను ప్రశంసా వాక్కులు చూచువారి నుండి ఆకాశచరుల నుండి వచ్చి దిక్కులు ప్రతిధ్వనిల్లెను. ఎల్లరు కన్నులప్పగించి చూచుచు భృగునీచే ఆయుత్తమస్తీ పునర్జీవింప బడ జేయజూచి వారందరకదియొక అద్భుతక్రియగా నయ్యెను.
సంజీవితురాలయిన పత్నిని చూచి, భృగువు అసంభ్రాంతుఁడై యుండుటచూచీ ఇంద్రుడు సంతోషింపలేదు. భృగుడన్న నతఁడు భయమొందెను. దీనిని గూర్చి నిద్రరాక రాత్రులు, ప్రజాగరుడయ్యెను. మతిమంతుఁడు పాకశాసనుఁడయిన ఇంద్రుఁడు తన కూతురయిన జయంతితో ఇట్లు పలికెను. “ఈ రాక్షస గురువైన శుక్రుఁడు ఇంద్రుఁడు లేకుండ నీ ప్రపంచమును చేయుటకు ఘోరమయిన తపస్సాచరించు చున్నాఁడు. అందుచే, ఓ పుత్రి నేను దృఢమయిన చిత్తము కలవాడనైనను, మిక్కిలి సంక్షుభితుఁడనైయుంటినీ నీవు వెళ్ళుము. ఆతనినీ గౌరవించుము. ఓ పుణ్యవతీ, ఆ యా మనోనుకూలములములయిన యుపచారములచే శ్రమాపనయనములగు పలుకులచే జాగరూకతతో సేవచేయుము అని శుభచారిణియైన యా ఇంద్రదుహిత యయిన జయంతి, చక్కని స్వరూపమునుధరించి, దుర్వహమయిన వ్రతమాచరించు కావునీ కడకేగెను. తండ్రి చెప్పినట్లు తు.చ' తప్పక చేసెను. మృదుభాషిణియై అనుకూలములయిన వాక్యములతో ఆతనిని స్తోత్రము చేయుచు, గాత్ర సంవాహానమును స్పర్శచే శరీరసుఖము కలుగునట్లు శుశ్రూషచేయుచు అత్యంతము ననుకూలురాలై చాల సంవత్సరములచ్చట వసించెను. ఒక సంవత్సరకాలము, ఘోరమైన ధూమ్రవ్రతము సంపూర్ణమయ్యెను. శివుఁడు మిక్కిలి ఆనందించేను. ఏదయిన వరమును కోరుకొమ్మనెను. అప్పుడు కావ్యుఁనీతో ఇంతవరకు ఏవంవిధమయిన వ్రతమును న్యాయముగా నీవే ఆచరించితివి ఇతరులెవ్వరాచరింపలేదు. అందుచే, తపస్సు చేతను, బుద్ధిచే, శ్రుతిచే, బలముచే, తేజస్సుచే, దేవతలందరినీ అభీభవన మొనర్చితివి. అందరిని అధిగమించితివి. ఓ భృగునందన నాయందు ఏ బ్రహ్మ' మను దీవ్యవర్ణము, ఉన్నదో అది సాంగముగా సరహస్యముగా, నీకు ప్రతిభాసించును. యజ్ఞము. ఉపనిషత్తులెవ్వి నాయందు కలవో యవియు నీకు ప్రభాసించును.
ఈ విషయముల నీ వెవ్వరికిని చెప్పరాదు, తన్మూలమున ఓ ద్వీజశ్రేష్ఠ !. ఎల్లరికంటే నధికుఁడవయ్యెదవు. అనీ భార్గవునకు పై వరము నొసంగి, ఆతనికీ ప్రజేశత్వము, ధనేశత్వము, అవధ్యత్వము మరల భవుఁడొసంగెను. ఈ వరములను పొంది శుక్రుడు ప్రహృష్ణ తనూరుహుఁడయ్యెను. హర్షాధిక్యముచే మహేశ్వరుని గూర్చి దీవ్యమైన స్తోత్రము - ఆతని నుండి ప్రాదుర్భవించెను. అప్పుడు ప్రక్కగా నిలఁబడి నీలలోహితునీ ఈవిధముగా నతఁడు స్తోత్రము చేసెను. శితికంఠునకు, దేవతాప్రథమునకు, మహావర్చస్వంతునకు, లేలిపోనునకు (జిహ్వతో నాకుటయను ముద్ర వహించెడువానీకి), లేహ్యునకు (వేలిముద్రతో సమీపింప నరుఁడైనవానికీ, వత్సరునకు (వత్సరాధీపతికి), జగత్పతికి నమస్కారము. కపర్దికి, (జటలు కట్టిన జుట్టు కలవానికి) ఊర్ద్వ రోమునకు (నీగడపొడిచియున్న రోమ తతి కలవానికి) హర్యక్ష వరదునకు (కుబేరునకు వరములొసంగు వానికి), సంస్తుతునకు (స్తోత్రము చేయబడువానికి) సుతీర్ణునకు, (తీర్థస్వరూపునకు), దేవదేవునకు, రంహసునకు (ఉదగ్రాహంకారునకు), ఉషీషునకు (తలపాగ కలహానికి), సువక్తనకు (అందమయిన వక్షము కలవానికి), సహస్రాక్షునకు, మీడునకు (దాతృభావునకు), వసురేతునకు (ధనమును పంచువానీకి), రుద్రునకు, తపస్వికి చీరవాసునకు (చెట్లబెరడులు వస్త్రముగా ధరించు వానీకి) నీస్సునకు (ధనరహితునకు), ముక్తకేశునకు, (జుట్టుముడిపెట్టనీవానికి) సేనానికి (దేవతాసేనాధ్యక్షునకు) రోహితునకు (రోహితవర్ణ శరీరునకు}; కవికి, రాజవృద్దునకు (కాంతిమంతునకు), తక్షక క్రీడితునకు, గిరీశునకు, అర్కనేత్రునకు, యతికి, ఆజ్యపాయికి (నేతిని త్రాగువానికి), / సువృత్తునకు సుహస్తునకు, ధన్వికి, భార్గవునకు, సహస్రబాహునకు, సహస్రామలచక్షువునకు (వేయిపవిత్ర నేత్రములు కలవానికి) -
సహస్రకుక్షునకు, (వేయి కడుపులు (కుక్షులు) కలవానికి) సహస్ర చరణునకు, సహస్రశీర్పునకు, బహురూపునకు, వేధకు (బ్రహ్మకు), భవునకు, విశ్వరూపునకు, శ్వేతవర్ణునకు, పురుషునకు, నిషంగికి (అమ్ములపొది కలవానికీ} కవచీకి (తనుత్రాణము కలవానికి), సూక్ష్మనకు, క్షపణునకు (శమనము) తామునకు, భీమునకు, ఉగ్రునకు, శివునకు, మహాదేవునకు, సర్వమైనవానీకి, విశ్వరూపశిపునకు, హిరణ్యునకు,వసిష్ఠునకు, (వసిష్ఠునితో తుల్యునకు) వరునకు (వర్షకారణునకు) మధ్యమునకు, ధామునకు, పిశంగునకు, పింగళవర్ణునకు, అరుణునకు, మహాదేవునకు, పినాకికి, ఇషుమంతునకు, బోణములు (శరములు) కలవానికీ, చిత్రునకు, రోహితునకు, దుంధుభ్యునకు (దుందుభినాదములచే గౌరవింపదగినవానికీ) ఏకపాదునకు, ఆరునకు, బుద్దీమంతునకు మృగవ్యాధుని కొఱకు, (దక్షయజ్ఞమున మృగవ్యాధరూపము దాల్చినవానికి) సర్వునకు, స్థాణువునకు (నిలిచి సిద్ధముగా నుండువానీకి) భీషణునకు (భయంకరునకు) బహురూపునకు, ఉగ్రునకు, త్రినేత్రునకు, ఈశ్వరునకు, కపిలునకు (కపిలర్షితో సమానుఁడైన వానికి) ఏకవీరునకు, మృత్యువునకు, త్ర్యంబకునకు, హస్తోషృతికి (గృహముల కధిపతియు, సంరక్షకుండునగు వానీకి) పినాకము గలవానికి, శంకరునకు, శివునకు, ఆరణ్యునకు (అరణ్యములలో నీవసించువానికి) గృహస్థునకు, యతికి, బ్రహ్మచారికి, సాంఖ్యునకు (సాంఖ్యవేదాంతనిధికి) యోగునకు, ధ్యానికి, దక్షిణునకు, అంతర్షితునకు, సర్వునకు, తప్యునకు (తపము చేసి పొందగలిగిన వానికి) వ్యాప్తికి (సర్వము వ్యాపించినవానికి), బుద్దునకు (విశేషజ్ఞానికి) శుదునకు, ముక్తునకు, కేవలునకు, రోధసునకు (పర్వతముల పార్వముల నుండు వానికి) చేకితానునకు (బుద్ధిమంతుఁడైన వానికి) బ్రహ్మిష్ణునకు (వేదముల యందు నీధికి) మహర్షికి.
చతుష్పాదునకు, మేధ్యునకు ప్రవిత్రునకు) వర్మము కలవానికి (కవచము కలవానికి) శీఘ్రగునకు (తొందరగా పోవువానికి) శిఖకలవానికి, కపాలము కలవానీకి, దండము కలవానీకి, విశ్వమేధ కలిగిన వానీకి, అప్రతీతునకు (కనఁబడనీవానికి) దీప్తునకు, భాస్కరునకు (కాంతిని కలిగించువానికి) సుమేధావికి, క్రూరునకు, వికార రూపునకు, బీభత్సునకు, శివునకు (శుభంకరునకు) శుచిమంతునకు, పరిధనునకు (ఎల్లర నావరించినవానీకి) సద్యోజాతునకు (అప్పుడే పుట్టిన వానికి) మృత్యువైన వానికి, పిశితాశునకు (మాంసమును. తీనువానికి)--తర్వునకు, మేఘుఁడై వానికి, విద్యుత్తయిన వానీకి, దక్షునకు (సమర్ధుఁడైనవానికి) జఘన్యునకు (తక్కువయైన పానీకి) లోకమునకు ఈశ్వరుండైన (ప్రభువైన) - వానికి, అనామయునకు (రోగరహితునకు) ఇద్మము అయినవానీకి (సమిధ) బంగారు వికారమైన ఏకనేత్రము కలవానికి, శ్రేష్ఠునకు, వామదేవునకు, ఈశ్వరునకు, ధీమంతునకు, మహాకల్పునకు, దీప్తునకు, రోదనునకు (రోదించువానీకి, హసునకు (నవ్వుచుండెడివానికి) దృఢమయిన ధనువు కలవానికీ, కవచము కలవానికి, రథము కలవానికి, వరూధినీ (సైన్యము) కలవానికి, భృగునాథునకు, శుక్రునకు (ప్రకాశవంతునకు, శుక్రునితో నద్వైతుఁడైన వానికీ), గహ్వరీషునకు (గుహయందుండువానికి) ధీమంతునకు అమోఘునకు (వ్యర్థము కానీ కార్యము లాచరించువానికి) ప్రశాంతునకు, పండిత విప్రుల యెడ నెల్లప్పుడు ప్రియుఁడైన వానికి, దిగ్వాసస్సుగల వానికి. దిగంబరునకు) కృత్తివాసునకు (ఏనుగు చర్మము ధరించువానికి) భగుని చంపిన వానికి నమోవాకములు పశువులకు పతియైన వానీకి (సర్వజీవులకు) భూతములకు ప్రభువైన వానికి, ఋగ్వేదమునకు, యజుర్వేదమునకు, సామవేదమునకు (ప్రభవ కారణమైనవానీకి, స్వాహా, స్వధా, వషట్కారములైనవానికి మంత్రాత్ముఁడవైన నీకు నమస్కారము.
స్రష్టకు (సృష్టించువానీకి) ధాతకు అట్లే కర్తకు నీకు నమస్కారము. భూత, భవ్య భవేశుఁడయిన వానికి (భూతభవిష్యద్వర్తమానములకు ఆధారుఁడైనవానికి) నాశనకర్తయైన వానికి, క్షపణునకు, కర్మాత్మునకు నమస్కారము. వసువునకు, స్వాధ్యాయునకు, రుద్రాదిత్యాశ్వనీదేవతలయిన వానికి, విశ్వేదేవతారూపునకు, మరుద్దేవతకు, దేవాత్మునకు నీకు నమస్కారము. అగ్నీషోమవిధీజునకు, యజ్ఞాత్మునకు, తపస్వియైనవానికి, సత్యునకు,త్యాగునకు, శమస్వభావునకు, అహింసునకు లోభునకు సువేషునకు, అనిశున (రాత్రి) (చీకటి) లేనివానికి, సర్వభూతముల నుండి ప్రభవించిన వానికి యోగాత్మునకు, పృథివి యైనవానికి, అంతరిక్షమైన వానికి, మహస్సయినవానికి (కాంతిపుంజమైనవానికి) భూతములైన వానికి, ఇంద్రియములైనవానీకీ, త్రిదివములైనవానికీ జనలోక, తపోలోక, సత్య లోకములైనవానికి, నిత్యమైనవానికి, స్త్రీపురుష భేదరహితునకు అలింగునకు (కారణము) రూపములేనివానికి, సూక్ష్ముఁడైనవానికి, తన్మాత్రలైనవానికి, తత్త్వాత్ముఁడైనవానీకీ, సూక్ష్ముఁడైనవానికీ, తత్త్వాత్ముఁడైనవానికి, శుద్దునకు,నిత్యునకు, భూమితో ఆరంభమై స్వర్గముతో ముగియు మూఁడులోకములుతానేన నీకు నమస్కారము. మహర్లోకముతో ఆరంభమై సువర్లోకమున ముగియు నాలుగు. లోకములయిన నీకు నమస్కారము. బ్రహ్మణ్యుడవు బ్రాహ్మణప్రియుడవునయిన నీకీ నామస్తోత్రమున అసద్వాహృతము దోషముగా పలికినచో “వీఁడు నా భక్తుండనీ నన్ను క్షమింపనరుఁడవు. .
ఇదీ వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణమున మధ్యమభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున డెబ్బదిరెండవ అధ్యాయము.
Summary of chapter 110 of the Brahmānda Mahā Purana is as follows:
In harmonious devotional prose, this chapter extols the equal divine grace of lord Vishṇu and lord Shiva, demonstrating how both supreme deities blessed and protected the ancient royal lineages. It emphasizes the fundamental unity between Vishṇu and Shiva, warning against delusional feelings of sectarian division. The devout soul is guided into harmonious, non-dual devotion, worshipping the divine in all its magnificent forms.