బ్రహ్మాండ మహా పురాణము
31 - సప్తకక్ష్యామతంగకన్యప్రాదుర్భవో
అగస్త్యుడనేను:- శ్రీ పురమనునదేమి? ఏ రూపముతో నుండును? పూర్వము ఎవరిచే నిర్మింపబడినది? అదియంతయు నాకు దెలుపుము-1. ఎంత ప్రమాణము గలది? దాని వర్ణమెట్టిది? ఓ ప్రభో! చెప్పుము. నీవే సర్వసందేహములనెడు బురుద మొండగొట్టుటలో సూర్యుడవు-2. .
హయగ్రీవుడనేను :- మహా యాగాగ్నిలోబుట్టిన లలితా పరమేశ్వరి పూర్వోక్త లక్షణములు గల చక్రరథమును బొంది బ్రహ్మాదులచే బ్రార్జింపబడి వివాహలీలను నిర్వహించి లోకకంటకుడైన భండాసురుని జయించేను-1,2,3. అపుడు మహేంద్రాది దేవతలు సంతసించిరి, తరువాత కామేశ్వరునకును, లలితాదేవికిని నిత్యోపభోగాది సమస్తమునకై శోభనమైన మందిరమును నిర్మించుట కుత్సహించిరి. 5. లలితాదేవి యొక్క కుమారులైన బ్రహ్మవిష్ణు మహేశ్వరులు దేవశిల్పియు రథకారుడునైన విశ్వకర్మను రాక్షసశిల్పియై మాయా విచక్షణుడైన మయుని బలిచి సత్కరించి లలితాజ్ఞతో నిట్లనిరీ- 5,6,7, అధికార పురుషులనిరీ :- శిల్పమును దెలిసిన యో విశ్వకర్మా! మహోదయుడవైన మయా! మీరు సర్వశాస్త్రజ్ఞులరు. భవనాదులను గూర్చుటలో కోవిదులరు -8. సంకల్ప మాత్రముననే మహాశిల్ప కల్పనా విశారదులరు. మీరు నిత్యజ్ఞానమహోదధియైన లలితాదేవియొక్క శ్రీనగరులను నిర్మింపవలేను. అవి షోడశక్షేత్ర మధ్యములలో సాక్షేత్రసమసంఖ్యలో నుండవలె. నానారత్నములతో నలంకరింపబడి యుండవలె -9, 10. అచట పదునారు రూపముల ధరించి విశ్వరక్షణకై లలితాపరమేశ్వరి నివసింపగలదు-11. ఇది మాకిష్టమైనది. దేవమరుత్తులకుగూడ ప్రియమైనది. సర్వలోకములకు బ్రియమైనది. ఇది యామె పేరనే నిర్మింపబడుగాక, ఈ విధముగా కారణదేవులు చెప్పిన మాటలను విని యా విశ్వకర్మ-మయులు నమస్కరించి యట్లేయగుగాక యని పలికిరి -13, వారు మరల నమస్కరించి యా కారణపురుషులతో నిట్లనిరి. ఏ క్షేత్రములలో నీ మహోదయములైన నగరుల నిర్మింపవలెను? -14. బ్రహ్మాదులు యథోచితముగా క్షేత్రముల వీభాగమును కల్పించుచు ఆ శిల్పులతో మరల బలికిరీ-15.
కారణ పురుషులనిరి :- మొదట మేరు పర్వతముపైన, నిషధపర్వతమున, హేమకూటమున, హిమగిరియందు, బదవది గంధమాదన పర్వతమున -16, నీలర్వతమున, మేషపర్వతమున, శృంగార పర్వతమున, మహాగిరీయైన మహేంద్ర పర్వతమున ఈ తొమ్మిదిక్షేత్రములలో నిర్మింపవలే. ఇవి భూమియందలి క్షేత్రములు అని గుర్తించగవలె -17. ఇక జలక్షేత్రములు సమస్త సముద్రములుగా చెప్పబడినవి. లవణసముద్రము, చేలకురససముద్రము, సురా సముద్రము, నేతిసముద్రము, దధి సముద్రము, పాలసముద్రము, ఏడవది జలసముద్రము, పూర్వము చెప్పిన తొమ్మిది పర్వతములు, తరువాతి యేడు సముద్రములు -19, కలిపి మొత్తము పదునాలు క్షేత్రములు అంబయొక్క శ్రీపుర నిర్మాణమునకై నిర్ణయింపబడినవి. వానిలో మహౌజస్వినియైన లలితా దేవి యొక్క దివ్యభవనములను దీవ్యఘటనాపండితులై శిల్పులైన మీరు నిర్మింపవలెను -20. అవి మహాసురసంహారముచేసిన లలితాదేవి యొక్క నిత్యానామములతోనే ప్రసిద్ధిచెందును. సంశయములేదు -21. ఆమె నిత్యాస్వరూపముతో కాలవ్యాప్తిని జేయు పరాశక్తి, కలనాంకమున సర్వజగమును ఆదేవి.సుఖింపజేయును-22 నీత్యాశక్తులకు మహరాణ్ణి. ఆమె నీత్యాశక్తి స్వరూపిణి. ఆమెకు భేదములేదు. కావున పూర్వము వారి నామముతోనే (నిత్యానామముతోనే) ప్రసిద్ధిచెందినది -63. కామేశ్వరపురి, భగమాలాపురీ, నిత్యక్లిన్నాపురి అను మొదలగు నామములు మిక్కిలి ప్రసిద్ధములు -24. కావున మిక్కిలి యోగ్యమైన పుణ్యదినమున మహాశిల్ప పద్దతిలో రంగుతోగాని,వర్ణముతోగాని నామముల సూచించు శుభమైనపురిని రచింపుడు -25, కారణకృత్యములకింద్రులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులు పై విధముగా జెప్పగనే యా విశ్వకర్మ మయులు ఆయాక్షేత్రములలో శ్రీపురిని నిర్మించిరి -26. ఇక శ్రీపురము యొక్క విస్తారమును, దానికధిష్ఠాతలైన దేవతలను, జెప్పెద ఓ లోపాముద్రాపతీ అగస్త్యా! వినుము -27. మేరుపర్వతము అఖిలాధారమైనది, ఎత్తైనది. అనంత యోజనవిస్తారము గలది. పదునాలుగు భువనముల మండలముతో నేర్పడిన యాకారముగలది. -28. దానికి నాలుగు శిఖరములు గలవు. అవి తూర్పున నైరుతమున వాయవ్యమున, మధ్యస్థలమున ఉన్నవి. వానియెత్తు జెప్పెద -29. మొదట జెప్పిన మూడు శిఖరములు నూరు యోజనముల యెత్తున్నవి. నూరుయోజనముల విస్తారము గలిగియున్నవి. వానిలో మూడు లోకములున్నవని యందుడు -10. అవి బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకమును. అవసరాంతరమున వీనియొక్క గృహ విన్యాసములను జెప్పెదను -31. మధ్యనున్న శిఖరము యొక్క విస్తారమును ఎత్తును వినుము. నాలుగు వందల యోజనముల యెత్తు, అంతీయ విస్తారము -32. ఆ మహా శృంగమునందే శిల్పులచే శ్రీపురము నిర్మింపబడినది. ఓ యగస్త్యా! అది నాలుగువందల యోజనముల విస్తారము గలది -33. అచట నీ వీభాగమును నీకు వివరించి చెప్పెదను. మొదటి ప్రాకారము ఉక్కుతో నిర్మింపబడినది. -34, అదీ పదునారువేల యోజనముల పొడవుతో జుట్టినది. నాలుగు దిక్కుల ద్వారములున్నవి. ప్రాకారము నాలుగు యోజనముల యెత్తున -35. అగస్త్యా శాలమూలము యొక్క వైశాల్యము పదివేల యోజనములు, శాలాగ్రము యొక్క ఆయతనము రెండు కోశములు వేరుగా గప్పబడినది .-36. శాల ద్వారము యొక్క యెత్తు ఒక యోజనము. ప్రతి ద్వారమున రెండు తలుపులు. ఒక క్రోశము విస్తారముగలవీ -37. ఒక యోజనమెత్తుగలమీ. ఉక్కుతో నిర్మింపబడినవి. ఆ రెండు తలుపులకు ఏర్పరచిన గడియ అరకోశము పొడవుగలది -38. ఈ విధముగా నాలుగు ద్వారములలోను సమానత పాటింపబడినది. అగస్త్యా! గోపురము యొక్క సంస్థానమును జెప్పెదను -5, మొదటజెప్పిన శాలము యోజన సమ్మితము రెండు ప్రక్కలు రెండు యోజనములు, మధ్యశాలము యోజనము. విస్తారము గూడ నంతీయ. ద్వారగర్బితమై యున్నది, -41. కలిపి ఓ మునీ! కొలతలో. బదు యోజనములు, రెండు ప్రక్కల రెండున్నర క్రోశములతో గలిసినది -42. కలిపి యైదు యోజనముల పొడవు, ఓమునీ! ఈ విధముగా నటగోపురము నిర్మింపబడినది -43. కావున గోపుర మూలము యొక్క చుట్టు ఇరువది యోజనములు పైపై చుట్టు తక్కువగానే యుండును. - -44 గోపురము యొక్క యెత్తు ఇరువదియైదు యోజనములు. ప్రతి యోజనమున తలుపులతో మనోహరమైన ద్వారముండును. -45, భూమికలు గూడనంతటివే. పైపైన తక్కువ గలవి. గోపురాగ్రము యొక్క విస్తారము యోజనము-46. పొడవు గూడ నంతియ. అట మూడు ముకుటములున్నవి. ముకుటము యొక్క విస్తారము ఓ యగస్త్యా! ఒక కోశము కొలత -47, రెండు క్రోశముల యెత్తు, గోపురమువలెనే పైపైన తక్కువగా నుండును. ముకుటము యొక్క మధ్యన భూమి క్రోశార్దము (అరకోశము) -48. ముకుటము పశ్చిమమున, తూర్పున, దక్షిణమున, ద్వారగోపురమున గలదు. పశ్చిమ ద్వార గోపురమున దక్షిణోత్తరముగా ముకుటములున్నవి -49. దక్షిణద్వారమువలెనే ఉత్తర ద్వార ముకుటములున్నవి. పశ్చిమ ద్వారమున వలెనే తూర్పు ద్వారమునను ముకుటములున్నవి -50. కాలాయసమను (ఉక్కుదైన) శాలము యొక్క మధ్యన మారుత యోజనములు (గాలి వచ్చుమార్కమలు} గలవు. కాంస్య (కంచు)శాలము యొక్క మధ్యన పూర్వమునందు వలెనే గోపురమున్నది -51, శాలమూల ప్రమాణము పూర్వమువంటిదే, ఈ కాంస్య (కంచు) శాలము గూడ పూర్వాది దీక్కులలో ద్వారములు గలవు. -52 ప్రతీద్వారమున గోపురములు. అవి పర్వ(అంతస్తుల) లక్షణములు గలవి. కాలాయస-కాంస్యశాలలమధ్యన నున్న ప్రదేశము నందంతట-58. అనేక వృక్షములుగల గొప్పయుద్యానము. అట. ఉద్భిజాదు లెన్నియున్నవో యన్నియు గలవు -54, వేయికి మించిన వృక్షములు, అవి సర్వకాలపుష్పములు, సర్వకాల ఫలములు, సర్వకాల పల్లవములును గలవై శోభిల్లుచుండును. సర్వకాలముల సుగంధములు వెదజల్లుచుండును -55, మామీళ్లు, కంకోలకములు, బొద్దుగుచెట్లు, బకులములు, కొండగోగులు, శింశపములు, దిరిసెనలు, దేవదారువులు, సురపొన్నలు, -56, పున్నాగములు, నాగభద్రములు, ముచుకుందములు, కట్పలములు, ఏలకులు, లవంగములు, తక్కోలములు, కర్పూర గౌఖులు -57. పీలువులు, కాకతుండులు, శాలకములు, అసనములు, కాంచనారములు, లకుచములు, పనసలు, హింగులములు, 58. పాటలములు, ఫలవృక్షములు, జడలుగలవృక్షములు, జఘనమున ఫలము గాయునవి (మేడి) గణికములు, కుండములు, బంధుజీవములు, దాడిమములు -59. అశ్వకర్ణములు, హస్తికర్ణములు, చాంపేయములు, కనకద్రుమములు, యూధీకలు, తోలపర్లులు, తులసులు, సదాఫలములు -60.. తొలములు, తమలములు, హింతాలములు, ఖర్జూరములు, శరబర్బురములు, ఇక్షువులు (చెరకులు) క్షీర వృక్షములు, శ్లేష్మాంతకములు, విభీతకములు (జీడి) - 61. హరీతకులు, అవాక్పుష్పములు, హోంటాలులు, స్వర్గపుష్పికము, భల్లాతకములు, ఖదిరములు, శాఖోటములు, చందనములు -62. కాలాగురువులు, కాలస్కంధములు, చీంచములు (చింత) వటములు, ఉదుంబరములు, అర్జునములు, అశ్వత్తములు, శమీవృక్షములు ధ్రువద్రుమములు, -63, రుచకములు, కుటజములు, సప్తపర్ణములు, కృతమాలకములు, కపిత్తములు, తింత్రిణులు, - ఇవి మొదలుగా గల వేలవృక్షములు -64. నానా ఋతువులలోజేరునవి. దేవి యొక్క శృంగారమునకు సాధనములు. అనేక వృక్షములవలే మహోన్నతములైన, శాఖలు గల వృక్షములు అందుగలవు -65, కాంస్యశాలము యొక్క మధ్యన ఏడు యోజనముల దూరముగా చతురస్రమైన తామ్రశాలముగలదు. అది. ఏడు యోజనములయెత్తెనదీ-66. ఈ రెంటిమధ్యనున్న భూమి కల్పవటీక. కల్పవృక్షఫలములు కర్పూరగంధముగలవి. రత్నముల వంటి బీజముగలవి -67. బంగారు బెరుడుతోనందమైనవి. బంగారు వన్నెగల ఫలములతో నిండుగా. బండిన వృక్షములున్నవి. ఆ వృక్షములకొమ్మలు చివురింపగా దివ్యమైన పీతాంబరములు గలిగినట్లున్నవి -68. అమృతమే వాని మధురసము: (మకరందము) పువ్వులు అలంకారము. ఇటువంటివనేక కల్పవృక్షములిచటగలవు -69. ఇదీ రెండవకక్ష్య పేరు కల్పవాషి, తామశాలముయొక్క మధ్యన నాగశాలమున్నది -70. ఈ రెంటికడ్డముగానున్న ప్రదేశము ఏడు యోజనములు, అచట కల్పవాపికి సమాకారములో సంతాన - వాటియున్నది. ఆరెంటి మధ్యభూమి హరిచందనవాటిక. ఇదీ కల్పవాటిక సమాకార. ఫలపుష్పముల నిండినది.-72. ఈ యన్నీ శాలములలోను పూర్వము వలే ద్వారముల కల్పనము, గోపురముల కల్పనము, ముకుటముల కల్పనమును జరిగినవి -73. ప్రతిద్వారమున గోపుర ద్వారద్వారముల యేర్పాటు కలదు ఇత్తడిశాల మధ్యన ఏడు. యోజనములు దూరముగా పంచలోహ మయశాల యున్నది. అది పుర్వశాల సమాకారము. ఆరెంటి మధ్యనభూమి మందార వృక్షవాటిక -75. పంచలోహశాలము యొక్క మధ్యన ఏడు యోజనములు దూరముగా వెండిశాలము నిర్మింపబడినది. అదీపూర్వోక్తశాలముల లక్షణములతో గూడినదీ. -76. ఆ రెండి మధ్యభూమి పారిజాతవక్షోద్యానము. అది దివ్యసుగంధముతో నిండినది, ఫలపుష్పముల భారముతో నుజ్వలమైనది -77 రౌష్య(వెండీ) శాలము యొక్క మధ్యన ఏడు యోజనముల విస్తారముగల హేమ (బంగారు) శాలము పూర్వమువలె ద్వారశోభితమైయున్నది -78, ఆరేంటి మధ్యభూమీ కదంబ వృక్షవాటిక. అచట దివ్యములైన నీప వృక్షములు. రెండు యోజనములున్నతములు -79, ఎల్లపుడు మచీర (కల్లు) తో కదలాడుచున్నవి. దట్టమైన పూవులతో మెరయు చున్నవి. వాటినుండి యోగినులకు భోగమునిచ్చు కాదంబరి (పుష్పప్రసవమైన యాసవము) వచ్చును -80. అది విశిష్టమైన మదిరోద్యానముగా మంత్రిణ్యంబకు ఎల్లప్పుడు ప్రియమైనది. ఆ నీపవృక్షములు సుఖచ్చాయ గలవి. - దట్టమైన యాకులుగలవీ.. చిగురాకులతో నిండినవి. సుగంధమున కాకర్షింపబడిన తుమ్మెదల దండు యొక్క ఝంకాములు నిండిన యుదరములు (లోపలి భాగములు) గలవి -81. అచటనే మంత్రిణీనాథయొక్క మనోహరమైన మందిరము కలదు కదంబవనవాటి యొక్క విదిశలలో ఆగ్నేయ దిక్కు మొదలుకొని కలదు -82. ఆది శిల్పిచే నెతైన నాలుగు మందిరములు కల్పింపబడినవి. ఒక్కొక్క మందిరము యొక్క విస్తారము ఐదు యోజనములు -83. ఐదు యోజనములు పొడవు, ఏడు. ఆవరణములతో వానియునికి, ఇట్లే యితర విదిశలలోగూడ నంతట ప్రియక వృక్షములుండును. ఇది శ్యామాశక్తి యొక్క నివాసనగరి -84 సేనకొఱకు మహాపద్మాటవీస్థలములో మరొక నగరి కలదు. ఇచట బహుజన దూరమున నామె గృహముండుటచే -85. మంత్రిణీచే శ్రీదేవి యొక్క నిత్యసేవ ఘటింపదు. అందువలన చింతామణిగృహసమీపమున ఆ శ్రీమంత్రినాథ యొక్క భవనము త్వష్టచేతను మయునిచేతను నిర్మింపబడినది -86. శ్రీపురమున మంత్రీడీదేవి మందిరము యొక్క బహుగుణములను రెండువేల నాలుకలుగలిగి (యాదీశేషుడై) ఎవడు వర్ణింపగలడు?-87. మాన్యలైన మాతంగకన్యకలు కాదంబరి (ఆసవ) మదముచే పూర్తిగా నేఱు పేక్కీన కన్నులు గలిగి, మధురవీణతో లలితాగుణముల గానముజేయుచు నాడుదురు -88. అగస్త్యుడనెను, మాతంగుడనవెవరు? ఆతని కన్యలెవరు? వారెట్లు కలిగిరి? వారు మధుమదముతో అలసలై మంత్రిణీనాథనెట్లు సేవింతురు? -89. హయగ్రీవుడనేను:- మతంగుడనువాడు తపస్సులన్నింటికి సేకరాశియైన తపోథనుడు. మహాప్రభావ సంపన్నుడు. జగమును సృజింపవలెనను నత్యాశ గలవాడు. 90. తపఃశక్తితోను, చక్కని బుద్ధితోను అంతట తనయాజ్ఞను ప్రవర్తింపజేయువాడు. ఆతని పుత్రుడు మాతంగుడు. ధీరధీమంతుడైన యాతడు మంత్రిగాయికమైన ముద్రిణిని -91. ఘోరతపములచే మిక్కిలి పూజించెను. మతంగముని పుత్రునిచే తపముతో సముపాసితయైన -92 మంత్రిణి సుప్రసన్నమై వరమడుగమని శాసించెను. తపోనిధియై సర్వమునులలో శ్రేష్ఠుడైన యా మాంతగుడును తనయెదుట ప్రత్యక్షమై నిలిచియున్న శ్యామలాంబికతో నీట్లనెను. -93. మాతంగమహాముని యనెను:- ఓ దేవీ! నీ స్మరణ మాత్రముననే అజీమాది సమస్త సిద్ధులు తక్కిన విభూతులును నాకు సిద్ధించినవి. అంబా! నేను పొందదగినది త్రిభువనములోను ఏదియులేదు. నీ చరిత స్మృతి మాత్రముననే నాకు అణిమాది సర్వసిద్ధులును తక్కినయన్ని విభూతులును కలిగినవి, ముల్లోకములలో నేను పొందదగినదేమియు లేదు. -95. ఐనను నీ ప్రసన్నత నాకు నిష్పలము గారాదు. ఈ వరమును గోరుకొందును. అంబా! దానిని పూరించుము -96. పూర్వము నేను హిమవంతునితో సౌహార్దముగ నుండి పరిహాసమాడితిని. క్రీడామదముతో నాతడు అవాచ్యములు పలికి తనగొప్పతనము జూపెను -97. తాను గౌరీ గురువునని (తండ్రినని) ఆత్మలో కొనియాడుకొను చుండెను. అతనికి నాకన్న అధిక గుణముగలదు ఆ స్థితి నాకు కలుగలేదు -98. అన్ని గుణములలో సామ్యముగల యిరువురు మిత్రులలోనొకరికి ఒక కారణమున గుణాధిక్యము వచ్చినచో తక్కినవానీకి సామ్యమునకై యది కావలెనను కోరిక కలుగును, -99. ప్రాక్తకాముడనైనను నేను గౌరీ గురుత్వ ప్రశంసకై తపము జేసితిని. కావున ఓ మంత్రిణీనాథురాలా! శ్యామలాంబా! నాకు నీవు పుత్రివీగమ్ము-100. దానివలన నా పేరు ప్రసిద్ధమగును. సంశయములేదు. మాతంగముని యొక్క వచనమును విని అట్లే యగుగాకయని మంత్రీకి అంబ! అంతర్ధానమయ్యెను, ఆముని కూడ సంతుష్మడయ్యేను-101. ఆమంత్రిణ్యంబ మాతంగమునికి స్వప్నమున తాపిచ్చమంజరిని (చీకటి మ్రాని (కానుగచెట్టు) పూగుత్తిని) చేవి అలంకారముగ నిచ్చెను-102. ఆస్వప్న ప్రభావమున మాతంగముని భార్య సిద్దీమతి (పేరుగలది) లఘుశ్యామను గర్భమున ధరించెను -103. ఆతని నుండి పుట్టినందున మాతంగి యనబడినది. లఘుశ్యామయని కూడ అనబడినది. కారణము ఆమెకు మూలకంధమైన భూమీ శ్యామయగుట -104 మాతంగకన్యకలు మనోహరలు. వారు కోట్లకు కోట్లలో గలరు. లఘుశ్యామలు, మహాశ్యామమాతంగీ బృందముతో గూడినవారు, వీరు అంగశక్తులై ప్రియకప్రియను సేవింతురు -105. ఓ అగస్త్యా! ఇది మాతంగకన్యలయుత్పత్తి, లోహాదినిర్మిత సప్త కక్షశాలలు చెప్పబడినవి. -106.
ఇది శ్రీ బ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున సప్తకక్ష్యామతంగకన్యాప్రాదుర్భావవమను ముప్పదియొకటవయధ్యాయము.
Summary of chapter 143 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter extols the supreme potency of the Kāmarāja Mantra, the sacred king of incantations dedicated to goddess Lalitā. It describes how the pure resonance of this mantra purifies the mind, awakens hidden spiritual centers, and bestows both worldly fulfillment and ultimate liberation. The devout reader is inspired to chant the divine syllables with absolute faith, reverence, and single-minded concentration under the guidance of a guru.